గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిలో 135 వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. జనరల్ మెడిసిన్, సర్జరీ, ఓబీజీ, íపీడియాట్రిక్, అనస్తీషియా విభాగాల్లో ఒక్కో విభాగానికి 20 చొప్పున, ఆర్థోపెడిక్‌లో 15 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్) 20 పోస్టులు మొత్తం 135 ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు.
ఈనెల 19 నుంచి ఏప్రిల్ 4లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఏప్రిల్ 7న మెరిట్ లిస్ట్ ప్రకటించనున్నట్లు తెలిపారు. 9న గ్రీవెన్స్ పరిశీలన, 11న ఫైనల్ మెరిట్ లిస్ట్, 12న సెలక్షన్ లిస్ట్, 14న అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇస్తారని సంబంధిత అధికారులు వెల్లడించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ తత్సమానమైన విద్యతోపాటు తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎంసీఐ లేదా ఎన్‌ఎంసీ రిజిస్ట్రేషన్ ఉండాలని, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఎంబీబీఎస్‌తోపాటు తెలంగాణ, ఏపీ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఉండాలని వివరించారు.
18 నుంచి 44 ఏళ్ల వయసు ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులని, రాష్ట్రంలో అమలవుతున్న రిజర్వేషన్ ప్రకారం కేటాయింపులుంటాయని తెలిపారు. ఎస్సెస్సీ ఒకటి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, మార్క్స్ లిస్ట్, ఎంబీబీఎస్, పీజీ సర్టిఫికెట్లు, కుల, వికలాంగ« ధ్రువీకరణ, సీనియర్ రెసిడెన్సీ పూర్తి చేసిన సర్టిఫికెట్, ఆధార్‌కార్డు, సంబంధిత పత్రాలను దరఖాస్తుతో జత చేయాలని సూచించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్‌లు సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment