సాక్షి, గాంధీఆస్పత్రి : కోవిడ్ థర్డ్‌వేవ్‌లో కరోనా నిర్ధారణ అయినప్పటికీ లక్షణాలు కనిపించడం లేదని, ప్రస్తుత బాధితుల్లో 93 శాతం ఒమిక్రాన్, 7 శాతం డెల్టా వేరియంట్లు ఉన్నాయని గాంధీఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీలో 167 మంది కోవిడ్ రోగులకు వైద్యచికిత్సలు అందిస్తున్నామని, వీరిలో కరోనాతోపాటు దీర్ఘకాల వ్యాధులు, వివిధ రుగ్మతలతో బాధపడుతున్న 74 మంది పరిస్థితి ఒకింత విషమంగా ఉందని, వీరిని ప్రధాన భవనంలోని రెండో అంతస్తులోని కోవిడ్ ఐసీయులో ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నామని వివరించారు.
చదవండి: ఒమిక్రాన్ భారత్: అంతా అయోమయం.. గందరగోళమే!
ఒమిక్రాన్ వేరియంట్ అంతగా ప్రమాదకారి కాదనే ధైర్యంతో కోవిడ్ నిబంధనలు పాటించకుంటే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని, ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గాంధీలో అవుట్ పేషెంట్, అత్యవసర సేవలు, పేషెంట్ అడ్మిషన్లు, సర్జరీలు యథావిధిగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
చదవండి: ఒమిక్రాన్ చివరి వేరియెంట్ అనుకోలేం
Comments
Please login to add a commentAdd a comment