హోమియోకేర్ చెంత థైరాయిడ్ నుంచి నిశ్చింత
ఆధునిక జీవితంలో ప్రతి 20 మందిలో ఒక వ్యక్తికి థైరాయిడ్ సమస్య రాగలదు. థైరాయిడ్ గ్రంథి నుండి విడుదలైన హార్మోనులు రక్త ప్రవాహంలో కలిసి శారీరక పెరుగుదలకు, జీవక్రియలు జరగడానికి తోడ్పడతాయి. థైరాయిడ్ గ్రంథిలో వచ్చే మార్పుల వల్ల ఈ సమస్య వస్తుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్, అందువల్ల జీవక్రియలన్నీ నెమ్మదిస్తాయి. ప్రస్తుత జీవన పరిస్థితులలో మానసిక ఒత్తిళ్ళ వల్ల, ఆహార సమతుల్యం/ శారీరక శ్రమ లోపించడం వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశం ఎక్కువ.
అప్పుడే పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు ఏ వయసువారికైనా ఈ సమస్య రావచ్చు. అయితే వయసును అనుసరించి కారణాలు మారవచ్చు. శిశువులలో... థైరాయిడ్‌గ్రంథి నిర్మాణంలో ఏదైనా లోపం ఉన్నపుడు సాధారణంగా ఈ సమస్య కనిపిస్తుంది. దీన్ని కంజెనిటల్ హైపోథైరాయిడిజం అంటారు. పెద్దవారిలో హషిమోటో థైరాయిడిటైటిస్, ఈ హైపోథైరాయిడిజం సమస్య రావడానికి ఒక సాధారణ కారణం.
రకాల: థైరాయిడ్ సమస్యలు 2 రకాలు
1.హైపోథైరాయిడిజం: జీవక్రియలు సజావుగా జరగడానికి సరిపడా థైరాక్సిన్ హార్మోన్‌ను థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేయకపోవడాన్ని హైపో థైరాయిడిజం అంటారు. ఫలితంగా అలసట, చర్మం పొడిబారడం, అధిక బరువు, స్త్రీలలో నెలసరి సమస్యలు, మగత, మలబద్దకం చలికి తట్టుకోలేకపోవడం, జుట్టు రాలడం, కీళ్ల నొప్పులు, చిరాకు, మతిమరుపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
2.హైపర్ థైరాయిడిజం: థైరాయిడ్ గ్రంథి అధికంగా పనిచేయడం వలన ఈ సమస్య వస్తుంది. గుండెదడ, చేతులు, కాళ్ళు వణకడం, నిద్రలేమి, ఆందోళన, బరువు తగ్గిపోవడం, వేడిని తట్టుకోలేకపోవడం, ఆకలి పెరగడం, నెలసరి సమస్యలు, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.
థైరాయిడ్ హార్మోన్‌లు అధికంగా స్రవించడం వల్ల థైరోటాక్సికోసిస్ వస్తుంది. ఈ వ్యాధి చాలా నెమ్మదిగా ప్రారంభమవుతుంది.
కంటి కండరాలు వాచి, కంటి గుడ్లు ముందుకు వచ్చినట్లు కనిపిస్తే దీన్ని Grave's disease అంటారు.
కొంతమందికి థైరాయిడ్‌గ్రంథి పెద్దదై మెడభాగంలో వాపు వస్తుంది. దీన్ని గాయిటర్ అంటారు.
పరీక్షలు: థైరాయిడ్ సమస్య ఉందా లేదా అని తెలుసుకోవడానికి టి3, టి4, టిఎస్‌హెచ్ హార్మోన్ల లెవల్స్‌ను రక్త పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పై లెవల్స్‌లో ఉండే హెచ్చుతగ్గులను బట్టి వ్యాధిని నిర్థారిస్తారు. రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందేమో నిర్థారించడానికి థైరాయిడ్ యాంటీ టాడిస్ (యాంటీ టిపిఓ బాడిస్) పరీక్షలు అవసరమవుతాయి.
మెడ లోపలి భాగంలో సీతాకోక చిలుక ఆకృతిలో ఉండే థైరాయిడ్‌గ్రంథి అత్యంత కీలకమైన విధులను నిర్వహిస్తుంటుంది.
థైరాయిడ్ వ్యాధిగ్రస్తుల్లో కొందరికి కనుగుడ్లు బయటకు పొడుచుకు వచ్చినట్లుగా ఉంటాయి. మరికొందరిలో గాయిటర్ సమస్య వస్తుంది.
హోమియో వైద్యం
హోమియో కేర్ వైద్యవిధానంలో రోగి శారీరక, మానసిక పరిస్థితి ఆకలి, నిద్ర, ఆందోళనలు తదితర అంశాలలో పాటు వంశపారంపర్యత, ఆరోగ్యచరిత్ర వంటివి పరిగణనలోకి తీసుకొని మళ్ళీ వచ్చే అవకాశం లేకుండా థైరాయిడ్ సమస్యకు వైద్య చికిత్స ఇవ్వబడుతుంది. ప్రపంచంలో మొదటిది కాన్‌స్టిట్యూషనల్ హోమియోపతి ద్వారా హోమియోకేర్ థైరాయిడ్ సమస్యలకు అత్యధిక శాతం రోగులకు పూర్తిగా తగ్గించడం జరుగుతుంది.
డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్
సి.ఎం.డి.,
హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్
ఉచిత సలహా సంప్రదింపుల కొరకు: 9550001188/99
టోల్ ఫ్రీ: 1800 102 2202
బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు.