Founding Day
-
విద్వేష సిద్ధాంతాలతో దేశ పునాదుల్ని బలహీనపరిచే కుట్ర
న్యూఢిల్లీ: పటిష్ట పునాదులపై సమున్నతంగా నిల్చున్న భారత వారసత్వాన్ని బలహీనపర్చే కుట్రకు బీజేపీ తెర తీసిందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. విభజన సిద్ధాంతాలతో దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతూ దేశానికి హాని తలపెడుతోందని బీజేపీని సోనియా తూర్పారబట్టారు. కాంగ్రెస్ 137 వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంగళవారం పార్టీ శ్రేణులనుద్దేశిస్తూ సోనియా వీడియో సందేశమిచ్చారు. ‘భారత దేశ సంస్కృతిలో ఒకటిగా కలిసిపోయి, అద్భుతంగా పరిఢవిల్లుతున్న హిందూ–ముస్లిం మత సామరస్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ నియమాలను పక్కకుతోసి నియంత పాలన కొనసాగుతోంది’ అని సోనియా ధ్వజమెత్తారు. ‘ ఇకపై ఈ దారుణాలకు కాంగ్రెస్ మౌన సాక్షిగా ఉండబోదు. దేశ వారసత్వ భావాలను చెరిపేసే ప్రయత్నాలను కాంగ్రెస్ అడ్డుకుంటుంది’ అని ఆమె హామీ ఇచ్చారు. ‘ భారత స్వాతంత్రోద్యమంలో ఎలాంటి భాగస్వామ్యం, పాత్ర లేని కొన్ని విభజన, విద్వేష శక్తులు ప్రస్తుతం దేశ లౌకికగుణాన్ని నాశనం చేసే దారుణానికి ఒడుగడుతున్నాయి’ అని పరోక్షంగా బీజేపీనుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ‘ అర్హత లేకున్నా తమకూ దేశ చరిత్రలో స్థానం కల్పించుకునేందుకు చరిత్రను తిరగరాసే యత్నం చేస్తున్నారు’ అని సోనియా అన్నారు. కాగా, పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సోనియా కాంగ్రెస్ పార్టీ జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెండాను ఎగరేస్తుండగా హఠాత్తుగా జెండా నేలరాలింది. -
థర్డ్ డిగ్రీలకు కాలం చెల్లింది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా క్రిమినల్ కేసుల్లో నేర నిర్థారణ శాతం చాలా తక్కువగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. పోలీసులు అనుమానితుల పట్ల థర్డ్ డిగ్రీని ప్రయోగించడం, ఫోన్ల ట్యాపింగ్ లాంటి పురాతన విధానాలు నేరాలను అరికట్టడంలో ఆశించిన ఫలితాలను ఇవ్వలేవని చెప్పారు. బుధవారం ఢిల్లీలో పోలీస్ పరిశోధన, అభివృద్ధి సంస్థ (బీపీఆర్డీ) 49వ వ్యవస్థాపక దినోత్సవంలో అమిత్ షా మాట్లాడారు. దర్యాప్తులో పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలను వినియోగించుకోవాలని, వీటి ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని సూచించారు. నేర శిక్షా స్మృతి, భారతీయ శిక్షా స్మృతిని సవరించడంపై చర్చల ప్రక్రియను ప్రారంభించాలన్నారు. దీనిపై సూచనలు, సలహాలు సేకరించి హోంశాఖకు పంపాలన్నారు. శిక్షా కాలం ఏడేళ్లు అంతకు మించిన క్రిమినల్ కేసుల్లో ఫోరెన్సిక్ ఆధారాలను తప్పనిసరి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. శాస్త్రీయ విధానాలను అనుసరించాలి ‘ఫోరెన్సిక్ ఆధారాలను సైతం జత చేస్తూ పోలీసులు సమగ్రవంతమైన చార్జ్‌షీటును కోర్టుకు సమర్పిస్తే నిందితుల తరపు న్యాయవాదులకు వాదించడానికి పెద్దగా అవకాశాలు ఉండవు. శిక్ష పడే అవకాశాలు సైతం బాగా పెరుగుతాయి. నేరగాళ్లు, నేర ప్రవృత్తి వ్యక్తుల కన్నా పోలీసులు నాలుగు అడుగులు ముందు ఉండటం అత్యవసరం. పోలీసులు వెనకపడకూడదు. బలగాల ఆధునికీకరణతోనే ఇది సాధ్యం. ఇది థర్డ్ డిగ్రీలు ప్రయోగించే కాలం కాదు. దర్యాప్తులో శాస్త్రీయ విధానాలను అనుసరించాలి. ఫోన్ల ట్యాపింగ్ సత్ఫలితాలు ఇవ్వదు. పౌర పోలీసింగ్, ఇన్ఫార్మర్ల వ్యవస్థతో చాలా ప్రయోజనాలున్నాయి. బీట్ కానిస్టేబుళ్ల విధానాన్ని బలోపేతం చేయాలి’ అని అమిత్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఫోరెన్సిక్ వర్సిటీ జాతీయ స్థాయిలో పోలీస్ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయాలని కేంద్రం భావిస్తోందని అమిత్ షా వెల్లడించారు. వర్సిటీకి ప్రతి రాష్ట్రంలో అనుబంధ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. 12వ తరగతి తరువాత పోలీస్ దళాల్లోకి ప్రవేశించాలనుకునే విద్యార్థుల కోసం శిక్షణ ఇచ్చి పరీక్షల్లో వెయిటేజ్ కల్పిస్తామన్నారు. ఈమేరకు బీపీఆర్డీ అందచేసిన ప్రతిపాదనలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. గుజరాత్లో ఈ ప్రయోగం విజయవంతమైందని, ఫోరెన్సిక్ వర్సిటీల నుంచి పట్టా పొందిన విద్యార్థుల్లో ఒక్కరు కూడా నిరుద్యోగిలా మిగిలిపోలేదన్నారు. -
23 ఏళ్ల ఎన్టీసీపీ ప్రస్థానం
అది ఒకప్పుడు ఓ కుగ్రామం. గాఢాంధకారంలో ఉండేది. జనసంచారం కూడా అంతంత మాత్రమే. కనీసం వీధి దీపాలు లేకుండా ఓ అడవిని తలపించేది. అదంతా గతం.ఇప్పుడా కుగ్రామం పగలు కన్నా రాత్రి వేళల్లో విద్యుత్ కాంతుల్లో ధగధగలాడుతోంది. అంతేకాదు.. మన రాష్ట్రంతో పాటు పక్కనే ఉన్న ఐదు రాష్ట్రాలకు ఎంతో అవసరమైన విద్యుత్ సరఫరా చేస్తూ అభివృద్ధికి తోడ్పాటునందిస్తోంది. ఆ కుగ్రామం పరవాడ. ఈ వెలుగులుకు కారణం 22 ఏళ్ల కిందట ఏర్పాటైన సింహాద్రి జాతీయ ధర్మల్ విద్యుత్ కేంద్రం(ఎన్టీపీసీ). భారీ పరిశ్రమ అంటే విశాఖ స్టీల్‌ప్లాంట్ తప్ప తెలియని పరవాడ ప్రజలకు తమ చెంత ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ కేంద్రం ఏర్పాటవుతున్నట్టు తమ కలలో కూడా ఊహించలేదు. వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో అడుగుపెట్టి అనతి కాలంలో అంచెంచెలుగా ఎదిగి 2వేల మెగావాట్ల సామర్థ్యానికి చేరుకున్న పరవాడ సింహాద్రి ఎన్టీపీసీ సోమవారం 23వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. సాక్షి, పరవాడ(పెందుర్తి): సింహాద్రి జాతీయ ధర్మల్ విద్యుత్ కేంద్రం(ఎన్టీపీసీ) 23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సోమవారం ఘనంగా జరుపుకోవడానికి ముస్తాబైంది. పరవాడ సమీపంలో 1997 జూలై 8న ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ఎన్టీపీసీ ఆవిర్భవించింది. 3,400 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎన్టీపీసీలో తొలి విడతగా రూ.3700 కోట్ల వ్యయంతో వెయ్యి మెగావాట్ల యూనిట్ల పనులను పూర్తి చేసింది. మలి విడతలో మరో రెండు 500 మెగావాట్ల యూనిట్లను ఏర్పాటు చేసి వెయ్యి మెగావాట్ల ఉత్పత్తికి 2007లో శంకుస్థాపన చేసింది. ఈ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని 2011 నాటికి పూర్తి స్థాయి ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. సేవలతో మమేకం సామాజిక సేవల్లో భాగంగా కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్వాసిత గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. కల్యాణ మండపాలు, పాఠశాలలు, కళాశాలల భవనాలు, సీసీ రహదారులు, కాలువలు, వీధి దీపాలు, మినరల్ వాటర్ ప్లాంట్లు, మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నారు. వికలాంగ సంక్షేమం, మహిళలకు కుట్టు శిక్షణ, నిరుద్యోగ యువకులకు డ్రైవింగ్‌లో శిక్షణ, ఆస్పత్రుల అభివృద్ధి, సౌర విద్యుత్ కల్పన, విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తున్నారు. మచ్చుకు కొన్ని.. ► సీఎస్సార్ విభాగం ద్వారా 2018–19లో రూ.1.60 కోట్ల వ్యయంతో పరవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదనపు భవన నిర్మాణం చేపట్టారు. సైన్స్ పరికరాలు, ఫర్నిచర్ వంటి సామగ్రిని సమకూర్చారు. ► వెన్నలపాలెంలో కోటి రూపాయల నిధులతో విశాలమైన కల్యాణ మండపాన్ని నిర్మించారు. ► రాష్ట్రంలో పలు తీర ప్రాంతాల్లో అంతరించిపోతున్న ఆలీవ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణకు రూ.5.6 కోట్లు వెచ్చించారు. ఈ నిధులను ఐదేళ్ల పాటు వాటి సంరక్షణ కోసం వినియోగిస్తారు. ► బాలిక సాధికారత కార్యక్రమంలో భాగంగా రూ.60 లక్షలు వెచ్చించి మండలంలో 125 మంది బాలికలకు నాలుగు వారాల పాటు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చారు. ► విశాఖలో దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ఫిజియోథెరఫీ సెంటర్లలో యంత్ర పరికరాలు సమకూర్చడానికి రూ.1.87 కోట్లను వెచ్చించారు. ‘మహారత్న’ంగా గుర్తింపు అనతి కాలంలోనే రెండు వేల మెగావాట్ల సామర్థ్యానికి చేరుకున్న సింహాద్రి ఎన్టీపీసీ పలు రాష్ట్రాల ప్రజలకు వెలుగులు ప్రసాదిస్తూ ప్రగతి పథంలో పయనిస్తోంది. సంస్థకు వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని వెచ్చించి నిర్వాసిత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోంది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంపకం వంటి పనులు చేపడుతూ అందరి మన్ననలు పొందుతూ ‘మహారత్న’ కంపెనీగా పేరు గాంచింది. భద్రత ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేస్తూ స్వర్ణశక్తి, గ్రీన్‌టెక్ సేఫ్టీ, ఇందిరా ప్రియదర్శిని, వృక్షమిత్ర వంటి అవార్డులను సింహాద్రి ఎన్టీపీసీ సొంతం చేసుకుంది. ఇతర రాష్ట్రాలకు వెలుగులు సింహాద్రి ప్లాంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్ఛేరి రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఆయా రాష్ట్రాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. దేశంలో నాణ్యమైన విద్యుదుత్పాదనలో మేటిగా నిలిచి ‘మహారత్న’ కంపెనీ బిరుదును సొంతం చేసుకుంది. బొగ్గు దిగుమతి ఇలా.. సింహాద్రి ఎన్టీపీసీలో విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గును ఒడిశా, సింగరేణి, ఇండోనేషియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారు. రెండు వేల మెగావాట్ల విద్యుదుత్పతికి 30 వేల మెట్రిక్ టన్నుల బొగ్గును ఉపయోగిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీటిని ఏలేరు కాలువ, ముత్యాలమ్మపాలెం సముద్రం నుంచి పైపులైన్ల ద్వారా తీసుకు వచ్చి వినియోగిస్తున్నారు. తప్పని కాలుష్య కష్టాలు పరిశ్రమలో ఏర్పాటు చేసిన చిమ్నీల ద్వారా ఎగిరిపడుతున్న బొగ్గు రేణువులతో సోమునాయుడుపాలెం, స్వయంభూవరం గ్రామాల ప్రజలు సతమతమవుతున్నారు. తమ గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్థానికులు కోరుతున్నారు. అందరి సహకారంతో ప్రగతి పథం కార్మికులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజల సహకారంతో సంస్థ ప్రగతి పథంలో పయనిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, భద్రత ప్రమాణాలు, ఆరోగ్య పరిరక్షణ, సమయ పాలనలపై అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. కార్మిక భద్రత, కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది శతశాతం బూడిదను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశాం. సీఎస్సార్ విభాగం ద్వారా కోట్లాది రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, రహదారులు, మినరల్ వాటర్ ప్లాంట్లు, విద్య, వైద్య సదుపాయాలు కల్పించాం. త్వరలో మరికొన్ని ఆర్వో ప్లాంట్లను ప్రారంభిస్తాం. భవిష్యత్‌లో గ్రామీణ ప్రాంతాలను మరింత ఆదర్శంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాం. – వి.సుదర్శన్‌బాబు, సీజీఎం, సింహాద్రి ఎన్టీపీసీ 800 ఎకరాల్లో బూడిద చెరువుల ఏర్పాటు ప్లాంటు నుంచి విడుదలైన ఫ్లైయాష్(బూడిద)ను నిల్వ చేయడానికి పిట్టవానిపాలెం సమీపంలో సుమారు 800 ఎకరాల్లో చెరువులను ఏర్పాటు చేశారు. ప్లాంట్ నుంచి విడుదలయ్యే బూడిదను పైపుల ద్వారా చెరువులకు తరలించి నిల్వ చేస్తున్నారు. ఈ బూడిద గాలికి ఎగరకుండా పింకలర్స్ ఏర్పాటు చేశారు. అయితే వాటి పనితీరు తూతూ మంత్రంగా ఉంది. ధూళి ఎగిరి పిట్టవానిపాలెం, దేవాడ, కలపాక, గొల్లలపాలెం, దలాయిపాలెం, స్వయంభూవరం, సోమునాయుడుపాలెం గ్రామాలను ముంచెత్తుతోంది. ఆయా గ్రామాల ప్రజలు వేసవి కాలంలో నరకయాతన అనుభవిస్తున్నారు. ఎన్టీపీసీ బూడిద వల్ల దలాయిపాలెంలో సాగు చేస్తున్న ఉప్పు మడులు దెబ్బతింటున్నాయి. పరిశ్రమ నుంచి విడుదలవుతున్న వ్యర్థ జలాలు ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి చేరి మత్స్య సంపద నాశనమవుతుందని ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిక్కవానిపాలెం తీరంలో నిర్మించిన జెట్టీ, పిట్టవానిపాలెంలో ఏర్పాటు చేసిన బూడిద చెరువు దేశంలో అతిపెద్ద జెట్టీ సింహాద్రి ఎన్టీపీసీ ప్లాంటులో ఏర్పాటు చేసిన బ్రాయిలర్లను చల్లార్చడానికి వీలుగా తిక్కవానిపాలెం సమీపంలోని సముద్రం నుంచి ఉప్పు నీటిని వినియోగిస్తున్నారు. ఇందు కోసం తీరంలో 1450 మీటర్ల పొడవైన పంప్ హౌస్‌ను నిర్మించారు. పంపుహౌస్ నుంచి సముద్రం నీటిని ప్లాంటుకు తరలించడానికి మూడు పంపులను ఏర్పాటు చేశారు. పంపుహౌస్‌లో సముద్రపు నీటిని తరలించడానికి 11 కేవీ మోటారును ఏర్పాటు చేసి ఒక్కొక్క పంపు ద్వారా గంటకు 90 లక్షల లీటర్ల సముద్రపు నీటిని సీడబ్ల్యూ పంప్ హౌస్‌కు పంపి కూలింగ్ టవర్లను చల్లార్చడానికి వినియోగిస్తున్నారు. ప్లాంటులో ఈడీపీ పంప్‌హౌస్ నుంచి విడుదలైన వేడి నీటిని తీరానికి 750 మీటర్ల దూరంలో సముద్రంలో పంపు ద్వారా విడుదల చేస్తారు. ఇందు కోసం తిక్కవానిపాలెం తీరంలో 700 మీటర్ల లోపల దేశంలో ఎక్కడలేని అతి పెద్ద జెట్టీని నిర్మించారు. 275 మీటర్ల ఎత్తులో నిర్మించిన రెండు చిమ్నీలు ఆసియా ఖండంలోనే అతి పెద్దవి. 165 మీటర్ల ఎత్తులో నిర్మించిన నాలుగు కూలింగ్ టవర్లు దేశంలోనే పెద్దవి. -
ఏళ్లుగా భరించాం.. ఇక ఊరుకోం
ఘజియాబాద్: ‘అయిందేదో అయింది. ఏళ్లుగా భరించాం. ఇక ఊరుకునే ప్రసక్తే లేదు’అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ లక్ష్యంగా జరుగుతున్న ఉగ్రకుట్రలకు తగిన గుణపాఠం చెప్పి తీరతామని స్ప ష్టం చేశారు. పుల్వామా, ఉడి ఘటనలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆదివారం ఇక్కడ జరిగిన కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల (సీఐఎస్ఎఫ్) 50వ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రధాని ప్రసంగించారు. దేశ భద్రతను కాపాడుతున్న సీఐఎస్ఎఫ్ జవాన్ల కృషి అభినందనీయమని కొనియాడారు. స్వాతంత్య్రం అనంతరం దేశం కోసం ప్రాణాలర్పించిన 35 వేల మంది పోలీసుల్లో పాలమిలటరీ దళాలకు చెందిన వారు 4 వేల మంది ఉన్నారని పేర్కొ న్నారు. వీరి శౌర్యం, అంకితభావం ప్రజలందరికీ ఆదర్శనీయమని ప్రశంసించారు. ఉగ్రదాడులకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. పుల్వామా ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులకు పాల్పడిన విషయాన్ని ప్రస్తావించారు. దేశప్రజల మద్దతుతోనే ఇదంతా సాధ్యమైందని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. ఉగ్రదాడు లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అధునాతన గాడ్జెట్లను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఇక వీఐపీ సంస్కృతిపై మోదీ విమర్శల వర్షం కురిపించారు. వీఐపీలకు భద్రతను అందించే సీఐఎస్ఎఫ్ బలగాలతో వారు వ్యవహరించే తీరు దారుణంగా ఉంటోం దన్నారు. సీఐఎస్ఎఫ్ జవాన్ల గురించి ప్రజలకు తెలిసేలా వారి చరిత్ర, విధివిధానాలతో డిజిటల్ మ్యూజియాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల ఆశీర్వాదం కోరుతున్నా: మోదీ న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను మరోసారి ఆశీర్వదించాల్సిందిగా ప్రజలను తాను కోరుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ‘అందరితోపాటుగా, అందరి అభివృద్ధి అనే మా మార్గంలో వెళ్తూ మరోసారి మీ ఆశీర్వాదం కోరుతున్నా. గత 70 ఏళ్లలో నాటి ప్రభుత్వాలు తీర్చలేకపోయిన కనీస అవసరాలను మా ప్రభుత్వం తీర్చింది. ఇప్పుడు మనం మరింత బలమైన, వృద్ధి దాయకమైన, భద్రమైన ఇండియాను నిర్మించాలి’అని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను మోదీ ప్రస్తావించారు. -
హ్యాపీబర్త్‌డే ఎఫ్బీ..
న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మంది యూజర్లను అక్కున చేర్చుకున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ నెట్టింట అడుగుపెట్టి 15 సంవత్సరాలైంది. 2004, ఫిబ్రవరి 4న ఫేస్బుక్ వ్యవస్ధాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ఎఫ్‌బీని ఆన్లైన్లో పరిచయం చేయడంతో సోషల్ మీడియా దిగ్గజం ప్రస్ధానం ప్రారంభమైంది. ఆరంభంలో అంకుర సంస్ధగా బుడిబుడి అడుగులు వేసిన ఫేస్బుక్ ఒకటిన్నర దశాబ్ధంలో కోట్లాది మందికి చేరువైంది. ప్రపంచ జనాభాలో మూడోవంతు ప్రజల దైనందిన జీవితాల్లో ఈ సోషల్ మీడియా దిగ్గజం భాగమైంది. స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఫేస్బుక్ విలువ 500 బిలియన్ డాలర్లు కాగా, ఏటా 22 బిలియన్ డాలర్ల నికర లాభాన్ని ఆర్జిస్తోంది. ఫేస్బుక్ వ్యవస్ధాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ వ్యక్తిగత సంపద 62 బిలియన్ డాలర్లకు ఎగబాకిందని ఫోర్బ్స్ మ్యాగజీన్ వెల్లడించింది. -
హక్కులతోనే మెరుగైన జీవితం
న్యూఢిల్లీ: మానవ హక్కులు సవ్యంగా అమలుపరచడం ద్వారా ప్రజల జీవితాల్ని మెరుగుపరిచేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో మానవ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసిందని గుర్తుచేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) 25వ వ్యవస్థాపక దినోత్సవంలో శుక్రవారం మోదీ ప్రసంగించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాల్లో ఎన్హెచ్ఆర్సీ ముఖ్య పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మానవ హక్కుల పరిరక్షణకు స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయ వ్యవస్థ, చురుకైన మీడియా, క్రియాశీల పౌర సంఘాలు, ఎన్హెచ్ఆర్సీ లాంటి సంస్థలు ఉనికిలోకి వచ్చాయని అన్నారు. 17 లక్షల కేసులు..వంద కోట్ల పరిహారం: మానవ హక్కుల వాచ్‌డాగ్‌గా పేరొందిన జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) ఏర్పాటై శుక్రవారానికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు సుమారు 17 లక్షలకు పైగా కేసులను పరిష్కరించిన కమిషన్...మానవ హక్కుల ఉల్లంఘనలకు గురైన బాధితులకు సుమారు రూ.100 కోట్లకు పైగా పరిహారం ఇప్పించింది. ఈ కమిషన్ ముందుకు వచ్చిన కేసుల్లో పశ్చిమబెంగాల్లోని నందిగ్రామ్ హింస, ఛత్తీస్‌గఢ్‌లోని సల్వాజుడుం సంబంధిత ఘటనలు కొన్ని ముఖ్యమైనవి. 28న జపాన్‌కు మోదీ మోదీ ఈ నెల 28–29న జపాన్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జపాన్ ప్రధాని షింజో అబేతో మోదీ ఇండియా–జపాన్ వార్షిక సమావేశంలో పాల్గొని పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై చర్చిస్తారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలోని పరిస్థితులు కూడా ఇరువురు అధినేతల భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
‘మూక హత్యలతో మళ్లీ దేశ విభజన’
శ్రీనగర్: గోవులను తరలిస్తున్నారనే అనుమానంతో ముస్లింలపై దాడులు, హత్యలకు అడ్డుకట్టపడకుంటే అది మళ్లీ దేశ విభజనకు దారి తీస్తుందని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) నేత, మాజీ ఉపముఖ్యమంత్రి ముజఫర్ హుస్సేన్ బేగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీడీపీ 19వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘గో సంరక్షకుల పేరుతో ముస్లింలపై దాడులు, మూకహత్యలను అడ్డుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరనున్నాం. ఇప్పటికే 1947లో దేశ విభజన జరిగింది. ముస్లింలపై దాడులు ఇంకా కొనసాగితే అది మరోసారి దేశం విచ్ఛిన్నానికి దారి తీస్తుంది’ అని హెచ్చరించారు. రాష్ట్రంలో మొన్నటి దాకా సాగిన బీజేపీతో పీడీపీ పొత్తు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ముఖ్యంగా కాశ్మీరీలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే కానీ, అధికారం కోసం మాత్రం కాదన్నారు. -
గదర్ పార్టీ 105వ వార్షికోత్సవం
ఎస్టోరియా: దేశ స్వాతంత్య్రం కోసం సాయుధ పోరుబాటను ఎంచుకున్న గదర్ పార్టీ 105వ వ్యవస్థాపక దినోత్సవం అమెరికాలో జరిగింది. 1913వ సంవత్సరంలో ఓరెగాన్ రాష్ట్రంలోని ఎస్టోరియా పట్టణంలో గదర్ పార్టీ ఏర్పడింది. అప్పట్లో పట్టణంలోని కలప డిపోలో కార్మికులుగా పనిచేసే 74 మంది భారతీయులు, ముఖ్యంగా సిక్కులు సమావేశమై పార్టీ ఏర్పాటును ప్రకటించారు. ఆ భవనానికి సమీపంలోనే ఉన్న పార్కులో ఆదివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గదర్ మెమోరియల్ ఫౌండేషన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఓరెగాన్, వాషింగ్టన్, కాలిఫోర్నియా రాష్ట్రాలతోపాటు కెనడాలోని బ్రిటిష్ కొలంబియా నుంచి కూడా వందలాది మంది భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త బహదూర్ సింగ్ గదర్ మెమోరియల్ ఫౌండేషన్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. బ్రిటిష్ పాలనపై గదర్ పార్టీ సాగించిన సాయుధ పోరు విజయవంతం కానప్పటికీ స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక అధ్యాయంగా నిలిచిపోయింది. -
టీఆర్పీ కోసం మీడియా పాకులాట
హైదరాబాద్: ప్రస్తుతం మీడియా రంగంలో రాజకీయ నేతల జోక్యం ఎక్కువగా ఉంటోందని, గతంతో పోలిస్తే మీడియాలో విలువలు తగ్గిపోతున్నాయని ఇండియా టుడే కన్సల్టింగ్ గ్రూప్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అభిప్రాయపడ్డారు. టీఆర్పీ రేటింగ్ కోసం మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోం దన్నారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ 53వ వ్యవస్థాపక దినోత్సవం, తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాలను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రాజమౌళిచారి, ప్రధాన కార్యదర్శి ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ‘మీడియా ఇన్ బ్రేకింగ్ న్యూస్ ఎరా’అనే అంశంపై రాజ్‌దీప్ సర్దేశాయ్ ఉపన్యసించారు. ప్రస్తుతం మీడియా యాజమాన్యాలు కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎడిటోరియల్ కథనాలకు ఎంతో విలువ ఉండేదని, కానీ నేడు అవి రాజకీయ నేతల ప్యాకేజీలుగా మారి పోయాయన్నారు. జర్నలిజాన్ని పెయిడ్ న్యూస్ ఒక కేన్సర్ వ్యాధిలా పట్టిపీడిస్తోందన్నారు. మరుగున పడిపోతున్న ప్రజా సమస్యలు ప్రజల సమస్యలపై వార్తలు ప్రసారం చేయడం, ప్రచురించడం తగ్గిపోయిందని రాజ్‌దీప్ వాపోయారు. దేశవ్యాప్తంగా 400 చానళ్లు ఉండగా అందులో ఎక్కువ శాతం రాజకీయాల కోసమే పనిచేస్తున్నాయని అన్నారు. నేడు ప్రధానులు, ముఖ్యమంత్రులు సైతం కనీసం మీడియాకి ఇంటర్వూలు కూడా ఇవ్వడం లేదని.. ప్రెస్మీట్లు పెట్టడానికి సైతం ఆసక్తి చూపడం లేదని అన్నారు. గతంలో ఎన్టీఆర్ లాంటి మహానేతలు ప్రతినిత్యం మీడియాతో కలసిమెలసి ఉండేవారని గుర్తుచేశారు. సంచలనాల కోసమే చానళ్లు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయన్నారు. ఇంటర్నెట్, మొబైల్, వాట్సప్ జర్నలిజం పెరిగిపోవడంతో తప్పుడు వార్తలు ప్రసారమవుతున్నాయన్నారు. ఇటీవలి కాలంలో జాతీయ మీడియా కులా లు, మతాలు, ప్రాంతీయ భేదాలతో ప్రజల్ని విడదీసే విధంగా కథనాలు ప్రసారం చేయడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఐజేయూ అధ్యక్షుడు దేవులపల్లి అమర్.. రాజ్‌దీప్ సర్దేశాయ్‌ను ఘనంగా సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. జర్నలిజంలో 45 సంవత్సరాలు పూర్తిచేసిన రామచంద్రమూర్తిని, ఐజేయూ అధ్యక్షుడిగా ఎన్నికైన అమర్‌ను, అల్లం నారాయణను రాజ్‌దీప్ సత్కరించారు. -
బీజేపీ ప్రభంజనం తట్టుకోలేకే!
న్యూఢిల్లీ: బలహీన వర్గాలకు చెందిన ఒక సామాన్యుడు, ఓ పేద మహిళ కుమారుడు దేశ ప్రధాని కావడాన్ని విపక్షాలు భరించలేకపోతున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. తనపై ప్రతిపక్ష పార్టీల వ్యతిరేకత హింసాత్మక రూపుదాలుస్తోందని మండిపడ్డారు. ‘మనపై వ్యతిరేకత మరింత తీవ్రంగా, ఆగ్రహంగా మారుతుండటం మీరు చూస్తున్నారు. ఇప్పుడు అది హింసాత్మకంగా మారుతోంది. మనం తప్పులు చేశామని కాదు వారి కోపం. రోజురోజుకీ బీజేపీ బలపడుతుండటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ 38వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నాయకులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. దళిత సంఘాల ఇటీవలి భారత్‌బంద్ హింసాత్మకమైన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘బీజేపీ వరుసగా ఒక్కో రాష్ట్రంలో గెలుస్తోంది. దీంతో మోదీని తొలగించాలి. ఆయన కుర్చీని లాక్కోవాలి అని కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షం ప్రయత్నిస్తోంది. అందుకే ఒకటి తర్వాత ఒకటిగా అవాస్తవాలను ప్రచారం చేస్తోంది’ అని విమర్శించారు. ‘బీజేపీ పేదల పార్టీగా మారడాన్ని పార్టీ నుంచి అత్యధిక సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నికవడాన్ని విపక్షం జీర్ణించుకోలేకపోతోంది. అందుకే ఈ హింసాత్మక వ్యతిరేకత’ అని పేర్కొన్నారు.పార్లమెంటు సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ప్రజాస్వామ్యం పీకనొక్కేసిందని, ప్రజాతీర్పును అవమానించిందని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ తీరు కారణంగా పార్లమెంటు గౌరవం అత్యంత దైన్యస్థితికి చేరిందన్నారు. విపక్షాల తీరుకు నిరసనగా పార్లమెంట్ ఆవరణలో ఏప్రిల్ 12న ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టాలని పార్టీ ఎంపీలను ఆదేశించారు. ఏడు పథకాలతో ప్రజల్లోకి బీజేపీ ఎంపీలు గ్రామాలకు వెళ్లి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించాలని మోదీ సూచించారు. హరిజనులు, గిరిజనుల కోసం తీసుకొచ్చిన 7 కీలకమైన సంక్షేమ పథకాలు, వాటి అమలును వివరించాలన్నారు. సంఘసంస్కర్త జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఏప్రిల్ 11ను సమతా దివస్ (సమానత్వ దినోత్సవం)గా జరపనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 14 నుంచి మే 5 వరకు ‘గ్రామ స్వరాజ్ అభియాన్’ను పార్టీ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. గ్రామాల కోసం కేంద్రం తీసుకొచ్చిన జన్‌ధన్ యోజన, ఉజ్వల తదితర 7 సంక్షేమ పథకాలను బీజేపీ ప్రజాప్రతినిధులు ప్రచారం చేయాలన్నారు. సామాజిక మాధ్యమం ద్వారా.. సాంకేతికతను వాడి సామాజిక మాధ్యమం ద్వారా వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు మోదీ సూచించారు. ‘సామాజిక మాధ్యమంలో మనం క్రియాశీలకంగా లేకపోతే దోశద్రోహ, సంఘ విద్రోహ శక్తులు స్థానాన్ని సంపాదించుకుంటాయి’ అని అన్నారు. ఢిల్లీలో శివాజీపై జరుగుతున్న నాటకాన్ని చూడాలని పార్టీ ఎంపీలను కోరారు. 30 ఏళ్ల క్రితం ఈ నాటకాన్ని చూసేందుకు తను గుజరాత్ నుంచి పుణేకు వెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. కాగా, బీజేపీ యావద్భారతీయుల పార్టీ అని కేంద్ర మంత్రి రవిశంకర్ పేర్కొన్నారు. నమో యాప్ ద్వారా ప్రసంగించిన మోదీ.. పార్టీ పదాధికారుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఏప్రిల్ 9న కాంగ్రెస్ నిరాహార దీక్షలు పార్లమెంటు వాయిదాలకు కాంగ్రెస్ కారణమంటూ బీజేపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఏప్రిల్ 12న నిరాహార దీక్ష చేయాలనే నిర్ణయానికి ప్రతిగా ఏప్రిల్ 9న కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఒకరోజు నిరాహార దీక్షలకు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాలు, జిల్లా కార్యాలయాల ముందు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఒక్కరోజు నిరాహార దీక్షలు చేయాలని.. వివిధ అంశాలపై బీజేపీ చెబుతున్న అవాస్తవాలను బట్టబయలు చేయాలని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తల శ్రమ.. ప్రజాశీర్వాదంతోనే... ప్రజల ఆశీర్వాదాలు, కార్యకర్తల నిరంతర శ్రమ కారణంగానే బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని మోదీ అన్నారు. పార్టీ నిర్మాణంలో అసువులు బాసిన నేతలకు నివాళులర్పించారు. పార్లమెంటరీ సమావేశ వివరాలను మంత్రి అనంత్ చెప్పారు. బీజేపీ ఎంపీలు ప్రజలకు ఈ విపక్షాలు చేస్తున్న కుట్రలను వివరించాలన్నారు. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్ యాత్ర’ను దేశవ్యాప్తంగా చేపట్టాలని పార్టీ యోచిస్తోంది. -
పేదల సంజీవని గాంధీ
నేడు గాంధీ మెడికల్ కళాశాల 63వ వ్యవస్థాపక దినోత్సవం గాంధీ ఆస్పత్రి : నిరుపేదలకు విశిష్టసేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రి ఏర్పాటు చేసి నేటికి అరవైమూడు వసంతాలు పూర్తి చేసుకుంది. 1954 సెప్టెంబర్ 14న ప్రారంభమైన ఈ ఆస్పత్రి అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక మందికి ప్రాణదానం చేసింది. గాంధీ మెడికల్ కళాశాలగా దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిలిచింది. దేశవిదేశాల్లో విశిష్టమైన వైద్యసే గాంధీ మెడికల్ కళాశాల ,వ్యవస్థాపక దినోత్సవంవలను అందిస్తున్న వేలాది మంది నిపుణులైన వైద్యులు ఇక్కడే చదువుకున్నారు. ఇదీ ప్రస్థానం... ⇔ 1954 సెప్టెంబర్ 14న 40మంది విద్యార్థులతో సరోజనీదేవి కంటి ఆస్పత్రి సమీపంలోని హుమాయూన్‌నగర్‌లో పీపుల్స్ మెడికల్ కాలేజీ ఏర్పాటు ⇔ నాటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ 1955 చేతుల మీదుగా ప్రారంభం ⇔ 1956లో హైదరాబాద్ ప్రభుత్వం ఆధీనంలోకి కళాశాల ⇔ 1958 జూలైలో బషీర్‌బాగ్‌కు తరలించి గాంధీ మెడికల్ కాలేజీగా నామకరణం ⇔ 1950–60 మధ్యకాలంలో కాలేజీని గాంధీ ఆస్పత్రికి అనుసంధానం ⇔ ఏటా లక్షకు పైచిలుకు అవుట్‌పేషెంట్లు, 75వేల మంది ఇన్ పేషెంట్లకు సేవలు, 20 వేల మేజర్, 30వేల మైనర్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ⇔ గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం నేతృత్వంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అలుమ్నీ భవనంలో ఆవిర్భావ దినోత్సవం ⇔ అత్యుత్తమ ప్రతిభ చూపిన వైద్యవిద్యార్థులకు బంగారు పతకాల బహూకరణ, వైద్యులకు సన్మాన కార్యక్రమం జరుగనుంది.