Mohammad Yousuf
-
పాకిస్తాన్ బ్యాటింగ్ కోచ్‌గా లెజెండరీ క్రికెటర్..!
పాకిస్తాన్ పూర్తి స్థాయి బ్యాటింగ్ కోచ్‌గా ఆ దేశ లెజెండరీ క్రికెటర్ మహ్మద్ యూసుఫ్‌ను నియమించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్దమైంది. యూసుఫ్ ఎంపిక సంబంధించి ఒకట్రెండు రోజుల్లో పీసీబీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా యూసుఫ్ ప్రస్తుతం నేషనల్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్లో బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నాడు. పీసీబీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే నేషనల్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్లో తన బాధ్యతల నుంచి యూసుఫ్ వైదొలిగినట్లు తెలుస్తోంది. ఇక అంతర్జాతీయ క్రికెట్లో దశాబ్దానికి పైగా పాక్‌కు సేవలందించిన యూసఫ్.. ఇప్పడు జట్టులో కోచ్ పాత్ర చేపట్టేందుకు సిద్దమయ్యాడు. వన్డే, టెస్టుల్లో పాక్ తరపున విజయవంతమైన ఆటగాళ్లలలో యూసఫ్ ఒకడు. 350 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పాక్‌కు ప్రాతినిద్యం వహించిన యూసఫ్ 17000 పైగా పరుగులు సాధించాడు. అదే విధంగా టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు. 2006లో పాక్ తరపున అత్యధికంగా 1788 పరుగులు చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2021 ముందు పాకిస్తాన్ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా నియమితుడైన ఆసీస్ దిగ్గజం మాథ్యూ హేడెన్‌తో కలిసి యూసఫ్ పనిచేయనున్నాడు. ఇక పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. తొలి టెస్టులో విజయం సాధించిన పాకిస్తాన్.. ఆదివారం జరగనున్న రెండో టెస్టుకు సిద్దమవుతోంది. చదవండి: Ind Vs WI 1st ODI: రుతురాజ్‌కు నో ఛాన్స్! ధావన్‌తో ఓపెనర్‌గా అతడే! ఇక ఫినిషర్‌గా ఎవరంటే.. -
73 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కివీస్ బ్యాటర్.. దిగ్గజాల సరసన చోటు
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. తాజాగా లీడ్స్ వేదికగా మూడో టెస్టులోనూ సెంచరీతో మెరిసిన మిచెల్‌కు ఇది హ్యాట్రిక్ శతకం కావడం విశేషం. ఇక మూడో టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్ అయింది. డారిల్ మిచెల్ 109, టామ్ బ్లండన్ 55 పరుగులు, టిమ్ సౌథీ 33 పరుగులు చేశారు. ఒక దశలో 123 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన న్యూజిలాండ్‌ను మిచెల్, టామ్ బ్లండన్లు ఆదుకున్నారు. ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు 120 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ నేపథ్యంలోనే డారిల్ మిచెల్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. ►228 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్న డారిల్ మిచెల్ విదేశంలో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా మూడు టెస్టుల్లో మూడు శతకాలు నమోదు చేసిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ►జాక్ లీచ్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి సెంచరీ మార్కును అందుకున్న డారిల్ మిచెల్.. 73 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రస్తుత మూడు టెస్టుల సిరీస్‌లో డారిల్ మిచెల్ ఇప్పటివరకు 482 పరుగులు సాధించాడు. అంతకముందు 1949లో బెర్ట్ సుత్క్లిఫ్ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 451 పరుగులు సాధించాడు. తాజాగా బెర్ట్ సుత్ల్కిఫ్ను అధిగమించిన డారిల్ మిచెల్ తొలి స్థానంలో నిలిచాడు. ►ఇక 21వ శతాబ్దంలో విదేశాల్లో వరుసగా హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేసిన జాబితాలో మిచెల్ నాలుగో ప్లేయర్‌గా చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో వరుసగా మూడు శతకాలు నమోదు చేసిన డారిల్ మిచెల్ క్రికెట్ దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు. ఇంతకముందు టీమిండియా నుంచి రాహుల్ ద్రవిడ్(2002, 2011), పాకిస్తాన్ నుంచి మహ్మద్ యూసఫ్(2002), ఆస్ట్రేలియా నుంచి స్టీవ్ స్మిత్(2019లో) ఈ ఘనత సాధించారు. ►మూడు టెస్టుల సిరీస్‌లో మూడు టెస్టు మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు సాధించిన జాబితాలో డారిల్ మిచెల్ ఏడో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లి(2017లో శ్రీలంకపై), రాస్ టేలర్(2013లో వెస్టిండీస్‌పై) , మహ్మద్ యూసఫ్(2006లో వెస్టిండీస్‌పై), మాథ్యూ హెడెన్(2002లో సౌతాఫ్రికాపై), షోయబ్ మహ్మద్(1990లో ఆస్ట్రేలియాపై), బారింగ్టన్(1967లో పాకిస్తాన్‌పై) డారిల్ మిచెల్ కంటే ముందున్నారు. Three hundreds in three matches. Well batted, Daryl Mitchell 👏 Scorecard/clips: https://t.co/AIVHwaRwQv 🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/ZiDfbtgsbT — England Cricket (@englandcricket) June 24, 2022 -
కోహ్లికి గురించి ఒక్క మాటలో..
కరాచీ: వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ల కంటే భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కరే మేటి అంటున్నాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్. ఈ ముగ్గురిలో అత్యుత్తమ బెస్ట్ బ్యాట్స్‌మన్ ఎవరు అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సచిన్ అని సమాధానమిచ్చాడు యూసఫ్. ట్వీటర్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు యూసఫ్ బదులిచ్చాడు. ఇక్కడ సచిన్‌కు తొలి స్థానాన్ని ఇచ్చిన యూసఫ్.. లారాకు రెండో ప్లేస్‌ను కట్టబెట్టాడు. (‘కుంబ్లే కోసం నా జీవితాన్ని ఇస్తా’) ఇక పాంటింగ్‌కు మూడు, కల్లిస్కు నాలుగు, సంగక్కరాకు ఐదో స్థానం ఇచ్చాడు. కాకపోతే సచిన్, లారాలు ఇద్దరూ తన ఫేవరెట్ ఆటగాళ్లనేని యూసఫ్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంచితే, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి ఒక్క మాటలో చెప్పాలంటూ ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు ‘నంబర్ వన్ ఎట్ ద మూమెంట్..గ్రేట్ ప్లేయర్’ అని పేర్కొన్నాడు. కాగా, వైట్ బాల్ క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్ ఎవరనే ప్రశ్నకు న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్‌ను ఎంచుకున్నాడు. ('రోహిత్ ఎదగడానికి ధోనియే కారణం') -
‘ఇదేం పద్ధతి.. నాకైతే అర్థం కావట్లేదు’
ఇస్లామాబాద్: కోచింగ్‌లో కనీసం క్లబ్ లెవల్లో కూడా అనుభవం లేని మిస్బావుల్ హక్‌ను పాకిస్తాన్ ప్రధాన కోచ్‌గా కొనసాగించడం పట్ల ఆ జట్టు మాజీ ఆటగాడు మహ్మద్ యూసఫ్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చర్యలను తప్పుపడుతూ ఎగతాళిగా మాట్లాడాడు. ఆటలో నైపుణ్యం, కెప్టెన్సీలో నిజాయితీ, కోచ్‌గా అనుభవం లేనటువంటి మిస్బావుల్‌ను పాక్ హెడ్ కోచ్‌గా నియమించడం విడ్డూరంగా ఉందన్నారు. ఏ ప్రామాణికంగా అతడిని కోచ్‌గా కొనసాగిస్తున్నారో చెప్పాలని పీసీబీని యూసఫ్ ప్రశ్నించారు. ‘కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకునే వారికి కనీస అనుభవం ఉండాలనే షరతును పీసీబీ పెట్టింది. కానీ కనీసం క్లబ్ లెవల్లో కూడా కోచింగ్ అనుభవం లేని మిస్బావుల్‌ను ఎంపిక చేసింది. కోచ్ ఎంపిక విషయంలో పీసీబీ అవలంభించిన ద్వంద్వ వైఖరేంటో అర్థం కావడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆటగాళ్లు, సారథి నిజాయితీగా, నిస్వార్థంగా ఉండాలని మిస్బా పేర్కొన్నాడు. కానీ అతడు సారథిగా ఉన్నప్పుడు అజహర్ అలీని జట్టులోకి ఎందుకు తీసుకోలేదో చెప్పగలడా? అజహర్ అలీ మంచి బ్యాట్స్‌మన్. అయితే అతడు క్రీజులో సెటిల్ అవ్వడానికి