రాష్ట్రానికి మరో 131 పీజీ వైద్య సీట్లు | Another 131 PG medical seats in the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి మరో 131 పీజీ వైద్య సీట్లు

Published Sat, Mar 4 2017 3:50 AM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM

రాష్ట్రానికి మరో 131 పీజీ వైద్య సీట్లు

రాష్ట్రానికి మరో 131 పీజీ వైద్య సీట్లు

అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు
ఉస్మానియాకు ఏకంగా 90 సీట్లు
నిమ్స్‌కు 30, గాంధీకి 11 పీజీ సీట్లు
2017–18 పీజీ అడ్మిషన్ల నుంచే వీటి భర్తీ


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి భారీగా పీజీ వైద్య సీట్లకు కేంద్రం అనుమతి ఇచ్చింది. నిమ్స్, ఉస్మానియా, గాంధీ మెడికల్‌ కాలేజీలకు అదనంగా 131 పీజీ వైద్య సీట్లు కేటా యిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉస్మానియా మెడికల్‌ కాలేజీకి అధికంగా 90 సీట్లు, నిమ్స్‌కు 30, గాంధీకి 11 కేటాయిం చింది. ఉస్మానియాలో 279 పీజీ సీట్లుండగా అవి 369కి పెరగనున్నాయి. గాంధీలో 138 నుంచి 149కి, నిమ్స్‌లో 50 నుంచి 80కి పెరుగుతున్నాయి. పెరిగిన సీట్లన్నింటినీ 2017–18లోనే భర్తీ చేస్తారు. సీట్లు పెంపుపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అదనంగా మరో 100 పీజీ సీట్లు కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికా రులు తెలిపారు. కాకతీయ మెడికల్‌ కాలేజీ కి 50 సీట్లు కోరాలని నిర్ణయించారు. సూపర్‌ స్పెషాలిటీ సీట్లు కోరనున్నట్లు వైద్య విద్యా సంచాలకులు రమణి ‘సాక్షి’కి తెలిపా రు. పీజీ సీట్లు లేని ఆదిలాబాద్, నిజామా బాద్‌ మెడికల్‌ కాలేజీలకు కూడా ఈసారి సీట్లు కోరాలని నిర్ణయించామన్నారు.

ఒక్కో ప్రొఫెసర్‌కు 3 పీజీ సీట్లు
ఒక్కో ప్రొఫెసర్‌ పరిధిలో ప్రస్తుతమున్న రెండు పీజీ వైద్య సీట్లను మూడుకు, ఒక అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అధిపతిగా ఉండగా ప్రస్తుతమున్న ఒక సీటును రెండుకు పెంచా లని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం దేశవ్యాప్తంగా 4,193 పీజీ వైద్య సీట్లు పెంచింది. వీటిలో భాగంగా రాష్ట్రా నికి 131 సీట్లను అదనంగా కేటాయించింది. మరో 100 సీట్ల దాకా వచ్చే అవకాశం ఉందని రమణి తెలిపారు. ఈ మేరకు ఇప్ప టికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపామ న్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి తొలిసారిగా ఎమర్జెన్సీ మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్‌కు రెండు పీజీ సీట్లను ఎంసీఐ మంజూరు చేసింది. ప్రైవేట్‌లో ఒక మెడికల్‌ కాలేజీలో మాత్రమే ఈ సదుపాయం ఉండగా ప్రభుత్వ రంగంలో నిమ్స్‌కు మాత్రమే ఈ సదుపాయం కల్పించింది. ఈ విభాగంలో నిమ్స్‌కు 2 ఎమర్జెన్సీ మెడిసిన్‌ సీట్లు కేటాయించింది.

► ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో 12 విభాగాలకు సీట్లను పెంచారు. అత్యధికంగా ఎంఎస్‌ జనరల్‌ సర్జరీ విభాగంలో 18 సీట్లు, ఎండీ పీడియాట్రిక్‌లో 17 సీట్లు పెంచారు. ఎంఎస్‌ ఆప్తమాలజీలో 12, ఎంఎస్‌ ఆర్థోపెడిక్స్‌లో 11 సీట్లు పెరిగాయి.
► గాంధీ మెడికల్‌ కాలేజీలో ఎండీ జనరల్‌ మెడిసిన్‌లో 8 పీజీ సీట్లు పెరిగాయి హా నిమ్స్‌లో ఎండీ జనరల్‌ మెడిసిన్‌లో 11 సీట్లు, ఎండీ అనెస్థీషియాలజీలో 8 సీట్లు, ఎండీ రేడియో డయాగ్నసిస్‌లో 6 సీట్లు పెరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement