PCB Likely To Appoint Mohammad Yousuf As Permanent Batting Coach For Pakistan - Sakshi
Sakshi News home page

Pakistan Batting Coach: పాకిస్తాన్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా లెజెండరీ క్రికెటర్‌..!

Published Fri, Jul 22 2022 12:27 PM | Last Updated on Fri, Jul 22 2022 1:28 PM

PCB likely to appoint Mohammad Yousuf as permanent batting coach - Sakshi

పాకిస్తాన్‌ పూర్తి స్థాయి బ్యాటింగ్ కోచ్‌గా ఆ దేశ లెజెండరీ క్రికెటర్‌ మహ్మద్ యూసుఫ్‌ను నియమించేందుకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సిద్దమైంది. యూసుఫ్‌ ఎంపిక సంబంధించి ఒకట్రెండు రోజుల్లో పీసీబీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.  కాగా యూసుఫ్‌ ప్రస్తుతం నేషనల్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్నాడు. పీసీబీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే నేషనల్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో తన బాధ్యతల నుంచి యూసుఫ్‌ వైదొలిగినట్లు తెలుస్తోంది.

ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో దశాబ్దానికి పైగా పాక్‌కు సేవలందించిన యూసఫ్.. ఇప్పడు జట్టులో కోచ్‌ పాత్ర చేపట్టేందుకు సిద్దమయ్యాడు. వన్డే, టెస్టుల్లో పాక్‌ తరపున విజయవంతమైన ఆటగాళ్లలలో యూసఫ్ ఒకడు. 350 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పాక్‌కు ప్రాతినిద్యం వహించిన యూసఫ్ 17000 పైగా పరుగులు సాధించాడు.

అదే విధంగా టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు. 2006లో పాక్‌ తరపున అత్యధికంగా 1788 పరుగులు చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2021 ముందు పాకిస్తాన్‌ ​జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా నియమితుడైన ఆసీస్ దిగ్గజం మాథ్యూ హేడెన్‌తో కలిసి యూసఫ్ పనిచేయనున్నాడు. ఇక పాకిస్తాన్‌ జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. తొలి టెస్టులో విజయం సాధించిన పాకిస్తాన్‌.. ఆదివారం జరగనున్న రెండో టెస్టుకు సిద్దమవుతోంది.
చదవండిInd Vs WI 1st ODI: రుతురాజ్‌కు నో ఛాన్స్‌! ధావన్‌తో ఓపెనర్‌గా అతడే! ఇక ఫినిషర్‌గా ఎవరంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement