
లిస్ట్ ‘ఎ' క్రికెట్‌లో హైదరాబాదీల ప్రపంచ రికార్డు
హైదరాబాద్ ఆటగాళ్లు ఆశిష్ రెడ్డి, రవికిరణ్ పదో వికెట్‌కు 128 పరుగులు జోడించి లిస్ట్ ‘ఎ’ క్రికెట్ (దేశవాళీ, అంతర్జాతీయ వన్డేలు)లో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. సుబ్బయ్యపిళ్లై ట్రోఫీలో భాగంగా సోమవారం కేరళతో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదైంది.
గతంలో చివరి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్య (అజేయంగా 106 పరుగులు-ఇంగ్లండ్‌పై 1984లో) ప్రపంచ రికార్డు విండీస్ దిగ్గజాలు వివియన్ రిచర్డ్స్, మైకేల్ హోల్డింగ్‌ల పేరిట ఉంది. కేరళతో మ్యాచ్‌లో హైదరాబాద్ 133 పరుగుల తేడాతో ఓడింది. - సాక్షి క్రీడావిభాగం