కాస్త సమయం తీసుకుంటాడు. మిస్బా కూడా అంతే. అతడి ఆటలో ఎలాంటి ప్రత్యేక నైపుణ్యం లేదు. ఒకే రీతిలో రక్షణాత్మకంగా ఆడతాడు. స్పిన్నర్లు బౌలింగ్‌కు దిగేవరకు వేచి చూసి ఆ తర్వాత పరుగులు రాబట్టేవాడు’అని యూసఫ్ వ్యాఖ్యానించాడు. మిస్బావుల్ పాక్ తరుపున 90 టెస్టులు, 288 వన్డేలు ఆడాడు. బ్యాట్స్‌మన్‌గా మంచి రికార్డు ఉండటంతో పాటు వివాదరహితుడుగా పేరుగాంచిన మిస్బాను పాక్ జట్టు ప్రధానకోచ్, చీఫ్ సెలక్టర్‌గా పీసీబీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. చదవండి: ఐసోలేషన్ క్రికెట్ కప్.. ఐసీసీ ట్వీట్ ఇలాంటి దిగ్గజం.. తరానికి ఒక్కరు -
కోహ్లి కంటే వారిద్దరే గొప్ప..
కరాచీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్, పరుగుల మెషీన్ విరాట్ కోహ్లి కంటే దిగ్గజ క్రికెటర్లైన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ లే గొప్ప బ్యాట్స్‌మెన్ అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొహ్మద్ యూసఫ్ అభిప్రాయపడ్డాడు. కనీసం వీవీఎస్ లక్ష్మణ్ తో పోల్చదగిన స్థాయి కూడా విరాట్ ఇంకా సంపాదించుకోలేదని యూసఫ్ పేర్కొన్నాడు. ప్రస్తుత క్రికెట్ లో నాణ్యత కొరవడిందన్న యూసఫ్..ప్రధానంగా నాణ్యమైన బౌలర్లే ఇప్పుడు కనబడటం లేదన్నాడు. తాను క్రికెట్ ఆడిన సమయంలో బౌలింగ్ లో క్వాలిటీ ఉండేదన్నాడు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో మెక్ గ్రాత్, షేన్ వార్న్ లతో పాటు, భారత్ లో అనిల్ కుంబ్లే, శ్రీనాథ్ లను యూసఫ్ గుర్తు చేసుకున్నాడు. వారు అద్భుతమైన బౌలర్లని యూసఫ్ కొనియాడాడు. మరొకవైపు ప్రస్తుత పిచ్ లన్నీ ఫ్రెండ్లీ పిచ్ లని.. అవి బ్యాటింగ్ కు ఎక్కువగా అనుకూలిస్తాయన్నాడు. సచిన్, ద్రవిడ్ లు తమ సమయంలో క్లిష్టమైన బౌలర్లను ఎదుర్కొని దిగ్గజ ఆటగాళ్లుగా గుర్తింపు పొందారని.. ఈ నేపథ్యంలో కోహ్లిని వారితో పోల్చకూడదని యూసఫ్ అన్నాడు. -
అనురాగ్.. నీకిది సరికాదు
లాహోర్:ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేసిన బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు. అనురాగ్ ఒక క్రికెట్ బోర్డుకు అధ్యక్షుడిగా మాట్లాడుతున్నారా?లేక రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారా? అంటూ పాక్ దిగ్గజ ఆటగాడు మొహ్మద్ యూసఫ్ మండిపడ్డాడు. అనురాగ్ తాజా ప్రకటన కచ్చితమైన రాజకీయ వ్యాఖ్యగా ఉందంటూ విమర్శించాడు. గత కొన్నేళ్ల నుంచి భారత్ తో క్రికెట్ ఆడటానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటే ఇప్పుడు అనురాగ్ ఇలా వ్యాఖ్యానించడం సరికాదన్నాడు. రాజకీయాలను, క్రీడలను వేర్వేరుగా చూడాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) పదే పదే స్పష్టం చేస్తున్నా, అనురాగ్ మాత్రం రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తున్నారని యూసఫ్ విమర్శించాడు. ఒక బీజేపీ ఎంపీగా మీరు మాట్లాడుతున్నారా?లేక బీసీసీఐ బాస్‌గా వ్యాఖ్యానిస్తున్నారా?అని నిలదీశాడు. మరో పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ ఖాదిర్ కూడా అనురాగ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఒక స్పోర్టింగ్ బాడీలో భాగమైన బీసీసీఐ ..రాజకీయ పరమైన ఆధిపత్యం చెలాయిస్తుందనడానికి ఈ వ్యాఖ్యలే ఉదాహరణ అని ఖాదిర్ విమర్శించారు. చాలాకాలం నుంచి తమతో క్రికెట్ ఆడటానికి భారత్ మొగ్గు చూపకపోయినప్పటికీ, అనురాగ్ చేసిన ప్రస్తుత వ్యాఖ్యలతో వచ్చే లాభం ఏముందని ప్రశ్నించాడు. -
' ఆ టూర్ మా బ్యాట్స్‌మెన్‌కు సవాల్'
కరాచీ: వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న తమ జట్టుకు అక్కడ జరిగే టెస్టు సిరీస్ కచ్చితంగా పెద్ద పరీక్షగా నిలుస్తుందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసుఫ్ పేర్కొన్నాడు. ప్రత్యేకంగా తమ బ్యాట్స్‌మెన్‌కు ఇంగ్లండ్ టూర్ ఒక సవాల్ అని స్పష్టం చేశాడు. ఇటీవల యూఏఈలో మాత్రమే ఆడుతున్న పాకిస్తాన్‌కు ఇంగ్లండ్‌లో పరిస్థితులకు అలవాటు పడటం అంత తేలిక కాదన్నాడు. యూఏఈలోని పిచ్‌లకు, పాక్ పిచ్‌లకు పెద్దగా వ్యత్యాసం లేకపోయినా, ఇంగ్లండ్ వాతావారణం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుందని యూసుఫ్ అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో మంచి రికార్డు కల్గిన ఇంగ్లండ్‌ను వారి దేశంలో నిలువరించడం పాక్‌కు అంత సులువు కాదని తెలిపాడు. గత కొంత కాలం నుంచి యూఏఈ లో ఆడటానికి మాత్రమే పాక్ పరిమితం కావడం ఆందోళన కల్గిస్తుందన్నాడు. -
మాజీ క్రికెటర్ల తిట్ల పురాణం!
కరాచీ: సాధారణంగా రాజకీయ నాయకుల మధ్య నిర్వహించే చర్చా వేదికలే ఎక్కువగా గందరగోళ పరిస్థితులకు దారి తీస్తుంటాయి. తమ ఆధిపత్య పోరును నిలుపుకునేందుకు వారు తీవ్ర విమర్శలు చేసుకుంటూ ఉంటారు. అయితే క్రికెట్ విశ్లేషణ సందర్భంగా ఆటగాళ్ల మధ్య విభేదాలు చోటు చేసుకున్న ఘటనలు చాలా అరుదు. ఈ తరహా ఘటన తాజాగా పాకిస్తాన్ క్రికెట్ లో కలకలం రేపింది. ఇద్దరు ప్రముఖ మాజీ క్రికెటర్ల మధ్య నిర్వహించిన టెలివిజన్ డిబేట్ కాస్తా వ్యక్తిగత విమర్శలకు దారి తీసింది. ఇందుకు మహ్మద్ యూసఫ్, రమీజ్ రాజాలు వేదికగా నిలిచారు. ఎవరైతే గడ్డం పెంచుకుంటారో వారు అబద్ధాలు దూరంగా ఉండాలంటూ వ్యంగ్యంగా మాట్లాడి తొలుత వివాదానికి తెరలేపాడు రమీజ్ రాజా. దీనిపై తీవ్రంగా స్పందించిన యూసఫ్.. 