షుగర్ వ్యాధికి పాజిటివ్ చికిత్స | Sugar positive treatment of the disease | Sakshi
Sakshi News home page

షుగర్ వ్యాధికి పాజిటివ్ చికిత్స

Published Thu, Dec 26 2013 10:39 PM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

Sugar positive treatment of the disease

ఒకప్పుడు మధుమేహం అంటే ఏ కొంతమందిలోనో కనిపించేది. కాని ఇప్పుడు ప్రతీ ఇంటికి ఒకరు లేదా ఇద్దరు కనిపిస్తున్నారు. వయస్సు పైబడిన వారిలో మాత్రమే అప్పట్లో కనిపించేది. కాని నవీనయుగంలో వయస్సు, లింగ- విచక్షణ లేకుండా రానురాను మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది. భారతదేశంలో, అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో వీరి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. భవిష్యత్తులో ప్రతి ఇద్దరిలో ఒకరు షుగర్‌వ్యాధితో బాధపడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. డయాబెటిస్ లేదా షుగర్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది మన శరీరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకునేలోపే మనలోని షుగర్ లెవెల్స్ పెరిగిపోయి ఎన్నో అనారోగ్యల బారిన పడతాం.
 
 లక్షణాలు:  
 అతిగా మూత్ర విసర్జన
 ఎక్కువగా ఆకలి వేయడం, ఎక్కువగా దాహం వేయడం
 చూపు మందగించటం  
 కారణం లేకుండా బరువు తగ్గి, చిక్కిపోవడం, నీరసం, నిస్సత్తువ  అతినిద్ర, బద్దకం.
 బరువు తగ్గడం తప్ప మిగతా లక్షణాలన్నీ డయాబెటిస్ 2 లో కూడా కనిపిస్తాయి.
 
 డయాబెటిస్ రకాలు

 - టైప్ 1 డయాబెటిస్
 - టైప్ 2 డయాబెటిస్
 
 కారణాలు:
 స్థూలకాయం
 వంశపారంపర్యత   
 మానసిక ఒత్తిడి  
 ఆహారపు
 అలవాట్లు  
 జీవనశైలి   
 థైరాయిడ్
 పీసీఓడీ ఉన్నవాళ్ళకు మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ.
 
 రకాలు:  
 టైప్ 1 డయాబెటిస్: సాధారణంగా బీటా కణాలను మన శరీరమే స్వయంగా నాశనం చేయడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా ఉండదు. అందుకే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇస్తారు
 
 టైప్ 2 డయాబెటిస్: ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం.  
 
 ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ నిరోధకత ఉంటుంది  
 
 రెసిస్టెన్షియల్ డయాబెటిస్:
ఈ రకాన్ని గర్భధారణ సమయంలో మాత్రమే చూస్తాం. సాధారణంగా కాన్పు తర్వాత, సాధారణ స్థితికి వస్తుంది. కొద్దిమందిలో మాత్రం అలానే కొనసాగుతుంది.
 
 డయాబెటిస్ వల్ల కాంప్లికేషన్లు: నాడీకణాల మీద ప్రభావం. ఇందులో మొత్తం శరీరభాగాలన్నీ ప్రభావితమవుతాయి. మొత్తం న్యూరైటిస్‌లలో ఇది అత్యంత ప్రభావశీలి. నరం మీద మైలిన్ షీత్ (పొర) దెబ్బ తినడం వల్ల తిమ్మిర్లు, మంటగా అనిపించడం, స్పర్శ తెలియకపోవడం జరుగుతుంది. అంటే కాలికి, చేతికి ఏదైనా గుచ్చుకున్నా, దెబ్బ తగిలినా రోగికి తెలియదు. నడకలో మార్పు, కంటిచూపు తగ్గిపోవడం, కొన్నిసార్లు మూత్రాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వంటి సమస్యలు చూస్తూ ఉంటాం. కొన్ని సంవత్సరాల తరువాత శరీరంలో పెద్ద రక్తనాళాలూ దెబ్బతినడం వల్ల గుండె, మెదడు, కాళ్ళు, చేతులలోని రక్తనాళాలు దెబ్బతింటాయి. మానసిక, సెక్స్ సమస్యలు తలెత్తుతాయి.
 
పాజిటివ్ హోమియోపతి వైద్య విధానంలో మానవుని కాన్‌స్టిట్యూషన్స్‌కు పాముఖ్యం ఇవ్వబడుతుంది. అంటే అతని వ్యాధి లక్షణాలు, పాథాలజీ, కుటుంబ చరిత్ర, మానసిక లక్షణాలు తదితర అన్ని విషయాలు పరిగణనలోనికి తీసుకుని చికిత్స చేయడం వల్ల కేవలం ఉపశమనమే కాకుండా, పూర్తిగా నయం చేయవచ్చును.
 - పాజిటివ్ హోమియోపతి
 
 డా॥టి. కిరణ్‌కుమార్
 పాజిటివ్ హోమియోపతి
 అపాయింట్‌మెంట్ కొరకు 9246199922
 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై
 www.positivehomeopathy.com

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement