Sugar disease
-
శాకాహారంతో మధుమేహం ముప్పు తగ్గుతుందా?
డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే సమస్య. ఇప్పటివరకు దీనికి శాశ్వత పరిష్కారం లేకపోయినా సరైన డైట్‌తో మధుమేహాన్ని నివారించవచ్చు అని ఓ అధ్యయనంలో తేలింది. మొక్కల ఆధారిత ఆహారాన్ని(plant-based diet) తీసుకోవడం వల్ల మధుమేహం ముప్పు 24% వరకు తగ్గుతుందని మెడ్‌యునీ వియెన్సాస్ సెంటర్ జరిపిన రీసెర్చ్‌లో వెల్లడైంది. దీని ప్రకారం..పండ్లు, కాయకూరలు, గింజలు, పప్పుదినుసులు, విత్తనాలు వంటి శాకాహారంతో మధుమేహాన్ని నివారించడంతో పాటు ఇప్పటికే డయాబెటిస్ ఉన్నవారికి మేలైన చికిత్సగా పనిచేస్తుందని గతంలోనూ ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేశాయి. తాజాగా మరోసారి ఇది రుజువైంది. శాకాహారం తినడం వల్ల కాలేయం, కిడ్నీ పనితీరు మెరుగవడంతో పాటు, డయాబెటిస్ ముప్పు తగ్గేందుకు తోడ్పుతుందని పరిశోధకులు గుర్తించారు. మాంసాహారంలో అధికంగా ఉండే మాంసకృత్తులు, పిండిపదార్థాలు.. డయాబెటిస్‌కు దారితీస్తాయని వారు పేర్కొన్నారు. ఊబకాయం,వయసు పైబడటం, శారీరక శ్రమ లేకపోవడం సహా జన్యపరమైన కారణాల వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉన్నా శాకాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర మోతాదులను నియంత్రించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఆహారంలో అధిక మొత్తంలో స్వీట్లు, ప్రాసెస్ చేసిన పదార్థాలు, కూల్‌డ్రింక్స్ వంటివి టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయని, అందుకే మనం తీసుకునే ఆహారం మధుమేహం నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. మాంసాహారాన్ని వారానికి ఒకసారి కంటే ఎక్కువగా తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ రిస్క్ పెరుగుతుందని తెలిపారు. -
షుగర్ నియంత్రణలో ఉంటే 'ఫంగస్' రాదు
సాక్షి, అమరావతి: ‘కరోనా బాధితుల్లో 10 నుంచి 15 శాతానికి మించి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉండరు. వారిలోనూ వెయ్యిలో ఒకరికి కూడా బ్లాక్‌ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) రాదు. బ్లాక్‌ఫంగస్‌పై భయాందోళన కలిగించేలా వెలువడుతున్న కథనాలు వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి. స్టెరాయిడ్స్ వాడటం వల్ల మధుమేహం నియంత్రణలోకి రాక ఇబ్బందులు పడుతున్న వారిలో తీవ్ర భయం కలుగుతోంది. వాస్తవానికి షుగర్‌ను నియంత్రణలో ఉంచుకుంటే బ్లాక్‌ఫంగస్ గురించి భయపడాల్సిన పనే లేదు’ అని వైద్యులు చెబుతున్నారు. గ్లూకోమీటర్ తప్పనిసరి షుగర్ చెక్ చేసుకోవడానికి ఇంట్లో గ్లూకోమీటర్ ఉంచుకోవడం తప్పనిసరి అని.. రోజూ ఉదయం పరగడుపున షుగర్ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆ సమయంలో షుగర్ లెవెల్ 125 కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. టిఫిన్ తిన్న గంటన్నర తర్వాత చెక్ చేసుకుంటే 250 కంటే తక్కువగా ఉండాలంటున్నారు. వీలైతే ఒకసారి ల్యాబ్‌కు వెళ్లి హెచ్‌బీ ఏ1సీ (మూడు మాసాల సగటు) చూపించుకోవాలని.. గరిష్టంగా 7.2 కంటే తక్కువగా ఉంటే ఇబ్బంది లేదని చెబుతున్నారు. ఇన్సులిన్ నిరభ్యంతరంగా వాడొచ్చు కరోనా బాధితుల్లో స్టెరాయిడ్స్ వాడిన తర్వాత షుగర్ ఎక్కువ అవుతుందని, అప్పుడు మందులతో నియంత్రణలోకి రాదని వైద్యులు పేర్కొంటున్నారు. ఇలాంటి వాళ్లు షుగర్ నియంత్రణలోకి వచ్చేవరకూ ఇన్సులిన్ వాడుకోవచ్చని, నియంత్రణలోకి వచ్చాక ఇన్సులిన్ ఆపేసి తిరిగి మందులు వాడొచ్చని స్పష్టం చేస్తున్నారు. చాలామంది బరువు పెరుగుతామని, ఇతర ఇబ్బందులొస్తాయని ఇన్సులిన్ వాడకానికి వెనక్కు తగ్గుతున్నారని.. ఇది సరికాదని చెబుతున్నారు. కార్బొహైడ్రేట్స్‌కు దూరంగా ఉండాలి కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం షుగర్ స్థాయిలను పెంచుతుంది. ఉదాహరణకు బియ్యంతో చేసిన అన్నం, ఇడ్లీలు, దోశలు, పఫ్‌లు, బంగాళ దుంప వంటి వాటికి దూరంగా ఉండాలి. జొన్న, రాగులు, కొర్రలు, అండు కొర్రలు వంటి వాటితో చేసిన ఆహారం, పీచు పదార్థాలు కలిగిన కూరగాయలు (బీరకాయ, సొరకాయ, చిక్కుడు, గోరు చిక్కుడు వంటివి), సిట్రస్ జాతికి చెందిన పైనాపిల్, నిమ్మ వాడొచ్చు. జామ పండ్లు తినొచ్చు. ఇవి తింటే షుగర్ లెవెల్స్ పెరగవు. పైగా వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. ఫంగస్ వచ్చే అవకాశమే ఉండదు. సామాజిక మాధ్యమాల్లో దీనిపై ఎక్కువ వార్తలు రావడంతో మందులు బ్లాక్‌లో అమ్ముతున్నారు. బ్లాక్ ఫంగస్‌కు భయపడాల్సిన పనిలేదు బ్లాక్ ఫంగస్ అనేది లక్షలో ఒకరికి వచ్చేది. దానికి భయపడాల్సిన పనిలేదు. అది కూడా అక్కడక్కడా షుగర్ పేషెంట్లకు మాత్రమే. మొత్తం కరోనా బాధితుల్లో 10 శాతం మంది కూడా షుగర్ బాధితులు ఉండరు. ఉన్న వాళ్లు.. షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి. షుగర్ స్థాయి 250 కంటే తక్కువగా ఉంటే ఫంగస్ రాదు. ప్రాథమికంగా గుర్తిస్తే నివారించవచ్చు. – డాక్టర్ సీహెచ్ ప్రభాకర్‌రెడ్డి, హృద్రోగ నిపుణులు, కర్నూలు రెండు లక్షల్లో నాలుగైదు కూడా లేవు బ్లాక్ ఫంగస్ దశాబ్దాల నుంచీ ఉన్నదే. ఇది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు. రాష్ట్రంలో 2 లక్షల పైగా కరోనా యాక్టివ్ కేసులు ఉంటే నాలుగైదు కూడా ఫంగస్ కేసులు రాలేదు. దీని గురించి భయాందోళన అవసరం లేదు. పరిమితికి మించి స్టెరాయిడ్స్, యాంటీ బయోటిక్స్ వాడిన.. నియంత్రణలో లేని డయాబెటిక్ వారికి మాత్రమే వస్తుంది. అది కూడా అరుదు. దీనిగురించి మధుమేహ రోగులు గానీ, సాధారణ కోవిడ్ బాధితులు గానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేనే లేదు. – డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి, న్యూరో ఫిజీషియన్ (చైర్మన్–ఏపీఎంఎస్ఐడీసీ) ఎలా సోకుతుందంటే.. వాతావరణంలో సహజంగానే ఉండే మ్యుకోర్ అనే ఫంగస్ వల్ల అరుదుగా ఇది మనుషులకు సోకుతుంది. గాలి పీల్చుకున్నప్పుడు ఈ ఫంగస్ ఊపిరితిత్తుల్లో, సైనస్ వద్ద చేరుతుంది. ముఖ్యంగా కోవిడ్ సోకిన వారిలో ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా లేదా రోగ మితిమీరి స్పందించకుండా వ్యాధి నిరోధక శక్తిని కట్టడి చేయడానికి స్టెరాయిడ్స్ వినియోగించిన వారికి ఇది ఎక్కువగా సోకే అవకాశం ఉంది. అవయవ మార్పిడి జరిగిన వారిలో, ఐసీయూలో చికిత్స పొందిన వారికి దీని ముప్పు ఎక్కువే. దీర్ఘకాలిక జబ్బులున్న వారు, శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారు, ప్రస్తుతం కోవిడ్ చికిత్సలో మోతాదుకు మించి స్టెరాయిడ్లు వాడితే వారిలో రోగ నిరోధక శక్తి ఒక్కసారిగా తగ్గిపోతుంది. వారి శరీరంలో చక్కెర స్థాయిలు గాడి తప్పుతాయి. ఇలాంటి సమయంలో ఫంగస్ శరీరంలోకి ప్రవేశిస్తే.. విపరీతంగా వృద్ధి చెంది, ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. కృత్రిమ ఆక్సిజన్ తీసుకుంటున్న పేషెంట్లకు సైతం బ్లాక్ ఫంగస్ సోకే అవకాశం ఉండొచ్చు. లక్షణాలివీ.. ► ముఖంలో వాపు ఉన్నప్పుడు ముందుగా ఈ లక్షణాలు బయటపడతాయి. ► కంటిగుడ్డు కింద ఎర్రబడి దురదగా ఉండటం (ఆఫ్తాల్మో ప్లీజియా). ► ముక్కులో దురదగా ఉండటం, పదేపదే ముక్కును నలిపేయాలనిపించడం. ► కళ్లపైన లేదా కళ్ల కింద చిన్న ఉబ్బులు కనిపించడం. కంటిచూపు తగ్గినట్టుగా లేదా మసకగా అనిపించడం. ► దంతాల్లో నొప్పిగా ఉండటం. ముఖంపై నొప్పి, తిమ్మిరి, వాపు వంటితో పాటు మొద్దుబారడం కూడా వంటివి కూడా దీని లక్షణాలు. -
సినీనటుడు నర్సింగ్ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత
సుల్తాన్‌బజార్: తెలుగు సినీ నటుడు నర్సింగ్ యాదవ్ తీవ్ర అస్వస్థకు గురికావడంతో కుటుంబ సభ్యులు గురువారం ఆయనను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. గత కొంత కాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న నర్సింగ్ యాదవ్ డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే అస్వస్థతకు గురైన నర్సింగ్ యాదవ్‌కు డయాలసిస్ చేస్తున్న సమయంలో షుగర్, బీపీ తగ్గిపోవడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన కొంత మేర కోలుకుంటున్నట్లు సోదరుడు శంకర్ యాదవ్ తెలిపారు. -
హైటెక్ నగరి.. రోగాల దాడి!
సాక్షి, సిటీబ్యూరో: హైటెక్ నగరం రోగాల మయంగా మారుతోంది. నగరంలో చక్కెర వ్యాధితో పాటు గుండె జబ్బులు, బీపీ సహా వివిధ రకాల కేన్సర్లు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ నగరంలో తాజాగా నిర్వహించిన అధ్యయనంలోఈ విషయం తెలిసింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కేన్సర్ వ్యాధిగ్రస్తుల్లో మూడోవంతు రోగులు హైదరాబాద్ నగరంలోనే ఉండడం గమనార్హం. పెరుగుతున్న భూ, జల, వాయు కాలుష్యం, మారుతున్న జీవన శైలి కారణంగా వివిధ రకాల కేన్సర్లు ప్రబలుతున్నాయి. మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మరో వైపు పాత నగరంలో టీబీ వ్యాధిగ్రస్తులు సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రతి నెలా ఆరు వందల నుంచి 700 వరకు టీబీ కేసులు నూతనంగా నమోదవుతున్నట్లు ఈ అధ్యయనంవెల్లడించింది. పాత నగరంలో జీవనశైలి జబ్బులు తో పాటు తీవ్రమైన రోగాలతో బాధపడుతున్న వారు 25 శాతంగా ఉన్నట్లు ఈ సంస్థ అధ్యయనం తెలిపింది. వీరిలో చాలామంది వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. తీవ్రమైన జబ్బులు రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలను మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతీస్తున్నాయి. ఆయా వ్యాధుల చికిత్స కోసం చేసే ఖర్చులు వారిని ఆర్థికంగా చితికిపోయేలా చేస్తున్నాయి. కాగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో రక్త కేన్సర్లు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. అవగాహన లేమితో ముప్పు జీవనశైలి జబ్బులు, తీవ్రమైన రోగాలపై ప్రధానంగా నిరుపేదలు, అల్పాదాయ, మధ్య ఆదాయ వర్గాలకు అవగాహన లేకపోవడం, ఆయా వ్యాధులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందులపై కనీసఅవగాహన లోపించడం శాపంగాపరిణమిస్తోంది. తరచూ వైద్య పరీక్షలు, వైద్యుల సలహాలు తీసుకునే విషయంలోనూ పలువురు వెనుకంజ వేస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహించే ఉచిత వైద్య పరీక్షలునిర్వహించినప్పుడు ఆయా టెస్టులుచేసుకునేందుకు కొందరు ముందుకురావడం గుడ్డిలో మెల్ల. వయో గ్రూపులవారీగా రోగాల జాడ ఇలా.. ఈ అధ్యయనం ప్రకారం నగరంలో 30 ఏళ్లు ఆపై వయసున్న వారిలో 20 శాతం మంది బీపీ సమస్యతో బాధపడుతున్నారు. 35 ఏళ్ల పైబడిన వారిలో 12 శాతం మందికి చక్కెర వ్యాధి ముప్పు పొంచి ఉంది. 25 నుంచి యాభయ్యేళ్ల లోపు వయసున్న వారిలో 11 శాతం మంది నోటి కేన్సర్‌తో బాధపడుతున్నారు. 35 ఏళ్లు పైబడిన మహిళల్లో 8 శాతం మంది బ్రెస్ట్ కేన్సర్ బారిన పడుతున్నారు. ఇక 40 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న మహిళలు, పురుషుల్లో ఐదు శాతం మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. పదిహేనేళ్ల లోపు చిన్నారుల్లో ఐదు శాతం మందికి రక్త కేన్సర్ల ముప్పు పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జీవన శైలి వ్యాధులు, తీవ్రమైన జబ్బులు రావడానికి గల కారణాలు, చికిత్స, నివారణ పద్ధతులపై ఇటు ప్రభుత్వం, అటు వైద్య ఆరోగ్య శాఖ, స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఈ అధ్యయనం స్పష్టం చేయడం విశేషం. -
బరువులెత్తితే.. మధుమేహ నియంత్రణ!
మధుమేహంతో బాధపడుతున్న ఊబకాయులకు వెయిట్ ట్రెయినింగ్, శక్తినిచ్చే వ్యాయామాలు రెండూ ఎంతో ఉపయోగపడతాయని అంటున్నారు బ్రెజిల్ శాస్త్రవేత్తలు. నడక లాంటి వ్యాయామాలే మధుమేహానికి చాలనుకుంటున్న తరుణంలో కంపినాస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ కొత్త విషయాన్ని చెప్పడం గమనార్హం. ఊబకాయులు పైన చెప్పిన రెండు పనులు చేస్తే వారి కాలేయాల్లో పేరుకున్న కొవ్వు గణనీయంగా తగ్గిపోతుందని, తద్వారా రక్తంలోని చక్కెర మోతాదులు నియంత్రణలోకి వస్తాయని వీరు అంటున్నారు. ఎలుకలపై తాము జరిపిన ప్రయోగాల్లో రెండువారాలపాటు బరువులెత్తడం, శక్తినిచ్చే వ్యాయామాలు చేయడం ద్వారా కాలేయ కణజాలంలోని జన్యువుల్లో మార్పులు వచ్చాయని, ఫలితంగా అక్కడి కొవ్వులు వేగంగా కరగడం మొదలైందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లియాండ్రో పెరీరా తెలిపారు. ఇదంతా ఎలా జరుగుతోందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, వ్యాయామం కారణంగా నిర్దిష్ట ప్రొటీన్ల ఉత్పత్తిలో హెచ్చుతగ్గులను గుర్తిస్తే వాటిని కృత్రిమంగా తయారు చేయవచ్చునని లియాండ్రో ఆశాభావం వ్యక్తం చేశారు. కాలేయంలో ఎక్కువ కొవ్వు ఉన్నప్పుడు స్థానికంగా మంట/వాపు లాంటివి వస్తాయని, ఫలితంగా కాలేయంలోని కణాలు ఇన్సులిన్‌పై ప్రభావం చూపే స్థితిని కోల్పోతాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో నిరాహారంగా మాత్రమే ఉన్నప్పుడు విడుదల కావాల్సిన గ్లూకోజ్ రక్తంలోనికి చేరిపోతుందని వివరించారు. -
చక్కెరొచ్చింది... రక్తం పోటెత్తింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీపీ, షుగర్ వంటి జీవనశైలి వ్యాధులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. అయితే, గ్రామాల్లో అనేకమందికి తమకు బీపీగానీ, షుగర్‌గానీ ఉన్నట్లు తెలియకపోవడంతో ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో జీవనశైలి వ్యాధిగ్రస్తులను ముందే గుర్తించి ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ‘నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ కేన్సర్, డయాబెటీస్, కార్డియోవస్కులర్ డిసీజ్ అండ్ స్ట్రోక్ (ఎన్‌పీసీడీసీఎస్)’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ సమాచారాన్ని తక్షణమే ట్యాబ్‌లలో అప్లోడ్ చేస్తున్నారు. వేగంగా సర్వే నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమస్థానంలో ఉంది. జీవనశైలి వ్యాధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈ నెల మూడో తేదీ వరకు చేపట్టిన సర్వే అంశాల్లోని నివేదికను విడుదల చేసింది. 12 జిల్లాలు 32 లక్షల మంది బీపీ, షుగర్ బాధితుల వివరాలు తెలుసుకునేందుకు రాష్ట్రంలో 12 జిల్లాల్లో వైద్య పరీక్షలు ప్రారంభించారు. జనగాం, సిద్ధిపేట, కరీంనగర్, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, వరంగల్ రూరల్, మెదక్, సంగారెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్ అర్బన్ జిల్లాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 1.04 కోట్ల జనాభా ఉంది. అందులో 30 ఏళ్లకుపైబడిన వయస్సుగలవారు 38.73 లక్షలమంది ఉన్నారు. 32.02 లక్షల(83%) మందికి స్క్రీనింగ్ పరీక్షలు జరిగాయి. వారిలో 3.86 లక్షలమందిని గుర్తించి ఆసుపత్రులకు రిఫర్ చేశారు. పాతవారితో కలిపి మొత్తంగా 2.73 లక్షల మందికి బీపీ, 1.69 లక్షల మందికి డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారించారు. అంటే 4.42 లక్షల మందికి బీపీ, షుగర్ ఉన్నట్లు తేలింది. వారిలో కొందరికి బీపీ, షుగర్ రెండూ ఉండటం గమనార్హం. అంటే 30 ఏళ్లకుపైబడిన వారిలో ఈ 12 జిల్లాల్లో 13 శాతం మంది బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతున్నట్లు నిర్ధారణ జరిగింది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో బీపీ, షుగర్ ఈ 12 జిల్లాల్లో అత్యధికంగా సంగారెడ్డి జిల్లాల్లో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఆ జిల్లాలో 5.12 లక్షలమందికి స్క్రీనింగ్ చేయగా, 65 వేలమందికి బీపీ, 34 వేల మందికి షుగర్ ఉన్నట్లు నిర్ధారణ చేశారు. అత్యంత తక్కువగా భూపాలపల్లి, వరంగల్ రూరల్ జిల్లాల్లో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులున్నట్లు తేలింది. భూపాలపల్లి జిల్లాలో 2.38 లక్షల మందికి స్క్రీనింగ్ చేయగా, అందులో 3,453 మందికి బీపీ, 3112 మందికి షుగర్ ఉన్నట్లు నిర్దారించారు. వరంగల్ రూరల్ జిల్లాలో 2.14 లక్షల మందికి స్క్రీనింగ్ చేయగా, అందులో 4,531 మందికి బీపీ, 4 వేల మందికి షుగర్ ఉన్నట్లు నిర్ధారించారు. జూన్ ఒకటి నుంచి మిగిలిన జిల్లాల్లోనూ జీవనశైలి వ్యాధులపై సర్వే చేయనున్నారు. -
యువత @హైరిస్క్
లబ్బీపేట(విజయవాడతూర్పు)/మచిలీపట్నంసబర్బన్: ‘ప్రైవేటు బ్యాంకులో పనిచేసే 35 ఏళ్ల యువకుడు ఇటీవల నీరసంగా ఉంటుండటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రక్తపోటు అధికంగా ఉండటంతో పాటు, మూత్రపిండాల్లో ఫిల్టర్స్ పదిశాతం వరకూ దెబ్బతిన్నట్లు వైద్యులు చెప్పారు. ఐదేళ్ల నుంచి రక్తపోటు ఉన్నా గుర్తించక పోవడంతో ఆ ప్రభావం మూత్రపిండాలపై చూపినట్లు పేర్కొన్నారు.’‘ఇరిగేషన్‌శాఖలో పనిచేసే ఓ ఉద్యోగికి 28 ఏళ్లు. తరచూ కళ్లు తిరిగినట్లు ఉండటంతో ఇటీవల వైద్యుడి వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. అతని శరీరంలో చక్కెర స్థాయి 160 ఉండటంతో పాటు, హెచ్‌బీఏ1సీ 10కి చేరింది. మరికొంతకాలం ఇదే పరిస్థితి ఉంటే గుండె, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండేదని వైద్యులు తెలిపారు.’ ఇలా వీరిద్దరే కాదు..రాజధానిలో అనేక మంది రెండు పదుల వయస్సులోనే రక్తపోటు, మధుమేహం అనే జంటభూతాల బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నగరంలోని ఆస్పత్రిల్లో గుండె, కిడ్నీ సమస్యలతో చికిత్స పొందుతున్న వారిలో 80 శాతం మందికి ఈ రెండు వ్యాధులే కారణమని నిర్థారణ అవుతుంది. చిన్నవయస్సులోనే సోకుతున్న వ్యాధుల పట్ల అప్రమత్తం కాకుంటే రానున్న రోజుల్లో మనిషి జీవిత కాలంలో పది నుంచి పదిహేనేళ్లు తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ నిర్వహించిన సర్వేలో సైతం రాజధాని జిల్లాలో మధుమేహం, రక్తపోటు కారణంగా గుండెజబ్బులు పెరుగుతున్నట్లు తేలింది. 25 ఏళ్లు దాటిన వారిలో దాదాపు 12 శాతం మంది సుగర్తోనూ.. 14 శాతం మంది బీపీతోనూ బాధపడుతున్నట్లు సర్వేలో తేటతెల్లమైంది. జంట వ్యాధులకు కారణాలివే.. జీవనశైలిలో మార్పులు చోటుచేసుకోవడం, మాంసాహారం, కార్పోహైడ్రేడ్స్ ఎక్కువుగా ఉంటే జంక్ఫుడ్స్ తీసుకోవడం, శారీరక శ్రమ లేక పోవడం కారణంగా తేలింది. అంతేకాకుండా ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోవడం కూడా రక్తపోటు పెరగడానికి కారణంగా సర్వేలో తేలింది. రాజధాని ప్రాంత ఉద్యోగుల్లో 70 శాతం మంది ఒత్తిడికి గురవడం కూడా చిన్నవయస్సులోనే రక్తపోటు, బీపీకి కారణాలుగా చెపుతున్నారు. ఏమి చేయాలి.. ♦ జంట వ్యాధులను అరికట్టేందుకు ప్రతిరోజూ 45 నిమిషాల చొప్పున వారంలో ఐదు రోజుల పాటు వ్యాయామం, వాకింగ్ లాంటివి తప్పక చేయాలి. ♦ విధి నిర్వహణలో, జీవితంలో ఎదుర్కొనే ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగా చేయడం మంచిది. ♦ ఆహారంలో కార్బోహైడ్రేడ్స్ తక్కువుగా ఉండేలా చూసుకోవాలి, మాంసాహారం, జంక్‌ఫుడ్స్‌ను తగ్గిస్తే మంచిది. ♦ పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, తాజా పళ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువుగా తినాలి. ♦ శరీరంలో బీపీ, చక్కెర స్థాయిలు, కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకునేలా తరచూ పరీక్షలు చేయించుకోవాలి. ♦ ప్రతి మనిషి నెలకు 500 గ్రాములకు మించి వంట నూనెలు వాడరాదు. అధికంగా నూనెలు వినియోగించడం చాలా ప్రమాదకరం. ♦ ఒకే నూనె కాకుండా మార్చి మార్చి వాడటం మంచిది. ప్రమాదకర స్థాయిలో ‘చక్కెర’ కృష్ణా జిల్లాలో మధుమేహం(సుగర్) వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ప్రతి పది మందిలో నలుగురు వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో హైరిస్క్ సుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో స్పష్టమైంది. ఈ రెండు నియోజకవర్గాల్లో సుమారు 4.50 లక్షల మంది జనాభా ఉండగా సుమారు 1.50 లక్షల మంది సుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. వీరిలో లక్ష మందికి పైగా హైరిస్క్ సుగర్‌తో పోరాడుతున్నారు. -
రెండు కిడ్నీలు చెడిపోయాయి.. ట్రాన్స్‌ప్లాంటేషన్ వివరాలు చెప్పండి
కిడ్నీ కౌన్సెలింగ్స్ మావారి వయసు 36 ఏళ్లు. సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మా కుటుంబంలో వంశపారంపర్యంగా షుగర్ వ్యాధి ఉంది. గత ఐదేళ్లుగా విదేశాల్లోనే ఉండి పనిచేసి, ఇటీవలే స్వదేశం వచ్చారు. విదేశాల్లో ఉన్నప్పుడు ఫాస్ట్‌ఫుడ్, కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తీసుకునేవారు. మద్యం, సిగరెట్ల అలవాటు కూడా ఉంది. ఈమధ్య హఠాత్తుగా ఆరోగ్యం చెడిపోతే డాక్టర్‌కు చూపించాం. రెండు కిడ్నీలు చెడిపోయాయని చెప్పారు. వారానికి మూడు, నాలుగు సార్లు డయాలసిస్ చేయించుకోవాలి. ట్రాన్స్‌ఫ్లాంటేషన్ అవసరమని చెప్పారు. మూత్రపిండాల మార్పిడి ఎలా చేస్తారు? కిడ్నీ ఎవరు ఇవ్వవచ్చు? దయచేసి వివరంగా తెలపండి. – కె. సింహాచలం, విశాఖపట్నం మన శరీరంలోని అత్యంత కీలకమైన అవయవాల్లో మూత్రపిండాలు కూడా చాలా ప్రధానమైనవి. ఇవి మన శరీరంలోని రక్తాన్ని శుద్ధిచేసి, అనవసర, ప్రమాదకర, విసర్జన పదార్థాలను నీటితో కలిపి బయటకు పంపిస్తుంటాయి. కిడ్నీలకు తీవ్రమైన వ్యాధులు సోకినప్పుడు అవ రక్తాన్ని శుద్ధి చేయలేవు. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధుల్లో ప్రాథమిక దశలో నొప్పిగానీ, స్పష్టమైన వ్యాధి లక్షణాలేమీ కనిపించవు. దాంతో కీలకమైన ఈ అవయవాలకు వ్యాధి సోకినట్లు గుర్తించడలంలో చాలా ఆలస్యం అవుతుంది. కానీ కిడ్నీ వ్యాధుల గుర్తింపులో సమయం చాలా కీలకం. ఆలస్యం అవుతున్నకొద్దీ వ్యాధి మరింత ముదిరి చివరకు అది రీనల్ ఫెయిల్యూరుకు దారితీస్తుంది. దాంతో మూత్రపిండం తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం చాలా సందర్భాల్లో అసాధ్యం అవుతుంది. ఆ పరిస్థితిలో మూత్రపిండాల మార్పిడి (కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్) తప్ప మరో మార్గం లేని పరిస్థితి ఏర్పడుతుంది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు దాత అవసరం. దాత నుంచి కిడ్నీ పొందడానికి ప్రభుత్వ నిర్వహణలో ఉండే ‘జీవన్‌దాన్’లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దాత లభించేలోగా డయాలసిస్‌పై ఆధారపడటమే మార్గం. డయాలసిస్‌లో రక్తంలోని మలినాలు, అదనపు నీటిని తొలగించివేస్తారు. డయాలసిస్‌లో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది హీమోడయాలసిస్, రెండోది పెరిటోనియల్ డయాలసిస్. హీమోడయాలసిస్ కోసం ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. పెరిటోనియల్ డయాలసిస్ ఇంటిదగ్గరే చేసుకోడానికి వీలవుతుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో లాగే మన దేశంలోనూ కిడ్నీ దాతల సంఖ్య చాలా తక్కువగా ఉంటున్నది. అందువల్ల వ్యాధిగ్రస్తుడి పరిస్థితిని బట్టి తొందరగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స అవసరమైనప్పుడు కుటుంబసభ్యులు, రక్తసంబంధీకుల్లో ఎవరైనా దానం చేయవచ్చు. దాతల ఆరోగ్యం, రక్తం గ్రూపు తదితర అంశాలను పరిశీలించి డాక్టర్లు సరైన దాతను నిర్ణయిస్తారు. కిడ్నీ వ్యాధుల చికిత్సతో పాటు మూత్రపిండాల మార్పిడికి అవసరమైన పూర్తిస్థాయి సదుపాయాలు, వైద్యనిపుణులు ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ శస్త్రచికిత్సలో సక్సెస్‌రేటు 95 శాతం వరకు ఉండి, దాదాపు అన్నీ విజయవంతమవుతూ అనేక మందికి మంచి ఆయుర్దాయాన్ని ఇస్తున్నాయి. శస్త్రచికిత్స తర్వాత దాదాపు 10, 15 ఏళ్ల వరకు దాదాపు ఎలాంటి సమస్యలూ ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోడానికి వీలవుతుంది. మీవారి విషయంలో వ్యాధి నిర్ధారణ జరిగిందంటున్నారు కాబట్టి ఇక మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ డాక్టర్ల సూచన మేరకు చికిత్స చేయించండి. డాక్టర్ ఎ. శశికిరణ్, సీనియర్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, మలక్‌పేట్, హైదరాబాద్ -
చక్కెర వ్యాధి.. ఎంతో చేదు
పశ్చిమగోదావరి, నిడమర్రు: చక్కెర వ్యాధి.. ఈ వ్యాధికి పేరులోనే చక్కెర.. దాని ఫలితమంతా ఎంతో చేదు. ఆ వ్యాధి వస్తే చక్కెరకు ఇక దాదాపు దూరమైనట్లే. భారత్‌లోని అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో ఈ వ్యాధి మరింత అధికమని గణాంకాలు చెపుతున్నాయి. జిల్లాలో ప్రతి నెల కొత్తగా సుగర్ వ్యాధి బారిన పడుతున్నవారు 5వేల నుంచి 6వేలు మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖాధికారులు చెపుతున్నారు. వీరిలో ఎక్కువ మంది 35 నుంచి 45 ఏళ్ల వయసున్న వారే ఉంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే ప్రతి 20 మరణాల్లో ఒకటి మధుమేహ సంబంధిత వ్యాధుల కారణంగానే అని వరల్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. దీన్ని నివారించడం అంత తేలిక కానప్పటికీ, కొన్ని రకాల విధి విధానాలు, ఆరోగ్య సూత్రాలు పాటించడం ద్వారా సమర్ధంగా ఎదుర్కోవచ్చుఅని వైద్యులు భరోసా ఇస్తున్నారు. నేడు అంతర్జాతీయ మధుమేహ దినోత్సవం సందర్భంగా కథనం.. జిల్లాలో రూ.6 లక్షల మందికి మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్యపరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. జిల్లాలో 39 లక్షల మంది జనాభా ఉంటే 25 ఏళ్లు పైబడిన వారు 27 లక్షల మంది వరకూ ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేటు గణాంకాలు పరి శీలిస్తే జిల్లాలో సుమారు రూ.6 లక్షల మంది వరకూ సుగర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలు స్తోంది. ప్రతి ఏడుగురిలో ఒకరిని ఈ వ్యాధి వెంటాడుతోంది. ప్రభుత్వ పరంగా పరిశీలిస్తే మధుమేహం వివిధ స్టేజిల్లో ఉన్న 1,24,665 మంది రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రతి నెలా ఉచితంగా మందులు అందిస్తున్నట్లు ఎన్సీడీ కోఆర్డినేటర్ డాక్టర్ ఆనంద్‌కుమార్ తెలిపారు. 104 ద్వారా మరో 15వేల మందికి ప్రతినెల సుగర్ మందులు అందిస్తున్నారు. ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్లే ఈ వ్యాధి శరీరంలోని ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం. రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన రుగ్మత. చక్కెరవ్యాధిని సాధారణంగా రక్తంలో మితి మీరిన చెక్కర స్థాయినిబట్టి గుర్తిస్తారు. శరీరంలో చక్కెర నిల్వలుతగ్గడానికి కారణాలు ♦ ఆహారం సరిగా తీసుకోకపోవడం,ఉపవాసాలు ♦ అనారోగ్యంగా ఉన్నప్పుడు అవసరానికి మించి వ్యాయామం, శారీరక శ్రమ ♦ ఇన్సులిన్, యాంటీడయాబెటిక్, నొప్పి నివారణ మందులు ఎక్కువ మొతాదులో తీసుకోవడం. ♦ అధికంగా మత్తుపానీయాలు తీసుకోవడం. రక్తంలో చక్కెరశాతం తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు ♦ అతిగా ఆకలి, అతి చెమట, మూర్చపోవడం, బలహీనత, ఎక్కువగా గుండె కొట్టుకోవడం. ♦ పెదవులకు తిమ్మిరి ♦ చూపు మసకబారడం ♦ తలనొప్పి, చేసేపనిపై శ్రద్ధ లేకపోవడం. ♦ తికమక పడటం, అలసిపోవడం, బద్ధకం. ఈ స్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦ కచ్చితమైన ఆహార సమయాలు పాటిస్తూ, సరైన సమయంలో మందులు వాడడం. ♦ రక్తంలో చక్కెర నిల్వ స్థితి పెంచేందుకు 3,4 చెంచాల చక్కెర లేదా గ్లూకోజ్ తీసుకోవాలి. వ్యాధి నిర్ధారణ ♦ మధుమేహ వ్యాధిని రక్త, మూత్రపరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. ♦ రక్తపరీక్ష : సాధారణంగా రక్తంలో చక్కెర శాతం 80 నుంచి 140 మి. గ్రాముల వరకు ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ ఉంటే చక్కెర ప్రారంభమైనట్లు. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు చక్కెర శాతం 60 నుంచి 90 ఎంజీ/ డీఎల్, తిన్న తరువాత 110 నుంచి 140ఎంజీ/ డీఎల్ ఉండాలి. ఇంతకన్నా ఎక్కువ ఉంటే చక్కెర వ్యాధి ఉన్నట్లే. ♦ మూత్ర పరీక్ష : సాధారణంగా మూత్రంలో చక్కెర ఉండదు. ఒక వేళ మూత్రంలో చక్కెర గుర్తిస్తే వ్యాధి ఉన్నట్లే. రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦ రోజు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేసి శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. ♦ భోజనానికి అరగంట ముందు నిర్ణీతసమయంలో మాత్రలు వేసుకోవాలి. ♦ రోజూ ఒక నిర్ణీత సమయంలోనేభోజనం చెయ్యాలి. ♦ ఇన్సులిన్ వేసుకోవడంలోనూ కాలనియమాన్ని పాటించాలి. ♦ మధుమేహంలో కాళ్లల్లో స్పర్శజ్ఞానం పోయిందన్న విషయం చాలాకాలం వరకూ తెలియదు. స్పర్శలేకపోతే ప్రతి ఆరు లేదా మూడు మాసాలకు ఒకసారి వైద్య పరీక్ష చేయించాలి. ♦ పాదాల మీద చర్మం కందిపోవడం, గాయాలు, పుండ్లు, అనెలు ఉన్నాయోమో గమనించాలి. ♦ గోళ్లు తీసి సమయంలోఎక్కడా గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. పాదాలను ప్రతిరోజు గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ♦ ఇన్ఫెక్షన్తో కాళ్లకు చీముపడితే డాక్టర్ సలహాలతో మందులు వాడాలి. మానుకోవాల్సిన అలవాట్లు ♦ తీపి పదార్థాలు, ఐస్‌క్రీమ్ మానుకోవాలి. నూనె పదార్థాలను తినడం తగ్గించాలి ♦ పాదరక్షలు లేకుండా నడవకూడదు ♦ పొగతాగరాదు ♦ మానసికి ఒత్తిళ్లను తగ్గించుకోవాలి ♦ కొలెస్ట్రాల్ అధికంగా ఉండే కొవ్వుతో కూడిన మాంసం, గుడ్లు తినరాదు. ఆరోగ్య క్రమశిక్షణ లేనివారిలోనే.. ఆరోగ్య క్రమశిక్షణ లేని వారిలోనే డయాబెటిస్ లక్షణాలు మొదలవుతున్నాయి. మానసిక ఒత్తిడికి గురవడం, జంక్‌ఫుడ్, కనీస వ్యాయామ నియమాలు పాటించక చాలామంది ఈ వ్యాధిబారిన పడుతున్నారు. వ్యాధి వచ్చే అవకాశాలను ముందుగానే గుర్తిస్తే నివారించవచ్చు.– డాక్టర్ షర్మిల, సుగర్ వ్యాధి నిపుణులు, భీమవరం సుగర్ కంట్రోల్ లేకపోతే రెటీనాపై సుగర్ వ్యాధిని నియంత్రించకుంటే కంటి రెటీనాపై ప్రభావం పడి చూపుమందగిస్తుంది. రెటీనాలోని రక్తం గడ్డకట్టి ఇతర సమస్యలతోపాటు, ఒక్కోసారి కంటి రెప్పల కదలికలు ఆగిపోయి నేత్ర పక్షవాతానికి దారితీయవచ్చు.రోగులు ఏటా కంటి పరీక్షలు చేయించుకోవాలి.–డాక్టర్ యూవీ రమణరాజు, కంటివైద్య నిపుణులు, భీమవరం -
సు'ఘర్'
మధుమేహం.. వ్యథాభరితంగా మారింది.. చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రాణాలకు ముప్పు తెస్తోంది.మారుతున్న జీవన సరళి, ఆధునికపోకడలు, ఆరోగ్య క్రమశిక్షణ మీరడం,ఆహారపు అలవాట్లు వ్యాధి విస్తరణకుకారణమవుతున్నాయి. ప్రధానంగా 35నుంచి 45 ఏళ్ల వయసు వారు చక్కెర రోగం బారినపడటం ఆందోళన కలిగి స్తోంది. దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో సుగర్ బాధితులు ఎక్కువగా ఉండగా జిల్లాలోనూ అదేస్థాయిలో ప్రభావం చూపుతోంది. జిల్లాలో ప్రతినెలా సుమారు 6 వేల కొత్త మధుమేహ కేసులు నమోదు కావడంపరిస్థితికి అద్దంపడుతోంది. పశ్చిమగోదావరి, నిడమర్రు: మధుమేహం కారణంగా ఇతర ఆరోగ్య సమస్యలతో దేశంలోని ప్రతి నిమిషానికి ఇద్దరు మరణిస్తున్నట్టు గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే ప్రతి 20 మరణాల్లో ఒకటి మధుమేహ సంబంధిత వ్యాధుల కారణమని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని నివారించడం సులభం కాదని, విధి విధానాలు, ఆరోగ్య సూత్రాలు పాటించడం ద్వారా సమర్థంగా ఎదుర్కొనవచ్చని వ్యాధి నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో సుమారు 6 లక్షల మందికి.. మధుమేహాన్ని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. జిల్లాలో 39 లక్షల మంది జనాభా ఉంటే 25 ఏళ్లు పైబడిన వారు 27 లక్షల మంది వరకూ ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ గణాంకాలు పరిశీలిస్తే జిల్లాలో సుమారు 6 లక్షల మంది సుగర్ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన ప్రతి ఏడుగురిలో ఒకరికి చక్కెర వ్యాధి ఉందన్నమాట. దాదాపు 80 శాతం కుటుంబాల్లో దీనిబారిన పడిన వారు ఒక్కరైనా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఉచితంగా మందులు ప్రభుత్వపరంగా పరిశీలిస్తే జిల్లాలో మధుమేహం వివిధ దశలో ఉన్న 1,24,665 మంది రోగులకు ప్రభుత్వాస్పత్రుల ద్వారా ప్రతి నెలా ఉచితంగా మందులు అందిస్తున్నట్టు ఎన్సీడీ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఆనంద్‌కుమార్ తెలిపారు. 104 వాహనం ద్వారా 14,402 మందికి ప్రతినెలా సుగర్ మందులు అందిస్తున్నట్టు 104 సీసీ ఎంవీవీ సత్యనారాయణమూర్తి తెలిపారు. జిల్లాలోని 555 ప్రైవేట్ ఆస్పత్రులు ఉండగా 25 శాతం ఆస్పత్రుల్లో సుగర్ వ్యాధి నిపుణులు ఉన్నారు. ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్లే.. శరీరంలోని ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన రుగ్మత, అతిమూత్రం (పాలీయూరియా), దాహం ఎక్కువ వేయడం (పాలీడిప్పియా), మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం, బద్దకం మధుమేహం ముఖ్య లక్షణాలు. రక్తంలో మితిమీరిన చక్కెర స్థాయిని బట్టి వ్యాధినినిర్ధారిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డయాబెటిస్‌ను మూడు రకాలుగా గుర్తించింది. ప్రసవం తర్వాత తగ్గిపోతుంది డయాబెటిస్‌లో మూడో రకమైన జెస్టేషనల్ డయాబెటిస్ సాధారణంగా మహిళకు ప్రసవం తర్వాత తగ్గిపోతుంది. మొదటి, రెండో రకాలు దీర్ఘకాలికంగా ఉంటాయి. ఆహారపు అలవాట్లలో మార్పు కూడా బాగుంటే ఇన్సులిన్ ఉత్పత్తి లేని మొదటి రకాన్ని నియంత్రించడానికి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వటం తప్పనిసరి. ఆహార అలవాట్లలో మార్పు, యాంటీ డయాబెటిక్ మందులు వాడకం వల్ల, అవసరమైతే ఇన్సులిన్ వాడకం వల్ల రెండో రకం మధుమేహాన్ని నియంత్రించవచ్చు. -
మందులోడే.. మాయగాడు
నాగర్‌కర్నూల్ క్రైం: షుగర్ వ్యాధికి మందిస్తానంటూ నమ్మించడమే గాక.. శాంతిపూజలు కూడా చేస్తానంటూ ఓ వ్యక్తిని బురిడీ కొట్టించి అతని నుంచి బంగారు నగలు, నగదు స్వాహా చేసి ఉడాయించాడు. ఈ సంఘటన శనివారం రాత్రి నాగర్‌కర్నూల్‌లో చోటుచేసుకుంది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంలోని కేసరిసముద్రం రోడ్డులోని ఈదమ్మగుడి కాలనీకి చెందిన కొట్ర బాలయ్య స్థానికంగా ఇస్త్రీ షాపు నిర్వహిస్తున్నాడు. ఇతడి షాపు దగ్గరికి గత 15 రోజుల క్రితం ఓ మహిళ వచ్చి షుగర్ వ్యాధికి ఒక స్వామీజీ మందు ఇచ్చి నయం చేస్తారని, తనతోపాటు తన బంధువులకు స్వామీజీ ఇచ్చిన మందుతో నయం అయిందని ఆ స్వామీజీని ఇక్కడ చూశారా అని కొట్ర బాలయ్యను అడిగి వెళ్లిపోయింది. శనివారం ఉదయం కాషాయపు దుస్తులు ధరించిన గుర్తుతెలియని వ్యక్తి కొట్ర బాలయ్య షాపు ముందే తిరుగుతూ బాధితుడి వద్దకు వెళ్లి ఇక్కడ కుంకుమ దొరుకుతుందా అని అడగడంతో బాధితుడు స్వామీజీ వేషంలో ఉన్న మోసగాడిని షుగర్ వ్యాధి నయం చేసే వ్యక్తిగా భావించాడు. స్వామీజీ వేషంలో మోసగాడు అతనితో మాటామాట కలిపి షుగర్వ్యాధితోపాటు ఏవైనా కష్టాలు ఉంటే పూజలు చేసి వాటిని తొలగిస్తానని అతన్ని నమ్మబలికాడు. దీంతో బాధితుడు షుగర్వ్యాధికి మందు ఇచ్చి నయం చేయాలని కోరడంతో స్వామీజీ అంగీకరించి ఇంటి దగ్గర మందు తయారు చేసిస్తానని చెప్పడంతో బాధితుడు స్వామీజీ వేషంలో ఉన్న మోసగాన్ని ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంటికి నరదృష్టి పేరుతో.. ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత ఇంటికి నరదృష్టి ఉందని పూజలు చేయాలని నిమ్మకాయలు, కుంకుమ, బియ్యం, పసుపు కావాలని కోరడంతో వాటిని బాధితుడు ఇచ్చాడు. పూజలో బంగారంతోపాటు, నగదు ఉంచి మందును తయారు చేసిస్తానని నమ్మబలికాడు. అది నమ్మిన కొట్ర బాలయ్య అతని భార్య లక్ష్మి తన ఇంట్లో ఉన్న 3 తులాల బంగారం నగలు, రూ.5,100 నగదు స్వామీజీకి ఇవ్వడంతో అతను బంగారాన్ని, నగదు తీసి తన దగ్గర ఉన్న బాక్సులో వేసి వాటికి దారాలు చుట్టి పూజలు చేశాడు. అనంతరం స్నానానికి వెళ్లమని చెప్పడంతో బాధితుడి భార్య లక్ష్మి స్నానానికి వెళ్లింది. బాలయ్యను గేటు దగ్గరికి వేయమని చెప్పడంతో ఆయన వెళ్లి వచ్చేలోపు తన దగ్గర ఉన్న వేరే డబ్బాను అక్కడ ఉంచి బంగారం నగలు, నగదు ఉన్న బాక్సును సంచిలో పెట్టుకున్నాడు. అనంతరం స్వామీజీ పట్టణంలోని మార్కెట్ యార్డులో వదిలి వేసి ఇంటికి తిరిగి వచ్చాడు. కేసు నమోదు ఈ క్రమంలో స్వామీజీ వెళ్లిపోయిన తర్వాత బాలయ్య భార్య లక్ష్మికి అనుమానం రావడంతో వెంటనే బాక్సును తెరిచి చూడగా అందులో బియ్యం మాత్రమే ఉన్నాయి. దీంతో తాము మోసపోయామని గుర్తించిన బాధితులు వెంటనే లబోదిబోమంటూ పోలీస్‌స్టేషన్ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ భగవంతురెడ్డి తెలిపారు. -
మధుమేహం శాశ్వతం కాదు!
చక్కెర వ్యాధి ఒకసారి వస్తే.. జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలని చాలామంది చెబుతూంటారు. అయితే ఇందులో వాస్తవం కొంతే. న్యూక్యాసల్, గ్లాస్గౌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రాయ్టేలర్, మైక్ లీన్‌లు మధుమేహం శాశ్వతమేమీ కాదని ఇటీవల ఒక అధ్యయనం ద్వారా తెలుసుకున్నారు. ప్రఖ్యాత వైద్య పరిశోధనల మ్యాగజైన్ ‘ద లాన్సెట్’లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. వైద్యుల సహకారంతో తగిన విధంగా బరువు తగ్గడం ద్వారా దాదాపు సగం మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ పరిస్థితిని పూర్తిగా మెరుగుపరచుకోగలిగారు. మూడు నుంచి ఐదు నెలలపాటు అతితక్కువ కేలరీలున్న ఆహారాన్ని తీసుకున్న వారిలో 45.6 శాతం మంది తమ మధుమేహం మందుల వాడకాన్ని నిలిపివేయగలిగారని, జనరల్ ప్రాక్టీషనర్ సిబ్బంది సహకారంతో బరువును అదుపులో ఉంచుకోవడం ఇందులో కీలకంగా ఉందని రాయ్ టేలర్ తెలిపారు. శరీర బరువు గణనీయంగా తగ్గినప్పుడు కాలేయం, క్లోమ గ్రంథుల్లోని కొవ్వు చాలావరకూ కరిగిపోయి. వాటి పనితీరు సాధారణ స్థితికి రావడం వల్ల ఇలా జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు అంటున్నారు. రక్తంలోని హెచ్‌బీఏ1సీ మోతాదు దాదాపు 12 నెలలపాటు 6.5 శాతం కంటే తక్కువ ఉండటం.. రెండు నెలలపాటు మందులు వాడకున్నా ఈ పరిస్థితి కొనసాగడాన్ని మధుమేహం నుంచి బయటపడినట్లుగా గుర్తించినట్లు ఆయన చెప్పారు. మధుమేహంతో బాధపడుతన్న రెండు గుంపుల ప్రజలపై తాము పరిశోధనలు నిర్వహించామని.. ఒక గుంపులోని వారికి మధుమేహ మందులు అందించగా.. రెండో వర్గానికి సమతుల ఆహారం, వ్యాయామాల ద్వారా బరువు తగ్గేందుకు ఏర్పాట్లు చేశామని.. ఐదు నెలల తరువాత దాదాపు 57 శాతం మందిలో మధుమేహం మాయమైనట్లు తెలిసిందని రాయ్ టేలర్ చెప్పారు. -
కూర్చుని గడిపేస్తే చక్కెర చిక్కు
పరిపరి శోధన గంటలకు గంటలు కూర్చున్న చోట నుంచి లేవకుండా గడిపేస్తూ ఉంటే ఒంట్లోకి చక్కెర జబ్బు చేరడానికి ఎంతోకాలం పట్టదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూర్చుని గంటల కొద్దీ గడిపేసే వారు ఆ తర్వాత కఠిన వ్యాయామాలు చేసినా పెద్దగా ఫలితం ఉండదని వారు చెబుతున్నారు. మెలకువగా ఉన్న స్థితిలో తొమ్మిది గంటలు లేదా అంత కంటే ఎక్కువ సమయం కూర్చున్న స్థితిలోనే గడిపేసే వారికి టైప్-2 డయాబెటిస్ ముప్పు తప్పదని మాస్ట్రిక్ట్ యూనివర్సిటీకి చెందిన వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్‌లో 2,500 మంది నడి వయస్కులపై నిర్వహించిన విస్తృత అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైందని వారు చెబుతున్నారు. -
ఎంత తిన్నా లావెక్కని జబ్బు!
మెడిక్షనరీ కాస్త ఎక్కువగా తిన్నా ఎక్కడ లావెక్కిపోతామోనని కంగారు పడిపోతారు చాలామంది. అయితే, కొందరు ఎంత తిన్నా ఏం తిన్నా లావెక్కరు. బాగా కొవ్వును పెంచే ఆహారాన్ని భారీగా భోంచేసినా, ఏమాత్రం లావెక్కనివ్వని వింత జబ్బు ఒకటి ఉంది. వైద్య పరిభాషలో దానినే ‘లైపోడిస్ట్రోఫీ’ అంటారు. ఈ జబ్బు ఉన్నవాళ్ల శరీరంలోని కొవ్వు శరవేగంగా కరిగిపోతుంది. అందువల్ల వాళ్లు ఏం తిన్నా, ఎంత తినేసినా ఏమాత్రం లావెక్కరు. ఎప్పుడు చూసినా బక్కచిక్కే కనిపిస్తారు. ఈ జబ్బు ఉన్నవాళ్ల శరీరంలో ఇన్సులిన్ సాధారణ స్థాయి కంటే ఆరురెట్లు ఎక్కువగా ఉత్పత్తవుతుంది. అందువల్ల వీళ్లకు చక్కెరజబ్బు వచ్చే అవకాశాలూ ఉండవు. బక్కచిక్కినట్లు కనిపించడం తప్ప ఈ జబ్బుతో వేరే సమస్యలేవీ ఉండవని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. -
డయాబెటిస్ కౌన్సెలింగ్
షుగర్ ఉంటే పాదాలపై అంత శ్రద్ధ ఎందుకు? నా వయసు 65. దాదాపు ఐదేళ్ల క్రితం నుంచి డయాబెటిస్తో బాధపడుతున్నాను. గుండె పరీక్షలు చేయించుకోడానికి వెళ్లినప్పుడు మా డాక్టర్‌గారు పాదాలను జాగ్రత్తగా చూసుకొమ్మని పదే పదే హెచ్చరించారు. ఆయన ఎందుకంత నిర్దిష్టంగా అడిగారు? వివరించండి. - కోటేశ్వరరావు, నరసరావుపేట డయబెటిస్ వ్యాధి దీర్ఘకాలంలో శరీరంలోని వివిధ రక్తనాళాలను, నరాలను దెబ్బతీస్తుంది. తొలిదశలో నరాలు మాత్రమే దెబ్బతింటాయి. అప్పుడప్పుడూ కాళ్లు తిమ్మిరెక్కడం, మొద్దుబారడం జరుగుతుంది. షుగర్ వచ్చిన 5 నుంచి 10 ఏళ్ల తర్వాత పాదాలకు స్పర్శ కోల్పోవడం, దానివల్ల తెలియకుండానే చెప్పులు కాలి నుంచి జారిపోవడం వంటి లక్షణాలు చూస్తాం. వ్యాధి తీవ్రమైతే స్పర్శ చాలావరకు కోల్పోయి కాలికి దెబ్బతగిలినా లేక వేడి వస్తువులు తాకినా నొప్పి తెలియదు. ఇలా నొప్పి తెలియకుండా అయిన గాయాలు, పెద్దవవుతాయి. వీటిని న్యూరోపథిక్ అల్సర్స్ అంటారు. అంటే నరాలు దెబ్బతినడం వల్ల నొప్పి తెలియకపోవడం వల్ల పెరిగిపోయిన పుండు అన్నమాట. షుగర్ వ్యాధి పదేళ్ల కంటే ఎక్కువ రోజులు ఉంటే కాలి నరాలతో పాటు రక్తనాళాలు కూడా దెబ్బతింటాయి ఇంతకు ముందు ఏర్పడ్డ న్యూరోపథిక్ గాయం తగ్గాలంటే నరాలు పునరుత్తేజితం కావాలి. నరాలకు ఈ శక్తి రావాలంటే రక్తప్రసరణ కీలకం. కానీ షుగర్ వ్యాధిగ్రస్తులలో రక్తనాళాల్లో కొవ్వు చేరడం వల్ల కరండాలు కూడా శక్తి కోల్పోతాయి. కాలి కండాల నరాలలో బలం, సమతౌల్యత లోపించడం వల్ల పాదం వంకరపోతుంది. ఇలా పాదం వంకరపోయిన చోట ఒత్తిడి పెరిగి పుండు ఏర్పడే అవకాశం ఎక్కువవుతుంది. దీన్నే వైద్యపరిభాషలో చార్కాట్ ఫుట్ అంటారు. నరాలు, రక్తనాళాలు... ఈ రెండూ దెబ్బతినడం వల్ల ఏర్పడ్డ పుండును న్యూరోఇస్కిమిక్ అల్సర్ అంటారు. ఇలాంటి న్యూరోపతిక్ అల్సర్లను షుగర్ వ్యాధి వచ్చిన 5 ఏళ్ల నుంచి పదేళ్ల సమయంలో ఎక్కువగా చూస్తుంటాము. ఈ పరిస్థితి ముదిరి కాలిగాయాన్ని నిర్లక్ష్యం చేస్తే పాదం కుళ్లిపోయే అవకాశం ఉంది. ఈ కండిషన్‌ను గ్యాంగ్రీన్ అంటారు. ఇది జరిగితే కాలిని తొలగించాల్సిన పరిస్తితి వస్తుంది. అందుకే మీ డాక్టర్ పాదం గురించి శ్రద్ధ తీసుకొమ్మని మరీ మరీ చెప్పారు. షుగర్ వ్యాధి తీవ్రత వల్ల ప్రపంచంలో ప్రతి 20 క్షణాలకు ఒకరు కాలిని కోల్పోతున్నారు. మనదేశంలోనూ షుగర్ వ్యాధిగ్రస్తులు చాలా ఎక్కువసంఖ్యలో పెరుగుతున్నారు. కాబట్టి మీ డాక్టర్ చెప్పిన సలహాలు పాటించి పాదాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. -
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 50 ఏళ్లు. నాకు గత మూడేళ్ల నుంచి షుగర్వ్యాధి, హైబీపీ ఉన్నాయి. డాక్టర్ సలహా ప్రకారం క్రమం తప్పక మందులు వాడుతున్నాను. కానీ గత రెండు వారాల నుంచి మెట్లు ఎక్కినా, త్వరత్వరగా నడిచినా ఛాతీ బరువెక్కుతోంది. ఈమధ్య భోజనం తర్వాత ఏమాత్రం నడిచినా ఆయాసంతో పాటు చెమటలు పడుతున్నాయి. అయితే నేను ఏ పనీ లేకుండా విశ్రాంతిగా ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి ఇబ్బందీ లేదు. దీనికి కారణమేమిటి? వివరించండి. - ఎస్.ఆర్.జి., కొత్తగూడెం మీరు పేర్కొన్న వివరాల ప్రకారం మీకు ‘అన్స్టేబుల్ యాంజైనా’ అనే గుండెకు సంబంధించిన వ్యాధి ఉందని తెలుస్తోంది. ఒక వ్యక్తికి ఏ చిన్న శారీరక శ్రమకు గురైనా (అంటే నడక, మెట్లు ఎక్కడం మొదలైనవి) గుండె స్పందనల వేగం పెరిగి, గుండెకు మరింత ఎక్కువ పరిమాణంలో ఆక్సిజన్, రక్తసరఫరా అవసరమవుతుంది. దాంతో రక్తనాళాల్లో రక్తం ప్రవహించే వేగం పెరుగుతుంది. అయితే నార్మల్ వ్యక్తుల్లో మాదిరిగా కాకుండా కొందరిలో రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నప్పుడు ఇలా నొప్పి, ఆయాసం వచ్చి, సేదదీరినప్పుడు గుండె వేగం తగ్గి, మళ్లీ అవి కూడా తగ్గిపోతాయి. అలాగే గుండెమీద అధికంగా భారం పడకుండా ఉండే పరిస్థితిలో (అంటే పడుకున్నా, కూర్చున్నా) ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మీరు మీ ‘అన్స్టేబుల్ యాంజైనా’ అనే కండిషన్‌ను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, దగ్గర్లోని గుండెజబ్బుల నిపుణుడిని సంప్రదించండి. యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకొని, రక్తనాళాల్లో అడ్డంకులు ఏవైనా ఉంటే వాటిని తొలగింపజేసు కోవడం అవసరం. లేకపోతే గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. డాక్టర్ ఎ. శ్రీనివాస్‌కుమార్ చీఫ్ కార్డియాలజిస్ట్, సిటిజన్స్ హాస్పిటల్స్, నల్లగండ్ల, హైదరాబాద్. -
రోగుల పాలిట నవ్వుల రేడు ‘రేవా’
ఒక్కసారి షుగర్ వ్యాధి అటాక్ అయిందని తెలియగానే ఇక అంతా అయిపోయిందని నిర్వేదంలోకి వెళ్ళిపోతాం. ఇష్టమైన ఆహారం, అలవాట్లన్నింటినీ వదులుకోవాలని అత్యధిక మంది పేషెంట్లు నిరాశ చెందుతున్నారు. షుగర్ వలన కలిగే శారీరక బాధ కంటే ఇలాంటి మనోవ్యథ ఎక్కువగా ఉంటోందని అనేక మంది రోగులు వాపోతుంటారు. ఇంతటి మనోవ్యథతో తమ వద్దకు వచ్చే మధుమేహ బాధితులకు ఆత్మస్థైర్యం, నిబ్బరం కలిగించి, రోగిలా కాకుండా వారికి తమను నమ్ముకుని వచ్చిన ఆత్మీయుడిగా భావించి చికిత్సనందిస్తోంది ‘రేవా హెల్త్, స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్’. మధుమేహ రోగి ఇష్టాలు, ఆహారపు అలవాట్లను పూర్తిగా వదులుకోవాల్సిన అవసరం లేకుండా బ్యాలెన్స్డ్ డైట్ సూచనలతో మన్ననలు పొందుతోంది. ప్రతి వ్యక్తికి తనలో ఉన్న పోషక లోపాలను సవరిస్తూ చక్కెర తక్కువగా ఉండేటట్లుగా డైట్ ప్లాన్ ఇస్తారు. అలాగే వ్యాయామం, మందులు కూడా చాలా లోతుగా చేసిన పరీక్షల ఆధారంగానే ఇస్తారు. అధిక బరువు గల కారణాలు ఏమిటి? ఒక వయస్సులో తిన్నా రాని బరువు వయస్సుతో ఎందుకు పెరుగుతుంది? హైపో థైరాయిడ్‌లో బరువు ఎందుకు పెరుగుతుంది? జాయింట్ Pain కు గల కారణాలు ఏమిటి? Root Cause తెలుసుకొని నివారణోపాయాలు తెలపటం రేవా ప్రత్యేకత. అడ్రస్ రేవా హెల్త్, స్కిన్ అండ్ హెయిర్ జీవీకే వన్ ఎంట్రీ గేట్ ఎదురుగా, రోడ్ నం. 4, బంజారాహిల్స్ హైదరాబాద్ వివరాలకు 800 800 1225 800 800 1235 040 4454 4330 మెయిల్ ఐడీ: ksrgopal@revami.com వెబ్సైట్: www.revami.in/ -
షుగర్ వ్యాధికి పాజిటివ్ చికిత్స
ఒకప్పుడు మధుమేహం అంటే ఏ కొంతమందిలోనో కనిపించేది. కాని ఇప్పుడు ప్రతీ ఇంటికి ఒకరు లేదా ఇద్దరు కనిపిస్తున్నారు. వయస్సు పైబడిన వారిలో మాత్రమే అప్పట్లో కనిపించేది. కాని నవీనయుగంలో వయస్సు, లింగ- విచక్షణ లేకుండా రానురాను మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది. భారతదేశంలో, అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో వీరి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. భవిష్యత్తులో ప్రతి ఇద్దరిలో ఒకరు షుగర్‌వ్యాధితో బాధపడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. డయాబెటిస్ లేదా షుగర్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది మన శరీరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకునేలోపే మనలోని షుగర్ లెవెల్స్ పెరిగిపోయి ఎన్నో అనారోగ్యల బారిన పడతాం. లక్షణాలు: అతిగా మూత్ర విసర్జన ఎక్కువగా ఆకలి వేయడం, ఎక్కువగా దాహం వేయడం చూపు మందగించటం కారణం లేకుండా బరువు తగ్గి, చిక్కిపోవడం, నీరసం, నిస్సత్తువ అతినిద్ర, బద్దకం. బరువు తగ్గడం తప్ప మిగతా లక్షణాలన్నీ డయాబెటిస్ 2 లో కూడా కనిపిస్తాయి. డయాబెటిస్ రకాలు - టైప్ 1 డయాబెటిస్ - టైప్ 2 డయాబెటిస్ కారణాలు: స్థూలకాయం వంశపారంపర్యత మానసిక ఒత్తిడి ఆహారపు అలవాట్లు జీవనశైలి థైరాయిడ్ పీసీఓడీ ఉన్నవాళ్ళకు మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ. రకాలు: టైప్ 1 డయాబెటిస్: సాధారణంగా బీటా కణాలను మన శరీరమే స్వయంగా నాశనం చేయడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా ఉండదు. అందుకే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇస్తారు టైప్ 2 డయాబెటిస్: ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం. ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ నిరోధకత ఉంటుంది రెసిస్టెన్షియల్ డయాబెటిస్: ఈ రకాన్ని గర్భధారణ సమయంలో మాత్రమే చూస్తాం. సాధారణంగా కాన్పు తర్వాత, సాధారణ స్థితికి వస్తుంది. కొద్దిమందిలో మాత్రం అలానే కొనసాగుతుంది. డయాబెటిస్ వల్ల కాంప్లికేషన్లు: నాడీకణాల మీద ప్రభావం. ఇందులో మొత్తం శరీరభాగాలన్నీ ప్రభావితమవుతాయి. మొత్తం న్యూరైటిస్‌లలో ఇది అత్యంత ప్రభావశీలి. నరం మీద మైలిన్ షీత్ (పొర) దెబ్బ తినడం వల్ల తిమ్మిర్లు, మంటగా అనిపించడం, స్పర్శ తెలియకపోవడం జరుగుతుంది. అంటే కాలికి, చేతికి ఏదైనా గుచ్చుకున్నా, దెబ్బ తగిలినా రోగికి తెలియదు. నడకలో మార్పు, కంటిచూపు తగ్గిపోవడం, కొన్నిసార్లు మూత్రాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వంటి సమస్యలు చూస్తూ ఉంటాం. కొన్ని సంవత్సరాల తరువాత శరీరంలో పెద్ద రక్తనాళాలూ దెబ్బతినడం వల్ల గుండె, మెదడు, కాళ్ళు, చేతులలోని రక్తనాళాలు దెబ్బతింటాయి. మానసిక, సెక్స్ సమస్యలు తలెత్తుతాయి. పాజిటివ్ హోమియోపతి వైద్య విధానంలో మానవుని కాన్స్టిట్యూషన్స్కు పాముఖ్యం ఇవ్వబడుతుంది. అంటే అతని వ్యాధి లక్షణాలు, పాథాలజీ, కుటుంబ చరిత్ర, మానసిక లక్షణాలు తదితర అన్ని విషయాలు పరిగణనలోనికి తీసుకుని చికిత్స చేయడం వల్ల కేవలం ఉపశమనమే కాకుండా, పూర్తిగా నయం చేయవచ్చును. - పాజిటివ్ హోమియోపతి డా॥టి. కిరణ్‌కుమార్ పాజిటివ్ హోమియోపతి అపాయింట్మెంట్ కొరకు 9246199922 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై www.positivehomeopathy.com -
షుగర్ వ్యాధి ప్రాణాలను అతి సున్నితంగా హరిస్తుంది
నవీన యుగంలో వయస్సు, లింగ-విచక్షణ లేకుండా రాను రాను మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది. భారతదేశంలో, అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో వీరి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. భవిష్యత్తులో ప్రతి ఇద్దరిలో ఒకరు షుగర్ వ్యాధితో బాధపడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. డయాబెటిస్ లేదా షుగర్ వ్యాధి ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది మన శరీరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకునేలోపే మనలోని షుగర్ లెవెల్స్ పెరిగిపోయి ఎన్నో అనారోగ్యాల బారిన పడతాం. కాబట్టి ప్రతి ఒక్కరికీ డయాబెటిస్‌పై అవగాహన ఎంతో ముఖ్యం. లక్షణాలు అతిగా మూత్రవిసర్జన, ఎక్కువగా ఆకలి వేయడం, ఎక్కువగా దాహం వేయడం, మందగించిన చూపు. కారణం లేకుండా బరువు తగ్గడం, బద్దకం, బరువు తగ్గడం తప్ప మిగతా లక్షణాలన్నీ డయాబెటిస్ - 2 లో కూడా కనిపిస్తాయి. కారణాలు: స్థూలకాయం. వంశపారంపర్యం, మాసనసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, జీవనశైలి, థైరాయిడ్, పీసీఓడీ ఉన్నవాళ్ళకు మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ. రకాలు: టైప్ - 1 డయాబెటిస్: సాధారణంగా బీటా కణాలను మన శరీరమే స్వయంగా నాశనం చేయడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా ఉండదు. అందుకే ఇన్సులిన్ ఇంజక్షన్స్ ఇస్తారు. టైప్ - 2 డయాబెటిస్: ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్(ఇన్సులిన్ నిరోధకత) ఉంటుంది. రెసిస్టెన్షియల్ డయాబెటిస్ : ఈ రకాన్ని గర్భధారణ సమయంలో మాత్రమే చూస్తాం. సాధారణంగా కాన్పు తర్వాత, సాధారణ స్థితికి వస్తుంది. కొద్దిమందిలో మాత్రం అలానే కొనసాగుతుంది. డయాబెటిస్ వల్ల కాంప్లికేషన్లు: నాడీ కణాల మీద ప్రభావం ఏర్పడుతుంది. ఇందులో మొత్తం శరీరభాగాలన్నీ ప్రభావితమవుతాయి. మొత్తం న్యూరైటిస్‌లలో ఇది అత్యంత ప్రభావశీలి. నరం మీద మైలిన్ షీత్ (పొర) దెబ్బ తినడం వల్ల తిమ్మిర్లు మరియు మంటగా అనిపించడం, స్పర్శ తెలియకపోవడం, అంటే వారి కాలికి, చేతికి ఏదైనా గుచ్చుకున్నా దెబ్బ తగిలినా రోగికి తెలియదు. నడకలో మార్పు, కంటిచూపు తగ్గిపోవడం, కొన్నిసార్లు మూత్రాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వంటి సమస్యలు చూస్తూ ఉంటాము. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారనియమాలు: రోజు కనీసం 45 ని॥పాటు నడక లేదా వ్యాయామం =భోజనానికి అరగంట ముందు మాత్రలు వేసుకోవాలి =రాత్రిపూట ఫలహారం మాత్రమే (టిఫిన్) తీసుకోవాలి. (అన్నం తినకూడదు) =ప్రతిరోజు ఒక నిర్ణీత సమసయంలోనే భోజనం చేయాలి =పాదాల మీద పుండ్లు, ఆనెలు, గాయాలు ఏమైనా ఉన్నా డాక్టర్ సమక్షంలోనే చికిత్స తీసుకోవాలి =పిండిపదార్థాలు తగ్గించి అధిక పీచు ఉండే ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. మానుకోవాల్సిన అలవాట్లు: పొగత్రాగకూడదు =మద్యం సేవించకూడదు =పాదరక్షలు లేకుండా నడవకూడదు =మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి =కొలెస్ట్రాల్ అధికంగా ఉండే మాంసం తగ్గించి తీసుకోవాలి. పాజిటివ్ హోమియోపతి వైద్య విధానం కేవలం వ్యాధి లక్షణాలు మాత్రమే కాక మానవుని మొత్తంగా పరిగణనలోనికి తీసుకొని, వ్యాధి లక్షణాల ఉపశమనం కాకుండా వ్యాధి పూర్తిగా నయం కావాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. హోమియోపతి వైద్యవిధానంలో మానవుని కాన్‌స్టిట్యూషన్‌కు ప్రాముఖ్యం ఇవ్వబడుతుంది. అంటే అతని వ్యాధి లక్షణాలు, పేథాలజీ, కుటుంబ చరిత్ర, మానసిక లక్షణాలు తదితర అన్ని విషయాలు పరిగణనలోనికి తీసుకుని చికిత్స చేయడం వలన కేవలం ఉపశమనం మాత్రమే కాకుండా పూర్తిగా నయం చేయవచ్చును. దేశ వ్యాప్తంగా పలు శాఖలతో విస్తరించి, ప్రతిదినం హోమియో వైద్య విధానంలో నూతన ఒరవడులను అందిపుచ్చుకుంటూ, రీసెర్చ్ విభాగంలో అందరికంటే ఉన్నతంగా నిలుస్తూ, హోమియో వైద్య ప్రపంచంలో అగ్రగామిగా నిలిచింది. డా॥టి. కిరణ్‌కుమార్ పాజిటివ్ హోమియోపతి అపాయింట్మెంట్ కొరకు 9246199922 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై www.positivehomeopathy.com