Thyroid
-
గాయిటర్ అంటే...? లక్షణాలు, చికిత్స!
మన శరీరంలో అనేక గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులలో థైరాయిడ్ గ్రంథి చాలా కీలకమైనది. మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకృతిలో శ్వాసనాళానికి రెండువైపులా ఉండే ఈ గ్రంథి థైరాయిడ్ హార్మోన్లను విడుదల చేస్తుంది. కొందరిలో ఈ గ్రంథి చాలా పెద్ద సైజుకు పెరిగిపోతుంది. ఇలా థైరాయిడ్ గ్రంథి అసాధారణమైన సైజుకు పెరగడాన్ని ‘గాయిటర్’ అంటారు. గాయిటర్ రకాలు... ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి డిఫ్యూస్ గాయిటర్, రెండోది నాడ్యులార్ గాయిటర్. సాధారణ పరిమాణం కంటే థైరాయిడ్ గ్రంథి ఉబ్బిపోయి ఇరువైపులా సమానంగా పెరగడాన్ని ‘డిఫ్యూస్ గాయిటర్’గా పరిగణిస్తారు. ఇక రెండోది ‘నాడ్యులార్ గాయిటర్’. ఈ నాడ్యులార్ గాయిటర్‌లో థైరాయిడ్ గ్రంథిలోని ఏదైనా ఒక భాగంలో ఒకటి లేదా ఇంకా ఎక్కువ సంఖ్యలో గడ్డలు ఏర్పడతాయి. థైరాయిడ్ గ్రంథిలో ఇలా గడ్డలు పెరగడాన్ని నాడ్యులార్ గాయిటర్ అంటారు. గాయిటర్ సమస్య వచ్చిన కొంతమందిలో సాధారణంగా థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో ఎలాంటి మార్పులూ కనిపించవు. కానీ మరికొందరిలో మాత్రం థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువగా గానీ లేదా తక్కువ మోతాదులోగానీ ఉత్పత్తి అవుతుంటాయి. ఒకవేళ హార్మోన్ల ఉత్పత్తి మోతాదులు పెరిగితే దాన్ని ‘హైపర్ థైరాయిడిజం’ అనీ, తగ్గితే ‘హైపోథైరాయిడిజమ్’ అని అంటారు. హైపర్ థైరాయిడిజమ్‌లో జీవక్రియల వేగం పెరగడంతో బాధితులు సన్నబారిపోవడం, హైపో థైరాయిడిజమ్‌లో జీవక్రియలు మందగించడంతో బాధితులు లావెక్కడం అనే ప్రధాన లక్షణాలతో పాటు మరికొన్ని సమస్యలు కనిపిస్తాయి. నిర్ధారణ పరీక్షలు... గొంతు దగ్గర బాగా ఉబ్బి కనిపించడం అనే పైకి కనిపించే లక్షణంతో దీన్ని కొంతవరకు నిర్ధారణ చేసినప్పటికీ... పూర్తి నిర్ధారణ కోసం థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్షలైన టీ3, టీ4, టీఎస్‌హెచ్, అల్ట్రాస్కాన్, ఎఫ్ఎన్ఏసీ వంటివి అవసరమవుతాయి. చికిత్స...థైరాయిడ్ సమస్య నిర్ధారణ కోసం చేసే పరీక్షల ఫలితాల ఆధారంగా గాయిటర్ చికిత్సకు ఎండోక్రైనాలజిస్ట్ ఆధ్వర్యంలో తగిన చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇప్పటికి అందుబాటులో ఉన్న వైద్యపరిజ్ఞానంతో థైరాయిడ్ వ్యవస్థను సరిచేయడం ద్వారా కొంతమందిలో థైరాయిడ్ గ్రంథి వాపు (గాయిటర్) తగ్గుముఖం పడుతుంది. కాబట్టి ఇలాంటి రోగులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డా. వ్రిందా అగర్వాల్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ -
అరుదైన జబ్బుతో అర్జున్ కపూర్ : ఎమోషనల్ కామెంట్స్,అంత ప్రమాదకరమా?
నటి మలైకా అరోరా, బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్(Arjun Kapoor) ఇద్దరూ ఒకరి కోసం ఒకరం అన్నంతగా చెట్టా పట్టాలేసుకుని తిరిగిన ప్రేమజంట. ఏమైందో తెలియదు గానీ, ఇటీవల వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. తాజాగా అర్జున్ కపూర్ తన ఆరోగ్యంపై కీలక విషయాన్ని వెల్లడించాడు. నిద్ర పట్టక ఇబ్బంది పడేవాడినంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. హాషిమోటోస్ థైరాయిడిటిస్ ((Hashimoto's disease) అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో తాను బాధపడుతున్నట్లు అర్జున్ కపూర్ వెల్లడించారు. ఇది థైరాయిడ్ తరువాత స్టేజీ అని, రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని పేర్కొన్నాడు. ఇది బరువు పెరగడానికి అది కూడా కారణం కావచ్చునని అన్నాడు. తాను లావుగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి మరింత పెరిగి అందరికీ దూరంగా ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్ట పడేవాడినని చెప్పాడు.‘‘సింగం ఎగైన్’’ మూవీ సమయంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, మానసికంగా, శారీరకంగా. నేను ఎంత డిప్రెషన్లో ఉన్నానో లేదో నాకు తెలియదు. అసలు ఈ సినిమా చేయాలా వద్దా ? నన్ను జనాలు ఆదరిస్తారా? లేదా? అనే అనుమానం పీడించేది. కానీ నాకు ఈ సినిమా పునర్జన్మ నిచ్చింది’’. కరియర్లో వరుస ఫ్లాప్‌లో ఇబ్బందిపడుతున్న తరుణంలో డైరెక్టర్ రోహిత్ శెట్టి, అర్జున్ కపూర్ కాంబోలో వచ్చిన 'సింగం ఎగైన్' మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రధాన విలన్ "డేంజర్ లంక" పాత్రతో అర్జున్ కపూర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. మలైకా, అర్జున్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. 2019లో, వారు సోషల్ మీడియాలో తమ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించారు. ఇటీవల ఇద్దరూ విడిపోయినట్టు ధృవీకరించారు. అసలేంటీ హషిమోటో వ్యాధి,ఎలా వస్తుంది?హషిమోటో వ్యాధికి ఖచ్చితమైన కారణాలపై స్పష్టతలేనప్పటికీ, జన్యు, పర్యావరణ , హార్మోన్ల అసమతుల్యత , జీవనశైలి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.ఫ్యామిలీలో థైరాయిడ్ లేదా ఆటో ఇమ్యూన్ వ్యాధుల ఉంటే రావచ్చు. పురుషుల కంటే స్త్రీలే దీనికి ఎక్కువ గురయ్యే అవకాశ ఉంది. బహుశా హార్మోన్ల ప్రభావాల వల్ల కావచ్చు.ఏ వయసులోనైనా సంభవించవచ్చు, అయితే సాధారణంగా మధ్య వయస్కులలో బయటపడుతుంది.పర్యావరణ కారకాలు: అయోడిన్ అధికంగా తీసుకోవడం, రేడియేషన్‌కు గురికావడం లేదా ఇన్ఫెక్షన్లు.ఒత్తిడి , జీవనశైలి: దీర్ఘకాలిక ఒత్తిడి, పోషకాహారం లోపం లక్షణాలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. జీవక్రియ, గుండె పనితీరు, జీర్ణక్రియలో సమస్యలు, కండరాలపై పట్టు కోల్పోవడం, మెదడు పనితీరులో లోపాలు అలసట,బలహీనత,బరువు పెరుగటం తరచుగా డిప్రెషన్, ఆందోళన , మూడ్ స్వింగ్స్చలిని తట్టుకోలేకపోడం , కండరాలు , కీళ్ల నొప్పులుమలబద్ధకం, ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయిచికిత్ససాధారణ థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను పునరుద్ధరించడానికి , అలసట మరియు బరువు పెరగడం వంటి లక్షణాలను తగ్గించడానికి థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని వాడతారు.థైరాయిడ్పనితీరును క్రమం తప్పకుండాపర్యవేక్షించుకోవాలి. అవసరం మేరకు మందుల మోతాదును సర్దుబాటు చేసుకోవాలి.సెలీనియం, జింక్ సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలి.ఒత్తిడికి దూరంగా ఉండేలా మెడిటేషన్, యోగా లాంటివి చేయాలి.థైరాయిడ్ ఆరోగ్యానికి తోడ్పడతాయి, అయినప్పటికీ అధిక అయోడిన్‌ను నివారించాలి. తగిన వ్యాయామం చేయాలిరోజుకు కనీసం 6 గంటల నిద్రం ఉండేలా జాగ్రత్త పడాలి.నోట్: ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. థైరాయిడ్ సమస్య ఉన్నట్టు అనుమానం ఉన్న వారు వెంటనే వైద్యుడిని సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలి. -
World thyroid day 2024 : థైరాయిడ్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం
#World thyroid day 2024: మే 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. థైరాయిడ్ వ్యాధి, ఆరోగ్యం చూపే ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు ఈరోజు.ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం 2024: థీమ్నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (NCDలు), థైరాయిడ్ సమస్యలు ప్రపంచ ఆరోగ్య ఆందోళనలో గణనీయమై పాత్ర పోషిస్తున్నాయనే వాస్తవాన్ని తెలియ జేయడం.ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం 2024: చరిత్ర1965లో యూరోపియన్ థైరాయిడ్ అసోసియేషన్ స్థాపన, ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం మొదలైంది. ఆ తరువాత థైరాయిడ్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ (TFI) 2007లో మే 25వ తేదీని ప్రపంచ థైరాయిడ్ దినోత్సవంగా ప్రకటించింది.థైరాయిడ్ వ్యాధిమెడ దిగువన సీతాకోకచిలుక ఆకారంలో ఉండే చిన్న గ్రంథి పేరే థైరాయిడ్. ఇది ముఖ్యమైన రెండు హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అవి థైరాక్సిన్ (టి 4), ట్రైయోడోథైరోనిన్ (టి 3). ఈ రెండు హార్మోన్లు హార్మోన్లు జీవక్రియ, పెరుగుదల, అభివృద్ధి, పునరుత్పత్ తిసమస్య సహా అనేక సమస్యలకు దారితీస్తుంది.ఆ గ్రంథి ఈ హార్మోన్లను తగినంతగా లేదా అధిక మొత్తంలో ఉత్పత్తి చేసినప్పుడు థైరాయిడ్ రుగ్మతలు తలెత్తుతాయి. హార్మోన్ల ఉత్పత్తి తగ్గితే హైపోథైరాయిడిజం అని, అధికమైతే హైపర్ థైరాయిడిజం అని రెండు రకాలుగా ఈ వ్యాధిని నిర్ధారిస్తారు.హైపోథైరాయిడిజం: అలసట, బరువు పెరగడం , నిరాశ వంటి లక్షణాలుంటాయి.హైపర్ థైరాయిడిజం: బరువు తగ్గడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన వంటి లక్షణాలు.థైరాయిడ్ కేన్సర్: థైరాయిడ్ గ్రంధిలో ప్రాణాంతక పెరుగుదల కేన్సర్‌కు దారతీయవచ్చు.గోయిటర్: తరచుగా మెడలో వాపుగా కనిపిస్తుంది, హైపో- లేదా హైపర్ థైరాయిడిజంలోనే ఇది కనిపిస్తుంది. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయాలంటేచక్కటి జీవన శైలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చాలా అసవరం. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు అందేలా చూసుకోవాలి.వ్యాయామం చాలా అవసరం. ఎలాంటి వ్యాధులు దాడి చేయకుండా ఉండాలంటే క్రమం తప్పని వ్యాయామం ముఖ్యం. వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, డ్యాన్స్,యోగా ఇలా ఏదో ఒక వ్యాయామాన్ని కనీసం అరగంటలు పాటు చేయాలి. తద్వారా హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం రెండింటినీ అదుపులో ఉంచుకోవచ్చుథైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి మద్దతిచ్చే ఆహారంపై శ్రద్ధపెట్టాలి. ముఖ్యంగా సెలీనియం కీలకమైంది.బ్రెజిల్ నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, సీఫుడ్,గుడ్లు, తృణధాన్యాలలో సెలీనియం పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఒత్తిడికి దూరంగా ఉండాలి, రోజులకు కనీసం ఎనిమిది గంటల కూడా చాలా అససరం. ఒక్కసారి థైరాయిడ్ ఉంది అని తెలిస్తే వైద్య సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. ఎలాంటి అపోహలను, అవాస్తవాలను నమ్మకుండా నిపుణుల సలహాలను పాటించాలి. -
థైరాయిడ్ ఉంటే అన్నం తినకూడదా?
థెరాయిడ్ ఇటీవల చిన్నా, పెద్ద అందర్నీ వేధిస్తున్న సమస్య ఇది. దీని వల్ల ఎదురయ్యే సమస్యలు అంత ఇంత కాదు. విపరీతంగా బరువు పెరిగిపోయి నలుగురిలో తిరిగేందుకు ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా మహిళలకు ప్రెగ్నెన్సీ విషయంలో పలు సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే ఈ థెరాయిడ్ ఉన్నవారు అస్సలు అన్నమే తినకూడదంటున్నారు నిపుణులు. ఇదేంటి అన్నమే మనకు శక్తినిచ్చేది అలాంటి అన్నమే వద్దంటే ఎలా? అసలు థెరాయిడ్ ఉన్నవారు ఎందుకు అన్నం తికూడదు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా!. కొందరూ అన్నాన్నే మూడు పూటలా తింటుంటారు. ఇందులో కార్భోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నందున మనల్ని శక్తివంతంగా ఉంచుతుంది. అలాగని ఇలా ఎక్కువగా తింటే మాత్రం అమాంతం బరువు పెరుగుతారు. నిజానికి డైటింగ్ చేసి బరువు తగ్గాలనుకునేవారే అన్నాన్ని తక్కువగా తీసుకుంటారు. అయితే థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా అన్నాన్ని ఎక్కువగా తీసుకోకూదట. ఒకవేళ అన్నం తినాలనుకున్నా వైట్‌రైస్ అస్సలు వద్దంటున్నారు నిపుణులు. దాని బదులు బ్రౌన్‌రైస్ తీసుకోమని సూచిస్తున్నారు. బియ్యంలో గ్లూటెన్ ప్రోటీన్ ఉంటుంది. ఇది సమస్యను మరింత పెంచుతుంది. అందుకే థైరాయిడ్ రోగులు అన్నం తినకూడదని చెప్తుంటారు. గ్లూటెన్ మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది శరీరంలో ప్రతిరోధకాలను తగ్గించి, థైరాక్సిన్ హార్మోన్ సమస్యలను కూడా కలిగిస్తుంది. అందుకే అన్నాన్ని అతిగా తినకూడదని చెబుతున్నారు నిపుణులు. అదీగాక అన్నంలో ఉండే పిండి పదార్థం త్వరగా జీర్ణమవుతుంది. దీంతో మనకు చాలా త్వరగా ఆకలిగా అనిపిస్తుంది. ఇంకేముంది కడుపు నిండేదాక ఆబగా తింటుంటాం. కానీ ఇది బరువును అమాంతం పెంచుతుంది. ఈ కారణంగానే థైరాయిడ్ రోగులను అన్నం తినొద్దని అంటారు. నిపుణులు ఏమంటున్నారంటే.. థెరాయిడ్ రోగులు అన్నం ఇలా ఎక్కువగా తింటే థైరాయిడ్ తో పాటుగా టైప్ -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. బియ్యంలో ఉండే కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం తదితర పరిమాణలు ఎక్కువుగా ఉంటాయి. అందుకే థైరాయిడ్ పేషెంట్లు అన్నం తినకూడదని చెబుతున్నారు. ఒకవేళ తినాలనుకున్నా బాగా నానబెట్టి వార్చి తినడం మంచిది. ఇలా చేస్తే గంజి రూపంలో బియ్యంలో ఉంటే కొన్ని విటమిన్లు వెళ్లిపోతాయి. కాస్త బెటర్‌గా ఉంటుంది. ఇక అలానే నానబెట్టి వండుకోవడానికే ప్రాముఖ్యత ఇవ్వండి. మరీ ముఖ్యంగా ఆర్గానిక్ రైస్‌కి ప్రిఫెరెన్స్ ఇవ్వండి. అదే సమయంలో తగు మోతాదులో తినేందుకు యత్నించండి. అంటే ఇక్కడ రైస్ క్వాంటిటీ తక్కువగానూ, కూర కంటెంట్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోమని చెబుతున్నారు. అన్నాన్ని ఎలా వండి తినాలి? అన్నం తినడం ఇష్టమైతే దీన్ని రకరకాల కూరగాయలతో మిక్స్ చేసి డైట్ లో చేర్చుకోవచ్చు. కానీ అన్నాన్ని చాలా తక్కువగా తినాలి. అన్నం తక్కువగా, కూరగాయలు ఎక్కువగా ఉండేట్టు చూసుకుంటే ఏ సమస్యా ఉండదు. అయితే మీ ఆహారంలో మార్పులు చేయడానికి ముందు ఖచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించండి. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చింది. ఈ సూచనలు, సలహాలు పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడని సంప్రదించి పాటించటం మంచిది. (చదవండి: రెడ్‌లైట్ థెరఫీతో షుగర్ తగ్గించొచ్చా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
ఆ పాఠమే చెప్పకపోయి ఉంటే..ఆ స్టూడెంట్ ప్రాణాలు..!
మన నేర్చుకున్న విద్య మనకే ఉపయోగపడితే ఆశ్చర్యం ఆనందరం రెండూ వస్తాయి. ఎన్ని విద్యలైనా.. కూటి కొరకే అంటారు. మరీ మనం నేర్చుకున్న విద్య మనకు ఉపయోగపడటం ఏమిటీ? మన అభ్యున్నతి కోసమే కదా ఇంత కష్టపడి చదువుకునేది అంటారా? నిజమే గానీ మనం నేర్చుకున్న విద్య ఆపదలో ఉన్నప్పుడూ లేదా ప్రాణాంతక వ్యాధుల బారిన పడినప్పుడూ ఉపయోగపడితే మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతుంది. అలాంటి అద్భుత ఘటనే ఓ స్టూడెంట్ విషయంలో చోటు చేసుకుంది. ఏం చేశాడంటే..? యూఎస్‌లో న్యూజెర్సీకి చెందిన 27 ఏళ్ల వైద్య విద్యార్థి సల్లీ రోహన్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. స్టడీలో భాగంతో ఓ రోజు థెరాయిడ్ను ఎలా అల్ట్రాసౌండ్ ద్వారా గుర్తించాలో భోదిస్తున్నారు ప్రోఫెసర్లు. థెరాయిడ్ గురించి బోధిస్తుండగా తనకు కూడా ఉందన్న అనుమానం సల్లీలో వచ్చింది . అనుహ్యంగా ఒక్కో విద్యార్థికి టెస్ట్ చేస్తూ.. సల్లీకు కూడా చేయగా థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నట్లు వెల్లడైంది. వెంటనే ఆయన డాక్టర్ని సంప్రదించమని ఆమెకు సలహ ఇచ్చారు. దీంతో ఆమె వైద్యులను సంప్రదించి వివిధ వైద్య పరీక్షలు చేయగా రిపోర్ట్‌లో పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్‌లో ఉందని తేలింది. అయితే సల్లీ థైరాయిడ్ సమస్యను సూచించే ఎలాంటి లక్షణాలను గానీ సమస్యలను గానీ ఫేస్ చెయ్యలేదు. ఇది నాలుగు ప్రాథమిక రకాల థైరాయిడ్ క్యాన్సర్లలో అత్యంత ప్రబలమైనది. అల్ట్రాసౌండ్ గురించి క్లాస్ జరగకపోతే గనుక తన వ్యాధిని కనుగొనకపోవచ్చని చెబుతోంది. సల్లీకి వచ్చిన థైరాయిడ్ క్యాన్సర్ శోషరస కణువుల వరకు విస్తరించి ఉన్నట్లు తేలింది. వెంటేనే ఆమె ఆరోగ్య ఖర్చులు కవరయ్యేలా భీమా చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకోవడవం ప్రారంభించింది. ముందుగా థైరాయిడ్ ప్రభావిత శోషరస కణువులను తొలగించే శస్త్ర చికిత్స చేయాలి తర్వాత రేడియో అయోడిన్ అనే ఒక రకమైన రేడియేషన్ థెరపీని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. కళాశాలలో ఆ క్లాస్ జరగడం ఆ స్టూడెంట్ వరం అయ్యింది. లేదంటే లాస్ట్ స్టేజ్ వరకు ఆ క్యాన్సర్‌ని గుర్తించి ఉండేవారు కాదు. పైగా ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోవాల్సి ఉండేది. మనం నేర్చకుంది ప్రాణాంతక సమస్యల నుంచి అనూహ్యంగా బయటపడేలా చేస్తే అంతకుమించిన ఆనందం మరోకటి లేదు కదా!. (చదవండి: ముక్కు క్యాన్సర్ అంటే..? దీని కారణంగా ఓ మహిళ మొత్తం ముక్కునే..) -
Health: థైరాయిడ్ క్యాన్సర్.. మహిళలతో పోలిస్తే పురుషులకే ముప్పు ఎక్కువ! లక్షణాలివే
ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలకూ, మరణాలకు గల ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి. 2020లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటి తొంభై లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని అంచనా. ప్రపంచమంతటి మరణాల్లో రెండో అతి ప్రధాన కారణం క్యాన్సర్. ఈ ప్రాణాంతక వ్యాధి వల్ల 2020లో దాదాపు 99 లక్షల మంది చనిపోయారు. ఈ కేసుల విషయంలో భారతదేశమూ మినహాయింపు కాదు. మన దేశంలోనూ ప్రతి ఏటా 13 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా, వీళ్లలో దాదాపు ఎనిమిది లక్షల మంది మరణిస్తున్నారు. క్యాన్సర్ కేవలం ఆరోగ్యానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇందులో సామాజిక, ఆర్థిక, మానవ హక్కులతో కూడిన సంక్లిష్టమైన అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఇతర క్యాన్సర్లతో పోలిస్తే థైరాయిడ్ క్యాన్సర్ ఇటీవల చాలా ఎక్కువగానే కనిపిస్తోంది. మన దేశంలో ఏటా 20,000 కంటే ఎక్కువగా థైరాయిడ్ కేసులు నమోదవుతుండగా... వీళ్లలో దాదాపు 4,000 మంది మృతిచెందుతున్నారు. సెప్టెంబరు నెల ‘థైరాయిడ్ క్యాన్సర్ అవగాహన మాసం’ కావడం వల్ల దీని గురించి అవగాహన పెంచుకోవడం మనందరి విధి. థైరాయిడ్ క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే శస్త్రచికిత్స, రేడియేషన్, అయోడిన్ వంటి చికిత్సలతో దీన్ని దాదాపుగా పూర్తిగా నయం చేయవచ్చు. ఇది మరీ ముదిరితే మరింత అధునాతనమైన, ప్రభావవంతమైన చికిత్సలూ అందుబాటులో ఉన్నాయి. ఈ సరికొత్త చికిత్స ప్రక్రియలన్నీ నిర్దిష్టంగా థైరాయిడ్ క్యాన్సర్‌నే లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాయి. కారణాలు: వంశపారంపర్యం అనే అంశం, కుటుంబ చరిత్ర, వయసు, లింగభేదం... వంటివి థైరాయిడ్ క్యాన్సర్‌కు కారణాల్లో కొన్ని. మార్చేందుకు వీలు కాని అంశాలివి. ఏ వయసువారికైనా థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. అయితే మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఈ క్యాన్సర్ ముప్పు ఎక్కువ. మరీ ముఖ్యంగా 60 నుంచి 70 ఏళ్ల వయసులో ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. (రోగ నిర్ధారణ సమయంలో దాదాపు 40 – 50 ఏళ్లవారిలో ఇదెక్కువగా కనిపించడం వైద్యులు చూస్తుంటారు). రేడియేషన్‌కు ఎక్స్పోజ్ కావడం, ఊబకాయం, ఆహారంలో అయోడిన్ మోతాదులు ఎక్కువగా ఉండటం వంటి అంశాలూ ఈ క్యాన్సర్‌కు కారణమని నిపుణుల అభిప్రాయం. లక్షణాలు: మెడ వద్ద బొడిపెలా కనిపించడం, కొన్ని సందర్భాల్లో అది వేగంగా పెరగడం, మెడ దగ్గర వాపు, మెడ ముందు భాగంలో నొప్పి, ఇది కొన్నిసార్లు చెవుల వద్దకు పాకడం, గొంతు బొంగురుబోవడం లేదా స్వరంలో రావడం, మింగడం కష్టంగా మారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జలుబు వంటి లక్షణాలే ఏమీ లేకుండా ఎడతెరపి లేకుండా దగ్గు రావడం వంటివి దీని లక్షణాల్లో కొన్ని. ఈ లక్షణాలు కేవలం థైరాయిడ్ క్యాన్సర్‌లోనే కాకుండా... గొంతు ప్రాంతంలో కనిపించే ఇతర క్యాన్సర్లలోనూ కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవడం అవసరం. చికిత్స: థైరాయిడ్ క్యాన్సర్ కనిపించినప్పుడు ప్రధానంగా థైరాయిడెక్టమీ శస్త్రచికిత్సతో థైరాయిడ్ గ్రంథిని తొలగిస్తారు. కణితి ఉన్నవైపు థైరాయిడ్ గ్రంథి భాగాన్ని తొలగించడంతో పాటు ఈ గ్రంథి వెలుపలి భాగంలో ఉన్న కణుతులకూ చికిత్స చేస్తారు. ఇది లింఫ్నోడ్స్కు విస్తరించినట్లు గమనిస్తే, అది విస్తరించిందని అనుమానించిన భాగాలన్నింటినీ శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు. అటు తర్వాత చికిత్సలు క్యాన్సర్ దశ మీద ఆధారపడి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రారంభ (టీ1 లేదా టీ2) దశల్లో... థైరాయిడెక్టమీ తర్వాత రేడియోధార్మిక అయోడిన్ (ఆర్ఏఐ) చికిత్స చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. చికిత్స తర్వాత మళ్లీ ఇదే క్యాన్సర్ పునరావృతమైన సందర్భాల్లో ‘రేడియో అయోడిన్’ చికిత్స ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలను రాబడతారు. ‘ఆర్ఏఐ’ చికిత్సను తరచుగా టీ3 లేదా టీ4 ట్యూమర్లకూ, అలాగే లింఫ్‌నోడ్స్ మీద కణుపులకూ, లేదా ప్రధాన ప్రాంతం నుంచి దూరంగా విస్తరించిన క్యాన్సర్లలోనూ ఇస్తుంటారు. శస్త్రచికిత్స ద్వారా తొలగింపునకు సాధ్యం కాని క్యాన్సర్ కణజాలాన్ని పూర్తిగా నాశనం చేయడమే ఈ చికిత్స లక్ష్యం. ఒకవేళ బాధితులు ‘ఆర్ఏఐ’కి ప్రతిస్పందించకపోతే... వెలుపలకు వ్యాధి వ్యాప్తిచెందిన భాగాలకు ‘బీమ్ రేడియేషన్ థెరపీ’, ‘టార్గెటెడ్ థెరపీ’ లేదా ‘కీమోథెరపీ’లతో చికిత్స చేయాల్సి ఉంటుంది. థైరాయిడ్ క్యాన్సర్ బాధితులు తమ వ్యక్తిగత ప్రొఫైల్‌ను, వ్యాధి సంబంధిత అంశాలను ఎప్పటికప్పుడు తమకు చికిత్స అందించే డాక్టర్‌కు తెలుపుతూ ఉండాలి. చికిత్స పూర్తయ్యాక కూడా దాదాపు జీవిత కాలమంతా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అవసరం. మొదట్లోనే క్యాన్సర్ లక్షణాలను గుర్తించి, సకాలంలో చికిత్స అందించడం అన్నది ఏ క్యాన్సర్‌లోనైనా మంచి ఫలితాలను ఇచ్చే అంశం. అందుకే క్యాన్సర్ల్పై పోరాటంలో ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని, మంచి సమన్వయంతో పనిచేస్తే ఫలితాలు కూడా అంతే బాగుంటాయి. బాధితుల ఆరోగ్యంలోనూ మంచి పురోగతి కనిపిస్తుంది. – డాక్టర్ పాలంకి సత్య దత్తాత్రేయ, డైరెక్టర్ అండ్ చీఫ్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ సర్వీసెస్, రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్, కార్ఖానా, సికింద్రాబాద్ చదవండి: Alzheimer: నాన్నల కంటే అమ్మల్లోనే ఈ సమస్య ఎక్కువ.. స్త్రీలలో రెండు ‘ఎక్స్’ క్రోమోజోములు! అందుకేనా ఇలా? -
గాయిటర్ సమస్యల్లో రకాలు... పరిష్కారాలు
మన శరీరంలో జరిగే అనేక జీవక్రియలకు గ్రంథుల నుంచి స్రవించే హార్మోన్లు అవసరం. అందులో థైరాయిడ్ గ్రంథి చాలా ముఖ్యమైనది. ఇది మెడ ముందు భాగంలో శ్వాసనాళానికి రెండువైపులా సీతాకోకచిలుక రెక్కల ఆకృతిలో ఉంటుంది. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రభావంతో థైరాయిడ్ గ్రంథి టీ3, టీ4 హార్మోన్లను వెలువరిస్తుంది. థైరాయిడ్ గ్రంథిలో అసాధారణ పెరుగుదలను గాయిటర్ అంటారు. ఇందులోనూ రెండు రకాలు ఉంటాయి.మొదటది డిఫ్యూస్ గాయిటర్, రెండోది నాడ్యులార్ గాయిటర్. థైరాయిడ్ గ్రంథి ఉబ్బిపోయి... ఇరువైపులా సమానంగా పెరగడాన్ని డిఫ్యూస్ గాయిటర్‌గా అంటారు. ఇక నాడ్యులార్ గాయిటర్‌లో థైరాయిడ్ గ్రంథికి ఒక భాగంలో ఒకటి లేదా మరిన్ని గడ్డలు ఏర్పడతాయి. ఇలా గడ్డల్లాంటివి పెరగడాన్ని నాడ్యులార్ గాయిటర్ అంటారు. గాయిటర్ సమస్య వచ్చిన కొందరిలో థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి సంబంధించి ఎలాంటి మార్పులూ ఉండవు. కానీ మరి కొందరిలో మాత్రం థైరాయిడ్ హార్మోన్ల స్రావంలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. అంటే... హార్మోన్స్రావాలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. హార్మోన్ల ఉత్పత్తి పెరిగితే ఆ కండిషన్‌ను హైపర్ థైరాయిడిజం అని, తగ్గితే హైపోథైరాయిడిజమ్ అని అంటారు. శరీరంలో అయోడిన్ లోపం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది. థైరాయిడ్‌కు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్షలైన టీ3, టీ4, టీఎస్‌హెచ్, యాంటీ థైరాయిడ్ యాంటీబాడీస్ వంటి పరీక్షలు చేసి, సమస్యను నిర్ధారణ చేస్తారు. ఫలితాలను బట్టి చికిత్స అవసరమవుతుంది. థైరాయిడ్ క్యాన్సర్ సమస్యను మినహాయించి... సాధారణంగా థెరాయిడ్ గ్రంథి వాపు (గాయిటర్) సమస్యను ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే నయం చేయవచ్చు. -
Health: రొమ్ము నుంచి నీరులాంటి స్రావాలా? అయితే..
మహిళల్లో కనిపించే కొన్ని సమస్యలు చాలా ఆందోళన కలిగిస్తాయి. ఉదాహరణకు రొమ్ముల్లో కనిపించే స్రావాలు క్యాన్సర్ కారణంగానా అని భయపెడతాయి. కానీ ఆ లక్షణం తప్పనిసరిగా క్యాన్సర్ వల్లనే కానక్కర్లేదు. బిగుతైన దుస్తుల వల్ల కూడా కావచ్చు. అలాగే తినగానే గర్భిణుల్లో ఇబ్బంది కలగవచ్చు. ఇలాంటి కొన్ని సమస్యలపై ఉండే సాధారణ అపోహలు తొలగించి, అవగాహన కలిగించే కథనాలివి... కొందరిలో రొమ్ము నుంచి నీరులాంటి స్రావాలు వస్తుంటాయి. ఈ కండిషన్‌ను గెలాక్టోరియా అంటారు. ఇలా జరుగుతున్నప్పుడు మహిళల్లో చాలా మంది దాన్ని క్యాన్సర్‌గా అనుమానించి, చాలా ఆందోళనకు గురవుతుంటారు. నిజానికి రొమ్ము నుంచి నీరు రావడానికి చాలా కారణాలుంటాయి. మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతున్నప్పుడూ, మెదడులో ఏమైనా కంతుల వల్లగానీ, హైపోథైరాయిడిజమ్ వల్ల గానీ, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుండటం వల్ల గానీ, లోదుస్తులు బాగా బిగుతుగా ఉన్నా, రొమ్ములో కంతులు ఉన్నా లేదా యాంటీ డిప్రెసెంట్ మందులు వాడుతున్నా, అవే కాకుండా మరికొన్ని రకాల మందుల్ని చాలాకాలంగా వాడుతున్నా కూడా రొమ్ముల్లో నీరు రావచ్చు. అయితే క్యాన్సర్‌లో కూడా ఇలా రొమ్మునుంచి స్రావాలు వస్తుండవచ్చు. అయితే... స్రావాలు కనిపించిన ప్రతిసారి అందుకు రొమ్ముక్యాన్సరే కారణం కాబోదు. అందుకే ఇలాంటి సమయాల్లో అనవసరంగా ఆందోళన చెందకుండా... తొలుత డాక్టర్‌ను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాలి. దానికి కారణం ఏమిటో నిర్దిష్టంగా తెలుసుకోవాలి. రొమ్ము పరీక్ష చేయించుకున్నప్పుడు ఏవైనా గడ్డలుగానీ, ఇన్ఫెక్షన్గానీ ఉన్నాయా అని చూడాలి. కొన్నిసార్లు రొమ్ము స్కానింగ్, మామోగ్రఫీ ప్రొలాక్టిన్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్, సీబీపీ, ఈఎస్ఆర్ వంటి పరీక్షలు అవసరం కావచ్చు. దానిలో బయటపడ్డ సమస్య లేదా కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. కొన్ని మందులను దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంటే మందుల్ని ఆపడం లేదా మార్చడం జరుగుతుంది. కొన్నిసార్లు సింపుల్‌గా దుస్తులను కాస్త వదులుగా వేసుకోవడం వల్లనే ఈ సమస్య తీరిపోవచ్చు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఆందోళన చెందకుండా డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. చదవండి: Health Benefits of Eating Dates: తీపిగా ఉండే ఖర్జూరాలు తరచుగా తింటున్నారా? ఈ విషయాలు తెలిస్తే! -
Neck Pain: టీనేజర్లలో మెడనొప్పి.. తగ్గాలంటే!
Neck Pain: సాధారణంగా టీనేజర్లలో మెడనొప్పి, నడుమునొప్పి లాంటి మధ్యవయస్కులకు వచ్చే ఆరోగ్య సమస్యలు అంతగా కనిపించకపోవచ్చుగానీ... అవి రాకపోవడం అంటూ ఉండదు. ఆ వయసులో వారికుండే కొన్ని రకాల లైఫ్‌స్టైల్ అలవాట్లూ (పోష్చర్కు సంబంధించినవి), ఇబ్బందులూ కారణం. ఉదాహరణకు... వారు స్కూళ్లూ/కాలేజీలలో చాలాసేపు అదేపనిగా కూర్చునే ఉండటం, సరైన పోష్చర్‌లో కూర్చోకపోవడం, బల్ల మీద ఉన్న కంప్యూటర్‌కూ, కుర్చీకీ మధ్య సరైన సమన్వయం లేకపోవడం లాంటి ఎన్నో అంశాల కారణంగా వాళ్లకూ మెడనొప్పి రావచ్చు. అలవాట్లు కాకుండా... ఇక ఆరోగ్య సమస్యల విషయాన్ని తీసుకుంటే... థైరాయిడ్ లోపాలు, చిన్నతనంలో వచ్చే (టైప్–1) డయాబెటిస్, విటమిన్ లోపాలు, జీవక్రియల్లో లోపాల వల్ల కూడా టీనేజర్లలో మెడనొప్పి వస్తుంటుంది. అలాగే దేహశ్రమ, ఒకే చోట కూర్చుని ఉండటం లాంటి విషయాలకు వస్తే... టీనేజర్లకు ఆ వయసులో కొందరికి వచ్చే స్థూలకాయం, సరైన వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతోనూ రావచ్చు. టీనేజర్లలో మెడనొప్పి నివారణకు చేయాల్సినవి. పై సమస్యల్లో ఏదైనా కారణమా అని మొదట చూసుకోవాలి. ఉదాహరణకు... ►స్కూల్ / కాలేజీలో కూర్చునే చోట... డెస్క్ అతడి ఎత్తుకు తగినట్లుగా ఉందో లేదో, అతడి ఎత్తుకు తగినట్లుగా పోష్చర్ ఉందో లేదో పరిశీలించుకోవాలి. కంప్యూటర్లపై పనిచేయడం లేదా వీడియో గేమ్స్ కోసం అదేపనిగా మెడను నిక్కించి ఉంచడం వల్ల ఆ భాగంలోని వెన్నుపూస ఎముకలూ, మెడ కండరాలపై తీవ్రమైన ఒత్తిడి పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. ►పోష్చర్ సరిగా లేనప్పుడు / కూర్చున్నప్పుడు వెన్నుతో పాటు, దేహంలోని కండరాల మీద పడాల్సిన విధంగా కాకుండా... ఒక్కోచోట ఎక్కువ ఒత్తిడి పడటం, మరికొన్ని చోట్ల సరిగా పడకపోవడం వంటి సమస్యలతో మెడనొప్పి, వెన్నునొప్పి రావచ్చు. అందుకే స్కూల్లో/కాలేజీలో లేదా ఇంట్లో చదువుల బల్ల / కంప్యూటర్ టేబుల్ వద్ద సరిగా (సరైన పోష్చర్‌లో) కూర్చుండేలా చూడాలి. వెన్నుపై సమాన భారం పడేలా నిటారుగా ఉండాలి. ఏదో ఒక వైపునకు ఒంగిపోకూడదు. ►స్థూలకాయం ఉన్న టీనేజీ పిల్లల్లో మెడనొప్పి సమస్య ఎక్కువ. టీనేజర్లలో ఒబేసిటీ తగ్గేలా చర్యలు తీసుకోవాలి. ఒబేసిటీ పెంచే జంక్‌ఫుడ్ /బేకరీ ఐటమ్స్ లాంటివి కాకుండా టీనేజర్లకు అన్ని పోషకాలూ, విటమిన్లు అందేలా సమతులాహారం ఇవ్వాలి. ►గతంలో టీనేజీ పిల్లలు వారి వయసుకు తగ్గట్లు బాగానే ఆటలాడేవారు. కానీ ఇటీవల వారు ఆటలాడటం తగ్గిపోయింది. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత అరుదుగా ఆడే ఆటలూ పూర్తిగా కరవైపోయాయి. దాంతో వెన్ను, దాని ఇతర ఎముకలకు తగినన్ని పోషకాలు అందకపోవడం వల్ల కూడా మెడనొప్పి రావడం ఇటీవల పెరిగింది. ►తగినంత వ్యాయామం లేని టీనేజర్లు... తమ దేహ శ్రమతో తమ సామర్థ్యం (స్టామినా) పెంచుకోకపోవడం వల్ల త్వరగా అలసిపోతుంటారు. వారి మెడ భాగపు కండరాలూ, అక్కడి వెన్నుపూసల సామర్థ్యం కూడా ఇందుకు మినహాయింపు కాదు. అందుకే పిల్లలు తగినంత వ్యాయామం చేయడం / ఆటలాడటం ద్వారా స్టామినా పెంచుకుంటే మెడనొప్పి వంటి సమస్యలూ తగ్గిపోతాయి. ►పిల్లల్లో విటమిన్–డి లోపం వల్ల కూడా మెడనొప్పి వస్తుంది. అంతేకాదు... వ్యాధి నిరోధకత తగ్గి... వయసు పెరిగే క్రమంలో డయాబెటిస్, క్యాన్సర్ వ్యాధుల రిస్క్ కూడా పెరుగుతుంది. అందుకే టీనేజీ పిల్లలు ఆరుబయట ఆడేలా చూడాలి. ►ఇలాంటి సూచనలు పాటించాక కూడా మెడనొప్పి వస్తుంటే... థైరాయిడ్ లేదా ఇతరత్రా వైద్య సమస్యలను గుర్తించడానికి డాక్టర్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించాలి. ఆ ఫలితాల ఆధారంగా సమస్యను సరిగా నిర్ధారణ చేసి, డాక్టర్లు తగిన చికిత్స అందిస్తారు. -డాక్టర్ వెంకటరామ్ తేలపల్లి, సీనియర్ పీడియాట్రిక్ ఆర్థోపెడీషియన్ -
థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలు పుట్టరని విన్నాను. నిజమేనా?
నాకు పెళ్లయి మూడేళ్లయింది. నా వయసు 29 ఏళ్లు. ఎత్తు 5.2, బరువు 48 కిలోలు. గత ఏడాది నాకు తొలికాన్పు ఏడోనెలలోనే జరిగింది. పుట్టిన పది రోజులకే పాప పోయింది. ఇప్పుడు నాకు నాలుగో నెల. తొలికాన్పులో తలెత్తిన పరిస్థితి మళ్లీ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు. – సుమతి, టెక్కలి సాధారణంగా గర్భస్థ శిశువు తొమ్మిది నెలలు నిండిన తర్వాత ఒక వారం వరకు పెరుగుతుంది. సక్రమంగా పీరియడ్స్ వచ్చేవారిలో చివరి పీరియడ్ అయిన మొదటి రోజు నుంచి లెక్కపెడితే, 280 రోజులు లేదా 40 వారాల సమయానికి డెలివరీ తేదీని (ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ–ఈడీడీ) నిర్ణయించడం జరుగుతుంది. దాదాపు 80 శాతం మందికి ఈడీడీ కంటే రెండు వారాల ముందే డెలివరీ జరుగుతుంది. కాన్పు నొప్పులు ఎవరికి ఎప్పుడు వస్తాయో చెప్పడం కష్టం. 36 వారాలకు ముందే కాన్పు కావడాన్ని ప్రీటెర్మ్ డెలివరీ అంటారు. సాధారణంగా 36–37 వారాల వరకు బిడ్డ ఊపిరితిత్తుల పనితీరు పూర్తిస్థాయిలో మెరుగుపడుతుంది. ఇంకా ముందే పుట్టడం వల్ల బిడ్డ ఊపిరితిత్తులు సరిగా ఎదగక బిడ్డ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, ఇన్ఫెక్షన్లు ఏర్పడి, సమయానికి సరైన వైద్య సహాయం అందకపోయినా, బిడ్డ చికిత్సకు సరిగా స్పందించకపోయినా బిడ్డకు ప్రాణాపాయం కలగవచ్చు. మీ పాప మరీ ఏడో నెలలోనే పుట్టడం వల్ల ఇబ్బంది అయినట్లుంది. గర్భాశయ ముఖద్వారమైన సర్విక్స్ చిన్నగా ఉన్నా, లూజ్‌గా ఉన్నా కొందరిలో బిడ్డ బరువు పెరిగే కొద్ది గర్భాశయం వదులై, నెలలు నిండకుండానే కాన్పు జరగవచ్చు. కొందరిలో యోనిలో ఇన్ఫెక్షన్లు, ఇంకా ఇతరేతరా తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, గర్భాశయం ఆకారంలో తేడాలు ఉంటే బైకార్నుయేట్ యుటెరస్, సెప్టేట్ యుటెరస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కొందరిలో 7–8 నెలలో కాన్పు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చదవండి: ఆ సమయంలో ఈ నాలుగూ మరింత ప్రమాదంలోకి నెట్టేస్తాయి.. జాగ్రత్త!! ఇప్పుడు మీకు నాలుగో నెల గర్భం కాబట్టి ఈ ప్రెగ్నెన్సీలో నెలలు నిండకుండా డెలివరీ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ముందు జాగ్రత్తగా స్కానింగ్‌లో గర్భాశయ ముఖద్వారం– అంటే సర్విక్స్ లెంగ్త్ తెలుసుకుంటూ ఉండటం ముఖ్యం. ఒకవేళ సర్విక్స్ లూజ్‌గా ఉన్నా, చిన్నగా ఉన్నా గర్భాశయ ముఖద్వారానికి యోనిభాగం ద్వారా సర్‌క్లాజ్ కుట్లు వేయడం జరుగుతుంది. వజైనల్ ఇన్ఫెక్షన్లు, యూరినరీ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ, వాటికి సరైన చికిత్స తీసుకోవడం, అలాగే గర్భాశయ కండరాలు కుంచించుకోకుండా ఉండటానికి ప్రొజెస్టిరాన్ ఇంజెక్షన్లు, మాత్రలు అవసరాన్ని బట్టి వాడటం, శారీరక శ్రమ లేకుండా విశ్రాంతిగా ఉండటం వంటి జాగ్రత్తలు డాక్టర్ సలహా మేరకు తీసుకుంటూ ఉండటం వల్ల చాలా వరకు నెలలు నిండకుండా జరిగే కాన్పులను అరికట్టవచ్చు. కాని, కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, గర్భాశయం పనితీరు, శరీరం తీరును బట్టి కొందరిలో ముందుగానే కాన్పు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు బిడ్డలో ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడటానికి 7–8 నెలలో స్టిరాయిడ్ ఇంజెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ సలహాను పాటిస్తూ, సరైన జాగ్రత్తలు తీసుకుంటూ, అన్ని సౌకర్యాలూ ఉన్న ఆస్పత్రిలో చెకప్ చేయించుకుంటూ ఉంటే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. ఒకవేళ ముందుగా పుట్టినా, సమయానికి ఇంక్యుబేటర్‌లో ఉంచి, సరైన చికిత్స ఇవ్వడం వల్ల, బిడ్డ చికిత్సకు స్పందించే తీరు బట్టి బిడ్డ ఆరోగ్యంగా బయటపడుతుంది. నేను థైరాయిడ్, పీసీఓడీ సమస్యలతో బాధపడుతున్నాను. నా వయసు 30 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. నా ఎత్తు 5.1, బరువు 75 కిలోలు. ఇంట్లోవాళ్లు త్వరలోనే నాకు పెళ్లి జరిపించాలనుకుంటున్నారు. థైరాయిడ్, పీసీఓడీ రెండు సమస్యలూ ఉంటే పిల్లలు పుట్టరని విన్నాను. నిజమేనా? దీనికి పరిష్కారం ఏమైనా ఉందా? – సాయిలక్ష్మి, ధర్మవరం థైరాయిడ్, పీసీఓడీ సమస్యలు తలెత్తినప్పుడు కొందరిలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, సక్రమంగా వచ్చినా, కొందరిలో అండం సరిగా పెరగకపోవడం, అది విడుదల కాకపోవడం వంటి సమస్యల వల్ల గర్భం రాకపోవడం, గర్భం వచ్చినా, అబార్షన్ జరగడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కాకపోతే ఈ సమస్యలకు గైనకాలజిస్టులు చెప్పిన సలహాలను పాటిస్తూ, సరైన చికిత్స తీసుకుంటే, థైరాయిడ్ సమస్య అదుపులో ఉండి, పీసీఓడీ వల్ల ఉండే హార్మోన్ల అసమతుల్యత చక్కబడితే గర్భం తప్పకుండా వస్తుంది. ఇక మీ విషయానికి వస్తే, ఎత్తు 5.1 అడుగులకు గరిష్ఠంగా 55 కిలోల వరకు బరువు ఉండవచ్చు. కాని, మీరు 75 కిలోలు ఉన్నారు. మీ సమస్యలకు సగం చికిత్స బరువు తగ్గడమే! క్రమం తప్పకుండా వాకింగ్, యోగా, ఏరోబిక్స్ వంటి వ్యాయామాలతో పాటు జంక్‌ఫుడ్ మానేసి, మితమైన పోషకాహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గడం జరుగుతుంది. మీరు పెళ్లి కుదిరే లోపు బరువు తగ్గి, థైరాయిడ్ మాత్రలు సరైన మోతాదులో తీసుకుంటూ, థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచుకుంటే, పెళ్లయిన తర్వాత పిల్లలు పుట్టే అవకాశాలు సహజంగానే పెరుగుతాయి. బరువు తగ్గితే పెళ్లయిన తర్వాత గర్భం రాకపోయినా, సరైన చికిత్సతో గర్భం త్వరగా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. బరువు తగ్గకుండానైతే, గర్భం కోసం చికిత్సలో భాగంగా ఎక్కువ కాలం ఎక్కువ మోతాదులో మందులు తీసుకోవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే బరువు తగ్గడానికి పైన చెప్పిన జాగ్రత్తలు పాటించడం మంచిది. - డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ చదవండి: ఇది జిరాఫీ కాదు!! కుక్క.. అత్యంత అరుదైన బ్రీడ్!! కానీ కారు ప్రమాదంలో.. -
ట్రైగ్లిజరైడ్స్‌తో జాగ్రత్త
మనం ఇటీవల చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి వాటి గురించి తరచూ వింటూ ఉంటాం. అవెంతో హాని చేస్తాయన్న విషయం మనలో చాలామందికి తెలిసిందే. అసలు ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏమిటి, అవి ఎందుకు హాని కలిగిస్తాయన్న విషయాలను తెలుసుకుందాం. ట్రైగ్లిజరైడ్స్ అనేవి వున శరీరంలోనూ, ఆహారపదార్థాల్లోనూ ఉండే ఒక రకం కొవ్వు వంటి జీవరసాయన పదార్థాలు. అవి కొలెస్ట్రాల్ లాగానే రక్తంలో ప్రవహిస్తుంటాయి. మనం తీసుకునే కొవ్వులు, చక్కెరల నుంచి తయారవతుంటాయి. మనం తీసుకున్న ఆహారం వెంటనే శక్తిగా వూరకపోతే అది ట్రైగ్లిజరైడ్స్‌గా వూరి కొవ్వు కణాల్లో నిల్వ అవుతుంది. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటే... రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్న కండిషన్‌ను ‘హైపర్ ట్రైగ్లిజరైడెమియా’ అని అంటారు. రక్తంలో వీటి పాళ్లు పెరిగితే అది గుండెజబ్బులకు దారితీయవచ్చు. ఎక్కువగా ఉండటానికి కారణాలు... 1) డయాబెటిస్, 2) థైరాయిడ్ సమస్యలు, 3) చాలా ఎక్కువ మోతాదుల్లో ఆల్కహాల్ తీసుకోవడం. రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు రోగిని పై అంశాల విషయంలోనూ పరీక్షించాలి. మోతాదులను తెలుసుకోవడమిలా... ద నేషనల్ కొలెస్ట్రాల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ వూర్గదర్శకాల ప్రకారం పరగడపున చేసిన రక్తపరీక్షలో కనుగొనే ట్రైగ్లిజరైడ్ మోతాదులను కింది విధంగా వర్గీకరించారు. 150 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉంటే... అది నార్మల్. 150 – 199 ఎంజీ/డీఎల్ ఉంటే కొంతవరకు పరవాలేదు (బార్డర్‌లైన్). 200 – 499 ఎంజీ/డీఎల్ ఉంటే... ఎక్కువ. 500 ఎంజీ/డీఎల్ అంతకు మించి ఉంటే... చాలా ఎక్కువ పాటించాల్సిన ఆహార నియవూలు... ►హైపర్ ట్రైగ్లిజరైడెమియా ఉన్నప్పుడు జీవన సరళిలో వూర్పులు తెచ్చుకొని ఆహార నియమాలు పాటించాలి. ►ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా బరువు ఉంటే శరీర బరువు సాధారణస్థాయికి వచ్చేలా ఆహారంలో క్యాలరీలు తగ్గించుకోవాలి. అంటే.. కొవ్వులు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఆల్కహాల్... ఇలా అన్ని పదార్థాల నుంచి మీ శరీరంలోకి వచ్చే క్యాలరీలను తగ్గించుకోవాలి. ►ఆహారంలో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్‌ను బాగా తగ్గించాలి. అంటే... నెయ్యి, వెన్న, వనస్పతి, వూంసాహారాలైన రొయ్యలు, వూంసం, చికెన్ స్కిన్, డీప్‌గా వేయించిన వేపుళ్లను తగ్గించాలి. ఆల్కహాల్ పూర్తిగా వూనేయాలి. ►తాజాపళ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్‌లో పీచు ఎక్కువగా ఉండి... ట్రైగ్లిజరైడ్స్ పాళ్లను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. వెజిటబుల్ సలాడ్స్, తేలిగ్గా ఉడికించిన కాయగూరలు తీసుకోవాలి. ►స్వీట్స్, బేకరీ ఐటమ్స్ లాంటి రిఫైన్డ్ ఫుడ్స్ తగ్గించాలి. పొట్టుతీయని తృణధాన్యాలు అంటే... దంపుడుబియ్యం, మెుక్కజొన్న, పొట్టుతీయని రాగులు, గోధువులు, ఓట్స్, పొట్టుతీయని పప్పుధాన్యాలు, మెులకెత్తిన గింజలు (స్ప్రౌట్స్) తీసుకోవాలి. ►ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రవు / వాకింగ్ వంటి వ్యాయావూలు చేయాలి. మీ ఎత్తుకు తగిన బరువ# ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ►కనీసం వారంలో వుూడుసార్లు చేపలు... అవి కూడా కేవలం ఉడికించిన గ్రిల్డ్ ఫిష్ వూత్రమే తీసుకోవాలి. ►పొగతాగడం పూర్తిగా వూనేయాలి. శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ పాళ్లు పెరిగినప్పుడు డాక్టర్లు చెప్పిన వుందులు వాడుతున్నా ఆహార నియవూలు పాటించడం తప్పనిసరి. మీ ఫిజీషియన్/కార్డియాలజిస్ట్ / న్యూట్రిషనిస్ట్ చెప్పే సూచనలు తప్పక పాటించండి. డాక్టర్ డి. మీరాజీ రావు, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ కాంటినెంటల్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
నాకు సంతానభాగ్యం ఉందా?
నా వయసు 33 ఏళ్లు. వివాహమై పదేళ్లు అయ్యింది. ఇంతవరకు సంతానం లేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేసి ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అని చెప్పారు. హోమియోలో నా సమస్యకు పరిష్కారం లభిస్తుందా? సంతానలేమికి అనేక అంశాలు కారణమవుతాయి. సమస్య మహిళల్లో లేదా పురుషుల్లో ఉండవచ్చు. ►స్త్రీలలో సాధారణంగా కనిపించే కారణాలు: ►జన్యుసంబంధిత లోపాలు ►థైరాయిడ్ సమస్యలు ►అండాశయంలో లోపాలు; నీటిబుడగలు ►గర్భాశయంలో సమస్యలు ►ఫెలోపియన్ ట్యూబ్స్‌లో సమస్యలు ►డయాబెటిస్ గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడటం. పురుషుల్లో కనిపించే కారణాలు: ►హార్మోన్ సంబంధిత సమస్యలు ►థైరాయిడ్ ►పొగతాగడం ►శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం సంతానలేమిలో రకాలు: ►ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ ►సెకండరీ ఇన్ఫెర్టిలిటీ ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ: అసలు సంతానం కలగకపోవడాన్ని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా జన్యుసంబంధిత లోపాలు, హార్మోన్ సంబంధిత లోపాల వల్ల ఏర్పడుతుంది. ►సెకండరీ ఇన్ఫెర్టిలిటీ: మొదటి సంతానం తర్వాత లేదా అబార్షన్ తర్వాత మళ్లీ సంతానం కలగకపోవడాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటా రు. ఇది ముఖ్యంగా గర్భాశయంలో లోపాలు ఏర్పడటం, ఇన్ఫెక్షన్స్ వల్ల ►సంభవిస్తుంది. గుర్తించడం ఎలా: తగిన వైద్య పరీక్షల ద్వారా సమస్యను నిర్ధారణ చేస్తారు. ముఖ్యంగా థైరాయిడ్ ప్రొఫైల్, సాల్ఫింజోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఫాలిక్యులార్ స్టడీ వంటి టెస్ట్‌లు చేస్తారు. ►చికిత్స: హోమియోలో ఎలాంటి సమస్యలకైనా కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. మీ సమస్యను పరిష్కరించేందుకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ ఇరువైపు కీళ్లలో నొప్పి... ఎందుకిలా? నా వయసు 59 ఏళ్లు. నాకు రెండు చేతుల్లోని కీళ్లు నొప్పిగా ఉండటం, కీళ్లవద్ద ఎర్రగా మారడం జరిగింది. నొప్పి భరించలేకుండా ఉన్నాను. హోమియో చికిత్స ద్వారా తగ్గుతుందా? మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. సాధారణంగా యాభైఏళ్లు పైబడిన వాళ్లలో ఈ నొప్పులు మొదలవుతాయి.ఈ వ్యాధి ఉన్న వారిలో లక్షణాల తీవ్రతలో చాలా రకాల మార్పులు కన్పిపిస్తుంటాయి. వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్లు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్లలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్యపరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. హోమియో మందుల ద్వారా ఈ వ్యాధిని నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా నివారించవచ్చు. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
ఈ వెండి సంతోషానివ్వదు...
సాధారణంగా వెండి రంగు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అందరికీ కనువిందు చేస్తుంది. కానీ ఈ వెండి రంగు మాత్రం సంతోషాన్నివ్వదు. పైగా బాధను నింపుతుంది. మరికొందరిలోనైతే... ‘‘అప్పుడేనా?... ఈ వయసులోనేనా...?’’ అనే ఫీలింగ్ ఇస్తుంది. అవే వెంట్రుకలు తెల్లబడటం. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ వెంట్రుకలు తెల్లబడటం అనేది చాలా సహజమైన ప్రక్రియ. ఏజింగ్‌లో భాగంగా అందరిలోనూ జరిగే ప్రక్రియే. అయితే కొందరిలో అది చాలా చిన్న వయసులోనే జరుగుతుంది. అలా నెరవడాన్ని ‘బాలనెరుపు’ అంటారు. ఇలా బాలనెరుపు వచ్చేందుకు కారణాలేమిటో, వాటి నివారణ ఎలాగో తెలుసుకుందాం. వెంట్రుకలు తెల్లబడటానికి కారణమిదే... మన వెంట్రుకల మూలాన్ని మనం హెయిర్ ఫాలికిల్ అని పిలుస్తాం. ఈ మూలంలో మెలనోసైట్స్ అనే కణాలు ఉంటాయి. ఈ మెలనోసైట్స్ అనే కణాలు మెలనిన్ అనే రంగునిచ్చే పిగ్మెంట్ను ఉత్పత్తి చేస్తాయి. అప్పుడప్పుడే తెల్లబడుతున్న వెంట్రుకలను ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కింద పరిశీలించినప్పుడు అక్కడి మెలనోసోమ్స్ అనే చోట్ల తగినంత మెలనిన్ ఉండకపోవడాన్ని డాక్టర్లు గమనిస్తారు. అదే తెల్లవెంట్రుకల విషయానికి వస్తే అక్కడ మెలనోసైట్స్ అనే కణాలు ఉండవు. ఈ పిగ్మెంట్ వల్లనే వెంట్రుకకు నల్లటి రంగు వస్తుంది. కొన్ని వెంట్రుకల్లో ఈ మెలనిన్ ఉత్పత్తి ఆగిపోవడం ఫలితంగా ఆ వెంట్రుక నల్లరంగును కోల్పోయి తెల్లగా మారుతుందన్నమాట. వాస్తవానికి మనకు 50 ఏళ్ల వయసు వచ్చేనాటికి మన జుట్టుకు రంగునిచ్చే 50 శాతం పిగ్మెంట్ను కోల్పోతాం. కానీ కొందరిలో ఆ వయసుకు ముందే జుట్టు తెల్లబడుతుంది.నిజానికి వెంట్రుక తెల్లగా మారదు. మెలనిన్ ఇచ్చే నలుపు రంగును కోల్పోవడం వల్ల అది పూర్తిగా కాకుండా, ఒక మేరకు పారదర్శకం (ట్రాన్స్లుసెంట్)గా మారుతుంది. అదే నల్లటి వెంట్రుకల నేపథ్యంలో తెల్లగా అనిపిస్తుంటుంది. వెంట్రుకలు తెల్లబడటానికి కారణాలు వెంట్రుకలు తెల్లబడటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో అన్నింటికంటే ప్రధానమైన కారణాలు జన్యుపరమైనవి. తల్లిదండ్రుల్లో ఎవరికైనా వెంట్రుకలు త్వరగా నెరిస్తే పిల్లల్లోనూ అవి త్వరగా తెల్లబడటానికి ఆస్కారం ఉంది. ఇలా కొందరిలో చాలా త్వరగా వెంట్రుకలు తెల్లబడటానికి మరికొన్ని కారణాలు ఇవే... స్వాభావికంగా వెంట్రుకలు నల్లబడాలంటే... ►ఐరన్, జింక్ సమృద్ధిగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ►విటమిన్ బి–12 పుష్కలంగా అందేలా తగిన ఆహారం తీసుకోవడం వల్ల వెంట్రుకల నెరుపు తగ్గుతుంది. మాంసాహారులైతే మాంసం, శాకాహారులైతే రోజూ గ్లాసెడు పాలు తాగడంతో పాటు, పొట్టుతీయని తృణధాన్యాలు తినాలి. ఇవి తీసుకున్న తర్వాత కూడా మీ ఒంటికి సరైన మోతాదులో విటమిన్ బి12 అందకపోతే డాక్టర్ సలహా మేరకు వైటమిన్ బి12 అందేలా టాబ్లెట్లు వాడటం అవసరం. ∙ క్యాల్షియం పాంటోథనేట్, పాబా అమైన్ సప్లిమెంట్లు తీసుకుంటే తెల్లవెంట్రుకలు తగ్గే అవకాశం ఉంది. ►కరివేపాకు వేసిన మజ్జిగ వల్ల కూడా వెంట్రుకలు తెల్లబడే ప్రక్రియ మందగిస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ►ఇక వాతావరణ కాలుష్యాలకు సైతం వీలైనంత దూరంగా ఉంటూ మంచి స్వాభావికమైన వాతావరణంలో ఉండాలి. ►వ్యాయామం కూడా వెంట్రుకలు నెరిసే ప్రక్రియను మందగించేలా చేస్తుంది. అందుకే ప్రతిరోజూ కనీసం 45 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయడం మంచిది. ఇది వెంట్రుకలు తెల్లబడకుండా నివారించడంతో పాటు ఓవరాల్ హెల్త్కూ మంచిది. చికిత్స: హెయిర్ పెప్టైడ్ సీరమ్ వంటి కొన్ని మందులను వాడితే ప్రయోజనం ఉంటుంది. అయితే ఇలాంటి వాటిని తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకే వాడాలని గుర్తుంచుకోవాలి. మానసిక ఒత్తిడి కారణంగా... ►మనలో పెరిగే మానసిక ఒత్తిడి వల్ల మన జీవకణాల్లోని కొన్ని పొరలు (సెల్యులార్ స్ట్రక్చరల్ మెంబ్రేన్స్), కొవ్వుపదార్థాలు (లైపిడ్స్), ప్రోటీన్లు, డీఎన్ఏ దెబ్బతిని వెంట్రుక తెల్లబడుతుంది. ►తీవ్రమైన మానసిక ఉద్వేగాలకు లోనుకావడం (ఎమోషనల్, ఇన్ఫ్లమేటరీ స్ట్రెస్) ►కణంలోని రోగనిరోధక శక్తి తగ్గడం ►థైరాయిడ్ లోపం ►రక్తహీనత (అనీమియా) ►పొగతాగే అలవాటు ►హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉత్పత్తి (మన రోమమూలాల్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఉత్పత్తి అవుతుంటుంది. ఇది చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నప్పుడు కూడా వెంట్రుక తెల్లబడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది). ►వీటికి తోడు కాలుష్యం, పోషకాహార లోపం కూడా కొంతమేరకు తెల్లవెంట్రుకలకు కారణమవుతాయి. కొన్ని మూలకాల/పోషకాల లోపాలు ►ఐరన్ లోపించడం ►కాపర్ లోపించడం ►జింక్ లోపించడం ►విటమిన్ బి–12, విటమిన్–ఈ, విటమిన్–సి లోపించడం డాక్టర్ స్వప్నప్రియ, డర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
చెమట ఎక్కువగా పడుతుంటే ?
చెమట పట్టడం మంచి సూచన. ఒంట్లో అధికంగా ఉన్న వేడిమిని తగ్గించేందుకు, ఒంటికి పడని వ్యర్థాలను బయటికి పంపేందుకు దేహ ధర్మానుసారం చెమట పడుతుంది. అయితే చెమట అధికంగా పడుతుంటే మాత్రం అది దేనికైనా సంకేతమా అని ఆలోచించాలి. సమస్యేమిటో తెలుసుకుని పరిష్కరించుకోవాలి. సాధారణంగా 8 కారణాల వల్ల ధారాపాతంగా చెమటలు పడుతుంటాయి. ఒత్తిడి: ఆదుర్దా, ఆందోళన, మానసిక ఒత్తిడి వల్ల చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. చర్మంపై బ్యాక్టీరియా కూడా చెమటకు కలవడం వల్ల కొందరిలో చెమట వాసన కూడా వస్తుంది. థైరాయిడ్ సమస్య (హైపోథైరాయిడిజం): గొంతు భాగంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. అది కనుక మితిమీరిన చురుకుదనంతో ఉంటేథైరాయిడ్ హార్మోన్ విపరీతంగా ఉత్పత్తి అవుతుంది. ఇలాంటప్పుడు చెమట ఎక్కువగా పడుతుంది. లో బ్లడ్ షుగర్ (హైపో గ్లైసీమియా): రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పడిపోయే స్థితే హైపో గ్లైసీమియా. ఇలాంటప్పుడు బయటి ఉష్ణోగ్రతలతో నిమిత్తం లేకుండా చెమటలు పడతాయి. హైపర్ హైడ్రోసిస్: శరీరంలో ఒక భాగం మీద మాత్రమే చెమట పడుతుంటే అది హైపర్ హైడ్రోసిస్. ఈ స్థితిలో స్వేద గ్రంధులు ఎక్కువగా ఉండే.. మెడ, అరిచేతులు, అరికాళ్లలో చెమట పడుతుంటుంది. మందుల దుష్ప్రభావాలు: కొన్ని రకాల మందుల కారణంగా కూడా చెమట ఎక్కువగా పడుతుంది. ఉదా: యాంటీబయాటిక్స్, బీపీ మందులు, మానసిక రుగ్మతలకు వాడే మందుల వల్ల కొందరిలో చెమటలు పోయడం ఉంటుంది. మెనోపాజ్: మెనోపాజ్ దశకు చేరుకుంటున్నప్పుడు, చేరుకున్న తర్వాత హార్మోన్ల ఉత్పత్తిలో హెచ్చు తగ్గుల కారణంగా చెమటలు పడుతుంటాయి. ఇవికాక... స్థూలకాయం, కారణం తెలియని జ్వరం వల్ల కూడా చెమటలు ఎక్కువగా పోయడం జరుగుతుంది. -
థైరాయిడ్ టెర్రర్
బిడ్డకు ఐదేళ్ల వయస్సు వచ్చినా మరీ చిన్నపిల్ల వాడిలాగా కనిపించడం.. ఎంత తిన్నా లావు అవ్వడం లేదని భావించిన గుంటూరు అరండల్‌పేటకు చెందిన కిశోర్, సుజాత దంపతులు ఇటీవల వైద్యుల్ని సంప్రదించారు. పరీక్షలు చేసిన వైద్యులు థైరాయిడ్ వ్యాధికి గురైనట్లు నిర్ధారణ చేయడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఒక్కగానొక్క బిడ్డకు ఈ వ్యాధి ఎలా వచ్చిందో అర్థంగాక తలలు పట్టుకున్నారు. తుళ్లూరుకు చెందిన రజనీకి ఏడాది కిందట పెళ్లయింది. ఇటీవల గర్భం ధరించడంతో బరువు పెరగసాగింది. కడుపులో బిడ్డ ఉండటం వల్ల, అధికంగా పోషకాహారం తీసుకోవడం వల్ల బరువు పెరుగుతూ ఉండొచ్చని తల్లిదండ్రులు భావించారు. కాన్పు సమయంలో గుంటూరులోని స్పెషాలిటీ వైద్యుల్ని సంప్రదించగా థైరాయిడ్ వ్యాధికి గురైనట్లు రిపోర్టు రావడంతో గాబరా పడ్డారు. ఇలాంటి బాధలతో ఎంతో మంది ప్రతి రోజూ వైద్యం కోసం వస్తున్నారని, థైరాయిడ్ గ్రంథిపై చాలా మందికి సరైన అవగాహన లేకపోవడంతో వ్యాధిని నియంత్రణలో పెట్టుకోలేక అవస్థలు పడుతున్నట్లు ఎండోక్రైనాలజిస్ట్‌లు తెలిపారు. శరీర జీవక్రియల్ని నియంత్రించే అతి ముఖ్యమైన గ్రంథి థైరాయిడ్. మనిషి వికాస క్రమంలో థైరాక్సిన్ హార్మోన్ పాత్ర ఎంతో కీలకమైంది. అయితే, ప్రస్తుతం పుట్టిన బిడ్డ నుంచి తొంభై ఏళ్ల వయస్సు వారికి సైతం థైరాయిడ్ వ్యాధి సోకుతూ టెర్రర్ పుట్టిస్తోంది. మనిషిని మానసికంగా, శారీరకంగా కుంగదీసే ఈ వ్యాధిపై సమగ్ర అవగాహన ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. సంపూర్ణ అవగాహన, అప్రమత్తతతో థైరాయిడ్ వ్యాధిని జయించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్న మాట. మే 25వ తేదీ ‘వరల్డ్ థైరాయిడ్ డే’ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. గుంటూరు మెడికల్ : గుంటూరు జిల్లాలో ఆరు వరకు ఎండోక్రైనాలజీ ఆస్పత్రులు ఉన్నాయి. ఒక్కో ఆస్పత్రికి ప్రతి రోజూ 20 నుంచి 25 మంది థైరాయిడ్ వ్యాధి బాధితులు వస్తున్నారు. రోజుకు సుమారు 80 మంది చికిత్స కోసం ఎండోక్రైనాలజిస్టుల్ని సంప్రదిస్తున్నారు. జనరల్ ఫిజీషియన్‌తో పాటుగా ఇతర వైద్య నిపుణుల్ని రోజూ సంప్రదిస్తున్న బాధితుల సంఖ్య 300 మందికి పైగా ఉంటుంది. జీజీహెచ్‌కు జనరల్ మెడిసిన్ వైద్య విభాగానికి రోజూ వైద్యం కోసం వచ్చే వారిలో 250 మందిలో 40 మంది థైరాయిడ్ వ్యాధి బాధితులే ఉంటున్నారు. థైరాయిడ్ గ్రంథి చేసే పనులు గొంతు ముందు భాగంలో శ్వాసనాళానికి ఇరుపక్కలా గులాబీ రంగులో ఇంచుమించు సీతాకోక చిలుక ఆకారంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఇది మెదడులోని పిట్యూటరీ గ్రంథి స్రవించే థైరాయిడ్ స్టిమ్యూలేటింగ్ హార్మోన్ (టీఎస్‌హెచ్) ద్వారా టి–3, టి–4 అనే హార్మోన్లను ఉత్తత్పి చేస్తుంది. టి–4 అనగా థైరాక్సిన్. ఇది 20 గ్రాముల బరువు ఉండి శరీరంలోని చాలా జీవక్రియల్ని నియంత్రిస్తుంది. శరరీ పెరుగుదల, ఎముకల పెరుగుదల, శరీర ఉష్ణోగ్రత, మానసిక వికాసాన్ని అదుపు చేస్తుంది. వివిధ కణజాలాల అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ హార్మోన్ ఉత్పత్తికి మన శరీరంలో తగినంత అయోడిన్ అవసరం. రోజుకు 150 మైక్రో గ్రాముల (గుండుసూది తలంత) అయోడిన్ శరీరానికి అవసరం. థైరాక్సిన్లో 65 శాతం అయోడిన్ ఉంటుంది. అయోడిన్ పెరుగుదలకు, శక్తి రావడానికి తోడ్పడుతుంది. థైరాయిడ్ లోపం ఏర్పడితే?.. ఈ వ్యాధి లక్షణాలు ఒక్కసారిగా కాక నిదానంగా కనిపిస్తాయి. ఈ వ్యాధి వచ్చిన వారిలో హుషారు తగ్గి, అంతకు ముందులేని మందకొడితనం చోటుచేసుకుంటుంది. విపరీతమైన అలసట, నడవాలన్నా, పనిచేయాలన్నా ఓపిక ఉండదు. చర్మంలో తడి, నునుపుతనం తగ్గి, ఎండిపోయినట్లు ఉంటుంది. కండరాలు ఉబ్బుతాయి. దానివల్ల ఒళ్లు ఉబ్బుగా కనిపిస్తుంది. ఒళ్లు ఉబ్బరం వల్ల ఉబ్బు కామెర్లుగా భ్రమపడే అవకాశం ఉంది. మలబద్ధకం, కండరాలు పట్టివేసినట్లు ఉండటం, చర్మం కింద కొవ్వు చేరి బరువు పెరుగుతారు. గొంతు బొంగురుగా మారడం, ముఖం గుండ్రంగా కనపడటం, మనిషి మందమతిగా మారతాడు. జీవక్రియ రేటు విపరీతంగా పెరిగి శరీరంలోని అన్ని శక్తి వనరులు ఖాళీ అవుతాయి. ఎముకల్లో కాల్షియం తక్కువై పెళుసుబారతాయి. తలమీద వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతాయి. కనుబొమ్మల వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతాయి. పిల్లలో పెరుగుదల ఉండదు. పిచ్చితనం వస్తుంది. లావు అవ్వడం, బరువు పెరగడం, మత్తు, నిద్ర, ఒళ్లునొప్పులు, మలబద్ధకం, స్త్రీలలో రుతుచక్రంలో మార్పులు రావడం, గర్భం రావడం ఆలస్యం కావడం, తరచుగా గర్భస్రావాలు జరగడం తదితర లక్షణాలు ఉంటాయి. వ్యాధి నిర్ధారణ రక్తంలో టి–3, టి–4, టీఎస్‌హెచ్ అనే హార్మోన్లు ఎంతున్నాయో పరీక్షలు చేస్తారు. దీన్నే థైరాయిడ్ ప్రొఫైల్ అంటారు. ఈ పరీక్షలు చేయించడం ద్వారా వ్యాధి ఉందా? లేదా? నిర్ధారణ చేస్తారు. పుట్టిన బిడ్డకు పరీక్షలు చేయించాలి ఈ వ్యాధి అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని 90 ఏళ్ల వయస్సు వారికి వస్తుంది. మగవారి కన్నా ఆడవారిలో ఎక్కువగా సమస్య తలెత్తుతుంది. ఆడవారిలో 80 శాతం మందికి ఉంటే మగవారిలో 20 శాతం మందికి వస్తుంది. జన్యుపర లోపాల వల్ల, తల్లికి ఉంటే బిడ్డకు, వంశపారంపర్యంగా వ్యాధి వస్తుంది. అప్పుడే పుట్టిన బిడ్డకు థైరాయిడ్ ఉందో లేదో నిర్ధారణ పరీక్ష చేయించడం చాలా ఉత్తమం. –డాక్టర్ పతకమూరి పద్మలత, ఎండోక్రైనాలజిస్ట్, జీజీహెచ్, గుంటూరు ముందే తెలుసుకోవచ్చు యాంటీబాడీ టెస్ట్ చేయించుకోవడం ద్వారా థైరాయిడ్ వ్యాధి వచ్చే అవకాశం ఉందా? లేదా? ముందుగానే తెలుసుకోవచ్చు. ఆహారంలో అయోడిన్ లోపం లేకుండా చూసుకోవడం వల్ల కొంత వరకు థైరాయిడ్ బారినపడకుండా కాపాడుకోవచ్చు. వ్యాధి నియంత్రణే తప్పా నివారణ లేదు. దీనికి జీవితాంతం మందులు వాడాలి. గర్భిణులకు వచ్చే థైరాయిడ్ ప్రసవం అనంతరం తగ్గిపోతుంది. వ్యాధి సోకిన వారికి ప్రత్యేకంగా లక్షణాలు కనిపించవు. ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయి.–డాక్టర్ బెల్లం భరణి,ఎండోక్రైనాలజిస్ట్, గుంటూరు -
గ్రాముల్లో తిని.. కేజీల్లో పెరుగుతున్నారా?
గ్రాముల్లో తింటున్నా కిలోల్లో పెరిగిపోతున్నారా?సన్నగా తిన్నా లావెక్కిపోతున్నారా?...చిన్న చిన్న పనులకే అలసిపోతున్నారా? నిష్కారణంగా కుంగిపోతున్నారా? అనవసరంగా చిర్రుబుర్రులాడుతున్నారా?...ఇందులో మీ తప్పేమీ లేదు. ఇదంతా థైరాయిడ్ తెచ్చిపెట్టిన ముప్పు కావచ్చు. అలాగని కంగారు పడకండి. వైద్యులను సంప్రదించి, పరీక్షలు జరిపించుకోండి. చికిత్సతో పరిస్థితిని చక్కదిద్దుకోండి. థైరాయిడ్ సమస్యలు ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారాయి. థైరాయిడ్ గ్రంథిలో తలెత్తే అసమతుల్యతల కారణంగా వచ్చే సమస్యల్లో హైపో థైరాయిడిజమ్, హైపర్ థైరాయిడిజమ్ ప్రధానమైనవి. హైపర్ థైరాయిడిజమ్‌తో పోలిస్తే హైపో థైరాయిడిజమ్‌తో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. మన దేశంలో దాదాపు 4.20 కోట్ల మందికి పైగా హైపో థైరాయిడిజమ్ బాధితులు ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. స్థూలంగా చెప్పుకోవాలంటే మన దేశంలో ప్రతి పదిమంది వయోజనుల్లో ఒకరు హైపో థైరాయిడిజమ్ బాధితులేనని చెప్పవచ్చు. గడచిన ఇరవై ఏళ్లలో భారత్‌లో హైపో థైరాయిడిజమ్ బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే, భారత్‌లోనే థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారి సంఖ్య ఎక్కువ. మన దేశ జనాభాలో దాదాపు 11 శాతం మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతుంటే, అమెరికాలో 4.6 శాతం, బ్రిటన్‌లో 2 శాతం మంది మాత్రమే ఈ సమస్యలతో బాధపడుతున్నారు. థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారి సంఖ్య మన దేశంలో మరింత ఎక్కువగానే ఉండవచ్చని, చాలామంది ఎలాంటి పరీక్షలూ చేయించుకోకుండానే ఏళ్లకు ఏళ్లు గడిపేస్తూ ఉంటారని, వేరే ఏ జబ్బుతోనో బాధపడి ఆస్పత్రికి చేరితే, వైద్యుల సూచనతో జరిపించుకునే పరీక్షల్లో థైరాయిడ్ సమస్యలు బయటపడటం మన దేశంలో సర్వసాధారణమేనని నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ గురించి, దాని పనితీరు గురించి, పనితీరులో తలెత్తే లోపాలు, వాటి వల్ల తలెత్తే సమస్యల గురించి, థైరాయిడ్ సమస్యల నియంత్రణ, చికిత్స మార్గాల గురించి తెలుసుకుందాం. కొలిమిలా పనిచేస్తుంది థైరాయిడ్ గ్రంథి నిరంతరం కమ్మరి కొలిమిలా పనిచేస్తూ ఉంటుంది. ఒకే వేగంతో ఎప్పుడూ ఒకేలా శరీరంలోని కోటాను కోట్ల కణాలన్నింటిలోనూ ఆహారాన్ని మండించి, వాటన్నింటికీ నిత్యం శక్తిని అందిస్తూ ఉంటుంది. థైరాయిడ్ పనితీరులో ఏమాత్రం వేగం తగ్గినా స్థూలకాయం వస్తుంది. ముఖం ఉబ్బిపోయినట్లుగా కనిపిస్తుంది. అలసట ముంచుకొస్తుంది. కదలికలు మందగిస్తాయి. థైరాయిడ్ పనితీరులో వేగం కాస్తంత పెరిగితే మాత్రం విపరీతంగా ఆకలి వేస్తుంది. అయితే, ఎంత తిన్నా తిన్నదంతా ఆవిరి అయిపోతుంది. కనుగుడ్లు ముందుకు పొడుచుకు వచ్చినట్లుగా అవుతాయి. కనురెప్పలు మూసినా మూసుకుపోనట్లుగా కనుగుడ్లు బయటకు కనిపిస్తుంటాయి. అస్థిమితంగా, చూడటానికి మానసిక రోగిలా తయారవుతారు. థైరాయిడ్ గ్రంథి చిన్న స్థలంలో నెలకొల్పిన పెద్ద రసాయనిక కర్మాగారంలా పనిచేస్తుంది. దీని నుంచి అత్యంత సంక్లిష్ట రసాయనాలు ఉత్పత్తవుతూ ఉంటాయి. దీని నుంచి వెలువడే రెండు అతి ముఖ్యమైన రసాయనాల్లో మూడింట రెండో వంతు అయొడిన్ ఉంటుంది. థైరాయిడ్ పనితీరు సజావుగా సాగడానికి గ్రాములో ఐదువేలవ వంతు పరిమాణంలో అయొడిన్ ప్రతిరోజూ అవసరమవుతూ ఉంటుంది. థైరాయిడ్ నుంచి వెలువడే హార్మోన్ల మోతాదు అతి తక్కువ. అయితే, అవి చాలా శక్తిమంతమైనవి. మెదడులో ఉండే హైపో థాలమస్, పిట్యూటరీ గ్రంథులు థైరాయిడ్ గ్రంథి పనితీరు సజావుగా సాగడానికి దోహదపడుతూ ఉంటాయి. థైరాయిడ్‌ను ప్రేరేపించడానికి పిట్యూటరీ గ్రంథి థైరోట్రోపిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది. పిట్యూటరీ గ్రంథి ఈ హార్మోన్‌ను స్రవించేలా దానిని హైపో థాలమస్ గ్రంథి ప్రేరేపిస్తుంది. థైరాయిడ్ గ్రంథి నరాలపై ప్రభావం చూపుతుంది. దీని పనితీరు వల్ల నరాలు ఉత్తేజితమవుతాయి. ఒత్తిడి ఎదురైన సందర్భాల్లో థైరాయిడ్ గ్రంథి కాస్త ఎక్కువ మోతాదులో హార్మోన్లను విడుదల చేస్తుంది. తీవ్ర విషాదం, ఆందోళన వంటివి కలిగినప్పుడు హైపోథాలమస్ అతిగా పనిచేస్తుంది. దాని ప్రభావంతో థైరాయిడ్ కూడా మోతాదుకు మించి హార్మోన్లు విడుదల చేసి, రకరకాల శారీరక, మానసిక వ్యాధులకు కారణమవుతుంది. వీటితో అయొడిన్ లోపానికి చెక్ సముద్రపు చేపలూ, సముద్ర తీరానికి దగ్గర్లో ఉండే భూభాగంలో పెరిగిన ఆకుకూరలు, కాయగూరల్లో అయొడిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో హిమనీనదాలు ఉన్నచోట నివసించేవారు సముద్రపు ప్రాంతంలో ఉండేవారంత అదృష్టవంతులు కాదు. ఎందుకంటే అక్కడ ప్రవహించే హిమనీ నదాలు క్రమంగా కరిగి ప్రవహిస్తూ ఉండటం వల్ల అక్కడి అయోడిన్ కొట్టుకుపోతూ ఉంటుంది. అందుకే అలాంటి చోట ఉన్నవారు తప్పనిసరిగా అయోడైజ్డ్ ఉప్పునే వాడాలి. అయొడిన్ లోపం లేకుండా చూసుకోవడం ద్వారా థైరాయిడ్ సమస్యలను కొంతవరకు నివారించవచ్చు. పరిమాణంలో చిన్నది.. ప్రభావంలో పెద్దది... థైరాయిడ్ గ్రంథి ఊపిరితిత్తులకు గాలి అందించే వాయునాళం చుట్టూ ఆవరించుకుని, గులాబి రంగులో చూడటానికి సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. దీని బరువు ఇరవై గ్రాములు మాత్రమే. ఇది స్రవించే హార్మోన్ పరిమాణం మరీ మరీ తక్కువ. ఎంత తక్కువంటే, కనీసం కంటికి ఆననంత. కచ్చితమైన లెక్కల్లో చెప్పాలంటే, ఒక గ్రామును 28 లక్షల భాగాలు చేస్తే, ఒక్కో భాగం ఎంత ఉంటుందో, అంతే పరిమాణంలో థైరాయిడ్ గ్రంథి హార్మోన్‌ను స్రవిస్తుంది. మనిషి పుట్టినప్పటి నుంచే థైరాయిడ్ గ్రంథి ఒక క్రమ పద్ధతిలో పని చేసుకుంటూ పోతుంది. శిశువు పుట్టినప్పుడు ఒకవేళ థైరాయిడ్ గ్రంథి సజావుగా పని చేయకుంటే, మందపాటి పెదవులు, చప్పిడి ముక్కు వంటి అవయవ లోపాలతో పాటు, బుద్ధిమాంద్యం వంటి మానసిక లోపాలూ ఏర్పడతాయి. చిన్నగా కనిపించే థైరాయిడ్ గ్రంథి మొత్తం శరీరంలోని జీవక్రియల వేగం ఒక క్రమ పద్ధతిలో ఉంచుతుంది. ఇందులో ఎలాంటి లోపాలు ఏర్పడినా, మొత్తం జీవక్రియల్లోనే తేడాలు వస్తాయి. థైరాయిడ్ పనితీరు మందగించడం వల్ల తలెత్తే లోపాన్ని ‘హైపో థైరాయిడిజమ్’ అని, థైరాయిడ్ అతిగా పనిచేయడం వల్ల తలెత్తే లోపాన్ని ‘హైపర్ థైరాయిడిజమ్’ అని అంటారు. పెరిగినా తగ్గినా ప్రమాదమే... థైరాయిడ్ పనితీరులో వేగం పెరిగినా, తరిగినా ప్రమాదమే. థైరాయిడ్ పనితీరు మందగిస్తే, దీని నుంచి వెలువడే హార్మోన్ల పరిమాణం తగ్గుతుంది. థైరాయిడ్ పనితీరు మందగించడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా అయొడిన్ లోపం ఒకటి. గడచిన ఇరవయ్యేళ్లలో ప్రపంచవ్యాప్తంగా అయొడైజ్డ్ ఉప్పు వాడకం మొదలైన తర్వాత అయొడిన్ లోపం కారణంగా థైరాయిడ్ పనితీరు మందగించిన సందర్భాలు తక్కువగానే ఉంటున్నాయి. ఒక్కొక్కసారి పిట్యూటరీ గ్రంథి నుంచి థైరాయిడ్‌ను ప్రేరేపించే హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయినా ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఒక్కోసారి రోగ నిరోధక శక్తి ఎదురు తిరగడం వల్ల థైరాయిడ్ పనితీరు మందగిస్తే, ఆ పరిస్థితిని ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌గా గుర్తించాల్సి ఉంటుంది. జన్యు కారణాల వల్ల థైరాయిడ్ పనితీరులో తేడాలు రావడం చాలా అరుదు. థైరాయిడ్ గ్రంథికి తగిన మోతాదులో అయొడిన్ అందకుంటే, దీని పరిమాణం బాగా పెరిగిపోయి, గొంతు వద్ద బాగా ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. ఈ పరిస్థితినే ‘గాయిటర్’ అంటారు. ఒక్కొక్కసారి థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేయడం మొదలుపెడుతుంది. థైరాయిడ్‌కు అందే అయొడిన్ మోతాదు పెరిగినప్పుడు కూడా దాని పరిమాణం అమాంతంగా పెరిగిపోతుంది. పిట్యూటరీ గ్రంథి మీద కణితి పెరిగితే, థైరోట్రోపిన్ ఉత్పత్తి మోతాదుకు మించి విడుదలవడం వల్ల కూడా ఇలాంటి దుస్థితి దాపురిస్తుంది. దీనినే ‘టాక్సిక్ గాయిటర్’ అంటారు. థైరాయిడ్ గ్రంథిలో తలెత్తే లోపాలను సరిదిద్దేందుకు చాలా సందర్భాల్లో మందులు ఇస్తారు. ఒక్కోసారి థైరాయిడ్‌కు క్యాన్సర్ కూడా రావచ్చు. అరుదైన పరిస్థితుల్లో శస్త్రచికిత్స ద్వారా థైరాయిడ్ గ్రంథిని తొలగించే పరిస్థితి కూడా తలెత్తవచ్చు. పూర్తిగా తొలగించాల్సి వస్తే, థైరోట్రోపిన్ లోపాన్ని భర్తీ చేసేందుకు జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. థైరాయిడ్ పనితీరు మందగించడం వల్ల తలెత్తే హైపో థైరాయిడిజమ్ సమస్యకు కూడా జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. థైరాయిడ్ అతిగా పనిచేయడం వల్ల తలెత్తే హైపర్ థైరాయిడిజమ్ సమస్యకు మాత్రం క్లినికల్ కండిషన్స్ బట్టి మందులు వాడాల్సి ఉంటుంది. థైరాయిడ్ సమస్యలు సాధారణంగా పురుషుల కంటే మహిళల్లోనే కాస్త ఎక్కువగా కనిపిస్తాయి. థైరాయిడ్ సమస్యలు ఈనాటివి కావు థైరాయిడ్ సమస్యలకు చెందిన పేర్లు ఆధునిక వైద్యశాస్త్రం అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రాచుర్యంలోకి వచ్చినా, నిజానికి ఈ సమస్యలు ఈనాటివి కావు. క్రీస్తుపూర్వమే థైరాయిడ్ పనితీరులోని లోపాల వల్ల తలెత్తే సమస్యలను ప్రాచీన వైద్యులు గుర్తించారు. వాటి నివారణకు తమవంతు ప్రయత్నాలూ చేశారు. క్రీస్తుపూర్వం 16వ శతాబ్దికి చెందిన చైనా వైద్యులు థైరాయిడ్ సమస్యల చికిత్స కోసం సముద్రపు నాచును, స్పాంజిని ఉపయోగించేవారు. క్రీస్తుపూర్వం 14వ శతాబ్దికి చెందిన భారతీయ వైద్యుడు సుశ్రుతుడు తన ‘సుశ్రుత సంహిత’ గ్రంథంలో థైరాయిడ్ లోపాల వల్ల తలెత్తే హైపో థైరాయిడిజమ్, హైపర్ థైరాయిడిజమ్, ఈ గ్రంథి వాపు వల్ల ఏర్పడే ‘గాయిటర్’ వంటి వ్యాధుల లక్షణాలను విపులంగా వివరించాడు. క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దికి చెందిన అరిస్టాటిల్, జెనోఫోన్ వంటి వారు తమ రచనల్లో హైపర్ థైరాయిడిజమ్ వల్ల తలెత్తే ‘గ్రేవ్స్ డిసీజ్’ వ్యాధి లక్షణాలను వివరించారు. వాళ్లందరూ వ్యాధులను, వ్యాధి లక్షణాలను దాదాపు సరిగానే గుర్తించగలిగినా, ఆ లక్షణాలకు మూలం థైరాయిడ్ గ్రంథిలోనే ఉన్న సంగతిని గ్రహించలేకపోయారు. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్ది నాటికి హిపోక్రాట్స్, ప్లాటో వంటి వారు థైరాయిడ్ గ్రంథి ఉనికిని గుర్తించారు. అయితే, వాళ్లు థైరాయిడ్ గ్రంథిని కేవలం లాలాజలం ఉత్పత్తి చేసే గ్రంథిగా పొరబడ్డారు. నాటి వైద్యులకు థైరాయిడ్ గ్రంథి కనీసం ఎలా ఉంటుందో కూడా తెలియదు. క్రీస్తుశకం పదిహేనో శతాబ్దికి చెందిన బహుముఖ ప్రజ్ఞశాలి లియొనార్డో డావిన్సి తొలిసారిగా థైరాయిడ్ గ్రంథి చిత్రాన్ని ప్రపంచానికి అందించాడు. థైరాయిడ్ గ్రంథి వాపు వల్ల వచ్చే ‘గాయిటర్’కు థైరాయిడ్ గ్రంథిని శస్త్రచికిత్స ద్వారా తొలగించడమే (థైరాయిడెక్టమీ) తగిన పరిష్కారమని క్రీస్తుశకం పదో శతాబ్దికి చెందిన పర్షియన్ వైద్యుడు అలీ ఇబ్న్ అబ్బాస్ అల్ మగుసి తన రచనల్లో సూచించాడు. క్రీస్తుశకం 1656లో ఇంగ్లాండ్‌కు చెందిన వైద్యుడు, శరీర శాస్త్రవేత్త థామస్ వార్టన్ ఈ గ్రంథికి ‘థైరాయిడ్’గా నామకరణం చేశాడు. ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త బెర్నార్డ్ కోర్టోయిస్ 1811లో అయొడిన్‌ను కనుగొంటే, థైరాయిడ్ గ్రంథి పనితీరులో ఇదే కీలకమైన మూలకమని జర్మన్ శాస్త్రవేత్త యూజన్ బామన్ 1896లో గుర్తించాడు. వేలాది గొర్రెల నుంచి సేకరించిన థైరాయిడ్ గ్రంథులను బాగా ఉడికించి, సేకరించిన పదార్థానికి అతడు ‘అయొడో థైరిన్’గా పేరు పెట్టాడు. ఇది జరిగిన కొన్నేళ్లకు అమెరికన్ వైద్యుడు డేవిడ్ మెరైన్ 1907లో థైరాయిడ్ పనితీరుకు అయొడిన్ అత్యవసరమని నిర్ధారణ చేశాడు. థైరాయిడ్ గ్రంథి స్రవించే హార్మోన్లలో కీలకమైన థైరాక్సిన్‌ను 1914లో కనుగొన్నారు. ఆ తర్వాత 1952లో థైరాయిడో థైరాక్సిన్‌ను, 1970లో టి–4, టి–3 హార్మోన్లను గుర్తించారు. అదే ఏడాది అమెరికాకు చెందిన పోలిష్ వైద్యుడు ఆండ్రూ షెల్లీ టీఆర్‌హెచ్ హార్మోన్‌ను గుర్తించాడు. ఈ పరిశోధనకు ఫలితంగా ఆయన 1977లో నోబెల్ బహుమతిని పొందాడు. థైరాయిడ్ గ్రంథి స్రవించే హార్మోన్లను నిర్దిష్టంగా గుర్తించిన తర్వాత, థైరాయిడ్ సమస్యలకు అందించే వైద్య చికిత్స ప్రక్రియలు చాలా వరకు మెరుగుపడ్డాయి. జాతీయాలు అగ్రహారంలో తంబళ జోస్యం అగ్రహారం అంటే పండితులకు రాజులు, సంస్థానాధీశులు దానంగా ఇచ్చిన గ్రామం. సాధారణంగా అగ్రహారాల్లో ఉండేవారంతా మహా పండితులు, సకల శాస్త్ర కోవిదులు. తంబళ అంటే శివార్చనతో పొట్ట పోసుకునే పూజారి. శివాలయంలో అర్చనకు తగిన స్తోత్రాలు నోటికి రావడం తప్ప తంబళకు శాస్త్ర పాండిత్యం శూన్యం. అలాంటి తంబళ ఒకడు వెనకటికి ఒకనాడు అగ్రహారానికి వెళ్లి, అక్కడ తనకున్న మిడిమిడి జ్ఞానంతో జనాలకు జోస్యం చెప్పబోయి నవ్వులపాలయ్యాడట. అసాధారణ ప్రజ్ఞావంతుల ఎదుట మిడిమిడి జ్ఞానం ఉన్న అల్పులు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించి నవ్వులపాలయ్యే సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అందితే జుట్టు, అందకుంటే కాళ్లు ఎలాగైనా అనుకున్న పనిని సాధించుకునే వాళ్లను ఉద్దేశించి వ్యాప్తిలోకి వచ్చిన జాతీయం ఇది. కొందరికి తలచిన పనిని సాధించుకోవడం మాత్రమే ముఖ్యం. తలపెట్టిన పనిని సాధించుకోవడానికి వాళ్లు ఎలాంటి మార్గాన్నయినా అనుసరిస్తారు. పరిస్థితులన్నీ సానుకూలంగా ఉండి, తాను తలపెట్టిన పనిని నెరవేర్చవలసిన ఎదుటి మనిషి బలహీనుడైతే, బలవంతంగానైనా, భయపెట్టయినా మెడలు వంచి మరీ పని జరిపించుకుంటారు. ఎదుటి మనిషి తన కంటే బలవంతుడైతే మాత్రం సిగ్గుశరం పక్కనపెట్టి కాళ్ల బేరానికి వస్తారు. కాళ్లూ గడ్డం పట్టుకుని బతిమాలి అయినా కావలసిన పనిని జరిపించుకుంటారు. నిస్సిగ్గుగా తమ పనులు జరిపించుకునే వారి ధోరణిని తేలికగా చెప్పడానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అజాగళస్తన సగోత్రులు కొందరు పనీపాటా లేకుండా కాలం వెళ్లబుచ్చేస్తూ ఉంటారు. తినడం, తిరగడం, పడుకోవడం తప్ప పొరపాటుగానైనా పనికొచ్చే పనులేవీ చెయ్యరు. ఇంట్లో వాళ్లకు గాని, బంధు మిత్రులకు గాని, ఊళ్లో వాళ్లకు గాని వారి వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. ఇలాంటి వ్యర్థ జీవులను వ్యంగ్యంగా ‘అజాగళస్తన సగోత్రులు’ అని ఆక్షేపిస్తుంటారు. సంస్కృతంలో మేకను అజా అంటారు. కొన్ని మేకలకు మెడ వద్ద చిన్న పొదుగులా ఉండి సిరలు వేలాడుతూ ఉంటాయి. వాటి నుంచి పాలు రావు. అవి ఎందుకూ పనిరావు. దేనికీ పనికిరాని దద్దమ్మలు కూడా మేక మెడకు వేలాడే సిరల్లాంటి వ్యర్థులేనని చెప్పడానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఇల్లలకగానే పండుగవుతుందా? పండుగలకు, పర్వదినాలకు ఇళ్లను అలికి, ముగ్గులు తీర్చిదిద్దడం ఆచారం. అలాగని ఇల్లు అలికినంత మాత్రానే పండుగ జరిగిపోతుందనుకోలేం. ప్రకృతి వైపరీత్యాలు, దుస్సంఘటనలు వంటి అవాంతరాలు ఏవీ లేకుండా ఉంటేనే పిండివంటల వంటకాలు, బంధు మిత్రులు, అతిథి అభ్యాగతుల రాకపోకలతో పండుగ సంబరంగా జరుగుతుంది. కాలం అనుకూలించకుంటే, ఇల్లు అలికినా ఏదో ఒక అవాంతరం ఎదురైతే, ఇక పండుగ పరిస్థితి చెప్పాల్సినదేముంటుంది? ఏదైనా పనిని మొదలుపెట్టడంతోనే అది సజావుగా పూర్తయినట్లు కాదు, నిరాటంకంగా అది పూర్తి కావాలంటే పరిస్థితులన్నీ అనుకూలించాల్సి ఉంటుంది. అప్పుడే పని విజయవంతమవుతుందని చెప్పడానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. రక్తపరీక్షలతో నిర్ధారణ థైరాయిడ్ లోపాలను రక్తపరీక్షల ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. రక్త పరీక్షల ద్వారా థైరాయిడో థైరోనిన్–టి3, థైరాక్సిన్–టి4, థైరాయిడ్ స్టిములంట్ హార్మోన్–టీఎస్‌హెచ్ హార్మోన్ల పరిమాణంలోని హెచ్చు తగ్గులను గుర్తించవచ్చు. అలాగే, రోగ నిరోధక వ్యవస్థ థైరాయిడ్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న సందర్భాల్లో యాంటీ థైరాయిడ్ యాంటీబాడీస్‌ను కూడా రక్త పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. వ్యాధి లక్షణాలు కనిపించినట్లయితే, ఈ పరీక్షలు చేయించుకుని, వైద్యుల సూచన మేరకు మందులు వాడుకుంటూ పరిస్థితిని అదుపులో ఉంచుకోవచ్చు. హైపో థైరాయిడిజమ్ లక్షణాలు ►కొద్దిగా తింటున్నా లావెక్కిపోవడం ►అలసట ►మతిమరపు ►చర్మం, జుట్టు పొడిబారిపోవడం ►కండరాల నొప్పులు ►గోళ్లలో పగుళ్లు ►మలబద్ధకం ►మహిళల్లోనైతే రుతుస్రావంలో తగ్గుదల ►మానసిక కుంగుబాటు ►మెడ వద్ద వాపులా కనిపించడం హైపర్ థైరాయిడిజమ్ లక్షణాలు ►ఎంత తిన్నా బక్కచిక్కిపోవడం ►ఒళ్లంతా వేడిగా అనిపించడం ►అతిగా చెమటలు పట్టడం ►నిద్రలో ఇబ్బందులు ►నిలకడ లేని ఆలోచనలు ►ఆందోళన, అసహనం ►నిష్కారణమైన చిరాకు, అలసట ►గుండె వేగం పెరగడం, గుండె దడ ►మలవిసర్జన క్రమం తప్పడం ►మహిళల్లో నెలసరి సమస్యలు -
దాని వల్ల మధుమేహమా?
ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌ని. అయితే మావారు, అత్తగారు.. చిన్న పని కూడా నన్ను చేయనీయడం లేదు. ఎంతగా విశ్రాంతి తీసుకుంటే, పుట్టబోయే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు. ఇలా ఏ పనీ చేయకుండా ఉండటం వల్ల నాకు బోర్‌గా ఉంది. అయితే, ఇలా అధికంగా విశ్రాంతి తీసుకోవడం వల్ల మధుమేహం, కాళ్లలో రక్తం గడ్డలు వంటి సమస్యలు ఎదురవుతాయని ఒక ఫ్రెండ్ చెప్పింది. నాకు కాస్త కంగారుగా ఉంది. దయచేసి దీని గురించి తెలియజేయగలరు. – ఆర్.శైలజ, నర్సీపట్నం గర్భం దాల్చడం అనేది ఒక సహజమైన ప్రక్రియ. ఈ క్రమంలో గర్భం తొమ్మిది నెలల పాటు సజావుగా జరగడానికి, ఆడవారిలో ప్రకృతి దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటూ పోతుంది. దానికి తగ్గట్లు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అంతే కానీ, ప్రతి ఒక్కరు తప్పకుండా మొత్తానికే విశ్రాంతి తీసుకోవాలని ఏమీ లేదు. కాకపోతే కొందరిలో కొన్ని సమస్యలు అంటే, గర్భాశయ ద్వారం చిన్నదిగా, లూజ్‌గా ఉండటం, మాయ పూర్తిగా కింద భాగంలో ఉండటం, ముందు గర్భాశయంలోని సమస్యల వల్ల అబార్షన్లు అయినప్పుడు మాత్రమే పూర్తిగా విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది. మిగతావారు డాక్టర్ సలహా మేరకు ఇతర ఇబ్బందులు ఏమీ లేనప్పుడు రోజూ చేసుకునే మామూలు పనులు చేసుకోవచ్చు. కొద్దిగా ఇబ్బందిగా, ఆయాసంగా అనిపించే పనులు చేయకపోవడం మంచిది. అవసరం లేకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం వల్లే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఏమీ లేదు. ఇంకా దీనివల్ల బిడ్డ అధిక బరువు పెరగటం, బీపీ, షుగర్, రక్తనాళాలలో రక్తం గూడుకట్టడం, ఆయాసం, కాన్పులో ఇబ్బంది, సిజేరియన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆపరేషన్ తర్వాత అధిక బరువు వల్ల సమస్యలు ఉంటాయి. కాబట్టి డాక్టర్ సలహా మేరకు మీ ఆరోగ్య పరిస్థితి బాగా ఉన్నప్పుడు, మొదటి మూడు నెలలు కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ, మిగతా నెలల్లో తేలికపాటి పనులు చేసుకోవచ్చు. అయిదో నెలలో టిఫా స్కానింగ్ అయిన తర్వాత గర్భాశయ ద్వారం సాధారణంగా ఉంటే, కొద్దిసేపు వాకింగ్, ప్రాణాయామం, తర్వాత మెల్లిగా చిన్నపాటి వ్యాయామాలు చేసుకోవచ్చు. దీనివల్ల శరీరం తేలికగా అనిపిస్తుంది. కాళ్ల నొప్పులు, నడుము నొప్పులను తట్టుకునే శక్తి ఉంటుంది. బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. కాన్పు సులువుగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు యాంటీ డిప్రెజంట్స్ వాడొచ్చా? అలా వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అలాగే మందులు వాడకుండా ‘పోస్ట్–నేటల్ డిప్రెషన్’ తగ్గడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? – కె.కల్పన, పుల్లేటికూరు, తూర్పుగోదావరి జిల్లా కొన్ని రకాల యాంటీ డిప్రెజంట్స్ ప్రెగ్నెన్సీలో వాడటం వల్ల శిశువులో కొన్ని అవయవ లోపాలు, గుండెలో లోపాలు వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని రోజుల పాటు డల్‌గా, చిరాకుగా ఉండటం, పాలు సరిగా తాగకపోవడం వంటి చిన్నచిన్న సమస్యలు ఏర్పడే అవకాశాలూ ఉంటాయి. అలా అని డిప్రెషన్ ఎక్కువగా ఉన్నవాళ్లు... యాంటీ డిప్రెజంట్స్ వాడుతూ ఉండి, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆపేస్తే కూడా తల్లిలో డిప్రెషన్ ఎక్కువగా ఉండటం, ఆహారం సరిగా తీసుకోకపోవడం వంటివి జరుగుతాయి. అలా చేస్తే బిడ్డ సరిగా ఎదగకపోవడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డాక్టర్‌ను సంప్రదించి తక్కువ మోతాదులో దుష్ఫలితాలు లేదా అసలు దుష్ఫలితాలే లేని యాంటీ డిప్రెజంట్స్ను వాడటం మంచిది. కాన్పు తర్వాత కొంతమంది తల్లులలో హార్మోన్లలో మార్పుల వల్ల, బిడ్డ పనులలో అలసిపోవడం, ఇంకా కొన్ని కారణాల వల్ల పోస్ట్ నేటల్ డిప్రెషన్ ఏర్పడుతుంది. దీని తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు యాంటీ డిప్రెజంట్స్ వాడవలసి వస్తుంది. కొద్దిగా కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం. భర్త, తల్లిదండ్రులు, అత్తమామలు వారితో ప్రేమగా ఉండటం, బిడ్డ పనుల్లో చేదోడు వాదోడుగా ఉండటం వల్ల చాలావరకు పోస్ట్ నేటల్ డిప్రెషన్‌ను మందులు లేకుండా అధిగమించొచ్చు. నాకు థైరాయిడ్ ఉంది. దాంతో తల వెంట్రుకలు బాగా రాలిపోతున్నాయి. పూర్తిగా రాలిపోతాయేమోనని భయంగా ఉంది. మొదటిసారి గైనకాలజిస్ట్‌ను కలిసినప్పుడు మందులు రాశారు. అప్పటికి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోలేదు. ఈ మందుల వల్ల యుటెరస్‌కి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నా ఫ్రెండ్ చెబితే వాడలేదు. ట్యాబ్లెట్లు వాడమంటారా? వద్దా ? అనేది తెలియజేయగలరు.– ఎన్.అనూష, హైదరాబాద్ రక్తహీనత, పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి, థైరాయిడ్ హార్మోన్ లోపం, పీసీఓడీ సమస్య, ఇంకా ఇతర హార్మోన్ల అసమతుల్యత వంటి ఎన్నో కారణాల వల్ల తల వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతుంటాయి. థైరాయిడ్ సమస్య ఉంటే దానికి తగ్గ మందులు తగిన మోతాదులో తప్పక వాడవలసి ఉంటుంది. థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం వల్ల యుటెరస్‌కి కానీ ఇంకా ఇతర అవయవాలకు కానీ ఎటువంటి ఇబ్బందీ ఉండదు. వాడకపోతేనే వెంట్రుకలు రాలిపోవడంతో పాటు పీరియడ్స్‌లో అసమతుల్యత, నీరసం, లావు పెరగటం, బద్ధకంగా ఉండటం, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థైరాయిడ్ ట్యాబ్లెట్లతో పాటు అవసరమైతే బి–కాంప్లెక్స్, క్యాల్షియం ట్యాబ్లెట్లు డాక్టర్ సలహా మేరకు వాడటం మంచిది. - డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్‌బోహైదర్‌నగర్ హైదరాబాద్ -
ఇంతే తిన్నా... అంత లావా?
రోజూ తినే రొటీన్ తిండే తప్ప మరేమీ తినకపోయినా లావెక్కిపోతున్నారా..? రాత్రి బాగానే నిద్రపోయినా, పొద్దున్న కునికిపాట్లు తప్పడం లేదా..? చిన్నపాటి పనిచేసినా బాగా అలసిపోతున్నారా..? చిన్న చిన్న విషయాలకే చిరాకుపడిపోతున్నారా..? పని మీద దృష్టి సారించలేకపోతున్నారా..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నట్లయితే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించండి. ఎందుకంటే ఈ లక్షణాలు థైరాయిడ్ సమస్య కావచ్చు. థైరాయిడ్ సమస్యలేవైనా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో్ల తేలినా చాలా వరకు బెంబేలెత్తాల్సినంత పరిస్థితి ఏమీ ఉండదు. వైద్యుల సలహా మేరకు తగిన మందులు క్రమం తప్పకుండా వాడుతూ, జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే చాలు, హాయిగా సాధారణ జీవితం గడపవచ్చు. ఇంతా చేసి ఇరవై గ్రాముల బరువు ఉండే చిన్న గ్రంథి. మెడ వద్ద వాయునాళం చుట్టూ ఆవరించుకుని సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. అది స్రవించే హార్మోన్ కనీసం ఒక బిందువంత కూడా ఉండదు. దాని పనితీరులో ఏమాత్రం తేడా వచ్చినా శరీరంలోని జీవక్రియల్లో పెనుమార్పులే సంభవిస్తాయి. పరిమాణానికి చిన్నదే అయినా, మనిషి ఆరోగ్యంలో కీలకమైన పాత్ర పోషించే ఆ గ్రంథి పేరు థైరాయిడ్. అది రోజు మొత్తంలో స్రవించే హార్మోన్ల పరిమాణం గ్రాములో దాదాపు 28 లక్షల వంతు మాత్రమే. థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తే తలెత్తే సమస్యను హైపోథైరాయిడిజమ్ అంటారు. థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేస్తే తలెత్తే సమస్యను హైపర్ థైరాయిడిజమ్ అంటారు. థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారు ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లకు పైగానే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. వీరిలో దాదాపు 96 శాతం మంది హైపోథైరాయిడిజమ్ బాధితులే. ఇదివరకటి కాలంతో పోలిస్తే, ఇటీవలి కాలంలో థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. థైరాయిడ్ సమస్యలు ఇటీవలి కాలంలో మహమ్మారిలా విస్తరిస్తున్నాయని అంతర్జాతీయ వైద్య, ఆరోగ్య పరిశోధన సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత్‌లోనైతే దాదాపు 32 శాతం జనాభా థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. మన దేశంలో దక్షిణాదిలో కంటే ఉత్తరాదిలోనే ఎక్కువ మంది థైరాయిడ్ బాధితులు ఉన్నారు. పురుషులతో పోలిస్తే ఎక్కువగా మహిళలే థైరాయిడ్ సమస్యల బారిన పడుతున్నట్లు అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. థైరాయిడ్ బాధితుల్లో మహిళల సంఖ్య 60 శాతానికి పైగానే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. ఇవీ లక్షణాలు.. థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారిలో అత్యధికులు థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగించడం వల్ల ‘హైపోథైరాయిడిజమ్’తో సతమతమయ్యే వారే ఎక్కువ. హైపోథైరాయిడిజమ్ సోకినట్లు వెనువెంటనే గుర్తించడం కష్టమే. దిగువ వివరించిన కొన్ని లక్షణాలు వారాల తరబడి కనిపిస్తున్నట్లయితే, వైద్య పరీక్షలు జరిపించుకుని ఒక నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు మందులు వాడటం, ఆహారపు అలవాట్లలో మార్పులు పాటించడం వంటివి చేయాల్సి ఉంటుంది. ♦ రాత్రిపూట ఎనిమిది నుంచి పది గంటల సేపు పూర్తిగా నిద్రపోయినా, పగటి వేళలో కునికి పాట్లు రావడం లేదా మధ్యాహ్నం పూట తప్పనిసరిగా కునుకుతీయనిదే ఉండలేకపోవడం. ♦ ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పు లేకపోయినా, అకస్మాత్తుగా బరువు పెరగడం, ఎంత ప్రయత్నించినా బరువు తగ్గలేకపోవడం. త్వరగా అలసిపోవడం. ♦ భావోద్వేగాలు అదుపులో లేకపోవడం, త్వరగా చిరాకుపడటం, ఆందోళన, కంగారు, మానసిక కుంగుబాటు వంటి లక్షణాలతో సతమతం కావడం. ♦ హార్మోన్ల అసమతుల్యత ఏర్పడటం, లైంగిక ఆసక్తి సన్నగిల్లడం, మహిళల్లోనైతే రుతుక్రమం అస్తవ్యస్తం కావడం, ఒక్కోసారి వంధ్యత్వం కలగడం. ♦ కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, అరచేతులు తిమ్మిరెక్కడం, పట్టులో బలం తగ్గడం. ♦ అరచేతులు, అరిపాదాలు చల్లబడటం. ♦ చర్మం పొడిబారడం, గోళ్లు చిట్లడం, జుట్టు రాలిపోవడం. ♦ జ్ఞాపకశక్తి క్షీణించడం, పని మీద ఏకాగ్రత కుదరకపోవడం. ♦ మలబద్ధకం. ♦ మెడ వద్ద వాపు ఏర్పడినట్లు కనిపించడం లేదా ‘డబుల్‌చిన్’ ఏర్పడటం, గొంతు బొంగురుగా మారడం. ఇవీ కారణాలు హైపోథైరాయిడిజమ్ లేదా హైపర్‌థైరాయిడిజమ్ సమస్యలే కాకుండా, ఒక్కోసారి థైరాయిడ్ గ్రంథిలో చిన్న చిన్న కణితులు ఏర్పడుతుంటాయి. అరుదుగా ఇలాంటి కణితులు థైరాయిడ్ కేన్సర్‌కు దారితీస్తాయి. థైరాయిడ్ గ్రంథిలో వాపు ఏర్పడటం వల్ల ‘థైరాయిడైటిస్’, థైరాయిడ్ గ్రంథి మెడవద్ద ఉబ్బిపోయినట్లుగా కనిపించే ‘గాయిటర్’ వంటి సమస్యలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ♦ ఒక్కోసారి రోగ నిరోధక వ్యవస్థ తిరగబడటం వల్ల కూడా హైపోథైరాయిడిజమ్ సమస్య తలెత్తుతుంది. వ్యాధులతో తలపడే యాంటీబాడీస్ సాధారణంగా వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులపై దాడి చేస్తాయి. అలా కాకుండా, శరీరంలోని జీవకణాలపైనే ఇవి దాడిచేయడం ప్రారంభించడం వల్ల హైపోథైరాయిడిజమ్ తలెత్తుతూ ఉంటుంది. ఇలా తలెత్తే సమస్యను ‘ఆటో ఇమ్యూన్ హైపోథైరాడిజమ్’గా పరిగణిస్తారు. ♦ కొన్ని రకాల మందులను వాడటం వల్ల కూడా హైపోథైరాయిడిజమ్ తలెత్తే అవకాశాలు ఉంటాయి. గుండెకు సంబంధించిన కొన్ని రకాల మందులు, హెపటైటిస్–బి, హెపటైటిస్–సి, కేన్సర్, బైపోలార్ డిజార్డర్ వంటి వ్యాధుల చికిత్సలో భాగంగా వాడే మందుల వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది. ♦ థైరాయిడ్ గ్రంథిలో చోటు చేసుకునే అసహజమైన పెరుగుదల, థైరాయిడ్ గ్రంథిని నియంత్రించే పిట్యూటరీ గ్రంథిలో కణితులు ఏర్పడటం వంటి సమస్యలు కూడా హైపోథైరాయిడిజమ్ తలెత్తవచ్చు. ♦ అయొడిన్ లోపం వల్ల, జన్యు లోపాల వల్ల, వంశపారంపర్య కారణాల వల్ల కూడా థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగించి, హైపోథైరాయిడిజమ్ తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఆహారంలో అయోడిన్ లోపిస్తే, టి–3, టి–4 హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయి, థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది. ♦ థైరాయిడ్ గ్రంథిలో కేన్సర్ ఏర్పడినప్పుడు శస్త్రచికిత్స ద్వారా గ్రంథిని పూర్తిగా తొలగించాల్సిన పరిస్థితిలో కూడా హైపోథైరాయిడిజమ్ తలెత్తుతుంది. ♦ హైపోథైరాయిడిజమ్ ఉన్నట్లు తేలితే వైద్యుల సలహాపై జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. మందులతో పాటు జీవనశైలిని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా అదుపు చేయవచ్చు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా హైపోథైరాయిడిజమ్ వల్ల తలెత్తే ఇబ్బందులను చాలా వరకు అదుపు చేయవచ్చు. థైరాయిడ్ పనితీరు మందగించినప్పుడు మీ జీవనశైలిలో మీరు చేపట్టాల్సిన మార్పులు... ♦ థైరాయిడ్ సమస్యలు ఎదుర్కొనే వారికి నిద్రలో సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. హైపోథైరాయిడిజమ్‌తో బాధపడేవారు రాత్రి నిద్రపోయినా, పగలు మగతగానే ఉంటారు. నాణ్యమైన నిద్ర పట్టకపోవడమే దీనికి కారణం. అందుకే నిద్రపోయే ముందు రిలాక్స్ కావడానికి ప్రయత్నించాలి. పడక గదిలో ఉష్ణోగ్రత మరీ ఎక్కువ, మరీ తక్కువ కాకుండా చూసుకోవాలి. శబ్దాలతో నిద్రకు భంగం కలగకుండా జాగ్రత్త పడాలి. ♦ హైపోథైరాయిడిజమ్ బాధితులకు భావోద్వేగాల్లో మార్పులు వస్తుంటాయి. ధ్యానం చేయడం, తేలికపాటి వ్యాయామం చేయడం, ఆహ్లాదభరితమైన సంగీతం వినడం వంటి చర్యల ద్వారా ఒత్తిడిని, మానసిక ఆందోళనను, కుంగుబాటును అధిగమించవచ్చు. ♦ హైపో థైరాయిడిజమ్ బాధితులకు రోజంతా మందకొడిగా అనిపించడం సహజం. అలాగని స్తబ్దుగా ఉండిపోతే ఫలితం ఉండదు. శరీరానికి పని చెప్పాల్సిందే. నడక, జాగింగ్, మెట్లు ఎక్కడం వంటి వాటితో పాటు రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. వ్యాయామం వల్ల బరువును అదుపులో ఉంచుకోవడానికి వీలవుతుంది. ♦ హైపోథైరాయిడిజమ్‌తో బాధపడేవారు ప్రత్యేకంగా పథ్యాలేవీ పాటించకపోయినా సమతుల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారంలో పొట్టుతో కూడిన ధాన్యాలు, పప్పులు, గింజలు, కూరగాయలు, ఆకుకూరలు పుష్కలంగా ఉండేలా చూసుకోవడం మంచిది. హానికలిగించే చెడు కొవ్వులకు, చక్కెరకు వీలైనంత దూరంగా ఉండటం క్షేమం. ♦ ఒకవేళ క్రీడాకారులకు హైపోథైరాయిడిజమ్ పరిస్థితి ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలితే, వారు పూర్తిగా క్రీడలకు దూరం కావాల్సిన అవసరమేమీ ఉండదు గాని, అతిగా ప్రాక్టీస్ చేయడం, మితిమీరిన వ్యాయామం వంటివి తగ్గించుకోవాలి. తేలికపాటి వ్యాయామాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానుకోకూడదు. హైపర్ థైరాయిడిజమ్ లక్షణాలు ♦ ఆకలి అకస్మాత్తుగా పెరగడం లేదా తగ్గిపోవడం. ♦ బాగానే తింటున్నా బరువు తగ్గిపోవడం. ♦ నిద్రపోవడానికి తంటాలు పడాల్సి రావడం. తగినంత నిద్ర పట్టకపోవడం ♦ త్వరగా అలసట కలగడం. ♦ఒక్కోసారి తరచుగా మలవిసర్జనకు వెళ్లాల్సి రావడం. ♦ గుండెదడ కలగడం, వేడిని తట్టుకోలేకపోవడం. ♦ ఎక్కువగా చెమటలు పట్టడం. ♦ మహిళల్లోనైతే తగినంత రుతుస్రావం కనిపించకపోవడం. ♦ మానసిక ఆందోళన, భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోవడం. ♦ కండరాలు బలహీనపడటం. ♦ సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణించడం. ♦ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు. ♦ అకస్మాత్తుగా కాళ్లు చేతులు చచ్చుబడటం. ♦వణుకు రావడం. దురదలు, దద్దుర్లతో బాధపడటం ♦ కనుగుడ్లు బయటకు పొడుచుకు వచ్చినట్లుగా కనిపించడం. ♦ మందకొడిగా అనిపించడం... వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదుపు చేయడం ఇలా... ♦ ఒకవేళ హైపర్థైరాయిడిజమ్తో బాధపడుతున్నట్లయితే, ఆహారంలో మరిన్ని కేలరీలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా బాగా ప్రొటీన్లు, ఆరోగ్యవంతమైన కొవ్వులు, కార్బొహైడ్రేట్లు, క్యాల్షియం, విటమిన్–డి ఉండే పాలు, గుడ్లు, మాంసం వంటి పదార్థాలతో పాటు పండ్లు, కూరగాయలు పుష్కలంగా తీసుకుంటూ ఉండాలి. ♦ కండరాలు త్వరగా క్షీణించిపోకుండా ఉండటానికి, వాటికి తగినంత సత్తువ ఇవ్వడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. హైపర్థైరాయిడిజమ్తో బాధపడేవారికి ముఖ్యంగా బరువులు ఎత్తడం వంటి వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. ♦ కనుగుడ్లు ముందుకు పొడుచుకు వస్తున్న పరిస్థితి ఎదురైతే, కళ్లలో వాపు తగ్గడానికి, తేమ ఆరిపోకుండా ఉండటానికి వైద్యుల సలహాతో ఐడ్రాప్స్ వాడటంతో పాటు, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు గాగుల్స్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ పడుకునేటప్పుడు తల కాస్త ఎత్తుగా ఉండేలా దిండ్లు వాడటం మంచిది. దీని వల్ల కళ్లపై ఒత్తిడి తగ్గడంతో పాటు ఒంటిపై వాపులు ఏర్పడకుండా ఉంటాయి. ♦ ఒత్తిడికి దూరంగా ఉండటం, సానుకూల దృక్పథం పెంపొందించుకోవడం కూడా ముఖ్యం. ధ్యానం, సంగీతాన్ని ఆలకించడం వంటి పనుల ద్వారా భావోద్వేగాల్లో అలజడి చాలావరకు సద్దుమణుగుతుంది. నిర్ధారణ పరీక్షలు టీ3, టీ4, టీఎస్‌హెచ్, ఎఫ్టీ3, ఎఫ్టీ4 అనే పరీక్షలు హార్మోన్ స్రావంలోని తేడాలను పరీక్షించి వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. ఈ పరీక్షలతో అది హైపర్ థైరాయిడిజమా, ప్రాథమిక హైపోథైరాయిడిజమా, లేక ద్వితీయ స్థాయి, తృతీయ స్థాయి హైపోథైరాయిడిజమా అన్నది నిర్ధారణ చేయవచ్చు. ఆటో యాంటీబాడీ పరీక్షలతో అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అవునో కాదో తెలుస్తుంది. కణితుల నిర్ధారణకు... ఎఫ్ఎన్ఏసీ (ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ సైటాలజీ), బయాప్సీ వంటి పరీక్షల సహాయంతో కణితులు హానికరమైనవా, కాదా అన్నది తెలుసుకుంటారు. ఇతర హార్మోన్ పరీక్షలు, అవసరాన్ని బట్టి ఇతర పరీక్షలు గర్భవతిగా ఉన్నప్పుడు థైరాయిడ్ హార్మోన్ ప్రాధాన్యం గర్భవతిగా ఉన్న సమయంలో తల్లిలోని థైరాయిడ్ హార్మోన్ బిడ్డ మెదడు, నాడీ వ్యవస్థల పెరుగుదలకు దోహదపడుతుంది. తల్లికి థైరాయిడ్ లోపం ఉండి, చికిత్స చేయించకపోతే బిడ్డ మెదడు ఎదుగుదలలో తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటప్పుడు తల్లికి తగిన మోతాదులో థైరాక్సిన్ మాత్రలు ఇవ్వడం ద్వారా బిడ్డకు కలిగే లోపాలను నివారించవచ్చు. ప్ రెగ్నెన్సీ సమయంలో తల్లి రక్తంలో టీఎస్‌హెచ్ మోతాదును తక్కువ స్థాయిలో ఉంచాలి. తల్లిలో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లయితే అది బిడ్డ ఎదుగుదలను తగ్గించవచ్చు. అంటే ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ రావచ్చన్నమాట. అందుకే ఇలాంటి సందర్భంలో యాంటీ థైరాయిడ్ మందులను తగిన మోతాదులో ఇస్తూ, తల్లిలో థైరాయిడ్ హార్మోన్‌ను సరిగా ఉండేలా నియంత్రించడం ద్వారా బిడ్డకు కలిగే దుష్ప్రభావాలను నివారించవచ్చు. -
థైరాయిడ్ ‘తేడా’తో గుండె జబ్బులు
న్యూయార్క్: థైరాయిడ్ గ్రంధి పనితీరులో చిన్నపాటి తేడా ఏర్పడినా తీవ్రమైన హృద్రోగ సమస్యలు తలెత్తవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. ఈ తాజా పరిశోధన మేరకు తీవ్రమైన గుండె జబ్బులు ఉన్నవారిలో థైరాయిడ్ హార్మోన్లుగా పిలిచే టీఎస్‌హెచ్(థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్), టీ4ల స్థాయి ఎక్కువగా, టీ3 స్థాయి తక్కువగా ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిశోధకులు గుర్తించారు. టీ4 స్థాయి ఎక్కువైతే గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయని నిర్ధారించారు. ఇందు కోసం మొత్తం 1,382 మంది హృద్రోగ బాధితులపై పరిశోధన చేశారు. టీఎస్‌హెచ్ స్థాయి 7 ఎంఐయు/లీ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ప్రాణాపాయం సంభవించే అవకాశాలున్నాయని పరిశోధకుల్లో ఒకరైన భారతీయ శాస్త్రవేత్త లక్ష్మీ కణ్ణన్ చెప్పారు. థైరాయిడ్ పనితీరు మందగించడంతో ఏర్పడే హైపోథైరాయిడిజం వల్ల గుండెకు కృత్రిమ యంత్రాల సాయం అవసరమవచ్చని కొన్ని సందర్భాల్లో మరణం సంభవిస్తుందన్నారు. -
హైపర్‌థైరాయిడిజమ్ తగ్గుతుంది
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 27 ఏళ్లు. ఈమధ్య బరువు తగ్గడం, నీరసం, ఎంత తిన్నా ఆకలిగా ఉండటం, గుండెదడ ఉంటోంది. డాక్టర్ గారికి చెబితే థైరాయిడ్‌కు సంబంధించి టీ3, టీ4, టీఎస్‌హెచ్ పరీక్షలు చేయించమన్నారు. ఈ సమస్య ఏమై ఉండవచ్చు. దీనికి పరిష్కారమార్గాలు చెప్పండి. – సునీత, హైదరాబాద్ థైరాయిడ్ సమస్య ఇటీవల ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తోంది. ప్రపంచ జనాభాలో దాదాపు 75 శాతం మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య పురుషులతో పోలిస్తే మహిళల్లో చాలా ఎక్కువ. మానవుడి శరీరంలో అతి ముఖ్యమైన గ్రంథులలో థైరాయిడ్ ఒకటి, థైరాయిడ్ గ్రంథి మెడ మధ్య భాగంలో గొంతుకు ముందువైపున సీతాకోకచిలుక ఆకారంలో శ్వానాళానికి ఇరుపక్కలా ఉంటుంది. ఈ గ్రంథి పిట్యూటరీ గ్రంథి అధీనంలో ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరులో ముఖ్యంగా రెండు తేడాలను చూస్తాం. వాటిల్లో థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గడం వల్ల కలిగే హైపోథైరాయిడిజమ్ ఒకటి. ఇక రెండోది థైరాయిడ్ గ్రంథి పనితీరు పెరగడం వల్ల కలిగే హైపర్‌థైరాయిడిజమ్. ఈ సమస్యలు ఏ వయసు వారిలోనైనా రావచ్చు. అయితే 20–40 ఏళ్ల మధ్యవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీది హైపర్ థైరాయిడిజమ్ కావచ్చని తెలుస్తోంది. ఈ సమస్యను త్వరగా గుర్తించకపోయినా లేదా నిర్లక్ష్యం చేసినా దుష్ప్రభావాలు ఎక్కవగా కనిపిస్తాయి. థైరాయిడ్ గ్రంథిలో వాపు, ఇన్ఫ్లమేషన్ వంటి కారణాలతో సమస్య రావచ్చు. లక్షణాలు: ∙కోపం, చికాకు, నీరసం ∙అలసట, ఉద్రేకం, కాళ్లు చేతులు వణకడం ∙హైపర్ థైరాయిడిజమ్‌లో ఆకలి బాగా ఉంటుంది. కానీ బరువు తగ్గుతుంది ∙అధిక వేడిని తట్టుకోలేకపోవడం ∙నిద్రలేమి, గుండెదడ, చెమటలు పట్టడం ∙ఏకాగ్రత సమస్యలు, స్త్రీలలో నెలసరి త్వరగా రావడం. నిర్ధారణ పరీక్షలు: టీ3, టీ4, టీఎస్‌హెచ్ స్థాయులు, రక్తపరీక్షలు, థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్ చికిత్స: హోమియోపతి వైద్యవిధానంలో థైరాయిడ్ రావడానికి గల మూలకారణాన్ని విశ్లేషించి, శారీరక, మానసిక లక్షణాలను విచారించి, సరైన హోమియో మందులను వాడటం ద్వారా చికిత్స చేస్తారు. హైపర్‌థైరాయిడ్ సమస్యకు హోమియోలో కాల్కేరియా ఫాస్, కాల్కేరియా కార్బ్, ఐయోడమ్, స్పాంజియా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని అనుభవజ్ఞులైన డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ గొంతును ఎక్కువగా వాడేవారికి జాగ్రత్తలివే... ఇఎన్‌టి కౌన్సెలింగ్ నేను ట్యూషన్స్ చెబుతుంటాను. ఇటీవల అప్పుడప్పుడూ నాకు గొంతు బొంగురుపోయినట్లుగా అనిపిస్తోంది. నా గొంతు విషయంలో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. – ఎన్.ఎల్. ప్రసాద్, వరంగల్ కొంతమందికి గొంతుతోనే పనిచేస్తుంటారు. వీరిని ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్ అంటారు. అంటే ఉపాధ్యాయులు, లెక్చరర్లు, గాయకులు, రేడియోజాకీలు, సేల్స్ జాబ్‌లో ఉన్నవాళ్లంతా రోజూ తమ గొంతుతోనే పనిచేస్తూ ఉంటారు. వారి రోజువారీ పనులతో వాళ్ల వోకల్ కార్డ్స్ ఎంతగానో అలసిపోతాయి. ఇలాంటివారు ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ⇒ రోజులో కనీసం 15 నిమిషాల పాటు చొప్పున మూడుసార్లైనా తమ గొంతుకు పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయాలి. హైపర్‌థైరాయిడిజమ్ తగ్గుతుంది రోజూ నీళ్లు పుష్కలంగా తాగాలి. ⇒ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. పొగాకు అలవాటును తక్షణం వదిలేయాలి. కాఫీ అలవాటును పూర్తిగా తగ్గించుకోవాలి. ⇒గొంతు గరగర వచ్చి అది సుదీర్ఘకాలం ఉంటే తప్పకుండా ఈఎన్టీ నిపుణులను కలుసుకొని తగిచన చికిత్స తీసుకోవాలి. కొందరిలో యాసిడ్ పైకి ఎగజిమ్మడం వల్ల కూడా గొంతులో సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఇలాంటివారు తప్పకుండా తమ ఎసిడిటీ తగ్గించుకోవడం కోసం కృషి చేయాలి. నాకు తరచూ జలుబు చేస్తోంది. గత కొంతకాలం నుంచి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. రోజువారీ పనులు చేసుకోడానికి కూడా కుదరడం లేదు. జలుబు టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. ఆ తర్వాత పదే పదే వస్తోంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – రవికుమార్, శ్రీకాకుళం మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తే మీకు ‘నేసల్ అలర్జీ’ ఉండవచ్చు అనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఈ సమస్య ఇబ్బంది ఉందన్నారు. కాబట్టి దీనికి మీరు సరైన చికిత్స తీసుకోలేదని అనిపిస్తోంది. ముక్కు, చెవి, గొంతు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి. దాంతో ఒక భాగంలో సమస్య వస్తే అది మిగతా రెండు చోట్లా సమస్యలకు దారితీయవచ్చు. యాంటీ అలర్జిక్ టాబ్లెట్ వాడటం శాశ్వత పరిష్కారం కాదు. దాన్ని ఎక్కువగా వాడటం వల్ల కొన్ని ఇతర సమస్యలు కూడా రావచ్చు. దీనికంటే ‘నేసల్ స్ప్రే’లు వాడటం కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. వాటితో సైడ్ఎఫెక్ట్స్ కూడా తక్కువ. మీరు ముందుగా నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం చికిత్స తీసుకోండి. మీకు అలర్జీ కలిగించే అంశాలను గుర్తించి వాటి నుంచి దూరంగా ఉండండి. డాక్టర్ ఇ.సి. వినయకుమార్ హెచ్ఓడి – ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ -
హైపోథైరాయిడిజమ్ తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 34 ఏళ్లు.ఈ మధ్య నేను బరువు పెరుగుతున్నాను. నా పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం వల్ల టీఎస్‌హెచ్ పరీక్ష చేశారు. హైపోథైరాయిడిజమ్ ఉందని తెలిసింది. నేను జీవితాంతం మందులు వాడాల్సిందేనా? హోమియోలో శాశ్వతంగా తగ్గించే మందులు ఏమైనా ఉన్నాయా? – కుసుమ, భువనగిరి మానవ శరీరంలో థైరాయిడ్ గ్రంథి ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. శరీరంలోని వివిధ రకాల జన్యుక్రియల సమతౌల్యతకు టీ3, టీ4, టీఎస్‌హెచ్ హార్మోన్లు ఉపయోగపడతాయి. హైపోథైరాయిడ్ బరువు పెరిగే సమస్య. హైపోథైరాయిడిజమ్ అనేది మానవ శరీరంలో థైరాయిడ్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వల్ల వస్తుంది. ఈ ఆధునిక కాలంలో సుమారు మూడు శాతం మంది హైపోథైరాయిడిజమ్‌తో బాధపడుతున్నారు. ఆకస్మికంగా బరువు పెరగడం ఈ సమస్యను సూచిస్తుంది. హైపోథైరాయిడిజమ్ ఏ వయసులోని వారికైనా రావచ్చు. స్త్రీలలో, పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. శిశువుల్లో క్రెటినిజం అనే ఒక రకమైన హైపోథైరాయిడిజమ్ వస్తుంది. థైరాయిడిజమ్ నుంచి తగినంత మోతాదులో హార్మోన్ టీ3, టీ4 ఉత్పన్నం కావడానికి మన శరీరంలో చాలినంత అయోడిన్, టీఎస్‌హెచ్ (మెదడులోని పిట్యుటరీ గ్రంథి నుంచి ఉత్పన్నమయ్యే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) అవసరం. అయోడిన్ లోపించడం వల్ల హైపోథైరాయిడిజమ్ సమస్య వస్తుంది. లక్షణాలు: ∙ బరువు పెరగడం, కాళ్లు చేతుల్లో నీరు చేరడం ∙జుట్టు రాలడం, చర్మం పొడిబారినట్లు ఉండటం, మలబద్దకం ∙గొంతు బొంగురుపోవడం, తొందరగా అలసిపోవడం, కండరాల నొప్పి, ∙కోపం, అలసట, నిరాశ, కీళ్లనొప్పి ∙రుచి, వాసన, స్పర్శ తగ్గడం ∙సంతానలేమి, నీరసం, డిప్రెషన్ నిర్ధారణ పరీక్షలు: రక్తపరీక్షలు, థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్. చికిత్స: హైపోథైరాయిడిజమ్ సమస్యను అదుపు చేసే ఔషధాలు మందులు హోమియో విధానంలో అందుబాటులో ఉన్నాయి. అయితే అవి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. హోమియోపతిలో సాధారణంగా కాల్కేరియా కార్బ్, కాల్కేరియా ఫాస్, అయోడమ్, థైరాడినమ్, స్పాంజియా వంటి మందులను రోగుల లక్షణాలను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడటం వల్ల హైపోథైరాయిడిజమ్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ తరచూ మూత్రంలో మంట.. ఎందుకిలా? నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 36 ఏళ్లు. తరచుగా జ్వరం. మూత్రవిసర్జన సమయంలో విపరీతమైన మంట ఉంటోంది. ఇలా మాటిమాటికీ జ్వరం, మంట రాకుండా ఉండేందుకు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? – నీరజ, కాకినాడ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్’తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా మీకు మాటిమాటికీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వస్తున్న కారణం ఏమిటన్నది తెలుసుకోవాలి. మీకు షుగర్ ఉంటే కూడా ఇలా మాటిమాటికీ యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఒకసారి మీరు షుగర్ టెస్ట్ చేయించుకోండి. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకొని మూత్రవిసర్జన వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లుగానీ, మూత్రనాళాల్లో వాపుగానీ ఉన్నాయేమో చూడాలి. మీకు డాక్టర్ ఇచ్చిన యాంటీబయాటిక్ పూర్తి కోర్సు వాడకుండా ఉన్నా కూడా మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్స్ తిరగబెట్టవచ్చు. మీకు ఏ కారణం లేకుండా ఇన్ఫెక్షన్ వస్తుంటే కనీసం మూడు నెలల పాటు యాంటీబయాటిక్స్ వాడాలి. రోజూ నీళ్లు ఎక్కువగా (అంటే రెండు నుంచి మూడు లీటర్లు) తాగాలి. మూత్రం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఆపుకోకుండా, వెంటనే మూత్రవిసర్జనకు వెళ్లాలి. నాకు 34 ఏళ్లు. అప్పుడప్పుడూ మూత్రం ఎర్రగా వస్తోంది. గత ఐదేళ్ల నుంచి ఇలా జరుగుతోంది. రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ లేదు. ఇలా రావడం వల్ల భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తుందా? కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? – ప్రవీణ్‌కుమార్, పాలకొండ మీరు చెప్పినట్లుగా మూత్రంలో రక్తం చాలాసార్లు పోతుంటే... ఎందువల్ల ఇలా జరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. దానికి తగినట్లుగా చికిత్స తీసుకోవాలి. ఇలా మాటిమాటికీ మూత్రంలో రక్తస్రావం అవుతుండటానికి కిడ్నీలో రాళ్లు ఉండటం, ఇన్ఫెక్షన్ ఉండటం, కిడ్నీ సమస్య లేదా మరేదైనా కిడ్నీ ఇబ్బంది (గ్లోమెరూలో నెఫ్రైటిస్ వంటిది) ఉండవచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోండి. మూత్రపరీ„ý కూడా చేయించుకోవాలి. కిడ్నీలో రాళ్లుగానీ, ఇన్ఫెక్షన్ గానీ లేకుండా ఇలా రక్తం వస్తుంటే మూత్రంలో ప్రోటీన్ పోతుందేమోనని కూడా చూడాలి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఒకవేళ రక్తంతో పాటు ప్రోటీన్ కూడా పోతుంటే కిడ్నీ బయాప్సీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కిడ్నీలు దెబ్బతినకుండా ఉండేందుకు మందులు వాడాల్సి ఉంటుంది. నా వయసు 28 ఏళ్లు. నాకు ఏ విధమైన ఇబ్బందులూ లేవు. కానీ జ్వరం వచ్చినప్పుడు ఒకసారి డాక్టర్‌కు చూపించుకుంటే బీపీ 170 / 120 అని చెప్పి, మందులు వాడాలన్నారు. మందులు వాడకపోతే భవిష్యత్తులో కిడ్నీ సమస్య వచ్చే అవకాశం ఉందా? – మనోహర్, కోదాడ ఈ వయసులో ఏ కారణం లేకుండా బీపీ రావడం చాలా అరుదు. ముఫ్ఫై ఏళ్లలోపు బీపీ ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ సమస్య ఏమైనా ఉందేమోనని చూడాలి. మీరు ముందుగా యూరిన్ టెస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్, క్రియాటినిన్‌తో పాటు కొన్ని ఇతర పరీక్షలు చేయించుకోండి. ఏ లక్షణాలూ లేనప్పటికీ బీపీ నియంత్రణలో ఉండటానికి మందులు వాడాలి. లేకపోతే భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంది. మందులు వాడటమే కాకుండా, ఆహారంలో ఉప్పు బాగా తగ్గించడం వంటి జీవనశైలికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా ఒక గంటకు తగ్గకుండా వాకింగ్ చేయాలి. బరువు ఎక్కువగా ఉన్నట్లయితే, మీ ఎత్తుకు తగినట్లుగా దాన్ని నియంత్రించుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే తప్పనిసరిగా మానేయాలి. నా వయసు 62 ఏళ్లు. షుగర్‌వల్ల రెండు కిడ్నీలూ పనిచేయడం లేదు. రెండేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. ఫిస్టులా ఆపరేషన్ కూడా అయ్యింది. డయాలసిస్ చేయించుకుంటున్న సమయంలో చలి, వణుకు వస్తున్నాయి. డయాలసిస్ కాకుండా ఇంకేమైనా పద్ధతులున్నాయా? – భూమయ్య, కరీంనగర్ ఇప్పుడు వాడుతున్న క్యాథెటర్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది. మొదట ఈ ఇన్ఫెక్షన్ తగ్గడానికి తగ్గడానికి మందులు వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత పర్మ్ క్యాథ్ ద్వారా డయాలసిస్ చేయించుకోవడం మంచిది. ఇలా ఫిస్టులా సమస్య ఉన్నప్పుడు హోమ్ డయాలసిస్ (కంటిన్యువస్ ఆంబుల్యేటరీ పెరిటోనియల్ డయాలసిస్–సీఏపీడీ) చేయించుకోవడం మేలు. సీఏపీడీ వల్ల ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. ఇంట్లోనే ఉండి, ఈ డయాలసిస్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ వృత్తినిర్వహణకూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. హోమ్ డయాలసిస్‌కు అయ్యే ఖర్చు హాస్పిటల్స్ డయాలసిస్ కంటే తక్కువ. కాబట్టి ఒకసారి మీ నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించి ఈ వివరాలు తెలుసుకోండి. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ స్టెమ్‌సెల్ థెరపీ అందుబాటులోకి వచ్చిందా? న్యూరో కౌన్సెలింగ్ నేను గత 15 ఏళ్లుగా పక్షవాతం (పెరాలసిస్) వ్యాధితో బాధపడుతున్నాను. అయితే పెరాలసిస్‌కు మూలకణ చికిత్స (స్టెమ్‌సెల్ థెరపీ) అందుబాటులోకి వచ్చినట్లు వార్తాపత్రికల్లో చదివాను. ఈ చికిత్స ప్రస్తుతం ఎక్కడ లభ్యమవుతోంది, దీనికి ఎంత ఖర్చవుతుంది, దాని ఫలితాలు ఎంత మెరుగ్గా ఉంటాయన్న విషయాలను వివరంగా తెలియజేయగలరు. – శివకుమార్ రావు, కాళహస్తి ఒకసారి మెదడులోని కణాలు చనిపోతే అవి శాశ్వతంగా చనిపోయినట్టే. అది పక్షవాతం వల్ల చనిపోయినా లేదా మెదడుకు గాయం కావడం వల్ల చనిపోయినా మెదడులోని కణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ పునరుజ్జీవించలేవు. ఇలాంటి సమయంలో గతంలో మనం నేర్చుకున్న అవశాలను తిరిగి పొందడానికి దెబ్బతిన్న కణాలకు పక్కనే ఉండే కణాలు తోడ్పడతాయి. దాంతో మనం పోగొట్టుకున్న అంశం మళ్లీ మనకు దక్కుతుంది. మన మెదడుకు ఉన్న ఈ అద్భుతమైన శక్తిని ‘న్యూరోనల్ ప్లాస్టిసిటీ’ అని వ్యవహరిస్తారు. సాధారణంగా 80 శాతం మేరకు కోలుకోడానికి ఆర్నెల్ల నుంచి ఏడాది వ్యవధి పడుతుంది. ఇక మూలకణాలతో చికిత్స అంటే... ఇవి మన శరీరంలోని ఎలాంటి కణాలుగానైనా మారేశక్తి ఉన్న కణాలన్నమాట. పక్షవాతానికి మూలకణాలతో చికిత్స చేసే ప్రక్రియ విషయంలో రెండు రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాం. మొదటిది... మెదడులోనే చెడిపోయి ఉన్న కణాలను కొన్ని మందుల ద్వారా మళ్లీ ప్రేరేపించి పనిచేయించేలా చూడటం; ఇక రెండోది... బయటి నుంచి మూలకణాలను శరీరంలోకి పంపడం. అంటే ఉదాహరణకు చెడిపోయిన మూలుగ స్థానంలో కొత్త కణాలు పంపి, కొత్త మూలుగను రూపొందించడం అన్నమాట. ఇక చనిపోయిన మెదడుకణాల స్థానంలో మూలకణాలను ప్రవేశపెట్టడం అనేది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. ఇందులో మూలకణాలు పాతకణాలతోనూ, న్యూరాన్ల దారులతో అనుసంధానితం అయి, అక్కడి రసాయన చర్యలకు అనుగుణంగా స్పందిస్తూ ఉండటానికి చాలాకాలం పడుతుంది. ఇందుకు కొన్నేళ్ల వ్యవధి కూడా పట్టవచ్చు. ఇవ్వాళ్టికీ ఈ విషయంలో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికి వచ్చిన ఫలితాలు అంత సంతృప్తికరంగా లేవు. కాబట్టి ప్రస్తుతానికి మూలకణ చికిత్స అన్నది పరిశోధనదశలోనే ఉంది. ఇంకా చికిత్స వరకూ రాలేదు. డాక్టర్ బి.చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరాలజిస్ట్ సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం.12 బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఎప్పటికీ పిల్లలు పుట్టరేమోనని...
సందేహం నా వయసు 28. పెళ్లై రెండేళ్లు అవుతోంది. మొదటి ఏడాది పిల్లలు వద్దనుకొని పిల్స్ వాడాను. కానీ రెండో సంవత్సరం ఎలాంటి మందులు వాడలేదు. అయినా నాకింకా పిల్లలు కావడం లేదు. నా బరువు 64 కిలోలు. థైరాయిడ్ ఉంది. నా సమస్య ఏంటంటే... ఇటీవలి కాలంలో పిల్లలు కాకపోవడానికి పీసీఓడీ అనే సమస్యే కారణమని టీవీల్లో, పేపర్లో చదువుతున్నాను. నాకు కూడా అలాంటి సమస్య ఏదైనా ఉందేమోనని భయంగా ఉంది. ఎప్పటికీ పిల్లలు పుట్టరేమోనని చాలా భయంగా ఉంది. అత్తింటి వారి నుంచి సూటిపోటి మాటలు మొదలయ్యాయి. పీసీఓడీ సమస్య ఉంటే, ఎలాంటి లక్షణాలు ఉంటాయో దయచేసి చెప్పండి. - ప్రభావతి, కాకినాడ మీ బరువు రాశారు కానీ ఎత్తెంతో రాయలేదు. మీ పీరియడ్స్ సక్రమంగా నెల నెలా వస్తున్నాయో లేదో రాయలేదు. పీసీఓడీ అంటే గర్భాశయం ఇరువైపుల ఉండే అండాశయాలలో చిన్న చిన్న నీటి బుడగలు ఎక్కువగా ఉండడం. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. సాధారణంగా అండాశయాలలో 5-8ఎంఎం ఫాలికల్స్ ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి 5 నుంచి 8 వరకు ఉంటాయి. పీసీఓడీ ఉన్నవారిలో చిన్న ఫాలికల్స్ 10,12 నుంచి ఇంకా ఎక్కువగా ఉంటాయి. మగవారిలో ఎక్కువగా విడుదలయ్యే టెస్టోస్టిరాన్ హార్మోన్, ఈ పీసీఓడీ ఉండే ఆడవారిలో ఎక్కువగా తయారవుతుంది. దీనివల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, మొటిమలు ఎక్కువగా రావడం, జుట్టు రాలిపోవడం, అవాంఛిత రోమాలు రావడం, కొందరిలో బరువు పెరగటం, మెడచుట్టూ చర్మం నల్లగా మందంగా ఏర్పడటం వంటి ఎన్నో లక్షణాలు కనిపించవచ్చు. అందరికీ అన్నీ ఉండాలని ఏమీ లేదు. వారిలో విడుదలయ్యే హార్మోన్ల మోతాదును బట్టి లక్షణాల తీవ్రత ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల నెలనెలా పెరిగి విడుదలయ్యే అండం, పీసీఓడీ ఉన్నవారిలో అండం పరిమాణం పెరగకపోవడం, విడుదల అవ్వకపోవడం వల్ల గర్భం ధరించడానికి ఇబ్బంది ఉంటుంది. కొంతమందిలో గర్భం వచ్చినా అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జన్యుపరమైన కారణాలు, అధిక బరువు, జీవనశైలిలో మార్పులు, ఇంకా తెలియని ఎన్నో కారణాల వల్ల పీసీఓడీ ఏర్పడుతుంది. ఈ మధ్యకాలంలో 10 ఏళ్ల పిల్లల నుంచి 40 ఏళ్ల వారి వరకు వస్తుంది. పేపర్లు, టీవీలు చూసుకుంటూ మీకు కూడా ఈ సమస్య ఉందేమోనని భయపడుతూ ఇంట్లోనే కూర్చుంటే ఎలా? పిల్లలు కాకపోవడానికి పీసీఓడీ ఒక్కటే సమస్య కాదు, థైరాయిడ్ సమస్య, ఇతర హార్మోన్లలో లోపాలు ఉండొచ్చు. ముందుగా మీరు ఓసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, మీలో ఏమైనా సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి స్కానింగ్, రక్త పరీక్షలు, హార్మోన్ల పరీక్షలు వంటివి చేయించుకొని, అలాగే మీ వారికి కూడా వీర్య పరీక్ష చేయించి, సమస్యను బట్టి చికిత్స తీసుకోండి. కొందరిలో ఎటువంటి సమస్య లేకపోయినప్పటికీ గర్భం కోసం ప్రయత్నించేటప్పుడు 80శాతం మందే మొదటి ఏడాది లోపుల ప్రెగ్నెంట్ అవుతారు. 15 శాతం మంది రెండో సంవత్సరం అవుతుంటారు. మిగతా 5 శాతం మందికి మాత్రమే చికిత్స అవసరం ఉంటుంది. నా వయసు 25. మూడేళ్ల నుంచి నేను ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నాను. అతను కూడా నన్ను ప్రేమించాడు. ఆ అబ్బాయి నాకన్నా ఒక సంవత్సరం చిన్నవాడు. ఇన్ని రోజులు ఆ తేడాను మేమెప్పుడూ ఆలోచించలేదు. కానీ రెండు నెలల క్రితం అతను నా దగ్గరకు వచ్చి, నన్ను పెళ్లి చేసుకోలేనని తేల్చి చెప్పాడు. ఎందుకని అడిగితే... నేను తనకన్నా ఏడాది పెద్దదానినని అంటున్నాడు. పెళ్లి చేసుకుంటే భవిష్యత్‌లో సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నాడు. అతను అన్నట్లు నిజంగా ఏమైనా సమస్యలు వస్తాయా? దయచేసి సలహా ఇవ్వండి, అతణ్ని మరచిపోలేక రెండు నెలల నుంచి పిచ్చిదానిలా ఏడుస్తున్నాను. - ఓ సోదరి పెళ్లికి మగవారి వయసు, ఆడవారి కంటే పెద్దగా ఉండాలనేది సంప్రదాయంలో అలవాటు అయిపోయింది. మగవారు పెద్దగా ఉండడం వల్ల వారి మీద గౌరవంతో, కుటుంబాన్ని వారు ముందుకు నడిపిస్తారు అనే అభిప్రాయం ఉంది. మన సమాజంలో మనం మన అభిప్రాయాల కంటే చుట్టుపక్కల వాళ్లు, బంధువులు ఏమనుకుంటారో అనే విషయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం కాబట్టి, సంప్రదాయానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్లాలంటే కొంతమంది ఆలోచిస్తారు. అలాగే అతను కూడా ఆలోచించి ఉంటాడు. నిజంగా చెప్పాలంటే.. మీరు అతనికంటే ఏడాది పెద్దగా ఉండటం వల్ల శారీరకంగా గానీ, భవిష్యత్‌లో పుట్టే పిల్లలకు కానీ ఎలాంటి సమస్యలు రావు. నిజంగా మీ ఇద్దరు మనస్పూర్తిగా ప్రేమించుకొని ఉంటే, మీరు మెల్లిగా అతనికి ఈ విషయాన్ని నచ్చ చెప్పి చూడండి. దానివల్ల అతని మనసు మారే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వినకపోతే, మీరిద్దరూ ఓసారి డాక్టర్‌ను సంప్రదించండి. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
థైరాయిడ్ ఉంటే... పిల్లలు పుట్టరా?
సందేహం నా వయసు 21, బరువు 62 కిలోలు. నాకు రెండేళ్ల నుంచి పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడం లేదు. దాంతో ఆస్పత్రికి వెళితే యుటెరస్‌లో ఎలాంటి లోపం లేదు కానీ ఏవో చిన్న బబుల్స్ ఉన్నాయని చెప్పారు. అంతేకాదు థైరాయిడ్ కూడా ఉందని తెలిసింది. డాక్టర్ దానికి సంబంధించిన మందులు రాయడంతో వాటిని రెగ్యులర్‌గా వాడాను. ఇప్పుడు థైరాయిడ్ కంట్రోల్లోనే ఉంది కానీ పీరియడ్స్ మాత్రం రెగ్యులర్‌గా రావడం లేదు. దాని కారణంగానే బరువు పెరుగుతున్నానేమోనని అనుమానంగా ఉంది. అలాగే థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరని, ఒకవేళ పుట్టినా.. వారికీ థైరాయిడ్ వస్తుందని అందరూ అంటున్నారు. ఈ అనారోగ్యం కారణంగా నేను నా తల్లిదండ్రులను బాధపెడుతున్నాను. దయచేసి ఈ ఆందోళన నుంచి బయటపడే సూచనలు ఇవ్వండి. - ఓ సోదరి గర్భాశయం ఇరువైపుల ఉండే అండాశయాలలో ఎక్కువగా నీటి బుడగలు ఉండటాన్ని పాలిసిస్టిక్ ఓవరీ (PCO) అంటారు. వీటి వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి.. కొందరిలో పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, కొందరిలో మొటిమలు రావడం, జుట్టు రాలడం, పెదవులు, గడ్డం పైన అవాంఛిత రోమాలు రావడం, మెడచుట్టూ చర్మం నల్లగా మారడం వంటి ఎన్నో లక్షణాలు ఏర్పడవచ్చు. బరువు పెరిగే కొద్దీ నీటి బుడగలు ఇంకా పెరుగుతాయి. వాటివల్ల పైన పేర్కొన్న లక్షణాలు ఇంకా ఎక్కువ కావచ్చు. కాబట్టి మీరు బరువు తగ్గడానికి సరైన వ్యాయామాలు, మితమైన ఆహారం తీసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో నీటి బుడగల వల్ల ఏర్పడిన హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడానికి మందులు వాడండి. మందులతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకొని బరువు తగ్గితే.. మొత్తంగా నీటి బుడగలు మాయం అవ్వవు కానీ వాటి నుంచి ఏర్పడే హార్మోన్ల అసమతుల్యత చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ నియమాలు సరిగ్గా పాటిస్తే వివాహం తర్వాత పిల్లలు కలగడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఒకవేళ గర్భం రావడానికి ఇబ్బంది అయినా, కొద్దిపాటి చికిత్సతో గర్భం నిలిచే అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు థైరాయిడ్ ఉన్నంత మాత్రాన పుట్టబోయే బిడ్డకు కూడా తప్పనిసరిగా వస్తుందని ఏమీ లేదు. ఒకవేళ అంత అనుమానంగా ఉంటే.. బిడ్డ పుట్టిన తర్వాత, ఆ బిడ్డకు కూడా థైరాయిడ్ పరీక్ష చేయించండి. అది కన్ఫర్మ్ అయితే చికిత్స చేయిస్తే సరిపోతుంది. కాబట్టి మీరు అనవసరంగా కంగారు పడి, మీ తల్లిదండ్రులను బాధపెట్టకండి. ఈ మధ్య మీలాంటి సమస్య 40 శాతం అమ్మాయిలలో ఉంటోంది. నాకిప్పుడు 18 ఏళ్లు. నాకు బ్రెస్ట్ అసలు పెరగడం లేదు. ఏ డ్రెస్ వేసుకున్నా నా స్నేహితులు బాగా కామెంట్ చేస్తున్నారు. మా పేరెంట్స్ నాకు వచ్చే ఏడాది పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ నేను మరీ సన్నగా ఉన్నానని, సంబంధాలు కుదుర్తాయో లేదోనని కంగారు పడుతున్నారు. ఏవైనా మందులు వాడితే మరిన్ని సమస్యలు వస్తాయేమోనని భయపడుతున్నారు. నేనిప్పుడు ఏం చేయాలో తెలపండి. - వివరాలు రాయలేదు మీరు వయసెంతో రాశారు కానీ బరువు గురించి చెప్పలేదు. కొంతమంది సన్నగా ఉన్నప్పుడు వారి రొమ్ములు కూడా చిన్నగానే ఉంటాయి. ఒకవేళ మీరు సన్నగా ఉంటే.. కొద్దిగా బరువు పెరిగేందుకు ప్రయత్నించండి. బరువు పెరిగి, శరీరంలో కొవ్వు పెరిగినప్పుడు రొమ్ముల సైజు కూడా పెరుగుతుంది. దాని కోసం మందులు వాడవలసిన అవసరం లేదు. ఆహారంలో పాలు, పెరుగు, నెయ్యి, పండ్లు, డ్రైఫ్రూట్స్, గుడ్లు, మాంసాహారంతో కూడిన పౌష్టికాహారం రోజూ తీసుకోవడం వల్ల ఒంట్లో కొవ్వు చేరి బరువు పెరుగుతారు కాబట్టి రొమ్ముల పరిమాణం కూడా పెరుగుతుంది. మీరు కంగారు పడకుండా బరువు పెరిగే ప్రయత్నం చేయండి. అలాగే రొమ్ములను క్రమంగా మసాజ్ చేసుకోవడం వల్ల కూడా రక్తప్రసరణ పెరిగి కొద్దిగా పరిమాణం పెరిగే అవకాశాలు ఉంటాయి. నా వయసు 22. బరువు 40. నా సమస్య ఏమిటంటే... నాకు ఈ మధ్యే వివాహం జరిగింది. మా వారికి శీఘ్ర స్కలనం సమస్య ఉంది. నేను, మావారు కలిసినప్పుడు కలయిక సమయంలో మావారికి త్వరగా స్కలనం జరుగుతోంది. దాంతో నాకు కలయిక సమయంలో సంతృప్తి కలగటం లేదు. దీనికి తగిన పరిష్కారం చెప్పండి. - ఓ సోదరి మీవారి శీఘ్ర స్కలనం సమస్యకు మీరు చేయడానికి పెద్దగా ఏమీ లేదు. మీవారు ఒకసారి యూరాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది. వారు అతణ్ని పరీక్షించి సమస్య ఎక్కడుందో తెలుసుకొని, దాన్నిబట్టి అవసరమైన చికిత్సను అందిస్తారు. దాంతోపాటు కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
వేడి పెరిగింది కదా... వ్యాయామం ఆపేయాలా?
లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్ ఈమధ్యే నేను వ్యాయామం చేయడం మొదలుపెట్టాను. అయితే గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి కదా. వ్యాయామం ఆపేయాలా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - నవీన్ కుమార్, పిడుగురాళ్ల వేసవిలో వ్యాయామం చేసేవారు కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. అవేమిటంటే... మన శరీర ఉష్ణోగ్రతను ఎప్పుడూ ఒకేలా ఉంచడానికి శరీరంలోని చర్మం, రక్తనాళాలు పనిచేస్తాయి. మన శారీరక శ్రమ పెరగగానే రక్తనాళాల్లోకి రక్తం ఎక్కువగా ప్రవహించి చర్మాన్ని చేరుతుంది. శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించడానికి చర్మంపైన ఉన్న స్వేదగ్రంథులు చెమటను స్రవిస్తాయి. ఆ చెమట ఆవిరి అయ్యే క్రమంలో శరీరం నుంచి ఉష్ణోగ్రతను తీసుకుంటుంది. అందుకే చర్మంపై చెమట పట్టినప్పుడు ఫ్యాన్ నుంచి గానీ, చెట్ల నుంచి గానీ గాలి సోకితే ఒంటికి హాయిగా అనిపిస్తుంది. అలా శరీరంలో పెరిగిన ఉష్ణోగ్రతను తగ్గించడానికి చెమట తోడ్పడుతుంది. అయితే శారీరక శ్రమ అలాగే కొనసాగి ఈ చెమట పట్టే ప్రక్రియ అదేపనిగా జరుగుతుంటే... మన మేను నీటినీ, దానితో పాటు ఖనిజలవణాలను కోల్పోతుంది. మరీ ఎక్కువ వేడిమికి ఎక్స్పోజ్ అయినప్పుడు, మనం తగినన్ని నీళ్లు, ద్రవాహారం తీసుకోనప్పుడు మనకు చెమట అతిగా పట్టి శరీర ఉష్ణోగ్రతను ఒకేలా నిర్వహించే వ్యవస్థ దెబ్బతినవచ్చు. అప్పుడు కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు... వాతావరణంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు చాలాసేపు కూర్చొని ఉండి, అకస్మాత్తుగా నిలబడినా లేదా అదేపనిగా నిలబడి వ్యాయామం చేసినా అకస్మాత్తుగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. దీన్నే ‘హీట్ సింకోప్ అండ్ ఎక్సర్సైజ్ అసోసియేటెడ్ కొలాప్స్’ అని అంటారు. వాతావరణంలో వేడి పెరుగుతున్న సమయంలో మీరు వ్యాయామం మానేయాల్సిన అవసరం లేదు. కానీ పైన పేర్కొన్న అనర్థాలు నివారించడానికి ఈ కింది జాగ్రత్తలు పాటించండి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో పగటివేళ ఎండకు ఎక్స్పోజ్ కావద్దు. మీరు మీ వ్యాయామాలను వాతావరణం చల్లగా ఉండే వేకువజామున చేయండి చెమటను పీల్చే కాటన్ దుస్తులను ధరించండి బాగా నీళ్లు తాగండి. ఒంట్లో ఖనిజ లవణాలు (ఎలక్రొలైట్స్) భర్తీ అయ్యేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోండి మీరు వ్యాయామం చేసే ముందర ఒకసారి వాతావరణం ఎలా ఉందో పరిశీలించండి. మరీ వేడిగా ఉంటే వ్యాయామాన్ని చల్లటి వేళకు వాయిదా వేసుకోండి. ఒకవేళ మీరు వ్యాయామం చేస్తున్న సమయంలో తలనొప్పి, కళ్లుతిరిగినట్లు, వాంతి వచ్చినట్లు అనిపిస్తే వెంటనే వ్యాయామం ఆపేసి, డాక్టర్‌ను సంప్రదించండి. -డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్ కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ హోమియో కౌన్సెలింగ్ నా వయసు 33 ఏళ్లు. నేను ఈమధ్య టీఎస్‌హెచ్ పరీక్ష చేయించుకున్నాను. థైరాయిడ్ ఉందని అన్నారు. గత ఆర్నెల్లుగా నా జుట్టు విపరీతంగా రాలిపోతోంది. ఇది హార్మోన్ లోపం వల్ల వచ్చిందని డాక్టర్లు అంటున్నారు. హోమియోపతిలో చికిత్స అందుబాటులో ఉందా? - అనిత, ఖమ్మం మన తలలో దాదాపు లక్షా ఇరవై వేల నుంచి లక్షా యాభై వేల వెంట్రుకలు ఉంటాయి. ఒక వెంట్రుక ఒక నెలలో దాదాపు ఒక సెంటీమీటరు పెరుగుతుంది. రోజూ 40 నుంచి 50 వెంట్రుకలు రాలుతూనే ఉంటాయి. జుట్టు రాలడం సమస్యకు చాలా కారణాలు ఉన్నాయి. దానిలో హార్మోన్ లోపాలు, థైరాయిడ్ సమస్య, రక్తహీనత, పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం, ఆందోళన, నిద్రలేమి వంటివి దీనికి కొన్ని కారణాలు. కొన్ని రకాల మందులు వాడటం, హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం జట్టు రాలడానికి కారణమయ్యే ఇంకొన్ని అంశాలు. జుట్టు రాలడానికి ఇంకా సూర్యకాంతికి ఎక్స్పోజ్ కావడం, మోతాదుకు మించి క్లోరిన్ ఉండే ఈత కొలనుల్లో ఈతకొట్టడం వంటివీ కారణమవుతాయి. జుట్టుకు రంగు వేసుకునే విషయంలోనూ సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరికి ఈ హెయిర్ డైలు సరిపడవు. వాటి నుంచి అలర్జీ వస్తుంది. అందుకే వాటి ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. డాండ్రఫ్ (చుండ్రు), ఎగ్జిమా, అలొపేషియా సమస్యలూ కారణమవుతాయి. జుట్టు సమస్యలు తీరాలంటే ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ఒంటిని సరైన గాడిలో పెట్టాలి. శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక వికాసం కూడా పెంపొందించుకోవాలి. జుట్టు రాలడాన్ని అరికట్టడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ఇందులో కేవలం జుట్టు రాలడం అనే అంశాన్నే కాకుండా దీనికి కారణాలైన థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ సమతౌల్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. ఆర్నికా, జబొరాండి, వింకమైనర్తో తయారు చేసిన నూనెలు, మంచి షాంపూలు హోమియోలో అందుబాటులో ఉన్నాయి. హోమియో ఔషధాలైన యాసిడ్ ఫ్లోర్, నేట్రమ్మూర్, ఫాస్ఫరస్, వింకామైనర్, ఆలోస్ లాంటి మందులు వాడితే సమస్య తగ్గుతుంది. అయితే ఆ మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. -డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ పల్మనాలజీ కౌన్సెలింగ్ మా నాన్నను వెంటిలేటర్ మీద పెట్టారు. వెంటిలేటర్ మీద పెట్టినవాళ్లు ఇక బతకరనీ బంధువులు అంటున్నారు. మాకు చాలా ఆందోళనగా ఉంది. తగిన సలహా ఇవ్వండి. - వీరభద్రరావు, చిట్యాల వెంటిలేటర్ మీద పెట్టిన పేషెంట్ ఇక బతకరనేది చాలామందిలో ఉండే అపోహ. అయితే జబ్బు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, చాలా సందర్భాల్లో రోగి పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉన్నప్పుడు చివరి ప్రయత్నంగా వెంటిలేటర్ మీద పెడతారు. దాంతో సాధారణ ప్రజల్లో ఈ దురభిప్రాయం ఏర్పడింది. కానీ ఇప్పుడున్న వైద్య పరిజ్ఞానం వల్ల అనేక వ్యాధులకు చాలా ఆధునిక చికిత్సలు అందుతున్నందున వెంటిలేటర్ మీద పెట్టినవాళ్లూ బతికేందుకూ, మళ్లీ నార్మల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. వెంటిలేటర్ అనేది కృత్రికంగా శ్వాస అందించే యంత్రం. దీన్ని పెట్టడానికి ముందుగా శ్వాసనాళంలోకి ఒక గొట్టం వేసి, దాన్ని కృత్రిమ శ్వాస అందించే వెంటిలేటర్‌తో అనుసంధానం చేస్తారు. రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉండటం, కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుతున్నా, రోగికి ఆయాసం పెరుగుతున్నా, ఊపిరితీసుకోవడానికి అవసరమైన కండరాలు పనిచేయకపోయినా వెంటిలేటర్ అమర్చుతారు. సాధారణంగా నిమోనియా, సీవోపీడీ వంటి వ్యాధులకూ, రక్తానికి ఇన్ఫెక్షన్ పాకే సెప్సిస్ వంటి కండిషన్లలో వెంటిలేటర్ పెడుతుంటారు. ఒకసారి వెంటిలేటర్ పెట్టిన తర్వాత... పరిస్థితి మెరగయ్యే వరకూ వెంటిలేటర్ తీయడం కష్టం కావచ్చు. సాధారణంగా ఐదు కంటే ఎక్కువ రోజులు వెంటిలేటర్ పెట్టడం అవసరమైతే ట్రకియాస్టమీ చేస్తారు. దీనివల్ల స్వరపేటికకు నష్టం వాటిల్లదు. వెంటిలేటర్‌ను త్వరగా తొలగించే అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల అవసరమనుకుంటే ఎలాంటి ప్రమాదమూ లేకుండా వెంటిలేటర్ మళ్లీ పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది. ఇటీవల మన వద్ద కూడా పాశ్చాత్య దేశాల్లో ఉన్నంత వైద్యపరిజ్ఞానం, ఉపకరణాలు అందుబాటులోకి ఉన్నాయి. అయితే వైద్యపరమైన అంశాలలో మన దగ్గర తగినంత అవగాహన లేకపోవడం వల్ల అపోహలు రాజ్యమేలుతున్నాయి. మీరు ఏదైనా సందేహం కలిగినప్పుడు నేరుగా మీకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను సంప్రదించండి. అంతేగానీ ఎలాంటి అపోహలను నమ్మకండి. -డాక్టర్ ఎస్.ఎ. రఫీ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ హైదరాబాద్ -
గుండెకూ విద్యుత్ సరఫరా!
థైరాయిడ్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు మా పాప వయసు 18. ఇంటర్మీడియట్ చదువుతోంది. ఇటీవల కొంతకాలంగా నెలసరి సరిగా రావడం లేదు. బరువు పెరుగుతోంది. జుట్టు ఊడిపోతోంది. అసహనంగా ఉంటోంది. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే కొన్ని పరీక్షలు చేయించి, థైరాయిడ్ వచ్చిందని, జీవితాంతం మందులు వాడాలని చెప్పారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. దీనికి హోమియోలో మందులున్నాయా? చెప్పగలరు. - పద్మజ, చల్లపల్లి థైరాయిడ్ అనేది మానవ శరీరంలోని ఒక ముఖ్యమైన గ్రంథి. ఇది ఉత్పత్తి చేసే థైరాయిడ్ హార్మోన్ శారీరక ఎదుగుదలకు, వివిధ జీవక్రియలకు సహకరిస్తుంది. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిలో అసమతుల్యత వల్ల హైపో థైరాయిడిజమ్, హైపర్ థైరాయిడిజమ్, గాయిటర్ అనే సమస్యలు తలెత్తుతాయి. హైపో థైరాయిడిజమ్: థైరాయిడ్ హార్మోన్లు కావలసిన దానికంటే తక్కువ అయితే ఇది వస్తుంది. ఏ వయసులోని వారైనా దీనికి గురి కావచ్చు. పిల్లలు, స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. లక్షణాలు: నిస్సత్తువ, బలహీనత, చర్మం పొడిబారడం, బరువు పెరగడం, నెలసరి సరిగా రాకపోవటం, జుట్టు రాలడం, మతిమరపు, మలబద్ధకం, అజీర్ణం, పిల్లల్లో ఎదుగుదల లోపించడం, ఆడపిల్లల్లో అయితే రజస్వల ఆలస్యంగానో లేదా ముందుగానో రావడం, వృద్ధుల్లో కుంగుబాటు, మతిమరపు వంటివి కనిపిస్తాయి. హైపర్ థైరాయిడిజమ్: థైరాయిడ్ హార్మోన్లు అవసరాని కన్నా ఎక్కువగా ఉత్పత్తి అవడాన్ని హైపర్ థైరాయిడిజమ్ అంటారు. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. దీన్ని త్వరగా గుర్తించలేకపోయినా, నిర్లక్ష్యం చేసినా దుష్ర్పభావాలు తీవ్రంగా ఉంటాయి. లక్షణాలు: బరువు తగ్గటం, నిద్రలేమి, గుండెదడ, అధిక చెమటలు, చిరాకు, అస్థిమితం, విరేచనాలు, చేతులు వణకడం, నీరసం, నెలసరి సమస్యలు కనిపిస్తాయి. గాయిటర్: గొంతు కింద ఉండే థైరాయిడ్ గ్రంథి అసహజంగా వాస్తే దాన్ని గాయిటర్ అని అంటారు. ఇది ముఖ్యంగా అయోడిన్ లోపం వల్ల వస్తుంది. కారణాలు... గ్రేవ్స్ డిసీజ్, టాక్సిక్ అడినోమా, సబ్ అక్యూట్ థైరాయిడైటిస్, పిట్యూటరీ గ్రంథి సరిగా పని చేయకపోవడం లేదా థైరాయిడ్ గ్రంథిలో క్యాన్సర్ రావడం, హషిమోటోస్ డిసీజ్, థైరాయిడ్ గ్రంథిని తొలగించటం, కొన్ని రకాల మందులు ఎక్కువ మొత్తంలో అయోడిన్కి ఎక్స్పోజ్ అవడం వల్ల థైరాయిడ్ సమస్యలు తలెత్తుతాయి. నిర్థారణ: రక్తపరీక్ష, రక్తంలోని టిఎస్హెచ్ శాతాన్ని పరీక్షించడం, థైరాయిడ్ యాంటీబాడీస్, అల్ట్రా సౌండ్ స్కాన్, అల్ట్రా సౌండ్ నెక్, రేడియో యాక్టివ్ అయోడిన్ పరీక్ష, బయాప్సీ ల ద్వారా. హోమియోకేర్ వైద్యం: థైరాయిడ్ సమస్యకు జీవితకాలం మందులు వాడే అవసరం లేకుండా ఈ సమస్య రావడానికి గల మూలకారణాన్ని గుర్తించి, వ్యక్తిత్వానికి అనుగుణంగా సరైన హోమియో వైద్యం చేయడం ద్వారా థైరాయిడ్ హార్మోన్ సమస్యలను నయం చేయవచ్చు. గుండెకూ విద్యుత్ సరఫరా! నా వయసు 42 ఏళ్లు. మార్నింగ్ వాక్ చేస్తూ అకస్మాత్తుగా ఆయాసం వచ్చి పడిపోయాను. వెంటనే ఆసుపత్రికి తరలిస్తే డాక్టర్లు పరీక్షించి, టాకీకార్డియా సమస్య అని చెప్పారు. టాకీ కార్డియా అంటే ఏమిటి? నాకు సమస్య పూర్తిగా తగ్గుతుందా? - సంజీవరావు, వరంగల్ గుండెజబ్బు అనగానే మనకు గుర్తుకు వచ్చేది గుండెపోటే. నిజానికి గుండెకు సంబంధించిన సమస్యలు చాలా ఉంటాయి. అందులో ఒకటి... గుండెకు అందాల్సిన విద్యుత్‌కు సంబంధించిన సమస్య. మన గుండె ఒక పంపులా పనిచేస్తూ... శరీరంలోని అన్ని భాగాలకూ రక్తం సరఫరా అయ్యేలా చూస్తుంది. మామూలుగా పంపులు పనిచేయడానికి విద్యుత్ అవసరమైనట్లే, మన గుండె కొట్టుకోడానికి కూడా నిరంతరం శక్తి కావాలి. ఇందుకోసం గుండె పైభాగంలో ఉండే గదుల్లో కుడివైపున సైనో ఏట్రియల్ నోడ్, ఏట్రియో వెంట్రిక్యులార్ నోడ్ అనే కేంద్రాలుంటాయి. ఈ గదుల్లో నుంచి ఎప్పటికప్పుడు విద్యుత్ ప్రేరణలు వస్తుంటాయి. సైనో ఏట్రియల్ నోడ్ నుంచి వెలువడే విద్యుత్ ప్రేరణలు గుండె పై గది అయిన కుడి కర్ణిక నుంచి ఎడమ కర్ణికకు చేరుతాయి. అప్పుడు ఏట్రియో వెంట్రిక్యులార్ నోడ్ నుంచి వెలువడే విద్యుత్ ప్రేరణలు కింది గదులైన జఠరికలు మూసుకుపోయేలా చేస్తాయి. ఇలా నిరంతరం ఒక పద్ధతి ప్రకారం జరుగుతుండటం వల్ల రక్తనాళాల్లోకి రక్తం పంప్ అవుతూ ఉంటుంది. కొన్ని సమయాల్లో రకరకాల సమస్యల వల్ల విద్యుత్ ప్రేరణలు గతి తప్పితే... గుండె లయ దెబ్బతినవచ్చు. దీంతో గుండెకొట్టుకునే వేగం క్రమంగా తగ్గుతుంది. ఒక్కొక్కసారి అనూహ్యంగా పెరగవచ్చు కూడా. ఇలా గుండె స్పందనల్లో తేడా వచ్చే సమస్యను టాకికార్డియా అంటారు. వేగం తగ్గితే:రక్తసరఫరా కూడా తగ్గి, మెదడుకు తగినంత రక్తసరఫరా కాదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది.నాడీ చాలా నెమ్మదిగా కొట్టుకుంటుందివేగం పెరిగితే:గుండెదడ వస్తుంది స్పృహ తప్పవచ్చు.తల తిరిగినట్లుగా అనిపిస్తుంది. చికిత్స: గుండె వేగం తగ్గినప్పుడు ఛాతీ పైభాగంలో చర్మం కింద పేస్‌మేకర్ అమర్చి, గుండె స్పందనలు ఒకేలా జరిగేలా సమస్యను చక్కదిద్దుతారు. గుండె వేగం పెరిగినప్పుడు బీటా బ్లాకర్స్ అనే గుండె లయను క్రమబద్ధీకరించే మందులు ఇస్తారు. స్పాస్టిసిటీ తగ్గేదెలా? నా వయసు 52. ఒక యాక్సిడెంట్లో నా మెడ భాగంలో వెన్నెముకకు గాయమైంది. సర్జరీ చేశారు. అప్పటినుంచి నా కాళ్లు, చేతులు బలహీనంగా మారాయి. మల, మూత్ర విసర్జనలపై కూడా నా నియంత్రణ లేదు. కాళ్లూ, చేతులు బిగుతుగా మారినట్లుగా ఉండటం నాకున్న పెద్ద సమస్య. దీనివల్ల నేను కాళ్లూ చేతులు కదిలించలేకపోవడంతో పాటు కూర్చోలేకపోవడం, నిలబడలేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. కాళ్లు, చేతులు కదిలించే ప్రయత్నంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. ఫిజియోథెరపీ చేయించుకొమ్మని కొందరు చెబుతున్నారు. దయచేసి సలహా చెప్పగలరు. - విశ్వేశ్వరరావు, విజయవాడ రోడ్డు ప్రమాదాలలో వెన్నెముకకు అయ్యే గాయాలు, వాటి వల్ల మీరు పేర్కొన్న సమస్యలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ. మెడదగ్గర వెన్నెముక భాగంలో గాయాలైతే మీరు పేర్కొన్నట్లుగా కాళ్లూ చేతులపై నియంత్రణ కోల్పోవడం జరగవచ్చు. ఈ ప్రాంతంలో ఎంత బలంగా గాయాలైతే... వాటిని అనుగుణంగా మన శరీరంలోని చాలా భాగాలు నియంత్రణలో లేకుండా పోయే అవకాశం ఉంది. ఒక్కోసారి కాళ్లూ, చేతులు, మొండెం భాగం కూడా నియంత్రణలో లేకుండా పోవచ్చు. మీరు పేర్కొన్న భాగంతోపాటు అంతకంటే కింద భాగంలోనూ వెన్నెముకకూ దెబ్బ తగిలితే మలమూత్ర విసర్జనలపై నియంత్రణలేకుండా పోతుంది. మీరు పేర్కొన్న లక్షణాలను బట్టి చూస్తే మీకు స్పాస్టిసిటీ వచ్చి ఉంటుందని తెలుస్తోంది. అంటే... నరాలు దెబ్బతిని కాళ్లూ, చేతులు మొదలైన శరీర భాగాలపై నియంత్రణ కోల్పోవడంతో పాటు మీ ప్రమేయం లేకుండానే కండరాలు వాటంతట అవి నేరుగా కదులుతుండటం జరుగుతోందన్నమాట. మీరు నిల్చోలేకపోవడం, కూర్చోలేకపోవడం... ఆ ప్రయత్నంలో మీకు తీవ్రమైన నొప్పి రావడం వంటి పరిణామాలు సంభవిస్తున్నాయని తెలుస్తోంది. స్పాస్టిసిటీ వల్ల మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీనివల్ల మీ జీవనశైలి దెబ్బతింటుంది. జీవననాణ్యత తగ్గుతుంది. మీ శరీరంలోని అవాంఛిత కదలికలను (స్పాస్టిసిటిని) రీహ్యాబిలిటేషన్ చికిత్స ద్వారా తగ్గించవచ్చు. ముందుగా మీరు న్యూరాలజిస్ట్ లేదా న్యూరోసర్జన్‌ను సంప్రదించండి. వారు ముందుగా రోగిని నిశితంగా పరీక్షిస్తారు. రోగిలోని స్పాస్టిటిటీ తీవ్రతను బట్టి వారు నోటి ద్వారా ఇవ్వదగిన యాంటీ-స్పాస్టిసిటీ మందులను, మోతాదును నిర్ణయిస్తారు. ఈ ప్రక్రియ తర్వాతే రీహ్యాబిలిటేషన్ నిపుణుడిని కలిస్తే, ఆ మందు ప్రభావం, రోగిలోని స్పాస్టిసిటీ తీవ్రత... వీటన్నింటినీ అంచనా వేసి, దానికి అనుగుణంగా ఇవ్వాల్సిన ఫిజియో చికిత్సను నిర్ణయిస్తారు. మందులతో పాటు ఇచ్చే రీహ్యాబిలిటేషన్ ప్రక్రియ మీకు మరింత ఉపకరిస్తుంది. నోటిద్వారా తీసుకునే యాంటీ స్పాస్టిసిటీ మందుల తీవ్రత ఎక్కువైనా కూడా కాళ్లు, చేతుల కండకాలలో బలహీనత పెరిగే అవకాశం ఉంది. ముందుగా న్యూరాలజిస్ట్‌ను కలిసిన తర్వాత న్యూరోఫిజియోథెరపిస్ట్నూ కలిస్తే... మీకు ఇచ్చిన మందుల ప్రభావం వల్ల మీలో కలిగిన మార్పుల ఆధారంగా న్యూరోఫిజియోథెరపిస్ట్ చికిత్స చేస్తారు.