Narsing yadav
-
నర్సింగ్ యాదవ్ కొడుక్కి మెగాస్టార్ బంగారు కానుక!
ఎన్నో సినిమాల్లో విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటుడు నర్సింగ్ యాదవ్... తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన ఆయన.. కామెడీ, విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. జనానికి వినోదాన్ని పంచిన అతడు గత ఏడాది డిసెంబర్ 31న అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఆయన మరణం అభిమానులు, సెలబ్రిటీలను కలచివేసింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తన ఆప్తుడు ఇక లేడు, తిరిగి రాడన్న వార్త విని తీవ్ర ఆవేదన చెందాడు. చిరంజీవికి, నర్సింగ్ యాదవ్‌కు మధ్య ఉన్న అనుబంధాన్ని గూర్చి నర్సింగ్ సతీమణి చిత్ర తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. "చిరంజీవి ఏ సినిమా షూటింగ్ జరుగుతున్నా అక్కడ నర్సింగ్ ఉండాల్సిందే. ఆయన లొకేషన్‌కు వచ్చేముందే నర్సింగ్ అక్కడ పరిస్థితులు చక్కబెట్టేవాడు. అలా వారిద్దరి మధ్య బంధం పెరుగుతూ వచ్చింది. మేము చాలాసార్లు చిరంజీవి ఇంటికి వెళ్లాం కూడా.. పది సంవత్సరాల వరకు ఆయనకు రాఖీ కూడా కట్టాను. మా బాబు పుట్టిన మూడు నెలలకు అతడిని తీసుకుని చిరంజీవిగారి దగ్గరకు వెళ్లాను. మమ్మల్ని చూడగానే మెగాస్టార్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మేనేజర్‌ను పంపించి అప్పటికప్పుడు బంగారు చైన్ కొని తీసుకురమ్మన్నారు. నర్సింగ్కు బాబు పుట్టాడన్న సంతోషంతో ఆ ఖరీదైన గోల్డ్ చెయిన్‌ను పిల్లోడి మెడలో వేశారు. అది ఏడు తులాల కంటే ఎక్కువే ఉంటుంది. సురేఖ గారు కూడా పసుపు బొట్టు ఇచ్చారు. ఎంతో క్లోజ్‌గా మాట్లాడేవాళ్లు. అది చూసి కొన్నిసార్లు నేనే ఆశ్చర్యపోయేదాన్ని" అని చెప్పుకొచ్చింది. చదవండి: ప్లీజ్, పరిస్థితి అర్థం చేసుకోండి : ప్రియాంక చోప్రా విజ్ఞప్తి -
సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు నర్సింగ్ యాదవ్ (52) కన్నుమూశారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన ఆయన.. కామెడీ, విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. మైలా నరసింహ యాదవ్‌ను ఇండస్ట్రీలో అందరూ నర్సింగ్ యాదవ్ అని పిలుస్తారు. 1963 మే 15న హైదరాబాద్‌లో జన్మించిన ఆయనకు భార్య చిత్ర, కొడుకు రిత్విక్ యాదవ్ ఉన్నారు. 300లకు పైగా సినిమాల్లో నటించిన ఆయన కామెడీ విలన్‌గా, విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. రజనీకాంత్ నటించిన బాషాలోనూ మంచి పాత్ర చేశారు. విజయనిర్మల దర్శకత్వం వహించిన హేమాహేమీలుతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు నర్సింగ్ యాదవ్. క్షణక్షణం, గాయం, ముఠామేస్త్రీ, మాస్, శంకర్ దాదా ఎంబీబీయస్, అనుకోకుండా ఒక రోజు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రేసుగుర్రం, పిల్లజమీందార్, సుడిగాడు, కిక్ తదితర చిత్రాల్లో ఆయన చేసిన కేరక్టర్లకు చాలా మంచి పేరు వచ్చింది. చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీనెంబర్ 150లోనూ నటించారు. గత కొంతకాలంగా నర్సింగ్ యాదవ్‌కు డయాలసిస్ జరుగుతోంది. నర్సింగ్ యాదవ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. -
సినీనటుడు నర్సింగ్ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత
సుల్తాన్‌బజార్: తెలుగు సినీ నటుడు నర్సింగ్ యాదవ్ తీవ్ర అస్వస్థకు గురికావడంతో కుటుంబ సభ్యులు గురువారం ఆయనను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. గత కొంత కాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న నర్సింగ్ యాదవ్ డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే అస్వస్థతకు గురైన నర్సింగ్ యాదవ్‌కు డయాలసిస్ చేస్తున్న సమయంలో షుగర్, బీపీ తగ్గిపోవడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన కొంత మేర కోలుకుంటున్నట్లు సోదరుడు శంకర్ యాదవ్ తెలిపారు. -
'సినిమావాళ్ల మీద పడ్డాడు... దేవుడు'
హైదరాబాద్ : కష్టాల్లో ఉన్నప్పుడు చిత్రసీమలో ఆదుకునేవారు దిక్కుండరని క్యారెక్టర్ నటి పావలా శ్యామల ఆవేదన వ్యక్తంచేశారు. ఉదయ్ కిరణ్ అకాల మరణం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక ఒత్తిడిని అధిగమించలేక..తాను కూడా ఒకప్పుడు ఆత్మహత్యనే శరణ్యమని భావించానని ఆమె అన్నారు.... ఎవరైనా సరే చనిపోయాక అయ్యో అంటారే కానీ, బతికి ఉన్నప్పుడు ఒక్కరూ అండగా ఉండరన్నారు. ఎంత మానసిక క్షోభ అనుభవిస్తే ఆత్మహత్య చేసుకుంటాడో అర్థం చేసుకోవచ్చన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండేవారంటే బాగుండేదన్నారు. మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నర్సింగ్ యాదవ్ మాట్లాడుతూ....ఉదయ్ కిరణ్,తాను అయిదారు చిత్రాలు కలిసి చేశామన్నారు. శ్రీరాం సినిమా షూటింగ్ సమయంలో కోఠీలో షూటింగ్ సమయంలో తన ఇంట్లో ఉండేవాడన్నారు. వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అని, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారన్నారు. నర్సింగ్ అన్నా... నర్సింగ్ అన్నా అని మాట్లాడేవాడని తెలిపారు. ఈ మధ్య కాలంలో దేవుడు....సినిమా వాళ్ల మీద పడ్డాడని, మంచివాళ్లనే తీసుకు వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయ్ కిరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కొద్ది రోజుల క్రితం శ్రీహరి, ఆతర్వాత ధర్మవరపు సుబ్రహ్మణం, ఇప్పుడు ఉదయ్ కిరణ్ మృతి కలిచి వేస్తుందన్నారు. -
నర్సింగ్కు కాంస్యం మిస్
బుడాపెస్ట్: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. బుధవారం జరిగిన పురుషుల 74 కేజీల రెప్‌చేజ్ రౌండ్లో నర్సింగ్ 1-6తో అలీ షబానో (బెలారస్) చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు జరిగిన తొలి రౌండ్లో 10-2తో కకబెర్ కుబ్జెటి (రష్యా)పై నెగ్గిన నర్సింగ్... రెండో రౌండ్లో 0-7తో జోర్గాన్ బురోగస్ (అమెరికా) చేతిలో ఓడాడు. అయితే జోర్డాన్ ఫైనల్‌కు చేరుకోవడంతో భారత రెజ్లర్‌కు రెప్‌చేజ్ అవకాశం దక్కింది. మరోవైపు మహిళల విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. 51 కేజీల విభాగం రెండో రౌండ్లో వినేశ్ 3-6తో ఇసబెల్లా సంబు (సెనెగల్) చేతిలో పరాజయం చవిచూసింది. 48 కేజీల కేటగిరీ తొలి రౌండ్లో నిర్మలా దేవి 0-7తో అలైసా లాంపీ (అమెరికా) చేతిలో ఓడింది.