కరాచీ: పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ ఉమర్ అక్మల్‌కు కొంత ఊరట లభించింది. అతనిపై విధించిన మూడేళ్ల నిషేధాన్ని 18 నెలలకు కుదిస్తూ స్వతంత్ర న్యాయ నిర్ణేత ఫకీర్ మొహమ్మద్ ఖోఖర్ తీర్పు వెలువరించారు. అతనిపై నిషేధం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వచ్చే ఏడాది ఆగస్టు వరకు కొనసాగుతుందని ఖోఖర్ తెలిపారు. అయితే ఈ తీర్పుపై అక్మల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మరోసారి దీనిపై అప్పీల్ చేస్తానని పేర్కొన్నాడు.
తనకన్నా తీవ్రమైన నేరాలకు పాల్పడిన క్రికెటర్లకు తేలికపాటి శిక్షలు విధించారన్న అక్మల్ తనకు మాత్రం పెద్ద శిక్ష వేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజా తీర్పు పట్ల సంతోషంగా లేనని పేర్కొన్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ సందర్భంగా బుకీల గురించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు తెలపకపోవడంతో పాటు, పీసీబీ అవినీతి నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ అక్మల్‌పై ఏప్రిల్‌లో మూడేళ్ల సస్పెన్షన్ విధించారు. తన తప్పును అంగీకరించిన అక్మల్ తనను క్షమించాలంటూ కోర్టుకు అప్పీల్ చేయగా తాజాగా శిక్షను 18 నెలలకు కుదించారు.
Comments
Please login to add a commentAdd a comment