'సిగ్గుమాలిన పనులు చేసేవారే నీలా అర్థంలేకుండా మట్లాడతారు. నీకు క్రికెట్ ఆడే సామర్థ్యమే లేదు. నువ్వు ఒక మాటకారివి. మరోసారి అదే మాటలతో మాయ చేస్తున్నావు. గడ్డాన్ని పెంచుకోవడానికి నువ్వు అర్హుడవే కావు. నువ్వు పాకిస్తాన్ క్రికెట్ లో ఉద్ధరించిందేమీ లేదు. 57 టెస్టుల్లో రెండు సెంచరీలు మాత్రమే చేశావు. అసలు ప్రముఖ క్రికెటర్ ఎలా అయ్యావో అనేది మరోసారి చూడాలనుకుంటున్నా. నీలాంటి వాళ్లు క్రికెట్ గురించి మాట్లాడకూడదు. నువ్వొక ఇంగ్లిష్ టీచర్‌వి మాత్రమే. అంతకుమించి నీకు తెల్సిందేమీ లేదు' అని యూసఫ్ విమర్శలకు దిగాడు. 'నువ్వు ఏమీ మాట్లాడినా ఫర్వాలేదు.. కానీ నువ్వు క్రికెట్ లో చీడ పురుగు మాదిరి తయారయ్యావు 'అని రమీజ్ బదులిచ్చాడు. అవును నాకు క్రికెటే సర్వస్వం. నాకు అది తప్ప ఇంకోటి తెలీదు. ఆ పని నీ వల్ల కాదు ' అని యూసఫ్ మరోసారి ఎదురుదాడి చేశాడు. వీరి వ్యక్తిగత దూషణల పర్వం తారాస్థాయికి చేరడంతో యాంకర్ కల్పించుకుని సర్దిచెప్పే యత్నం చేసి వారిద్దరి పంపించి వేశాడు. దీంతో ఆ డిబేట్ అర్థాంతరంగా ముగియక తప్పలేదు. -
క్రికెట్ కోచ్ ను మార్చండి!
కరాచీ: గత కొంతకాలంగా పేలవంగా సాగుతున్న పాకిస్థాన్ క్రికెట్ మరింత దిగజారిపోకుండా ఉండాలంటే దేశీయ కోచ్ లను కచ్చితంగా వదిలి పెట్టాల్సిన అవసరం ఉందని ఆ దేశ మాజీ ఆటగాడు మహ్మద్ యూసఫ్ స్పష్టం చేశాడు. ఆటగాళ్ల ప్రదర్శన మెరుగుపడటంతో పాటు, జట్టు కూడా పూర్తి స్థాయిలో ముందడుగు వేయాలంటే విదేశీ కోచ్ తోనే సాధ్యమవుతుందన్నాడు. ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ లో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైన నేపథ్యంలో యూసఫ్ స్పందించాడు. వన్డేల్లో, ట్వంటీ 20 ల్లో పాకిస్థాన్ క్రికెట్ పరిస్థితి అంతకంతకూ కిందికి పడిపోతుందంటూ యూసఫ్ ఆందోళన వ్యక్తం చేశాడు. రాబోయే సంవత్సరం అంతా కూడా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల్లో పాకిస్థాన్ కు బిజీ షెడ్యూల్ ఉన్న తరుణంలో విదేశీ కోచ్ పై దృష్టి పెట్టాలని పీసీబీకి సూచించాడు. ఒకవేళ అలా జరగని పక్షంలో పాకిస్థాన్ మరోసారి చేదు అనుభవాన్ని ఎదుర్కొనక తప్పదని హెచ్చరించాడు. కాగా, ఎటువంటి విదేశీ కోచ్ ను తీసుకోవాలో అనే దానిపై కూడా యూసఫ్ స్పష్టతనిచ్చాడు. డేవ్ వాట్ మోర్, జెఫ్ లాసన్ వంటి కోచ్ లు కంటే గతంలో పాకిస్థాన్ కు పని చేసిన దివంగత కోచ్ బాబ్ వూమర్ తరహా కోచ్ లైతే మేలని సూచించాడు. పాకిస్థాన్ క్రికెట్ ను వూమర్ ఎంతగానో మెరుగుపరిచాడని ఈ సందర్భంగా యూసఫ్ కొనియాడాడు. ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ కోచ్ గా వకార్ యూనస్ పని చేస్తున్న సంగతి తెలిసిందే.