calender year
-
2023 sports: ఏడాదంతా ఆడేద్దాం!
వచ్చేసింది 2023... క్రీడాభిమానులకు ఆటల విందు మోసుకొని వచ్చేసింది.... ఆద్యంతం ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేందుకు వచ్చేసింది... ముందుగా హాకీ ప్రపంచకప్ మెగా ఈవెంట్‌తో కొత్త ఏడాది మొదలుకానుంది... ఆ తర్వాత తొలిసారి అమ్మాయిలకు నిర్వహిస్తున్న అండర్–19 టి20 ప్రపంచకప్ కనువిందు చేయనుంది... అనంతరం మహిళల టి20 ప్రపంచకప్‌తో ధనాధాన్ ధమాకా కనిపించనుంది... మండే వేసవిలో వినోదం పంచడానికి ఐపీఎల్ టోర్నీ... శీతాకాలంలో వన్డే వరల్డ్‌కప్.... కేవలం క్రికెట్టే కాదు... పంచ్ పవర్ చాటిచెప్పడానికి ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్... ‘పట్టు’పట్టడానికి ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్... ‘రాకెట్’తో రఫ్ఫాడించేందుకు బ్యాడ్మింటన్, టెన్నిస్ టోర్నీలు... ‘రయ్ రయ్’ అంటూ సాగిపోయే ఫార్ములావన్ రేసులు... ఇంకా ఎన్నో... ఎన్నెన్నో టోర్నీలు మనను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరెందుకు ఆలస్యం... మీ క్యాలెండర్‌లోనూ ఈ ఈవెంట్స్‌ను జత చేయండి... తప్పకుండా చూడండి! అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్ జనవరి 14 నుంచి 29 వరకు వేదిక: దక్షిణాఫ్రికా మొత్తం జట్లు: 16 ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు వేదిక: దక్షిణాఫ్రికా మొత్తం జట్లు: 10 భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ భారత్‌లో శ్రీలంక పర్యటన జనవరి 3 నుంచి 15 వరకు 3 టి20లు, 3 వన్డేలు భారత్‌లో న్యూజిలాండ్ పర్యటన జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1 వరకు 3 వన్డేలు, 3 టి20లు భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన ఫిబ్రవరి 9 నుంచి మార్చి 22 వరకు 4 టెస్టులు, 3 వన్డేలు ఐపీఎల్ టి20 టోర్నీ ఏప్రిల్–మే వెస్టిండీస్‌లో భారత్ పర్యటన జూలై–ఆగస్టు 2 టెస్టులు, 3 వన్డేలు, 3 టి20లు మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీ జూలై 20 నుంచి ఆగస్టు 20 వరకు వేదిక: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మొత్తం జట్లు: 32 ఆసియా క్రీడలు వేదిక: హాంగ్జౌ (చైనా) సెప్టెంబర్ 23– అక్టోబర్ 8 ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు వేదిక: చెంగ్డూ (చైనా) జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఫార్ములావన్ ఈ ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్లో మొత్తం 23 రేసులు ఉన్నాయి. మార్చి 5న బహ్రెయిన్ గ్రాండ్‌ప్రితో సీజన్ మొదలవుతుంది. అనంతరం వరుసగా బహ్రెయిన్ (మార్చి 5), సౌదీ అరేబియా (మార్చి 19), ఆస్ట్రేలియా (ఏప్రిల్ 2), అజర్బైజాన్ (ఏప్రిల్ 30), మయామి (మే 7), ఎమిలియా రొమాగ్నా (మే 21), మొనాకో (మే 28), స్పెయిన్ (జూన్ 4), కెనడా (జూన్ 18), ఆస్ట్రియా (జూలై 2 ),బ్రిటన్ (జూలై 9), హంగేరి (జూలై 23), బెల్జియం (జూలై 30), డచ్ (ఆగస్టు 27), ఇటలీ (సెప్టెంబర్ 3), సింగపూర్ (సెప్టెంబర్ 17), జపాన్ (సెప్టెంబర్ 24), ఖతర్ (అక్టోబర్ 8), యూఎస్ఎ (అక్టోబర్ 22), మెక్సికో (అక్టోబర్ 29), సావోపాలో (నవంబర్ 5), లాస్‌వేగస్ (నవంబర్ 18) రేసులు జరుగుతాయి. నవంబర్ 26న అబుదాబి గ్రాండ్‌ప్రితో ఎఫ్1 సీజన్ ముగుస్తుంది. పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీ వేదిక: భువనేశ్వర్, రూర్కెలా (భారత్) జనవరి 13 నుంచి 29 వరకు మొత్తం జట్లు: 16 బ్యాడ్మింటన్ ఇండియా ఓపెన్ సూపర్–750 టోర్నీ వేదిక: న్యూఢిల్లీ జనవరి 17 నుంచి 22 వరకు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్–1000 టోర్నీ వేదిక: బర్మింగ్‌హామ్ మార్చి 14 నుంచి 19 వరకు సుదిర్మన్ కప్ టోర్నీ వేదిక: సుజౌ (చైనా) మే 14 నుంచి 21 వరకు ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీ వేదిక: జకార్తా జూన్ 13 నుంచి 18 వరకు చైనా ఓపెన్ సూపర్–1000 టోర్నీ వేదిక: చెంగ్జూ సెప్టెంబర్ 5 నుంచి 10 వరకు ప్రపంచ చాంపియన్‌షిప్ వేదిక: కోపెన్‌హాగెన్ (డెన్మార్క్) ఆగస్టు 21 నుంచి 27 వరకు ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ వేదిక: దుబాయ్ (యూఏఈ) ఫిబ్రవరి 14 నుంచి 19 వరకు ఆసియా చాంపియన్‌షిప్ వేదిక: దుబాయ్ (యూఏఈ) ఏప్రిల్ 25 నుంచి 30 వరకు సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్–300 టోర్నీ వేదిక: లక్నో (భారత్) నవంబర్ 28 నుంచి డిసెంబర్ 3 వరకు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ వేదిక: బుడాపెస్ట్ (హంగేరి) ఆగస్టు 19 – 27 పురుషుల వన్డే ప్రపంచకప్ అక్టోబర్–నవంబర్ వేదిక: భారత్ మొత్తం జట్లు: 10 టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆస్ట్రేలియన్ ఓపెన్ వేదిక: మెల్బోర్న్; జనవరి 16 – 29 ఫ్రెంచ్ ఓపెన్ వేదిక: పారిస్; మే 28 – జూన్ 11 వింబుల్డన్ వేదిక: లండన్; జూలై 3 –17 యూఎస్ ఓపెన్ వేదిక: న్యూయార్క్; ఆగస్టు 28 –సెప్టెంబర్ 10 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ వేదిక: బెల్గ్రేడ్ (సెర్బియా); సెప్టెంబర్ 16 –24 ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ వేదిక: న్యూఢిల్లీ మార్చి 15 –31 ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్ వేదిక: తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్) మే 1 – 14 –సాక్షి క్రీడావిభాగం -
కొత్త సంవత్సరం.. కొత్త సినిమాలు
కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త సినిమా అప్డేట్స్ కోసం సినీ లవర్స్ ఎదురు చూస్తుంటారు. అలాగే తమ అభిమాన స్టార్ ఏయే సినిమాలు చేస్తున్నారో తెలుసుకోవాలని ఫ్యాన్స్‌కు ఉంటుంది. ఆ విశేషాలు ‘స్టార్ క్యాలెండర్’లో తెలుసుకుందాం. చిరంజీవి: ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా జనవరి 13న రానున్నారు హీరో చిరంజీవి. ఇక చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బోళా శంకర్’ ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. మరోవైపు చిరంజీవి హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందనే ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. బాలకృష్ణ: ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా జనవరి 12న రానున్నారు బాలకృష్ణ. ఇక అనిల్æ రావిపూడి దర్శకత్వంలోని సినిమాతో బిజీగా ఉంటారు. వెంకటేశ్: కొన్ని కథలు విన్నప్పటికీ ఏప్రాజెక్ట్ ఫైనలైజ్ చేయలేదు. కానీ హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘కీసీ కా బాయ్.. కీసీ కా జాన్’లో వెంకీ కీ రోల్ చేశారు. ఈ మూవీ రంజాన్‌కి రిలీజ్ కానుంది. నాగార్జున: కొన్ని కథలు విన్నప్పటికీ ఇంకా ఏప్రాజెక్ట్కీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మోహన్‌బాబు: కుమార్తె మంచు లక్ష్మీతో కలిసి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో మోహన్‌బాబు ‘అగ్నినక్షత్రం’ సినిమాలో నటిస్తున్నారు. సమంత టైటిల్ రోల్ చేసిన ‘శాకుంతలం’లో మోహన్‌బాబు కీ రోల్ చేశారు. రవితేజ: ఈ ఏడాది రవితేజ ఫుల్ బిజీ. ఇప్పటికే రవితేజ హీరోగా ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. అలాగే ‘ఈగిల్’ అనే కొత్త సినిమా కమిట్ అయినట్లు వార్తలు ఉన్నాయి. సుధీర్‌వర్మ దర్శకత్వంలోని ‘రావణాసుర’ ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. ఇక ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ కీ రోల్ చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్: క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో హీరోగా టైటిల్ రోల్ చేస్తున్నారు పవన్ కల్యాణ్. అలాగే ‘గబ్బర్‌సింగ్’ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్’ అనే సినిమా చేస్తున్నారు పవన్. యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కించే సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. గోపీచంద్: దర్శకుడు శ్రీవాస్‌తో ఓ మూవీ చేస్తున్నారు గోపీచంద్. దీనికి ‘లక్ష్యం 2’, ‘రామబాణం’ టైటిల్స్ తెరపైకి వచ్చాయి. రాజశేఖర్: పవన్ సాధినేని దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ ‘మాన్స్టర్’ చేస్తున్నారు రాజశేఖర్. ప్రభాస్: ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్తోప్రాజెక్ట్ కె, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో ‘సలార్’, మారుతితో ‘రాజా డీలక్స్’ (అధికారికంగా ప్రకటించాల్సి ఉంది) చిత్రాలు చేస్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఇక ప్రభాస్ టైటిల్ రోల్లో నటించిన ‘ఆదిపురుష్’ పూర్తయింది. ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం జూన్ 16న రిలీజ్ కానుంది. ‘సలార్’ సెప్టెంబరు 28న రిలీజ్ కానుంది. మహేశ్‌బాబు: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందు తోంది. ఇది పూర్తి కాగానే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఇంటర్నేషనల్ లెవల్ ఫిల్మ్‌లో హీరోగా నటిస్తారు మహేశ్. ఎన్టీఆర్: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపుదిద్దుకోనున్న సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. ఈ చిత్రం తర్వాత ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. రామ్‌చరణ్: శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనతో ఓ సినిమా చేస్తారు చరణ్. అలాగే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ సినిమా ప్రకటన వచ్చింది. అల్లు అర్జున్: ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2’ చేస్తున్నారు అల్లు అర్జున్. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లుగా తెలుస్తోంది. కాగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమా అల్లు అర్జున్ కమిట్ అయిన సంగతి తెలిసిందే. నాని: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ చిత్రం చేస్తున్నారు నాని. మార్చి 30న రిలీజ్ కానుంది. అలాగే తన కొత్త చిత్రాన్ని నాని ఈ రోజు ప్రకటిస్తారు. రామ్: ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తు న్నారు రామ్. నాగచైతన్య: వెంకట్ ప్రభు డైరెక్షన్లో ‘కస్టడీ’ చిత్రం చేస్తున్నారు నాగచైతన్య. ఈ సినిమా మేలో రిలీజ్ కానుంది. ఇక పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ సినిమా ప్రకటన వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. విజయ్ దేవరకొండ: ప్రస్తుతం ‘ఖుషి’ సినిమా చేస్తున్నారు విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకుడు. కాగా విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ‘జేజీఎమ్æ’ (జన గణ మన) షూటింగ్ ఆరంభమైంది. ఈ సినిమాపై మరో అప్డేట్ రావాల్సి ఉంది. నందమూరి కల్యాణ్‌రామ్: ప్రస్తుతం ‘అమిగోస్’, ‘డెవిల్’ చిత్రాలు చేస్తున్నారు కల్యాణ్‌రామ్. ఫిబ్రవరిలో విడుదల కానున్న ‘అమిగోస్’ చిత్రానికి రాజేంద్రరెడ్డి దర్శకుడు. ‘డెవిల్’ సినిమాకు నవీన్ మేడారం డైరెక్టర్. అలాగే కేవీ గుహన్‌తో ఓ సినిమా కమిట్ అయ్యారు. శర్వానంద్: కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా కమిటయ్యారు శర్వానంద్. రానా దగ్గుబాటి: దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించనున్న మైథలాజికల్ ఫిల్మ్ ‘హిరణ్యకశ్యప’లో రానా టైటిల్ రోల్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అలాగే మిలింద్ రావ్ దర్శకత్వంలో రానా హీరోగా ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. అల్లరి నరేశ్: ‘నాంది’ సినిమాతో తనకు మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్షన్లో అల్లరి నరేశ్ ‘ఉగ్రం’ అనే సినిమా చేస్తున్నారు. అలాగే ‘సభకు నమస్కారం’ అనే సినిమా కూడా కమిట్ అయ్యారు నరేశ్. ఈ చిత్రానికి సతీష్ దర్శకుడు. నితిన్: వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ఫిల్మ్ షూటింగ్లో నితిన్ పాల్గొంటున్నారు. వరుణ్ తేజ్: దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో ఓ యాక్షన్ ఫిల్మ్, కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్‌సింగ్‌తో ఎయిర్‌ఫోర్స్ యాక్షన్ బేస్డ్ ఫిల్మ్ చేస్తున్నారు వరుణ్ తేజ్. శక్తి ప్రతాప్‌తో చేస్తున్నది వరుణ్‌కి హిందీలో తొలి సినిమా. అఖిల్: సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఏజెంట్’తో బిజీగా ఉన్నారు అఖిల్. సుధీర్‌బాబు: ‘హంట్’, ‘మామా మశ్చీంద్ర’ సినిమాలు చేస్తున్నారు సుధీర్‌బాబు. జనవరి 26న విడుదల కానున్న ‘హంట్’ మూవీకి మహేశ్ సూరపనేని దర్శకత్వం వహించగా, ‘మామా మశ్చీంద్ర’ సినిమాకు హర్షవర్థన్ దర్శకుడు. అలాగే జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ‘హరోం హర’ అనే సినిమా చేస్తున్నారు సుధీర్‌బాబు. నిఖిల్: ఎడిటర్ గ్యారీ బీహెచ్ మెగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న ‘స్పై’ చిత్రంలో నటిస్తారు నిఖిల్. అలాగే దర్శకుడు సుధీర్ వర్మతోనూ నిఖిల్ ఓ సినిమా చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్: సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం ‘విరూపాక్ష’. కార్తిక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. అదే విధంగా జయంత్ అనే కొత్త దర్శకుడితో కూడా ఓ సినిమా చేస్తున్నారు సాయిధరమ్ తేజ్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్: ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ షూటింగ్‌ను దాదాపు పూర్తి చేశారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. హిందీలో సాయి శ్రీనివాస్‌కు ఇది తొలి చిత్రం కాగా, ఈ చిత్రదర్శకుడు వీవీ వినాయక్‌కు కూడా అక్కడ దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. వైష్ణవ్ తేజ్: కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్. రెడ్డి తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీలో హీరోగా నటిస్తున్నారు వైష్ణవ్ తేజ్. అడివి శేష్: తన కెరీర్లో వన్నాది బెస్ట్ హిట్స్‌గా నిలిచిన ‘గూఢచారి’ సినిమా సీక్వెల్ ‘గూఢచారి 2’లో నటిస్తున్నారు అడివి శేష్. ఈ సినిమాకు వినయ్ కుమార్ దర్శకుడు. నాగశౌర్య: అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా చేసిన ‘ఫలానా అబ్బాయి... ఫలానా అమ్మాయి’ సినిమా విడుదలకు రెడీగా ఉంది. అలాగే ‘΄ోలీసువారి హెచ్చరిక’తో పాటు మరో సినిమా చేస్తున్నారు నాగశౌర్య. సందీప్ కిషన్: రంజిత్ జయకొడి దర్శకత్వంలో ‘మైఖేల్’, వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘ఊరిపేరు భైరవకోన’ సినిమాలు చేస్తున్నారు సందీప్ కిషన్. అలాగే ధనుష్ హీరోగా చేస్తున్న ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రంలో ఓ కీ రోల్ చేస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ: హిట్ ఫిల్మ్ ‘డీజే టిల్లు’ సీక్వెల్ ‘డీజే టిల్లు’ స్క్వైర్‌లో నటిస్తున్నారు సిద్ధు జొన్నలగడ్డ. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది. నవీన్ పొలిశెట్టి: అనుష్కా శెట్టి, నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో పి. మహేశ్‌బాబు ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. అలాగే నవీన్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘అనగనగా ఒక రాజు’ను కల్యాణ్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. బెల్లంకొండ గణేష్: రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ చేసిన ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. వీరితోపాటు మరికొందరు హీరోలు ఆన్ సెట్స్‌లో బిజీగా ఉంటారు. -
'బడ్జెట్' తేదీలను మార్చడం అవసరమా?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సాధారణ బడ్జెట్‌ను వాయిదా వేయాలన్న ప్రతిపక్షాల విజ్ఞప్తులను త్రోసిపుచ్చి ముందుగా నిర్ణయించినట్లు ఫిబ్రవరి ఒకటవ తేదీనే బడ్జెట్ ప్రవేశపెడతామని కేంద్రం ప్రకటించింది. అసలు ఏప్రిల్-మార్చి ఆర్థిక సంవత్సరాన్ని క్యాలెండర్ ఇయర్ కింద జనవరి-డిసెంబర్ సంవత్సరానికి ఎందుకు మార్చాల్సి వచ్చింది. మార్చిలో ప్రవేశ పెట్టే బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టాలని కేంద్రం ఎందుకు భావిస్తోంది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటీ? న్యూఢిల్లీ: బ్రిటీష్ పరిపాలనా కాలం నుంచి, అంటే 1867 నుంచి భారత ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్-మార్చిగానే పరిగణిస్తూ వస్తున్నారు. అంతకుముందు మే-ఏప్రిల్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించేవారు. భారత ఆర్థిక సంవత్సరాన్ని మార్చే అంశాన్ని పరిశీలించి అవసరమైన సిఫార్సులు చేయడం కోసం కేంద్ర ఆర్థిక శాఖ గత జూలై నెలలో మాజీ ఆర్థిక సలహాదారు శంకర్ ఆచార్య చైర్మన్‌గా ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకే భారత ఆర్థిక సంవత్సరాన్ని జనవరి-డిసెంబర్‌కు మారుస్తూ ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. 150 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్న ఏప్రిల్-మార్చి ఆర్థిక సంవత్సరాన్ని మార్చేందుకు ప్రయత్నం జరగడం ఇదేమి మొదటిసారి కాదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఎల్కే లోధా చైర్మన్‌గా ఏర్పాటైన కమిటీ 1984లో మొదటిసారిగా ఆర్థిక సంవత్సరాన్ని మార్చి దానికి అనుగుణంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 1979-–80, 1982-83 సంవత్సరాల్లో దేశంలో తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో మున్ముందు కరవు పరిస్థితులను పటిష్టంగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఆర్థిక సంవత్సరాన్ని ముందుకు జరపాలన్న ప్రతిపాదన వచ్చింది. దేశంలో 2014, 2015 సంవత్సరాల్లో వరుసగా వర్షపాతం తక్కువగా నమోదైన నేపథ్యంలో నేటి ప్రభుత్వం కూడా ఆర్థిక సంవత్సరాన్ని ముందుకు జరపాలన్న ప్రతిపాదనను తీసుకొచ్చింది. ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశమవడం వల్ల భారత్‌లో రుతుపవనాలను, పంటల ఉత్పత్తులను బడ్జెట్ రూపకల్పనలో ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఖరీఫ్ పంట కింద వరి, పప్పు దినుసులు పండిస్తారు. అదే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య రుతుపవనాలపై ఆధారపడి గోధుమ లాంటి రబీ పంటలను పండిస్తారు. నైరుతి రుతుపవనాల కింద ప్రతి ఏటా అంతో ఇంతో వర్షాలు కురుస్తాయి. ఈశాన్య రుతుపవనాల కింద ఆ గ్యారెంటీ లేదు. అందుకని రబీ పరిస్థితులను ముందుగా అంచనావేసి అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులను జరిపేందుకు వీలుగా ఆర్థిక సంవత్సరాన్ని ముందుకు జరపాలని నాటి లోధా కమిటీ సూచించింది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో 58 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు. ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాల ప్రకారం భారత ఆర్థిక గణాంకాలను జనవరి-డిసెంబర్ సంవత్సరానికే సమర్పించాల్సి వస్తోందని, అందుకోసం బడ్జెట్ ప్రతిపాదనలపై పునర్ కసరత్తు చేయాల్సి వస్తోందని కూడా నాడు లోధా కమిటీ పేర్కొంది. అందుకోసమైనా సరే ఆర్థిక సంవత్సరాన్ని ముందుకు జరపాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పింది. ప్రయోజనాలు తక్కువ, అవాంతరాలు ఎక్కువ ఉన్నాయని, పైగా ఆర్థిక సంవత్సరాన్ని మార్చేందుకు పలు చట్ట సవరణలు తీసుకరావాల్సి ఉంటుందన్న ఉద్దేశంతో నాటి కేంద్ర ప్రభుత్వం లోధా సిఫార్సులను పక్కన పడేసింది. ప్రపంచవ్యాప్తంగా స్వతంత్య్ర ఆర్థిక వ్యవస్థలు కలిగిన 227 దేశాల్లో 156 దేశాలు జనవరి-డిసెంబర్ క్యాలెండర్ ఇయర్‌నే ఆర్థిక సంవత్సరంగా పాటిస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కూడా క్యాలెండర్ ఇయరే మంచిదంటున్న ఆర్థిక నిపుణులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మోదీ ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలనుకుంటుందో, ఐదు రాష్ట్రాల ఎన్నికల రూపంలో కలిసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తుందో, బడ్జెట్ ప్రతిపాదనలు చూస్తేగానీ తెలియదు.