సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనా రోగులకు సేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో కలకలం రేగింది. గాంధీ మెడికల్ కాలేజీ డేటాఎంట్రీ ఆపరేటర్‌కు శుక్రవారం కరోనా పాజిటివ్ అని తేలింది. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను కలిసినవారిలో పలువురు ప్రొఫెసర్లు ఉన్నారనే వార్తతో గాంధీ మెడికల్ కాలేజీ సిబ్బంది మరింత ఆందోళనకు గురవుతున్నారు. దీంతో మెడికల్ కాలేజీ సిబ్బంది మొత్తం కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. కాగా, గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం సంఖ్య 700కు చేరుకుంది. గురువారం నమోదైన కేసుల్లో అత్యధికం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 18 మంది మరణించారు. ఇక గురువారం 68 మంది డిశ్చార్జి కావడంతో, కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లినవారి సంఖ్య 186కు చేరింది.
(చదవండి: కరోనా: తెలంగాణలో మళ్లీ పెరిగాయ్!)
(చదవండి: గాంధీ ఆస్పత్రిలో సమ్మె విరమణ)
‘గాంధీ’ డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా!
Published Fri, Apr 17 2020 2:32 PM | Last Updated on Fri, Apr 17 2020 2:49 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment