![Cinema Artist Narsing Yadav Join in Hospital With Sugar Disease - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/11/narsing.jpg.webp?itok=ko0uPimq)
నర్సింగ్ యాదవ్
సుల్తాన్‌బజార్: తెలుగు సినీ నటుడు నర్సింగ్ యాదవ్ తీవ్ర అస్వస్థకు గురికావడంతో కుటుంబ సభ్యులు గురువారం ఆయనను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. గత కొంత కాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న నర్సింగ్ యాదవ్ డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే అస్వస్థతకు గురైన నర్సింగ్ యాదవ్‌కు డయాలసిస్ చేస్తున్న సమయంలో షుగర్, బీపీ తగ్గిపోవడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన కొంత మేర కోలుకుంటున్నట్లు సోదరుడు శంకర్ యాదవ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment