నర్సింగ్‌కు కాంస్యం మిస్ | Narsingh slips in bronze medal bout at World Wrestling Championships | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌కు కాంస్యం మిస్

Published Thu, Sep 19 2013 1:15 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM

Narsingh slips in bronze medal bout at World Wrestling Championships

బుడాపెస్ట్: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. బుధవారం జరిగిన పురుషుల 74 కేజీల రెప్‌చేజ్ రౌండ్‌లో నర్సింగ్ 1-6తో అలీ షబానో (బెలారస్) చేతిలో ఓడిపోయాడు.
 
 అంతకుముందు జరిగిన తొలి రౌండ్‌లో 10-2తో కకబెర్ కుబ్జెటి (రష్యా)పై నెగ్గిన నర్సింగ్... రెండో రౌండ్‌లో 0-7తో జోర్గాన్ బురోగస్ (అమెరికా) చేతిలో ఓడాడు. అయితే జోర్డాన్ ఫైనల్‌కు చేరుకోవడంతో భారత రెజ్లర్‌కు రెప్‌చేజ్ అవకాశం దక్కింది. మరోవైపు మహిళల విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. 51 కేజీల విభాగం రెండో రౌండ్‌లో వినేశ్ 3-6తో ఇసబెల్లా సంబు (సెనెగల్) చేతిలో పరాజయం చవిచూసింది. 48 కేజీల కేటగిరీ తొలి రౌండ్‌లో నిర్మలా దేవి 0-7తో అలైసా లాంపీ (అమెరికా) చేతిలో ఓడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement