Osmania Medical College
-
అనామకంగా ఆరంభమై అభివృద్ధిపథంలో!
అది 1992 అక్టోబర్ 9. కోట్ల విజయ భాస్కరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు. హైదరాబాద్‌కు ఫోన్ చేస్తే, ఢిల్లీలోనే ఉన్నారని వర్తమానం. పీవీ క్యాబినెట్లో న్యాయశాఖ, కంపెనీ వ్యవహారాల మంత్రిగా ఉన్నారప్పుడు. ఢిల్లీ నివాసానికి ఫోన్ చేస్తే, విజయ భాస్కరరెడ్డి ఫోన్ ఎత్తారు. ‘ఏమిటి సార్ ఈరోజే ప్రమాణ స్వీకారం అన్నారు. మీరింకా ఇక్కడే ఉన్నారేమిటంటే – ‘ఉదయం విమానం అందుకోలేక పోయాను. ప్రత్యేక విమానంలో వెళ్లబోతున్నాన’న్నారు. సరే వారిని అభినందించి, విజయవాడలో దంత వైద్య కళాశాల నెలకొల్పమని సలహా ఇచ్చాను. ‘ఊరుకో శివాజీ! నా ముందున్న ముఖ్యమంత్రి వైద్య కళాశాలల జోలికిపోయి ఉద్యోగం పోగొట్టుకొన్నాడు. నాకు ఈ సలహా ఇస్తున్నావు’ అన్నారు. ‘అది కాదులెండి, నేను హైదరాబాద్ వచ్చి వివరిస్తాను’ అని అప్పటికా సంభాషణ ముగించాను.మూడు నాలుగు రోజుల్లో హైదరాబాదు ముఖ్యమంత్రి కార్యాలయంలో కలిసి సవివరంగా వివరించాను. అప్పటికి అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో ఉస్మానియా వైద్య కళాశాలలో మాత్రమే దంత వైద్య విద్య ఉంది. దానిలో మొత్తం సీట్లు 32. అందులో 7 సీట్లు జమ్మూ–కశ్మీరుకు కేంద్ర ప్రభుత్వ కోటాలో పోతే... మిగిలిన 25 సీట్లలో ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర, ఉస్మానియా విశ్వవిద్యాలయాలకు వరుసగా 11, 6, 8 సీట్లు పంచుతారు. కనుక ‘విజయవాడలో హెల్త్ యూనివర్సిటీలో ఒక కళాశాల నెలకొల్పితే, మరొక 40 సీట్లు వస్తాయి. దానికి పెద్దగా నిధులు కూడా అవసరం ఉండదు కదా! మొదటి, రెండు సంవత్సరాల చదువుకు – అనాటమీ, ఫిజియాలజీ, ప్యాథాలజీ, బాక్టీరియాలజీ, ఫార్మకాలజీలకూ; వాటి నాన్క్లినికల్ సబ్జెక్టులకు వైద్య కళాశాలలోనున్న వసతులు సరిపోతాయి కదా.మూడో సంవత్సరం వచ్చేసరికి కాస్త అవుట్ పేషెంట్ పార్టులో ఓ 10, 15 డెంటల్ థియరీలు, కాస్త ఆపరేషన్ థియేటర్, ఇన్‌పేషెంట్లకు వసతి వంటివి ఏర్పాటు చేసుకోవడానికి నామమాత్రపు కేటాయింపులు సరిపోతాయ’ని చెప్పాను. వైద్య విశ్వవిద్యాలయం కులపతిగా ఉన్న డాక్టర్ లింగం సూర్యనారాయణను పిలిపించి, దానికి అవసరమైన నివేదిక తయారు చేయమని పురమాయించమని కోరాను. ఇది ప్రభుత్వ రంగంలో నెలకొంటుంది గనక అవినీతి ఆరోపణలకు తావుండదనీ చెప్పాను.ఈ సంగతి డాక్టర్ లింగం గారికి ముందుగానే తెలియజేస్తే – ‘అమ్మో! వారిని కలవడం మాటలా? నావల్ల కాదని’ కంగారుపడ్డారు. తరువాత రెండు, మూడు రోజులకు వారికి ఫోన్ చేసి చెప్పాను... ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కబురు వస్తుందనీ, కంగారు పడకుండా సవివరంగా నివేదిక తయారు చేసుకొని వెళ్లమనీ. ‘ఫోను వచ్చింది – శివాజీ ఈరోజే వెడుతున్నాను’ అని సెలవిచ్చారు. ముఖ్యమంత్రి ఆ నివేదిక పరిశీలించి వెంటనే ఐదు లక్షల రూపాయలు కేటాయించి, విజయవాడ పాత ఆర్టీసీ బస్టాండు భవనాన్ని బదలాయించి, కాలేజీ మొదలు పెట్టమన్నారు.ఇకపై, ప్రభుత్వం నుండి నిధుల కోసం ఎదురు చూడకుండా, మీ కాళ్ల మీద మీరు నిలబడి కాలేజీ నడుపుకోవాలని కూడా హెచ్చరించారు. అలా 1992–93లో 40 వార్షిక ప్రవేశాలతో, విజయవాడలో హెల్త్ యూనివర్సిటీ యాజమాన్యంలో ఈ కాలేజీ పురుడు పోసుకుంది. ఇది అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో, ద్వితీయ దంత వైద్య కళాశాల. హెల్త్ యూనివర్సిటీ మొత్తం అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు చెందింది కనుక, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం దానిలో ప్రవేశాలకు అవిభక్త రాష్ట్రమంతటికీ అన్ని జిల్లాలకూ పది సంవత్సరాల పాటు అర్హత ఉంది. ఇప్పుడు ఆ గడువు ముగిసింది కనుక విభజిత ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమయ్యింది.ఇదిలా ఉండగా, డాక్టర్ లింగం పదవీ విరమణ తర్వాత వారి స్థానంలో డాక్టర్ సీఎస్ భాస్కరన్ వైస్ ఛాన్స్లర్ అయ్యారు. వారు బ్యాక్టీరియాలజీ ప్రొఫెసర్. వారికి హాస్పిటల్ పని, ఆపరేషన్లు, రోగులు, వైద్యం వంటి బాధ్యతలు ఉండవు. దానితో వారు అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి కేంద్రీకరించారు. గతంలో కూడా డాక్టర్ డి. జగన్నాథరెడ్డి, డాక్టర్ డి. భాస్కర్ రెడ్డి, డాక్టర్ హరినాథ్ వంటి వారు వైద్య కళాశాలల ప్రిన్సిపల్స్గాను, వైద్య విద్యాశాఖ సంచాలకులుగాను బాగా రాణించారు. డాక్టర్ భాస్కరన్ విజయవాడలో ప్రైవేట్ ప్రాక్టీసులో ఉన్న సీనియర్ దంత వైద్యులను పిలిచి ‘ఈ కళాశాల అమ్మా, అబ్బా లేని అనాథ. మీరు ఈ ప్రాంతం వారు. ఇవి బతికి, బట్టగట్టేటట్లు కాపాడవలసిన గురుతర బాధ్యత మీ మీద ఉంది. జీతం–భత్యం ఆశించకుండా పని చేయండి’ అని విన్నవించారు. అలాగే పనిచేసి, వారు దాన్ని నిలబెట్టారు. అదే నేడు బీడీఎస్‌తో పాటుగా ఎమ్‌డీఎస్ కోర్సుల్లో కూడా తర్ఫీదునిస్తూ రాష్ట్రంలో అత్యుత్తమ కళాశాలగా నిలదొక్కుకుంది.– డా. యలమంచిలి శివాజీ, వ్యాసకర్త, రాజ్యసభ మాజీ సభ్యులు -
రోడ్డెక్కిన స్టాఫ్ నర్సులు
సాక్షి, హైదరాబాద్, సుల్తాన్‌బజార్: వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న హెడ్ నర్సు, స్టాఫ్ నర్సుల కౌన్సెలింగ్‌లో అవకతవకలు జరిగాయంటూ నర్సులు చేపట్టిన ఆందోళన శుక్రవారం కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణలోని 7 జోన్లకు ఒకేసారి కౌన్సెలింగ్ చేపట్టడంతో కళాశాల ఆడిటోరియంలో గందరగోళం నెలకొంది. డీహెచ్ రవీంద్రనాయక్ నేతృత్వంలో జరిగిన కౌన్సెలింగ్‌లో గ్రేడ్–1 అధికారి సుజాత రాథోడ్ వేదికపైకి వచ్చి బదిలీల లిస్టును మార్పు చేయించడంతో నర్సులు ఆగ్రహం వ్యక్తం చేశారు.బదిలీల కౌన్సెలింగ్‌ను పారదర్శంగా నిర్వహించాలని పెద్దపెట్టున నినదించారు. దీంతో డీహెచ్ కౌన్సెలింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు. దీంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది స్టాఫ్‌నర్సులు ధర్నాకు దిగారు. తమకు ఆన్లైన్లో కాకుండా ఆఫ్‌లైన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించాలని, డీహెచ్ డౌన్ డౌన్ అని నినదించారు. కొందరు అధికారులు యూనియన్ నేతలుగా చెప్పుకుంటున్న వారితో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగులు ఇస్తున్నారని ఆరోపించారు.ఓ యూనియన్ నేత రూ.5 కోట్ల వరకు వసూలు చేశాడని.. ఆ సొమ్ములో రూ. 3 కోట్లు ఒక కీలక అధికారికి కూడా ఇచి్చనట్లు ఆరోపించారు. ఉస్మానియా మెడికల్ కళాశాల ఎదురుగా ఉన్న రోడ్డును గంటసేపు దిగ్బంధనం చేశారు. దీంతో సుమారు రెండున్నర గంటల పాటు కోఠి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పదుల సంఖ్యలో ఉన్న పోలీసులు వేల సంఖ్యల్లో స్టాఫ్ నర్సులను నిలువరించలేకపోవడంతో రాకపోకలు భారీగా నిలిచిపోయాయి. -
రాష్ట్ర వైద్య మండలి ఎన్నికలు షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్ఎమ్సీ) ఎన్నికలను 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా నిర్వహించనున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ వేదికగా ఆదివారం ఈ ఎన్నికల మేనిఫెస్టోను హెచ్ఆర్డీఏ విడుదల చేసింది. అర్హత లేకుండా వైద్యం చేస్తున్న వారిని ప్రత్యేక కమిటీలు వేసి అరకడతామని ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. నూతన భవనం నిర్మించి, తెలంగాణ వైద్యులకు గౌరవం లభించేలా చూస్తామని, వైద్య విద్య ఫీజు నియంత్రణ దిశగా ప్రయత్నాలు చేస్తామని ప్రకటించారు. 48,405మంది డాక్టర్లకు ఓట్లు ప్రస్తుతం 48,405 మంది తెలంగాణ డాక్టర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత కలిగి ఉన్నారు. ఈ ఎన్నికల్లో 13 మంది వైద్యులు వైద్య మండలికి ఎన్నిక కానుండగా, ఇందుకోసం వందకు పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అభ్యర్థులంతా తమ విధివిధానాలతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడగా, మరికొందరు ప్యానల్‌గా ఏర్పడి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలు పోస్టల్ బాలెట్ ద్వారా జరగనున్నాయి. వచ్చే నెల నుంచి బ్యాలెట్ పేపర్ల పంపిణీ జరగనుండగా, వాటి లెక్క డిసెంబర్ 1న మొదలుకానుంది. కాగా మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో డా.మహేష్‌కుమార్, డా. ప్రతిభాలక్ష్మీ, డా. కుసుమరాజు రవికుమార్, డా.కిరణ్‌కుమార్ తోటావర్ తదితరులు పాల్గొన్నారు. -
సివిల్స్‌లో తెలుగువారి సత్తా
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: ఆలిండి యా సివిల్ సర్వీసెస్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఆలిండియా 20వ ర్యాంకును హైదరాబాద్‌కు చెందిన పి.శ్రీజ దక్కించుకోగా.. టాప్–100లో 12 మంది నిలిచారు. మొత్తంగా 50 మందికిపైగా తెలుగు విద్యార్థులకు మంచి ర్యాంకులు వ చ్చాయి. ఈ మేరకు సివిల్ సర్వీసెస్–2020 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసింది. డాక్టర్ నుంచి సివిల్స్‌కు.. సివిల్స్‌లో ఆలిండియా 20వ ర్యాంకు వచ్చిన పి.శ్రీజ స్వస్థలం వరంగల్. హైదరాబాద్‌లోని ఉప్పల్ సమీపంలోని సాయినగర్‌లో నివాసం ఉంటున్నారు. తండ్రి శ్రీనివాస్ హబ్సిగూడలోని వాహనాల షోరూంలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తుండగా.. తల్లి శ్రీలత నర్సుగా పనిచేస్తున్నారు. శ్రీజ ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివింది. తాజాగా తన తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 20వ ర్యాంకు సాధించింది. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఎంబీబీఎస్ చేశానని.. పేదలకు మరింత సేవ చేయాలన్న ఆలోచనతో సివిల్స్‌కు సిద్ధమయ్యానని శ్రీజ తెలిపింది. ‘‘పెద్దగా ఒత్తిడికి గురికాకుండా ఆడుతూపాడుతూ సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యా. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవడం వల్ల ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో.. ఇంటర్వూ్యలో ఎలాంటి తడబాటు లేకుండా నిలిచా. కోచింగ్, తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం నా విజయానికి తోడ్పడ్డాయి..’’ అని పేర్కొంది. రైతుల ఆత్మహత్యలు ఆగేలా పనిచేస్తా.. సివిల్స్ 207 ర్యాంకు సాధించిన వి.సంజనాసింహ నివాసం హైదరాబాద్‌లోని మలక్‌పేట. ఐఏఎస్ కావాలన్నది తన కోరిక. ‘‘నేను కలెక్టర్ అయితే రైతుల ఆత్మహత్యలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తా. మహిళలపై దాడులు జరగకుండా ప్రణాళిక రూపొందించి.. అవగాహన కల్పిస్తా’’ అని తెలిపింది. ఐపీఎస్‌కు ఎంపికవుతా.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం హరిజనవాడ పంచాయతీకి చెందిన కోట కృష్ణయ్య – వజ్రమ్మల కుమారుడు కిరణ్‌కుమార్. దమ్మపేట గురుకుల పాఠశాలలో చదివిన కిరణ్.. ఖరగ్‌పూర్ ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. కిరణ్ తండ్రి వ్యవసాయం చేస్తారు, తల్లి ఆ గ్రామ సర్పంచ్, సోదరుడు బాబురావు పోలీసు విభాగంలో సీఐగా పనిచేస్తున్నారు. సివిల్స్‌లో 652వ ర్యాంకు సాధించిన కిరణ్.. ఐపీఎస్‌కు ఎంపికయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎంతో సంతోషంగా ఉంది సివిల్స్‌లో 616వ ర్యాంకు సాధించడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని ఆందాసు అభిషేక్ పేర్కొన్నారు. ఏపీలోని విశాఖపట్నా నికి చెందిన అభిషేక్ ముంబై ఐఐటీలో బీటెక్ పూర్తి చేసిన అభిషేక్.. తన మూడో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంకు సాధించాడు. మరికొందరు ర్యాంకర్ల వివరాలివీ.. ►66వ ర్యాంకు సాధించిన అనిష శ్రీవాస్తవ నివాసం సికింద్రాబాద్‌లోని ఆర్కేపురం. కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేసి.. సివిల్స్‌కు సిద్ధమయ్యారు. ►317వ ర్యాంకు సాధించిన గౌతమి నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆర్కిటెక్చర్లో డిగ్రీ చేశారు. తండ్రి గోపాల్ వ్యాపారవేత్త, తల్లి రాధ స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. ►248వ ర్యాంకు సాధించిన శోభిక పాఠక్ నివాసం సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి. ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న ఆమె.. వరంగల్ ఎన్ఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. విద్యా వ్యవస్థలో మార్పు తేవాలని విజయవాడకు చెందిన బద్దెల్లి చంద్రకాంత్‌రెడ్డి సివిల్స్‌లో 120వ ర్యాంకు సాధించాడు. కరోనా పరిస్థితులతో నేరుగా క్లాసులు వినలేకపోయినా.. సొంతంగా నోట్స్ తయారు చేసుకుని సిద్ధమయ్యానని చంద్రకాంత్‌రెడ్డి చెప్పాడు. ‘‘ఐఏఎస్ వస్తుందని ఆశిస్తున్నా. ఐఏఎస్ అయితే విద్యా వ్యవస్థలో మార్పులు తేవాలనే ఆలోచన ఉంది. మాతృభాషను మరింత దగ్గర చేసేలా కృషి చేస్తా. ఒకవేళ ఐపీఎస్ వస్తే.. నేరాలను అరికట్టేలా ప్రయత్నిస్తా..’’ అని పేర్కొన్నాడు. మొదటిసారే సాధించా.. హైదరాబాద్‌లోని తార్నాకలో నివసించే రిచా కులకర్ణి సివిల్స్‌లో 134వ ర్యాంకు సాధించింది. ‘‘యూపీఎస్సీ రాయడం ఇదే మొదటిసారి. ఇంత మంచి ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. రెండేళ్లుగా కోచింగ్ తీసుకోవడం, తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తి నాకు తోడ్పడింది. ఐఎఫ్ఎస్ వస్తుందన్న ఆశతో ఉన్నాను..’’ అని రిచా పేర్కొంది. మూడో ప్రయత్నంలో.. ఏపీలోని విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన సూరపాటి ప్రశాంత్ ఆలిండియా 498వ ర్యాంకు సాధించాడు. ఆయన తండ్రి బాబూరావు రిటైర్ట్ ఆర్మీ ఉద్యోగి. ఇంజనీరింగ్ పూర్తిచేసిన ప్రశాంత్ తన మూడో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంకు సాధించాడు. మహిళలు చదువుకుంటేనే దేశం బాగుపడుతుందన్నది తన అభిప్రాయమని ప్రశాంత్ పేర్కొన్నాడు. ప్రజల జీవితంలో మార్పు తెచ్చేందుకు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కడుకుంట్లకు చెందిన శ్రీనివాస్‌గౌడ్, వనజ దంపతుల కుమారుడు పృథ్వీనాథ్‌గౌడ్. కొత్తకోటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న పృథ్వీనాథ్.. హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేశాడు. తాజాగా సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా 541వ ర్యాంకు సాధించాడు. ‘‘ఎంబీబీఎస్ చదివినా సంతృప్తి అనిపించలేదు. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలంటే పరిపాలనా విభాగంలో ఉండాలన్న పట్టుదలతో సివిల్స్ కోసం సిద్ధమయ్యాను..’’అని పృథ్వీనాథ్ తెలిపాడు. -
ఉస్మానియా వైద్య విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
సాక్షి ,సిటీబ్యూరో: ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న19 మంది విద్యార్థులు అస్వసత్థకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం భోజనం అనంతరం వాంతులు, విరేచనాలతో బాధపడటంతో అందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. -
కరోనా భయంతో వణికిపోతున్న వైద్య సిబ్బంది
-
ఉస్మానియాలో హెల్త్ ఇన్స్పెక్టర్, నర్సుకు కరోనా
-
వైద్య విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు
-
మెడికల్ కాలేజీలో 12 మందికి కరోనా
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల ఉస్మానియా వైద్య కళాశాలలో ఇద్దరు పీజీ డాక్టర్లకు కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. స్థానిక వైద్యులు వారిని పరీక్షించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. తాజాగా 12 మంది ఉస్మానియా మెడికల్ కళాశాల విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో కాలేజీ యాజమాన్యం ఉస్మానియా మెడికల్ రీడింగ్ రూమ్‌ను మూసివేసింది. జూనియర్ డాక్టర్లకు కరోనా సోకడంతో కళాశాల మొత్తం శానిటైజింగ్ చేయించినట్లు ప్రిన్సిపల్ శశికళ తెలిపారు. మిగతా మెడికల్ కాలేజీ విద్యార్థులకు కరోనా టెస్టులు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఉన్న 10 హాస్పిటల్స్ లోని వివిధ విభాగాల్లో జూనియర్ డాక్టర్లు పనిచేస్తున్నారు. కాగా తోటి స్నేహితులకు కరోనా సోకడంతో మిగతా విద్యార్థులంతా భయాందోళనకు గురవుతున్నారు. (‘కరోనాకు మందు కనిపెట్టా.. అనుమతివ్వండి’) ‘కింగ్‌కోఠి’లో 19 మందికి పాజిటివ్ -
ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటి వరకు పాతబస్తీ, మలక్‌పేట్, వనస్థలిపురం, జియాగూడ, కుల్సుంపురలకే పరిమితమైన కరోనా వైరస్ తాజాగా కొత్త కాలనీల్లోనూ విజృంభిస్తోంది. మార్చి నుంచి ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కానీ శివారు కాలనీల్లో ఇటీవల రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆయా ప్రాంత వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఉస్మానియా మెడికల్ కాలేజీ, పహడీషరీఫ్, హఫీజ్‌పేట్, సరూర్‌నగర్ చెరుకుతోట కాలనీ, లింగోజిగూడ సాయినగర్ కాలనీ, మీర్పేట్, లెనిన్‌నగర్, బడంగ్పేట్, నాదర్గుల్, మల్కాజ్గిరి, రామంతాపూర్‌లోని కామాక్షిపురం వీధి, మారేడ్‌పల్లి, గోల్నాక డివిజన్ సుందర్ నగర్, నార్త్‌లాలాగూడ, గుడిమల్కాపూర్, ఆజంపురా, ఎన్టీఆర్నగర్, లింగోజిగూడ సాయినగర్‌లలో కరోనా వైరస్ కేసుల పరంపర కొనసాగుతోంది. ఇద్దరు పీజీ డాక్టర్లు సహా క్యాంటిన్ వర్కర్ సుల్తాన్‌బజార్/ఉస్మానియా ఆస్పత్రి: ఉస్మానియా వైద్య కళాశాలలో ఇద్దరు పీజీ డాక్టర్లకు కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. స్థానిక వైద్యులు వారిని పరీక్షించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇతర రూమ్మేట్స్ సైతం అప్పటికప్పుడు తమ రూములు ఖాళీచేసి పరుగులు పెట్టారు. పీజీ వైద్యులు ఎవరెవరితో సమీపంగా ఉన్నారో గుర్తించే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే ఉస్మానియా ఆస్పత్రి క్యాంటిన్లో పనిచేస్తున్న యువకునికి(25) కూడా కరోనా వైరస్ సోకింది. మహబూబ్‌నగర్ జిల్లా, పెబ్బేరుకు చెందిన ఈ యువకుడు ఆస్పత్రి క్యాంటిన్లో పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌కు ముందే సొంతూరుకు వెళ్లి...ఇటీవలే వచ్చి మళ్లీ విధుల్లో చేరాడు. ఆయన తీవ్రమైన జ్వరం, జలుబుతో బాధపడుతుండడంతో ఉస్మానియా వైద్యులు అతనికి కరోనా పరీక్షలు చేయించారు. శనివారం అతనికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ తెలిపారు. క్యాంటీన్లో పని చేసే సిబ్బందికి దశల వారీగా కరోనా పరీక్షలు చేయిస్తామని ఆయన వెల్లడించారు. (ఒక్కరోజులో 8,000 మంది డిశ్చార్జ్) చెరుకుతోట కాలనీలో ఒకరికి పాజిటివ్ హుడాకాంప్లెక్స్: సరూర్‌నగర్ పరిధిలోని చెరుకుతోట కాలనీ రోడ్ నెంబర్ తొమ్మిదికి చెందిన యువకుడు(36)కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన గత నవంబర్‌లో సౌదీ అరేబియాకు వెళ్లారు. మే 22న హైదరాబాద్ చేరుకున్నాడు. నగరంలోని ఓ హోటల్లో క్వారంటైన్ చేశారు. ఐసీఎంఆర్ నిబంధనల మేరకు ఏడు రోజుల తర్వాత ఇంటికి పంపారు. ఇంట్లో ప్రత్యేక గదిలో ఉన్నాడు. ఆ మరుసటి రోజే తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు వంటి కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆయన స్వయంగా వైద్యులకు సమాచారం ఇచ్చాడు. 108లో ఆయన్ను గాంధీకి తరలించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులను, ఇదే ఇంట్లో అద్దెకు ఉండే మరో ఏడుగురిని కూడా క్వారంటైన్ చేశారు. (కమ్యూనిటీ వ్యాప్తిపై సర్వే..) -
ఉస్మానియాలోనూ ‘కోవిడ్’ నిర్ధారణ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుబంధంగా కోవిడ్ వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం అనుమతినిచ్చిందని, అందుకు అవసరమైన పరికరాలు, కిట్లను పంపుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు మరో సమావేశం నిర్వహించారు. ఆయా సమావేశ వివరాలన్నింటినీ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం రాత్రి మీడియాకు వివరించారు. గాంధీ వైరాలజీ ల్యాబ్‌కు అదనంగా ఉస్మానియాలో ఏర్పాటు చేయబోయే కోవిడ్ నిర్ధారణ కేంద్రం పనిజేస్తుందన్నారు. అలాగే హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లోనూ కోవిడ్ పరీక్ష నిర్ధారణ కేంద్రానికి అనుమతి కోరామన్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు తా జాగా పరీక్షలు నిర్వహించామని, నెగటివ్ వచ్చిందన్నారు. మరోమారు పరీక్ష చేసి, నాలుగైదు రోజుల్లో అతన్ని డిశ్చార్జి చేస్తామన్నారు. అంటే ఈ క్షణానికి తెలంగాణలో ఒక్క మనిషికి కూడా కోవిడ్ వైరస్ లేదని మంత్రి సగర్వంగా ప్రకటించారు. విమానాశ్రయంలో 24 గంటలూ స్క్రీనింగ్ చేయడానికి ఏర్పాటు చేశామన్నారు. రెండు స్టాండింగ్ థర్మల్ స్క్రీనింగ్ యంత్రాల కొనుగోలు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి స్టాండింగ్ థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామ ని ఈటల తెలిపారు. అయితే అందుకు కేంద్రం సహకరించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రెండు థర్మల్ స్క్రీనింగ్స్ యంత్రాలకు ఆర్డర్ ఇచ్చామన్నారు. తాను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మం త్రి హర్షవర్ధ్దన్తో మంగళవారం మాట్లాడానన్నారు. అన్ని విమానాశ్రయాల్లోనూ కోవిడ్ స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరానన్నారు. అందుకు అంగీకరించారన్నారు. వివిధ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మన దగ్గర ఒకవేళ కోవిడ్ కేసులు వస్తే ఏం చేయాలన్నదానిపై తదుపరి చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 41,102 మందికి థర్మల్ స్క్రీనింగ్ చేశామని, 277 మందికి అనుమానిత లక్షణాలున్న కారణంతో పరీక్షలు చేయగా, వారందరికీ నెగిటివ్ వచ్చిందని మంత్రి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ సూచన... చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్, ఇటలీ, థాయిలాండ్, సింగపూర్, మలేసియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ దేశాల నుంచి భారతదేశంలోకి వచ్చే ప్రయాణికులంతా స్వతహాగా 14 రోజులు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కోవిడ్ కట్టడికి సాయం చేస్తాం కోవిడ్ వైరస్ కట్టడిలో సర్కార్‌కు సాయం అందించేందుకు యశోద ఆసుపత్రి యాజమాన్యం ముందుకొచ్చింది. మంగళవారం వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను యశోద ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్ రావు, వైస్ ప్రెసిడెంట్ సురేశ్‌కుమార్ కలసి కోవిడ్ వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, సంస్థ తరఫున అందించే సాయంపై వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1.20 లక్షల మాస్క్‌లు అందించామని, మరో 80 వేలు బుధవారంలోగా అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే 60 వెంటిలేషన్‌తో కూడిన ఐసోలేషన్ పడకలను అందుబాటులో ఉంచుతామన్నారు. వాటిని కేవలం కోవిడ్ వైరస్ చికిత్స కోసం వచ్చే వారికి మాత్రమే వినియోగిస్తామని చెప్పారు. సిక్రింద్రాబాద్, మలక్‌పేట, సోమాజిగూడలలో 20 చొప్పున బెడ్లను ఏర్పాటు చేశామని యశోద ఆసుపత్రి ఎండీ తెలిపారు. ఈ సందర్భంగా కోవిడ్ వైరస్ వ్యాప్తి కాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన కొనియాడారు. -
సీనియర్లు వర్సెస్ జూనియర్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ బోధనాసుపత్రుల్లోని ప్రొఫెసర్లు, ఇతర అధ్యాపకులు, వాటిల్లోని వైద్యుల విరమణ వయస్సును 58 నుంచి 65 ఏళ్లకు పెంచాలన్న సర్కారు నిర్ణయం సీనియర్లు, జూనియర్ల మధ్య ఘర్షణ వాతావరణానికి దారితీస్తోంది. ఉద్యోగ విరమణ వయస్సు పెంపును సీనియర్ వైద్యులు ఆహ్వానిస్తుండగా, జూనియర్ డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో సీనియర్లు, జూనియర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రెండ్రోజుల క్రితం ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీనియర్లు, జూనియర్లు కొట్టుకున్నట్లు అక్కడి వైద్యులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విరమణ వయస్సు పెంపుపై వైద్యుల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. సర్కారు మాత్రం విరమణ వయస్సు పెంపుపై తగ్గే పరిస్థితి కనిపించడంలేదు. త్వరలోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చే పనిలో నిమగ్నమైంది. కానీ జూనియర్ డాక్టర్లు మాత్రం దీన్ని ఎలాగైనా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి. ఎక్కడికక్కడ నిరసనలు... బోధనాసుపత్రుల్లోని వైద్యుల విరమణ వయస్సు పెంపుపై వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల అధికారిక ప్రకటన చేయడంతో జూనియర్ డాక్టర్లు, ఇతర వైద్యుల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. 65 ఏళ్ల వయస్సు పెంచాలని సీనియర్ డాక్టర్లు, త్వరలో రిటైర్ కాబోయే వారు కోరుతున్నారు. దీన్ని కేవలం బోధనాసుపత్రుల్లోని వైద్యులకే కాకుండా ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులందరికీ వర్తింపచేయాలని మరికొందరు విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్ని ప్రభుత్వ వైద్యుల సంఘాలు కూడా కోరుతున్నాయి. అన్నేళ్లు పనిచేయడం కష్టమని, ఆ వయస్సులో ఆపరేషన్ చేయాలంటే చేతులు వణుకుతాయని, కాబట్టి 61 ఏళ్లు చాలని ఇంకొందరు డాక్టర్లు అంటున్నారు. ఇక జూనియర్ డాక్టర్లేమో ఖాళీలను భర్తీ చేయకుండా ఇలా విరమణ వయస్సు పెంచితే తాము నిరుద్యోగులుగా మిగిలిపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీళ్లే ఇప్పుడు ప్రధానంగా నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘డాక్టర్ల నిరుద్యోగ సభ’మంగళవారం జరగబోతోంది. హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద సభ నిర్వహించనున్నారు. బెంగాల్‌పై నిరసనలు... ఇదిలా ఉండగా పశ్చిమబెంగాల్లో వైద్యులపై దాడులను నిరసిస్తూ రాష్ట్రంలోనూ పలుచోట్ల వైద్యులు నిరసనలు తెలిపారు. అనేక ఆసుపత్రుల్లో వైద్యులు నిరసన ప్రదర్శనలు చేశారు. త్వరలో ఆర్డినెన్స్... వాస్తవంగా విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతూ గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రభుత్వం కేబినెట్లో ఆమోదం తెలిపింది. తర్వాత దానిపై వివిధ వర్గాల వైద్యులు, జూనియర్ డాక్టర్లు నిరసన తెలపడం, ఇంతలోనే ఎన్నికలు రావడంతో అడుగు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన జీవోను సర్కారు విడుదల చేయలేకపోయింది. అయితే గతంలోనే కేబినెట్ ఆమోదం తెలిపినందున మరోసారి అవసరంలేదని, ఆర్డినెన్స్ తీసుకొస్తే సరిపోతుందని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. త్వరలోనే ఆర్డినెన్స్ జారీచేసే అవకాశముందని వివరించారు. ఆర్డినెన్స్ తీసుకొస్తే తక్షణమే అమలుకానుంది. దీంతో ఈ నెలలో విరమణ పొందే బోధనాసుపత్రుల్లోని డాక్టర్లు మరో ఏడేళ్ల వరకు పొడిగింపు పొందనున్నారు. -
గాంధీకి 16.. ఉస్మానియాకు 21
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ వైద్య కళాశాలలు తమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలు, మానవ వనరులను సమకూర్చుకుంటూ అత్యుత్తమ వైద్యవిద్యను అందిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. ఏటా అనేక మంది విద్యార్థులను ఉత్తమ వైద్యులుగా తీర్చిదిద్ది సమాజానికి అందిస్తున్నాయి. వైద్యవిద్య బోధనలోనే కాదు.. వైద్యసేవల్లోనూ కార్పొరేట్‌కు దీటుగా ముందుకు సాగుతున్నాయి. వైద్య విద్యార్థుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘ఇండియా టుడే’సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న 503 ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలపై సర్వే నిర్వహించింది. జాతీయస్థాయి ఉత్తమ వైద్య కళాశాలల జాబితాలో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు మొదటి ర్యాంకు, సీఎంసీ వెల్లూరుకు రెండో ర్యాంకు, పుణేలోని ఆర్మ్డ్ ఫోర్స్ వైద్య కళాశాలకు మూడో ర్యాంకు లభించింది. నగరానికి చెందిన గాంధీ మెడికల్ కాలేజీకి 16వ స్థానం లభించగా, ఉస్మానియా మెడికల్ కాలేజీకి 21వ ర్యాంకు దక్కింది. ఎంబీబీఎస్ లో చేరేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ఉస్మానియాలో కాకుండా గాంధీ కాలేజీలో చేరేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. గతంలో 21.. ఇప్పుడు 16.. గాంధీ వైద్య కళాశాలకు అనుబంధంగా గాంధీ జనరల్ ఆస్పత్రి కొనసాగుతోంది. 1954లో గాంధీ ఆస్పత్రి ప్రారంభమైంది. 1956లో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (ఎంసీఐ) గుర్తింపు లభించింది. తొలి ఓపెన్‌హార్ట్ సర్జరీ ఇక్కడే జరిగింది. తొలి కేథల్యాబ్ ఇక్కడే ఏర్పాటు చేశారు. ఇక్కడ డీఎం కార్డియాలజీ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 43 విభాగాలు ఉన్నాయి. వైద్య కాలేజీకి అనుబంధంగా కొనసాగుతున్న ఆస్పత్రిలో ఓపీ, ఐపీ, అత్యవసర సేవలు సహా రక్తనిధి కేంద్రం కూడా ఉంది. మౌలిక సదుపాయాలు, మానవవనరులు, విద్యాబోధన, ఫలితాలు ప్రతిపాదికన ఇండియా టుడే గతంలో నిర్వ హించిన సర్వేలో 21వ స్థానంలో ఉన్న గాంధీ వైద్య కళాశాల.. ఈ ఏడాది 16వ స్థానానికి చేరుకుంది. ఉస్మానియా వైద్య కళాశాలతో పోలిస్తే ఇక్కడ మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటం, కాలేజీ క్యాంపస్‌లోనే అనుబంధ ఆస్పత్రి కొనసాగుతుండటం, నిపుణులైన అధ్యాపకులు అందుబాటులో ఉండటం వల్ల నీట్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు సైతం ఈ కాలేజీలో చదివేందుకు ఇష్టపడుతున్నారు. ఉస్మానియాకు 21వ స్థానం ఉస్మానియా వైద్య కళాశాలకు 1951లో ఎంసీఐ గుర్తింపు లభించింది. ఒకప్పుడు టాప్ ర్యాంకర్లంతా ఈ కాలేజీలో చేరేందుకు ఎక్కువ ఇష్టపడేవారు. అనుబంధ ఆస్ప త్రులు వైద్య కళాశాలకు దూరంగా ఉండటం, ఆయా ఆస్పత్రుల భవనాలు శిథిలావస్థకు చేరుకోవడం వల్ల ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ఇటీవల ఎంసీఐ ఆదేశాల మేరకు రూ.70 కోట్లతో మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్, ఎండీఆర్‌యూ, లేడీస్ హాస్టల్, అధునాతన లైబ్రరీ, రెండు హాస్టల్ భవనాలు సహా ఇతర మౌలిక వసతులను మెరుగుపర్చుకుంది. మానవవనరులను సమకూర్చుకుంది. బోధనలోనే కాదు ఫలితాల్లోనూ మెరుగుపడింది. ఫలితంగా ఈ ఏడాది 21వ స్థానంలో నిలిచి పూర్వవైభవాన్ని సంతరించుకుంది. గతేడాది జాబితా లో కనీసం స్థానం కూడా దక్కలేదు. ఈసారి ఏకంగా 21వ స్థానం దక్కడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
తెలంగాణకే ఎయిమ్స్ టాప్ ర్యాంకు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన వై.జతిన్ ప్రతిష్టాత్మక ఢిల్లీ ఎయిమ్స్ నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం ప్రవేశ పరీక్షలో దేశవ్యాప్త మొదటి ర్యాంకు సాధించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో 2014లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన జతిన్.. తర్వాత 2015–18 వరకు చండీగఢ్‌లో ఎండీ జనరల్ మెడిసిన్ పూర్తి చేశారు. ఇప్పుడు ఎయిమ్స్ నిర్వహించిన ఎంట్రన్స్‌లో మొదటి ర్యాంకు సాధించడం పట్ల జూనియర్ డాక్టర్లు (జూడా) హర్షం వ్యక్తంచేశారు. కరీంనగర్‌కు చెందిన ఆయన కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. -
మెడికల్ పీజీ కోటాపై డాక్టర్ల పోరాటం
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ సీట్లలో ఇన్‌సర్వీస్ కోటాను పునరుద్ధరించాలని దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఆ సంఘం కీలక సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ వైద్యుల సంఘాల ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ఇన్‌సర్వీస్ కోటా సీట్లను సాధించేందుకు పోరాటం చేయాలని పిలుపు ఇవ్వనున్నారు. ఢిల్లీ వెళ్లి ఎంపీలను, ఇతర కేంద్ర పెద్దలను కలసి విన్నవించాలని తీర్మానించాలని భావిస్తున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో జరిగే దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ వైద్యుల సమావేశంలో ఈ ప్రాంత డాక్టర్లకు జరుగుతున్న అన్యాయంపైనా చర్చించే అవకాశముంది. ‘నీట్’తో కోటాకు టాటా.. రాష్ట్రాల్లో పీహెచ్సీ, సీహెచ్‌సీల్లో వైద్యులు, స్పెషలిస్టులను పెద్ద ఎత్తున నియమించేందుకు ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహకాలు అందించారు. అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1975లో ప్రభుత్వంలో పనిచేస్తున్న వైద్యులకు ప్రోత్సాహకాలుగా ఇన్‌సర్వీస్ పీజీ కోటాను ప్రవేశపెట్టారు. ఇలా దేశంలో 11 రాష్ట్రాలు ఇన్ సర్వీస్ కోటాను ప్రవేశపెట్టాయి. దీనిద్వారా చాలామంది వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పనిచేసేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అయితే నీట్ పరీక్షలతో ప్రభుత్వ వైద్యులకు కల్పిస్తున్న ఇన్‌సర్వీస్ పీజీ కోటాను రద్దు చేశారు. డిప్లొమా కోర్సులకు మాత్రమే రిజర్వేషన్ కల్పించి మెడికల్ డిగ్రీ కోర్సులకు ఏడాదికి 10 శాతం వెయిటేజీ కల్పించారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ వైద్యులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ వైద్యుల సంఘం తరపున తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి.సుధాకర్ ‘సాక్షి’కి తెలిపారు. సుప్రీం కోర్టులో పిటిషన్.. ఇన్‌సర్వీస్ కోటా రద్దుపై తమిళనాడు ప్రభుత్వ వైద్యుల సంఘం ఎంసీఐ నిర్ణయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇన్‌సర్వీస్ కోటా రద్దు వల్ల ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి నెలకొందని డాక్టర్ సుధాకర్ తెలిపారు. ఇదే పరిస్థితి పదేళ్లు కొనసాగితే దేశంలో ప్రభుత్వ వైద్యరంగంలో పనిచేసేందుకు డాక్టర్లు ముందుకురారని, ప్రభుత్వ వైద్యుల సంఖ్య తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఆదివారం కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యుల సంఘ ప్రతినిధులను సంఘటితం చేసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
రాజేష్‌కు బెయిల్ నిరాకరణ
చిత్తూరు అర్బన్: తొలిరాత్రి శోభనం గదిలో భార్యను చిత్రహింసలకు గురిచేశాడనే ఆరోపణలపై జుడీషియల్ రిమాండులో ఉన్న ఉపాధ్యాయుడు రాజేష్‌కు బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. అతడి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ చిత్తూరులోని మొదటి అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 1న శోభనం గదిలో భార్య శైలజపై విచక్షణ మరిచి దాడి చేయడంతో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు చెందిన రాజేష్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు రాజేష్‌కు లైంగిక పటుత్వ పరీక్షలు పూర్తి కావడంతో శుక్రవారం అతడిని పోలీసులు హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. లైంగిక పటుత్వ పరీక్షలకు న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో గతవారం అతడిని హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షల అనంతరం తిరిగి చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. -
ఉస్మానియా వైద్య కళాశాలలో ‘ఎంసీఐ’ తనిఖీ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా వైద్య కళాశాలలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) పరిశీలకులు తనిఖీ నిర్వహించారు. గతంలో తనిఖీకి వచ్చినపుడు లోపాలు కనిపించడంతో 50 ఎంబీబీఎస్ సీట్లకు కోతపెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి తనిఖీ నేపథ్యంలో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా సిబ్బంది క్వార్టర్ల నిర్మాణంలో జాప్యంపై ఎంసీఐ పరిశీలకులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. వీటితోపాటు మరికొన్ని లోపాలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం. దీంతో వాటినికూడా సరిచేస్తామని అధి కారులు హామీ ఇచ్చారు. కోతకు గురైన 50 సీట్ల పునరుద్ధరణ త్వరలోనే ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. -
రాష్ట్రానికి మరో 131 పీజీ వైద్య సీట్లు
⇒ అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు ⇒ ఉస్మానియాకు ఏకంగా 90 సీట్లు ⇒ నిమ్స్‌కు 30, గాంధీకి 11 పీజీ సీట్లు ⇒ 2017–18 పీజీ అడ్మిషన్ల నుంచే వీటి భర్తీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి భారీగా పీజీ వైద్య సీట్లకు కేంద్రం అనుమతి ఇచ్చింది. నిమ్స్, ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలకు అదనంగా 131 పీజీ వైద్య సీట్లు కేటా యిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉస్మానియా మెడికల్ కాలేజీకి అధికంగా 90 సీట్లు, నిమ్స్‌కు 30, గాంధీకి 11 కేటాయిం చింది. ఉస్మానియాలో 279 పీజీ సీట్లుండగా అవి 369కి పెరగనున్నాయి. గాంధీలో 138 నుంచి 149కి, నిమ్స్‌లో 50 నుంచి 80కి పెరుగుతున్నాయి. పెరిగిన సీట్లన్నింటినీ 2017–18లోనే భర్తీ చేస్తారు. సీట్లు పెంపుపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అదనంగా మరో 100 పీజీ సీట్లు కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికా రులు తెలిపారు. కాకతీయ మెడికల్ కాలేజీ కి 50 సీట్లు కోరాలని నిర్ణయించారు. సూపర్ స్పెషాలిటీ సీట్లు కోరనున్నట్లు వైద్య విద్యా సంచాలకులు రమణి ‘సాక్షి’కి తెలిపా రు. పీజీ సీట్లు లేని ఆదిలాబాద్, నిజామా బాద్ మెడికల్ కాలేజీలకు కూడా ఈసారి సీట్లు కోరాలని నిర్ణయించామన్నారు. ఒక్కో ప్రొఫెసర్‌కు 3 పీజీ సీట్లు ఒక్కో ప్రొఫెసర్ పరిధిలో ప్రస్తుతమున్న రెండు పీజీ వైద్య సీట్లను మూడుకు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ అధిపతిగా ఉండగా ప్రస్తుతమున్న ఒక సీటును రెండుకు పెంచా లని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం దేశవ్యాప్తంగా 4,193 పీజీ వైద్య సీట్లు పెంచింది. వీటిలో భాగంగా రాష్ట్రా నికి 131 సీట్లను అదనంగా కేటాయించింది. మరో 100 సీట్ల దాకా వచ్చే అవకాశం ఉందని రమణి తెలిపారు. ఈ మేరకు ఇప్ప టికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపామ న్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తొలిసారిగా ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్కు రెండు పీజీ సీట్లను ఎంసీఐ మంజూరు చేసింది. ప్రైవేట్‌లో ఒక మెడికల్ కాలేజీలో మాత్రమే ఈ సదుపాయం ఉండగా ప్రభుత్వ రంగంలో నిమ్స్‌కు మాత్రమే ఈ సదుపాయం కల్పించింది. ఈ విభాగంలో నిమ్స్‌కు 2 ఎమర్జెన్సీ మెడిసిన్ సీట్లు కేటాయించింది. ► ఉస్మానియా మెడికల్ కాలేజీలో 12 విభాగాలకు సీట్లను పెంచారు. అత్యధికంగా ఎంఎస్ జనరల్ సర్జరీ విభాగంలో 18 సీట్లు, ఎండీ పీడియాట్రిక్‌లో 17 సీట్లు పెంచారు. ఎంఎస్ ఆప్తమాలజీలో 12, ఎంఎస్ ఆర్థోపెడిక్స్‌లో 11 సీట్లు పెరిగాయి. ► గాంధీ మెడికల్ కాలేజీలో ఎండీ జనరల్ మెడిసిన్‌లో 8 పీజీ సీట్లు పెరిగాయి హా నిమ్స్‌లో ఎండీ జనరల్ మెడిసిన్‌లో 11 సీట్లు, ఎండీ అనెస్థీషియాలజీలో 8 సీట్లు, ఎండీ రేడియో డయాగ్నసిస్‌లో 6 సీట్లు పెరిగాయి. -
సీట్లు కాపాడుకునేందుకు పాట్లు!
⇒ నిబంధనలు పాటించకపోవడంతో ⇒ తాజాగా కాకతీయ, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీల్లో ఇదే పరిస్థితి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లను కాపాడుకోవడం వైద్య ఆరోగ్య శాఖకు గండంగా మారింది. ప్రతీ ఏడాది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) తనిఖీలకు రావడం.. లోపాల కారణంగా సీట్ల పునరుద్ధరణకు తిరస్కరించడం పరిపాటిగా మారింది. 3 నెలల కిందట ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన 50 ఎంబీబీఎస్ సీట్లు, నిజామాబాద్ మెడికల్ కాలేజీలోని 100 సీట్లను 2017–18 సంవత్సరానికి పునరుద్ధరించడానికి ఎంసీఐ నిరాకరించింది. తాజాగా కాకతీయ మెడికల్ కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లు, కొత్తగా ఏర్పడిన మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో 150 సీట్లకు ఎంసీఐ అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీట్ల పునరుద్ధరణకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే నిజామాబాద్, ఉస్మానియాల్లోని ఎంబీబీఎస్ సీట్ల అనుమతి కోసం లేఖ రాయగా.. తాజాగా తిరస్కరించిన మహబూబ్‌నగర్, కాకతీయ మెడికల్ కాలేజీల్లోని సీట్ల పునరుద్ధరణకు లేఖ రాయాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఆయా కాలేజీ ప్రిన్సిపాళ్లను బుధవారం ఆదేశించారు. వారితో ఆయన సమావేశం నిర్వహించారు. తరచూ ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తుతోందని అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మౌలిక వసతులు, సిబ్బంది కొరత వల్లే.. కాకతీయ మెడికల్ కాలేజీలో 19.06 శాతం బోధన సిబ్బంది కొరత ఉన్నట్లు గుర్తించారు. వార్డుల్లో వైద్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు గదుల్లేవు. కేంద్ర ప్రయోగశాల లేదు. 150 మంది విద్యార్థులు పరీక్ష రాసే సామర్థ్యమున్న గదుల్లో 250 మందిని కూర్చోబెడుతున్నారు. ఇక మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో 30.85 శాతం బోధన సిబ్బంది.. 17.02 శాతం రెసిడెంట్ వైద్యుల కొరత ఉంది. నర్సులు, పారామెడికల్ సిబ్బంది కొరత 10.15 శాతం ఉంది. ఐదేళ్ల అనుభవమున్న వారినే మెడికల్ సూపరింటెండెంట్‌గా నియమించారు. గతంలో ఉస్మానియా, నిజామాబాద్ మెడికల్ కాలేజీల్లోనూ లేబొరేటరీ, లైబ్రరీ, సిబ్బంది, మౌలిక సదుపాయాల వంటివి లేకపోవడంతో ఎంసీఐ సీట్ల పునరుద్ధరణకు అనుమతి ఇవ్వలేదు. అయితే అప్పట్లో లేఖ నేపథ్యంలో ఎంసీఐ అధికారులు ఉస్మానియా, నిజామాబాద్ కాలేజీ సీట్ల పునరుద్ధరణకు అనుమతిచ్చారు. -
ప్రముఖ వైద్యుడు ఏకే చారి కన్నుమూత
హైదరాబాద్: ఉస్మానియా మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ అచ్చి కృష్ణాచారి(87) గుండెపోటుతో బుధవారం కన్ను మూశారు. సికింద్రాబాద్‌లోని సెయింట్ జాన్స్ రోడ్లో నివాసముండే ఆయన కొంత కాలంగా హృద్రోగంతో బాధపడుతున్నారు. బుధవారం ఉదయం హఠాత్తుగా గుండెనొప్పి రావడంతో మృతిచెందారు. ఆయనకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఏకే చారి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేయడంతో పాటు పాథాలజీ సర్జరీలో గోల్డ్ మెడల్‌ను సాధించారు. ధూల్‌పేట్ ప్రాంతంలో వైద్య వృత్తిని ఆరంభించారు. గాంధీ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. కర్నూల్ మెడికల్ కళాశాలలో సర్జరీ ప్రొఫెసర్‌గా, గాంధీ ఆస్పత్రిలో సర్జరీ విభాగం హెచ్వోడీగా, ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించి 1983లో గాంధీ ఆస్పత్రిలో పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు. పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆయన వైద్య సేవలు అందించారు. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రతినిధిగా రష్యా, యూకే, యూఎస్ఏలలో కూడా పర్యటించారు. గురువారం బన్సీలాల్‌పేటలోని శ్మశానవాటికలో ఏకే చారి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఏకే చారి నివాసానికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. -
పేలిన ట్రాన్స్ఫార్మర్..తప్పిన ప్రమాదం
హైదరాబాద్ : కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాల సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా పేలింది. ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు ఎగసిపడి కాలిపోయింది. అయితే, ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవటంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. -
ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షలు
♦ బస్సు ప్రమాదంలో మరణించిన మెడికోల కుటుంబాలకు పరిహారం ♦ సీడీఎస్ నిధుల నుంచి చెల్లించనున్నట్టు డీఎంఈ వెల్లడి హైదరాబాద్: ఇటీవల బస్సు ప్రమాదంలో మృతిచెందిన నలుగురు ఉస్మానియా మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ(సీడీఎస్) నిధుల నుంచి రూ.7 లక్షల చొప్పున పరిహారంగా అందజేయాలని నిర్ణయిం చినట్టు తెలంగాణ డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ), సీడీఎస్ చైర్మన్ డాక్టర్ రమణి వెల్లడించారు. విద్యార్థుల వరుస ఆందోళనలతో స్పందించిన డీఎంఈ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉస్మానియా వైద్య కళాశాలలో జరిగిన సీడీఎస్ సమావేశంలో డీఎంఈతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్, ప్రొఫెసర్లు డాక్టర్ బాబూరావు, డాక్టర్ నాగేందర్, సిబ్బంది, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. సమావేశం ఆనంతరం డీఎంఈ రమణి మాట్లాడుతూ ఈ నెల 14న జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వైద్య విద్యార్థులు జి.లక్ష్మణ్, మోకా విజయ్‌తేజ, మచ్చ ప్రణయ్రాజారాం, వదనాల ఉదయ్ కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించామన్నారు. సీడీఎస్‌లో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్, వైద్య మంత్రి లక్ష్మారెడ్డి, ముఖ్యకార్యదర్శి తివారీ దృష్టికి తీసుకువెళ్లి మంగళవారం సాయంత్రంలోగా విద్యార్థుల కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేస్తామని చెప్పారు. ఉస్మానియా వైద్య కళాశాలలో పనిచేస్తున్న టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది ఒకరోజు వేతనాలను విరాళంగా ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు. గాంధీ వైద్య కళాశాల, కాకతీయ వైద్య కళాశాల అధ్యాపకులు, సిబ్బంది సైతం విరాళాలు అందజేసేందుకు ముందుకొచ్చారన్నారు. వచ్చే ఏడాది నుంచి కళాశాల టాపర్స్‌కు మృతిచెందిన విద్యార్థుల పేరు మీద గోల్డ్ మెడల్స్ అంజేస్తామని ప్రకటించారు. కాగా, ఉస్మానియా వైద్య కళాశాల ఎస్పీఎం హెచ్‌వోడీ డాక్టర్ బాబూరావు విద్యార్థుల కుటుంబాలకు తన వంతుగా లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించి చెక్కును కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్‌కు అందజేశారు. డీఎంఈ రమణి కూడా రూ.10 వేల విరాళాన్ని ప్రకటించారు. కొనసాగిన విద్యార్థుల ఆందోళన.. బస్సు ప్రమాదంలో మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కోఠి ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థుల ఆందోళన కొనసాగింది. విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. తరగతి గదులకు తాళాలు వేసి కళాశాల ప్రధాన ద్వారం వద్ద మృతిచెందిన విద్యార్థుల చిత్రపటాలను పెట్టి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. సీడీఎస్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను డీఎంఈ రమణి విద్యార్థులకు స్వయంగా వివరించడంతో వారు తమ నిరసన విరమించారు. -
వైద్య విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్: కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు సోమవారం తరగతులు బహిష్కరించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మెడికోల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగారు. ఇటీవల విజయవాడ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో నలుగురు వైద్య విద్యార్థులు చనిపోయిన సంగతి తెలిసిందే. -
సంతాపం.. ఉద్రిక్తం
ఆగ్రహించిన ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు డీఎంఈ, ప్రిన్సిపాల్ నిర్బంధం హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతిచెందిన వైద్య విద్యార్థుల సంతాప సభ ఉద్రిక్తంగా మారింది. ఉద్వేగానికి లోనైన విద్యార్థులు ఉస్మానియా వైద్య కళాశాల డీఎంఈ, ప్రిన్సిపాల్‌ను నిర్బంధించారు. మీ నిర్లక్ష్యం కారణంగానే తమ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన గిరిలక్ష్మణ్, ఉదయ్, విజయ్‌తేజ, ప్రణయ్రాజారామ్కు నివాళులర్పిస్తూ శనివారం ఉస్మానియా వైద్య కళాశాలలో సంతాప సభ ఏర్పాటు చేశారు. డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ రమణి, కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్, అలుమిని అధ్యక్షుడు గోపాలకృష్ణ, మాజీ డీఎంఈ పి.శ్రీనివాస్, నిమ్స్ మాజీ డెరైక్టర్ రాజిరెడ్డితో పాటు మృతుడు ప్రణయ్రాజారామ్ తల్లిదండ్రులు శ్రీనివాస్‌మూర్తి, నిర్మల హాజరయ్యారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. భగ్గుమన్న విద్యార్థులు... ఈ సందర్భంగా డీఎంఈ రమణి మాట్లాడుతూ... చనిపోయిన విద్యార్థులు తన పిల్లలతో సమానమన్నారు. వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా వచ్చేలా ప్రభుత్వానికి విన్నవిస్తామన్నారు. ఈ బడ్జెట్లో కళాశాల అభివృద్ధికి రూ.63 కోట్లు కేటాయించారని, వాటితో బస్సులు ఇతర అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ప్రిన్సిపాల్ ప్రభాకర్ కూడా ఇదే తరహాలో ప్రసంగించడంతో విద్యార్థులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. వారితో పాటు మాజీ డీఎంఈ, అధ్యాపకులను ఆడిటోరియం తలుపులు మూసేసి నిర్బంధించారు. తోటి విద్యార్థులను ఎంతో మిస్సయ్యామని, శవాలపై రాజకీయం చేస్తున్నారే తప్ప వారి కుటుంబాల గురించి ఆలోచించడం లేదని కన్నీరు పెడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ స్నేహితులను కోల్పోయామన్నారు. నాడు కోట్ల రూపాయలు కళాశాల అభివృద్ధికి ఖర్చు చేసినవారికి బస్సుల గురించి ఎందుకు గుర్తుకు రాలేదని నిలదీశారు. తమ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పేవరకూ అధికారులెవరినీ బయటకి కదలనిచ్చేది లేదని పట్టుబట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడికి వచ్చిన పోలీసులను సైతం విద్యార్థులు వెళ్లిపోవాలని కోరడంతో వారు బయట బందోబస్తుకే పరిమితమయ్యారు. దాదాపు ఐదు గంటలపాటు అధికారులను నిర్బంధించారు. కేసీఆర్‌కు చికిత్స చేయాల్సిందీ వైద్యులే ప్రణయ్ తల్లిదండ్రులు నలుగురు వైద్య విద్యార్థులు చనిపోతే తెలంగాణ సీఎం కేసీఆర్ కనీసం స్పందించలేదని మృతుడు ప్రణయ్ తల్లిదండ్రులు నిర్మల, శ్రీనివాస్‌మూర్తి ఆరోపించారు. రేపు ఆయనకేమన్నా అయితే వైద్యులే చికిత్సలందించాలన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి కేవలం ఫొటోలకే ఫోజులిచ్చారని, కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించలేదన్నారు. చిన్నచిన్న స్కూళ్లు కూడా మంచి బస్సులు పెట్టుకుంటుంటే దేశంలోనే ప్రతిష్టాత్మక కళాశాలకు బస్సు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనన్నారు. ప్రమాదానికి కారణమైన ట్రావెల్స్ యాజమాన్యంపై చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము ఎక్స్‌గ్రేషియా కోసం రాలేదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలియజెప్పడానికే వచ్చామన్నారు. -
ఇంతలోనే అంత విషాదమా !
రోడ్డు ప్రమాదంలో ‘ఉస్మానియా’ మెడికోల దుర్మరణం కిమ్స్ మెడికల్ కళాశాలలో విషాదం ఘన నివాళి అర్పించిన వైద్య విద్యార్థులు, వ్యాయామోపాధ్యాయులు విజయవాడ వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన బస్సు ప్రమాదం అమలాపురం కిమ్స్ కళాశాల వైద్య విద్యార్థుల్లో విషాదాన్ని నింపింది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వైద్య, దంతవైద్య కళాశాలల విద్యార్థులకు.. కిమ్స్ కళాశాలలో ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకూ క్రీడా పోటీలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పోటీల్లో పాల్గొని, తిరుగు పయనమైన హైదరాబాద్ ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థుల బస్సు.. విజయవాడ వద్ద ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ముందు రోజు వరకూ తమతో కలసి ఉత్సాహంగా ఆటలాడిన ‘ఉస్మానియా’ వైద్య విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారని.. వారిలో నలుగురు అసువులు బాశారని తెలిసి.. కిమ్స్ విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. మృతుల కుటుంబాలకు కళాశాల యాజమాన్యం ప్రగాఢ సంతాపం తెలిపింది. అమలాపురం/ అమలాపురం రూరల్ : ఐదారు రోజుల పాటు కళ్ల ముందు ఉత్సాహంగా ఆటలాడిన సహచర విద్యార్థులు తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడం వైద్య విద్యార్థుల్లో అంతులేని విషాదాన్ని నింపింది. మెడికోలు సొంత ఇళ్లకు సంతోషంగా బయలుదేరిన రోజునే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడాన్ని కిమ్స్ యాజమాన్యం, వ్యాయామోపా ధ్యాయులు జీర్ణించుకోలేకపోతున్నారు. విజయవాడ సమీపంలో గొల్లపూడి వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన నలుగురు వైద్య విద్యార్థులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. అమలాపురం కిమ్స్‌లో ఈనెల 10 నుంచి 13 వరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో 19వ ఉభయ తెలుగు రాష్ట్రాల మెడికల్, డెంటల్ కాలేజీ విద్యార్థుల స్పోర్ట్స్ మీట్ జరిగిన విషయం తెలిసిందే. ఆది వారం మధ్యాహ్నం ఆటలు ముగియడంతో ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు కోనసీమ అందాలను తిలకించేందుకు వెళ్లారు. యానాం, ఎదుర్లంకతోపాటు పలు ప్రాంతాలను సందర్శించారు. ఆదివారం రాత్రి బయలుదేరాల్సిన విద్యార్థులు కిమ్స్‌లోనే బసచేసి సోమవారం ఉదయం బయలుదేరారు. రాత్రి జరిగిన దుర్ఘటనలో వీరు మృత్యువాత పడ్డారని తెలిసి కిమ్స్‌లో ఒక్కసారిగా విషాదం అలముకుంది. క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ‘ఉస్మానియా’ విద్యార్థులు అన్ని పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మృత్యువాత పడిన మేకా విజయతేజ, గిరి లక్ష్మణ్, వి.ఉదయ్, ప్రణయ్రాజారామ్లు వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొన్నారు. బాస్కెట్‌బాల్‌లో యూనివర్సిటీ జట్టు రన్నర్‌గా నిలి చింది. కబడ్డీ పోటీల్లో ఓటమి చెందినా వీరు ఆడిన తీరు క్రీడాభిమానులను ఆకట్టుకుంది. ఇలా కళ్ల ముందు నడియాడిన తమ సహచర విద్యార్థులు మృతి చెందడంతో కిమ్స్ వైద్య విద్యార్థులు కలత చెందారు. విద్యార్థుల మృతికి కిమ్స్ యాజమాన్యం ప్రగాఢ సంతాపం తెలిపింది. కిమ్స్‌లో మంగళవారం డీన్ ఏఎస్ రాజ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సంతాపసభలో వైద్య విద్యార్థులు నివాళులర్పించారు. వైస్ ప్రిన్సిపాల్ జీకేవీ ప్రసాద్, డాక్టర్ ఆనందాచార్య, వైస్ ప్రెసిడెంట్ మోహన్‌రాజు, సీఏవో రఘులు సంతాపం తెలిపిన వారి లో ఉన్నారు. క్రీడా పోటీల్లో అంపేర్లుగా సేవలందించిన వ్యాయామోపాధ్యాయు లు ఈ సంఘటన పట్ల తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పీఈటీలు పప్పుల శ్రీరామచంద్రమూర్తి (రాంబా బు), వాసంశెట్టి హరిబాబు, గోలకోటి నారాయణరావు, ఉండ్రు ముసలయ్య, కె.నాగరాజు, ఐ.భీమేష్, పి.విఘ్నేశ్వరుడు, కె.సత్యనారాయణ, కె.ఆదిలక్ష్మి, వి.నరసింహారావు, ఎంజీ రామారావు, సత్యానందం, కె.వెంకటేశ్వరరావు, వై.ఎస్.వి.రమణారావు తదితరులు సంతాపం తెలిపినవారిలో ఉన్నారు.