హైదరాబాద్: హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. హెల్మెట్ పై అవగాహన కల్పించడానికి నారాయణగూడలోని జాహ్నవి కాళాశాల విద్యార్థినులు ఓ కార్యక్రమం చేపట్టారు. రాఖీ కట్టు.. హెల్మెట్ పెట్టు అనే ఈ కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులతో రాఖీ కట్టించుకుని హెల్మెట్ ధరించాడు. హెల్మెట్పై అవగాహన కల్పిస్తూ హెల్మెట్ పెట్టుకుని నారాయణగూడ చౌరస్తా నుంచి సుందరయ్య విజ్ఞాన భవన్ వరకు విద్యార్థినులు ర్యాలీ నిర్వహించారు.
‘రాఖీ కట్టు.. హెల్మెట్ పెట్టు’
Published Sat, Aug 5 2017 1:13 PM | Last Updated on Tue, Sep 4 2018 5:29 PM
Advertisement
Advertisement