6, 4, 6, 6.. బాదాడు! | Sharjeel Khan blasts century off 61 balls | Sakshi
Sakshi News home page

6, 4, 6, 6.. బాదాడు!

Published Thu, Aug 18 2016 7:33 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

Sharjeel Khan blasts century off 61 balls

డబ్లిన్: ఐర్లాండ్ తో జరుగుతున్న మొదటి వన్డేలో పాకిస్థాన్ ఓపెనర్ షార్జిల్ ఖాన్ రెచ్చిపోయాడు. సెంచరీలో చెలరేగాడు. వన్డేల్లో పాకిస్థాన్ తరపున రెండో వేగవంతమైన శతకం నమోదు చేశాడు. 61 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. షాహిద్ ఆఫ్రిది తర్వాత అత్యంత వేగవంతమైన సెంచరీ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.

ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన షార్జిత్ ఐర్లాండ్ బౌలర్లపై సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 21 ఓవర్ లో వరుసగా 6, 4, 6, 6 బాదాడు. మరో ఎండో వికెట్లు పడుతున్నా వీరవిహారం కొనసాగించాడు. 86 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్సర్లతో 152 పరుగులు చేసి అవుటయ్యాడు. షార్జిత్ విజృంభణతో పాకిస్తాన్ 32 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 226 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement