Pakistan Batsman
-
మాట మార్చిన పాక్ క్రికెటర్.. అయినా కోహ్లితో నాకు పోలికేంటి?!
Khurram Manzoor On Virat Kohli: టీమిండియా స్టార్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి గురించి చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ ఖుర్రమ్ మంజూర్ మాట మార్చాడు. కోహ్లితో పోల్చుకుని అతడిని తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని, కేవలం తన విజయాల గురించి చెప్పుకోవడానికి మాత్రమే అలా మాట్లాడానని పేర్కొన్నాడు. కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం తన మాటలను వక్రీకరించాయన్నాడు. పెద్ద ఎత్తున ట్రోలింగ్ కాగా 50 ఓవర్ల క్రికెట్లో ప్రపంచంలో తానే నంబర్ 1 అని, కోహ్లి స్థానం తన తర్వాతే అంటూ ఖుర్రమ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత పదేళ్లుగా వన్డేల్లో తన సగటు 53 అని.. ప్రతి ఆరు ఇన్నింగ్స్‌లకు ఒక సెంచరీ బాదానంటూ చెప్పుకొచ్చాడు. ఈ కోహ్లి పేరును ప్రస్తావిస్తూ ఖుర్రమ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అతడిపై భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఖుర్రమ్ మంజూర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాడు. ‘‘కొన్ని మీడియా సంస్థలు, నా ఇంటర్వ్యూలో తీసుకున్న వాళ్లు నా మాటలను వక్రీకరించారు. విరాట్ కోహ్లి తరానికొక్క గొప్ప ప్లేయర్. ఓ ఆటగాడిగా తనని నేను ఆరాధిస్తాను. తనతో పోలికేంటి? లిస్ట్ ఏ క్రికెట్లో సెంచరీల నిష్పత్తి గురించి మాట్లాడుతూ.. కోహ్లి కంటే నా గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి.. తను రెండో స్థానంలో ఉన్నాడని మాత్రమే చెప్పాను. తనతో నాకసలు పోలికే లేదు. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. గణాంకాలతో సంబంధం లేదు.. తను ఎప్పటికీ గొప్ప క్రికెటరే’’ అని ఖుర్రమ్ మంజూర్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తన గణాంకాలకు సంబంధించిన ఫొటోను జత చేశాడు. ఇకనైనా మీడియా సంస్థలు విచక్షణతో వ్యవహరించాలని చురకలు అంటించాడు. కాగా పాక్ తరఫున ఖుర్రమ్ 16 టెస్టులు, ఏడు వన్డేలు, మూడు టీ20లు ఆడాడు. చదవండి: Hardik Pandya: మా ఓటమికి ప్రధాన కారణం అదే! అలాంటి ఆటగాడు జట్టులో ఉంటే మాత్రం.. Rahul Tripathi: 'కోహ్లి స్థానాన్ని అప్పగించాం.. ఇలాగేనా ఔటయ్యేది' 1/3 Its funny how some media outlets and individuals have taken my interview out of context and twisted my words. Virat Kohli is a generational player and I have always admired him as the best. pic.twitter.com/d1UzhA7egI — Khurram Manzoor Khan (@_khurrammanzoor) January 26, 2023 -
నేనే నంబర్ వన్, నా తర్వాతే కోహ్లి.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా స్టార్ క్రికెటర్, పరుగుల యంత్రం, రికార్డు రారాజు విరాట్ కోహ్లితో పోల్చుకుంటూ పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ ఖుర్రమ్ మన్సూర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 36 ఏళ్ల ఈ పాకిస్తానీ ఔట్ డేటెడ్ బ్యాటర్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ.. 50 ఓవర్ల ఫార్మాట్లో (లిస్ట్-ఏ) విరాట్ కోహ్లి కంటే నేనే బెటర్, ఈ ఫార్మాట్లో కోహ్లి రికార్డులు నా రికార్డుల ముందు బలాదూర్, ప్రపంచంలో నేనే నంబర్ వన్ బ్యాటర్ అంటూ తన డప్పు తాను కొట్టుకున్నాడు. ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే ఖుర్రమ్ తన అవివేకాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. విరాట్‌తో పోల్చుకోవడం తన ఉద్దేశం కాదని, వాస్తవానికి 50 ఓవర్ల క్రికెట్లో టాప్-10 బ్యాటర్స్‌లో నేనే ప్రపంచ నంబర్ వన్ అని, రికార్డుల ప్రకారం కోహ్లి నా తర్వాతే ఉంటాడని ఇష్టమొచ్చినట్లు వాగాడు. లిస్ట్-ఏ క్రికెట్లో నా కన్వర్జన్ రేట్ బెటర్‌గా ఉందని, ఇందుకు గణాంకాలే సాక్షమని అన్నాడు. 50 ఓవర్ల క్రికెట్లో కోహ్లి ప్రతి 6 ఇన్నింగ్స్‌లకు సెంచరీ చేస్తే, నేను ప్రతి 5.68 ఇన్నింగ్స్‌లకే సెంచరీ బాదాను అని చెప్పుకొచ్చాడు. గత 10 ఏళ్లుగా ఈ ఫార్మాట్లో తన సగటు 53గా ఉందని, ప్రపంచ లిస్ట్-ఏ క్రికెట్ గణాంకాల్లో తాను ఐదో స్థానంలో ఉన్నానని తెలిపాడు. కాగా, ఖుర్రమ్ లిస్ట్-ఏ క్రికెట్లో 166 మ్యాచ్‌ల్లో 53 సగటున 27 శతకాల సాయంతో 7992 పరుగులు చేశాడని తెలుస్తోంది. 2008లో పాక్ తరఫున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఖుర్రం.. తన కెరీర్ మొత్తంలో 16 టెస్ట్‌లు, 7 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. 2016లో చివరిసారిగా పాక్‌కు ఓ టీ20 మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించిన ఖుర్రమ్ ఆతర్వాత అత్తాపత్తా లేడు. ఖుర్రమ్ టెస్ట్‌ల్లో సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు, వన్డేల్లో 3 హాఫ్ సెంచరీలు చేశాడు. కోహ్లి-ఖుర్రమ్ ఇద్దరూ ఓ మ్యాచ్‌లో ఎదురెదురు పడ్డారు. ఆ మ్యాచ్‌లో కోహ్లినే ఖుర్రమ్ను రనౌట్ చేయడం కొసమెరుపు. -
పసికూనపై పాక్ బ్యాటర్ ప్రతాపం.. టీమిండియాతో ఆడి చూపించు!
పాకిస్తాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ పసికూన నెదర్లాండ్స్‌పై శతకంతో రెచ్చిపోయాడు. విషయంలోకి వెళితే.. మంగళవారం నెదర్లాండ్స్‌తో తొలి వన్డేలో టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఇమాముల్ హక్ 2 పరుగులకే వెనుదిరిగినప్పటికి.. కెప్టెన్ బాబర్ ఆజం(74)తో కలిసి ఫఖర్ జమాన్ పాక్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో ఏడో శతకం అందుకున్న ఫఖర్ జమాన్ ఓవరాల్‌గా 109 బంతుల్లో 109 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. బాబర్ ఆజం(85 బంతుల్లో 74, 6 ఫోర్లు, 1 సిక్సర్) అతనికి సహకరించాడు. ఇక చివర్లో షాదాబ్ ఖాన్ (28 బంతుల్లో 48 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిపించడంతో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. కాగా నెదర్లాండ్స్‌పై శతకంతో రెచ్చిపోయిన ఫఖర్ జమాన్‌ను టీమిండియా ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. '' పసికూనపై ప్రతాపం చూపించడం కాదు.. ఆసియాకప్‌లో టీమిండియాతో మ్యాచ్‌లో ఆడి చూపించు.. అప్పుడు తెలుస్తుంది నీ అసలు ఆట'' అంటూ కామెంట్స్ చేశారు. కాగా ఆగష్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఆసియా కప్ టోర్నీ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులైన టీమిండియా, పాకిస్తాన్‌లు ఆగస్టు 28న తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి టి20 ప్రపంచకప్‌లో ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఇక రెండు నెలలవ్యవధిలోనే టీమిండియా, పాకిస్తాన్ రెండుసార్లు ఎదురుపడనున్నాయి. ఒకటి ఆసియా కప్ అయితే.. మరొకటి ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 28న మరోసారి ఇరుజట్లు తలపడనున్నాయి. అన్నీ సక్రమంగా జరిగితే.. ఆసియాకప్ ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడితే ముచ్చటగా మూడోసారి తలపడినట్టువుతుంది. ఇక ఆసియాకప్‌లో భారత్, పాక్‌లు 13సార్లు తలపడితే.. ఏడుసార్లు టీమిండియా గెలవగా.. ఐదు మ్యాచ్‌ల్లో పాక్ నెగ్గింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. కాగా ఆగస్ట్ 28న జరుగనున్న భారత్-పాక్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాన్ని ఆగస్టు 15న ప్రారంభించగా.. నిమిషాల వ్యవధిలోనే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. A seventh ODI century for Fakhar Zaman 🙌 Watch all the #NEDvPAK matches on https://t.co/CPDKNxpgZ3 for FREE (in select regions) 📺 | 📝 Scorecard: https://t.co/RGyky5X3nm pic.twitter.com/PZE0QThlk3 — ICC (@ICC) August 16, 2022 చదవండి: నిమిషాల్లో అమ్ముడుపోయిన భారత్- పాక్ మ్యాచ్ టికెట్లు.. ఒకేసారి 7.5 లక్షల మంది దండయాత్ర Rohit Sharma: 'జెండా కొనడానికి డబ్బులు లేవా'.. పరువు తీసుకున్న హిట్‌మ్యాన్ -
పాకిస్తాన్ బ్యాటింగ్ కోచ్‌గా లెజెండరీ క్రికెటర్..!
పాకిస్తాన్ పూర్తి స్థాయి బ్యాటింగ్ కోచ్‌గా ఆ దేశ లెజెండరీ క్రికెటర్ మహ్మద్ యూసుఫ్‌ను నియమించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్దమైంది. యూసుఫ్ ఎంపిక సంబంధించి ఒకట్రెండు రోజుల్లో పీసీబీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా యూసుఫ్ ప్రస్తుతం నేషనల్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్లో బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నాడు. పీసీబీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే నేషనల్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్లో తన బాధ్యతల నుంచి యూసుఫ్ వైదొలిగినట్లు తెలుస్తోంది. ఇక అంతర్జాతీయ క్రికెట్లో దశాబ్దానికి పైగా పాక్‌కు సేవలందించిన యూసఫ్.. ఇప్పడు జట్టులో కోచ్ పాత్ర చేపట్టేందుకు సిద్దమయ్యాడు. వన్డే, టెస్టుల్లో పాక్ తరపున విజయవంతమైన ఆటగాళ్లలలో యూసఫ్ ఒకడు. 350 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పాక్‌కు ప్రాతినిద్యం వహించిన యూసఫ్ 17000 పైగా పరుగులు సాధించాడు. అదే విధంగా టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు. 2006లో పాక్ తరపున అత్యధికంగా 1788 పరుగులు చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2021 ముందు పాకిస్తాన్ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా నియమితుడైన ఆసీస్ దిగ్గజం మాథ్యూ హేడెన్‌తో కలిసి యూసఫ్ పనిచేయనున్నాడు. ఇక పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. తొలి టెస్టులో విజయం సాధించిన పాకిస్తాన్.. ఆదివారం జరగనున్న రెండో టెస్టుకు సిద్దమవుతోంది. చదవండి: Ind Vs WI 1st ODI: రుతురాజ్‌కు నో ఛాన్స్! ధావన్‌తో ఓపెనర్‌గా అతడే! ఇక ఫినిషర్‌గా ఎవరంటే.. -
పాక్ క్రికెటర్ ఆబిద్ అలీకి యాంజియో ప్లాస్టీ.. రెండు నెలలు విశ్రాంతి
పాకిస్తాన్ టెస్టు ఓపెనర్ ఆబిద్ అలీ రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. గురువారం అతడికి రెండోసారి యాంజియో ప్లాస్టీ నిర్వహించి మరో స్టెంట్‌ను వైద్యులు అమర్చారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు, పూర్తిగా కోలుకోవడానికి కనీసం రెండు నెలల విశ్రాంతి అవసరమని డాక్టర్లు తెలిపారు. 34 ఏళ్ల ఆబిద్ పాక్ తరఫున 16 టెస్టులు ఆడి 1,180 పరుగులు... 6 వన్డేలు ఆడి 234 పరుగులు చేశాడు. -
22 కోట్ల జనాభా ఉంటే ఒలింపిక్స్‌లో పాల్గొనేది 10 మందేనా..
కరాచీ: ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో పాకిస్తాన్ నుంచి కేవలం 10 మంది అథ్లెట్లు మాత్రమే పాల్గొనడంపై ఆ దేశ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నజీర్ ఫైరయ్యాడు. విశ్వ వేదికపై పాక్ దుస్థితికి కారణమైన పాలకులను ఎండగడుతూ.. ట్వీటర్ వేదికగా ధ్వజమెత్తాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్ల ఫోటోను ప్రస్తుత ఒలింపిక్స్ పాల్గొన్న అథ్లెట్ల ఫొటోను ఒకే ఫ్రేమ్‌లో చేరుస్తూ.. ట్విటర్లో షేర్ చేశాడు. 22 కోట్ల జనాభా గల దేశం నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొనేది కేవలం 10 మంది ఆటగాళ్లేనా అంటూ పాక్ పాలకులపై మండిపడ్డాడు. విశ్వక్రీడల్లో పాక్ ఈ స్థాయికి దిగజారడానికి బాధ్యులైన ప్రతిఒక్కరికీ ఇది సిగ్గుచేటని పాక్ పాలకులను ఉద్దేశిస్తూ చురకలంటించాడు. This is actually sad. Just 10 athletes from a country of 220 million people. To everyone who is responsible for Pakistan's such decline in sports , SHAME ON YOU! pic.twitter.com/4qkqC1cj7N — Imran Nazir (@realimrannazir4) July 24, 2021 పాక్‌లో ప్రతిభకు కొదవలేదని, అయితే క్రీడల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలిగే బాధ్యతగల నాయకులే లేరని విమర్శించాడు. దేశంలోని చాలా మంది ప్రముఖులు క్రీడా సంస్థలపై ఆరోపణలు చేస్తున్నారు కానీ, ఎంతమంది ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తున్నారని ప్రశ్నించాడు. ఆర్థిక సహకారం అవసరం ఉన్న అథ్లెట్ల వివరాలిస్తే.. ఎంతమంది సాయం చేయడానికి ముందుకు వస్తారని నిలదీశాడు. తమ దేశ దుస్థితికి పాలకులతో పాటు బాధ్యత గల ప్రముఖులు కూడా కారణమని పాక్ పరువును బజారుకు ఈడ్చాడు. కాగా, 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో పాకిస్తాన్ తరఫున 21 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌కు అత్యధికంగా పాక్ తరఫున 62 మంది అర్హత సాధించారు. పాక్ ఖాతాలో ఇప్పటి వరకు 10 పతకాలు ఉన్నాయి. ఇందులో 3 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్య పతకాలున్నాయి. 1992లో బార్సిలోనాలో జరిగిన ఒలింపిక్స్ తర్వాత పాక్ ఒక్క పతకం కూడా గెలవలేదు. ఒకప్పుడు ఎంతో బలంగా ఉన్న పాక్ పురుషుల హాకీ జట్టు సాధించిన కాంస్యమే పాక్ ముద్దాడిన చిట్టచివరి ఒలింపిక్ పతకం. దాదాపు 30 సంవత్సరాలుగా పాక్ పతకం గెలవలేదు. ఈసారి కూడా ఆశలు లేవు. కాగా, 1999-2012 మధ్య పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఇమ్రాన్ నాజీర్.. హార్డ్ హిట్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దేశవాళీ టోర్నీల్లో 14 బంతుల్లో అర్ధ శతకం సాధించిన రికార్డు అతని పేరిట ఉంది. పాక్ తరఫున అతను 8 టెస్టులు, 79 వన్డేలు, 25 టీ20లు ఆడాడు. టెస్టులో 427, వన్డేల్లో 1895, టీ20ల్లో 500 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 4 సెంచరీలు, 13 అర్ధ శతకాలు చేశాడు. -
ఉమర్ అక్మల్ సస్పెన్షన్ కుదింపు
కరాచీ: పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ ఉమర్ అక్మల్‌కు కొంత ఊరట లభించింది. అతనిపై విధించిన మూడేళ్ల నిషేధాన్ని 18 నెలలకు కుదిస్తూ స్వతంత్ర న్యాయ నిర్ణేత ఫకీర్ మొహమ్మద్ ఖోఖర్ తీర్పు వెలువరించారు. అతనిపై నిషేధం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వచ్చే ఏడాది ఆగస్టు వరకు కొనసాగుతుందని ఖోఖర్ తెలిపారు. అయితే ఈ తీర్పుపై అక్మల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మరోసారి దీనిపై అప్పీల్ చేస్తానని పేర్కొన్నాడు. తనకన్నా తీవ్రమైన నేరాలకు పాల్పడిన క్రికెటర్లకు తేలికపాటి శిక్షలు విధించారన్న అక్మల్ తనకు మాత్రం పెద్ద శిక్ష వేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజా తీర్పు పట్ల సంతోషంగా లేనని పేర్కొన్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ సందర్భంగా బుకీల గురించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు తెలపకపోవడంతో పాటు, పీసీబీ అవినీతి నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ అక్మల్‌పై ఏప్రిల్‌లో మూడేళ్ల సస్పెన్షన్ విధించారు. తన తప్పును అంగీకరించిన అక్మల్ తనను క్షమించాలంటూ కోర్టుకు అప్పీల్ చేయగా తాజాగా శిక్షను 18 నెలలకు కుదించారు. -
కోహ్లి పేరుతో పిలవొద్దు: యువ క్రికెటర్
న్యూఢిల్లీ: తనను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పోల్చవద్దని పాకిస్తాన్ యువ బ్యాట్స్‌మన్ హైదర్ అలీ కోరాడు. అభిమానులు తనను పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ పేరుతో పిలవాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. అండర్-19 జట్టు ఓపెనర్ అయిన హైదర్ అలీ పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) తాజా సీజన్లో రాణించడంతో అతడిపై మాజీ క్రికెటర్ రమీజ్ రాజా ప్రశంసలు కురిపించాడు. హైదర్ అలీలో కోహ్లి, బాబర్ అజామ్‌ల తరహా టాలెంట్ ఉందని.. ఏదొక రోజు అతడు ప్రపంచ నంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా ఎదుగుతాడని పొగిడాడు. (కోహ్లిని తలపించే మొనగాడు వచ్చాడు..!) ఈ నేపథ్యంలో హైదర్ అలీ స్పందిస్తూ... ‘తన రోల్ మోడల్స్‌లా అవ్వాలని ఏ బ్యాట్స్‌మన్ అనుకోడు. కానీ తనకు తానుగా మెరుగవుతూ వారిలా షాట్స్ ఆడేందుకు ప్రయత్నించాలి. నాను నేనుగా మెరుగవ్వాలని అనుకుంటున్నాను. కోహ్లి పేరుతో కాకుండా బాబర్ అజామ్ పేరుతో నన్ను పిలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాబర్ మంచి షాట్లు ఆడతాడు. విరాట్ కోహ్లిలా ఉండాలని అనుకోవడం లేదు. కానీ ప్రాక్టీస్ చేసి అతడిలా షాట్లు కొట్టేందుకు మాత్రం ప్రయత్నిస్తాను. నేను హైదర్ అలీని. నేను నాలాగే ఉండేందుకు ఇష్టపడతాను. ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్ సందర్భంగా ఒకసారి బాబర్ అజామ్‌ను కలిశాను. బ్యాటింగ్ గురించి కొన్ని మెళకువలు నాకు చెప్పాడు. లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో అతడి నుంచి చాలా నేర్చుకున్నా. పీఎస్ఎల్లోనూ నన్ను అతడు ఎక్కువగా ప్రోత్సహించాడు. పరుగులు సాధించడంపైనే దృష్టి పెట్టు. మిగతా విషయాలు దేవుడికి వదిలేయాలని బాబర్ సూచించాడు’ అని వెల్లడించాడు. (దొంగ నిల్వలు పెట్టుకోవద్దు: అక్తర్) -
వివాదంలో పాకిస్తాన్ బ్యాట్స్ మన్
లాహోర్: వివాదాలతో సావాసం చేసే పాకిస్తాన్ బ్యాట్స్ మన్ ఉమర్ అక్మల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. నడిరోడ్డుపై ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి అందరి దృష్టిలో పడ్డాడు. సొంత నగరంలో లాహోర్ లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించడంతో కారులో వెళుతున్న అక్మల్ ను పోలీసులు ఆపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తిగతంగా తన కారుకు నంబరు ప్లేట్ పెట్టించికున్నందుకు అతడిని పోలీసులు ప్రశ్నించారు. ఆగ్రహంతో ఊడిపోయిన అక్మల్ వారిపై తిట్లదండకం అందుకున్నాడు. అక్కడితో ఆగకుండా వారితో గొడవకు దిగాడు. అయితే పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని అతడు ఆరోపించాడు. ‘పోలీసులు నన్ను ఆపారు. దుర్భాషలాడారు. నాకు నేనుగా నంబరు ప్లేట్ తొలగించాలన్నార’ని మీడియాతో అక్మల్ చెప్పాడు. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ లో బ్యాడ్ బాయ్ గా ముద్ర పడిన అక్మల్ కు వివాదాలు కొత్త కాదు. 2014 ఫిబ్రవరిలో ట్రాఫిక్ వార్డెన్ తో గొడవపడి జైలు శిక్షకు గురయ్యాడు. క్రమశిక్షణ ఉల్లంఘనతో జట్టులో స్థానం కోల్పోయాడు. -
6, 4, 6, 6.. బాదాడు!
డబ్లిన్: ఐర్లాండ్ తో జరుగుతున్న మొదటి వన్డేలో పాకిస్థాన్ ఓపెనర్ షార్జిల్ ఖాన్ రెచ్చిపోయాడు. సెంచరీలో చెలరేగాడు. వన్డేల్లో పాకిస్థాన్ తరపున రెండో వేగవంతమైన శతకం నమోదు చేశాడు. 61 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. షాహిద్ ఆఫ్రిది తర్వాత అత్యంత వేగవంతమైన సెంచరీ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన షార్జిత్ ఐర్లాండ్ బౌలర్లపై సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 21 ఓవర్ లో వరుసగా 6, 4, 6, 6 బాదాడు. మరో ఎండో వికెట్లు పడుతున్నా వీరవిహారం కొనసాగించాడు. 86 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్సర్లతో 152 పరుగులు చేసి అవుటయ్యాడు. షార్జిత్ విజృంభణతో పాకిస్తాన్ 32 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 226 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.