విరాట్ కోహ్లి- ఖుర్రమ్ మంజూర్
Khurram Manzoor On Virat Kohli: టీమిండియా స్టార్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి గురించి చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ ఖుర్రమ్ మంజూర్ మాట మార్చాడు. కోహ్లితో పోల్చుకుని అతడిని తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని, కేవలం తన విజయాల గురించి చెప్పుకోవడానికి మాత్రమే అలా మాట్లాడానని పేర్కొన్నాడు. కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం తన మాటలను వక్రీకరించాయన్నాడు.
పెద్ద ఎత్తున ట్రోలింగ్
కాగా 50 ఓవర్ల క్రికెట్‌లో ప్రపంచంలో తానే నంబర్ 1 అని, కోహ్లి స్థానం తన తర్వాతే అంటూ ఖుర్రమ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత పదేళ్లుగా వన్డేల్లో తన సగటు 53 అని.. ప్రతి ఆరు ఇన్నింగ్స్‌లకు ఒక సెంచరీ బాదానంటూ చెప్పుకొచ్చాడు. ఈ కోహ్లి పేరును ప్రస్తావిస్తూ ఖుర్రమ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అతడిపై భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది.
ఈ నేపథ్యంలో ఖుర్రమ్ మంజూర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాడు. ‘‘కొన్ని మీడియా సంస్థలు, నా ఇంటర్వ్యూలో తీసుకున్న వాళ్లు నా మాటలను వక్రీకరించారు. విరాట్ కోహ్లి తరానికొక్క గొప్ప ప్లేయర్. ఓ ఆటగాడిగా తనని నేను ఆరాధిస్తాను.
తనతో పోలికేంటి?
లిస్ట్ ఏ క్రికెట్‌లో సెంచరీల నిష్పత్తి గురించి మాట్లాడుతూ.. కోహ్లి కంటే నా గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి.. తను రెండో స్థానంలో ఉన్నాడని మాత్రమే చెప్పాను. తనతో నాకసలు పోలికే లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు.
గణాంకాలతో సంబంధం లేదు.. తను ఎప్పటికీ గొప్ప క్రికెటరే’’ అని ఖుర్రమ్ మంజూర్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తన గణాంకాలకు సంబంధించిన ఫొటోను జత చేశాడు. ఇకనైనా మీడియా సంస్థలు విచక్షణతో వ్యవహరించాలని చురకలు అంటించాడు. కాగా పాక్ తరఫున ఖుర్రమ్ 16 టెస్టులు, ఏడు వన్డేలు, మూడు టీ20లు ఆడాడు.
చదవండి: Hardik Pandya: మా ఓటమికి ప్రధాన కారణం అదే! అలాంటి ఆటగాడు జట్టులో ఉంటే మాత్రం..
Rahul Tripathi: 'కోహ్లి స్థానాన్ని అప్పగించాం.. ఇలాగేనా ఔటయ్యేది'
1/3 Its funny how some media outlets and individuals have taken my interview out of context and twisted my words. Virat Kohli is a generational player and I have always admired him as the best. pic.twitter.com/d1UzhA7egI
— Khurram Manzoor Khan (@_khurrammanzoor) January 26, 2023
Comments
Please login to add a commentAdd a comment