పేదల సంజీవని గాంధీ
నేడు గాంధీ మెడికల్ కళాశాల 63వ వ్యవస్థాపక దినోత్సవం
గాంధీ ఆస్పత్రి : నిరుపేదలకు విశిష్టసేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రి ఏర్పాటు చేసి నేటికి అరవైమూడు వసంతాలు పూర్తి చేసుకుంది. 1954 సెప్టెంబర్ 14న ప్రారంభమైన ఈ ఆస్పత్రి అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక మందికి ప్రాణదానం చేసింది. గాంధీ మెడికల్ కళాశాలగా దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిలిచింది. దేశవిదేశాల్లో విశిష్టమైన వైద్యసే గాంధీ మెడికల్ కళాశాల ,వ్యవస్థాపక దినోత్సవంవలను అందిస్తున్న వేలాది మంది నిపుణులైన వైద్యులు ఇక్కడే చదువుకున్నారు.
ఇదీ ప్రస్థానం...
⇔ 1954 సెప్టెంబర్ 14న 40మంది విద్యార్థులతో సరోజనీదేవి కంటి ఆస్పత్రి సమీపంలోని హుమాయూన్‌నగర్‌లో పీపుల్స్ మెడికల్ కాలేజీ ఏర్పాటు
⇔ నాటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ 1955 చేతుల మీదుగా ప్రారంభం
⇔ 1956లో హైదరాబాద్ ప్రభుత్వం ఆధీనంలోకి కళాశాల
⇔ 1958 జూలైలో బషీర్‌బాగ్‌కు తరలించి గాంధీ మెడికల్ కాలేజీగా నామకరణం
⇔ 1950–60 మధ్యకాలంలో కాలేజీని గాంధీ ఆస్పత్రికి అనుసంధానం
⇔ ఏటా లక్షకు పైచిలుకు అవుట్‌పేషెంట్లు, 75వేల మంది ఇన్ పేషెంట్లకు సేవలు, 20 వేల మేజర్, 30వేల మైనర్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.
⇔ గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం నేతృత్వంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అలుమ్నీ భవనంలో ఆవిర్భావ దినోత్సవం
⇔ అత్యుత్తమ ప్రతిభ చూపిన వైద్యవిద్యార్థులకు బంగారు పతకాల బహూకరణ, వైద్యులకు సన్మాన కార్యక్రమం జరుగనుంది.