Sharjeel Khan
-
వైరల్: బంతి ఎక్కడ పడింది.. నువ్వెక్కడున్నవ్
జొహెన్నెస్‌బర్గ్: సోమవారం పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాక్ ఓపెనర్ షార్జీల్ ఖాన్ చేసిన పని సోషల్ మీడియలో నవ్వులు పూయిస్తుంది. విషయంలోకి వెళితే.. ఉస్మాన్ ఖాదీర్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఒక బంతిని జార్జ్ లిండే లాంగాన్ మీదుగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి అనూహ్యంగా లిండే బ్యాట్ ఎడ్జ్‌కు తాకి గాల్లోకి లేచింది. అయితే లాంగాన్‌లో ఉన్న షార్జీల్ బంతి ఎక్కడ పడుతుందనే దానిని సరిగ్గా అంచనా వేయలేక బాగా ముందుకు పరిగెత్తుకు వచ్చాడు. అయితే బంతి మాత్రం అతన్ని దాటుకొని వెనకాల పడింది. ఈ ఘటనతో కాసేపు ఆశ్చర్యానికి లోనైన షార్జీల్ తాను చేసిన తప్పు తెలుసుకొని సిగ్గుపడ్డాడు. అయితే బంతి బౌండరీ లైన్ దాటుతుందేమో అన్న సమయంలో లాంగాఫ్ నుంచి వచ్చిన ఫీల్డర్ బంతిని అందుకోవడంతో రెండు పరుగులే వచ్చాయి. అయితే షార్జీల్ చర్యపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు. అసలే ఫిట్‌నెస్‌లో పూర్ అని పేరున్న షార్జీల్‌కు క్యాచ్ పట్టుకోవడం కూడా రాదని గేలి చేశారు. కాగా ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ అజమ్ 50 పరుగులతో రాణించాడు. అనంతరం 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్ జట్టు 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. జార్జి లిండే ఆల్‌రౌండ్ ప్రదర్శన (3/23; 10 బంతుల్లో 20 నాటౌట్; 2 సిక్స్‌లు), ఓపెనర్ మక్రమ్ 30 బంతుల్లోనే 54 పరుగులతో రాణించడంతో సునాయస విజయాన్ని అందుకుంది. చదవండి: లిండే ఆల్‌రౌండ్ ప్రదర్శన.. పాక్‌పై దక్షిణాఫ్రికా గెలుపు EPIC LOL 😂😂😂🤣🤣🤣 pic.twitter.com/Q8DhsUeyh2 — Taimoor Zaman (@taimoorze) April 12, 2021 -
నిషేధం తర్వాత క్రికెట్లోకి రీఎంట్రీ
కరాచీ: పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన ఆ దేశ క్రికెటర్ షార్జీల్‌ఖాన్ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. షార్జిల్‌కు ఆ దేశ యాంటీ కరప్షన్ యూనిట్(అవినీతి నిరోధక శాఖ) నుంచి క్లియరెన్స్ లభించడంతో అతను ఆడటానికి మార్గం సుగుమం అయ్యింది. ఈ మేరకు ఇటీవల పీసీబీ యాంటీ కరప్షన్ యూనిట్ ముందు హాజరైన షార్జిల్ ఖాన్‌కు దేశవాళీ ఈవెంట్లలో ఆడటానికి అనుమతి లభించింది. దాంతో త్వరలో ఆరంభం కానున్న పీఎస్ఎల్లో షార్జిల్ ఆడనున్నాడు. పీఎస్ఎల్ ఆటగాళ్ల డ్రాఫ్ట్‌లో షార్జిల్ చేరబోతున్నాడు. పాకిస్తాన్ తరఫున 25 వన్డేలు, ఏకైక టెస్టు, 15 అంతర్జాతీయ టీ20లు ఆడిన షార్జిల్.. పీఎస్ఎల్ రెండో ఎడిషన్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. దాంతో 2017, ఆగస్టులో అతనిపై ఐదేళ్ల నిషేధం విధిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది. కాగా, తనను క్షమించాలంటూ పీసీబీకి షార్జిల్ విన్నవించుకోవడంతో అతనిపై ఉన్న నిషేధాన్ని రెండేళ్లకే పరిమితం చేశారు. దాంతో షార్జిల్‌పై నిషేధం ముగిసింది. దాంతో షార్జిల్ తన కెరీర్‌ను తిరిగి కొనసాగించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. కాగా, ఖలీద్ లతీఫ్, మహ్మద్ ఇర్ఫాన్, మహ్మద్ నవాజ్, నసీర్ జెంషెడ్, షహ్‌జైబ్ హసన్‌లు ఇంకా నిషేధం ఎదుర్కొంటున్నారు. -
నన్ను క్షమించండి: పాక్ క్రికెటర్
కరాచీ: పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన ఆ దేశ క్రికెటర్ షార్జీల్‌ఖాన్ తిరిగి తన కెరీర్‌ను కొనసాగించేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డుకు క్షమాపణలు చెప్పాడు. సోమవారం పీసీబీ అవినీతి నిరోధక శాఖ అధికారులను షార్జీల్ కలిసి విజ్ఞప్తి చేశాడు. బోర్డు విధించిన నిషేధం గడువు ముగియడంతో తిరిగి కెరీర్‌ను కొనసాగించేందుకు అతడికి అనుమతి లభించింది. ‘నా వల్ల ఇబ్బంది పడ్డ పీసీబీకి, సహచరులకు, అభిమానులకు, కుటుంబసభ్యులకు క్షమాపణలు చెబుతున్నా. ఇప్పటి నుంచి బాధ్యతాయుతంగా ఉండి భవిష్యత్‌లో మంచి ప్రదర్శన చేస్తానని హమీ ఇస్తున్నా’ అంటూ పీసీబీ విడుదల చేసిన లేఖలో షార్జీల్ పేర్కొన్నాడు. అతడికి విధించిన నిషేధం రెండున్నరేళ్ల గడువు ముగిసినందున తిరిగి రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్‌కి ఎంపికయ్యాడని, ఈ ఏడాది పూర్తయ్యేలోపు షార్జీల్ తన శిక్షణను పూర్తి చేసుకుంటాడని పీసీబీ ప్రకటించింది. ఆ తర్వాత జాతీయ జట్టులో చేరతాడని చెప్పింది. 2017లో దుబాయ్‌లో నిర్వహించిన పీఎస్ఎల్ రెండో సీజన్లో షార్జీల్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడిపై ఐదేళ్ల పాటు నిషేధం విధించిన పాక్ బోర్డు. తర్వాత దాన్ని రెండున్నరేళ్లకు కుదించింది. ఇటీవల ఆ గడువు పూర్తవడంతో తిరిగి తన కెరీర్ కొనసాగించేందుకు అవకాశమిచ్చింది. -
స్పాట్ ఫిక్సింగ్‌లో అడ్డంగా దొరికిన క్రికెటర్
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ క్రికెట్ ఆటగాళ్లు ఫిక్సింగ్‌లో కూరుకుపోయారు. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురౌతున్నా ఆటగాళ్లు మాత్రం ఫిక్సింగ్‌లో దొరకుతూనే ఉన్నారు. సరిగ్గా మూడు నెలలక్రితం పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో స్పాట ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పాక్ ఆల్‌రౌండర్ నవాజ్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రెండు నెలలపాటు నిషేధం విధించిన సంఘటన మరవక ముందే మరొక ఆటగాడు ఫిక్సింగ్‌లో అడ్డంగా దొరికిపోయాడు. తాజాగా బుధవారం పాక్ ఓపెనర్ బ్యాట్‌మెన్ సార్జీల్ఖాన్పై పాకిస్తాన్ అవినీతి నిరోధక ట్రిబ్యునల్ 5ఏళ్లపాటు నిషేధం విధించింది. మంగళవారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గత ఫిబ్రవరిలో దుబాయిలో నిర్వహించిన పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని సాక్ష్యాధారాలు సమర్పించడంతో ట్రిబ్యునల్ తుది తీర్పును వెలువరించింది. సార్జీల్ఖాన్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పతున్నారనే ఆరోపణలతో పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభమైన రెండో రోజునే లీగ్ నుంచి వెనక్కి పంపించారు. స్పాట్ ఫిక్సింగ్‌లో దొరకడం పాక్ క్రికెటర్లకు కొత్తేం కాదు. గతంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్‌భట్, పేసర్ మహమ్మద్ అమీర్, ఆసిఫ్‌లు 2010 ఇంగ్లండ్ పర్యటనలో స్పాట్ ఫిక్సింగ్‌లో అడ్డంగా దొరికిపోయారు. 2012-13లో టెస్ట్ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా సైతం ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభం అనంతరం ఈ ఫిక్సింగ్ భూతం మరింత విస్తరించింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మూడు నెలల క్రితం వేటు వేసింది. ఫిక్సింగ్ ఆరోపణలతో జంషెద్ అనే క్రికెటర్ కూడా గత ఫిబ్రవరిలో నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. -
ట్వంటీ20 స్పాట్ ఫిక్సింగ్: మరొకరి అరెస్ట్
లండన్: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్) లీగ్ లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలతో గత వారం ఇద్దరు పాకిస్తాన్ క్రికెటర్లను అదుపులోకి తీసుకున్న బ్రిటన్ పోలీసులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ క్రికెట్ స్పాట్ ఫిక్సింగ్ పై దృష్టిపెట్టిన బ్రిటన్ జాతీయ నేర విభాగం షెఫీల్డ్ లో స్థానిక పౌరుడిని అదుపులోకి తీసుకున్నట్లు గురువారం వెల్లడించింది. అయితే ఆ వ్యక్తి బెయిల్ పై విడుదలనట్లు తెలిపింది. ఫిబ్రవరి 13న పాక్ క్రికెటర్లు నాసిర్ జంషెడ్, యూసఫ్ లను అదుపులోకి తీసుకోగా రెండు రోజుల అనంతరం ఏప్రిల్ వరకు బెయిల్ మంజూరు కావడంతో బయటకొచ్చారు. పీఎస్ఎల్ కు సంబంధించి స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డార్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు పాక్ క్రికెటర్లు షార్జిల్ ఖాన్, ఖాలిద్ లతీఫ్ లకు రెండు వారాల గడువిస్తూ వివరణ ఇవ్వాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదేశించింది. గత శనివారం పీసీబీ ఈ ఇద్దరు క్రికెటర్ల విషయాన్ని మీడియాకు వెల్లడించింది. మరోవైపు ఫిక్సింగ్ ఆరోపణలతో పీసీబీ ఇదివరకే.. ఇస్లామాబాద్ యూనైటెడ్ ప్లేయర్ షార్జిల్ ఖాన్, ఖాలిద్ లతీఫ్ ను సస్పెండ్ చేసింది. పీఎస్ఎల్ లో పాక్ క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్ పాల్పడ్డారన్న ఆరోపణలపై బ్రిటన్ ఎన్సీఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఫిక్సింగ్ కు సంబంధం ఉందన్న ఆరోపణలతో మరికొందరిపై నిఘా పెట్టింది. షార్జిల్, లతీఫ్ మాత్రం తమకు ఫిక్సింగ్ తో ఎలాంటి సంబంధాలు లేవని, తమపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆటగాళ్ల ఫిక్సింగ్ వివరాలపై మాట్లాడేందుకు పీసీబీ నిరాకరిస్తోంది. -
సస్పెండైన ఇద్దరు క్రికెటర్లు!
కరాచీ:పాకిస్తాన్ కు చెందిన క్రికెటర్లు షర్జిల్ ఖాన్, ఖలిద్ లతిఫ్ లపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ ఇద్దరిపై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్ చేస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) లో వారిద్దరూ స్పాట్ ఫిక్సింగ్ పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఐసీసీ సహకారంతో విచారణ చేపట్టిన పీసీబీ..వారిద్దరికీ ఫిక్సింగ్ తో సంబంధాలున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తూ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఫిక్సింగ్ కు పాల్పడిన ఎటువంటి ఆధారాలను పీసీబీ వెల్లడించలేదు. తాజాగా సస్పెన్షన్ వేటు పడిన వీరిద్దరూ జాతీయ స్థాయి క్రికెటర్లే. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాక్ జట్టులో షర్జిల్ సభ్యుడు. అతను పాకిస్తాన్ తరపున ఇప్పటివరకూ 25 వన్డేలు, 15 ట్వంటీ 20లు ఆడాడు. మరొకవైపు గతేడాది వరల్డ్ ట్వంటీ 20 పాల్గొన్న పాక్ జట్టులో లతిఫ్ సభ్యుడు. కేవలం ఐదు వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడిన లతిఫ్..13 ట్వంటీ 20 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. -
6, 4, 6, 6.. బాదాడు!
డబ్లిన్: ఐర్లాండ్ తో జరుగుతున్న మొదటి వన్డేలో పాకిస్థాన్ ఓపెనర్ షార్జిల్ ఖాన్ రెచ్చిపోయాడు. సెంచరీలో చెలరేగాడు. వన్డేల్లో పాకిస్థాన్ తరపున రెండో వేగవంతమైన శతకం నమోదు చేశాడు. 61 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. షాహిద్ ఆఫ్రిది తర్వాత అత్యంత వేగవంతమైన సెంచరీ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన షార్జిత్ ఐర్లాండ్ బౌలర్లపై సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 21 ఓవర్ లో వరుసగా 6, 4, 6, 6 బాదాడు. మరో ఎండో వికెట్లు పడుతున్నా వీరవిహారం కొనసాగించాడు. 86 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్సర్లతో 152 పరుగులు చేసి అవుటయ్యాడు. షార్జిత్ విజృంభణతో పాకిస్తాన్ 32 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 226 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. -
డబ్బులు ఇవ్వాలంటూ క్రికెటర్‌కు బెదిరింపులు
కరాచీ: డబ్బు కోసం తనను గుర్తు తెలియని వ్యక్తులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ పాకిస్తాన్ క్రికెటర్ షర్జీల్ ఖాన్ చెప్పాడు. తనకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని, లేకుంటే తన నకిలీ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించినట్టు తెలిపాడు. షర్జీల్ ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించాడు. 'కొందరు గుర్తుతెలియని నెంబర్ల నుంచి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. లేకుంటే నా భవిష్యత్‌కు భంగం కలిగించేలా వీడియోలను పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఎవరైనా అలాంటి వీడియోలను పోస్ట్ చేస్తే దయచేసి నమ్మకండి. అవన్నీ నకిలీ వీడియోలు. కొందరు నా ట్విట్టర్, ఫేస్బుక్ ఎకౌంట్లను కూడా హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారు' అని అభిమానులు, స్నేహితులను ఉద్దేశించి షర్జీల్ ట్వీట్ చేశాడు. బెదిరింపుల కేసులో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, పోలీసులు షర్జీల్‌కు అండగా నిలిచారు. ఆసియా కప్, ప్రపంచ టి-20 కప్‌లో పాక్‌కు షర్జీల్ ప్రాతినిధ్యం వహించాడు.