రాష్ట్రానికి మరో 45 పీజీ సీట్లు
Published Wed, Mar 29 2017 8:09 PM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM
హైదరాబాద్: రాష్ట్రానికి మరో 45 పీజీ వైద్య సీట్లు మంజూరయ్యాయి. గాంధీ మెడికల్ కాలేజీకి 9, కాకతీయ మెడికల్ కాలేజీకి 36 పీజీ వైద్య సీట్లు మంజూరు చేస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్ణయం తీసుకుంది. 2017-18 పీజీ అడ్మిషన్ల నుంచే సీట్లను భర్తీ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
గాంధీలో ఎంఎస్ సర్జరీలో 6 సీట్లు, ఎంఎస్ ఈఎన్‌టీలో 2, ఎంఎస్ ఆప్తమాలజీలో ఒక సీటు.. కాకతీయలో ఎండీ జనరల్ మెడిసిన్ విభాగంలో 11 సీట్లు, ఎంఎస్ జనరల్ సర్జరీలో 9, ఎంఎస్ ఆర్థోపెడిక్స్‌లో 6, ఎంఎస్ ఆప్తమాలజీలో ఒకటి, ఎంఎస్ ఓబీజీలో 6, ఎంఎస్ పీడియాట్రిక్స్‌లో 3 సీట్లకు ఎంసీఐ అనుమతిచ్చింది.
ఇటీవలే రాష్ట్రానికి 131 పీజీ వైద్య సీట్లకు ఎంసీఐ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అందులో ఉస్మానియాకు 90, నిమ్స్‌కు 30, గాంధీకి 11 పీజీ సీట్లు మంజూరయ్యాయి. ఒక్కో ప్రొఫెసర్ పరిధిలో ప్రస్తుతమున్న రెండు పీజీ వైద్య సీట్లను మూడుకు.. అసోసియేట్ ప్రొఫెసర్ అధిపతిగా ఉన్నప్పుడు ఒక సీటును రెండుకు పెంచాలని ఎంసీఐ నిర్ణయించడంతో ఈ సీట్లు రాష్ట్రానికి మంజూరయ్యాయి.
Advertisement
Advertisement