Travis Head hits fastest-ever List A double- century: లిస్ట్-ఏ క్రికెట్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రెవీస్ హెడ్ తన పేరిట సరికొత్త రికార్డును లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియా డొమాస్టిక్ వన్డే కప్‌లో భాగంగా క్వీన్స్‌లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 114 బంతుల్లో హెడ్.. డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 127 బంతుల్లో 28 ఫోర్లు, 8 సిక్స్‌లతో 230 పరుగులు సాధించాడు. లిస్ట్- ఏ క్రికెట్‌లో రెండు సార్లు డబుల్ సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా హెడ్ మరో ఘనత సాధించాడు. కాగా ఆస్ట్రేలియా లిస్ట్- ఏ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో ఆటగాడిగా హెడ్ రికార్డులకెక్కాడు.
మార్ష్ కప్‌లో 257 పరుగులు చేసిన డీ ఆర్సీ షార్ట్ అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా ఉన్నాడు. అయితే వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా రోహిత్ శర్మ ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా 48 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆస్ట్రేలియా 392 పరగుల భారీ లక్ష్యాన్ని క్వీన్స్‌లాండ్ ముందట ఉంచింది. 392 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన క్వీన్స్‌లాండ్ 40 ఓవర్లలో 312 పరుగులకే ఆలౌటైంది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 67 పరుగుల తేడాతో సౌత్ ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇక హెడ్ ఆస్ట్రేలియా తరుపున 2018లో చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడాడు.
చదవండి: IPL 2022 Mega Auction: రైనా సహా ఆ ముగ్గురి ఖేల్ ఖతమైనట్టే..!
— varun seggari (@SeggariVarun) October 13, 2021
Comments
Please login to add a commentAdd a comment