గాంధీలో ఫెస్ట్ సందడి
గాంధీ ఆస్పత్రి: తరగతులు, పుస్తకాలను పక్కనపెట్టిన మెడికోలు ఆటపాటలు, విందువినోదాలతో సందడి చేశారు. గాంధీ మెడికల్ కాలేజీ 2012 బ్యాచ్ నేతృత్వంలో ఇతిహాస్ పేరిట నిర్వహిస్తున్న కాలేజీ ఫెస్ట్‌లో వైద్యవిద్యార్థులు ఉరిమే ఉత్సాహంతో పాల్గొన్నారు. సోమవారం ఫేస్ పెయింటింగ్, బ్యాంగిల్ డిజైనింగ్, స్ట్రా అండ్ రబ్బర్‌బ్యాండ్, కార్డ్సు క్యాయిన్స్, బాక్స్‌బాల్స్ వంటి సరదా ఆటల్లో పాల్గొన్నారు. బేక్ అండ్ సేల్ పేరిట కొత్తరకాల వంటకాలను తయారుచేసి తోటి విద్యార్థులకు విక్రయించారు.