Gandhi Medical College
-
మద్యం పోసి... సిగరెట్లు తాగించి
సాక్షి, హైదరాబాద్: గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి 10 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను సస్పెండ్ చేయడంతో వైద్య విద్యార్థి లోకం ఉలిక్కిపడింది. ర్యాగింగ్ పేరిట కొందరు సీనియర్ ఎంబీబీఎస్ విద్యార్థులు ఇటీవల జూనియర్ ఎంబీబీఎస్ విద్యార్థులను అర్ధరాత్రి 2 గంటల సమయంలో తమ హాస్టల్ రూములకు రప్పించి వారికి బలవంతంగా మద్యం పోసి... సిగరెట్లు తాగించినట్లు తేలింది. దీంతో మానసిక వేదనకు గురైన బాధిత విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) కార్యాలయ అధికార వర్గాలు చేపట్టిన విచారణలో విస్మయకర నిజాలు వెలుగుచూశాయి. కొందరిని బట్టలు విప్పించి డ్యాన్స్‌లు చేయించారని కూడా అంటున్నారు. బూతులు తిడుతూ, బాధితులతో కూడా బూతులు మాట్లాడించారని తేలింది. కాగా, కొందరు విద్యార్థినులను కూడా ర్యాగింగ్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇది వాస్తవమేనా కాదా అన్న దానిపై అధికారులు విచారణ చేస్తున్నారు. కాగా ఈ ర్యాగింగ్ ఉదంతంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. అన్ని మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్‌పై ఉక్కుపాదం మోపాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ర్యాగింగ్ నిరోధక కమిటీల పటిష్టం... రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల ఒకటో తేదీ నుంచి ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో కొన్నిచోట్ల కొందరు సీని యర్ విద్యార్థులు మొదటి ఏడాది విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడుతున్న ఘటనలు అధికా రుల దృష్టికి వచ్చాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీ ల్లోనూ ఇలాంటివి జరుగుతున్నట్లు తెలిసింది. అయితే ర్యాగింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందన్న భావనతో చూసీచూడనట్లుగా వదిలేశారు. కానీ గాంధీ ఘటన నేపథ్యంలో ఇకపై ర్యాగింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంఈ కార్యాలయం ఆదేశించింది. అన్ని మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలను పటిష్టం చేయాలని, ఇప్పటికీ లేకుంటే తక్షణమే ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని, హాస్టళ్ల వద్ద రాత్రి వేళ నిఘా పెంచాలని సూచించింది. మరోవైపు ర్యాగింగ్‌కు గురైన విద్యార్థుల ఫిర్యాదు నిమిత్తం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు, ఈ మెయిల్ ఐడీని రూపొందించాలని కూడా డీఎంఈ కార్యాలయ అధికారులు యోచిస్తున్నారు. -
వైద్య విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలి
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): గాంధీ వైద్య కళాశాల వైద్య విద్యార్థుల సస్పెన్షన్‌పై పునరాలోచించాలని కోరు తూ వైద్య విద్యార్థులు ప్రిన్సిపాల్ కార్యాలయాన్ని ముట్టడించి శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. గాంధీ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌కు పాల్పడిన పదిమంది వైద్య విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాంధీ వైద్య విద్యా ర్థులు మంగళవారం ప్రిన్సిపాల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈక్రమంలో గాంధీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, చిలకలగూడ సీఐ మట్టంరాజులు వైద్యవిద్యార్థులతో పలుమార్లు చర్చలు జరిపారు. ఢిల్లీలోని యూజీసీ యాంటీ ర్యాగింగ్ సెల్‌కు ఫిర్యాదు అందిన నేపధ్యంలో.. అక్కడి ఉన్నతాధి కారుల సూచన మేరకు గాంధీ వైద్య కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీ జరిపిన అంతర్గత విచారణలో ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారణయిందని అధికారులు వివరించారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ తీర్మానం మేరకే చర్యలు చేపట్టామని, ఇది డీఎంఈ నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై చట్టప్రకారం పోలీస్ కేసులు నమోదు చేయాలని, విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఓ అధికారి పేర్కొన్నారు. డీఎంఈ, గాంధీ ప్రిన్సిపాల్ రమేశ్‌రెడ్డి ప్రస్తుతం అందుబాటులో లేరని, బుధవారం ఆయనతో సమావేశం ఏర్పాటు చేస్తామని వైస్ ప్రిన్సిపాల్ నచ్చజెప్పడంతో విద్యార్థులు ధర్నా విరమించి, తరగతులకు హాజరయ్యారు. -
అన్ని కాలేజీల్లో సీపీఆర్ శిక్షణ ఇవ్వాలి: గవర్నర్
పంజగుట్ట(హైదరాబాద్): కార్డియోపల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) శిక్షణను ఒక జీవితాన్ని కాపాడే మంచిపనిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభివర్ణించారు. విదేశాల్లో 60 నుంచి 65 శాతం సీపీఆర్ శిక్షణ పొందిన వారుంటే భారత్‌లో కేవలం 2 శాతం ఉండటం బాధాకరమన్నారు. ప్రతీ కాలేజీలో సీపీఆర్ శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. గురువారం రాజ్‌భవన్ సంస్కృతిహాల్లో గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల అసోసియేషన్, గాంధీ మెడికల్ కాలేజీ గ్లోబల్ అలయన్స్, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘కమ్యూనిటీ హ్యాండ్స్ ఓన్లీ సీపీఆర్’పేరుతో రాజ్‌భవన్ సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు సీపీఆర్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ ఈ కార్యక్రమంలో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్, గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్ధుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ లింగమూర్తి పాల్గొన్నారు. -
కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టారు
గాంధీఆస్పత్రి: కరోనా బారిన పడ్డవాళ్లను కన్నవాళ్లు, కట్టుకున్నవాళ్లూ వదిలేస్తే, ప్రాణాలను పణంగా పెట్టి నర్సింగ్ సిబ్బంది సేవలు అందించారని, వారి సేవలకు వెలకట్టలేమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కొనియాడారు. కోవిడ్‌తో మృతి చెందిన నర్సుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని తెలిపారు. ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ మెడికల్ కాలేజీలోని వివేకానంద ఆడిటోరియంలో గురువారం జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వైద్యరంగంలో తెలంగాణ నంబర్‌వన్ కావాలని, అందుకు నర్సింగ్ సిబ్బంది తమవంతు కృషి చేయాలని అన్నారు. 4,722 స్టాఫ్‌నర్సుల పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. నర్సింగ్ కౌన్సిల్ బలోపేతానికి ప్రణాళికలు రూపొందించామని, నర్సింగ్ డైరెక్టరేట్ విషయమై సీఎం కేసీఆర్‌తో చర్చించామని, ఆయన పాజిటివ్‌గా ఉన్నారని వివరించారు. నర్సింగ్ విద్యను పటిష్ట పరిచేందుకు జిల్లాకు ఒకటి చొప్పున 33 బీఎస్సీ నర్సింగ్ కాలేజీల ఏర్పాటుతో పాటు నర్సింగ్ స్కూళ్లను అప్‌గ్రేడ్ చేస్తామని తెలిపారు. నర్సింగ్ విద్యలో మార్పులకు అనుగుణంగా ఎస్ఎన్సీయూ, ఆంకాలజీ, మెంటల్ హెల్త్ విభాగాల్లో స్పెషలైజేషన్ శిక్షణ ఇస్తామన్నారు. చిత్తశుద్ధితో విధులు నిర్వహించిన 33 జిల్లాలకు చెందిన 106 మంది స్టాఫ్‌నర్సులు, ఆరుగురు నర్సింగ్ సూపరింటెండెంట్లకు అవార్డు, ప్రశంసాపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్ కమిషనర్లు వాకాటి కరుణ, అజయ్‌కుమార్, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు, గాంధీ, ఉస్మానియా సూపరింటెండెంట్లు రాజారావు, నాగేందర్, గాంధీ వైస్ ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, అసిస్టెంట్ డైరెక్టర్ విజయనిర్మల, నర్సింగ్ పిన్సిపాల్స్ విద్యుల్లత, విజయ, వివిధ జిల్లాలకు చెందిన నర్సింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
గాంధీలో 135 వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిలో 135 వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. జనరల్ మెడిసిన్, సర్జరీ, ఓబీజీ, íపీడియాట్రిక్, అనస్తీషియా విభాగాల్లో ఒక్కో విభాగానికి 20 చొప్పున, ఆర్థోపెడిక్‌లో 15 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్) 20 పోస్టులు మొత్తం 135 ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈనెల 19 నుంచి ఏప్రిల్ 4లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఏప్రిల్ 7న మెరిట్ లిస్ట్ ప్రకటించనున్నట్లు తెలిపారు. 9న గ్రీవెన్స్ పరిశీలన, 11న ఫైనల్ మెరిట్ లిస్ట్, 12న సెలక్షన్ లిస్ట్, 14న అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారని సంబంధిత అధికారులు వెల్లడించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎండీ, ఎంఎస్, డీఎన్బీ తత్సమానమైన విద్యతోపాటు తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎంసీఐ లేదా ఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ ఉండాలని, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఎంబీబీఎస్‌తోపాటు తెలంగాణ, ఏపీ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఉండాలని వివరించారు. 18 నుంచి 44 ఏళ్ల వయసు ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులని, రాష్ట్రంలో అమలవుతున్న రిజర్వేషన్ ప్రకారం కేటాయింపులుంటాయని తెలిపారు. ఎస్సెస్సీ ఒకటి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, మార్క్స్ లిస్ట్, ఎంబీబీఎస్, పీజీ సర్టిఫికెట్లు, కుల, వికలాంగ« ధ్రువీకరణ, సీనియర్ రెసిడెన్సీ పూర్తి చేసిన సర్టిఫికెట్, ఆధార్‌కార్డు, సంబంధిత పత్రాలను దరఖాస్తుతో జత చేయాలని సూచించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్లు సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఉంటారు. -
సాయుధ పోరాట యోధుడు నర్సింహులు కన్నుమూత
సాక్షి, యాదాద్రి/అంబర్‌పేట: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ (ఎం ఎల్) జనశక్తి నేత, ప్రజా విమోచన సంపాదకుడు బండ్రు నర్సింహులు (104) తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొంది ఈ నెల 21న డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అనంతరం బాగ్ అంబర్‌పేట డీడీ కాలనీ లోని కుమారుడు ప్రభాకర్ నివాసంలో ఉం టున్నారు. శనివారం బండ్రు నర్సింహులు గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమారులు ప్రభాకర్, భాస్కర్, కుమార్తెలు విమలక్క (అరుణోదయ, విప్లవ గాయకురాలు), జయమ్మ ఉన్నారు. ఆయన పార్ధివ దేహాన్ని గాంధీ వైద్య కళాశాలకు కుటుంబ సభ్యులు దానం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్య దర్శి చాడ వెంకట్‌రెడ్డి, వామపక్ష నేతలు గోవర్ధన్, ఎన్.శ్రీనివాస్, పరశురామ్, డీడీ కాలనీకి వచ్చి బండ్రు నర్సింహులు మృతదేహానికి నివాళులర్పించారు. ఆలేరులో నక్సల్ ఉద్యమానికి శ్రీకారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెంది న కొమురవ్వ, బుచ్చి రాములు దంపతు లకు జన్మించిన బండ్రు నర్సింహులు ఆలేరు ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమానికి పురుడు పోశాడు. చిన్నతనంలో తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం మీద పడి నర్సింహులు ఆలేరులో కొంతకాలం హమాలీగా పనిచేశారు. ఆ సమయంలోనే ఆంధ్ర మహాసభ ద్వారా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ లో చేరారు. తెలంగాణ సాయుధ పోరాటంలో గెరిల్లా దళ కమాండర్‌గా పోరాటం నడుపుతూ రాయగిరి వద్ద అరెస్టయ్యారు. జనగామ మిలటరీ క్యాంపు, నల్లగొండ జైలులో చిత్రహింసలు అనుభవించారు. 1964లో డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్, మీసా చట్టం కింద అరెస్ట్ అయి పన్నెండేళ్లు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత సీపీఐ (ఎంఎల్) పార్టీలో చేరి తరిమెల నాగిరెడ్డి నాయకత్వంలో పనిచేశారు. అనంతరం చండ్ర పుల్లారెడ్డి గ్రూపులో.. అనంతరం జనశక్తి పార్టీ రాజన్న వర్గంలో పనిచేశారు. సికింద్రాబాద్ కుట్ర కేసులో అరెస్ట్ 1971 నుంచి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మెదక్ ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సమావేశాలు, సభలు, ఊరేగింపులు, వాటికి ముందు జరిగిన హింసాత్మక ఘటనల ఆధారంగా సికింద్రాబాద్ కుట్ర కేసు నమోదు చేశారు. ఇందులో బండ్రు నర్సింహులు తదితరులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. సికింద్రాబాద్ కుట్ర కేసులో ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాలు సేకరించలేదని సెషన్స్ కోర్టు అభిప్రాయపడుతూ 1989 ఫిబ్రవరి 27న అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. 2015లో నూరేళ్ల పండుగ బండ్రు నర్సింహులు ‘నూరేళ్ళ సభ–నూటొక్క పాట’కార్యక్రమం 2015 అక్టోబర్ 1న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేం ద్రంలో జరిగింది. అప్పుడే నర్సింహులు 100వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కాగా, నర్సింహులు మృతికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. -
ఆర్సీటీ యూనిట్‌గా గాంధీ మెడికల్ కాలేజీ
గాంధీఆస్పత్రి: రీజనల్ క్లినికల్ ట్రయల్స్ యూనిట్ (ఆర్‌సీటీయు)గా గాంధీ మెడికల్ కాలేజీని ఎంపిక చేస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియన్ క్లినికల్ ట్రయల్ అండ్ ఎడ్యుకేషన్ నెట్వర్క్(ఇంటెంట్)లో భాగంగా అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ క్లినికల్ ట్రయల్(ఏసీసీటీ), రీజనల్ క్లినికల్ ట్రయల్ యూనిట్(ఆర్‌సీటీయు), ఐసీఎంఆర్ సెంటర్ ఫర్ క్లినికల్ ట్రయల్(ఐసీసీటీ), స్పెషాలిటీ సెంటర్ ఫర్ క్లినికల్ ట్రయల్ (ఎస్సీసీటీ), నాలెడ్జ్ పార్ట్నర్ ఫర్ క్లినికల్ ట్రయల్(కేపీసీటీ) వంటి ఐదు విభాగాల్లో దేశవ్యాప్తంగా పలు క్లినికల్ సెంటర్లను ఎంపిక చేసింది. దక్షిణ భారతదేశంలో ఆర్‌సీటీయు విభాగంలో గాంధీ మెడికల్ కాలేజీని ఎంపిక చేస్తు ఆదేశాలు జారీ చేసింది. రీజనల్ క్లినికల్ ట్రయల్ యూనిట్‌గా ఐసీఎంఆర్ గుర్తించడంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలతో గాంధీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రులను అభివృద్ధి చేసినందువల్లే ఇది సాధ్యమైందన్నారు. దీనివల్ల తెలంగాణ వైద్యులు, వైద్యవిద్యార్థులకు సైంటిఫిక్ స్టడీస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందిపుచ్చుకునేందుకు అవకాశాలు పెరుగుతాయని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. గాంధీ మెడికల్ కాలేజీ మైక్రోబయోలజీ విభాగంలో ఇటీవల వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసి జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ యూనిట్ ఏర్పాటుతో మరిన్ని పరిశోధనలకు వెసులుబాటు కలుగుతుందని మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రమేష్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
ఉద్యోగ కేటాయింపులు: ఆప్షన్.. హక్కు కాదని చెప్పిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సందర్భంగా జరిగిన ఉద్యోగుల కేటాయింపుల్లో భాగంగా తమను ఫలానా రాష్ట్రానికి కేటాయించాలంటూ ఉద్యోగులు ఇచ్చే ఆప్షన్ హక్కు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. తాము కోరుకున్న రాష్ట్రానికి కేటాయించాలంటూ ఆప్షన్ ఇచ్చినంత మాత్రాన వారిని ఆ రాష్ట్రానికే కేటాయించాలని లేదని తేల్చిచెప్పింది. స్థానికత, సీనియారిటీ, ఆప్షన్ వీటన్నింటినీ పరిశీలించి కేటాయింపుల జాబితా రూపొందిస్తారని పేర్కొంది. తనను తెలంగాణకు కేటాయించాలని కోరినా ఏపీకి కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ గాంధీ మెడికల్ కళాశాలకు చెందిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ మునగాల జ్యోతి దాఖలు చేసిన పిటిషన్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. స్థానికత ఆధారంగా చట్టబద్ధంగానే ఈ కేటాయింపు జరిగిందని అభిప్రాయపడింది. ఈ మేరకు ఏపీకి కేటాయించడాన్ని సవాల్‌చేస్తూ జ్యోతి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. (చదవండి: పేకాటలో ప్రజాప్రతినిధులు?) -
గాంధీ మెడికల్ కళాశాల: వైద్యుల తయారీలో అరవై ఏడు వసంతాలు
సాక్షి, హైదరాబాద్: నిష్ణాతులైన వైద్యులను తయారు చేయడంలో సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాల అరవై ఏడు వసంతాలు పూర్తి చేసుకుంది. 1954 సెపె్టంబర్ 14న పీపుల్స్ మెడికల్ కాలేజీగా ఆవిర్భవించి తర్వాత గాంధీ మెడికల్ కళాశాలగా దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిలిచింది. అస్వస్థతలు, రోగాల నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ప్రపంచ దేశాల్లోనూ వైద్యసేవలను అందిస్తున్న వేలాది మంది నిష్ణాతులైన వైద్యులు వైద్య భాషలో ఓనమాలు దిద్దింది ఇక్కడే. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సమయంలో మేమున్నాం.. అనే భరోసా ఇచ్చి మేలైన వైద్యసేవలు అందించి వేలాది మందికి పునర్జన్మ ప్రసాదించింది గాంధీ వైద్యులే. అందుకే ఈ కళాశాలను వైద్యులను తయారు చేసే కర్మాగారంగా అభివర్ణిస్తారు. ప్రజల సేవ కోసం పీపుల్స్ కాలేజీగా ఆవిర్భవించి, దేశ ప్రజల బానిస సంకెళ్లను తెంచిన జాతిపిత మహాత్మాగాంధీ పేరుతో కొనసాగుతూ మేలిమి వైద్య వజ్రాలను ప్రపంచానికి అందిస్తోంది సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి అలుమ్నీ భవనంలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో డీఎంఈ రమే‹Ùరెడ్డి, గాంధీ ప్రిన్సిపాల్ ప్రకాశరావు, సూపరింటెండెంట్ రాజారావు, అలుమ్నీ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజారెడ్డి, జీఎంసీ అలుమ్నీ ఎడ్యుకేషన్ సెంటర్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కే.లింగయ్య ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు, వైద్యవిద్యలో ప్రతిభ చూపిన విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్ అందిస్తామని అలుమ్నీ అధ్యక్ష, కార్యదర్శులు ప్రతాప్‌రెడ్డి, లింగమూర్తి తెలిపారు. చదవండి: బ్యాండ్ లేకపోతేనేం.. చిన్నారుల ఆలోచన అదిరిపోయింది వైద్యవిద్యార్థులకు ప్రోత్సాహం రెండు దశాబ్దాలుగా అలుమ్నీ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులకు మరింత ఉన్నతమైన విద్యను అభ్యసించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని అలుమ్నీ కార్యదర్శి డాక్టర్ జీ.లింగమూర్తి తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు బంగారు పతకాలు అందిస్తున్నామని వివరించారు. – డాక్టర్ లింగమూర్తి, అలుమ్నీ కార్యదర్శి -
వైద్యుల వాగ్వాదం; ఎగ్జామినర్ నేనంటే.. నేను..
సాక్షి, గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ ఆర్ధోపెడిక్ విభాగ వైద్యుల మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఇరువురు వైద్యులను ఇంటర్నల్ ఎగ్జామినర్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ కావడంతో సోమవారం పరీక్ష కేంద్రంలోనే ఎగ్జామినర్ నేనంటే.. నేనని చెప్పడంతో వైద్యవిద్యార్థులు అవాక్కయ్యారు. రంగంలోకి దిగిన కాలేజీ అధికారులు ఆ ఇద్దరు వైద్యులను సముదాయించి సమస్యను సామరస్యంగా పరిష్కరించారు. వివరాలు... ఎంబీబీఎస్ ఫైనలియర్ పార్ట్–2 ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఈనెల 26వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహించాలని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఆదేశాలు అందాయి. ఆర్ధోపెడిక్ విభాగం పరీక్షల ఇంటర్నల్ ఎగ్జామినర్‌గా ప్రొఫెసర్ ఎన్.రవీందర్‌కుమార్‌ను నియమిస్తూ ఈనెల 24వ తేదీన కేఎన్ఆర్యుహెచ్ఎస్ ఎగ్జామినేషన్ డిప్యూటీ రిజిస్టార్ డాక్టర్ రామానుజరావు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొఫెసర్ బీ.వాల్యాను ఎగ్జామినర్‌గా నియమిస్తున్నట్టు ఈనెల 26వ తేదీన మరో నియామక ఉత్తర్వులు జారీ చేశారు. గాంధీ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో సోమవారం ఉదయం 9.30 గంటలకు వైద్యవిద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రంలో ఎగ్జామినర్ నేనే అంటూ ఇద్దరు వైద్యులు వాగ్వాదానికి దిగారు. ఎవరు ఎగ్జామినరో తెలియక వైద్య విద్యార్థులు అయోమయంలో పడ్డారు. రాత్రంతా నిద్రలేకుండా పరీక్షలకు ప్రిపేర్ అయ్యామని, పరీక్ష కేంద్రంలో ఈ రాద్ధాంతం ఏమింటని పలువురు వైద్యవిద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా 8 రోజులపాటు జరిగే పరీక్షల్లో నాలుగు రోజులకు ఒకరు, మిగిలిన నాలుగు రోజులు మరొకరు ఎగ్జామినర్‌గా వ్యవహరిస్తారని కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ప్రకాశరావు వివరణ ఇచ్చారు. రెండేళ్ల నుంచి కొనసాగుతున్న విభేదాలు.. గాంధీ ఆర్ధోపెడిక్ విభాగంలో వైద్యుల మధ్య రెండేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఆర్ధోపెడిక్ హెచ్ఓడీగా బీ వాల్య ఉండగా, నిబంధనల ప్రకారం మరో ప్రొఫెసర్ సత్యనారాయణ హెచ్ఓడీగా నియమితులయ్యారు. గాంధీ ఆస్పత్రి ఆర్ధోపెడిక్ విభాగంలోని హెచ్ఓడీ రూం విషయమై వైద్యుల మధ్య విభేదాలు ప్రారంభమై తారస్థాయికి చేరుకుని రెండు వర్గాలుగా విడిపోయారు. ఇరువర్గాలు పలుమార్లు గొడవ పడ్డారు. గాంధీ ఆస్పత్రి, కాలేజీ అధికారులు కలుగజేసుకున్నా పరిష్కారం కాలేదు. దీంతో నిరుపేద రోగులతోపాటు వైద్యవిద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. -
గాంధీ సిబ్బందికి కరోనా పాజిటివ్!
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనా రోగులకు సేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో కలకలం రేగింది. గాంధీ మెడికల్ కాలేజీ డేటాఎంట్రీ ఆపరేటర్‌కు శుక్రవారం కరోనా పాజిటివ్ అని తేలింది. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను కలిసినవారిలో పలువురు ప్రొఫెసర్లు ఉన్నారనే వార్తతో గాంధీ మెడికల్ కాలేజీ సిబ్బంది మరింత ఆందోళనకు గురవుతున్నారు. దీంతో మెడికల్ కాలేజీ సిబ్బంది మొత్తం కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. కాగా, గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం సంఖ్య 700కు చేరుకుంది. గురువారం నమోదైన కేసుల్లో అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 18 మంది మరణించారు. ఇక గురువారం 68 మంది డిశ్చార్జి కావడంతో, కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లినవారి సంఖ్య 186కు చేరింది. (చదవండి: కరోనా: తెలంగాణలో మళ్లీ పెరిగాయ్!) (చదవండి: గాంధీ ఆస్పత్రిలో సమ్మె విరమణ) -
గాంధీకి 16.. ఉస్మానియాకు 21
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ వైద్య కళాశాలలు తమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలు, మానవ వనరులను సమకూర్చుకుంటూ అత్యుత్తమ వైద్యవిద్యను అందిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. ఏటా అనేక మంది విద్యార్థులను ఉత్తమ వైద్యులుగా తీర్చిదిద్ది సమాజానికి అందిస్తున్నాయి. వైద్యవిద్య బోధనలోనే కాదు.. వైద్యసేవల్లోనూ కార్పొరేట్‌కు దీటుగా ముందుకు సాగుతున్నాయి. వైద్య విద్యార్థుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘ఇండియా టుడే’సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న 503 ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలపై సర్వే నిర్వహించింది. జాతీయస్థాయి ఉత్తమ వైద్య కళాశాలల జాబితాలో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు మొదటి ర్యాంకు, సీఎంసీ వెల్లూరుకు రెండో ర్యాంకు, పుణేలోని ఆర్మ్డ్ ఫోర్స్ వైద్య కళాశాలకు మూడో ర్యాంకు లభించింది. నగరానికి చెందిన గాంధీ మెడికల్ కాలేజీకి 16వ స్థానం లభించగా, ఉస్మానియా మెడికల్ కాలేజీకి 21వ ర్యాంకు దక్కింది. ఎంబీబీఎస్ లో చేరేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ఉస్మానియాలో కాకుండా గాంధీ కాలేజీలో చేరేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. గతంలో 21.. ఇప్పుడు 16.. గాంధీ వైద్య కళాశాలకు అనుబంధంగా గాంధీ జనరల్ ఆస్పత్రి కొనసాగుతోంది. 1954లో గాంధీ ఆస్పత్రి ప్రారంభమైంది. 1956లో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (ఎంసీఐ) గుర్తింపు లభించింది. తొలి ఓపెన్‌హార్ట్ సర్జరీ ఇక్కడే జరిగింది. తొలి కేథల్యాబ్ ఇక్కడే ఏర్పాటు చేశారు. ఇక్కడ డీఎం కార్డియాలజీ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 43 విభాగాలు ఉన్నాయి. వైద్య కాలేజీకి అనుబంధంగా కొనసాగుతున్న ఆస్పత్రిలో ఓపీ, ఐపీ, అత్యవసర సేవలు సహా రక్తనిధి కేంద్రం కూడా ఉంది. మౌలిక సదుపాయాలు, మానవవనరులు, విద్యాబోధన, ఫలితాలు ప్రతిపాదికన ఇండియా టుడే గతంలో నిర్వ హించిన సర్వేలో 21వ స్థానంలో ఉన్న గాంధీ వైద్య కళాశాల.. ఈ ఏడాది 16వ స్థానానికి చేరుకుంది. ఉస్మానియా వైద్య కళాశాలతో పోలిస్తే ఇక్కడ మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటం, కాలేజీ క్యాంపస్‌లోనే అనుబంధ ఆస్పత్రి కొనసాగుతుండటం, నిపుణులైన అధ్యాపకులు అందుబాటులో ఉండటం వల్ల నీట్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు సైతం ఈ కాలేజీలో చదివేందుకు ఇష్టపడుతున్నారు. ఉస్మానియాకు 21వ స్థానం ఉస్మానియా వైద్య కళాశాలకు 1951లో ఎంసీఐ గుర్తింపు లభించింది. ఒకప్పుడు టాప్ ర్యాంకర్లంతా ఈ కాలేజీలో చేరేందుకు ఎక్కువ ఇష్టపడేవారు. అనుబంధ ఆస్ప త్రులు వైద్య కళాశాలకు దూరంగా ఉండటం, ఆయా ఆస్పత్రుల భవనాలు శిథిలావస్థకు చేరుకోవడం వల్ల ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ఇటీవల ఎంసీఐ ఆదేశాల మేరకు రూ.70 కోట్లతో మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్, ఎండీఆర్‌యూ, లేడీస్ హాస్టల్, అధునాతన లైబ్రరీ, రెండు హాస్టల్ భవనాలు సహా ఇతర మౌలిక వసతులను మెరుగుపర్చుకుంది. మానవవనరులను సమకూర్చుకుంది. బోధనలోనే కాదు ఫలితాల్లోనూ మెరుగుపడింది. ఫలితంగా ఈ ఏడాది 21వ స్థానంలో నిలిచి పూర్వవైభవాన్ని సంతరించుకుంది. గతేడాది జాబితా లో కనీసం స్థానం కూడా దక్కలేదు. ఈసారి ఏకంగా 21వ స్థానం దక్కడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
కొత్తగా 27 పీజీ వైద్య సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి గానూ కొత్తగా 27 పీజీ వైద్య సీట్లు పెరిగాయి. సీట్ల పెంపుపై ఈ మేరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) వైద్య విద్య సంచాలకుడికి లేఖ రాసింది. గాంధీ వైద్య కళాశాల ఛాతీ విభాగంలో 1, అనస్తీషియా విభాగంలో 2, కాకతీయ వైద్య కళాశాల చర్మ వ్యాధుల విభాగం లో 1, స్త్రీ వ్యాధుల చికిత్స విభాగంలో 5, రేడియాలజీలో 3, ఈఎన్టీలో 1, కంటి విభాగంలో 1, ఉస్మానియా వైద్య కళాశాల స్త్రీ వ్యాధుల విభాగంలో 4, ఈఎన్టీ విభాగంలో 3, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) అనస్తీషియా విభాగంలో 6 సీట్ల చొప్పున పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో్ల పెంచిన సదుపాయాలతోనే 27 సీట్లు పెరిగాయని వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. -
పేదల సంజీవని గాంధీ
నేడు గాంధీ మెడికల్ కళాశాల 63వ వ్యవస్థాపక దినోత్సవం గాంధీ ఆస్పత్రి : నిరుపేదలకు విశిష్టసేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రి ఏర్పాటు చేసి నేటికి అరవైమూడు వసంతాలు పూర్తి చేసుకుంది. 1954 సెప్టెంబర్ 14న ప్రారంభమైన ఈ ఆస్పత్రి అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక మందికి ప్రాణదానం చేసింది. గాంధీ మెడికల్ కళాశాలగా దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిలిచింది. దేశవిదేశాల్లో విశిష్టమైన వైద్యసే గాంధీ మెడికల్ కళాశాల ,వ్యవస్థాపక దినోత్సవంవలను అందిస్తున్న వేలాది మంది నిపుణులైన వైద్యులు ఇక్కడే చదువుకున్నారు. ఇదీ ప్రస్థానం... ⇔ 1954 సెప్టెంబర్ 14న 40మంది విద్యార్థులతో సరోజనీదేవి కంటి ఆస్పత్రి సమీపంలోని హుమాయూన్‌నగర్‌లో పీపుల్స్ మెడికల్ కాలేజీ ఏర్పాటు ⇔ నాటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ 1955 చేతుల మీదుగా ప్రారంభం ⇔ 1956లో హైదరాబాద్ ప్రభుత్వం ఆధీనంలోకి కళాశాల ⇔ 1958 జూలైలో బషీర్‌బాగ్‌కు తరలించి గాంధీ మెడికల్ కాలేజీగా నామకరణం ⇔ 1950–60 మధ్యకాలంలో కాలేజీని గాంధీ ఆస్పత్రికి అనుసంధానం ⇔ ఏటా లక్షకు పైచిలుకు అవుట్‌పేషెంట్లు, 75వేల మంది ఇన్ పేషెంట్లకు సేవలు, 20 వేల మేజర్, 30వేల మైనర్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ⇔ గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం నేతృత్వంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అలుమ్నీ భవనంలో ఆవిర్భావ దినోత్సవం ⇔ అత్యుత్తమ ప్రతిభ చూపిన వైద్యవిద్యార్థులకు బంగారు పతకాల బహూకరణ, వైద్యులకు సన్మాన కార్యక్రమం జరుగనుంది. -
రాష్ట్రానికి మరో 45 పీజీ సీట్లు
హైదరాబాద్: రాష్ట్రానికి మరో 45 పీజీ వైద్య సీట్లు మంజూరయ్యాయి. గాంధీ మెడికల్ కాలేజీకి 9, కాకతీయ మెడికల్ కాలేజీకి 36 పీజీ వైద్య సీట్లు మంజూరు చేస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్ణయం తీసుకుంది. 2017-18 పీజీ అడ్మిషన్ల నుంచే సీట్లను భర్తీ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. గాంధీలో ఎంఎస్ సర్జరీలో 6 సీట్లు, ఎంఎస్ ఈఎన్టీలో 2, ఎంఎస్ ఆప్తమాలజీలో ఒక సీటు.. కాకతీయలో ఎండీ జనరల్ మెడిసిన్ విభాగంలో 11 సీట్లు, ఎంఎస్ జనరల్ సర్జరీలో 9, ఎంఎస్ ఆర్థోపెడిక్స్‌లో 6, ఎంఎస్ ఆప్తమాలజీలో ఒకటి, ఎంఎస్ ఓబీజీలో 6, ఎంఎస్ పీడియాట్రిక్స్‌లో 3 సీట్లకు ఎంసీఐ అనుమతిచ్చింది. ఇటీవలే రాష్ట్రానికి 131 పీజీ వైద్య సీట్లకు ఎంసీఐ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అందులో ఉస్మానియాకు 90, నిమ్స్‌కు 30, గాంధీకి 11 పీజీ సీట్లు మంజూరయ్యాయి. ఒక్కో ప్రొఫెసర్ పరిధిలో ప్రస్తుతమున్న రెండు పీజీ వైద్య సీట్లను మూడుకు.. అసోసియేట్ ప్రొఫెసర్ అధిపతిగా ఉన్నప్పుడు ఒక సీటును రెండుకు పెంచాలని ఎంసీఐ నిర్ణయించడంతో ఈ సీట్లు రాష్ట్రానికి మంజూరయ్యాయి. -
రాష్ట్రానికి మరో 131 పీజీ వైద్య సీట్లు
⇒ అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు ⇒ ఉస్మానియాకు ఏకంగా 90 సీట్లు ⇒ నిమ్స్‌కు 30, గాంధీకి 11 పీజీ సీట్లు ⇒ 2017–18 పీజీ అడ్మిషన్ల నుంచే వీటి భర్తీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి భారీగా పీజీ వైద్య సీట్లకు కేంద్రం అనుమతి ఇచ్చింది. నిమ్స్, ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలకు అదనంగా 131 పీజీ వైద్య సీట్లు కేటా యిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉస్మానియా మెడికల్ కాలేజీకి అధికంగా 90 సీట్లు, నిమ్స్‌కు 30, గాంధీకి 11 కేటాయిం చింది. ఉస్మానియాలో 279 పీజీ సీట్లుండగా అవి 369కి పెరగనున్నాయి. గాంధీలో 138 నుంచి 149కి, నిమ్స్‌లో 50 నుంచి 80కి పెరుగుతున్నాయి. పెరిగిన సీట్లన్నింటినీ 2017–18లోనే భర్తీ చేస్తారు. సీట్లు పెంపుపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అదనంగా మరో 100 పీజీ సీట్లు కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికా రులు తెలిపారు. కాకతీయ మెడికల్ కాలేజీ కి 50 సీట్లు కోరాలని నిర్ణయించారు. సూపర్ స్పెషాలిటీ సీట్లు కోరనున్నట్లు వైద్య విద్యా సంచాలకులు రమణి ‘సాక్షి’కి తెలిపా రు. పీజీ సీట్లు లేని ఆదిలాబాద్, నిజామా బాద్ మెడికల్ కాలేజీలకు కూడా ఈసారి సీట్లు కోరాలని నిర్ణయించామన్నారు. ఒక్కో ప్రొఫెసర్‌కు 3 పీజీ సీట్లు ఒక్కో ప్రొఫెసర్ పరిధిలో ప్రస్తుతమున్న రెండు పీజీ వైద్య సీట్లను మూడుకు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ అధిపతిగా ఉండగా ప్రస్తుతమున్న ఒక సీటును రెండుకు పెంచా లని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం దేశవ్యాప్తంగా 4,193 పీజీ వైద్య సీట్లు పెంచింది. వీటిలో భాగంగా రాష్ట్రా నికి 131 సీట్లను అదనంగా కేటాయించింది. మరో 100 సీట్ల దాకా వచ్చే అవకాశం ఉందని రమణి తెలిపారు. ఈ మేరకు ఇప్ప టికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపామ న్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తొలిసారిగా ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్కు రెండు పీజీ సీట్లను ఎంసీఐ మంజూరు చేసింది. ప్రైవేట్‌లో ఒక మెడికల్ కాలేజీలో మాత్రమే ఈ సదుపాయం ఉండగా ప్రభుత్వ రంగంలో నిమ్స్‌కు మాత్రమే ఈ సదుపాయం కల్పించింది. ఈ విభాగంలో నిమ్స్‌కు 2 ఎమర్జెన్సీ మెడిసిన్ సీట్లు కేటాయించింది. ► ఉస్మానియా మెడికల్ కాలేజీలో 12 విభాగాలకు సీట్లను పెంచారు. అత్యధికంగా ఎంఎస్ జనరల్ సర్జరీ విభాగంలో 18 సీట్లు, ఎండీ పీడియాట్రిక్‌లో 17 సీట్లు పెంచారు. ఎంఎస్ ఆప్తమాలజీలో 12, ఎంఎస్ ఆర్థోపెడిక్స్‌లో 11 సీట్లు పెరిగాయి. ► గాంధీ మెడికల్ కాలేజీలో ఎండీ జనరల్ మెడిసిన్‌లో 8 పీజీ సీట్లు పెరిగాయి హా నిమ్స్‌లో ఎండీ జనరల్ మెడిసిన్‌లో 11 సీట్లు, ఎండీ అనెస్థీషియాలజీలో 8 సీట్లు, ఎండీ రేడియో డయాగ్నసిస్‌లో 6 సీట్లు పెరిగాయి. -
జికా వైరస్ నిర్ధారణకు 2 కేంద్రాల గుర్తింపు
సాక్షి, అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జికా వైరస్ నిర్ధారణకు ప్రత్యేక ల్యాబొరేటరీల ఏర్పాటుకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతించింది. జికా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అప్ర మత్తంగా ఉండాలని ఈ మేరకు కేంద్ర అధి కారులు ఆదేశాలు జారీచేశారు. దేశం మొత్తం మీద 25 ల్యాబొరేటరీలను గుర్తించగా అందులో ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ వెంకటేశ్వరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎస్వీఎంసీ-తిరుపతి), తెలంగాణలో గాంధీ మెడికల్ కాలేజ్ (జీఎంసీ-సికింద్రాబాద్)లను గుర్తించారు. ఈ రెండు సెంటర్లలో జికా వైరస్‌కు సంబంధించిన కేసులను నిర్ధారిస్తే కేంద్రానికి తెలియ జేయాలని పేర్కొన్నారు. -
చీరకట్టు... అదిరేట్టు
గాంధీ ఆస్పత్రి : గాంధీ మెడికల్ కాలేజీ 2కే12 బ్యాచ్ నేతృత్వంలో జరుగుతున్న ఇతిహాస్ ఫెస్ట్‌లో భాగంగా మెడికోలు సంప్రదాయ దుస్తులు, చీరలు, పంచెలు ధరించి సందడి చేశారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ ఆట పాటలతో ఆహ్లాదాన్ని పంచారు. క్రికెట్, వాలీబాల్, క్యారమ్స్‌తో పాటు, మెహిందీ, వాట్సప్ సింబల్స్ టాటూ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 74 మంది ప్రొఫెసర్లు
- పదోన్నతులతో నియమించిన వైద్య ఆరోగ్యశాఖ - ఎంబీబీఎస్, బీడీఎస్ తరగతులు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 74 ప్రొఫెసర్ పోస్టులను ప్రభుత్వం పదోన్నతుల ద్వారా భర్తీ చేసింది. గాంధీ మెడికల్ కాలేజీలో 14, కాకతీయ మెడికల్ కాలేజీలో 17, కొత్తగా ఏర్పాటైన మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో 4, ఉస్మానియా మెడికల్ కాలేజీలో 23, ఆదిలాబాద్ రిమ్స్‌లో 2, నిజామాబాద్ మెడికల్ కాలేజీలో 14 ప్రొఫెసర్ పోస్టుల్లో ఈ నియామకాలు జరుపుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీల్లో ఉండాల్సిన సంఖ్యలో ప్రొఫెసర్ల నియామకం జరిగినట్లయింది. భారత వైద్య మండలి నిబంధనల ప్రకారం పోస్టులు ఖాళీగా ఉంటే సీట్లు రద్దయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆగమేఘాల మీద వాటిని భర్తీ చేసింది. మరికొన్ని పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తెలిపారు. ఇక 2016-17 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ తరగతులు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయిలో తరగతులు జరుగుతాయి. నేడు రెండో విడత సీట్ల కేటాయింపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ సోమవారం జరిగింది. తొలి కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయించినా.. విద్యార్థులు చేరకపోవడంతో 95 ఎంబీబీఎస్, 350 బీడీఎస్ సీట్లు మిగిలాయి. వీటికోసం నిర్వహించిన రెండో కౌన్సెలింగ్‌లో 7 వేల మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నారు. మంగళవారం ఉదయమే విద్యార్థులకు వచ్చిన సీటు వివరాలను వారి మొబైల్ ఫోన్లకు సమాచారం పంపిస్తారు. వెబ్సైట్లో జాబితా ప్రకటిస్తారు. విద్యార్థులు మంగళవారమే వారికి కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్‌రెడ్డి చెప్పారు. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో డెంటల్ సీట్లు మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. నీట్ ద్వారా ర్యాంకుల పొందినవారెవరూ బీడీఎస్‌లో చేరడానికి ఆసక్తి చూపడం లేదని.. ఆ ర్యాంకుల ఆధారంగా దేశంలో ఏదో ఓ చోట ఎంబీబీఎస్ సీటు సాధించేందుకు ప్రయత్నిస్తుండడమే దీనికి కారణమని చెబుతున్నారు. 29న బీ కేటగిరీ రెండో విడత కౌన్సెలింగ్ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ సీట్లు మిగిలితే వాటిని ఎన్నారై కోటాలోకి మార్చుకోకూడదని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో... ఈ నెల 29న రెండో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. తొలి కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్ సీట్లన్నీ భర్తీ అయ్యాయని, బీడీఎస్ సీట్లు మాత్రమే మిగిలాయని చెప్పారు. సీటు వచ్చిన విద్యార్థులెవరైనా కాలేజీల్లో చేరకపోతే.. ఎంబీబీఎస్ సీట్లు మిగులుతాయని, లేకుంటే బీడీఎస్ సీట్లకే రెండో విడత కౌన్సెలింగ్ ఉంటుందని వివరించారు. కాగా ఆయుర్వేద, హోమియో వైద్య విద్య సీట్లకు వచ్చే నెలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. -
గాంధీలో ఫెస్ట్ సందడి
గాంధీ ఆస్పత్రి: తరగతులు, పుస్తకాలను పక్కనపెట్టిన మెడికోలు ఆటపాటలు, విందువినోదాలతో సందడి చేశారు. గాంధీ మెడికల్ కాలేజీ 2012 బ్యాచ్ నేతృత్వంలో ఇతిహాస్ పేరిట నిర్వహిస్తున్న కాలేజీ ఫెస్ట్‌లో వైద్యవిద్యార్థులు ఉరిమే ఉత్సాహంతో పాల్గొన్నారు. సోమవారం ఫేస్ పెయింటింగ్, బ్యాంగిల్ డిజైనింగ్, స్ట్రా అండ్ రబ్బర్‌బ్యాండ్, కార్డ్సు క్యాయిన్స్, బాక్స్బాల్స్ వంటి సరదా ఆటల్లో పాల్గొన్నారు. బేక్ అండ్ సేల్ పేరిట కొత్తరకాల వంటకాలను తయారుచేసి తోటి విద్యార్థులకు విక్రయించారు. -
దుమ్మరేపిన గాంధీ కాలేజీ మెడికోలు
గాంధీ ఆస్పత్రి: హుషారైన డ్యాన్సులు, దుమ్మురేపే స్టెప్పులతో సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ మెడికోలు(జూనియర్ డాక్టర్లు) సందడి చేశారు. 2కే12 బ్యాచ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించిన కాలేజీ ఫెస్ట్ ప్రారంభోత్సవ వేడుకలను ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మంజుల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వైద్యవిద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. 30వ తేదీ వరకు ఫెస్ట్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. -
అపూర్వ కలయిక!
గాంధీ ఆస్పత్రి: సుమారు ఐదు దశాబ్దాల క్రితం వారంతా వైద్య విద్యార్థులు. వైద్యవిద్య పూర్తయిన తర్వాత వృత్తిరీత్యా దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. ఇన్నాళ్లకు మళ్లీ కలుసుకున్నారు. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. సికింద్రాబాద్ గాంధీ వైద్య కళాశాల ప్రాంగణంలోని అలుమ్నీ భవనంలో బుధవారం 62 వసంతాల వేడుకల్లో వీరంతా కలిశారు. ఆప్యాయ పలకరింపులు... ఆత్మీయ ఆలింగనాలతో సందడి చేశారు. ర్యాంకులు సాధించేందుకు కష్టపడి చదివిన రాత్రులు... సరదాగా చూసిన సినిమాలు... అల్లరి పనులున్ చిలిపి చేష్టలను గుర్తు చేసుకొని... జోకులు వేసుకుంటూ ఒకరినొకరు ఆట పట్టించుకున్నారు. సెల్ఫీలు, ఫోటోలు దిగి జ్ఞాపకాలను పదిలపరుచుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీఎంఈ డాక్టర్ రమణి అలుమ్నీ భవనంలోని మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ మెడికల్ కాలేజీ అలుమ్నీ అసోసియేషన్ ద్వారా అనేక సామాజిక సేవ, వైద్య, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, డాక్టర్ జి.లింగమూర్తి తెలిపారు. -
పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లకు ఎంసీఐ గుర్తింపు
పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లకు ఎంసీఐ గుర్తింపు మరో 86 పీజీ సీట్లకు ప్రతిపాదనలు పంపిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: మౌలిక సదుపాయాలు, ఇతర వసతులు లేకపోవడంతో.. మంజూరైనా ఇప్పటివరకు గుర్తింపు లేకుండా ఉన్న 49 సూపర్ స్పెషాలిటీ, స్పెషాలిటీ పీజీ సీట్లకు గుర్తింపునిస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్ణయం తీసుకుంది. అందులో సూపర్ స్పెషాలిటీ సీట్లు 8 ఉండగా... బ్రాడ్ స్పెషాలిటీ పీజీ సీట్లు 41 ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ సీట్లలో ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన ఎంసీహెచ్ పీడియాట్రిక్ సర్జరీ సీట్లు 6, గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ సీట్లు 2 ఉన్నాయి. ఇక బ్రాడ్ స్పెషాలిటీ పీజీ సీట్లలో ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన ఎంఎస్ జనరల్ సర్జరీ సీట్లు 11, ఎండీ అనస్థీషియా సీట్లు 9, ఎండీ బయో కెమిస్ట్రీ 4, ఎండీ డీవీఎల్ 4, ఎంఎస్ ఆర్థోపెడిక్స్ 3, ఎండీ ఫోరెన్సిక్ మెడిసిన్ 3, ఎండీ రేడియోథెరపీ 2, ఎండీ మైక్రో బయాలజీ 2, ఎండీ ఫార్మకాలజీ 2 సీట్లు గుర్తింపు పొందాయి. కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన ఎండీ డీవీఎల్కు చెందిన ఒక్క సీటుకు కూడా ఎంసీఐ గుర్తింపునిచ్చింది. వాస్తవంగా ఈ సీట్లకు వచ్చే ఏడాది మే నెల నాటికి గుర్తింపు తెచ్చుకోవాలని ఎంసీఐ ఆదేశించింది. అయితే గడువుకు ముందే అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర వసతులు కల్పించి తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలావుండగా రాష్ట్రానికి అదనంగా మరో 86 పీజీ మెడికల్ సీట్లు మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు తయారుచేసి పంపింది. అందులో ఉస్మానియా మెడికల్ కాలేజీకి 47, గాంధీ మెడికల్ కాలేజీకి 13, వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీకి 26 సీట్లు కావాలని ప్రతిపాదించింది. ఇవి గనుక మంజూరైతే ఈ మూడు కాలేజీల్లో ప్రస్తుతం ఉన్న 516 సీట్లకు కలిపితే మొత్తం 602 పీజీ సీట్లు కానున్నాయి. -
ఆనందం పరవళ్లు..
-
ఆయుష్మాన్ భవ
రేపటితో గాంధీ మెడికల్ కళాశాలకు 60 వసంతాలు పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నాడు పీపుల్స్.. నేడు గాంధీ మెరుగైన వైద్య సేవలకు నిలయుం రోగం వచ్చిందంటే ఊరంతా భయమే.. ఏ ఇల్లు చూసినా మూలుగుతున్న వారే.. దవాఖానాలు ఎక్కడో ఉండేవి.. వైద్యుల వద్దకు వెళ్లాలంటే సాహసమే.. ఇది ఒకప్పటి మాట. అప్పట్లో వైద్య విద్యకు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి.. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఏ గల్లీలో చూసినా డాక్టర్లు.. క్లినిక్‌లు.. కార్పొరేట్ ఆస్పత్రులు.. ఎన్నో ఏళ్లుగా వేల మంది డాక్టర్లకు వైద్య విద్య బోధించి ప్రపంచమంతా డాక్టర్లను పంపించిన ఘనత ‘గాంధీ’ కళాశాలకు సొంతం. కాలేజీకి అనుసంధానంగా ఉన్న గాంధీ ఆస్పత్రి కొనసాగుతోంది. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా.. ప్రాణాపాయంలో ఉన్నా.. మొదట గుర్తొచ్చేది గాంధీ హాస్పిటలే.. అత్యాధునిక సౌకర్యాలతో ప్రతిరోజూ వేలమంది బయటి రోగులు.. వందల సంఖ్యలో లోపలి రోగులకు ఉన్నత వైద్య సేవలందిస్తూ పేదలపాలిట ‘సంజీవని’గా మారింది. గాంధీ ఆస్పత్రి: నిష్ణాతులైన వైద్యులను తయారు చేయడంలో సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాల అరవై వసంతాలు పూర్తి చేసుకుంది. పీపుల్స్ మెడికల్ కాలేజీగా 1954 సంవత్సరంలో ఆవిర్భవించి తదనంతరం గాంధీ మెడికల్ కళాశాలగా పేరుమార్చుకుని దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిలిచింది. రోగాల నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు దేశంలోని నలుమూలలతోపాటు ఇతర దేశాలలోనూ వైద్యసేవలను అందిస్తున్న వేలాదిమంది నిష్ణాతులైన వైద్యులు స్టెతస్కోప్ పట్టుకుని వైద్యభాషలో ఓనమాలు దిద్దింది ఇక్కడే. ప్రజల సేవ కోసం పీపుల్స్ కాలేజీగా ఆవిర్భవించి, దేశ ప్రజల బానిస సంకెళ్లును తెంచిన మహాత్మాగాంధీ పేరుతో కొనసాగుతూ మెరుగైన వైద్యవజ్రాలను దేశానికి అందిస్తోంది సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ.. ఆవిర్భావం... నగర ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశ్యంతో 1954 సెప్టెంబర్ 14వ తేదీన ‘అన్వర్ ఉలామ్ ఎడ్యుకేషనల్ సొసైటీ’ ఆధ్వర్యంలో 40 మంది విద్యార్థులతో పీపుల్స్ మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. వైద్యవిద్య అవసరాలు తీర్చేందుకు అప్పటికే ఉన్న ఉస్మానియా వైద్య కాలేజీ సరిపోకపోవడంతో ప్రస్తుతం ఉన్న సరోజనీదేవి కంటి ఆస్పత్రి సమీపంలోని హుమాయూన్‌నగర్‌లో పీపుల్స్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. కాలేజీ మొట్టమొదటి ప్రిన్సిపాల్‌గా డాక్టర్ సయ్యద్ నిజాముద్దీన్ అహ్మద్ విధులు నిర్వహించారు. అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ 1955 జూన్ 25న కాలేజీని ప్రారంభించి గాంధీ మెడికల్ కాలేజీగా పేరు వూర్చారు. 1956లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడంతో ప్రైవేట్ యాజమాన్యం నుంచి కాలేజీని హైదరాబాద్ ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంది. నిర్వహణ బాధ్యతలను ప్రిన్సిపాల్ నిజాముద్దీన్ అహ్మద్‌తోపాటు రిటైర్డ్ మెడికల్ డెరైక్టర్ కల్నల్ కేవీ వాఘ్రేకు అప్పగించింది. కాలేజీని 1958 జూలైలో బషీర్‌బాగ్‌కు తరలించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ డీవీ సుబ్బారెడ్డిని గాంధీ మెడికల్ కాలేజీ పూర్తిస్థాయి ప్రిన్సిపాల్‌గా నియమించారు. 2003లో ముషీరాబాద్‌కు తరలించారు. 1950-60 మధ్యకాలంలో కాలేజీని గాంధీ ఆస్పత్రికి అనుసంధానించారు. సూపర్‌స్పెషాలిటీ కోర్సులు... మొదట్లో గాంధీ మెడికల్ కాలేజీ అనాటమీ, ఫిజియాలజీ,, బయోకెమిస్ట్రీ, ఫోరెనిక్స్ మెడిసిన్, మైక్రోబయాలజీ, పైథాలజీ, ఫార్మకాలజీ, కమ్యూనిటీ మెడిసిన్ వంటి 27 విభాగాలలో వైద్యవిద్యను అందించేది. 1970 దశకం నుంచి కార్డియాలజీ, కార్డియోథొరాసిస్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి సూపర్‌స్పెషాలిటీ కోర్సులు కాలేజీలో అందుబాటులోకి వచ్చాయి. ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డీఎం వంటి వాటితోపాటు నర్సింగ్, పారామెడికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంబీబీఎస్‌లో 150, పోస్టుగ్రాడ్యుయేట్ (పీజీ) 80 సీట్లు ఉండగా, వైద్యరంగంలోని వివిధ విభాగాలకు చెందిన 37 డిగ్రీలను ఇక్కడ బోధిస్తారు. కళాశాలకు అనుబంధంగా ఉన్న గాంధీ ఆస్పత్రిలో ఏటా లక్షకు పైచిలుకు అవుట్‌పేషెంట్లు, 60 వేల మంది ఇన్‌పేషెం ట్లకు వైద్యసేవలు అందిస్తోంది. మరో 15 వేలు మేజర్, 25 వేల మైనర్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ముఖ్యఅతిథిగా సీఎం కేసీఆర్.. గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం నేతృత్వంలో ఈ నెల 14వ తేదీన నిర్వహించే అరవై వసంతాల వేడుకలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. అలుమ్నీ భవనంలోని గాంధీ చిత్రపటానికి నివాళులు, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహావిష్కరణతో పాటు వివేకానంద ఆడిటోరియంలో జరిగే వేడుకల్లో సీఎం పాల్గొంటారు. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖమంత్రి రాజయ్య, మంత్రులు పాల్గొంటారు. కళాశాలను మరింత అభివృద్ధి చేస్తా: గాంధీ ప్రిన్సిపాల్ శ్రీలత సికింద్రాబాద్ మెడికల్ కళాశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, నిరుపేద రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు తమవంతు కృషి చేస్తామని ప్రిన్సిపాల్ ఎస్.శ్రీలత తెలిపారు. తన హయాంలో 60 వసంతాల వేడుకలు జరగడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ చొరవతో కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని ధీమా వ్యక్తం చేశారు.