కరాచీ: వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ల కంటే భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కరే మేటి అంటున్నాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్. ఈ ముగ్గురిలో అత్యుత్తమ బెస్ట్ బ్యాట్స్‌మన్ ఎవరు అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సచిన్ అని సమాధానమిచ్చాడు యూసఫ్. ట్వీటర్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు యూసఫ్ బదులిచ్చాడు. ఇక్కడ సచిన్‌కు తొలి స్థానాన్ని ఇచ్చిన యూసఫ్.. లారాకు రెండో ప్లేస్‌ను కట్టబెట్టాడు. (‘కుంబ్లే కోసం నా జీవితాన్ని ఇస్తా’)
ఇక పాంటింగ్‌కు మూడు, కల్లిస్‌కు నాలుగు, సంగక్కరాకు ఐదో స్థానం ఇచ్చాడు. కాకపోతే సచిన్, లారాలు ఇద్దరూ తన ఫేవరెట్ ఆటగాళ్లనేని యూసఫ్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంచితే, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి ఒక్క మాటలో చెప్పాలంటూ ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు ‘నంబర్ వన్ ఎట్ ద మూమెంట్..గ్రేట్ ప్లేయర్’ అని పేర్కొన్నాడు. కాగా, వైట్ బాల్ క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్ ఎవరనే ప్రశ్నకు న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్‌ను ఎంచుకున్నాడు. ('రోహిత్ ఎదగడానికి ధోనియే కారణం')
Comments
Please login to add a commentAdd a comment