
సాక్షి, హైదరాబాద్: అతి తక్కువ వ్యవధిలో ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసి హైదరాబాదీ చిన్నారులు ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆదివారం ఆసిఫ్‌నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఎంఎస్ హిఫ్జ్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఖురాన్‌లోని వ్యాఖ్యలను విద్యార్థులు పఠించారు. గతంలో ఈ రికార్డు ఈజిప్టు పేరిట ఉంది. నగరంలోని 28 మంది విద్యార్థులు 11 నెలల్లోనే మొత్తం ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసి రికార్డు సాధించినట్లు అకాడమీ చైర్మన్ మహ్మద్ లతీఫ్ ఖాన్ చెప్పారు. కార్యక్రమంలో పలువురు మతగురువులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment