Ind vs Pak: కోహ్లి అద్భుత శతకం.. 77వ సెంచరీతో రికార్డు | Asia Cup 2023 Ind Vs Pak: Virat Kohli Slams 77th Century | Sakshi
Sakshi News home page

Ind vs Pak: కోహ్లి అద్భుత శతకం.. 77వ సెంచరీతో రికార్డు

Published Mon, Sep 11 2023 6:31 PM | Last Updated on Mon, Sep 11 2023 7:23 PM

Asia Cup 2023 Ind Vs Pak: Virat Kohli Slams 77th Century - Sakshi

Asia Cup 2023- India vs Pakistan: పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 84 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కాగా వన్డేల్లో కోహ్లికిది 47వ శతకం కాగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 77వది.

ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో
తద్వారా సమకాలీన క్రికెటర్లెవ్వరికీ సాధ్యం కాని రీతిలో సెంచరీల రికార్డులో మరో ముందడుగు వేశాడు. కాగా టీమిండియా దిగ్గజం అంతర్జాతీయ స్థాయిలో 100 శతకాలతో ముందు వరుసలో ఉండగా.. కోహ్లి అతడిని అనుసరిస్తున్నాడు. కోహ్లి సమకాలీన బ్యాటర్లలో జో రూట్‌(ఇంగ్లండ్‌), డేవిడ్‌ వార్నర్‌(ఆస్ట్రేలియా) 46.. రోహిత్‌ శర్మ 44 శతకాలతో ఉన్నారు.

అరుదైన మైలురాయిని చేరుకున్న కోహ్లి
ఇదిలా ఉంటే.. పాక్‌తో మ్యాచ్‌ సందర్భంగా విరాట్‌ కోహ్లి వన్డేల్లో 13000 పరుగుల మైలురాయిని చేరుకోవడం విశేషం. దీంతో కింగ్‌ కోహ్లి ఫ్యాన్స్‌ సంబరాల్లో మునిగిపోయారు.ఆసియా కప్‌-2023 సూపర్‌-4 దశలో భాగంగా టీమిండియా పాకిస్తాన్‌తో తలపడుతోంది.

ధనాధన్‌ సెంచరీలు
వర్షం కారణంగా ఆదివారం నాటి ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే కేటాయించారు. అయితే, సోమవారం కూడా వరణుడు ఆటంకం కలిగించడంతో మ్యాచ్‌ ఆలస్యంగా ఆరంభమైంది. ఈ క్రమంలో 24.1 ఓవర్ల వద్ద 147-2 వద్ద ఆట మొదలుపెట్టిన టీమిండియా స్కోరు బోర్డును విరాట్‌ కోహ్లి- కేఎల్‌ రాహుల్‌ పరుగులుపెట్టించారు.

ఇద్దరూ అజేయ శతకాలతో చెలరేగి 200కు పైగా భాగస్వామ్యం నమోదు చేశారు. రాహుల్‌ 106 బంతుల్లో 111 పరుగులు, కోహ్లి 94 బంతుల్లో 122 పరుగులు సాధించడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా కేవలం రెండు వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోరు చేసింది.

చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్‌కు భారీ షాక్‌! హ్యారిస్‌ రవూఫ్‌ దూరం.. కారణమిదే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement