వచ్చేసింది 2023... క్రీడాభిమానులకు ఆటల విందు మోసుకొని వచ్చేసింది.... ఆద్యంతం ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేందుకు వచ్చేసింది... ముందుగా హాకీ ప్రపంచకప్ మెగా ఈవెంట్‌తో కొత్త ఏడాది మొదలుకానుంది... ఆ తర్వాత తొలిసారి అమ్మాయిలకు నిర్వహిస్తున్న అండర్–19 టి20 ప్రపంచకప్ కనువిందు చేయనుంది... అనంతరం మహిళల టి20 ప్రపంచకప్‌తో ధనాధాన్ ధమాకా కనిపించనుంది...
మండే వేసవిలో వినోదం పంచడానికి ఐపీఎల్ టోర్నీ... శీతాకాలంలో వన్డే వరల్డ్‌కప్.... కేవలం క్రికెట్టే కాదు... పంచ్ పవర్ చాటిచెప్పడానికి ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్... ‘పట్టు’పట్టడానికి ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్... ‘రాకెట్’తో రఫ్ఫాడించేందుకు బ్యాడ్మింటన్, టెన్నిస్ టోర్నీలు... ‘రయ్ రయ్’ అంటూ సాగిపోయే ఫార్ములావన్ రేసులు... ఇంకా ఎన్నో... ఎన్నెన్నో టోర్నీలు మనను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరెందుకు ఆలస్యం... మీ క్యాలెండర్‌లోనూ ఈ ఈవెంట్స్‌ను జత చేయండి... తప్పకుండా చూడండి!
అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్
జనవరి 14 నుంచి 29 వరకు
వేదిక: దక్షిణాఫ్రికా
మొత్తం జట్లు: 16
ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్
ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు
వేదిక: దక్షిణాఫ్రికా
మొత్తం జట్లు: 10
భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్
భారత్‌లో శ్రీలంక పర్యటన
జనవరి 3 నుంచి 15 వరకు
3 టి20లు, 3 వన్డేలు
భారత్‌లో న్యూజిలాండ్ పర్యటన
జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1 వరకు
3 వన్డేలు, 3 టి20లు
భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన
ఫిబ్రవరి 9 నుంచి మార్చి 22 వరకు
4 టెస్టులు, 3 వన్డేలు
ఐపీఎల్ టి20 టోర్నీ
ఏప్రిల్–మే
వెస్టిండీస్‌లో భారత్ పర్యటన
జూలై–ఆగస్టు
2 టెస్టులు, 3 వన్డేలు, 3 టి20లు
మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీ
జూలై 20 నుంచి ఆగస్టు 20 వరకు
వేదిక: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
మొత్తం జట్లు: 32
ఆసియా క్రీడలు
వేదిక: హాంగ్జౌ (చైనా)
సెప్టెంబర్ 23– అక్టోబర్ 8
ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు
వేదిక: చెంగ్డూ (చైనా) జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు
ఫార్ములావన్
ఈ ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్‌లో మొత్తం 23 రేసులు ఉన్నాయి. మార్చి 5న బహ్రెయిన్ గ్రాండ్‌ప్రితో సీజన్ మొదలవుతుంది. అనంతరం వరుసగా బహ్రెయిన్ (మార్చి 5), సౌదీ అరేబియా (మార్చి 19), ఆస్ట్రేలియా (ఏప్రిల్ 2), అజర్‌బైజాన్ (ఏప్రిల్ 30), మయామి (మే 7), ఎమిలియా రొమాగ్నా (మే 21), మొనాకో (మే 28), స్పెయిన్ (జూన్ 4), కెనడా (జూన్ 18), ఆస్ట్రియా (జూలై 2 ),బ్రిటన్ (జూలై 9), హంగేరి (జూలై 23), బెల్జియం (జూలై 30), డచ్ (ఆగస్టు 27), ఇటలీ (సెప్టెంబర్ 3), సింగపూర్ (సెప్టెంబర్ 17), జపాన్ (సెప్టెంబర్ 24), ఖతర్ (అక్టోబర్ 8), యూఎస్‌ఎ (అక్టోబర్ 22), మెక్సికో (అక్టోబర్ 29), సావోపాలో (నవంబర్ 5), లాస్‌వేగస్ (నవంబర్ 18) రేసులు జరుగుతాయి. నవంబర్ 26న అబుదాబి గ్రాండ్‌ప్రితో ఎఫ్1 సీజన్ ముగుస్తుంది.
పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీ
వేదిక: భువనేశ్వర్, రూర్కెలా (భారత్)
జనవరి 13 నుంచి 29 వరకు
మొత్తం జట్లు: 16
బ్యాడ్మింటన్
ఇండియా ఓపెన్ సూపర్–750 టోర్నీ
వేదిక: న్యూఢిల్లీ
జనవరి 17 నుంచి 22 వరకు
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్–1000 టోర్నీ
వేదిక: బర్మింగ్‌హామ్
మార్చి 14 నుంచి 19 వరకు
సుదిర్మన్ కప్ టోర్నీ
వేదిక: సుజౌ (చైనా)
మే 14 నుంచి 21 వరకు
ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీ
వేదిక: జకార్తా
జూన్ 13 నుంచి 18 వరకు
చైనా ఓపెన్ సూపర్–1000 టోర్నీ
వేదిక: చెంగ్జూ
సెప్టెంబర్ 5 నుంచి 10 వరకు
ప్రపంచ చాంపియన్‌షిప్
వేదిక: కోపెన్‌హాగెన్ (డెన్మార్క్)
ఆగస్టు 21 నుంచి 27 వరకు
ఆసియా మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్
వేదిక: దుబాయ్ (యూఏఈ)
ఫిబ్రవరి 14 నుంచి 19 వరకు
ఆసియా చాంపియన్‌షిప్
వేదిక: దుబాయ్ (యూఏఈ)
ఏప్రిల్ 25 నుంచి 30 వరకు
సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్–300 టోర్నీ
వేదిక: లక్నో (భారత్)
నవంబర్ 28 నుంచి డిసెంబర్ 3 వరకు
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
వేదిక: బుడాపెస్ట్ (హంగేరి) ఆగస్టు 19 – 27
పురుషుల వన్డే ప్రపంచకప్
అక్టోబర్–నవంబర్ వేదిక: భారత్ మొత్తం జట్లు: 10
టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలు
ఆస్ట్రేలియన్ ఓపెన్
వేదిక: మెల్‌బోర్న్; జనవరి 16 – 29
ఫ్రెంచ్ ఓపెన్
వేదిక: పారిస్; మే 28 – జూన్ 11
వింబుల్డన్
వేదిక: లండన్; జూలై 3 –17
యూఎస్ ఓపెన్
వేదిక: న్యూయార్క్; ఆగస్టు 28 –సెప్టెంబర్ 10
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్
వేదిక: బెల్‌గ్రేడ్ (సెర్బియా);
సెప్టెంబర్ 16 –24
ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్
వేదిక: న్యూఢిల్లీ
మార్చి 15 –31
ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్
వేదిక: తాష్కెంట్
(ఉజ్బెకిస్తాన్)
మే 1 – 14
–సాక్షి క్రీడావిభాగం
Comments
Please login to add a commentAdd a comment