Pakistan Cricketer Khurram Manzoor Claims That He Is Better Than Virat Kohli - Sakshi
Sakshi News home page

నేనే నంబర్‌ వన్‌, నా తర్వాతే కోహ్లి.. పాక్‌ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు

Published Wed, Jan 25 2023 9:20 PM | Last Updated on Thu, Jan 26 2023 10:45 AM

Pakistan Cricketer Khurram Manzoor Claims That He Is Better Than Virat Kohli - Sakshi

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, పరుగుల యంత్రం, రికార్డు రారాజు విరాట్‌ కోహ్లితో పోల్చుకుంటూ పాకిస్తాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ ఖుర్రమ్‌ మన్సూర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 36 ఏళ్ల ఈ పాకిస్తానీ ఔట్‌ డేటెడ్‌ బ్యాటర్‌ తాజాగా ఓ  యూట్యూబ్‌ ఛానల్‌తో మాట్లాడుతూ.. 50 ఓవర్ల ఫార్మాట్‌లో (లిస్ట్‌-ఏ) విరాట్‌ కోహ్లి కంటే నేనే బెటర్‌, ఈ ఫార్మాట్‌లో కోహ్లి రికార్డులు నా రికార్డుల ముందు బలాదూర్‌, ప్రపంచంలో నేనే నంబర్‌ వన్‌ బ్యాటర్‌ అంటూ తన డప్పు తాను కొట్టుకున్నాడు. ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే ఖుర్రమ్‌ తన అవివేకాన్ని కవర్‌ చేసుకునే ప్రయత్నం చేశాడు.

విరాట్‌తో పోల్చుకోవడం తన ఉద్దేశం కాదని, వాస్తవానికి 50 ఓవర్ల క్రికెట్‌లో టాప్‌-10 బ్యాటర్స్‌లో నేనే ప్రపంచ నంబర్‌ వన్‌ అని, రికార్డుల ప్రకారం కోహ్లి నా తర్వాతే ఉంటాడని ఇష్టమొచ్చినట్లు వాగాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో నా కన్వర్జన్‌ రేట్‌ బెటర్‌గా ఉందని, ఇందుకు గణాంకాలే సాక్షమని అన్నాడు.

50 ఓవర్ల క్రికెట్‌లో కోహ్లి ప్రతి 6 ఇన్నింగ్స్‌లకు సెంచరీ చేస్తే, నేను ప్రతి 5.68 ఇన్నింగ్స్‌లకే సెంచరీ బాదాను అని చెప్పుకొచ్చాడు. గత 10 ఏళ్లుగా ఈ ఫార్మాట్‌లో తన సగటు 53గా ఉందని, ప్రపంచ లిస్ట్‌-ఏ క్రికెట్‌ గణాంకాల్లో తాను ఐదో స్థానంలో ఉన్నానని తెలిపాడు. కాగా, ఖుర్రమ్‌ లిస్ట్-ఏ క్రికెట్‌లో 166 మ్యాచ్‌ల్లో 53 సగటున 27 శతకాల సాయంతో 7992 పరుగులు చేశాడని తెలుస్తోంది. 

2008లో పాక్‌ తరఫున తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన ఖుర్రం.. తన కెరీర్‌ మొత్తంలో 16 టెస్ట్‌లు, 7 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. 2016లో చివరిసారిగా పాక్‌కు ఓ టీ20 మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించిన ఖుర్రమ్‌ ఆతర్వాత అత్తాపత్తా లేడు. ఖుర్రమ్‌ టెస్ట్‌ల్లో సెంచరీ, 7 హాఫ్‌ సెంచరీలు, వన్డేల్లో 3 హాఫ్‌ సెంచరీలు చేశాడు. కోహ్లి-ఖుర్రమ్‌ ఇ‍ద్దరూ ఓ మ్యాచ్‌లో ఎదురెదురు పడ్డారు. ఆ మ్యాచ్‌లో కోహ్లినే ఖుర్రమ్‌ను రనౌట్‌ చేయడం కొసమెరుపు. 

 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement