Covid 4th Wave: ఫోర్త్‌ వేవ్‌కు అవకాశాలు తక్కువ.. కానీ | Hyderabad: Gandhi Hospital Superintendent About Covid 4th Wave | Sakshi
Sakshi News home page

Corona Virus: ఫోర్త్‌ వేవ్‌కు అవకాశాలు తక్కువ.. కానీ మే, జూన్‌ నెలలో..

Published Wed, Apr 20 2022 7:56 AM | Last Updated on Wed, Apr 20 2022 11:38 AM

Hyderabad: Gandhi Hospital Superintendent About Covid 4th Wave - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి పీడ పూర్తిగా తొలగిపోలేదని, వచ్చేనెలలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుందని, ఫోర్త్‌వేవ్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను వివరించారు. ప్రస్తుతం ఉన్న డెల్టా, ఒమిక్రాన్, ఎక్స్‌ఈలు సబ్‌ వేరియంట్లని, వీటి ప్రభావం తక్కువగా ఉంటుందని,  కరోనా కొత్త వేరియంట్లపై మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రూపాంతరం చెందిన కరోనా వైరస్‌ కొత్త వేరియంట్లు ప్రతి ఆరునెలలకు ఒకసారి పుట్టుకొస్తున్నాయని, మూడో వేవ్‌లో నూతన వేరియంట్‌ ఒమిక్రాన్‌ బలహీనపడి పెద్దగా ప్రభావం చూపించలేదన్నారు. రూపాంతరం చెందిన కరోనా వైరస్‌ మే, జూన్‌ నెలల్లో నాలుగో వేవ్‌ రూపంలో కాకున్నా కొంతమేర ప్రభావం చూపించడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్యనిపుణులు అంచనాకు వచ్చారని తెలిపారు.
చదవండి: Corona: కరోనా ఫోర్త్‌ వేవ్‌ హెచ్చరిక! 

నెలరోజులుగా సింగిల్‌ డిజిట్‌...  
కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితుల సంఖ్య గత నెలరోజులుగా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైందని, ప్రస్తుతం కేవలం నలుగురు పాజిటివ్‌ రోగులకు వైద్యసేవలు అందిస్తున్నామని రాజారావు తెలిపారు.  


గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement