రాయల్ లండన్ వన్డే కప్-2023లో నార్తంప్టన్షైర్ ఓపెనర్, టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా మరో సెంచరీ బాదాడు. నాలుగు రోజు కిందట (ఆగస్ట్ 9) సోమర్సెట్పై విధ్వంకర ద్విశతకం (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) బాదిన షా.. ఇవాళ (ఆగస్ట్ 13) డర్హమ్తో జరిగిన మ్యాచ్లో మెరుపు శతకం చేశాడు. ఈ మ్యాచ్లో 76 బంతులు ఎదుర్కొన్న షా.. 15 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 125 పరుగులు చేసి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన డర్హమ్ 43.2 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌట్ కాగా.. నార్తంప్టన్షైర్ 25.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.
Prithvi Shaw is in red-hot form in the One-Day Cup tournament in England. pic.twitter.com/pVIQwbOewJ
— CricTracker (@Cricketracker) August 13, 2023
చెలరేగిన లూక్ ప్రాక్టర్..
తొలుత బ్యాటింగ్ చేసిన డర్హమ్.. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ లూక్ ప్రాక్టర్ (9-0-34-4) ధాటికి 198 పరుగులకే కుప్పకూలింది. ప్రాక్టర్తో పాటు జేమ్స్ సేల్స్ (8-1-31-2), కియోగ్ (5.2-0-35-2), జాక్ వైట్ (10-0-49-1), కెర్రిగన్ (4-0-22-1) కూడా రాణించడంతో డర్హమ్ జట్టు పేకమేడలా కూలింది. డర్హమ్ ఇన్నింగ్స్లో ట్రెవాస్కిస్ (37), అలెక్స్ లీస్ (34), బుష్నెల్ (32), బోర్త్విక్ (20), ప్రిటోరియస్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
PRITHVI SHOW in One-day cup🔥 @PrithviShaw pic.twitter.com/GxY9uyrlUl
— CricTracker (@Cricketracker) August 13, 2023
విధ్వంసకర డబుల్ సెంచరీని మరువక ముందే..
199 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్తంప్టన్షైర్ను ఓపెనర్ పృథ్వీ షా మెరుపు శతకం బాది ఒంటిచేత్తో గెలిపించాడు. సోమర్సెట్పై చేసిన ద్విశతకాన్ని మరువక ముందే షా మరో మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. షాకు రాబ్ కియోగ్ (42) సహకరించగా.. ఎమిలియో గే (17), సామ్ వైట్మన్ (4), లూక్ ప్రాక్టర్ (3) విఫలమయ్యారు. డర్హమ్ బౌలర్లలో జార్జ్ డ్రిస్సెల్ 3 వికెట్లు పడగొట్టగా.. బుష్నెల్ ఓ వికెట్ తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment