
హైదరాబాద్‌లో 9% మందికి ‘థైరాయిడ్’!
హైపోథైరాయిడిజమ్ పీడితుల్లో భాగ్యనగరమే టాప్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రధాన పట్టణాల్లో థైరాయిడ్ సమస్యలు బాగా పెరుగుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, గోవా, ముంబై, అహ్మదాబాద్‌లలో నిర్వహించిన ఈ అధ్యయనంలో.. 11 శాతం మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. ఈ వివరాలను బుధవారం హైదరాబాద్‌లో ఉస్మానియా మెడికల్ కాలేజీ ఎండోక్రైనాలజిస్ట్ రాకేశ్‌కుమార్ సహాయ్ మీడియాకు తెలిపారు. 5,360 మంది రక్త నమూనాలను పరీక్షించగా.. 10.95 శాతం మంది హైపో థైరాయిడిజమ్ (థైరాయిడ్ గ్రంథి తక్కువస్థాయిలో పనిచేయడం)తో బాధపడుతున్నారని తెలిసిందని వివరించారు. హైదరాబాద్‌లో వీరి సంఖ్య 9 శాతం ఉందని.. మిగతా నగరాలతో కంటే ఇక్కడే వీరి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు.