hormones
-
మనిషి ఆనందాన్ని నిర్ణయించే హార్మోనులు ఇవే..!
మనం ఆనందం కోసం ఎక్కడెక్కడో వెతుకుతాం. కానీ అది మన చేతిలోని పనే. పైసా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. సులభంగా మన నిత్య జీవితంలో ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటామట. మన దీర్ఘాయువుకు మూలం అవేనట చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మనిషి ఆనందాన్ని నిర్ణయించే ఈ హార్మోనులు గురించి తెలుసుకుంటే సంతోషంగా ఎలా ఉండాలో తెలుస్తుందని చెబుతున్నారు నిపుణులు. తద్వారా మనశ్శాంతిని, సంతోషకరమైన జీవితాన్ని సొంతం చేసుకోగలం అని అంటున్నారు. అవేంటో చూద్దామా..!ఆ హార్మోనులు ఏంటంటే..ఎండార్ఫిన్స్, డోపామిన్, సెరిటోనిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు గురించి పూర్తిగా తెలుసుకుంటే హాయిగా సంతోషంగా ఉంటాం అని చెబుతున్నారు నిపుణులు. ముందుగా ఒక్కొక్కదాని గురించి సవింరంగా తెలుసుకుందాం..ఎండార్ఫిన్స్: వ్యాయామాలు చేసేటప్పుడూ విడుదలయ్యేదే ఈ ఎండార్ఫిన్స్. ఇవి వ్యాయామం వల్ల కలిగే నొప్పులను భరించే శక్తిని ఇస్తాయి. అలాగే నవ్వడం వల్ల కూడా ఈ హార్మోన్ విడుదలవుతుంది. అందుకే యోగాలో హాస్యాసనం కూడా ఒక ఆసనంగా మన పూర్వీకులు చేర్చారు. అందువల్ల ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామాలు చేయడం, హాస్య భరిత సీన్లు, వీడియోలు చూడటం వంటివి చేయాలి. డోపామిన్: ఎవరైన పొగడగానే లోపల నుంచి తన్నుకుంటే వచ్చే ఆనందానకి కారణం ఈ హార్మోనే. దీని స్థాయిని పెంచుకుంటే ఆనందంగా ఉంటాం. కొత్త బట్టలు, వస్తువులు కొనుక్కున్నప్పుడు కలిగే ఫీలింగ్ ఇదే. ముఖ్యంగా భార్యభలు ఈ విషయాన్ని గ్రహించి పొగడటం ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ సంతోషాన్ని పొందడమే గాక మీ మధ్య బంధం కూడా బలపడుతుంది. సెరిటోనిన్: ఇతరులకు సహాయం చేయడం వల్ల కలిగేది. సమాజానికి, స్నేహితులకు ఏదైన సాయం చేయడం వల్ల వచ్చే ఒక విధమైన ఆనందానికి మూలమే ఈ సెరిటోనిన్. అందుకే మొక్కలు నాటడం, రక్తదానం, అనాథలకు సేవ తదితరాల వల్ల సంతోషంగా ఉంటారు.ఆక్సిటోసిన్: పెళ్లైన కొత్తలో శరీరంలో బాగా విడుదలయ్యే హార్మోన్ ఇదే. ఎవరినైనా మన దగ్గరకు తీసుకున్నప్పడూ మనలో విడుదలయ్యే హార్మోన్ ఇది. స్నేహితులను ఆలింగనం చేసుకోవడం వల్ల విడుదలవుతుంది. మన పిల్లలను, జీవిత భాగస్వామిని కౌగలించుకున్నప్పుడు మనలో కలిగే ఒక విధమైన సంతోషానికి కారణం ఈ హార్మోన్. అందువల్ల తరుచుగా మీకు ప్రియమైన వాళ్లను హగ్ చేసుకుంటూ ఉండటం వంటివి చేయండి. దీని వల్ల ప్రేమానుబంధాలు బలపడి కుటుంబ ఐక్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. ఇలాంటివి అలవాటు చేసుకోవాలి..ఓ అరంగంట వ్యాయామం చేయండిచిన్న పనులకు సంతృప్తిగా ఫీలవ్వుతూ గర్వంగా ఫీలవ్వండి. ఇక్కడ కళ్లు నెత్తికెక్కెలా కాదు. కేవలం చిన్న లక్ష్యాలను అందిపుచ్చుకున్నామని, సంతోషంగా భావించడం. అలాగే మీ పిల్లలను, భాగస్వామిని తరుచుగా ప్రశంసిచండి.తోచినంతలో సాయం చేసే యత్నం చేయడం, మొక్కలు పెంచడం వంటివి చేయండి. మీ పిల్లలను, భాగస్వామిని ప్రేమగా దగ్గరకు తీసుకోవడం, ప్రేమను వ్యక్తం చేసేలా హగ్ చేసుకోవడం వంటివి చేస్తే వాళ్లు భరోసాగా ఫీలవ్వుతారు. పైగా మీరు కూడా సంతోషంగా ఉంటారు. పైసా ఖర్చు పెట్టకుండా ఆనందాన్ని పొందడమే గాక సంతోషంగా హాయిగా జీవిద్దాం. (చదవండి: రాజకీయ నాయకులే దేవుళ్లుగా పూజలందుకుంటున్న ఆలయాలు ఇవే..!) -
ఒకే వ్యక్తిలో స్త్రీ, పురుష జననాంగాలు!
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): మంచిర్యాలకు చెందిన ఓ వ్యక్తి వృషణాలు లేకుండా పుట్టాడు. 40 ఏళ్లుగా అలాగే ఉన్నాడు. పెళ్లి చేసుకున్నా.. ఎంతకు పిల్లలు పుట్టకపోవడం, పొత్తి కడుపు కింద నొప్పితో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వచ్చాడు. అల్ట్రాసౌండ్, స్కానింగ్, ఎంఆర్ఐ వంటి పరీక్షలు చేయగా.. ఆ వ్యక్తిలో స్త్రీ, పురుష జననాంగాలు రెండూ ఉన్నట్టు గుర్తించారు. జన్యు ఉత్పరివర్తనం (మ్యుటేషన్) కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్టు తేల్చారు.ఆస్పత్రిలో ఆయనకు ఆండ్రాలజిస్టు, రోబోటిక్ సర్జన్ వైఎం ప్రశాంత్ చికిత్స చేశారు. దీనికి సంబంధించి వైద్యుడు వెల్లడించిన వివరాల మేరకు.. సాధారణంగా పిండం ఏర్పడిన సమయంలోనే హార్మోన్ల ప్రభావంతో ఆడ, మగ అన్నది నిర్ణయమైపోతుంది. అయితే మంచిర్యాల వ్యక్తి కేసులో జన్యు మ్యుటేషన్ కారణంగా.. హార్మోన్ల అసమత్యుల్యత ఏర్పడి ఆడ, మగ రెండు రకాల జననాంగాలు ఏర్పడ్డాయి. అందులో గర్భ సంచి, ఫాలోపియన్ ట్యూబ్స్‌తోపాటు వృషణాలు ఉదర భాగంలోనే ఉండిపోయాయి. ఇలాంటి వారు అన్ని అంశాల్లో మామూలుగానే ఉంటారు. హార్మోన్లు, పురుషాంగం, మీసాలు, గడ్డాలు అన్ని సాధారణంగానే ఉంటాయి. అయితే వృషణాలు లోపలే ఉండి, వీర్య కణాలు ఉత్పత్తిగాక పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. లాప్రో స్కోపిక్ శస్త్రచికిత్సతో.. ఈ వ్యక్తికి వైద్యులు చిన్నపాటి కోతతో కూడిన ల్యాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స చేసి.. గర్భసంచి, ఫాలోపియన్ ట్యూబ్స్‌తోపాటు వృషణాలను కూడా తొలగించారు. సాధారణంగా 18 ఏళ్ల వయసు దాటిన తర్వాత కూడా వృషణాలు లోపలే ఉండిపోతే కేన్సర్‌గా మారే ప్రమాదం ఉంటుందని.. అందువల్ల వాటినీ తొలగించాల్సి వచ్చిందని డాక్టర్ ప్రశాంత్ తెలిపారు. ఇన్నేళ్లుగా ఆ వ్యక్తి పడుతున్న ఇబ్బందులు తొలగిపోయాయని.. కానీ పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిపారు. 18 ఏళ్ల వయసుకు ముందే ఈ సమస్యను గుర్తించి శస్త్రచికిత్స చేస్తే వృషణాలను సాధారణ స్థితికి తెచ్చే అవకాశం ఉండేదని.. కానీ పేదరికం, నిరక్షరాస్యత కారణంగా ఇన్నేళ్లుగా సమస్యను గుర్తించలేకపోయారని వివరించారు. ఇలాంటి కేసులు అరుదని, ప్రపంచంలో ఇప్పటివరకు 300 కేసులు, దేశంలో 20 కేసులు మాత్రమే బయటికి వచ్చాయని తెలిపారు. -
జుట్టు ఎక్కువగా రాలుతుందా...?
జుట్టు రాలడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా మారింది. వయస్సుతో పాటు ఆడ మగ తేడా లేకుండా జుట్టు రాలుతుంది. జుట్టు రాలడం అనే సమస్యతో కనీసం 80 శాతం మంది బాధపడుతున్నారు. రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం మామూలే. అయితే అంతకుమించి రాలుతుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు: జీన్స్, ఒత్తిడి, కాలుష్యం, పోషకాహారలోపం, నిద్రలేమి, చెడు అలవాట్లు. వంశపారంపర్యంగా బట్టతల ఉంటే, హార్మోన్ తేడా జుట్టు రాలడాన్ని ఎక్కువ చేస్తుంది. అందువల్ల చిన్న వయసులోనే జుట్టు రాలడం మొదలవుతుంది. ఇక్కడ హార్మోన్ కరెక్షన్స్ చేయాలి. ఒత్తిడి వల్ల తలపై చర్మానికి (స్కాల్ప్) అందవలసిన పోషకాలు అందకపోవడం వల్ల జుట్టు రాలిపోతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడం, పోషకాహారం ముఖ్యం. కాలుష్యం వల్ల జుట్టు పొడిగా అవడం, పోషకాలు సరిగా అందకపోవడం, అవసరం లేని రసాయనాలు అడ్డుపడటం వల్ల జుట్టు రాలిపోతుంది. కాలుష్యం నుంచి కాపాడుకోవాలి. మంచి గాలి పీల్చడం, నార్మల్ వాటర్ తాగడం చేయాలి. ప్రధానంగా తీసుకోవాల్సిన పోషకాలు: విటమిన్ బి3, బి5, ఇలు తీసుకోవాలి. ఇవి చికెన్, ఫిష్, నట్స్, సోయా, ఆకుకూరల్లో లభ్యమవుతాయి. ఐరన్, జింక్ గుడ్డు సొనలో ఉంటాయి. కుంకుళ్లుతో కురులు ధృడం ఆధునికత పెరిగే కొద్దీ ఆడంబరాలకు పోతూ అలవాటుగా వస్తున్న ఆరోగ్య విధానాలను మరిచిపోతున్నాం. స్నానానికి రసాయనాలతో కూడిన ఖరీదైన షాంపూలు, సబ్బులను వాడుతూ.. ప్రకృతి ప్రసాదించిన కుంకుడుకాయలు, శీకాకాయ, సున్నిపిండి వంటివి మరచిపోతున్నాం. ఉద్యోగాలు చేసేవారికి కుంకుడుకాయలు నలగగొట్టి నానబెట్టడానికి ఖాళీ సమయమే కరువైంది. వీటిని నలగగొట్టితే మార్బుల్, సిరామిక్ గచ్చులు పాడైపోతాయని కుంకుడు కాయల జోలికే వెళ్లడం లేదు. అందమైన సీసాలు, ఆకట్టుకునే ప్యాకింగ్‌ల్లో లభించే షాంపూల వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ సంప్రదాయ పద్దతుల్ని పాటిస్తే.. శిరోజాలకు కలిగే మేలు అంతా ఇంతాకాదు. తలంటుకి కుంకుడుకాయలను వాడటమే మంచిది. దీనివల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటమే కాక పేలు, చుండ్రులాంటి సమస్యలు రావు. కుంకుడుకాయలను బాగా ఎండబెట్టి పొడిచేసుకుని నిల్వ చేయొచ్చు. దీనివల్ల తలస్నానం చేసిన ప్రతీసారీ కుంకుడుకాయలను కొట్టుకునే శ్రమ తప్పుతుంది. ఎండబెట్టిన కమలాతొక్కలు, నిమ్మతొక్కలు, మందారాకులు, మందారపూలు, మెంతులను పొడిచేసి కుంకుడు పొడిలో కలపవచ్చు. వీటన్నిటినీ కలిపిన పొడితో తలస్నానంచేస్తే వెంట్రుకలు త్వరగా నెరవవు. జుట్టు ఊడదు. మృదువుగా ఉంటాయి. -
తెల్ల జుట్టుకు బై చెప్పచ్చు
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం మనం తరచూ చూస్తూంటాం. విపరీతమైన ఒత్తిడి దీనికి కారణమన్న విషయమూ మనకు తెలుసు. అయితే కారణమేమిటన్నది మాత్రం నిన్న మొన్నటివరకూ ఎవరికీ తెలియదు. ఈ లోటును పూరించారు హార్వర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఒత్తిడికి, జుట్టు నెరుపుకూ మధ్య ఉన్న సంబంధం ఏమిటన్నది తెలుసుకునేందుకు తాము విస్తృత స్థాయిలో పరిశోధనలు చేపట్టామని హార్వర్డ్ శాస్త్రవేత్త యా ఛీ హూ తెలిపారు. వృద్ధాప్య లక్షణాలు వేగంగా చోటు చేసుకునేందుకు ఒత్తిడి కారణమవుతుందని, అందువల్లనే జుట్టు తెల్లబడుతోందని ఇప్పటివరకూ అనుకునేవారు. కానీ పరిశోధనల్లో మాత్రం భిన్నమైన ఫలితాలు కనిపించాయి. ఒత్తిడి ఎక్కువైనా వెంట్రుకల కుదుళ్లలో నల్లటి రంగును ఉత్పత్తి చేసే కణాలు తక్కువేమీ కాలేదు. అలాగే.. కార్టిసాల్ అనే హార్మోన్‌కూ వెంట్రుకల నెరుపుకూ సంబంధం లేదని స్పష్టమైంది. వెంట్రుకల కుదుళ్లలో ఉండే కొన్ని రకాల మూలకణాలు ఒత్తిడి ఎక్కువయినప్పుడు అతిగా స్పందిస్తున్నట్లు ఎలుకలపై జరిగిన పరిశోధనల ద్వారా తెలిసిందని, ఈ క్రమంలో ఆ మూలకణాల సంఖ్య తగ్గిపోవడం వల్ల నల్లటి రంగును ఉత్పత్తి చేసే కణాలూ తగ్గిపోతున్నట్లు తెలిసిందని హూ తెలిపారు. ఇంకోలా చెప్పాలంటే సాధారణ స్థితిలో నల్లటి రంగును ఉత్పత్తి చేసే కణాలుగా మారే మూలకణాలు ఒత్తిడి సమయంలో అతిగా స్పందించడం వల్ల జుట్టు నెరుస్తోందన్నమాట! అంతా బాగుందికానీ.. ఒత్తిడి సమయాల్లో మన శారీరక వ్యవస్థలోని సింపథెటిక్ నెర్వస్ సిస్టమ్ విడుదల చేసే నోరీపైనిఫ్రైన్ అనే రసాయనం మూలకణాలను చైతన్యవంతం చేస్తోందని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. వెంట్రుకలు తెల్లబడకుండా కొత్త మందులు కనుక్కునేందుకు ఈ పరిశోధన ఉపకరిస్తుందని అంచనా. -
పీసీవోడీకి చికిత్స ఉందా?
నా భార్య వయసు 36 ఏళ్లు. ఇటీవల ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? వివరించండి. రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో వాళ్లలోని రెండు అండాశయల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అలా జరగకుండా అపరిపక్వమైన అండాలు వెలువడి అవి నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోయే కండిషన్‌ను పీసీవోడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అంటారు. ఇవి రెండువైపులా ఉంటే ‘బైలేటరల్ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ. లక్షణాలు: నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తంపోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానకలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు. రోగిని భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. హోమియో విధానంలో సరైన హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా దుష్ఫలితాలేవీ లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
పీసీవోడీకి చికిత్స ఉందా?
నా భార్య వయసు 34 ఏళ్లు. ఇటీవల ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో వాళ్లలోని రెండు అండాశయల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అలా జరగకుండా అపరిపక్వమైన అండాలు వెలువడి అవి నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోయే కండిషన్‌ను పీసీవోడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అంటారు. ఇవి రెండువైపులా ఉంటే ‘బైలేటరల్ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ. లక్షణాలు : నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తంపోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానకలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు. రోగిని భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. హోమియో విధానంలో సరైన హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా దుష్ఫలితాలేవీ లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు. తరచూ తలనొప్పా? మీకు తరచూ తలనొప్పి వస్తోందా? కొంతమంది తలనొప్పి రాగానే మెడికల్ షాపుకు వెళ్లి ఏదో ఓ తలనొప్పి మాత్ర కొని ఠక్కున వేసుకుంటుంటారు. ఇలా అప్పుడప్పుడూ తలనొప్పి వస్తుండేవారు డాక్టర్‌ను సంప్రదించేలోపు ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోండి. ►మీరు ఎప్పుడూ కంప్యూటర్ మీద వర్క్ చేస్తుండేవారైతే ప్రతి అరగంటకు ఒకసారి అయిదు నిమిషాలు రిలాక్స్ అవుతూ ఉండాలి. కంప్యూటర్‌పై పని చేసే సమయంలో స్క్రీన్‌ను అదేపనిగా కనురెప్ప కొట్టకుండా చూడటం సరికాదు. మీ కళ్లపై తీవ్రమైన ఒత్తిడి పడకుండా స్క్రీన్ ముందు కూర్చునేటప్పుడు యాంటీ గ్లేయర్ గ్లాసెస్ ధరించడం కూడా మంచిదే. ►కుట్లు, అల్లికలు వంటి పనులు చేసేవారు, అత్యంత సూక్ష్మమైన ఇంట్రికేట్ డిజైన్లు చేస్తుండే సమయంలోనూ కళ్లు ఒత్తిడికి కాకుండా చూసుకోవాలి. తమ పనిలో తరచూ బ్రేక్ తీసుకుంటుండటం ద్వారా కంటిపై పడే అదనపు ఒత్తిడిని తగ్గించవచ్చు. ►పిల్లల్లో తలనొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. కంటి చూపు సమస్యల కారణంగా తలనొప్పి వచ్చే అవకాశాలు వారిలో ఎక్కువగా ఉంటాయి. తలనొప్పితో పాటు తల తిరగడం, వాంతుల కావడం వంటివి జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ►రోజూ ప్రశాంతంగా కనీసం ఎనిమిది గంటలపాటు నిద్ర పోవాలి. కొన్ని సందర్భాల్లో నిద్ర మరీ ఎక్కువైనా కూడా తలనొప్పి వస్తుంది. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరికి సరిపడినంతగా వారు నిద్రపోవడం మంచిది. ►మనకు సరిపడని పదార్థాలు తీసుకోవద్దు. ►ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లు తప్పనిసరిగా మానేయాలి. ►కాఫీ, చాకొలెట్స్, కెఫిన్ ఎక్కువగా పదార్థాలను తీసుకోవడం మానేయాలి. కెఫిన్ పాళ్లు ఎక్కువగా ఉండే కొన్ని రకాల శీతల పానియాలు అవాయిడ్ చేయడం అవసరం. ►ఏదైనా అలవాటు తలనొప్పిని దూరం చేస్తుంటే దానికే అలవాటు కావడం కూడా సరికాదు. ఉదాహరణకు టీ, కాఫీ తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంటే వాటిని పరిమితికి మించి తీసుకోవడం కూడా మంచిదికాదు. ►చీప్ సెంట్లు, అగరుబత్తీల్లాంటి ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి. సరిపడని పెర్ఫ్యూమ్స్ను వాడకూడదు. ►రణగొణ శబ్దాలకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. పరిసరాలు ప్రశాంతంగా ఉండటం వల్ల కొన్ని తలనొప్పులను నివారించవచ్చు. ఇలాంటి జాగ్రత్తల తర్వాత కూడా తలనొప్పులు తరచూ వస్తుంటే తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి. అంతేగానీ... తలనొప్పి నివారణ మాత్రలు అదేపనిగా వాడటం సరికాదని గుర్తుంచుకోవాలి. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
కాబోయే తల్లుల్లో మానసిక ఒత్తిడి
కాబోయే తల్లులు మానసికంగా ఒత్తిడికి గురయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. ఇంకా బిడ్డ పుట్టకముందే లోపల తన బిడ్డ ఎలా ఉన్నాడో అని ఒక బెంగ. తొలిచూలు మహిళలకు పుట్టినవాడిని తాము బాగా సాకగలమో లేదో అని ఆందోళనగా ఉంటుంది. ఇక బిడ్డకు ఇవ్వాల్సిన ఆహారం, పెరుగుతున్న క్రమంలో వాడి ఆరోగ్యం... ఇలా కాబోయే తల్లి ఎన్నోరకాల ఒత్తిడులకు లోనవుతూ ఉంటుంది. తల్లి ఎదుర్కొనే ఒత్తిళ్లలో అప్పటికప్పుడు పడేవి, దీర్ఘకాలంగా ఉండేవి ఇలా రెండు రకాలూ ఉండవచ్చు. మామూలుగానైతే తాను ఒత్తిడి వల్ల పడే ప్రభావం ఆ వ్యక్తిపైనే ఉంటుంది. అయితే గర్భవతులు ఒత్తిడికి లోనైతే అది రెండు ప్రాణాలపై ప్రభావం చూపుతుంది. అంటే పిండంపై దుష్ప్రభావం పడే అవకాశం ఉందన్నమాట. ఒత్తిడి వల్ల కలిగే అనర్థాలివి... ఒత్తిడి పెరిగినప్పుడు మెదడులో కార్టికోట్రోఫిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది గ్లూకోకార్టికాయిడ్ అనే కార్టిసాల్ స్రావం విడుదల అయ్యేలా చేస్తుంది. ఈ కార్టిసాల్ స్రావం స్థాయులు పెరగడం వల్ల గర్భస్రావం, పిండంలో ఎదుగుదల లోపించడం, బిడ్డ పూర్తిగా ఎదగకముందే ప్రసవం కావడం, పుట్టిన బిడ్డకు... మానసిక వికాసంలో తేడాలు, నేర్చుకునే శక్తిలో లోపాలు, ఏదైనా విషయంపై దృష్టికేంద్రీకరించే శక్తిలో లోపాలు వంటివి రావచ్చు. గర్బవతిగా ఉన్నప్పుడు పడే తక్షణ ఒత్తిడి (ఆక్యూట్ స్ట్రెస్) ఆ తర్వాత కొంతకాలానికి స్కీజోఫ్రినియా రూపంలో కనిపించవచ్చు. దీర్ఘకాలపు ఒత్తిడి (క్రానిక్ స్ట్రెస్) వల్ల మహిళల్లో కార్టిసాల్ ఎక్కువగా ఉత్పత్తి అయి అది ప్రోజెస్టెరాన్ అనే హార్మోన్‌పై ప్రభావం చూపవచ్చు. ఈ ప్రోజెస్టెరాన్ అనే హార్మోన్ గర్భధారణకూ, గర్భం నిలవడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ప్రోజెస్టెరాన్ హార్మోన్ పాళ్లు తక్కువైతే దానివల్ల నెలలు నిండకముందే ప్రసవం అయ్యే అవకాశాలు ఎక్కువ. మరీ ఎక్కువ ఒత్తిడికి గురైన తల్లులకు పుట్టిన బిడ్డల వ్యాధి నిరోధక శక్తి తక్కవగా ఉంటుంది. ఒత్తిడిని నివారించండిలా... ►బిడ్డతో తల్లికి అనుబంధం చిన్నారి తన కడుపున పడిన నాటి నుంచి మొదలై కడవరకూ ఉంటుంది. ఆ బంధంలో ఎలాంటి ఒడిదొడుకులూ రాకూడదంటే గర్భం ధరించిన నాటి నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా చూసుకోవడం అవసరం. ఒత్తిళ్లు లేకుండా చూసుకోడానికి రకరకాల రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. ఉదాహరణకు యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ధ్యానం వంటివి అందులో ప్రధానమైనవి. ధ్యానం వల్ల రక్తపోటును అదుపు చేయవచ్చు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ల వల్ల దృష్టికేంద్రీకరణ శక్తి మెరుగుపడుతుంది. యోగాతో కేవలం తల్లి ఆరోగ్యం మెరుగ్గా ఉండటమే కాదు... ప్రసవం సమయంలో బిడ్డ తేలిగ్గా పుట్టడానికీ ఉపయోగపడుతుంది. అయితే గర్భవతులు యోగా చేయాలంటే అది నిపుణుల పర్యవేక్షణలోనే చేయడం మంచిదని గుర్తుంచుకోవాలి. ►నిద్రలేమి వల్ల గర్భిణుల్లో ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. అందుకే మధ్యాహ్నం పూట తప్పనిసరిగా కనీసం 20 నిమిషాలు నిద్రపోవాలి. ∙అవసరం పడ్డప్పుడు పొరుగువారి సాయం తీసుకోవాలి. ఒత్తిడి వల్ల దుష్ప్రభావాలిలా... గర్భవతి ఒత్తిడికి లోనైనప్పుడు శరీర జీవక్రియల్లో అనేక రకాల మార్పులు చోటుచేసుకుంటాయి. ఒంట్లో ఒత్తిడిని కలిగించే హార్మోన్లు పెరిగిపోతాయి. ఈ హార్మోన్ల ప్రభావం వల్ల గర్భసంచి లోపలి భాగాల్లో పడుతుంది. దాంతో రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలెక్కువ. ఈ హార్మోన్ల పెరుగుదల కారణంగా ఆకలి మందగించడం, అలసట, నిద్రలేమి, యాంగై్జటీ, తలనొప్పులు, వెన్నునొప్పులు కనిపిస్తాయి. కొందరిలోనైతే ఒత్తిడి పెరిగినప్పుడు తమకు తెలియకుండానే ఎక్కువగా తినేస్తూ ఉంటారు. దీనివల్ల బరువు పెరిగి అదో అనర్థంగా పరిణమించే అవకాశం ఉంటుంది. డా. కల్యాణ చక్రవర్తి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, లూసిడ్ డయాగ్నస్టిక్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
ఏది ప్రేమ? ఏది మోహం?..
ప్రేమ వేదం లాంటిది. చదవగలిగితే పరిపూర్ణతను ఇస్తుంది. ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించేలా చేయడం భగవంతుడికి కూడా సాధ్యం కాదు. జీవితం పువ్వులాంటిది.. అందులోని మకరందమే ప్రేమ. ప్రేమ శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుంది. ప్రేమించడం పాపం కాదు. ఎందుకంటే అది పెరిగేది కడుపులో కాదు, హృదయంలో... ఈ ప్రపంచంలో ప్రేమకు కూడా ఏదో వ్యతిరేకత, అర్హత ఉండాలంటే ఇంత మంది ప్రేమించేవారు కాదు. ప్రేమించబడేవారు కాదు. ప్రేమంటే హృదయాన్ని పారేసుకోవటం కాదు. నువ్వు లేనప్పుడు నవ్వుని, నువ్వున్నప్పుడు కాలాన్నీ పారేసుకోవడం. ప్రేమ అంటే ఏమిటో తెలుసుకోవటానికి నెట్టింట సెర్చ్ చేస్తే దొరికే నిర్వచనాలు బోలేడన్ని. తమ అనుభవాలను, పాండిత్యాలను అంతా కలబోసి ఒక్కో మనిషి ఒకలా ప్రేమను నిర్వచిస్తాడు. కానీ, ‘‘ప్రేమ’’కు సైన్స్ ఇచ్చే నిర్వచనం వేరేలా ఉంటుంది. శరీరంలో చోటుచేసుకునే రసాయనిక మార్పుల ప్రభావమే ప్రేమ. ఓ వ్యక్తిని క్షణం కూడా విడిచి ఉండలేకపోవటం.. ఎంత చూసినా, ఎంత మాట్లాడినా తనివి తీరకపోవటం.. పదేపదే ఆ వ్యక్తి గురించి ఆలోచించటం.. చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవటం ఇలా ఒక్కో చర్యకు ఒక్కో హార్మోన్ ప్రభావం ఉంటుంది. ప్రేమలో ముఖ్యంగా మూడు దశలు ఉంటాయి. మొదటిది వ్యామోహం, కామం(లస్ట్).. రెండవది ఆకర్షణ(అట్రాక్సన్).. మూడవది అనుబంధం(అటాచ్మెంట్). ఈ మూడు దశలకు కొన్ని హార్మోన్లలో కలిగే మార్పులే కారణం. 1) వ్యామోహం(లస్ట్) దీన్నే మనకు అర్ధమమ్యే భాషలో కామం అని అనొచ్చు. ఇది తమ శారీరక వాంఛలు తీర్చుకునేవరకు మాత్రమే ‘‘ప్రేమ’’ను నడిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం సెక్స్ హార్మోన్స్. మగవారిలో టెస్టోసిరాన్, ఆడవారిలో ఈస్ట్రోజన్ ఎదుటి వారి పట్ల సెక్స్ కోర్కెలను కలిగేలా చేస్తాయి. ఈ హార్మోన్లలో కలిగే మార్పులను బట్టి కోర్కెలలో మార్పులు సంభవిస్తాయి. 2) ఆకర్షణ( అట్రాక్షన్) అమ్మాయి అందంగా ఉందనో, అబ్బాయి కండలు తిరిగి, ఆరడుగుల ఎత్తు ఉన్నాడనో ప్రేమించటమన్నది ఒకరకంగా ఆకర్షణ కిందకు వస్తుంది. ఈ దశలో ప్రేమలు ఎక్కువ రోజులు మనలేవు. కొన్ని నెలలు.. కొన్ని సంవత్సరాలు.. ఎదుటి వ్యక్తి మనికిచ్చే ప్రాధాన్యతపై ఇది ఆధారపడి ఉంటుంది. ఆకర్షణకు ప్రధాన కారణం డోపమైన్, నోరెపినోఫ్రిన్, సెరోటోనిన్ అనే హార్మోన్లు. ఈ హార్మోన్లు మన శరీరంపై చూపే ప్రభావం కారణంగానే ఎదుటి వ్యక్తి మీద మనకున్నది విపరీతమైన ప్రేమ అనే భావన కలుగుతుంది. ఇదే కొన్ని సందర్భాల్లో అనుబంధానికి దారితీయోచ్చు. 3) అనుబంధం(అటాచ్మెంట్) మూడవది, అతిముఖ్యమైనది ఈ దశ. ఇందులోనే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఎక్కువకాలం నిలుస్తుంది. అనుబంధానికి ముఖ్యకారణం ఆక్సిటోసిన్, వాసోప్రెస్సిన్ అనే హార్మోన్లు. శృంగారం సమయంలో, తల్లులు తమ పిల్లలకు చనుబాలు ఇస్తున్నపుడు, కాన్పు సమయంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇందుకారణంగానే బంధాలు గట్టిపడతాయి. వాసోప్రెస్సిన్ హార్మోన్ కూడా బంధాలు ఎక్కువకాలం కొనసాగేలా చేస్తుంది. -
అమ్మో.. టీన్మార్!
కౌమారం అందరికీ వస్తుంది. కిక్కిస్తుంది, కిక్కెక్కిస్తుంది! ఇది ప్రకృతి పిల్లలకు ఇచ్చే బహుమానం. ఇది సుగుణాలకు దారివేయాలి. అవగుణాల నుంచి దూరంగా ఉంచాలి. పేరెంట్స్‌గా అది మీ చేతుల్లోనే ఉంది. లేకపోతే... అమ్మో.. టీన్మార్! బాల్యం, కౌమారం, యౌవనం, మధ్యవయస్సు, వృద్ధాప్యం... ఇవీ మనిషి తన జీవితంలో అనుభవించే దశలు. పుట్టినప్పటి నుంచి 12 ఏళ్లు వచ్చే వరకు గడిచే బాల్యం చాలా మధురమైనది. 18 ఏళ్లు నిండిన నాటి నుంచి 40లలోకి ప్రవేశించే వరకు యౌవనం కూడా జీవితంలో మంచిదశే. ఈ దశలోప్రతి వ్యక్తీ జీవితంలో తాను అనుకున్నది సాధించడానికి అవసరమైన శక్తియుక్తులు కలిగి ఉంటాడు. ఇక 40 నుంచి 65-70ల వరకు ఇక తాను గడించిన అనుభవంతో అలా దాదాపుగా అలవోకగా జీవితాన్ని వెళ్లదీస్తాడు. ఇలా సాగిపోయే దశే... మధ్యవయస్సు. ఇవన్నీ గడిచిపోయాక జీవితం చివరి భాగంలో 75-90 ల వరకు ఉండేది వృద్ధాప్యం అనుకోవచ్చు. ఈ దశలో ప్రతి ఒక్కరూ దాదాపుగా పూర్తిస్థాయి విశ్రాంత జీవితం గడుపుతుంటారు. కానీ 12 ఏళ్ల నుంచి 19 వరకు ఉండే టీనేజీ చాలా చిత్రమైన దశ. ఈ సమయంలో మనం చేసేవన్నీ కరెక్ట్ అనిపిస్తుంది. ఈ దశలోనే మన వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. మనకు అభిరుచులు ఏర్పడి... టీనేజీ దాటాక అవి హాబీలుగా స్థిరపడతాయి. టీన్స్లోని కొత్తహార్మోన్ల ప్రభావంతో పిల్లలు తాము కోపంగా ఉన్నా, దురుసుగా వ్యవహరించినా, ఆగ్రహంతో ఊగిపోయినా... మనకు అదంతా సబబే అనిపిస్తుంది. మధ్యవయసుకు చేరాక ఆలోచిస్తే... అప్పుడెంత దుందుడుకుగా వ్యవహరించామా అంటూ మన ప్రవర్తన పట్ల మనకే సిగ్గుగానూ, బిడియంగానూ ఉంటుంది. అందుకే ఇలాంటి కౌమార (టీన్స్) దశలో వారి ప్రవర్తనల్లో వచ్చే మార్పులు... ఆ ప్రవర్తనకు కారణమయ్యే రకరకాల భావోద్వేగాలు.. అందుకు కారణాలు, పెద్దలు వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా మేనేజ్ చేయాలి వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం. ‘టీన్’ అంటే బాలబాలికలు పదమూడు దాటిననాటి నుంచి పందొమ్మిదవ ఏటి వరకు ఉండే దశ అన్నది అందరికీ తెలిసిందే. థర్‘టీన్’ అంటూ మొదలై... నైన్‘టీన్’ వరకు గడిచే సంవత్సరాలను ఆయా సంఖ్యల పేర్ల చివరన ఉండే ‘టీన్’ అనే పదంతో సూచిస్తుంటారు. అయితే పిల్లలందరిలోనూ టీన్స్‌లో ఉండే ఆ ఉద్వేగాలన్నీ... గంటకొట్టినట్టుగా సరిగ్గా పన్నెండో ఏడు దాటిన మరుక్షణం నుంచే మొదలవ్వాలని ఏమీ లేదు. అమ్మాయిల్లో టీన్స్ తాలూకు పరిణతి 10-11 నుంచే ప్రారంభం కావడం మొదలవుతుంది. కానీ అబ్బాయిల్లో మాత్రం కాస్తంత ఆలస్యంగా అంటే... 12వ ఏటి తర్వాతే ఈ పరిణతి ప్రారంభమవుతుంది. పిల్లలు తమ బాల్యం వీడి క్రమంగా పెద్దలుగా రూపొందడానికి మధ్యన ఉండే ఈ సంధి (ట్రాన్సిషన్) దశలో వారి ప్రవర్తనలో ఎన్నో మార్పులు (బిహేవియరల్ ఛేంజెస్) చోటు చేసుకుంటాయి. ఆ మార్పులతో వారెన్నో అయోమయాలకు గురవుతుంటారు. అంతేకాదు.. తమ ప్రవర్తనతో తమకూ, తమ పెద్దలకు సైతం సమస్యలూ, చిక్కులూ తెచ్చిపెడుతుంటారు. హార్మోన్లే ప్రధాన కారణం టీనేజీ పిల్లల ప్రవర్తనల్లో అంతకు మునుపెన్నడూ లేని మార్పు కనిపించడానికి వారిలో కొత్తగా స్రవించే కొన్ని హార్మోన్లే ప్రధాన కారణం. అవి వారిని నిలకడగా, స్థిరంగా, కుదురుగా ఉండనివ్వవు. టీన్స్‌లో వారు కొత్తదనం కోరుకుంటుంటారు. స్వేచ్ఛను ఆకాంక్షిస్తుంటారు. ఉత్సాహాలు, ఉద్రేకాలు పొంగిపొరలుతుంటాయి. తమ కోరికలు తక్షణం తీరకపోతే వెంటనే వారిలో రకరకాల ఉద్వేగాలు చెలరేగుతుంటాయి. మగపిల్లల్లో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ స్రవించడం మొదలవుతుంది. దాంతో మీసాలూ, గడ్డాలు వంటి సెకండరీ సెక్సువల్ కారెక్టర్స్ కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ హార్మోన్సాహ ప్రవృత్తినీ పెంచుతుంది. కాస్తంత స్వేచ్ఛగా సంచరించేలా, తమకూ తమ ఆపోజిట్ జెండర్‌కూ మధ్యన ఆకర్షణను పెంచేలా చేస్తుంది. ఆ హార్మోన్ ప్రభావం వల్ల సమకూరే కొత్త ఉత్సాహాల కారణంగా తాము స్వేచ్ఛను అనుభవించాలన్న కాంక్షతో కొన్ని పనులు చేయడం మొదలుపెడతారు. ఉదాహరణకు సమాజంలో సిగరెట్ తాగడం, మద్యం సేవించడం, వేగంగా వాహనం నడపడం వంటి కొన్ని అంశాలపై ఆంక్షలు ఉంటాయన్న విషయం తెలిసిందే. తమ సాహసప్రవృత్తిని తీర్చుకోడానికి వారు సమాజంలో ఆంక్షలున్న అంశాలను కాస్త తెంపరితనంతోనో లేదా దొంగతనంగానో చేయాలనుకుంటారు. ఆ పనులు చేసినప్పుడు అవి వారికి మంచి లేదా హాయిగా అనిపించే (ఫీల్‌గుడ్) భావనను కలగజేస్తే... అవే పనులు మాటిమాటికీ చేసి అలవాట్లనూ, వ్యసనాలనూ అభివృద్ధి చేసుకుంటారు. ఇక్కడ మెదడులో స్రవించే మరికొన్ని హార్మోన్లు సైతం రంగంలోకి వస్తాయి. ఉదాహరణకు మొదటిసారి సిగరెట్ తాగినప్పుడు అందులోని నికోటిన్ ప్రభావం వల్ల మెదడులో డోపమైన్ వంటి సంతోష రసాయనాలు స్రవిస్తే... ఆ ఆనందభావనను మాటిమాటికీ పొందడం కోసం టీనేజీ పిల్లాడు మళ్లీ మళ్లీ సిగరెట్ తాగాలనుకుంటాడు. అలాగే మద్యం, పేకాట, దురలవాట్లు శ్రుతిమించితే డ్రగ్స్... ఇవన్నీ కూడా అలా అలవాటయ్యేవే. మంచీ చెడుల కలగలుపు.. మన హార్మోన్లతో టీనేజ్‌లో కలిగే సాహసధోరణీ, సంతోష రసాయనాలూ రెండూ కలగలసి మంచీ-చెడూ... ఈ రెండు రకాల అభిరుచులూ వృద్ధి అవుతాయి. ఉదాహరణకు టీనేజ్‌లో కొత్తగా బైక్ నేర్చుకోవాలనే ధోరణి అందరిలో కలగడం ఓ మంచి భావన. భవిష్యత్తులో తాము జీవితాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవాలనే తపన అందులో ఉంటుంది. అయితే బైక్ నేర్చుకున్న తర్వాత దాని ముందు చక్రాన్ని పైకెత్తి నడపడం, చాలా వేగంగా డ్రైవ్ చేయడం వంటివి చేస్తున్న టీనేజీ పిల్లలను మనం రోడ్లపై నిత్యం చూస్తుంటాం. దీనికి కారణం ఆ వయసులో వారిలో కలిగే సాహసప్రవృత్తి. దానికి తోడుగా తమ కాన్షియస్ ఎఫర్ట్స్‌తో వారు తమ బైక్ నైపుణ్యాలను మరింత వృద్ధిపరచుకొని సాహసకార్యాలు చేస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లోనైతే హింసాత్మక ప్రవృత్తితో చాలా క్రూరంగానూ వ్యవహరిస్తారు. అయితే పిల్లల్లో ఇలా వ్యక్తిత్వ రూపకల్పన, అభిరుచులు ఏర్పడే సమయంలో... వారినీ, వారి ఆలోచనలనూ, వారి అలవాట్లనూ ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉంటాయి. టీనేజ్‌లో మన ప్రవర్తన రూపొందడానికీ, అభివృద్ధి్ద చెండానికి కారణాలివే... జన్యుపరమైన అంశాలు: టీనేజీ పిల్లల్లోని ప్రవర్తనలకు జన్యుపరమైన అంశాలే ప్రధాన కారణం. సాధారణంగా తల్లిదండ్రులనుంచి వచ్చే జన్యువుల పైనే వారి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు తల్లిదండ్రుల్లో ఆత్మస్థైర్యం చాలా ఎక్కువనుకోండి. వారిని చూసిన పిల్లలు సైతం తామూ అలాగే ధైర్యంగా ఉండటాన్ని అలవాటు చేసుకుంటారు. తల్లిదండ్రుల్లో ఏదైనా కొత్తగా చేసే పనుల విషయంలో భయపడే గుణం... అంటే ‘పర్ఫార్మెన్స్ యాంగై్జటీ’ ఉంటే పిల్లల ప్రవర్తనలోనూ చాలా వరకు అవే గుణగణాలు (ట్రెయిట్స్) వస్తాయి. కాన్షియస్ ఎఫర్ట్స్ : వీటికి కూడా చాలా వరకు తల్లిదండ్రులతో పాటు కొన్ని సామాజిక అంశాలూ కారణమవుతాయి. ఉదాహరణకు తల్లిదండ్రులు ఏ డాక్టర్లో, ఐఏఎస్లుగానో పనిచేస్తున్నారనుకోండి. వాళ్లను గమనించే పిల్లలు... తాము కూడా అలాంటి వృత్తిలోకే వెళ్లాలనీ, అలాంటి గౌరవమే పొందాలని ఆకాంక్షిస్తుంటారు. ఇదే విషయం పెయింటర్లు, డాన్సర్లు, రచయితలకూ వర్తిస్తుంటుంది. కొన్ని మినహాయింపులున్నా సాధారణంగా తల్లిదండ్రుల ప్రభావం కారణంగానూ, తమ కాన్షియస్ ఎఫర్ట్స్తోనూ కలగలిసిన ప్రభావంతో తమ కెరియర్ను నిర్మించుకుంటుంటారు. ప్రవర్తనపై సామాజిక అంశాల ప్రభావం ఇలా... పిల్లలను తమ చుట్టూ ఉన్న సమాజంలోని అనేక అంశాలను నిత్యం పరిశీలిస్తూ ఉంటారు. వాటినుంచి కూడా తాము నేర్చుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా తమ పరిసరాలు, తాము చూసే సినిమాల వంటి మాస్‌మీడియా ప్రభావాలు, తాము చదివే పుస్తకాల వంటి అనేక సామాజిక అంశాలూ టీనేజీ పిల్లల ప్రవర్తనను నిర్దేశిస్తుంటాయి. నిర్ణాయాత్మక భూమికను పోపిస్తుంటాయి. పరిసరాల ప్రభావం:ఉదాహరణకు తమ ఇంటికి సమీపంలో ఏ పోలీస్ ఉద్యోగో ఉన్నాడు. అతడి ధీరత్వం, అతడి హుందాతనం, అతడు ప్రవర్తిస్తున్న తీరుతో స్ఫూర్తి పొందుతుంటాడు. అలాంటి వారి వల్ల ప్రభావితమైన కుర్రాడు తానూ అలాంటి వృత్తిలోకే వెళ్లాలని ఆశిస్తాడు. అందుకు అనుగుణంగా మళ్లీ తన కాన్షియస్ ఎఫర్ట్స్ మొదలుపెడతాడు. కొద్దిమేరకు జన్యుపరమైన అంశాలతో పాటు... చాలావరకు ఈ కాన్షియస్ ఎఫర్ట్స్ కారణంగానే పిల్లల కెరియర్, వారి భవిష్యత్తు నిర్ణయమవుతుంది. అలాగే నిత్యం కీచులాడుకునే తల్లిదండ్రులూ, పరిసరాల్లో ఎప్పుడూ గొడవలకు దిగే ప్రవృత్తి ఉన్నవారు ఉన్నారనుకోండి.... అవే అంశాలు పిల్లలనూ ప్రభావితం చేస్తాయి. దాంతో వారు నిత్యం తగాదాలు పెట్టుకునే తంపులమార్లుగా, పోకిరీలూ, జులాయిలుగా తయారయ్యే అవకాశాలూ ఉంటాయి. టీవీలు, సినిమాల, డిజిటల్ వంటి మాస్ మీడియా : సాధారణంగా టీనేజ్ దశలో చూసే సినిమాలు, అందులో కథానాయకుడి లక్షణాలు పిల్లలను చాలావరకు ప్రభావితం చేస్తుంటాయి. ఉదాహరణకు శంకరాభరణం సినిమా తర్వాత చాలా మంది టీనేజీ పిల్లలు సంగీతం వైపునకు ఆకర్షితులయ్యారు. అలాగే సాగరసంగమం సినిమా వచ్చాక చాలా మంది డాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఇక ‘ద్రోహి’ (హిందీలో ద్రోహకాల్) అనే సినిమా చూసిన కొంతమంది పోలీస్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ తీసుకొని ఆ వృత్తిలోకి వెళ్లారు. స్ఫూర్తిదాయక కథనాలు, సాహిత్యం: కింది స్థాయినుంచి జీవితాన్ని ప్రారంభించి, తాము మంచి కెరియర్‌నూ, మంచి పేరునూ సంపాదించిన వారి కథనాలూ చదవడం, సాహిత్యంతోనూ చాలామంది టీనేజీ పిల్లలు ప్రభావితమవుతుంటారు. పాపులర్ సైన్స్ పుస్తకాలు చదివి సైన్స్ పట్ల అభిరుచి పెంచుకోవడం, డబ్బు సంపాదన గురించిన కథనాలు చదివి జీవితంలో తామూ పారిశ్రామికవేత్తలుగా రూపొందిన ఉదాహరణలు సైతం చాలానే ఉన్నాయి. ఇంగ్లిష్‌లో స్టీఫెన్ హాకింగ్స్ వంటివారి పుస్తకాలు చదవడం, తెలుగులో నండూరి రామమోహన్‌రావు ‘విశ్వరూపం’, ‘నరావతారం’, యాకొవ్ పెరల్మాన్ రాసిన ‘నిత్యజీవితంలో భౌతికశాస్త్రం’ వంటి పుస్తకాలూ, మన దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం వంటి వారి రచనలు చదివి సైన్స్ పట్ల అభిరుచి పెంచుకొని సైంటిస్టులుగా మారినవారూ ఉన్నారు. అవే అంశాలతో దురలవాట్లు సైతం... మనం పైన చెప్పుకున్న అంశాల నుంచే దురలవాట్లు అబ్బుతాయి. ఉదాహరణకు పరిసరాల్లో నేరప్రవృత్తి ఉన్నవారి నుంచి, సినిమాల్లోని కొన్ని దుస్సాహస ధోరణుల నుంచి, పేరుమోసిన నేరగాళ్ల నుంచి ప్రేరణ పొంది చెడుదారుల్లో నడవడం, ఆల్కహాల్‌కూ, డ్రగ్స్‌కూ అలవాటు కావడం వంటి ధోరణులు సైతం చోటు చేసుకునేందుకు టీనేజీలోనే బీజం పడటం జరుగుతుంటుంది. ఇవన్నీ చేశాక కూడా టీనేజీ పిల్లల్లో ప్రవర్తన పూర్వకమైన మార్పుల వల్ల ఇటు పెద్దలకూ అటు వారికీ ఇబ్బందులు కలుగుతుంటే సైకియాట్రిస్ట్‌ల వంటి ప్రొఫెషనల్స్ సహాయం తీసుకోవడం చాలా వరకు మేలు చేస్తుంది. సైకియాట్రిస్ట్‌లు కౌన్సెలింగ్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) వంటి ప్రక్రియలతో వారి టీనేజీ ప్రవర్తనలను చక్కదిద్దుతారు. ఒకవేళ ఈ ఈడు పిల్లలు దుష్ప్రవర్తనతో ఉంటే... వాటి కారణంగా వచ్చే దుష్పరిణామాలకు చాలావరకు అడ్డుకట్ట వేస్తారు. చక్కదిద్దడం ఎలా... టీనేజ్‌లోకి రాగానే పిల్లల్లో కనిపించే ప్రవర్తను మార్పులను చక్కగా గాడిలో పెట్టడం (ఛానలైజ్ చేయడం) ద్వారా వారిని ప్రయోజనాత్మకమైన మంచి పౌరులుగా రూపొందేలా చేయవచ్చు. అందుకు తల్లిదండ్రులు అనుసరించాల్సిన కొన్ని అంశాలివే. ఆదర్శప్రాయంగా ఉండటం: టీనేజీ పిల్లలు తమ చాలా ప్రవర్తనలను పెద్దల నుంచే నేర్చుకుంటారని చెప్పుకున్నాం కదా. ఉదాహరణకు తాము మంచివృత్తుల్లో ఉండాలన్న భావనలూ, తాము సైతం తమ తల్లిదండ్రుల్లా సంగీత సాధన, మంచి రచనలు చేయాలని అనుకోవడానికి తల్లిదండ్రుల ఆదర్శ ప్రవర్తనే కారణమవుతుంది. మంచి జీవన శైలి అలవాటు చేయడం: మన జీవనశైలి ఆరోగ్యకరంగానూ, క్రమశిక్షణతోనూ ఉండేలా టీనేజీలోనే పిల్లలకు అలవాటు చేయాలి. ఆ వయసులో ఏర్పడ్డ అలవాట్లు జీవితాంతం కొనసాగుతాయి. క్రమబద్ధంగా ఉండటం అలవాటు చేసుకుంటే అది జీవితంలో వచ్చే ఎన్నో అడ్డంకులు, సమస్యలను అధిగమించడానికి ఉపయోగపడుతుంది. క్రమశిక్షణ కలిగి ఉండటం అన్నది జీవితంలో శ్రమపడటాన్నీ నేర్పుతుంది. పటిష్టమైన కుటుంబ సబంధాలు: తల్లిదండ్రులు తమ పిల్లలతో నాణ్యమైన సమయం గడపడం, వారిపట్ల ప్రేమతో వ్యవహరించడం ద్వారా టీనేజీలో సైతం పిల్లలు అయోమయానికి గురికాకుండా స్పష్టంగా వ్యవహరించేలా చేయవచ్చు. పిల్లలు తమను నమ్మి అన్ని విషయాలూ తమతో చర్చించేలా బలమైన, పటిష్టమైన కుటుంబ సంబంధాలు ఉన్నప్పుడు ఆ పిల్లలు టీనేజీ అయోమయాలను తేలిగ్గా అధిగమించగలుగుతారు. చెడు అలవాట్లకు లోనుకాకుండా చూడటం: వ్యసనాలన్నీ పిల్లలను కబళించేందుకు టీనేజీలోనే పొంచి ఉంటాయి. వారి సాహసధోరణీ, తాత్కాలిక సంతోషాన్ని కలిగించే అంశాలు వ్యసనాలకు బానిస చేస్తాయి. అందుకే అవెంత ప్రమాదకరమో పిల్లలకు అన్యాపదేశంగా ఎప్పుడూ చెబుతూ ఉండటం ద్వారా వాటి జోలికి వెళ్లకుండా చేయాలి. మంచి అభిరుచుల వృద్ధి కూడా... టీన్స్ దశలోనే పిల్లల్లో వ్యక్తిత్వ నిర్మాణం ప్రారంభం అవుతుందనీ, అభిరుచులూ పెంపొందుతుంటాయని మనం ముందే చెప్పుకున్నాం కదా. ఈ దశలో తమకు సంతోషాన్నిచ్చే వ్యక్తిత్వాన్నీ, అభిరుచులను పిల్లలు ప్రాక్టీస్ చేస్తారు. ఆ సమయంలో కూడా మళ్లీ వాళ్ల మెదడుల్లో సంతోషాన్నీ, హాయినీ ఇచ్చే డోపమైన్, సెరిటోనిన్, ఎండార్ఫిన్ లాంటి రసాయనాలు స్రవిస్తాయి. ఉదాహరణకు ఒక టీనేజ్ అబ్బాయి చక్కటి డ్రాయింగ్ వేస్తాడు. మరొక అమ్మాయి మంచి రచన చేస్తుంది. ఇంకొకరు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తారు. ఇలా సృజనాత్మకమైన చర్య (యాక్టివిటీ) వల్ల తాము పొందిన ఆనందాన్ని మళ్లీ మళ్లీ పొందడం కోసం... తమలోని ఆ సృజనాసామర్థ్యాన్ని (టాలెంట్‌ను) అభివృద్ధి చేసుకుంటారు. ఇందుకోసం చేసే ప్రాక్టీస్‌ను ‘కాన్షియస్ ఎఫర్ట్’ అని అంటారు. - డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్,లూసిడ్ డయాగ్నస్టిక్స్,బంజారాహిల్స్,హైదరాబాద్. -
వరుసగా అబార్షన్స్ అవుతున్నాయి... సంతానం కలుగుతుందా?
నా వయసు 32 ఏళ్లు. పెళ్లయి ఏడేళ్లు అవుతోంది. మూడుసార్లు గర్భం వచ్చింది. కానీ గర్భస్రావం అయ్యింది. డాక్టర్‌ను సంప్రదిస్తే అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని అన్నారు. అయినా ఈ విధంగా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు. హోమియో ద్వారా నాకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉందా? గర్భధారణ జరిగి అది నిలవనప్పుడు, ముఖ్యంగా తరచూ గర్భస్రావాలు అవుతున్నప్పుడు అది వారిని మానసికంగానూ కుంగదీస్తుంది. మరోసారి గర్భం ధరించినా అది నిలుస్తుందో, నిలవదో అన్న ఆందోళనను కలగజేస్తుంది. ఇలా రెండు లేదా మూడుసార్లు గర్భస్రావం అయితే దాన్ని ‘రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్’గా పేర్కొంటారు. కారణాలు: ►ఇలా గర్భస్రావాలు జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో కొన్ని... ►గర్భాశయం అసాధారణంగా నిర్మితమై ఉండటం (రెండు గదుల గర్భాశయం) ►గర్భాశయంలో కణుతులు / పాలిప్స్ ఉండటం ►గర్భాశయపు సర్విక్స్ బలహీనంగా ఉండటం ►కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులు ►కొన్ని ఎండోక్రైన్ వ్యాధులు ►వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం ►రకరకాల ఇన్ఫెక్షన్లు రావడం వంటి ఎన్నో కారణాలు గర్భస్రావానికి దారితీస్తాయి. అయితే కొంతమందిలో ఎలాంటి కారణం లేకుండా కూడా గర్భస్రావాలు జరుగుతుండవచ్చు. చికిత్స: రోగనిరోధకశక్తిని పెంపొందించడం, హార్మోన్ల అసమతౌల్యతను చక్కదిద్దడం వంటి చర్యల ద్వారా సంతాన లేమి సమస్యను పరిష్కరించవచ్చు. అలాగే గర్భస్రావానికి దారితీసే అనేక కరణాలు కనుగొని, వాటికి తగి చికిత్స అందించడంతో పాటు కాన్స్టిట్యూషన్ పద్ధతిలో మానసిక, శారీరక తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తే సంతాన సాఫల్యం కలుగుతుంది. అయితే అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో కారణాలతో పాటు వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకొని సరైన ఔషధాలను వాడితే సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ మైగ్రేన్ తలనొప్పి... చికిత్స ఉందా? నాకు విపరీతమైన తలనొప్పి వస్తోంది. వారంలో ఒకటి, రెండు సార్లు తీవ్రంగా వస్తోంది. ఎన్నో రక్తపరీక్షలు, ఎక్స్–రే, స్కానింగ్ పరీక్షలు చేయించాను. డాక్టర్లు దీన్ని మైగ్రేన్‌గా నిర్ధారణ చేశారు. జీవితాంతం వస్తుంటుందని చెప్పారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా? తరచూ తలనొప్పి వస్తుంటే అశ్రద్ధ చేయకూడదు. నేటి ఆధునికయుగంలో శారీరక, మానసిక ఒత్తిడి, అనిశ్చితి, ఆందోళనలు తలనొప్పికి ముఖ్యమైన కారణాలు. ఇంకా రక్తపోటు, మెదడు కణుతులు, మెదడు రక్తనాళాల్లో రక్తప్రసరణల్లో మార్పులు, సైనసైటిస్ మొదలైన వాటివల్ల తలనొప్పి వచ్చేందుకు ఆస్కారం ఉంది. తలనొప్పి ఏ రకానికి చెందినదో నిర్ధారణ తర్వాత కచ్చితమైన చికిత్స చేయడం సులువవుతుంది. మైగ్రేన్ తలనొప్పిని పార్శ్వపు తలనొప్పి అంటారు. మానసిక ఆందోళన, ఒత్తిడి, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్, నిద్రలేమి, అధికప్రయాణాలు, సూర్యరశ్మి, స్త్రీలలో హార్మోన్ సమస్యల వల్ల ఈ పార్శ్వపు తలనొప్పి వస్తుంటుంది. ఇది స్త్రీలలోనే ఎక్కువ. మైగ్రేన్‌లో దశలూ, లక్షణాలు: సాధారణంగా మైగ్రేన్ వచ్చినప్పుడు 24 గంటల నుంచి 72 గంటలలోపు అదే తగ్గిపోతుంది. ఒకవేళ 72 గంటలకు పైనే ఉంటే దాన్ని స్టేటస్ మైగ్రేన్ అంటారు. దీంతోపాటు వాంతులు కావడం, వెలుతురునూ, శబ్దాలను అస్సలు భరించలేకపోవడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. వ్యాధి నిర్ధారణ: రక్తపరీక్షలు, రక్తపోటును పరీక్షించడం, సీటీస్కాన్, ఎంఆర్ఐ పరీక్షల ద్వారా మైగ్రేన్‌ను నిర్ధారణ చేయవచ్చు. నివారణ: మైగ్రేన్ రావడానికి చాలా అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు మనం తినే ఆహారంలో మార్పులు, మనం ఆలోచించే విధానం, మానసిక ఒత్తిడి, వాతావారణ మార్పులు, నిద్రలేమి, మహిళల్లో రుతుసమస్యలు వంటి కారణాలతో వచ్చినప్పుడు జీవనశైలిలో మార్పులతో దీన్ని కొంతవరకు నివారించవచ్చు. ఇక మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయాలి. చికిత్స: మైగ్రేన్‌ను పూర్తిగా తగ్గించడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. శారీరక, మానసిక, కుటుంబ, అనువంశీక, వాతావరణ, వృత్తిసంబంధమైన కారణాలను అంచనా వేసి, వాటిని అనుగుణంగా మందును ఎంపిక చేయాల్సి ఉంటుంది. వారి జెనెటిక్ కన్‌స్టిట్యూటషన్ సిమిలియమ్ వంటి అంశాలన పరిగణనలోకి తీసుకొని బెల్లడోనా, ఐరిస్, శ్యాంగ్యునేరియా, ఇగ్నీషియా, సెపియా వంటి కొన్ని మందులు మైగ్రేన్‌కు అద్భుతంగా పనిచేస్తాయి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ బాబుకు ఆటిజమ్... చికిత్స ఉందా? మా బాబుకు మూడేళ్లు. ఆటిజమ్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. హోమియోలో మంచి చికిత్స సూచించండి. ఆటిజమ్ ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి. దీనిలో చాలా స్థాయులు, ఎన్నో లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీనితో బాధపడేవారందరిలోనూ లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చు. ఆటిస్టిక్ డిజార్డర్ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య. యాస్పర్జస్ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఇది రావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... ►అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం ►నలుగురిలో కలవడలేకపోవడం ►ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం ►వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలు బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారిని స్పీచ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు బట్టి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు మామూలుగా అయ్యేందుకు లేదా గరిష్ఠస్థాయికి మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
ఫైబ్రాయిడ్స్ మళ్లీ రాకుండా తగ్గించవచ్చా?
నా వయసు 44 ఏళ్లు. గత కొంతకాలంగా గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్ సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించాలని చెప్పారు. అయితే భవిష్యత్తులో అవి మళ్లీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. హోమియో చికిత్సతో ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. వీటి బారిన పడిన కొంతమంది స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. వీటి ఎదుగుదల కొందరిలో వేగంగానూ, మరికొందరిలో నిదానంగా ఉంటుంది. ఇంకొందరిలో నిదానంగా, నిలకడగా, స్వల్ప పరిమాణంలో ఉంటూ ఎలాంటి లక్షణాలనూ కనబరచకపోవచ్చు. గర్భాశయంలో వీటిని ఉనికి, పరిమాణరీత్యా ఈ యుటెరైన్ ఫైబ్రాయిడ్స్‌ను మూడు రకాలుగా విభజించవచ్చు. 1) సబ్‌సీరోజల్ ఫైబ్రాయిడ్స్ 2) ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ 3) మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్. కారణాలు : ఈ ఫైబ్రాయిడ్స్ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి. లక్షణాలు: గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు. చికిత్స: జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ పీరియడ్స్ సక్రమంగా రావడం లేదు మా అమ్మాయి వయసు 23 ఏళ్లు. హార్మోన్ లోపం వల్ల ఆమెకు నెలసరి సరిగా రావడం లేదు. ఆమె బరువు పెరుగుతోంది. హోమియోపతిలో సరైన చికిత్స చెప్పండి. మనిషి జీవించడానికి శ్వాస ఎంత ముఖ్యమో, ఆరోగ్యంగా ఉండటానికి హోర్మోన్లు అంతే ముఖ్యం. గర్భాశయంలో పిండం ఏర్పడినప్పట్నుంచీ జీవితాంతం హార్మోన్లు తమ ప్రభావం కలిగి ఉంటాయి. మెదడులోని హైపోథెలామస్, పిట్యూటరీ గ్రంథులు శరీర కణాల క్రమబద్ధీకరణలో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ హార్మోన్లే శరీర ఉష్ణోగ్రతను, ఆకలిని, మానసిక స్థితి, నిద్ర, దాహం, ఉద్వేగాలను అదుపులో ఉంచుతాయి. ఇవి రక్తం ద్వారా ప్రవహిస్తూ, నిర్దిష్ట అవయవాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి చాలా సూక్ష్మ మోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ శరీరంపై చాలా ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. సాధారణ జీవక్రియలైన జీర్ణక్రియ మొదలుకొని, శరీరక, మానసిక ఎదుగుదల, మానసిక సమతౌల్యత వంటి అంశాలన్నింటికీ ఇవి తోడ్పడతాయి. హైపోథైరాయిడ్, పీసీఓడీ, సంతాన లేమి, డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక జబ్బులన్నీ హార్మోన్ అసమతౌల్యత వల్ల వచ్చేవే. ఈ హార్మోన్ల సమతౌల్యత దెబ్బతిన్నప్పుడు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు. థైరాయిడ్ హార్మోన్లయిన టీ3, టీ4... థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతాయి. వీటిలో అసమతౌల్యత ఏర్పడితే హైపోథైరాయిడిజమ్, హైపర్‌థైరాయిడిజమ్, గాయిటర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు వస్తాయి. అలాగే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, ప్రోలాక్టిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు మహిళల్లో నెలసరి, సెకండరీ సెక్సువల్ లక్షణాలు, సంతానోత్పత్తి, ప్రసవం వంటి అంశాలకు ఉపకరిస్తాయి. ఈ హార్మోన్ల అసమతౌల్యత వల్ల మహిళల్లో నెలసరి సమస్యలు, అవాంఛిత రోమాలు, సంతానలేమి వంటి సమస్యలు కనిపిస్తాయి. మెనోపాజ్, నెలసరి వచ్చే సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల వేడి ఆవిర్లు, మానసిక అశాంతి, నీరసం, కీళ్లనొప్పులు కూడా వస్తాయి. నెలసరి సరిగా రాకపోవడంతో పాటు, బరువు పెరుగుతోందని చెబుతున్నారు కాబట్టి మీ అమ్మాయిలో హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడి ఉండవచ్చు. ముందుగా ఆమెలోని సమస్యను తెలుసుకోవాలి. అయితే మీరు చెబుతున్న లక్షణాలను చూస్తే ఆమెకు థైరాయిడ్‌కు సంబంధించిన సమస్య ఉండవచ్చని అనిపిస్తోంది. దీన్ని నిర్ధారణ చేస్తే ఆమెకు హోమియోలో కాల్కేరియా కార్బ్, థైరాయిజమ్ ఐయోడమ్, బ్రోమియమ్, సల్ఫర్ వంటి మంచిమందులే అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ఆమెను అనుభవజ్ఞులైన హోమియో వైద్యులకు చూపించండి. ఆమెకు ఉన్న వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ నాకు ఇకనైనా సంతానం కలుగుతుందా? నా వయసు 33 ఏళ్లు. వివాహమై ఎనిమిదేళ్లు అయ్యింది. ఇంతవరకు సంతానం లేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేసి ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అని చెప్పారు. ఇన్ఫెర్టిలిటీ అంటే ఏమిటి? దానికి కారణాలు ఏమిటి? హోమియోలో నా సమస్యకు శాశ్వత పరిష్కారం ఉందా? ఇటీవల చాలా మందిలో సంతానలేమి సమస్య కనిపిస్తోంది. దీనికి అనేక అంశాలు కారణమవుతాయి. సమస్య మహిళల్లో లేదా పురుషుల్లో ఉండవచ్చు. స్త్రీలలో సాధారణంగా కనిపించే కారణాలు : ►జన్యుసంబంధిత లోపాలు ►థైరాయిడ్ సమస్యలు ►అండాశయంలో లోపాలు; నీటిబుడగలు ►గర్భాశయంలో సమస్యలు ►ఫెలోపియన్ ట్యూబ్స్‌లో వచ్చే సమస్యలు ►డయాబెటిస్ ►గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడటం. పురుషుల్లో సాధారణంగా కనిపించే కారణాలు : ►హార్మోన్ సంబంధిత సమస్యలు ►థైరాయిడ్ ►పొగతాగడం ►శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం సంతానలేమిలో రకాలు : ►ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ ►సెకండరీ ఇన్ఫెర్టిలిటీ ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ : అసలు సంతానం కలగకపోవడాన్ని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా జన్యుసంబంధిత లోపాలు, హార్మోన్ సంబంధిత లోపాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. సెకండరీ ఇన్ఫెర్టిలిటీ: మొదటి సంతానం కలిగిన తర్వాత లేదా అబార్షన్ అయిన తర్వాత మళ్లీ సంతానం కలగకపోవడాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా గర్భాశయంలో ఏమైనా లోపాలు ఏర్పడటం, ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల సంభవిస్తుంది. గుర్తించడం ఎలా : తగిన వైద్య పరీక్షల ద్వారా సమస్యను నిర్ధారణ చేస్తారు. ముఖ్యంగా థైరాయిడ్ ప్రొఫైల్, సాల్ఫింజోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఫాలిక్యులార్ స్టడీ వంటి టెస్ట్‌లు చేస్తారు. చికిత్స: హోమియోలో ఎలాంటి సమస్యలకైనా కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. మీ సమస్యను పరిష్కరించేందుకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
పాపకు తరచూ విరేచనాలు... ఎందుకిలా?
మా పాప వయసు పదేళ్లు. గత కొద్ది నెలలుగా పదే పదే విరేచనాలు అవుతున్నాయి. కొద్దిపాటి మందులతో తగ్గినట్లే తగ్గినా... మళ్లీ సమస్య తిరగబెడుతోంది. మరీ చెప్పాలంటే... పాప భోజనం తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి వస్తోంది. ఎప్పుడైనా కొద్దిగా నీరసంగా ఉంటోంది. మా పాప సమస్య ఏమిటి? ఎందుకిలా జరుగుతోంది. పరిష్కారం ఉందా? మీరు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే మీ పాపకు రికరెంట్ డయేరియల్ ఎపిసోడ్స్ ఉన్నట్లు చెప్పవచ్చు. పిల్లల్లో వారు సాధారణంగా విసర్జనకు వెళ్లే టాయిలెట్స్ హాబిట్స్‌తో పోల్చినప్పుడు... వారు మలవిసర్జనకు వెళ్లాల్సిన విడతలు ఎక్కువైనా లేదా వారి క్రమబద్ధమైన వేళల్లో మార్పువచ్చినా దాన్ని డయేరియా అని నిర్వచించవచ్చు. అలాగే అది ఒకేసారి ఎక్కువగా విరేచనాలు (అక్యూట్ డయేరియా), లేదా పదే పదే విరేచనాలు కావడం లేదా దీర్ఘకాలికంగా ఉండే డయేరియా అయినా కావచ్చు. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తూంటే మీ అమ్మాయిది రికరెంట్ డయేరియా అని చెప్పవచ్చు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. వాటిల్లో ఒకటి ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియల్ లేదా ప్రోటోజోవా (అమీబిక్) కావచ్చు. లేదా నాన్ ఇన్ఫెక్షియస్ డయేరియా కూడా కావచ్చు. మీరు చెబుతున్న లక్షణాలతో మీ అమ్మాయిది నాన్ ఇన్ఫెక్షియస్ డయేరియా అయ్యేందుకు అవకాశం ఎక్కువ. ఇలాంటి కండిషన్‌కు చాలా అంశాలు కారణం కావచ్చు. ఉదాహరణకు... ►తిన్న తిండి ఒంటికి పట్టడంలో సమస్యలు (మాల్ అబ్జార్ప్షన్). ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ లేదా ప్రోటీన్స్ లేదా ఫ్యాట్ అబ్జార్ప్షన్లో సమస్యలు. ►ఎండోక్రైన్ సమస్యలు, కొన్ని ఆటో ఇమ్యూన్ సమస్యలు, నిర్దిష్టమైన ఎంజైమ్స్‌లో లోపాలు, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్ (ఐబీడీ), ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) వంటి ఏదైనా కారణం వల్ల కూడా ఆమెకు సమస్య వచ్చి ఉండవచ్చు. తిన్న తిండి ఒంటికి పట్టకపోవడం (మాల్ అబ్జార్ప్షన్) ఉన్న పిల్లల్లో నీళ్ల విరేచనాలు, పొట్ట ఉబ్బరంగా ఉండటం, ఎదుగుదల లోపాలు రావడం, కడుపునొప్పి ఎక్కువగా ఉండటం, దుర్వాసనతో కూడిన మలం, కొన్నిసార్లు ముఖం–కాళ్లూ చేతుల్లో వాపురావడం, కొన్ని విటమిన్ (ముఖ్యంగా ఎ, డి, ఈ, కె, బి12) లోపాలతో కనిపించే లక్షణాలు ఎక్కువగా చూస్తుంటాం. కొన్ని అరుదైన ఉదంతాల్లో కౌమార వయసులో (అడాలసెంట్) పిల్లల్లో కెఫిన్ పాళ్లు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకున్నప్పుడు లేదా చాలా ఎక్కువగా శారీరక శ్రమ చేసినప్పుడు, రుతుస్రావంలో మార్పుల (మెనుస్ట్రువల్ డిస్టర్బెన్సెస్)తో కూడా డయేరియా లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే మీ పాపకు ఉన్న రికరెంట్ డయేరియాకు కారణం చెప్పడానికి కూలంకషమైన పరీక్షలు, డిటెయిల్డ్ స్టూల్ ఇవాల్యుయేషన్, హార్మోన్స్, ఎంజైమ్స్ అండ్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఎస్సేతో పాటు... అవసరమనిపిస్తే తప్పనిసరిగా కొలనోస్కోపీ, ఎండోస్కోపీ చేయించడం కూడా ముఖ్యం. ఇటువంటి పిల్లల్లో ఆహారంలో మార్పులు – అంటే ముఖ్యంగా వాళ్లకు ఏది సరిపడటం లేదో, లేదా ఏది తింటే సరిగా జీర్ణం కావడం లేదో గుర్తించి, ఆ ఆహారంలో మార్పులు చేయడంతో పాటు కొవ్వు పదార్థాలు, మసాలాలు తగ్గించడం వల్ల చాలావరకు మెరుగుదల కనిపిస్తుంది. కొన్ని ఎంజైమ్ సప్లిమెంట్లు ఇవ్వడంతో పాటు వైటమిన్లు, జింక్ ఇవ్వడం, యాంటీమొటిలిటీ డ్రగ్స్ (పేగుల కదలికలను తగ్గించే మందులు), యాంటీ సెక్రిటరీ డ్రగ్స్ (జీర్ణవ్యవస్థలో ఊరే రసాయనాలను తగ్గించే మందులు), అబ్జార్బెంట్స్, ప్రోబయాటిక్స్ (శరీరంలో మేలు చేసే బ్యాక్టీరియాను పెంచే మందులు) ఇవ్వడం వల్ల పాపకు డయేరియా లక్షణాలు తగ్గుతాయి. అయితే ఇలా విరేచనాలు ఎక్కువగా అవుతున్నప్పుడు కారణం లేకుండా యాంటీబయాటిక్స్ వాడటం జరిగితే వ్యాధి తీవ్రత మరింత పెరగడానికి (యాంటీబయాటిక్ ఇండ్యూస్డ్ డయేరియాకు) దారితీయవచ్చు. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా ఒకసారి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి మీ పాప సమస్యకు తగిన చికిత్స తీసుకోండి. ముర్రుపాలు,తల్లిపాలు, పోతపాలు –ప్రయోజనాలు కొత్తగా తల్లి అయిన చాలామందిలో ఒక సందేహం ఉంటుంది. మొదట ఊరిన పాలు (ముర్రుపాలు) పట్టించాల్సిందేనని కొందరు, అవి బిడ్డకు మంచిది కాదని మరికొందరు అంటుంటారు. కానీ బిడ్డకు ముర్రుపాలు తప్పక తాగించాలి. బిడ్డ పుట్టిన తర్వాత తల్లిలో ఊరే ముర్రుపాలను కొలెస్ట్రమ్ అంటారు. ఈ ముర్రుపాలలో చాలా శక్తిమంతమైన యాంటీబాడీస్ ఉంటాయి. అవి బిడ్డలోని రోగనిరోధకశక్తిని స్వాభావికంగా పెంచుతాయి. ఆ నేచురల్ ఇమ్యూనిటీ వల్ల జీవితకాలంలో బిడ్డ ఎన్నో ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని సమకూర్చుకుంటుంది. అంతేకాదు... వయసు పెరిగాక కనిపించే ఎన్నో జబ్బులు... ఈ ముర్రుపాల కారణంగా రాకపోవచ్చు లేదా చాలా ఆలస్యం రావచ్చు. అందుకే బిడ్డకు ముర్రుపాలు తప్పక పట్టించాలి. ఇక ఆ తర్వాత కూడా పిల్లలకు సాధ్యమైనంతవరకు తల్లిపాలే ఇవ్వాలి. కేవలం తల్లికి తగినన్ని పాలు పడనప్పుడు మాత్రమే పోతపాలకు వెళ్లాలి తప్ప... ఒకవేళ తల్లి దగ్గర పుష్కలంగా పాలు ఉంటే పిల్లలకు కడుపు నిండా తల్లిపాలు తాగించడం మంచిది. దీనివల్ల బిడ్డలకు ఎన్నో లాభాలు చేకూరుతాయి. బిడ్డల్లో రోగనిరోధక శక్తి పెరగడం, వాళ్లు పెద్దయ్యాక వచ్చే అనేక డీజనరేటివ్ డిసీజెస్ ఆలస్యం కావడం వంటి ప్రయోజనాలు తల్లిపాల వల్ల సమకూరుతాయి. మరి పోతపాలు వాడవచ్చా? ఇటీవలి కొన్ని నిరూపితమైన అధ్యయనాల ప్రకారం... పోతపాల (యానిమల్ మిల్క్)పై పెరిగే పిల్లల్లో కడుపునొప్పి వంటి ఉదరసంబంధమైన సమస్యలు, ఆస్తమా వంటి అలర్జిక్ వ్యాధులు ఎక్కువగా వస్తాయని తేలింది. పిల్లల్లో చెవి ఇన్ఫెక్షన్లు, స్థూలకాయం వంటి అనేక సమస్యలకు కూడా పోతపాలు ఒక ప్రధాన కారణమని కూడా తెలుస్తోంది. పైగా ఇటీవల పశువుల్లో పాల ఉత్పత్తి పెంచడానికి అనేక హార్మోన్లు, మందులు, యాంటీబయాటిక్స్ ఉపయోస్తున్నారు. కాబట్టి ఇలాంటి పాలపై పెరిగిన పిల్లల్లో వాళ్ల దీర్ఘకాలిక ఆరోగ్యంపై ఆ రసాయనాల దుష్ప్రభావం కనిపిస్తోంది. కాబట్టి పోతపాలు వాడటం సరికాదు. ఒకవేళ తల్లికి తగినన్ని పాలు పడకపోవడం లేదా బిడ్డకు పాలుసరిపడకపోవడం వంటి పరిస్థితుల్లో (అంటే లాక్టోజెన్ ఇన్టాలరెన్స్, ప్రోటీన్ ఇన్టాలరెన్స్ వంటి సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే). మార్కెట్లో దొరికే కొన్ని ఫార్ములా ఫీడ్స్ ఉపయోగించవచ్చు. కానీ తల్లి వద్ద సరిపడా పాలు లేనప్పుడు పోత పాలు లేదా ఆవు లేదా గేదె పాలు పట్టించడం కంటే తల్లిలోనే పాలు పెరిగేలా కొన్ని స్వాభావిక విధానాలు (ప్రోటీన్లు పుష్కలంగా ఉండే పుష్టికరమైన ఆహారం ఇవ్వడం వంటివి) అనుసరించడం మంచిది. అలా చేయడం వల్ల కూడా తల్లిలో పాలు పడకపోతే అప్పుడు మాత్రమే డాక్టర్ సలహామేరకు తల్లిలో పాలు పెరిగేందుకు కొన్ని మందులు ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే... ముర్రుపాలు తప్పనిసరి. తల్లిపాలు కంపల్సరీ. తల్లి దగ్గర తగినన్ని పాలు లేనప్పుడు మాత్రమే పోతపాలు. పాపకు నోట్లో పుండ్లు... తగ్గేదెలా? మా పాప వయసు ఏడేళ్లు.ఈమధ్య ఒకసారి గొంతులో నొప్పి ఉందని చెప్పింది. వెంటనే డాక్టర్‌కు చూపించాం. పాప నోట్లో, నాలుక మీద, గొంతులోపలా పుండ్లలాగా వచ్చాయి. గొంతులో ఇన్ఫెక్షన్లా కొంచెం పుండులాగా ఎర్రబారింది. ఏదైనా తినడానికి పెడితే గొంతులో నొప్పి అంటూ ఏడుస్తోంది. ఏమీ తినలేకపోతోంది. మా పాప సమస్యకు పరిష్కారం చూపండి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు పదే పదే నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తున్నాయని తెలుస్తోంది.ఈ సమస్యను చాలా సాధారణంగా చూస్తుంటాం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు... ఉద్వేగాలపరమైన ఒత్తిడి బాగా నీరసంగా అయిపోవడం ∙విటమిన్లు, పోషకాల లోపం... (ఇందులోనూ విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్‌ల వంటి పోషకాలు లోపించడం) వైరల్ ఇన్ఫెక్షన్లు (ముఖ్యంగా హెర్పిస్ వంటివి) గాయాలు కావడం (బ్రషింగ్‌లో గాయాలు, బాగా ఘాటైన పేస్టులు, కొన్ని ఆహారపదార్థాల వల్ల అయ్యే గాయాల కారణంగా). పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్ అనే పదార్థం పడకపోవడం, తరచూ జ్వరాలు రావడం... వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యల వల్ల పిల్లలకు తరచూ నోటిలో పుండ్లు వస్తుంటాయి. లెటర్లో చెప్పిన కొద్ది పాటి వివరాలతో నిర్దిష్టంగా ఇదీ కారణం అని చెప్పలేకపోయినా... మీ పాపకు విటమిన్ల వంటి పోషకాల లోపం లేదా తరచూ వచ్చే ఇన్ఫెక్షన్స్తో ఈ సమస్య వస్తున్నట్లు విశ్లేషించవచ్చు. ఇలాంటి పిల్లలకు నోటిలో బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా వాడే మందులు, యాంటిసెప్టిక్ మౌత్ వాష్‌లు, విటమిన్ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో చాలా అరుదుగా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు మరోసారి మీ పిల్లల వైద్య నిపుణుడినిగానీ లేదా దంత వైద్య నిపుణుడినిగానీ సంప్రదించి వారి ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్,రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
నెలసరికి స్వీట్స్‌కి సంబంధమేంటి?
నాకు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు లేవు. అయితే ఈమధ్య నెలసరి రావడం లేదు. నాకు స్వీట్లు ఎక్కవగా తినే అలవాటు ఉంది. దీనివల్లే సమస్య వస్తుందని మా అమ్మ చెబుతోంది. ఇది ఎంత వరకు నిజం? ఏ కారణాల వల్ల నెలసరి సరిగ్గా రాదు? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? – పీఆర్, కరీంనగర్ నెలసరి సరిగా రావాలంటే, మెదడు నుంచి, అండాశయాల నుంచి విడుదలయ్యే హార్మోన్స్fsh, lh, tsh, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్. సక్రమంగా విడుదల అవ్వాలి. అలాగే గర్భాశయం లోపలి పొర సరిగా ఏర్పడాలి. మెదడులో లోపాలు, థైరాయిడ్ సమస్య, మానసిక ఒత్తిడి, అండాశయాలలో నీటి బుడగలు, తిత్తులు, సిస్ట్లు, గర్భాశయంలో టీబీ, అధికబరువులాంటి అనేక కారణాల వల్ల హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి నెలసరులు సరిగ్గా రాకపోవచ్చు. కేవలం ఎక్కువగా స్వీట్లు తీనడం వల్ల పీరియడ్స్ క్రమం తప్పవు. స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల ఎక్కువ బరువు పెరుగుతారు కాబట్టి అధిక బరువు వల్ల హార్మోన్లలో తేడా ఏర్పడి పీరియడ్స్ క్రమం తప్పవచ్చు. నీ బరువు గురించి రాయలేదు. నువ్వు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి పీరియడ్స్ ఎందుకు రావట్లేదు అని తెలుసుకోవడానికి, థైరాయిడ్, పెల్విక్ అల్ట్రాసౌండ్ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకొని కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు. పీరియడ్స్ సక్రమంగా రావాలంటే సరైన వ్యాయామాలు చేయడం, బరువు మితంగా ఉండేట్లు చూసుకోవడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా లేకుండా ఉండటం, ఆహారాలలో అన్నం (కార్బోహైడ్రేట్స్) తక్కువ తిని, ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పండ్లు ఎక్కువ తీసుకోవడం వల్ల బరువు ఎక్కువ పెరగకుండా ఉంటారు. ∙కడుపులో బిడ్డ లోపాలను గుర్తించే సాంకేతికజ్ఞానం మనకు అందుబాటులో ఉందా? గర్భస్థ శిశువుల లోపాలను సవరించే వీలుంటుందా? తెలియజేయగలరు. – జి.సుధ, కర్నూలు తల్లి గర్భంలో అండం, శుక్రకణం అనే రెండు కణాల కలయికతో పిండం ఏర్పడడం మొదలయ్యి తొమ్మిది నెలలపాటు అనేక రూపాంతరాలు చెందుతూ శిశువు పెరుగుతుంది. ఈ సమయంలో తెలియని అనేక కారణాల వల్ల, శిశువులో జన్యుపరమైన సమస్యలు, అవయవ లోపాలు, అవయవాల పనితీరులో లోపాలు ఏర్పడవచ్చు.గర్భంలో బిడ్డలోని అన్ని లోపాలను నూటికి నూరుశాతం గుర్తించలేము. 90 శాతం మటుకే అల్ట్రా స్కానింగ్ వల్ల గుర్తించవచ్చు. వీటిని గుర్తించడానికి నిపుణులైన డాక్టర్లు, మంచి స్కానింగ్ మెషిన్ అవసరం. ఇప్పుడు మనకు ఉన్న సాంకేతికజ్ఞానంతో 90 శాతం లోపాలను తెలుసుకోవచ్చు.తల్లి అధిక బరువు ఉన్నా, పొట్టలో కొవ్వు ఉన్నా, బిడ్డ పొజీషన్ సరిగ్గా లేకపోయినా, ఉమ్మనీరు తక్కువ ఉన్నా, ఇంకా కొన్ని పరిస్థితుల్లో కొన్ని లోపాలు సరిగ్గా కనిపించకపోవచ్చు. గుండెకు సంబంధించిన రంధ్రాలు వంటి కొన్ని అవయవ లోపాలు సరిగ్గా తెలియకపోవచ్చు..మూడోనెలలో చేసే ఎన్టీ స్కాన్, ఐదోనెలలో టీఫా స్కాన్లలో 90శాతం అవయవ లోపాలను గుర్తించవచ్చు.సందేహాలు ఉన్నప్పుడు తల్లికి యంఆర్ స్కాన్ ద్వారా కూడా కొన్నిలోపాలను నిర్ధారణ చేయడం జరుగుతుంది. డౌన్స్‌సిండ్రోమ్ వంటి జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలను కనిపెట్టడానికి ఇప్పుడు తల్లికి మూడో నెలలో డబుల్ మార్కర్ టెస్ట్, అయిదవ నెలలో క్వాడ్రుపుల్ టెస్ట్ మొదలైనవి అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిస్తే అవి నిర్ధారణ చేసుకోవడానికి కొరియాన్ విల్లస్ బయాప్సీ, అమ్నియోసెంటిసిస్ అని బిడ్డ చుట్టూ ఉన్న ఉమ్మనీరును కొంచెం తీసి కారియోటైపింగ్ పరీక్షకు పంపి నిర్ధారణ చేయడం జరుగుతుంది. వీటిలో కూడా అన్నీ జన్యుపరమైన సమస్యలు తెలియవు. మూగ, చెవుడు, మెదడు పనితీరు, అవయవాల పనితీరువంటివి ఎటువంటి పరీక్షలలోను ముందుగా తెలియవు. బిడ్డ పుట్టిన తరువాతే బయటపడతాయి.ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫీటల్ స్పెషాలిటీతో కొన్ని అవయవలోపాలకు, బిడ్డ కడుపులో ఉన్నప్పుడే, అవి సరిచేయడానికి కొన్ని రకాల ఆపరేషన్లు కొంతమంది అనుభవం ఉన్న డాక్టర్లు చేయడం జరుగుతుంది. నేను ప్రెగ్నెంట్. ఇటీవల ఒక మ్యాగజిన్లో "bump bounce" అనే పదం చదివాను. ఇది తగ్గడానికి ప్రత్యేకమైన వర్కవుట్లు ఉన్నట్లు చదివాను. దీని గురించి సవివరంగా తెలియజేయగలరు. – బి.వందన, ఆలమూరు గర్భంతో ఉన్నప్పుడు కడుపు పెరుగుతూ, ఎత్తుగా ముందుకు ఏర్పడుతుంది. దీనినే ‘ప్రెగ్నెన్సీబంప్’ అంటారు. కడుపు పెరిగే కొలది బరువు నడుం మీద, పెల్విక్ కండరాలు, ఎముకల మీద పడుతుంది.దీనివల్ల నెలలు నిండే కొద్ది నడవడానికి ఇబ్బంది ఏర్పడుతుంది.నడుం నొప్పులు, కాళ్లనొప్పులు... అటు ఇటు తిరగడానికి ఇబ్బంది పడుతుంటారు. నడిచేటప్పుడు కడుపు అటు ఇటు ఊగుతుంటుంది. దీనినే ‘బంప్ బౌన్స్’ అంటారు. దీని నుంచి పూర్తిగా ఉపశమనం దొరకడం కష్టం. కాకపోతే కొన్ని వ్యాయామాలు, కొంత విశ్రాంతి వంటి జాగ్రత్తలు తీసుకుంటూ చాలావరకు ఇబ్బందుల నుండి ఉపశమనం దొరుకుతుంది.పొట్టకు సపోర్ట్‌గా ఉండే బట్టలు వేసుకోవడం, రోజు అరగంట నడక, చిన్న చిన్న వ్యాయామాలు, యోగావంటివి చేయడం వల్ల ఎముకలు, కండరాలు, జాయింట్లు రిలాక్స్ అవుతాయి. నొప్పి, ఇబ్బందుల నుంచి ఊరట కలుగుతుంది. మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ అధికబరువు పెరగకుండా చూసుకోవాలి. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్,హైదరాబాద్ -
ఎందుకో... ఆందోళన
నా వయసు 27 సంవత్సరాలు. నేను ప్రెగ్నెంట్. ఎందుకో తెలియదు, అప్పుడప్పుడు అకారణ ఆందోళనకు గురువుతుంటాను. ‘బిహేవియరల్ యాక్టివేషన్’ అనే టెక్నిక్‌తో ఈ సమస్యకు దూరం కావచ్చు అని ఒక ఫ్రెండ్ సలహా ఇచ్చింది. వైద్యుల సలహా తీసుకున్న తరువాతే అలాంటి టెక్నిక్లను పాటించాలనే ఉద్దేశంతో మీ సలహా కోరుతున్నాను. – జి.రూప, ఆలేరు ప్రెగ్నెన్సీ సమయంలో జరిగే హర్మోన్ల మార్పుల వల్ల, శరీరంలో జరిగే మార్పుల వల్ల ఎన్నో తెలియని భయాలు, సందేహాల వల్ల కొందరు గర్భవతులు అప్పుడప్పుడూ ఆందోళనకు గురవుతుంటారు. ఆందోళన, డిప్రెషన్‌కు గురయ్యేవారు బిహేవియరల్ యాక్టివేషన్ అనే టెక్నిక్‌లో శిక్షణ తీసుకున్న థెరపిస్ట్‌లు లేదా స్పెషలిస్ట్‌లను సంప్రదించినప్పుడు వారి సమస్యను తెలుసుకోవడమే కాకుండా, అది ఏ సమయంలో ఉంటుంది? దానిని అధిగమించడానికి ఏమి చేస్తారు, చెయ్యాలనుకుంటున్నారు..వంటి ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రాలను వారికి ఇచ్చి, వారు ఇచ్చే జవాబును బట్టి, వారికి అనేక సలహాలను, ఉదాహరణలను ఇవ్వడం జరుగుతుంది. అలాగే రోజువారీగా వారు ఏ రోజుకా రోజు సలహాలను పాటించారా లేదా, ఆందోళనను మళ్ళించడానికి వారికి ఇష్టమైన పనులను, వారు చెయ్యాలనుకొని చెయ్యలేని పనులను చెయ్యడానికి ఉత్సాహపరచడం వంటి మాట సహాయం చేస్తూ వారికి ధైర్యాన్ని నింపి, వారి డిప్రెషన్‌ను దూరం చేస్తారు. ఈ బిహేవియరల్ యాక్టివేషన్ టెక్నిక్‌లో మందులు వాడడం జరగదు కాబట్టి ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. కాబట్టి సందేహం లేకుండా దీనిని పాటించవచ్చు. ఒక సమస్య గురించి డాక్టర్ని సంప్రదించినప్పుడు మెనోపాజ్ సమయంలో టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్ల శాతం తగ్గడం వల్ల సమస్యలు వస్తాయని చెప్పారు. మెనోపాజ్ సమయంలో ఈ హార్మోన్లు ఎందుకు తగ్గుతాయి. ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? నివారణకు ఏంచేయాలి? – కె.మాలతి, హైదరాబాద్ ఆడవారిలో గర్భాశయం ఇరువైపుల ఉన్న అండాశయాల నుంచి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్, కొద్దిగా టెస్టోస్టిరాన్ హార్మోన్స్ సక్రమంగా విడుదల అవుతుంటాయి. సాధారణంగా ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి వారి జన్యువుల స్థితిని బట్టి అండాశయాల పనితీరు మెల్లగా అది సంవత్సరాల నుంచి తగ్గడం మొదలయ్యి, 50 దగ్గర పడేకొద్ది వాటి పనితీరు చాలావరకు, పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఈ హార్మోన్స్ విడుదల చాలావరకు తగ్గిపోతుంది. దీనివల్ల పీరియడ్స్ పూర్తిగా ఆగిపోయి, మెనోపాజ్ దశను చేరుకుంటారు.కొందరిలో 55 సంవత్సరాలకు కూడా మెనోపాజ్ దశకు చేరుకుంటారు. కొందరిలో 40 సంవత్సరాలకే పీరియడ్స్ ఆగిపోయి ప్రిమెచ్యూర్ మెనోపాజ్‌కు చేరుకుంటారు.ఈస్ట్రోజన్ హార్మోన్ ఆడవారి శరీరంలో అనేక రకాల ప్రక్రియలకు అవసరం. ఇది శరీర, ఎముకల, చర్మ, దృఢత్వానికి, పీరియడ్స్ సక్రమంగా రావడానికి, రొమ్ములు, జననేంద్రియాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. కొద్ది మోతాదులో విడుదలయ్యే టెస్టోస్టిరాన్ హార్మోన్ (ఇది ఎక్కువగా మగవారిలో ఉంటుంది). ఆడవారి కండరాల, ఎముకల దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి, లైంగిక తృప్తికి ఉపయోగపడుతుంది.ప్రకృతిపరంగా, సహజసిద్ధంగానే వయసు పెరిగే కొద్ది అవయవాల పనితీరు ఎలా మందగిస్తుందో, అలాగే అండాశయాల పనితీరు తగ్గి హోర్మోన్స్ తగ్గిపోయి మెనోపాజ్ దశకు చేరుతారు. దీనిని నివారించలేము. కాకపోతే ఇవి తగ్గడం వల్ల వచ్చే సమస్యలకు డాక్టర్ సలహా మేరకు, సరైన పౌష్టికాహారం, వ్యాయామాలు, యోగా, ధ్యానం అవసరమైతే హార్మోన్స్ మందుల ద్వారా తీసుకోవడం వల్ల సమస్యల తీవ్రతను తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. నేను బాగా సన్నగా ఉంటాను. ‘ఈవిడే సన్నగా ఉంటుంది. ఇక పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందో’ అని కొందరు చాటు మాటుగా అనుకుంటున్నారు. తల్లి సన్నగా ఉండడం వల్ల పుట్టబోయే బిడ్డకు ఏవైనా సమస్యలు ఎదురవుతాయా? ఈ సమయంలో బరువు పెరిగే ప్రయత్నాలు చేయవచ్చా? – పి.నీరజ, శ్రీకాకుళం గర్భాశయంలో పెరిగే బిడ్డకు పోషకపదార్థాలు తల్లి తీసుకునే ఆహారం, మాయ ద్వారా తల్లి నుండి బిడ్డకు రక్తనాళాల ద్వారా చేరుతుంది. కొందరిలో మాయ సరిగా లేకపోవడం, రక్తనాళాలు సరిగా వ్యాకోచించకుండా ఉండటం, వాటిలో రక్తం గూడు కట్టడం వంటి అనేక కారణాల వల్ల బిడ్డకు రక్తసరఫరా లేకపోవడం వల్ల బిడ్డ బరువు పెరగక పోవచ్చు.అలాగే గర్బాశయం చిన్నగా ఉండడం, దాని పొరల్లో లోపాలు ఉన్నప్పుడు కూడా అవి సరిగా సాగకుండా బిడ్డ బరువు పెరగకపోవచ్చు.కొందరిలో తల్లిలో జన్యుపరమైన కారణాల వల్ల కూడా బిడ్డ బరువు ఎక్కువగా పెరగకపోవచ్చు. తల్లిలో ఇన్ఫెక్షన్స్, బీపీ పెరగటం వంటి అనేక కారణాల వల్ల బిడ్డ బరువు పెరగకపోవచ్చు. తల్లి ముందు నుంచి సన్నగా ఉన్నా, గర్భం దాల్చిన తర్వాత పైన చెప్పిన కారణాలు ఏమీ లేకపోతే డాక్టర్ పర్యవేక్షణలో పౌష్టికాహారం బాగా తీసుకుంటూ ఐరన్, కాల్షియం, విటమిన్ టాబ్లెట్స్ సరిగ్గా వాడుతుంటే బిడ్డ మంచి బరువుతో పుడతాడు.అలాగే ఆహారంలో అన్నంతో పాటు ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, పాలు,పండ్లు, డ్రైఫ్రూట్స్ వంటి పౌష్టికాహారం కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది. అలాగే మాంసహారులయితే, రోజు ఒక గుడ్డు, మాంసం, చేపలు వంటివి తీసుకోవచ్చు.తల్లి సన్నగా ఉండి పైన జాగ్రత్తలు తీసుకోకపోతే, బిడ్డ బరువు తక్కువగా పుట్టడం, తల్లిలో బిడ్డలో కూడా రక్తహీనత, ఎముకలు బలహీనంగా ఉండడం, కాన్పు సమయంలో ఇబ్బందులు వంటి సమస్యలు ఏర్పడవచ్చు. డా‘‘ వేనాటి శోభబర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
అమ్మాయికి నెలసరి సరిగా రావడంలేదు
హోమియో కౌన్సెలింగ్స్ మా అమ్మాయి వయసు 23 ఏళ్లు. హార్మోన్ లోపం వల్ల ఆమెకు నెలసరి సరిగా రావడం లేదు. ఆమె బరువు పెరుగుతోంది. హోమియోపతిలో సరైన చికిత్స చెప్పండి. – పి. అనసూయ, కావలి మనలోని హార్మోన్లు అనేక కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతను, ఆకలిని, మానసిక స్థితి, నిద్ర, దాహం, ఉద్వేగాలను అదుపులో ఉంచుతాయి. ఇవి రక్తం ద్వారా ప్రవహిస్తూ, నిర్దిష్ట అవయవాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి చాలా సూక్ష్మమోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ శరీరంపై చాలా ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. సాధారణ జీవక్రియలైన జీర్ణక్రియ మొదలుకొని, శరీరక, మానసిక ఎదుగుదల, మానసిక సమతౌల్యత వంటి అంశాలన్నింటికీ ఇవి తోడ్పడతాయి. హైపోథైరాయిడ్, పీసీఓడీ, సంతాన లేమి, డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక జబ్బులన్నీ హార్మోన్ అసమతౌల్యత వల్ల వచ్చేవే. ఈ హార్మోన్ల సమతౌల్యత దెబ్బతిన్నప్పుడు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు. అలాగే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, ప్రోలాక్టిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు మహిళల్లో నెలసరి, సెకండరీ సెక్సువల్ లక్షణాలు, సంతానోత్పత్తి, ప్రసవం వంటి అంశాలకు ఉపకరిస్తాయి. ఈ హార్మోన్ల అసమతౌల్యత ఉన్న మహిళల్లో నెలసరి సమస్యలు, అవాంఛిత రోమాలు, సంతానలేమి వంటి సమస్యలు కనిపిస్తాయి. మెనోపాజ్, నెలసరి వచ్చే సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల వేడి ఆవిర్లు, మానసిక అశాంతి, నీరసం, కీళ్లనొప్పులు కూడా వస్తాయి. నెలసరి సరిగా రాకపోవడంతో పాటు, బరువు పెరుగుతోందని చెబుతున్నారు కాబట్టి మీ అమ్మాయిలో హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడి ఉండవచ్చు. ముందుగా ఆమెలోని సమస్యను తెలుసుకోవాలి. అయితే మీరు చెబుతున్న లక్షణాలను చూస్తే ఆమెకు థైరాయిడ్‌కు సంబంధించిన సమస్య ఉండవచ్చని అనిపిస్తోంది. దీన్ని నిర్ధారణ చేశాక ఆమె సమస్యను నయం చేసేందుకు హోమియోలో కాల్కేరియా కార్బ్, థైరాయిజమ్ ఐయోడమ్, బ్రోమియమ్, సల్ఫర్ వంటి మంచి మందులే అందుబాటులో ఉన్నాయి. మీరొకసారి మీ అమ్మాయిని అనుభవజ్ఞులైన హోమియో వైద్యులకు చూపించండి. ఆమె సమస్యను పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ సెబోరిక్ డర్మటైటిస్‌కు చికిత్స ఉందా? నా వయసు 46 ఏళ్లు. నాకు చాలాకాలంగా తలలో, ముఖం మీద, కనురెప్పల దగ్గర చర్మం ఎర్రటి, తెల్లటి పొరలతో దురదగా ఉంటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే సెబోరిక్ డర్మటైటిస్ అని చెప్పారు. మందులు వాడితే సమస్య తగ్గుతోంది, కానీ మళ్లీ కొంతకాలానికే తిరగబెడుతోంది. అసలు సమస్య ఎందుకు వస్తోంది? హోమియోలో ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి. – ఎన్. గోపాలరావు, చీరాల చర్మంలో సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఉండే భాగాలు ఎర్రగా మారడంతో పాటు, దురదతో ఈ వ్యాధి కనిపిస్తుంటుంది. సాధారణంగా ఇది దీర్ఘకాలిక సమస్య. ఇది 30 నుంచి 70 ఏళ్ల వారితో పాటు మూడు నెలల శిశువులలోనూ కనిపిస్తుంది. వీళ్లలో 6 నుంచి 12 నెల వయసు వరకు ఇది తగ్గిపోతుంటుంది. తలలో వచ్చే తేలికపాటి సెబోరిక్ డర్మటైటిస్‌ని చుండ్రు అని అంటారు. ఇది ఎక్కువ మందిని వేధించే సమస్య. ఈ వ్యాధి ఎక్కువగా తల, ముఖం, ఛాతీ, వీపు, చెవి లోపలి భాగాలతో పాటు వెంట్రుకలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో కనిపిస్తుంటుంది. కారణాలు : ఈ వ్యాధికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ చర్మంలోని సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఉన్న చోట మలసేజియా అనే ఒక రకం జీవజాతి అధికంగా అభివృద్ధి చెంది కొన్ని హానికరమైన పదార్థాలను విడుదల చేస్తుంది. ఈ అంశం సెబోరిక్ డర్మటైటిస్‌ను ప్రేరేపిస్తుంది. ►రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల్లోనూ, పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల్లోనూ ఇది కనిపించే అవకాశాలు ఎక్కువ. ►మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేవారిలో, జిడ్డు చర్మం ఉండేవారిలో ఇది కనిపించే అవకాశాలు అధికం. ►వాతావరణం, హార్మోన్ సమస్యలు, కొన్ని జన్యుపరమైన అంశాలు ఈ వ్యాధిని ప్రభావితం చేయవచ్చు. లక్షణాలు : ►సెబోరిక్ డర్మటైటిస్ లక్షణాలు క్రమంగా ఏర్పడతాయి. చర్మంపై ఎర్రటి, తెల్లటి లేదా పసుపు వర్ణంలో పొరలు ఏర్పడతాయి. దురద, మంట కనిపిస్తుంటుంది. నిర్ధారణ : వ్యాధి లక్షణాలను బట్టి దీన్ని గుర్తించవచ్చు. ఇది సోరియాసిస్‌ను పోలి ఉంటుంది. కానీ సోరియాసిన్ ముఖాన్ని ప్రభావితం చేయకపోవడం వల్ల ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించవచ్చు. మీరు ఆందోళన చెందకండి. ఆధునిక జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందింపజేయడం ద్వారా సెబోరిక్ డర్మటైటిస్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ స్పాండిలోసిస్ తగ్గుతుందా? నా వయసు 42 ఏళ్లు. గత ఆర్నెల్ల నుంచి తీవ్రమైన మెడనొప్పి, నడుమునొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అంటున్నారు. మందులు వాడుతున్నా, నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. ఈ సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? – ఆర్. లక్ష్మణరావు, కరీంనగర్ ఎముకల అరుగుదల వల్ల వచ్చే ఒక రకమైన ఆర్థరైటిస్‌ను స్పాండిలోసిస్ అంటారు. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అని పేర్కొంటారు. కారణాలు : ►కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు. జాయింట్స్‌లోని ద్రవం తగ్గడం వల్ల ∙స్పైన్ దెబ్బతినడం వల్ల ∙వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి ఉండే దారి సన్నబడి, నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. లక్షణాలు : ►సర్వైకల్ స్పాండిలోసిస్: మెడనొప్పి, తలనొప్పి తల అటు–ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది. ►లంబార్ స్పాండిలోసిస్: నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి మొదలై పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి సప్లై అయ్యే చోటు మొద్దుబారడం, నడవడానిక్కూడా ఇబ్బందిపడటం వంటి సమస్యలు వస్తాయి. నివారణ : వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం. చికిత్స: రోగి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని ఇచ్చే కాన్స్టిట్యూషనల్ చికిత్సతో వారిలోని రోగనిరోధక శక్తి క్రమంగా పెరిగి, సమస్య పూర్తిగా తగ్గుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
13 ఏళ్లయినా పసివాడే..!
అసలే నిరుపేదలు.. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి వారిది... అలాంటి వారికి పెద్ద కష్టం వచ్చింది... తమ కుమారుడికి 13 ఏళ్లు వచ్చినా పసివాడిలాగే ఉన్నాడు.. ఎదుగుదల లేదు.. దీంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు... ఆస్పత్రుల్లో చూపించుకోవడానికి అంతో ఇంతో ఉన్న డబ్బును అయిపోగొట్టుకున్నారు... ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. బద్వేలు (అట్లూరు) :బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని రిక్షా కాలనీలో నివాసం ఉంటున్న దాసరి ఆదిలక్ష్మి, వెంకటసుబ్బయ్యకు ఉండటానికి ఇల్లు లేదు. అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి నలుగురు పిల్లలు. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మొదటి కుమారుడు పేరు వెంకటసుబ్బయ్య. ఆ పిల్లోడు పుట్టగానే మొదట కుమారుడని పుట్టాడని తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. అయితే వారి ఆనందం ఎక్కువ కాలం నిలవ లేదు. ఆ బాలుడు పుట్టుకతో బాగా ఉన్నప్పటికీ.. రాను రాను ఎదుగుదల లేదు. అలాగే మాటలు రాకపోవడంతోపాటు కాళ్లు సన్నగిల్లి పోతున్నాయి. ఆకలి వేస్తుందనే విషయం కూడా సైగల ద్వారా చెప్పడం లేదు. వారి ఆర్థిక స్థోమతను బట్టి సాధారణ ఆస్పత్రుల్లో చూపించారు. ఫలితం లేకపోయింది. ఇది చాలా అరుదుగా వచ్చే వ్యాధి అని వైద్యులు తెలిపారు. పెద్ద నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో చూపిస్తే పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోపూట గడవని స్థితిలో ఉన్న వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. పింఛన్ ఇప్పించండి మహాప్రభో కనీసం కదలలేని, మెదలలేని స్థితిలో ఉన్న తమ కుమారుడికి పింఛన్ ఇవ్వాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఈ విషయాన్ని విన్నవించడానికి అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తహసీల్దార్‌ను కలవడానికి వారు వచ్చారు. తమ పరిస్థితిని వివరించారు. ప్రభుత్వం తరఫున ఏదైనా సాయం చేయాలని కోరారు. దాతలు స్పందించండి పిల్లవాడిని ఇంట్లో వదిలి కూలీ పనులకు వెళ్లలేక, ఇంట్లో ఉండలేక వారు సతమతమవుతున్నారు. చేతిలో చిల్లి గవ్వలేక, ఇంటి అద్దె కట్టుకోవడం కూడా కష్టమైంది. ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే తమ కుమారుడి ఆరోగ్యం బాగు చేయించుకుంటామని వారు కోరుతున్నారు. -
ప్రాణాయామంతో ఏకాగ్రత మెరుగు
యోగాలో ప్రాణాయామం అతి ముఖ్యమైన ప్రక్రియ. ఊపిరి తీసుకోవడం, వదలడంలో ఒక క్రమపద్ధతిని అనుసరించే ప్రాణాయామం ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలుసు కానీ.. ఎలా అన్నది మాత్రం ఇప్పటివరకూ చాలామందికి తెలియదు. డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజ్ శాస్త్రవేత్తలు ఈ లోటును భర్తీ చేశారు. ప్రాణాయామం మెదడులోని లోకస్ కొయిరులియస్ ప్రాంతంపై ప్రభావం చూపుతుందని గుర్తించారు. ఈ మెదడు ప్రాంతం నోరా అడ్రినలిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒత్తిడి పెరిగినప్పుడు ఈ హార్మోన్ ఎక్కువగాను, ఆలోచనలు మందకొడిగా సాగినప్పుడు తక్కువగానూ ఉత్పత్తి అవుతుందని, ఈ రెండింటి ఫలితంగా ఏకాగ్రత కోల్పోతామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మైకేల్ మెలిన్ఛుక్ తెలిపారు. ఊపిరి తీసుకుని, వదిలేసే క్రమంలో శరీరంలోని కార్బన్డయాక్సైడ్ మోతాదుల్లో మార్పులు వస్తాయని.. ఈ మార్పులకు స్పందిస్తూ లోకస్ కొయిరులియస్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తూంటుందని వివరించారు. గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు ఎక్కువగా, వదిలేసినప్పుడు తక్కువగా పనిచేసి మన ఉద్వేగాలను, ఏకాగ్రతను కూడా ప్రభావితం చేస్తుందని చెప్పారు. మతిమరపుతో బాధపడే వారికి, ఏకాగ్రత కుదరని పిల్లలకు మెరుగైన చికిత్స కల్పించేందుకు తమ పరిశోధన ఉపకరిస్తుందని మైకేల్ తెలిపారు. -
కొవ్వు కరిగించే హార్మోన్లు గుర్తించారు
ఊబకాయం పాటు మధుమేహ సమస్యను పరిష్కరించేందుకు శాస్త్రవేత్తలకు సరికొత్త ఆయుధం లభించింది. కొవ్వును వేగంగా కరిగించగల, మధుమేహాన్ని తగ్గించగల రెండు హార్మోన్లను కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. నోటమ్, లిపోకాలిన్–5 అనే పేరున్న ఈ రెండు హార్మోన్లతో ఇతర ఉపయోగాలు ఉన్నట్లు వీరు అంటున్నారు. అవయవాలు, కండరాల మధ్య సమాచార ప్రసారం ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు జరిగిన ప్రయత్నంలో భాగంగా తాము ఈ హార్మోన్లను గుర్తించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తెలిపారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో ముందుగా తాము హార్మోన్ల వ్యవస్థ ఎలా పనిచేస్తోందో గుర్తించామని, ఆ తరువాత మనుషుల్లో, ఎలుకల్లోని హార్మోన్ల మధ్య సారూప్యతను తెలుసుకున్నామని చెబుతున్నారు. చాలా హార్మోన్లు మనుషుల్లో, ఎలుకల్లో ఒకే తీరున పని చేస్తున్నట్లు తెలిసిందని, దీనిని బట్టి ఎలుకలలో నోటమ్, లిపోకాలిన్–5లు చేస్తున్న పని మానవులలోనూ సాధ్యమన్నది స్పష్టమైనట్లు వివరించారు. శరీరానికి పోషకాలు ఒంటబట్టేందుకు కూడా ఈ రెండు హార్మోన్లు ఉపయోగపడుతున్నట్లు తమకు తెలిసిందని, గుండె జబ్బులు, మధుమేహం ఉన్న వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని తెలిపారు. -
అందుకు కారణం హర్మోన్లు కాదట....
యుక్తవయస్సుకు రాగానే పిల్లల్లో ఎన్నో మార్పులు. అన్ని రోజులు తల్లిదండ్రుల మాటే వేదంగా భావించే అంతర్ముఖుల్లో కూడా ఎన్నో మార్పులు వస్తుంటాయి. మంచి చేదుగా అనిపిస్తుంది, చెడు త్వరగా ఆకర్షిస్తుంది. స్నేహితులే ప్రపంచమవుతారు. అంతకుముందు చూడని కొత్త లోకం కనిపిస్తుంది. మొత్తనికి ప్రపంచమే చాలా కొత్తగా కనిపిస్తుంది. కొత్త అలవాట్లు వచ్చి చేరతాయి. రాముడు మంచి బాలుడు అని అనిపించుకున్న వారిని సైతం చెడ్డవారిని చేస్తుంది కౌమార దశ. ఇన్నిరోజులు ఈ మార్పులకు కారణం హర్మోన్ల ప్రభావం అనుకున్నాం. కానీ ఇది నిజం కాదట. కౌమార దశలో పిల్లల సామాజిక ప్రవర్తనలో మార్పుకు కారణం పునరుత్పిత్తి హర్మోన్ల ప్రభావం కాదట. ఈ విషయాన్ని బఫెలో యూనివర్శీటీకి చెందిన ప్రముఖ రచయిత మాథ్యూ పాల్ వెల్లడించారు. యుక్తవయసులో శరీరంలో వచ్చే అన్నిమార్పులకు కారణం పునరుత్పత్తి హర్మోన్లే. అయితే ఇంతకాలం కౌమార దశలో వచ్చే సామాజిక ప్రవర్తనలో మార్పుకు కూడా ఈ హర్మోన్లే కారణం అనుకున్నాం. కానీ పాల్, అతని సహచరులు కలిసి చేసిన నూతన పరిశోధన ఇది అబద్దమని నిరూపించింది. ఇంతకు ముందు ప్రయోగాలు నిరూపించలేని అనేక విషయాలను వీరు రుజువు చేశారు. అందుకోసం వీరు నూతన విధానాన్ని కనుగొన్నారు. దాని ప్రకారం ప్రతి ఒక్కరిలో యుక్తవయస్సులో వచ్చే మార్పులును వీరు పరిశీలించారు. ‘ఈ దశలో సంక్లిష్ట ఆలోచన విధానం అభివృద్ధి చెందుతుంది. అనేక మానసిక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రమాదకర ప్రవర్తన విధానం ముఖ్యంగా మాదకద్రవ్యాల వినియోగం వంటి అంశాలు ప్రారంభదశలో ఉంటాయి. సామాజిక ప్రవర్తన అంశానికి వచ్చినట్లయితే, అన్ని రోజులు తల్లిదండ్రులను అంటిపెట్టుకుని ఉన్నవారు పూర్తిగా వేరే ప్రపంచం వైపు ఆకర్షితులౌతారు. అక్కడ వారు కలుసుకునే వ్యక్తులను బట్టి వారి సామాజిక ప్రవర్తన ఉంటుంది. పునరుత్పత్తి హర్మోన్ల ప్రధాన విధి ప్రత్యుత్పత్తి సామర్ధ్యం, రెండో దశ లైంగిక లక్షణాలను పెంపొందించడం, గోనడల్ హర్మోన్స్ పెరుగుదల వంటివి మాత్రమే’ అని తమ పరిశోధనలో తేల్చారు. ప్రస్తుతం పాల్ రూపొందించిన విధానం వల్ల పునరుత్పత్తి హర్మోన్లు కలిగించే మార్పులేంటో సులభంగా గుర్తించవచ్చు. యవ్వనము విశాలమైనదని, దీనిలోనే కౌమార దశ కూడా ఉంటుందని దాంతో పాటు యుక్తవయసులో జరిగే మేథోవికాసం, సామాజిక, భావోద్వేగ మార్పులను కూడా కలిగి ఉంటాయని పాల్ చెప్పారు. ఈ మార్పులను గుర్తించడం వల్ల కౌమార దశ అభివృద్ధికి బాధ్యత వహించే అంతర్లీన యంత్రాంగాలను అర్థం చేసుకోవడంతో పాటు జీవితంలో మున్ముందు వచ్చే మానసిక ఆరోగ్య సమస్యలకు కారణాలను కూడా విశ్లేషించవచ్చన్నారు. -
హైపో థైరాయిడిజమ్ తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 33 ఏళ్లు. నేను ఈ మధ్య బరువు పెరుగుతున్నాను. నా పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం వల్ల టీఎస్‌హెచ్ పరీక్ష చేశారు. హైపోథైరాయిడిజమ్ ఉందని తెలిసింది. నేను జీవితాంతం మందులు వాడాల్సిందేనా? హోమియోలో మందులు ఉన్నాయా? – శకుంతల, రాజమండ్రి మానవ శరీరంలో థైరాయిడ్ గ్రంథి ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. శరీరంలోని వివిధ రకాల జన్యుక్రియల సమతౌల్యతకు టీ3, టీ4, టీఎస్‌హెచ్ హార్మోన్లు ఉపయోగపడతాయి. హైపోథైరాయిడ్ బరువు పెరిగే సమస్య. హైపోథైరాయిడిజమ్ అనేది మానవ శరీరంలో థైరాయిడ్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి తగ్గడం వల్ల వస్తుంది. ఈ ఆధునిక కాలంలో సుమారు మూడు శాతం మంది హైపోథైరాయిడిజమ్‌తో బాధపడుతున్నారు. ఆకస్మికంగా బరువు పెరగడం ఈ సమస్యను సూచిస్తుంది. హైపోథైరాయిడిజమ్ ఏ వయసులోని వారికైనా రావచ్చు. స్త్రీలలో, పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. శిశువుల్లో క్రెటినిజం అనే ఒక రకమైన హైపోథైరాయిడిజమ్ వస్తుంది. థైరాయిడిజమ్ నుంచి తగినంత మోతాదులో హార్మోన్ టీ3, టీ4 ఉత్పన్నం కావడానికి మన శరీరంలో శరీరంలో చాలినంత అయోడిన్, టీఎస్‌హెచ్ (మెదడులోని పిట్యుటరీ గ్రంథి నుంచి ఉత్పన్నమయ్యే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) అవసరం. అయోడిన్ లోపించడం వల్ల హైపోథైరాయిడిజమ్ సమస్య వస్తుంది. లక్షణాలు: ∙బరువు పెరగడం, కాళ్లు చేతుల్లో నీరు చేరడం ∙జుట్టు రాలడం, చర్మం పొడిబారినట్లు ఉండటం, మలబద్దకం ∙గొంతు బొంగురుపోవడం, తొందరగా అలసిపోవడం, కండరాల నొప్పి, ∙కోపం, అలసట, నిరాశ, కీళ్లనొప్పి ∙రుచి, వాసన, స్పర్శ తగ్గడం ∙సంతానలేమి, నీరసం, డిప్రెషన్ నిర్ధారణ పరీక్షలు: రక్తపరీక్షలు, థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్. చికిత్స: హైపోథైరాయిడిజమ్ సమస్యను అదుపు చేసే ఔషధాలు మందులు హోమియో విధానంలో అందుబాటులో ఉన్నాయి. అయితే అవి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. హోమియోపతిలో సాధారణంగా కాల్కేరియా కార్బ్, కాల్కేరియా ఫాస్, అయోడమ్, థైరాడినమ్, స్పాంజియా వంటి మందులను రోగుల లక్షణాలను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడటం వల్ల హైపోథైరాయిడిజమ్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ గాల్‌బ్లాడర్‌లో రాళ్లు... ఆపరేషన్ తప్పదా? గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నేను నెల రోజుల క్రితం హెల్త్ చెకప్ చేయించుకున్నాను. అందులో కడుపు స్కానింగ్ చేశారు. ఆ పరీక్షలో నాకు గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. కానీ నాకు కడుపునొప్పి ఎప్పుడూ రాలేదు. కొందరు ఆపరేషన్ చేయించుకోవాలని అంటున్నారు. దయచేసి నాకు సరైన సలహా ఇవ్వగలరు. – ఉష, కొత్తగూడెం మీరు చెప్పినదాని ప్రకారం మీకు అసింప్టమాటిక్ గాల్‌స్టోన్ డిసీజ్ ఉన్నదని చెప్పవచ్చు. ఇలా గాల్బ్లాడ్ర్లో రాళ్లు ఉండి వ్యాధి లక్షణాలు లేనివారిలో నూటికి ఇద్దరికి మాత్రమే వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. అంటే 98 శాతం మంది నార్మల్‌గానే ఉంటారు. కాబట్టి మీరు ఒకసారి మీ దగ్గరలోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి, మీ రిపోర్టులు చూపిస్తే సరైన సలహా ఇవ్వగలరు. నా వయసు 35 ఏళ్లు. నేను నిద్రపోయే సమయంలో ఛాతీ కింద ఎడమవైపున గత వారం నుంచి నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే లివర్ సైజు పెరిగిందని చెప్పారు. లివర్ సైజు ఎందుకు పెరుగుతుందో దయచేసి తెలియజేయండి. – మనోహరరావు, కోదాడ మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే మీ కాలేయ పరిమాణం పెరిగిందనే తెలుస్తోంది. దీనికి వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకునేవారిలో, స్థూలకాయం ఉన్నవారిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి లివర్ సైజ్ పెరిగే అవకాశం ఉంది. మీ లేఖలో మీరు స్థూలకాయులా లేదా మీకు ఆల్కహాల్ అలవాటు ఉందా లేదా తెలియజేయలేదు. కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు, హైపటైటిస్–బి, హెపటైటిస్–సి వంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లివర్ పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు రాసిన కాలేయం పరీక్షలో అన్నీ నార్మల్‌గా ఉన్నాయి కాబట్టి అలాంటివి ఉండే అవకాశం తక్కువ. ముందుగా మీలో లివర్ పరిమాణం ఎంత పెరిగిందో తెలుసుకోడానికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించండి. మీకు వస్తున్న కడుపులో నొప్పి ఎడమవైపు ఛాతీ కింది భాగంలో వస్తోంది కాబట్టి ఒకసారి ఎండోస్కోపీ కూడా చేయించగలరు. ఈ రెండు పరీక్షల వల్ల మీలో కాలేయం పరిమాణం పెరగడానికి కారణంతో పాటు నొప్పి ఎందుకు వస్తోంది అన్న విషయం కూడా తెలిసే అవకాశం ఉంది. మీకు మద్యం తాగడం, పొగతాగడం వంటి అలవాట్లు ఉంటే వాటిని వెంటనే మానేయండి. నా వయసు 43 ఏళ్లు. నేను చాలా ఏళ్లుగా ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నాను. మూడు నెలల నుంచి మందులు వాడుతున్నాను. అయినా కడుపునొప్పి తగ్గడం లేదు. దీనికి తోడు మలబద్ధకం, తలనొప్పి సమస్యలు కూడా ఉన్నాయి. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – దామోదర్‌రావు, కాకినాడ మీ లేఖలో మీరు ఎండోస్కోపీ చేయించారా లేదా అన్న విషయం రాయలేదు. ఇక రెండో అంశం మలబద్ధకం పాటు కడుపునొప్పి ఉంటోందని రాశారు. మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీ సమస్య ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ కావచ్చని అనిపిస్తోంది. ఆ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరు పేర్కొన్న లక్షణాలు కనిపిస్తాయి. మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడం, యాంగై్జటీ, ఒత్తిడి వల్ల ఇది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. మీ సమస్య అదుపులోకి వస్తుంది. డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
నా వయసు 32 ఏళ్లు పీరియడ్స్ సక్రమంగా ...
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 32 ఏళ్లు. నేను ఈ మధ్య బరువు పెరుగుతున్నాను. నా పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం వల్ల టీఎస్‌హెచ్ పరీక్ష చేశారు. హైపోథైరాయిడిజమ్ ఉందని తెలిసింది. నేను జీవితాంతం మందులు వాడాల్సిందేనా? హోమియోలో మందులు ఉన్నాయా? - సునీత, హైదరాబాద్ మానవ శరీరంలో థైరాయిడ్ గ్రంథి ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. శరీరంలోని వివిధ రకాల జన్యుక్రియల సమతౌల్యతకు టీ3, టీ4, టీఎస్‌హెచ్ హార్మోన్లు ఉపయోగపడతాయి. హైపోథైరాయిడ్ బరువు పెరిగే సమస్య. హైపోథైరాయిడిజమ్ అనేది మానవ శరీరంలో థైరాయిడ్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వల్ల వస్తుంది. ఈ ఆధునిక కాలంలో సుమారు మూడు శాతం మంది హైపోథైరాయిడిజమ్‌తో బాధపడుతున్నారు. ఆకస్మికంగా బరువు పెరగడం ఈ సమస్యను సూచిస్తుంది. హైపోథైరాయిడిజమ్ ఏ వయసులోని వారికైనా రావచ్చు. స్త్రీలలో, పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. శిశువుల్లో క్రెటినిజం అనే ఒక రకమైన హైపోథైరాయిడిజమ్ వస్తుంది. థైరాయిడిజమ్ నుంచి తగినంత మోతాదులో హార్మోన్ టీ3, టీ4 ఉత్పన్నం కావడానికి మన శరీరంలో శరీరంలో చాలినంత అయోడిన్, టీఎస్‌హెచ్ (మెదడులోని పిట్యుటరీ గ్రంథి నుంచి ఉత్పన్నమయ్యే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) అవసరం. అయోడిన్ లోపించడం వల్ల హైపోథైరాయిడిజమ్ సమస్య వస్తుంది. లక్షణాలు: బరువు పెరగడం, కాళ్లు చేతుల్లో నీరు చేరడం జుట్టు రాలడం, చర్మం పొడిబారినట్లు ఉండటం, మలబద్దకం గొంతు బొంగురుపోవడం, తొందరగా అలసిపోవడం, కండరాల నొప్పి కోపం, అలసట, నిరాశ, కీళ్లనొప్పి రుచి, వాసన, స్పర్శ తగ్గడం సంతానలేమి, నీరసం, డిప్రెషన్. నిర్ధారణ పరీక్షలు: రక్తపరీక్షలు, థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్. చికిత్స: హైపోథైరాయిడిజమ్ సమస్యను అదుపు చేసే ఔషధాలు హోమియో విధానంలో అందుబాటులో ఉన్నాయి. అయితే అవి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. హోమియోపతిలో సాధారణంగా కాల్కేరియా కార్బ్, కాల్కేరియా ఫాస్, అయోడమ్, థైరాడినమ్, స్పాంజియా వంటి మందులను రోగుల లక్షణాలను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడటం వల్ల హైపోథైరాయిడిజమ్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ ఇప్పటికే రెండుసార్లు హార్ట్ ఎటాక్... కార్డియాలజీ కౌన్సెలింగ్ మా నాన్నగారి వయసు 54 ఏళ్లు. ఆర్నెల్ల క్రితం హార్ట్ ఎటాక్ వచ్చింది. అప్పుడు యాంజియోగ్రామ్ చేయించి, రెండు స్టెంట్స్ వేయించి, మందులు వాడుతున్నాం. కొద్దిరోజుల క్రితమే మళ్లీ తీవ్రమైన గుండెపోటు వచ్చింది. మరోసారి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు మా నాన్న గుండెకు సంబంధించిన మూడు ప్రధాన రక్తనాళాలు పూర్తిగా బ్లాక్ అయ్యాయని, అలాగే ప్రధానమైన ‘లెఫ్ట్ వెంట్రికిల్’ కూడా చాలావరకు దెబ్బతిని బ్లాక్ అయ్యిందని తెలిపారు. దాంతో మేము ఆందోళనకు గురవుతున్నాం. సాధారణంగా మూడోసారి హార్ట్ ఎటాక్ వచ్చిందంటే మనిషి మీద ఆశ వదులుకోవాల్సిందేనని అంటుంటారు. మా నాన్నగారికి ఇప్పటికే రెండుసార్లు హార్ట్ ఎటాక్ వచ్చింది కాబట్టి మాకు తగిన సలహా ఇవ్వగలరు. - రవికుమార్, నిజామాబాద్ మూడోసారి హార్ట్ ఎటాక్ వస్తే ప్రాణాలకే ముప్పు అనే అపోహే చాలామందిలోనూ ఉంటుంది. కానీ వాస్తవం ఏమిటంటే గుండె స్వతహాగా పనిచేసే స్థితిలో ఉందంటే దాన్ని కాపాడుకునే అత్యాధునిక వైద్యవిధానాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక విషయం వివరించాలి. ఒకసారి స్టెంట్ వేసిన తర్వాత మరోసారి గుండెపోటు అనేది సాధారణంగా రాదు. ఒకవేళ స్టెంట్ వేసిన తర్వాత మరోసారి గుండెపోటు రావడం సాధారణంగా జరగదు. ఒకవేళ పేషెంట్ పొగతాగడం లేదా మద్యం తీసుకోవడం వంటి దురలవాట్లను కొనసాగిస్తున్నా లేదా ఆహారపు అలవాటు జాగ్రత్తల విషయంలో వైద్యుల సూచనల మేరకు నడుచుకోకుండా ఇష్టానుసారం వ్యవహరించినా ఇలాంటి విపరీతమైన పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. మీ నాన్నకు రెండుసార్లు హార్ట్ ఎటాక్... అది కూడా చాలా తక్కువ సమయంలో రావడంతో గుండె పనిచేయలేని స్థితికి చేరుకుందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిని ‘హార్ట్ ఫెయిల్యూర్’ అంటారు. హార్ట్ ఎటాక్ తర్వాత గుండెకు సంబంధించిన మూడు ప్రధాన రక్తనాళాలు పూర్తిగా దెబ్బతినడంతో ఆ బ్లాక్ అలాగే వృద్ధి చెంది స్కార్లా ఏర్పడి... మీ నాన్నగారికి ‘హార్ట్ ఫెయిల్యూర్’ స్థితి వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి కేసుల్లో ఒక్కొక్కసారి గుండె దాదాపుగా ఆగిపోయే స్థితిని కూడా ఎదుర్కోవచ్చు. అలాంటిప్పుడు పరిస్థితి మరింత చేయిదాటిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ మీ నాన్నగారి లాంటి వాళ్ల గుండె, ఊపిరితిత్తులను మొదట స్టెబిలైజ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సకు సిద్ధం చేయాలి. పేషెంట్ బతికేందుకు తక్కువ అవకాశాలే ఉన్నప్పటికీ వైద్యశాస్త్రంలోని అత్యాధునిక చికిత్స ప్రక్రియలలో ‘ఎంటార్ట్ ఇరెక్టోమీ’ విత్ ‘లెఫ్ట్ వెంట్రిక్యులార్ రిపేర్’ వంటి అత్యాధునికమైన శస్త్రచికిత్స విధాలను అవలంబించి హార్ట్ ఫెయిల్యూర్ వల్ల కొన ఊపిరితో ఉన్నవారిని సైతం దక్కించుకునే అవకాశాలు ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. వాటితో పేషెంట్ గుండెలోని ప్రధాన రక్తనాళాల్లో పూడికనూ తొలగించవచ్చు. దాంతో వారం పది రోజుల్లోనే గుండె సాధారణ స్థితికి వచ్చి మామూలుగా పనిచేయడం మొదలవుతుంది. కాబట్టి మీరు భయాందోళనలు పెట్టుకోకుండా నిపుణులైన కార్డియోథొరాసిక్ సర్జన్ ఉన్న ఆసుప త్రిలో మీ నాన్నగారికి చికిత్స అందిస్తూ, నిపుణుల సూచనలను తప్పక పాటించండి. డాక్టర్ పి.వి. నరేశ్ కుమార్ సీనియర్ హార్ట్ట్రాన్స్ప్లాంట్ అండ్ కార్డియో థొరాసిక్ సర్జన్ యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ -
ఆరోగ్యకరమైన బిడ్డల కోసం నాన్న సత్ప్రవర్తన కూడా ప్రధానమే!
పరిపరిశోధన మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ అది గర్భధారణ మీద, పిండం ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందన్నది తెలిసిన విషయమే. కానీ పిండం ఆరోగ్యంపై తండ్రి వయసు, అతడి జీవనశైలి కూడా ప్రభావం చూపుతాయని పరిశోధకులు తెలుసుకున్నారు. సాధారణంగా 35 ఏళ్లు దాటిన మహిళలకు గర్భధారణ జరిగితే బిడ్డలకు కొన్ని జన్యుపరమైన ఆరోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఎక్కువ అన్నది చాలా మందికి తెలిసిన సంగతే. అందుకే కాబోయే తల్లి సరైన వయసులో గర్భధారణ జరిగేలా చూసుకోవడం, ఆమె మానసికంగానూ ఉల్లాసంగా ఉండటం, ఆమె ఉండే పరిసరాలు ఆరోగ్యకరంగానూ, హార్మోన్లు సమతౌలంతో ఉండేలా జాగ్రత్త పడటం అవసరమని డాక్టర్లు చెబుతుంటారు. ఇదే విషయం కాబోయే నాన్నలకూ వర్తిస్తుందంటున్నారు అధ్యయనవేత్తలు. వారు పేర్కొన్న అంశాల ప్రకారం... తండ్రుల జీవనశైలి, అతడి వయసు జన్యువులపై ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు తల్లికి ఎలాంటి దురలవాట్లు లేకపోయినా తండ్రికి ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటే పిండానికి ‘ఫీటల్ ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఎఫ్‌ఏఎస్‌డీ)’ వచ్చే అవకాశాలు ఎక్కువ. పైగా ఇలాంటి పిల్లలు పెద్దయ్యాక తాగుబోతులుగా మారేందుకు 75 శాతం వరకు అవకాశం ఉంది. తండ్రికి ఆల్కహాల్, పొగ తాగే అలవాటు ఉంటే పుట్టబోయే బిడ్డ తక్కువ బరువుతో ఉండటం, మెదడు పరిమాణం తగ్గడం, మానసిక వికాసం ఆలస్యంగా జరగడం వంటి ప్రమాదాలు ఉన్నాయి. అలాగే పెద్ద వయసులో తండ్రి అయిన వారి పిల్లలకు స్కీజోఫ్రీనియా, ఆటిజమ్ వంటి సమస్యలూ వచ్చే అవకాశం ఉంది. తండ్రి వయసు ఎంతగా పెరుగుతుంటే బిడ్డలకు ఈ సమస్యలు వచ్చే అవకాశం అంతగా పెరుగుతుంది. అంతేకాదు... తండ్రికి స్థూలకాయం ఉంటే దాని దుష్ర్పభావం బిడ్డల్లో కణజాలంలో జీవక్రియలపైనా ఉండవచ్చు. బిడ్డకు భవిష్యత్తులో స్థూలకాయం రావచ్చు. డయాబెటిస్, క్యాన్సర్ వంటి జబ్బులు వచ్చే అవకాశం కూడా ఎక్కువే. అంతేకాదు... కాబోయే తండ్రిపై ఒత్తిడి కూడా పిల్లల మానసిక ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపవచ్చు. తమ అధ్యయనంలో తేలిన ఈ ఫలితాలన్నింటినీ అధ్యయనవేత్తలు ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ స్టెమ్ సెల్స్’ అనే పరిశోధన పత్రికలో ప్రచురించారు. తండ్రికి ఆల్కహాల్, పొగ తాగే అలవాటు ఉంటే పుట్టబోయే బిడ్డ తక్కువ బరువుతో ఉండటం, మెదడు పరిమాణం తగ్గడం, మానసిక వికాసం ఆలస్యంగా జరగడం వంటి ప్రమాదాలు ఉన్నాయి. -
నేను అడ్రినల్ గ్రంథిని!
నా ప్రతి గ్రాములోనూ ఒక డైనమైట్ అంతటి శక్తి ఉంది. నేను కావాలనుకుంటే నా యజమానిని పిచ్చాసుపత్రికి పంపించే శక్తి ఉంది. కానీ అలా పంపించకూడని వివేచన కూడా ఉంది. అసలు నేనున్నాననే ఉనికి కూడా తెలియకుండా పనిచేస్తుంటాను. నేను ఆనంద్ అడ్రినల్ గ్రంథిని. అతడి కుడి మూత్రపిండం మీద నేనూ, మరో కిడ్నీ మీద నా సహచరుడు ఇద్దరం నిశ్శబ్దంగా రాజ్యమేలుతుంటాం. నా సైజు వేలికొన కంటే తక్కువ. నా బరువు ఒక నాణెం కంటే తక్కువ. కానీ దాదాపు 50 కి పైగా హార్మోన్లు, హార్మోన్ల లాంటి స్రావాలను తయారు చేస్తుంటాను. 28 గ్రాములను వెయ్యి భాగాలు చేస్తే అందులో ఒక వంతు ఎంత ఉంటుందో నేను స్రవించే స్రావాలూ అంతే ఉంటాయి. నా స్రావాలు చాలా తక్కువ... కానీ ఆనంద్ రోజులో చేసే చాలా పనులకు అవసరమైన హార్మోన్లు నాలోంచి విడుదల అవుతుంటాయి. నిర్మాణపరంగా నేనొక అద్భుతాన్ని... ఎందుకంటే ప్రతి నిమిషానికీ... నా బరువుకంటే ఆరురెట్లుకు మించి నాలో రక్తం ప్రవహించేలా నా నిర్మాణం ఉంటుంది. అంత ఎక్కువగా నాలో రక్తప్రవాహం కొనసాగుతుంటుంది. అంత పెద్దమొత్తంలో రక్తం ప్రవహించేందుకు వీలుగా, అతి సంక్లిష్టంగా నాలో రక్తనాళాలు అల్లుకుపోయి ఉంటాయి. ఆనంద్ దేహం పనిచేయడానికి, అతడి అవసరాలు తీరడానికి నాలో పదోవంతు చాలు. కానీ ఎంతో రిజర్వ్ ఉండేలా ప్రకృతి నన్ను నిర్మించింది. అలాగని ఏ కారణం వల్లనో లేదా ఏ శస్త్రచికిత్స వల్లనో నేను పదోవంతుకు తగ్గిపోతే ఆనంద్ చనిపోతాడు. అంతర్భాగం నుంచి ఒకటీ... బయటిపొర నుంచి మరొకటి నాలో కొన్ని రకాల హార్మోన్లు విడుదల అవుతాయి. కొన్ని నాలోని అంతర్భాగం నుంచి. మరికొన్ని నాలోని బయటి పొర నుంచి. నాలోని అంతర్భాగం నుంచి స్రవించాల్సిన స్రావం కోసం మెదడు నుంచి నేరుగా సంకేతాలు అందుతాయి. ఆనంద్కి ఏదైనా ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు, తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యే సమయంలో, క్లిష్టమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, కోపం; ఆవేశం వచ్చే సందర్భాల్లో ఇవి విడుదల అవుతాయి. అప్పుడు అతడు తీవ్రమైన ఉద్విగ్నతకు లోనవుతాడు. తీవ్రమైన భావోద్వేగానికీ, ఒత్తిడికీ గురవుతాడు. వీలైతే పోరాటానికి లేదా తప్పించుకోడానికి సిద్ధపడేలా ఉద్విగ్నుడవుతాడు. ఫైట్ లేదా ఫ్లైట్ ఈ రెండింటిలో ఏదో ఒకటి చేసేంతగా అతడి శరీరం ఉద్రేకపూరితమవుతుంది. నా అంతర్భాగం నుంచి వచ్చే కార్టిసాల్స్, అడ్రినలీన్, నార్-అడ్రినలిన్ అనే హార్మోన్లు అతడి రక్తప్రవాహంలోకి స్రవించడమే ఇందుకు కారణం. ఈ చర్యకు ప్రతిస్పందనగా అతడి కాలేయం రెడీ అవుతుంది. పోరాటానికో లేదా తప్పించుకుపోవడానికో అవసరమైన శక్తి అందించడానికి కాలేయం నుంచి చక్కెర స్రవిస్తుంది. ఆలా స్రవించిన చక్కెర వల్ల శరీరంలో శక్తి వెల్లువెత్తుంది. క్రమంగా నార్మల్స్థితి కోసం... అయితే అదే ఉద్విగ్న పరిస్థితి అదేపనిగా కొనసాగదు. ఇదే జరిగితే ఆనంద్ తన మృత్యువు వైపునకు పరుగుపెడతాడు. నాలోని అడ్రినల్ స్రావాలను ప్రేరేపించిన అంశమే అతడి మెదడులోని హైపోథలామస్నూ ప్రేరేపిస్తుంది. దాని నుంచి పిట్యుటరీ గ్రంథికీ, అక్కడి నుంచి మళ్లీ నాకు ఒక సందేశం అందుతుంది. పరిస్థితిని తన నియంత్రణలోకి తెచ్చుకొని క్రమంగా పరిస్థితులు మామూలు స్థితికి వచ్చేలా చేస్తాయి కొన్ని హార్మోన్లు. సక్రమమైన పనికి సమతౌల్యమే ప్రధానం నాలోని స్రావాలన్నీ అత్యంత సమతౌల్యంతో జరగాల్సిన అవసరం ఉంది. అలా సమతౌల్యంతో జరగకపోతే అది చాలా ప్రమాదం. నా అంతర్భాగం గాయపడి, అక్కడ ఉద్భవించాల్సిన హార్మోన్లు ప్రవించకపోతే ఆనంద్‌కు దాదాపు డజన్ వ్యాధులు ఒకేసారి వచ్చేస్తాయి. అతడిలో చర్మం నల్లబడుతుంది. కండరాలు చచ్చుబడిపోతుంటాయి. ఆకలి మందగిస్తుంది. వికారంగా ఉంటుంది. వాంతులూ అవుతాయి. నీళ్ల విరేచనాలు వస్తాయి. క్రమంగా ఆనంద్ నీరసించిపోయి మృత్యువాతపడతాడు. అయితే అదృష్టవశాత్తు ప్రస్తుతం అతడి పరిస్థితికేమీ ఢోకా లేదు. అతడిలోని అంతర్భాగం నశించిపోయినప్పుడూ... ఆ టైమ్‌లో బయటి నుంచి కూడా అవసరమైన హార్లోన్లు అందనప్పుడు మాత్రమే ఈ పరిస్థితి వస్తుంది. నాలోంచి అవసరమైన స్రావాలు తగ్గినప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో... నాలోంచి పరిమితికి మించి హార్మోన్ స్రవించినా ఆనంద్‌కు అంతే హాని కలుగుతుంది. ఉదాహరణకు నాలోని అంతర్భాగం నుంచి స్రవించే కార్టిసాల్ అనే హార్మోన్ సూదిమొనంతటి పరిమాణంలో ఎక్కువైనా దేహంలో చక్కెర పాళ్లు ఎక్కువగా పెరిగిపోతాయి. ఆ పరిస్థితి ఆనంద్ కండరాలు చచ్చుబడిపోయేలా కూడా చేయవచ్చు. రక్తపోటు పెరుగుతుంది. శరీరంలోని కండరాలు నీరసించి పోతాయి. ఎముకల శక్తి సన్నగిల్లుతుంది. అదే అల్డోస్టెరాన్ అనే మరో హార్మోన్ ఎక్కువైతే ఒంట్లోంచి పొటాషియమ్ ఎక్కువగా బయటకు పోయి... సోడియమ్ (ఉప్పు) దేహంలో ఎక్కువగా మిగిలిపోతుంది. దాని వల్ల రక్తపోటు (బీపీ) పెరగడం జరుగుతుంది. ఎన్ని మందులు వాడినా ఆ రక్తపోటు తగ్గదు. అలాగే నార్-ఎడ్రినలీన్, ఎడ్రినల్ హార్మోన్లు ఎక్కువైతే తీవ్రమైన రక్తపోటు, తలనొప్పి, రక్తపోటు వల్ల మెదడులో, పొట్టలో రక్తస్రావం జరగవచ్చు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్తపోటు తీవ్రంగా పెరుగుతుంది. అతడి చేతులు, వేళ్లు వణుకుతాయి. వేలిచివర్లు మొద్దుబారిపోతాయి. తలనొప్పి వదలకుండా వస్తుంది. సాధారణంగా దేహంలో ట్యూమర్లు పెరిగినప్పుడు కూడా ఈ స్థితి వస్తుంది. అలాంటి స్థితి రాకుండా ఆనంద్ చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఏ విషయానికీ ఎక్కువగా దుఃఖించకూడదు. ఎవరిపట్లా తీవ్రమైన ద్వేషం కూడదు. ఎవరినీ అసహ్యించుకోవడం సరికాదు. మరీ పట్టరానంత అంటేంత కోపం వద్దు. మరీ స్థితప్రజ్ఞతతో కాకపోయినా కాస్త స్థిమితంగా ఉండాలి. యాభై ఫ్యాక్టరీలకు సరిసమానం చాలా కాలం క్రితం వరకూ నేనొక రహస్యాన్ని. నా గురించి పెద్దగా లోకానికి తెలియదు. అప్పటికి వాళ్లకు తెలిసన విషయం ఒక్కటే. నేను చాలా కీలకమైన గ్రంథిని. నన్నూ, నా పార్ట్నర్ను తొలగిస్తే రోజుల వ్యవధిలోనే ఆనంద్ చనిపోతాడు. నేను ఉత్పత్తి చేసే హార్మోన్లను బయటి నుంచి ఇస్తుంటే కొంతకాలం మాత్రం బతుకుతాడేమో! అదీ చాలా నీరసంగా... నిస్సత్తువగా. ఆ తర్వాత మెల్లగా నా గుట్టు మట్లు తెలుసుకోవడం ప్రారంభించారు. నా సైజ్‌కు నేను ఉత్పత్తి చేసే దాదాపు 50కి పైగా హార్మోన్లు స్రవించాలంటే అన్నే సంఖ్యలో కెమికల్ ఫ్యాక్టరీలు పెట్టాలి. వాళ్లకు నా గురించి తెలిశాక వాళ్లు గ్రహించిన విషయం ఏమిటంటే... నేను ఉత్పత్తి చేసే కార్టికో స్టెరాయిడ్ లాంటి స్రావాన్నే దాదాపు 100 కు పైగా వ్యాధుల్లో మందుగా ఇస్తారు. గౌట్ నుంచి మొదలుకొని ఆస్తమా వరకు అనేక వ్యాధులకు అదే మందు. మరీ ముఖ్యమైన మూడు అంశాలు నా బయటి పొర నుంచి స్రవించే హార్మోన్లను మూడు విభాగాలుగా చేయవచ్చు. మొదటి విభాగానికి చెందిన హార్మోన్లు కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లకు సంబంధించిన జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేస్తాయి. రెండోవి ఆనంద్ దేహంలోని నీటి పాళ్లు, మినరల్స్ సమతౌల్యంగా ఉండేందుకు దోహదపడతాయి. ఇక మూడో విభాగానికి చెందినవి కీలకమైన సెక్స్ సంబంధించిన కార్యకలాపాలు కొనసాగేలా చూస్తాయి. ఇవన్నీ నిల్వ ఉంచేందుకు వీలుగాని హార్మోన్లు. అలా నిరంతరం పనిచేస్తుంటాయి. అంటే రెండు గంటల క్రితం నాలోంచి వెలువడ్డ స్రావాలు తొలగిపోయి ఇప్పటికప్పుడు తాజా (ఫ్రెష్) స్రావాలు వచ్చి చేరుతుంటాయి. డాక్టర్ శ్రీదేవి కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదర్‌గూడ, హైదరాబాద్ -
పెరిగే వయసు... తగ్గే అవకాశాలు
సందేహం నా వయసు 29. ఈ మధ్యనే పెళ్లయ్యింది. నాకు కొన్నాళ్లు సంతోషంగా ఎంజాయ్ చేసి, తర్వాత పిల్లల్ని కనాలని ఉంది. కానీ త్వరగా బిడ్డని కనకపోతే ఇబ్బందులు వస్తాయని మావాళ్లు అంటున్నారు. అది నిజమేనా? ఇంకొక సంవత్సరం ఆగవచ్చా? లేక వెంటనే పిల్లల్ని కనేయమంటారా? ఒకవేళ ఆగవచ్చు అంటే ప్రత్యేక జాగ్రత్తలేమైనా తీసుకోవాలా? - పి.సారిక, ఖమ్మం సాధారణంగా ఆడవారిలో 22 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు పిల్లల్ని కనడానికి కావలసిన ప్రక్రియకు సంబంధించిన హార్మోన్స్, అవయవాలు, అండాశయాల పనితీరు.. అన్నీ సక్రమంగా ఉంటాయి. 30 సంవత్సరాలు దాటే కొద్దీ ప్రక్రియ మెల్లగా మందగించడం ప్రారంభమవుతుంది. దాంతో హార్మోన్ల తేడాలు, అండం నాణ్యత కొద్దికొద్దిగా తగ్గడం మొదలవుతుంది. దానివల్ల అబార్షన్లు, పిండంలో అవయవ, జన్యుపరమైన లోపాలు తలెత్తే అవకాశాలు పెరుగుతాయి. 33 సంవత్సరాలు దాటితే ఈ సమస్యలు ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. మీకు ఇప్పుడు 29 సంవత్సరాలు కాబట్టి, మీకు సంతోషంగా గడపాలని ఉంటే ఆరునెలలు గ్యాప్ తీసుకుని త్వరగా గర్భం కోసం ప్రయత్నించడం మంచిది. ఇంకా ఎక్కువ అంటే ఒక సంవత్సరం, అంతకంటే ఎక్కువ కాలం ఆగకపోవడమే మంచిది. ఈ గ్యాప్ కోసం మీరు low dose oral contraceptive pillsప్రతినెలా పీరియడ్ మొదలైన మూడో రోజు నుంచి 21 రోజుల వరకు వాడొచ్చు. లేదా మీవారు కండోమ్స్‌ను జాగ్రత్తగా వాడుకోవచ్చు. కానీ కండోమ్స్ ఫెయిలై గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఫెయిలైనా.. గర్భం ఉంచుకునే ఉద్దేశం ఉంటే కండోమ్స్ వాడొచ్చు. నా వయసు 20. ఆరోగ్యంగానే ఉంటాను. అయితే ఈ మధ్య నా రొమ్ముల్లో తేడా గమనించాను. ఎడమ రొమ్ము కాస్త చిన్నగా ఉంది. అలాగే అందులో చిన్న చిన్న గడ్డలు రెండు ఉన్నాయి. దాంతో అనుమానం వచ్చి డాక్టర్ దగ్గరకు వెళ్లాను. పరీక్షలు చేసి ఏ సమస్యా లేదు, క్యాన్సర్ కాదని చెప్పారు. అయితే పిల్లలు పుట్టినప్పుడు పాలు రాకపోతే వేరే పరీక్షలు చేస్తాం అన్నారు. అంటే ఏంటి? ఒకవేళ పాలే రాకపోతే ఏం పరీక్షలు చేస్తారు? అదేమైనా ప్రమాదకరమైన సమస్యా? - చంద్రకళ, మెయిల్ కొందరిలో రొమ్ములు పెరిగే క్రమంలో, ఒకటి పెద్దదిగా మరొకటి చిన్నదిగా ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎటువంటి సమస్యా ఉండదు. దాని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొందరి రొమ్ముల్లో అటు ఇటు కదలాడే నొప్పి లేని చిన్న గడ్డలు ఏర్పడుతుంటాయి (హార్మోన్ల తేడా వల్ల ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి - ఇవి క్యాన్సర్ గడ్డలు కావు). వాటినే ఫైబ్రో అడినోమా (Fibro adenoma)అంటారు. అవి పెరగకుండా ఉంటే ఫర్వాలేదు. కానీ అవి మరీ పెద్దగా పెరిగిపోతుంటే మటుకు ఆపరేషన్ చేసి తీసివేయవలసి వస్తుంది. ఆ గడ్డలు చిన్నగా ఉంటే పాలు రావటానికి ఎలాంటి సమస్యా ఉండదు. రొమ్ము చిన్నదైనా బిడ్డ దాన్ని చీకే కొద్దీ, పాలగ్రంథులు ప్రేరణకు గురై పాల ఉత్పత్తి జరుగుతుంది. అంతేకానీ పాలు రాకపోతే ప్రత్యేకంగా దానికోసమంటూ ఎలాంటి పరీక్షలు లేవు. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. - డా.వేనాటి శోభ లీలా హాస్పిటల్ మోతీనగర్, హైదరాబాద్ -
చక్కెర వ్యాధిగ్రస్తుల వ్యాయామంలో జాగ్రత్తలు...
హోమియో కౌన్సెలింగ్ మా అమ్మాయి వయసు 24 ఏళ్లు. హార్మోన్ లోపం వల్ల ఆమెకు నెలసరి సరిగా రావడం లేదు. ఆమె బరువు పెరుగుతోంది. హోమియోపతిలో సరైన చికిత్స చెప్పండి. - రాజేశ్వరి, కర్నూలు మనిషి జీవించడానికి శ్వాస ఎంత ముఖ్యమో, ఆరోగ్యంగా ఉండటానికి హోర్మోన్లు అంతే ముఖ్యం. గర్భాశయంలో పిండం ఏర్పడినప్పట్నుంచీ జీవితాంతం హార్మోన్లు తమ ప్రభావం కలిగి ఉంటాయి. మెదడులోని హైపోథెలామస్, పిట్యూటరీ గ్రంథులు శరీర కణాల క్రమబద్ధీకరణలో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ హార్మోన్లే శరీర ఉష్ణోగ్రతను, ఆకలిని, మానసిక స్థితి, నిద్ర, దాహం, ఉద్వేగాలను అదుపులో ఉంచుతాయి. ఇవి రక్తం ద్వారా ప్రవహిస్తూ, నిర్దిష్ట అవయవాలను ప్రభావితం చేస్తాయి. ఇవి సూక్ష్మమోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ శరీరంపై ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్లయిన టీ3, టీ4... థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతాయి. వీటిలో అసమతౌల్యత ఏర్పడితే హైపోథైరాయిడిజమ్, హైపర్‌థైరాయిడిజమ్, గాయిటర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు వస్తాయి. అలాగే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, ప్రోలాక్టిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు మహిళల్లో నెలసరి, సెకండరీ సెక్సువల్ లక్షణాలు, సంతానోత్పత్తి, ప్రసవం వంటి అంశాలకు ఉపకరిస్తాయి. ఈ హార్మోన్ల అసమతౌల్యత వల్ల మహిళల్లో నెలసరి సమస్యలు, అవాంఛిత రోమాలు, సంతానలేమి వంటి సమస్యలు కనిపిస్తాయి. మెనోపాజ్, నెలసరి వచ్చే సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల వేడి ఆవిర్లు, మానసిక అశాంతి, నీరసం, కీళ్లనొప్పులు కూడా వస్తాయి. నెలసరి సరిగా రాకపోవడంతో పాటు, బరువు పెరుగుతోందని చెబుతున్నారు కాబట్టి మీ అమ్మాయిలో హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడి ఉండవచ్చు. ముందుగా ఆమెలోని సమస్యను తెలుసుకోవాలి. అయితే మీరు చెబుతున్న లక్షణాలను చూస్తే ఆమెకు థైరాయిడ్‌కు సంబంధించిన సమస్య ఉండవచ్చని అనిపిస్తోంది. దీన్ని నిర్ధారణ చేస్తే ఆమెకు హోమియోలో కాల్కేరియా కార్బ్, థైరాయిజమ్ ఐయోడమ్, బ్రోమియమ్, సల్ఫర్ వంటి మంచి మందులే అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ఆమెను అనుభవజ్ఞులైన హోమియో వైద్యులకు చూపించండి. ఆమెకు ఉన్న వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్ నా వయసు 49 ఏళ్లు. గత ఐదేళ్లుగా నేను డయాబెటిస్తో బాధపడుతున్నాను. చక్కెర రోగులకు వ్యాయామం అవసరమని డాక్టర్లు చెప్పారు. డయాబెటిస్ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - వి. రాము, నూతనకల్లు డయాబెటిస్ ఉన్నవారు వ్యాయామం చేయడం వల్ల మరింత మెరుగైన జీవనాన్ని సాగించగలచు.అయితే దీనికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాయామానికి మీ శరీరం సంసిద్ధంగా ఉందా లేదా అని చూసుకోవాలి. ఇందుకోసం ముందుగా స్థూలకాయం ఉంటే దాన్ని తగ్గించుకోవాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. గుండెజబ్బులు ఏవైనా ఉన్నాయా లేదా అని కూడా తెలుసుకోవాలి. శరీరానికి ఏ మేరకు వ్యాయామం కావాలో, ఏ మేరకు సురక్షితమో కూడా తెలుసుకోవాలి. ఒకవేళ ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల కూడా కొన్ని సమస్యలు రావచ్చు. వ్యాయామానికి ముందుగా మీ ఒంట్లోని చక్కెర పాళ్లు తెలుసుకోవాలి. అవి మరీ ఎక్కువగా ఉన్నా, లేదా మరీ తక్కువగా ఉన్నా, రక్తంలోనూ, మూత్రంలోనూ కీటోన్స్ ఉన్నా శరీరకంగా ఎక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు చేయకూడదు. ఒకవేళ రక్తంలోని చక్కెరపాల్లు 100 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉంటే వ్యాయామానికి ముందు కాస్త ఉపాహారం తీసుకోవాలి. ఒకవేళ చక్కెర పాళ్లు త్వరత్వరగా పడిపోతుంటే తక్షణం చాక్లెట్ లాంటిది ఏదైనా తీసుకోవాలి. మన శరీరానికి, మెదడుకు అవసరమైనంత ద్రవాహారం అందేలా చేసుకోవాలి. ఇందుకోసం వ్యాయామానికి ముందర, వ్యాయామం తర్వాత తగినన్ని నీళ్లు తాగాలి. వ్యాయమాన్ని మొదలుపెట్టడానికి తక్షణం ముందుగానూ, వెంటనే ఆ తర్వాత నీళ్లు తాగకూడదు. వాతావరణంలో చాలా ఎక్కువగా వేడి ఉన్నప్పుడు శరీరం వెంటనే అలసిపోయే వ్యాయామాలు చేయకూడదు. ఎందుకంటే కొందరిలో శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధంగా ఉంచేంత సామర్థ్యం ఉండదు. అలాంటి సందర్భాల్లో చెమటను, రక్తప్రసరణను నియంత్రించే అటనామిక్ నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే బాగా వేడి ఎక్కువగా ఉండే రోజుల్లో ఆరుబయట వ్యాయామం చేయవద్దు. డయాబెటిస్ వల్ల ఒక్కోసారి పాదాలకు జరిగే రక్తప్రసరణ తగ్గి వాటిని అయ్యే గాయాలు తెలియకపోవచ్చు. పాదాలకు తిమ్మిర్లు (పెరిఫెరల్ న్యూరోపతి) రావచ్చు. మీ పాదాలకు ఎలాంటి గాయాలు కాకుండా చూసుకోవాలి. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉత్పన్నమైనా వెంటనే దగ్గరివారికి తెలియజేసేలా మీ మొబైల్‌ఫోన్‌ను వెంటే ఉంచుకోండి. మీ వ్యాయామం ప్లానింగ్‌లో మీ కుటుంబ సభ్యులనూ భాగం చేసుకోండి. ప్రతిరోజూ ఒకేలాంటి వ్యాయామాలు రిపీట్ కానివ్వకండి. ఒకరోజు బాగా శారీరక శ్రమ ఉన్నవి చేస్తే మరో రోజు తేలికపాటి వ్యాయామాలు చేయండి. ఇలా రోజువిడిచి రోజు వ్యాయామాలను మార్చుకోండి. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 36 ఏళ్లు. గృహిణిని. ఇటీవల ఎక్కువగా కీళ్లనొప్పులతో బాధపడుతున్నాను. సాధారణ కీళ్లనొప్పులే అని అంతగా పట్టించుకోలేదు. గత నాలుగు రోజులుగా కీళ్లనొప్పులతో పాటు వాపు, జ్వరం కూడా ఉంటోంది. నడుస్తున్నప్పుడు నొప్పితో సరిగా నడవలేకపోతున్నాను. రోజూ చేసుకునే పనులూ చేసుకోలేకపోతున్నాను. విశ్రాంతి తీసుకుంటే నొప్పి తగ్గినట్లు అనిపిస్తోంది. తర్వాత మళ్లీ కీళ్లనొప్పులు వస్తున్నాయి. నేను ఇదివరకెప్పుడూ ఇలాంటి లక్షణాలతో అనారోగ్యానికి గురికాలేదు. మొదటిసారి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. విశ్రాంతి తీసుకుంటే ఈ నొప్పులు తగ్గిపోతాయని తెలిసినవారు చెబుతున్నారు. ఈ సమస్య ఎందుకు వస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - అనసూయ, ఏలూరు మీరు తెలిపిన వివరాలను బట్టి మీకు ఆర్థరైటిస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థరైటిస్ ఉన్నవారిలో కీళ్లనొప్పులతో పాటు జ్వరం, వాపు కూడా ఉంటోంది. వయసు పైబడిన వారిలోనే ఆర్థరైటిస్ వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నవయసులో కూడా ఆర్థరైటిస్ బారిన పడుతున్నవారు ఉన్నారు. విశ్రాంతి తీసుకోవడం వల్ల అన్ని రకాల కీళ్ల నొప్పులు తగ్గవు. కీళ్లనప్పుల్లో చాలా రకాలు ఉంటాయి. కీళ్లనొప్పి రకాన్ని బట్టి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వారు సూచించిన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి. ఒకవేళ మీకు ఆర్థరైటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయినా ఆందోళన చెందకండి. ప్రస్తుతం ఆర్థరైటిస్‌కు మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆర్థరైటిస్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే దానిని సులువుగా నివారించవచ్చు. నిర్లక్ష్యం చేస్తే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆర్థరైటిస్‌లో చాలా రకాలు ఉంటాయి. ఆర్థరైటిస్ రకాన్ని బట్టి చికిత్స ఉంటుంది. మీరు తెలిపిన లక్షణాలు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో కనిపిస్తాయి. దీనికి సకాలంలో చికిత్స అందించడం ద్వారా కీళ్లనొప్పుల నుంచి త్వరగా ఉపశమనం పొందడంతో పాటు మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. -
టీనేజ్ పిల్లలు తిరగబడితే .....
పడలేరు... పడతారు! టీనేజ్‌లో మాట పడలేరు. స్వాభిమానం దెబ్బతింటే రాంగ్ రూట్లో పడతారు. చీటికీ మాటికీ టీనేజర్ మీద తిరగమాతలేస్తూ అవమానిస్తే... ఆ చిటపటలకి తిరగబడే పిల్లలు ఉన్నారు.... తిరిగిరాని పిల్లలున్నారు... ‘పేరెంట్స్ ఏది చేసినా ప్రేమతోనే చేస్తారు కదా’ అంటే చెల్లదు. అడాలసెన్స్లో... అంటే కౌమారంలో పిల్లల హార్మోన్స్ డిస్కో ఆడుతుంటాయి. వాటిని అవమానిస్తే తాండవిస్తాయి. ఇలాంటి రియాక్షన్ల వల్ల మీ ప్రేమ కాస్తా కక్షలా కనబడుతుంది. నెక్స్ట్ టైమ్ పిల్లల్ని మందలించేటప్పుడు కొంచెం మృదువుగా, ఇంకొంచెం సున్నితంగా... తాలింపేస్తే... ిపిల్లలకు కెరీర్ పట్ల, లైఫ్ పట్ల, రిలేషన్షిప్స్ పట్ల అభి‘రుచి’ భేషుగ్గా ఉంటుంది. సో... మై డియర్ పేరెంట్స్.... నాలుక మీద కొంచెం తేనె పూసుకోండి. చెప్పేది మంచికే అయినా, కారాలు మిరియాలు నూరకండి. గౌతమ్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ‘మీ అబ్బాయి ఎంతసేపూ స్నేహితులతోనే కబుర్లు, అస్సలు చదవడం లేదు’ అని చెప్పారు తల్లిదండ్రులతో టీచర్లు. ఇల్లు దాటకుండా బుద్ధిగా చదువుకోమని హెచ్చరించాడు తండ్రి. ఓ రోజు ఆఫీస్ నుంచి వచ్చాక గౌతమ్ కనిపించకపోవడంతో అతన్ని వెతుక్కుంటూ వెళ్లాడు తండ్రి. స్నేహితుల మధ్య నవ్వుతూ కనిపించాడు గౌతమ్. అంతే! తండ్రికి విపరీతమైన కోపం వచ్చింది. తన మాటంటే కొడుక్కి లెక్కలేకుండా పోయింది అనుకున్నాడు. ‘ఇంట్లో కుదురుగా చదవమంటే రోడ్డుపట్టుకు తిరుగుతున్నావా?’ అంటూ స్నేహితుల ముందే గౌతమ్‌ని కొట్టాడు తండ్రి. ఇంకోసారి మా అబ్బాయితో తిరిగితే మిమ్మల్నీ వదలను అంటూ గౌతమ్ స్నేహితులనూ నోటికొచ్చినట్టు తిట్టాడు. మరుసటి రోజు గౌతమ్ స్కూల్‌కి వెళ్లాడు. కానీ, తిరిగి ఇంటికి రాలేదు. తలిదండ్రులు కొడుకు కోసం వెతకని చోటంటూ లేదు. ఆర్నెల్ల తర్వాత గౌతమ్ దొరికాడు. పిల్లవాడిని దారిలో పెట్టడం ఎలాగ అని నిపుణులను సంప్రదించారు. ‘తప్పు గౌతమ్‌ది కాదు, స్నేహితుల ముందు అతడిని అవమానించిన మీదే’ అని వారు తల్లిదండ్రులకే కౌన్సెలింగ్ ఇచ్చారు నిపుణులు. ఇంటి కి వచ్చిన బంధువులకు ఇవ్వమని తల్లి ఇచ్చిన టీ ట్రే తీసుకొచ్చింది శ్రీజ. ఆ ట్రే చేయిజారి కిందపడింది. ‘ఏ పనీ సరిగ్గా చేతకాదు. ఎద్దులా పెరగావు తప్పితే...’ బంధువుల ముందే తిట్లదండకం మొదలుపెట్టింది తల్లి. ఏడుస్తూ లోపలికెళ్లిపోయింది శ్రీజ. ఇక ఇంటికి బంధువులెప్పుడు వచ్చినా గదిలోనుంచి బయటకు రావడమే మానేసింది శ్రీజ. ఇంట్లో పేరెంట్సే పదే పదే ఇలాంటి మాటలు అంటుండంతో ‘నాకు ఏ పనీ చేయడం సరిగ్గా చేతకాదు’ అనే భావనలో ఉండిపోయింది. ఈ ప్రభావం చదువుమీద పడింది. స్కూల్లో యాక్టివిటీస్‌లోనే వెనగ్గానే ఉండిపోయింది. ఎదిగే వయసులో పిల్లలను చిన్నచూపుతో చూస్తే జీవితాంతం చిన్నబోతారు. పెద్దవాళ్ల మీద ఎప్పటికీ తృణీకార భావంతోనే ఉంటారు. చాలామంది తమ పిల్లలను చిన్నవాళ్లుగానే భావిస్తూ ఏ చిన్న పొరపాటు చేసినా ఇతరుల ముందు, ఇంటికి వచ్చిన బంధువుల ముందు, వారి స్నేహితుల ముందు అవమానకరంగా మాట్లాడతారు. అలా ప్రవర్తిస్తున్నామనే విషయం కూడా పెద్దలకు తెలియదు. కానీ, ‘చిన్న మనసులు గాయపడి తాము పెద్దయ్యాక కూడా పెద్దవారిని క్షమించలేని స్థితికి చేరుకుంటారు. అంతేకాదు, పెద్దయ్యాక ఇంట్లోవారినే కాకుండా ఇతరులనూ చిన్నచూపు చూస్తారు. పిల్లలైనా సరే చిన్నబుచ్చే మాటలు మాట్లాడకూడదు. చాలామంది పేరెంట్స్ చేసే పొరపాటు ఏంటంటే- ‘ఫ్రెండ్స్ వల్ల పిల్లలు పాడైపోతున్నారు’ అనుకుంటారు. ఫ్రెండ్షిప్ను కట్‌చేస్తే సరైన దారిలోకి వస్తారు అనుకుంటారు. అందుకే, ఫ్రెండ్స్ ముందే అవమానిస్తారు. ఫ్రెండ్స్‌తో కలవనీయకుండా కట్టడి చేస్తారు. స్నేహాలు కట్ చేస్తే వారి మానసిక ఎదుగుదలా కట్ అయిపోతుంది. ఎవరితోనూ కలవని పిల్లల్లో ఒకలాంటి మొండితనం అలవడుతుంది. పెద్దలు చేయద్దు అన్నదే చేసి చూపించాలనుకుంటారు. అయితే, చెడు స్నేహాల వల్ల పిల్లలు చెడిపోతారు అని భయపడినప్పుడు సమాజంలో ఎలాంటి మనస్తత్వం గలవారుంటారో, ఎవరితో ఎలా మెలగాలో కొన్ని సంఘటనలు, తమ జీవితానుభవాలద్వారా చెప్పడం మంచిది. ఈ వయసులో పిల్లలకు తమ శరీర ఎదుగుదల పట్ల బోలెడు సందేహాలుంటాయి. కొందరు పెద్దవాళ్లకు చెప్పుకోగలుగుతారు. కొందరు తమలో తామే కుమిలిపోతుంటారు. ఈ వయసులో ఏదైనా తెలిసీ తెలియక చేసే పనుల వల్ల ‘భారీగా శరీరమైతే పెంచావు, బుర్రమాత్రం పెరగలేదు’ అనే తిట్లు సహజంగా వింటుంటాం. అప్పటికే ‘నేనెందుకు ఇలా ఉన్నాను’ అనే కన్ఫ్యూజన్లో ఉంటారు పిల్లలు. అలాంటప్పుడు పెద్దల నుంచి వచ్చే పరుషపు మాటల వల్ల సరైన ఆహారం తీసుకోరు. దీంతో అనారోగ్యసమస్యల బారిన పడతారు. వీరిలో శారీరక వయసు కాకుండా మానసిక పరిణితి చూడాలి. ఈ వయసులో పిల్లలకు ఊహలు ఎక్కువ, వేగం కూడా ఎక్కువ. నాకేం కాదు అనే పిచ్చి ధైర్యం ఉంటుంది. ఒక ప్రణాళిక లేకుండా వాస్తవానికి దూరంగా ఉంటారు. ‘నేను అలా అవుతాను, ఇలా సాధిస్తాను... కార్లు కొంటాను, బంగళాలు కడ్తాను’ వంటి పెద్ద పెద్ద కబుర్లు చెబుతారు. ఇలాంటప్పుడు పెద్దలు వెటకారంగా మాట్లాడేస్తారు. ‘ముందు ఈ పనిని సవ్యంగా చేయ్, మార్కులు సరిగ్గా తెచ్చుకుంటే అంతే చాలులే’ అంటుంటారు. చిన్న విషయానికే కోపం తెచ్చుకోవడం, అలగడం.. వంటివీ చూస్తుంటాం. ఈ నిరసనను పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ప్రణాళిక ఉంటే అనుకున్నది సాధిస్తావని ప్రోత్సహించాలి. తమను ఎదుటివారి ముందు అవమానకరంగా మాట్లాడుతున్నారనగానే ఉక్రోషంతో ఎదురు మాట్లాడుతారు. లేదంటే, ఏదో సందర్భంలో పెద్దవాళ్లను తిడతారు. దీంతో పిల్లల ప్రవర్తన పెద్దవాళ్లకు అర్థం కాదు. పిల్లలు దారి తప్పుతున్నారు అనే ఆందోళన, భయం లేకుండా పోతుంది.. ఇంకా బెదిరించాలి అనుకుంటారు. అందుకే ఇంకాస్త హెచ్చుస్వరంతో తిడతారు. కొడతారు. ఈ వయసు పిల్లలకు పెద్దల ఇలాంటి చేష్టలు అవమానకరంగా తోస్తాయి. తమ మీద ఈ పెద్దలకు ఏ మాత్రం ఇష్టం, ప్రేమ లేవు అనుకుంటారు. దీని వల్ల తమ బాధ్యతల పట్ల మరింత నిర్లక్ష్యంగా ఉంటారు. పిల్లల మానసిక ఎదుగుదలకు పెద్దల చిన్నచూపు ఓ చట్రంలా అడ్డుపడుతుంది. ‘ఈ ఏజ్‌లో పిల్లలు చాలా బద్ధకంగా ఉంటారు. ఉదయాన్నే నిద్రలేవకపోవడం, బద్దకంగా ఉండటాన్ని పెద్దలు ఇతరుల ముందు ఎత్తిచూపుతారు. ‘మా వాడంత లేజీబోయ్ ఎవరూ ఉండరు’ అని మాట్లాడేస్తుంటారు. ఇలాంటి మాటలు ఎంత యధాలాపంగా అన్నా అవి చిన్న మనసులను గాయపరుస్తూనే ఉంటాయి. ‘ఈ పెద్దవాళ్లు ఎలాగూ ఇలాంటే మాటలు అంటుంటారు’ అని చాలా తేలికగా తీసుకోవచ్చు. బద్ధకంగా ఉండే పిల్లలకు ‘నీ జీవితానికి నీవే కర్తవు’ అని భవిష్యత్తు పట్ల బాధ్యతను తెలియజేయాలి. ఆటలు, కళల్లో ప్రోత్సాహం కల్పిస్తే బద్ధకాన్ని వీడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవి గుర్తించండి... ఈ వయసులో శారీరక, మానసిక ఎదుగుదలలో హార్మోన్ల ప్రభావం ఎక్కువ. పిల్లలు తమకు నచ్చని విధంగా ప్రవర్తించినప్పుడు పెద్దలు గట్టిగా అరవడం, ఇతరుల ముందు చులకనగా మాట్లాడటం వెంటనే మానేయాలి.పిల్లలకు తల్లిదండ్రులే ఆదర్శం. మీరు ఎదుటివారిని గౌరవిస్తే మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. పిల్లలు ఎదుటివారి పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించినా, అవమానించినా చూసీ చూడనట్టు వదిలేయకూడదు. ఆకర్షణకు లోనవడం సహజం. వాటిని తమ జీవితానభవాల ద్వారా వివరించాలి. గాలి, నీరు, ఎండ.. తగినంత అందితేనే మొక్క ఎదుగుదల బాగుంటుంది. అలాగే పిల్లలకు చదువే లోకం కాదు. ఆటలు, ఉల్లాసంగా గడిపే సమయాలూ అవసరం. స్వతంత్రంగా ఎదగడానికి కావల్సిన స్వేచ్ఛకూడా ఇస్తుండాలి. అతి స్వేచ్ఛ వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తుండాలి. - గీతాచల్లా, సైకాలజిస్ట్ ‘సారీ’కి వెనకాడకూడదు... పిల్లలు తప్పులు చేస్తే, పెద్దలకు సారీ చెబుతారు. కానీ, పెద్దలు పిల్లలకు సారీ చెప్పడం ఏంటని అనుకోకూడదు. ఎదుటివారి ముందు పిల్లలను అవమానపరిచే మాట అంటే తర్వాతనైనా క్షమాపణ కోరాలి. పిల్లలకూ వ్యక్తిత్వం ఏర్పడే దశలో వచ్చే మార్పులను అర్థం చేసుకుంటూ వెళితే వారి బంధంలో గ్యాప్ ఏర్పడదు. పిల్లలు చిన్న తప్పు చేసినా పెద్దగా ఎత్తి చూపుతారు. కానీ, తప్పులు చేస్తూనే నేర్చుకోవాలి. వాటిని చూసీ చూడనట్టు ఉండాలి. అదే పట్టుకొని సాధించకూడదు. వారు హింసాత్మకధోరణికి చేరువకాకుండా, కుటుంబ బాంధవ్యాలకు దూరం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దలమీదే ఉంది. - సాక్షి ఫ్యామిలీ -
వృద్ధ మహిళల్లో పక్షవాతం నివారణ ఇలా...
పోరాడే పొటాషియమ్ వయసు పైబడ్డ మహిళలు, మెనోపాజ్ దశకు చేరుకున్న వారిలో అకస్మాత్తుగా వచ్చే హార్మోన్ల అసమతౌల్యత వల్ల పక్షవాతం రిస్క్ పెరుగుతుంది. ఆహారంలో పొటాషియమ్ పాళ్లు ఎక్కువగా ఉంటే, అది రక్తపోటును నియంత్రించి, పక్షవాతం రిస్క్‌ను గణనీయంగా తగ్గిస్తుందని రుతుస్రావం ఆగిన 50-79 ఏళ్ల మధ్యన ఉన్న 90,137 మంది మహిళలపై నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. వీళ్లకు పొటాషియమ్ అధిక మోతాదులో ఉండే అరటి వంటి పండ్లు, ఆకుకూరలు, బీన్స్ వంటి కూరగాయలు, పాలు, మాంసాహారం ఇచ్చారు. ఈ ఆహారం తీసుకున్న 16% మందిలో ఇస్కిమిక్ స్ట్రోక్ నివారితమైంది. అంతేకాదు... స్ట్రోక్ వల్ల కలిగే మరణాలలోనూ 10% తగ్గుదల కనిపించింది. ఈ విషయాలన్నీ ‘స్ట్రోక్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. డబ్ల్యూహెచ్ఓ సిఫార్సుల మేరకు మహిళలు, ప్రత్యేకంగా మెనోపాజ్ వచ్చిన వారికి ప్రతిరోజూ 3.510 గ్రాముల పొటాషియమ్ అవసరం కాగా కేవలం 16.6 శాతం మందిలోనే ఈ మేరకు పొటాషియమ్ పాళ్లు ఉన్నాయి. -
వాయిస్ ఆఫ్ యూత్!
వయసుకు తగ్గట్టుగా వచ్చే హార్మోన్లు మనిషికి సహజసిద్ధంగా చాలా విషయాలను నేర్పిస్తాయి. అలాగే సంఘంలో బతుకుతున్నందుకు చదువు, ఉద్యోగం, శ్రమలకు సులువుగా అలవాటు పడిపోతాడు.. మరి ఇదే సంఘంలో బతుకీడుస్తూ కొంచెం వైవిధ్యంగా చదివే వాళ్లు, కొంచెం వైవిధ్యమైన ఉపాధిని చూసుకొనే వాళ్లు, కొంచెం వైవిధ్యంగా శ్రమ పడే వాళ్లు... ప్రత్యేకమైన వ్యక్తులు అవుతారు. గొప్ప గుర్తింపును తెచ్చుకొంటారు. అవకాశం కలిసొస్తే అంతర్జాతీయ స్థాయి పేరు ప్రఖ్యాతులను తెచ్చుకొంటారు. ఈ తరహాలో కొంచెం సృజన, మరికొంచెం బాధ్యత, కొంచెం ఆసక్తి మరికొంచెం అవసరంతో కొంతమంది మంచి ప్రయత్నాలు చేశారు. సమకాలీన సమాజాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్న వారుగా, ప్రభావితం చేసే వ్యక్తులుగా పేరు తెచ్చుకొన్నారు. అలాంటి వారిలో కొందరు. వీళ్లంతా యువ డాక్యుమెంటరీ మేకర్లు. తమ చుట్టూ ఉన్న సమాజంలోని సమస్యలపై అధ్యయనం చేసి తమదైన శైలిలో దాన్ని సంస్కరించడానికి ప్రయత్నించిన వాళ్లు. పేరు: శ్రుతీ రాయ్, ఇండియా డాక్యుమెంటరీ పేరు: మైనా, ది లిటిల్ బ్రైడ్ బాల్య వివాహం. చాపకింద నీరులా ఇప్పటికీ మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. వ్యవస్థలో భాగమై అనేక మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తూ దుష్పరిణామాలకు కారణం అవుతున్న సమస్య ఇది. దేశంలోని ఒక మహానగరంలో చదువుతున్న యువతి శ్రుతీరాయ్. అక్కడే ఒక కార్పొరేట్ విద్యాలయంలో చదువుతున్న శ్రుతి ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా గ్రామానికి వెళితే అక్కడ చిన్న వయసు పిల్లలకే వివాహాలు అవుతున్నాయనే విషయం అర్థమైందట. ఈ విషయం గురించి పూర్తి వివరాల గురించి గూగుల్‌ను ఆశ్రయిస్తే ఎన్నో కఠోరమైన నిజాలు తెలిశాయి. వాటి గురించి తెలుసుకొన్న శ్రుతి ఆవేదనకు ప్రతిరూపమే ‘మైనా, ది లిటిల్ బ్రైడ్’. అప్పటికే మూవీ మేకింగ్ మీద అవగాహన కలిగిఉన్న ఈ టీనేజర్ యానిమేషన్ డాక్యుమెంటరీని రూపొందించింది. ‘సమాజంలో మార్పు తీసుకురావడానికి, ఏదో ఒక వైవిధ్యమైన ప్రయత్నం చేయాలనే ఆలోచనే ఈ డాక్యుమెంటరీకి మూలం. దీనికి మంచి గుర్తింపు రావడం ఆనందమే. అయితే నా డాక్యుమెంటరీ కొంతమందిపై ప్రభావం చూపి, కొంతమంది అమ్మాయిల జీవితాలు బాగు పడటానికి కారణం అయినా ఆనందమే..’’ అని అంటోంది శ్రుతి. పేరు: బిజిమనా ఫ్రాంకోయిస్, కెన్యా డాక్యుమెంటరీ పేరు: క్రై ఆఫ్ ది రెఫ్యుజీస్ ఈ ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారంటే అది శరణార్థి శిబిరంలో ఉన్న మనిషే. ఇటు తమిళ ఈలం దగ్గర నుంచి అటు ఆఫ్రికన్ అంతర్యుద్ధాల బాధితుల వరకూ ఎవరి పరిస్థితిని చూసినా అర్థమవుతుంది ఈ విషయం. కష్టమో నష్టమో సొంత ఊరిలో ఉండి, సొంత వాళ్ల మధ్యనే ఉండి దాన్ని ఎదుర్కొంటునప్పుడు ఉండే స్థైర్యం వేరు, స్థానిక పరిస్థితుల ప్రభావంతోనో, యుద్ధ వాతావరణంలోనో, ప్రకృతి వైపరీత్యాలతోనో.. కష్టాలను ఎదుర్కోవడం వేరు. అలాంటి కష్టాల ప్రతిరూపమే ‘క్రై ఆఫ్ ది రెఫ్యూజీస్’. బిజిమనా ఫ్రాంకోయిస్ అనే ఈ కెన్యన్ యువకుడు తీశాడు ఈ డాక్యుమెంటరీని. వాలంటీర్‌గా కెన్యాలోని ఒక శరణార్థ శిబిరాన్ని సందర్శించినప్పుడు ఫ్రాంకోయిస్ కళ్లలోని తడికి ఆవిష్కారం ఈ సినిమా. సృజనాత్మకత ఉన్న యువతీయువకులు సమాజాన్ని ఎంతగానైనా ప్రభావితం చేయగలరనేది తన నమ్మకం అని, అందుకే తను ఈ ప్రయత్నం చేశానని, మరిన్ని ఇలాంటి ప్రయత్నాలు చేస్తానని ఫ్రాంకోయిస్ అంటాడు. పేరు: ఎరిని-రెనీ గట్సీ, గ్రీస్ డాక్యుమెంటరీ పేరు: డ్రాప్ ఇట్ ఈమె పేరు పలకడానికి మనకు కొంచెం కష్టం కానీ, ఆమె భావాన్ని మాత్రం డాక్యుమెంటరీని చూస్తే చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోతోంది, వలసలు ఎక్కువవుతున్నాయి. దీంతో కొన్ని దేశాలకే పరిమితం అయిన భిన్నత్వంలో ఏకత్వం అంతటా ఆవిష్కృతం అవుతుందనే భ్రమల్లో ఉన్నాం కానీ, తమదేశంలోనే జాతుల మధ్య అంతరాలున్నాయని, రేసిజం పుష్కలంగా ఉందని అంటుంది గ్రీస్‌కు చెందిన ఈ టీనేజర్. మనుషులు అలాంటి జాడ్యాలను వదులుకోవాలని, మనసుంటే అది చాలా సులభమైన విషయం అనే సందేశాన్ని ఇస్తూ ‘డ్రాప్ ఇట్’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది రెనీ. భవిష్యత్తులో మానవహక్కులు, మహిళల హక్కులపై అవగాహనను పెంపొందించే పనిలో ఉంటానని, అందులో భాగంగా ఇండియాను ఒకసారి సందర్శించాలనేది తన ప్రణాళిక అని రెనీ వివరించింది. -
పడతులూ తెలుసుకోండి ఈ పధ్నాలుగు వ్యాధులను...
పురుషుడితో పోలిస్తే మహిళల్లో జరిగే అనేకానేక జీవక్రియలు అత్యంత సంక్లిష్టాలు. యుక్తవయసుకు వచ్చిన నాటి నుంచి యువకుల్లో ఒకటి రెండు హార్మోన్లు మాత్రం పనిచేస్తే చాలు. అదే యువతుల్లో అయితే వారి జీవక్రియలన్నీ సక్రమంగా జరగడానికి అనేక హార్మోన్లు అవసరం. మళ్లీ ఈ హార్మోన్లన్నింటి మధ్యా సమన్వయం కావాలి. అందుకే మహిళ తాలూకు ఆరోగ్య నిర్వహణ అత్యంత క్లిష్టంగా ఉంటుంది. ఈ కింద పేర్కొన్న అంశాల్లో కొన్ని మహిళలకు మాత్రమే వచ్చే అనారోగ్యాలతో పాటు... అందరిలోనూ కనిపించే ‘రక్తహీనత’,‘థైరాయిడ్ వ్యాధులు’ వంటివీ ఉన్నాయి. అయితే అవి పురుషుల్లో కంటే మహిళల్లోనే అత్యధికం. ఈ నెల 8వ తేదీ ‘మహిళా దినోత్సవ’సందర్భంగా మహిళల్లో అత్యధికంగా కనిపించే 14 ప్రధాన ఆరోగ్య సమస్యలు, వాటి నివారణలు, చికిత్సలు సంక్షిప్తంగా... 1- పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఏమిటీ సమస్య: మహిళలకు ఓవరీలో నీటితిత్తులు ఎక్కువగా వస్తుంటాయి. మహిళల్లో అత్యధికంగా వచ్చే ఈ సమస్యను ‘పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్’ అంటారు. ఈ సమస్య మహిళల్లో అనేక అవరోధాలను కల్పిస్తుంది. రుతుక్రమం సక్రమంగా రాకపోవడం గర్భధారణలో ఆటంకాలు హార్మోన్ల అసమతౌల్యత గుండె, రక్తనాళాల సమస్యలు. ఎందుకు వస్తుంది: పురుష హార్మోన్ అయిన ఆండ్రోజన్ పాళ్లు మహిళల్లో పెరిగినప్పుడు ఈ సమస్య వస్తుంది. దీనికి జన్యుపరమైన అంశాలే కారణమని భావిస్తున్నారు. దుష్పరిణామాలు: ముఖంపై అత్యధికంగా మొటిమలు రావడం చుండ్రు అవాంఛిత రోమాలు కొందరిలో పురుషుల్లో లాగా బట్టతల స్థూలకాయం అండం విడుదలలో సమస్యలు నెలసరి సరైన సమయంలో రాకపోవడం ఎదుర్కొనేది ఎలా: జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు... అంటే వేళకు తినడం, నిద్రపోవడం, ఆహారంలో కృత్రిమ ప్రాసెస్డ్ ఫుడ్ - చక్కెరపాళ్లను తగ్గించుకోవడం, పొట్టుతో ఉండే ఆహారం, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తినడం వంటివి. దీనికి నిర్దిష్టమైన చికిత్స లేదు. అయితే దీనివల్ల వచ్చే సమస్యలను అధిగమించడానికి చికిత్స చేయించుకోవాలి. కొందరిలో అవసరాన్ని బట్టి అండం విడుదల కావడానికి, చక్కెర తగ్గడానికి మందులు వాడాల్సి రావచ్చు. మామూలుగా తగ్గకపోతే ‘ఒవేరియన్ డ్రిల్లింగ్’ అనే శస్త్రచికిత్స ప్రక్రియను అనుసరించాల్సి రావచ్చు. 2- మొటిమలుబ (ఆక్నే) ఏమిటీ సమస్య: ఈ సమస్య యువతీ యువకులు ఇద్దరిలోనూ కనిపించినా యువతుల్లోనే ఎక్కువ. అలాగే మరిన్ని కారణాలు (హార్మోన్ల అసమతౌల్యత వంటివి) కూడా మహిళల్లో ఈ సమస్యకు దోహదం చేస్తాయి. పైగా అందంగా కనిపించే అంశంలోనూ ఇవి మహిళలను ఒకింత ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తాయి. ఎందుకు వస్తుంది: హార్మోన్ల అసమతౌల్యత మహిళల్లో పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ పాళ్లు పెరగడం పీసీఓఎస్ దుష్పరిణామాలు: ముఖంపై గుంటలు పడడం గొంతు భారీగా (మగ గొంతుకలా) మారడం కండరాలు మృదుత్వాన్ని కోల్పోయి మగవారిలా దృఢంగా/గరుకుగా మారడం, రొమ్ముల పరిమాణం తగ్గడం. ఎదుర్కొనేది ఎలా: ముఖాన్ని గాఢత తక్కువైన (మైల్డ్) సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ముఖంపై జిడ్డుగా ఉండేలా మేకప్ వేసుకోకూడదు. రోజుకు రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ముఖాన్ని స్క్రబ్‌తో రుద్దుకోకూడదు. వెంట్రుకలు జిడ్డుగా ఉండేవారు ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేయాలి. ముఖం కప్పేలా కాకుండా, కాస్త నుదురు కనపడేలా జుట్టును దువ్వుకోవాలి. మొటిమలను గిల్లడం, నొక్కడం చేయకూడదు. జిడ్డుగా ఉండే కాస్మటిక్స్ వేసుకోకూడదు. కాస్మటిక్స్ వాడాలనుకుంటే ‘నాన్-కొమిడోజెనిక్’ తరహావి మాత్రమే వాడాలి. అప్పటికీ తగ్గకపోతే మొటిమలను నివారించే మందులను డాక్టర్ సలహా మేరకే వాడాలి. మందుల షాపుల్లో అమ్మే మొటిమలను తగ్గించే మందుల్ని ఎవరంతట వారే వాడకూడదు. ఎందుకంటే అందులో బెంజోయిల్ పెరాక్సైడ్ / సల్ఫర్ / రిజార్సినాల్ / శాల్సిలిక్ ఆసిడ్ అనే రసాయనాలు ఉండవచ్చు. అవి బ్యాక్టీరియాను చంపి, ముఖాన్ని తేమగా ఉంచే నూనెగ్రంథులను నాశనం చేయవచ్చు, పైపొరను దెబ్బతీయవచ్చు. ముఖం ఎర్రబారవచ్చు. మొటిమలు వచ్చేవారు ముఖానికి కాస్త లేత ఎండ తగిలేలా జాగ్రత్త తీసుకుంటే ఆ చిన్న జాగ్రత్తే చాలావరకు అవి రాకుండా నివారిస్తుంది. 3- రక్తహీనత (అనీమియా) ఏమిటీ సమస్య: ఇది అందరిలో కనిపించే సమస్యే అయినా భారతీయ మహిళల్లో మరీ ఎక్కువ. రక్తంలో తగినన్ని ఎర్రరక్తకణాలు (ఆర్బీసీ) లేకపోవడాన్ని రక్తహీనత (అనీమియా) అంటారు. ఈ ఎర్రరక్తకణాలే మన శరీరంలోని అన్ని అవయవాలకూ రక్తాన్ని మోసుకుని వెళుతుంటాయి. వాటి సంఖ్య తగ్గడం ప్రమాదకరంగా పరిణమిస్తుంది. రక్తహీనతల్లోనూ ఐరన్‌లోపం వల్ల కలిగేది చాలా సాధారణమైనది. ఎందుకు వస్తుంది: మహిళల్లో రుతుస్రావం వల్ల ప్రతి నెలా రక్తం పోతుంది కాబట్టి అది రక్తహీనతకు దారితీయడం చాలా సాధారణం. కొందరిలో ఎర్రరక్తకణాల తయారీ ప్రక్రియ దెబ్బతింటుంది. కొత్త ఎర్రరక్తకణాలు తయారయ్యే లోపే కొందరిలో పాతవి వేగంగా చనిపోవడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది. ఇక మహిళల్లో రుతుస్రావంతో పాటు బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అతిగా రక్తం పోవడం, యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ ఉండటం కూడా రక్తహీనతకు కారణం. లక్షణాలు: వేగంగా అలసట కొద్దిపాటి నడకకే ఆయాసం తలనొప్పి కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు, అవి చల్లగా మారడం పాలిపోయినట్లుగా ఉండడం ఛాతీనొప్పి త్వరగా భావోద్వేగాలకు గురికావడం చిరాకు/కోపం స్కూలుకెళ్లే వయసు వారు అక్కడ తగిన సామర్థ్యం చూపలేకపోవడం. ఎదుర్కొనేది ఎలా: ఐరన్ పుష్కలంగా లభించే ఆహారమైన ఆకుపచ్చటి ఆకుకూరలు, నువ్వులు, ఖర్జూరం, కొబ్బరి, పప్పుచెక్కలు (చిక్కీ)తో పాటు మాంసాహారులైతే గుడ్లు, కాలేయం, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. ఏదైనా తిన్న వెంటనే కాఫీ, టీ తాగితే, అవి జీర్ణమైన ఆహారాన్ని రక్తంలోకి ఇంకకుండా చేస్తాయి. కాబట్టి, తినగానే వాటిని తీసుకోవద్దు. డాక్టర్ సలహా మీద ఐరన్ ట్యాబ్లెట్లు వాడాలి. మరీ రక్తహీనత ఎక్కువగా ఉంటే అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించాలి. 4- రొమ్ము క్యాన్సర్ ఏమిటీ సమస్య: మహిళల్లో అత్యధికంగా కనిపించే మరో రుగ్మత రొమ్ము క్యాన్సర్. రొమ్ము కణజాలాల్లో క్యాన్సర్ కణాలు అపరిమితంగా పెరిగిపోవడమే రొమ్ము క్యాన్సర్. ఈ క్యాన్సర్ కణాలు ఒక గడ్డ (ట్యూమర్)లా కనిపించవచ్చు. అవి దగ్గర్లోని ఇతర కణజాలాలకు పాకి, పక్కనే ఉన్న లింఫ్నోడ్స్కు వ్యాపించి శరీరమంతా విస్తరించనూ వచ్చు. రొమ్ము క్యాన్సర్‌లో ప్రధానంగా ఈ కింది రకాలు ఉంటాయి. అవి... డక్టల్ కార్సినోమా: రొమ్ము క్యాన్సర్ వచ్చిన ప్రతి పదిమందిలో ఎనిమిది మంది సమస్య ఈ తరహాకు చెందినదే. లోబ్యులార్ కార్సినోమా: ప్రతి పదిమందిలో కేవలం ఒకరికే ఈ తరహా క్యాన్సర్ కనిపిస్తుంది. లక్షణాలు: లక్షణాలు కనిపించకముందే ఆమెలో క్యాన్సర్ ఉందని తెలుసుకునే అవకాశం ఉంది. ఎలాగంటే... రొమ్ములో లేదా బాహుమూలాల కింద గట్టిగా ఉన్న కండ... గడ్డలా చేతికి తగులుతుండటం రొమ్ము ఆకృతిలో, పరిమాణంలో మార్పురావడం చనుమొన నుంచి స్రావాలు రావడం (ఇవి పాలు కావు) చనుమొన ఆకృతిలో మార్పురావడం... అంటే అది లోపలికి కుంచించుకుపోయినట్లుగా మారడం రొమ్ము చర్మంలో మార్పులు... అంటే చనుమొన, దాని చుట్టూ ఉన్న ప్రాంతంలోనూ, రొమ్ము మీద దురద రావడం, ఎర్రబారినట్లుగా కనిపించడం, పొలుసులు ఊడినట్లుగా అవుతుండటం, సొట్టపడినట్లుగా ఉండటం. ఎదుర్కొనేది ఎలా: రొమ్ముక్యాన్సర్ చికిత్సలో ఒకటి కంటే ఎక్కువ ప్రక్రియలను అనుసరించాల్సి రావచ్చు. ఎన్ని, ఎలాంటి ప్రక్రియలు అనుసరించాలి అన్న అంశం... క్యాన్సర్ ఏ దశలో ఉందన్న విషయంతో పాటు... ట్యూమర్ పరిమాణం ఎంత, అది ఏ రకమైన క్యాన్సర్, అది వచ్చిన మహిళ మెనోపాజ్ దశకు చేరిందా లేదా, ఆమె సాధారణ ఆరోగ్యపరిస్థితి... వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, హార్మోన్ థెరపీ, నిర్ణీతంగా క్యాన్సర్ కణాలను మాత్రమే నిర్మూలించే టార్గెట్ థెరపీ వంటి ప్రక్రియలతో చికిత్స చేస్తారు. 5- ఎండో మెట్రియాసిస్ ఏమిటీ సమస్య: ఎండోమెట్రియాసిస్ అనే ఈ జబ్బు కేవలం మహిళలు, యువతుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. అది కూడా వారిలో రుతుస్రావం మొదలై... అది కొనసాగుతున్న సమయంలోనూ వస్తుంది. ఇందులో గర్భసంచీలో ఉండే లోపలిపొర (ఎండోమెట్రియమ్) కేవలం లోపలికే పరిమితం కాకుండా అన్ని అంతర్గత అవయవాల్లోకి పెరుగుతుంది. ఫలితంగా అది అండాలను, ఫెలోపియన్ ట్యూబ్స్‌ను, పొత్తికడుపులో ఉండే ఇతర అవయవాలను ప్రభావితం చేస్తుంది. లక్షణాలు: కొందరిలో ఎండోమెట్రియమ్ పొర బయటకు తక్కువగా పెరిగినా పొత్తికడుపు కింది భాగంలో లేదా నడుములో నొప్పి ఉండవచ్చు. కొందరిలో అది ఎంతగా బయటకు పెరిగినా వారిలో ఎలాంటి నొప్పీ ఉండకపోవచ్చు. అయితే సాధారణంగా కనిపించే లక్షణాలు ఏమిటంటే... రుతుస్రావ సమయంలో తీవ్రమైన నొప్పి నడుము, పొత్తికడుపులో నొప్పి సెక్స్‌లో విపరీతమైన బాధ మలవిసర్జన / మూత్రవిసర్జన బాధాకరంగా ఉండటం రుతుస్రావం సమయంలోనే గాక... ఇతర సమయాల్లోనూ చుక్కలు చుక్కలుగా రక్తస్రావం తీవ్రమైన అలసట గర్భధారణ జరగకపోవడం (ఇన్ఫెర్టిలిటీ) నీళ్లవిరేచనాలు / మలబద్ధకం / కింది నుంచి గ్యాస్ పోవడం / వికారం (రుతుస్రావ వేళ ఈ వికారం ఎక్కువ). ఎదుర్కొనేది ఎలా: దీనికి చికిత్స దశల వారీగా జరుగుతుంది. ఉదాహరణకు ఒక దశ చికిత్సకు సరైన స్పందన లభించకపోతే ఆ తర్వాతి దశకు వెళ్లాల్సి ఉంటుంది. మొదటి దశలో: నాన్‌స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ నొప్పి నివారణ మందులతో రెండో దశలో: కనీసం మూడు నెలల పాటు గర్భనిరోధక మాత్రలతో మూడో దశలో: ఎండోమెట్రియమ్ పొర పెరుగుదలను అరికట్టే జీఎన్ఆర్హెచ్-అగొనిస్ట్ అనే మందుతో నాలుగో దశలో: ల్యాపరోస్కోపిక్ శస్త్రచికిత్స ద్వారా పొత్తి కడుపు భాగంలో చిన్న గాటు పెట్టి, ఎండోమెట్రియమ్ పొరను చూస్తూ... కనిపించిన మేరకు తొలగిస్తారు. 6- మూత్రంలో ఇన్ఫెక్షన్ ఏమిటీ సమస్య: మూత్రంలో ఇన్ఫెక్షన్స్ అన్నవి పురుషుల్లోనూ కనిపించినా... మహిళల్లో చాలా ఎక్కువ. మూత్రంలో ఇన్ఫెక్షన్కు చికిత్స చేయించకపోతే అది మూత్రాశయానికీ, మూత్రపిండాలకూ హాని కలిగించవచ్చు. ఒక్కోసారి ఈ ఇన్ఫెక్షన్ రక్తంలోకి పాకి అన్ని అవయవాలకూ వ్యాపించి, ప్రమాదకరంగానూ పరిణమించవచ్చు. ఎందుకు వస్తుంది: బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సిస్టైటిస్ (బ్లాడర్ ఇన్ఫెక్షన్) పైలోనెఫ్రైటిస్ (కిడ్నీ ఇన్ఫెక్షన్) యురెథ్రైటిస్ (మూత్రాశయం నుంచి మూత్రద్వారం వరకు ఉండే మూత్రనాళంలో మంట, ఇన్ఫెక్షన్). లక్షణాలు: మూత్రవిసర్జన సమయంలో నొప్పి, మంట పొత్తికడుపులో, నడుములో, నడుము పక్కభాగాల్లో నొప్పి చలి, వణుకు జ్వరం చెమటలు పట్టడం వికారం / వాంతులు మాటిమాటికీ మూత్రం వస్తున్నట్లు అనిపించడం మూత్రంపై నియంత్రణ కోల్పోయి ఒక్కోసారి చుక్కలు చుక్కలుగా పడటం మూత్రం నుంచి ఘాటైన వాసన విసర్జించే మూత్రం పరిమాణంలో మార్పులు (ఎక్కువ లేదా తక్కువ) మూత్రంలో రక్తం, చీము పడటం సెక్స్‌లో మంట, నొప్పి ఎదుర్కొనేది ఎలా: వ్యాధి నిర్ధారణ తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గడానికి తగిన మందులు వాడతారు. ఒకవేళ మాటిమాటికీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వస్తుంటే మూత్రపిండాలను, గర్భసంచి (యుటెరస్)ను, మూత్రాశయాన్ని ఎక్స్-రే తీసి పరీక్షించే ఇంట్రావీనస్ పైలోగ్రామ్ (ఐవీపీ) అనే ప్రత్యేకమైన పరీక్షలనూ, అవసరాన్ని బట్టి పూర్తి మూత్ర విసర్జక వ్యవస్థను పరిశీలించడానికి అల్ట్రాసౌండ్ స్కాన్‌ను, ఒక టెలిస్కోప్ వంటి సాధనంతో బ్లాడర్ లోపల పరీక్ష చేయాల్సి వచ్చే ‘సిస్టోస్కోపీ’ వంటి పరీక్షలు చేయాల్సి రావచ్చు. ఇది సాధారణ యాంటీ బయాటిక్స్తోనే ఇది తగ్గుతుంది. పరిస్థితి ముదిరితేనే కనిపించే లక్షణాలను బట్టి ఇతర చికిత్సలు అవసరమవుతాయి. 7- థైరాయిడ్ సమస్య ఏమిటీ సమస్య: మానవ దేహంలో సరిగ్గా మెడ భాగంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఇది ప్రథానంగా థైరాక్సిన్ (టీ4) అనీ, ట్రై అయడో థైరమిన్ (టీ3) అనే హార్మోన్లను స్రవిస్తుంటుంది. ఈ రెండూ శరీరంలోని అనేక జీవక్రియలను నియంత్రిస్తుంటాయి. ఈ హార్మోన్లను స్రవించే ఈ గ్రంథి అతిగా పనిచేసినా, లేదా పనిచేయకపోయినా సమస్యలు వస్తుంటాయి. థైరాయిడ్ సమస్యలను ప్రధానంగా ఇలా విభజించవచ్చు. హైపర్ థైరాయిడిజం (థైరాయిడ్ అతిగా పనిచేయడం) హైపో థైరాయిడిజం (థైరాయిడ్ పనిచేయకపోవడం) హైపర్ థైరాయిడిజం: హైపర్ థైరాయిడిజం కండిషన్లో థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేసి థైరాక్సిన్ హార్మోన్‌ను ఎక్కువగా స్రవిస్తుంటుంది. హైపర్ థైరాయిడిజం లక్షణాలు: ఎంత తిన్నా సన్నగానే ఉండటం, బరువు పెరగకపోగా... తగ్గడం. గాయిటర్ (మెడ దగ్గర ఉండే థైరాయిడ్ ఉబ్బినట్లుగా ఉండటం. దాంతో మెడ దగ్గర ఉబ్బి కనిపిస్తుంటుంది). కళ్లు ఉబ్బినట్లుగా ఉంటాయి. దురదలు పెట్టడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉద్వేగంగా ఉండటం, త్వరగా కోపం రావడం నిద్రపోవడంలో ఇబ్బందులు, ఎప్పుడూ అలసటగా ఉండటం గుండె వేగం పెరగడం, గుండె స్పందనల్లో క్రమబద్ధత లేకపోవడం, వేళ్లు వణుకుతూ ఉండటం చెమటలను ఎక్కువగా పట్టడం, కొద్దిపాటి వేడిమిని కూడా భరించలేకపోవడం కండరాలు బలహీనంగా మారడం త్వరగా మలవిసర్జన ఫీలింగ్స్ కలగడం. హైపర్ థైరాయిడిజం లక్షణాలు ఉన్నప్పుడు విధిగా పరీక్షలు చేయిచుకుని, ఆ రుగ్మత ఉన్నట్లు తేలితే తప్పనిసరిగా మందులు తీసుకోవాలి. లేకపోతే అది ఒక్కోసారి గుండె పనిచేయకపోవడానికి (హార్ట్‌ఫెయిల్యూర్)కు దారితీయవచ్చు. లేదా ఎముకలు పెళుసుగా మారిపోవడం (ఆస్టియోపోరోసిస్) జరగవచ్చు. ఒక్కోసారి ప్రాణాపాయకరమైన థైరాయిడ్ స్టార్మ్ కండిషన్కూ దారితీయవచ్చు. నిర్ధారణ పరీక్ష : రక్తంలో థైరాయిడ్ హార్మోన్ల మోతాదులను పరీక్షించడం ద్వారా హైపర్ థైరాయిడ్ కండిషన్‌ను నిర్ధారణ చేస్తారు. థైరాక్సిన్ హార్మోన్ (ప్రధానంగా టీ4 హార్మోన్) మోతాదులు పెరిగి ఉండటం ద్వారా దీన్ని గుర్తించవచ్చు. ఎదుర్కొనేది ఎలా: యాంటీ థైరాయిడ్ మందులు ఇవ్వడం రేడియో యాక్టివ్ అయొడిన్ ద్వారా చికిత్స శస్త్రచికిత్స బీటా బ్లాకర్స్ ఉపయోగించడం హైపో థైరాయిడిజం: థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోవడం, లేదంటే చాలా తక్కువగా పనిచేయడాన్ని ‘హైపో థైరాయిడిజం’ అంటారు. లక్షణాలు: తీవ్రమైన అలసట / మందకొడిగా ఉండటం మానసిక వ్యాకులత (మెంటల్ డిప్రెషన్) చల్లగా అనిపించడం బరువు పెరగడం (రెండు నుంచి నాలుగు కిలోల వరకు) చర్మం పొడిగా మారడం, మలబద్ధకం మహిళల్లో రుతుక్రమం సక్రమంగా రాకపోవడం గర్భిణుల్లో మరింత జాగ్రత్త: గర్భిణుల విషయంలో థైరాక్సిన్ పాళ్లు తగ్గుతున్నాయేమో జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ పరీక్షలు చాలా అవసరం. నిర్ధారణ పరీక్షలు : రక్త పరీక్ష ద్వారా థైరాయిడ్ గ్రంథి స్రవించే టీ4 హార్మోన్ పాళ్లు సాధారణంగా ఉన్నాయా లేదా అని పరీక్షిస్తారు. టీఎస్‌హెచ్ పాళ్లలోనూ మార్పులు రావచ్చు. ఎదుర్కొనేది ఎలా: లెవో థైరాక్సిన్ సోడియమ్ వంటి మందుల ద్వారా దీనికి చికిత్స అందిస్తారు. 8- ఆస్టియో పోరోసిస్ ఏమిటీ సమస్య: భారతీయుల్లో చాలా ఎక్కువ. అందులోనూ మహిళల్లో! మెనోపాజ్ దాటాక కనీసం 40% మందిలో కనిపిస్తుంది. ఎందుకు వస్తుంది: మన అందరిలోనూ 20 ఏళ్లు వచ్చే వరకు ఎముకలు పెరుగుతుంటాయి. బాల్యం, కౌమారంలో ఉండే ఈ ఎముకల పెరుగుదల యౌవనం తర్వాత ఆగిపోయాక కూడా దాదాపు 40 ఏళ్లు వచ్చేవరకు బలంగా, గట్టిగా ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా పలచబడుతూ, పెళుసుగా మారుతూ ఉంటాయి. మహిళల ఓవరీల నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్- ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల రుతుక్రమం ఆగిన మహిళల్లో ఇది మరీ ఎక్కువ. (ఎముకలను బలంగా ఉంచడానికి ఈస్ట్రోజెన్ దోహదపడుతుంది). రుతుక్రమం ఆగిపోయాక ఈస్ట్రోజెన్ ఉత్పత్తి కూడా తగ్గిపోవడంతో ఈ పరిణామం మహిళల్లో ఎక్కువగా ప్రభావం చూపుతుంది. పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువగా కనిపించడానికి కారణం ఇదే. లక్షణాలు: ఇది వస్తుంది అని తెలుసుకోడానికి అవసరమైన లక్షణాలు ముందే కనిపించేందుకు అవకాశం లేదు. కారణం... ఎముకలు శరీరంలో లోపల ఉంటాయి కాబట్టి అవి పలచబడడం, పెళుసుగా మారడాన్ని గమనించడం సాధ్యం కాదు. అందుకే ఇది నిశ్శబ్దంగా వచ్చే పరిణామం. ఇలా ఎముకలు పలచబారడం దీర్ఘకాలం జరుగుతూ పోతే చిన్న గాయాలకే ఎముకలు విరగడం కనిపిస్తుంది. అంటే... ఏదైనా చిన్నపాటి ప్రమాదానికే ఎముక పుటుక్కున విరిగిపోతుంటే దాన్ని ‘ఆస్టియో పోరోసిస్’గా గుర్తించవచ్చు. దీనికి సంబంధించి మరికొన్ని లక్షణాలు ఏమిటంటే... ఒళ్లు నొప్పులు ఎముకలు, కీళ్ల నొప్పులు అలసట చిన్న ప్రమాదానికే ఎముక విరగడం విపరీతమైన వెన్ను నొప్పి, కాస్తంత వెన్ను ఒంగినట్లయి శరీరం ఎత్తు తగ్గడం ఆస్టియోపోరోసిస్ - నిర్ధారణ: రక్తపరీక్ష, ఎక్స్-రే, బీఎమ్‌డీ (బోన్ మాస్ డెన్సిటీ - అంటే ఎముక సాంద్రత నిర్ధారణ చేసే పరీక్షల ద్వారా రోగిలో దీన్ని నిర్ధరించవచ్చు.) ఎదుర్కొనేది ఎలా: ప్రాథమిక నివారణ చర్యలు ఆస్టియోపోరోసిస్ కండిషన్‌ను ఆలస్యం చేస్తాయి. ఫలితంగా రిస్క్ తగ్గుతుంది. దాంతోపాటు... క్యాల్షియమ్, విటమిన్ ‘డి’ ఇవ్వడం - డాక్టర్లు ప్రాథమిక చికిత్సగా క్యాల్షియమ్, విటమిన్ ‘డి’ ఇస్తారు. అంటే... 60 ఏళ్లు దాటిన వారికి ప్రతిరోజూ 1500 ఎంజీ క్యాల్షియమ్నూ, విటమిన్-డిని రోజూ 10 నుంచి 15 మిల్లీ గ్రాములు ఇస్తారు. డిస్ఫాస్ఫోనేట్స్ - ఇవి ఒక రకం మందులు. వీటినే డిస్ఫాస్ఫోనేట్స్ అని కూడా అంటారు. ఎముక తనలోని పదార్థాన్ని కోల్పోయే ప్రక్రియను ఇవి ఆలస్యం చేస్తాయి. ఫలితంగా ఎముక సాంద్రత తగ్గే వేగం మందగిస్తుంది. దానివల్ల ఎముక మరింత కాలం దృఢంగా ఉంటుంది. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ) - రుతుక్రమం ఆగిన మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను తిరిగి భర్తీ చేసే ఈ చికిత్స ప్రక్రియను కూడా అవసరాన్ని బట్టి డాక్టర్లు చేస్తుంటారు. అయితే ఈ హెచ్ఆర్టీ వల్ల కొన్ని దుష్ర్పభావాలు కూడా కనిపిస్తాయి. అంటే... రొమ్ముల సలపరం, మళ్లీ రుతుస్రావం మొదలుకావడం, బరువు పెరగడం, మూడ్స్ మాటిమాటికీ మారిపోవడం, పార్శ్వపు తలనొప్పి రావడం వంటివన్నమాట. కాబట్టి రోగి కండిషన్‌ను బట్టి హెచ్ఆర్టీ అవసరమా, కాదా అన్నది డాక్టర్లే నిర్ధరిస్తారు. క్యాల్సిటోనిన్ - ఈ మందులను డాక్టర్ల సలహా మేరకే తీసుకోవాల్సి ఉంటుంది. టెరీపారటైడ్ - ఇది ఆస్టియో పోరోసిస్ చికిత్స ప్రక్రియలో సరికొత్త మందు. 9- ప్రీ-మెన్స్ట్రువల్ సిండ్రోమ్ ఏమిటీ సమస్య: ఇది మహిళల్లో రుతుస్రావం ముందర కనిపించే ఆరోగ్యసమస్య. ఎందుకు వస్తుంది: ఈ సమస్యకు కారణాలు నిర్దిష్టంగా తెలియదు. అయితే అనేక అంశాలు దీరికి దోహదపడతాయి. ఉదాహరణకు ప్రతి నెలా రుతుస్రావం వచ్చేందుకు ఉపయోగపడే అనేక హార్మోన్లలో మార్పులు మిగతావారి కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ‘పీఎమ్ఎస్’ కనిపించవచ్చు. కొందరిలో మెదడు రసాయనాల్లోని మార్పులూ ఇందుకు దోహదం చేస్తాయి. ఒత్తిడి, ఉద్వేగ భరితమైన సమస్యలూ (డిప్రెషన్) పీఎమ్ఎస్కు కారణాలే. లక్షణాలు: మొటిమలు రావడం రొమ్ము వాపు లేదా ముట్టుకుంటే మంటగా మారడం (టెండర్నెస్) అలసట నిద్రపోవడంలో ఇబ్బంది కడుపులో ఇబ్బంది / కింది నుంచి గ్యాస్పోవడం / మలబద్ధకం లేదా నీళ్ల విరేచనాలు తలనొప్పి వెన్నునొప్పి కీళ్లనొప్పులు కండరాల నొప్పులు టెన్షన్ / త్వరగా కోపం రావడం / వేగంగా భావోద్వేగాలకు గురికావడం / మూడ్స్ త్వరత్వరగా మారిపోవడం / తరచూ వెక్కివెక్కి ఏడ్వటం యాంగ్జైటీ లేదా డిప్రెషన్ ఎదుర్కొనేది ఎలా: దీనికి చికిత్స మూడు మార్గాల్లో జరుగుతుంది. మొదటిది జీవనశైలిలో మార్పులు: ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అంటే... ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవడం తాజాపండ్లు తినడం ఉప్పు, తీపి, కెఫిన్ ఉండే పదార్థాలకు దూరంగా ఉండటం (ప్రధానంగా పీఎమ్ఎస్ ఉన్నప్పుడు) ప్రతిరోజూ కనీసం ఎనిమిది గంటలు తగ్గకుండా నిద్రపోవడం యోగా, రిలాక్సేషన్ టెక్నిక్స్ వంటివి చేయడం. రెండోది మందులు తీసుకోవడం: ఇలాంటి సమయాల్లో నొప్పులు తగ్గడానికి వీలుగా ఇబూప్రొఫెన్, కీటోప్రొఫెన్, న్యాప్రోగ్రెన్, ఆస్పిరిన్ వంటి మందులు తీసుకోవడం. మూడోది అల్టర్నేటివ్ థెరపీ: పీఎమ్ఎస్ ఉన్నవారు అదనంగా కొన్ని విటమిన్లు, మినరల్ సప్లిమెంట్లు తీసుకోవాలి. 10- యూరినరీ ఇన్‌కాంటినెన్స్ ఏమిటీ సమస్య: మూత్రం వస్తున్నప్పుడు దానిని ఏ మాత్రం నియంత్రించలేక టాయ్‌లెట్‌కు వెళ్లాల్సి వచ్చే పరిస్థితిని ‘యూరినరీ /అర్జ్ ఇన్‌కాంటినెన్స్’ అంటారు. టాయ్‌లెట్‌కు చేరేలోపే మూత్రం చుక్కలు చుక్కలుగా పడుతుంది. పరిస్థితి మరింత దిగజారేదెప్పుడు: ఈ సమస్య ఉన్న మహిళలు కెఫిన్ ఎక్కువగా తీసుకున్నా (కాఫీలు ఎక్కువసార్లు తాగినా), టీలు, కోలా డ్రింకులు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నా, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నా... పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. కొందరు మహిళల్లో రుతుస్రావం ఆగిపోయాక (మెనోపాజ్ తర్వాత) అది ఇంకా పెరుగుతుంది. మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడంతో యోని లోపలి పొరలు కుంచించుకుపోవడం (వెజైనల్ అట్రోఫీ) వల్ల ఈ స్థితి వస్తుందని భావన. ఎదుర్కొనేది ఎలా: అర్జ్ ఇన్‌కాంటినెన్స్‌ను అధిగమించడానికి కొన్ని సాధారణ జీవనశైలి మార్గాలు ప్రభావపూర్వకంగా పనిచేస్తాయి. అవి... త్వరగా టాయిలెట్‌కు వెళ్లడం కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలను తగ్గించడం తగినంతగా ద్రవాహారం తీసుకోవడం ఒకవేళ స్థూలకాయులైతే బరువు తగ్గించుకోవడం. మూత్రవిసర్జనపై నియంత్రణకు శిక్షణ: దీన్నే బ్లాడర్ ట్రైనింగ్ లేదా బ్లాడర్ డ్రిల్ అంటారు. అర్జ్ ఇన్‌కాంటినెన్స్ ఉన్నప్పుడు టాయిలెట్లోకి వెళ్లాక అక్కడ మూత్రవిసర్జన ఫీలింగ్‌ను నియంత్రించుకుంటూ క్రమంగా ఆ వ్యవధిని పెంచుకుంటూ పోవాలి. ఫలితంగా చుక్కలు చుక్కలుగా రాలడం అన్నది క్రమంగా తగ్గుతుంది. ఇలా క్రమంగా బ్లాడర్‌పై నియంత్రణ సాధించవచ్చు. మందులు: ఒకవేళ బ్లాడర్ ట్రైనింగ్/బ్లాడర్ డ్రిల్‌తో ఫలితం లేకపోతే అప్పుడు యాంటీ మస్కారినిక్స్ / యాంటీకొలినెర్జిక్ అనే మందులను ఇస్తారు. ఇక బ్లాడర్, యుటెరస్, మలద్వారం కండరాలు బలం పుంజుకునేలా చేసే కొన్ని రకాల వ్యాయామాలు (పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్లు)తోనూ మంచి ఫలితం ఉంటుంది. ఇవీ విఫలమైతే కొన్ని శస్త్రచికిత్సల ద్వారా సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. 11- ఫైబ్రాయిడ్స్ గర్భసంచిలో గడ్డలు ఏమిటీ సమస్య: గర్భసంచీలో పెరిగే హానికరం కాని గడ్డలను ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి క్యాన్సర్‌గా మారవు. వీటినే యుటెరైన్ మయోమాస్, ఫైబ్రోమయోమాస్ లేదా లియోమయోమాస్ అంటారు. ఎలాంటి చికిత్సా తీసుకోకపోయినా క్రమంగా తగ్గిపోతాయి. గర్భసంచీలో అవి వచ్చే ప్రాంతాన్ని బట్టి వాటిని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్, సబ్సిరోస్ ఫైబ్రాయిడ్స్, సబ్‌మ్యూకస్ ఫైబ్రాయిడ్స్, పెడంక్యులేటెడ్ ఫైబ్రాయిడ్స్ అని పిలుస్తారు. ఎందుకు వస్తుంది: ఇవి పెరగడానికి నిర్దిష్ట కారణం తెలియకపోయినా... అదనపు కండ పెరగడం వల్ల ఇవి వస్తాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ పాళ్లు పెరిగినప్పుడు ఆ హార్మోన్ వల్ల వీటి పెరుగుదలకూ ప్రేరణ లభిస్తుంది. ఈస్ట్రోజెన్ సరఫరా తగ్గితే ఇవి కూడా కుంచించుకుపోతాయి. లక్షణాలు: ఫైబ్రాయిడ్స్ ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరికి మాత్రమే వీటి వల్ల కనిపించే లక్షణాలు బయటపడతాయి. కొందరికి ఇవి ఉన్నప్పటికీ వాటి ఉనికే తెలియదు. అందుకే వేరే సమస్య కోసం పరీక్షలు చేస్తుంటే కొందరిలో ఇవి ఉన్నట్లుగా తెలుస్తుంది. సాధారణంగా కనిపించే లక్షణాలు... రుతుస్రావం సమయంలో తీవ్రమైన రక్తస్రావం, నొప్పి సెక్స్ సమయంలో నొప్పి గర్భస్రావం లేదా గర్భధారణ జరగకపోవడం గర్భవతిగా ఉన్న సమయంలో సమస్యలు. పరీక్షలు: యోనిని పరీక్షించినప్పుడు డాక్టర్‌కు ఈ ఫైబ్రాయిడ్స్ చేతికి తగలవచ్చు. మరికొందరిలో అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో ఇవి ఉన్నట్లు తెలియవచ్చు. ఎదుర్కొనేది ఎలా: ట్రానెగ్జామిక్ యాసిడ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు, కొన్ని గర్భనిరోధక మాత్రలు, లెవో నార్జెస్ట్రల్ ఇంట్రాయుటెరైన్ విధానలతో దీనికి చికిత్స చేయవచ్చు. ఇక చికిత్సతో తగ్గనప్పుడు కొన్ని శస్త్రచికిత్స ప్రక్రియలు, ఎండోమెట్రియల్ అబ్లేషన్, యుటెరస్‌కు రక్తసరఫరా చేసే రక్తనాళాన్ని ఆటంకపరచి దానికి రక్తసరఫరాను ఆపే ‘యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్’ వంటి ప్రక్రియలతో దీనికి చికిత్స చేయవచ్చు. 12- ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఏమిటీ సమస్య: ఇది చాలా ఇబ్బంది కలిగించే సమస్య. తినగానే టాయిలెట్‌కు వెళ్లాల్సి వచ్చే ఈ సమస్యతో సామాజికంగా చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఇందులో చాలా లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలకు కారణాలు తెలుసుకునేందుకు నిర్వహించే అన్ని వైద్యపరీక్షల్లోనూ ఎలాంటి సమస్యలూ ఉన్నట్లు తేలదు. ఫలితాలన్నీ మామూలుగా ఉంటాయి. లక్షణాలు: పొట్ట నొప్పి, పొట్ట పట్టేసినట్లుగా ఉండటం మలబద్ధకం మలవిసర్జన తర్వాత కూడా ఇంకా కడుపు పూర్తిగా ఖాళీ కానట్లుగా ఉండటం నీళ్ల విరేచనాలు విరేచనాలు, మలబద్ధకం లాంటి విరుద్ధ లక్షణాలు ఒకదాని తర్వాత మరోటి కనిపించడం మలంలో బంక (మ్యూకస్) పడటం కడుపు ఉబ్బరంగా ఉండటం కడుపులో గ్యాస్ నిండటం / కింది నుంచి గ్యాస్ పోవడం పొట్టపై భాగంలో ఉబ్బరంగా/ఇబ్బందిగా అనిపించడం కొద్దిగా తిన్నా కడుపు నిండిపోయినట్లు ఉండి వికారం / వాంతి భ్రాంతి కలగడం ఎదుర్కొనేది ఎలా: దీనికి నిర్దిష్టమైన చికిత్స లేదు. కాకపోతే కొన్ని ఆరోగ్యకరమైన జీవనశైలులను అనుసరించడం ద్వారా సమస్య తీవ్రతను తగ్గించవచ్చు. అవి... ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని తీసుకోవడం తగిన వేళల్లో తినడం ఆహారంలో తగినంత పీచు ఉండటం కోసం పొట్టుతో కూడిన ఆహారధాన్యాలు, తాజాపండ్లు, కూరగాయలు తీసుకోవడం రోజూ ఎనిమిది గ్లాసులకు తగ్గకుండా మంచినీళ్లుతాగడం తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం వంటి జాగ్రత్తలతో ఈ సమస్యను అధిగమించవచ్చు. అయితే కొన్నిసార్లు ఫైబర్‌ను మందుల రూపంలో తీసుకోవాల్సి రావచ్చు. లక్షణాలను బట్టి యాంటీ-డయేరియల్ మందులు, యాంటీ డిప్రెసెంట్స్, కడుపు పట్టేసిన ఫీలింగ్‌ను తొలగించేందుకు యాంటీ స్పాస్మోడిక్ మందులు అవసరం కావచ్చు. అవసరాన్ని బట్టి మానసిక చికిత్సలో భాగంగా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ), డైనమిక్ సైకోథెరపీ వంటి చికిత్స ప్రక్రియలు అవసరం కావచ్చు. 13- రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏమిటీ సమస్య: ఇది మహిళల్లో ఒళ్లు నొప్పులు, కీళ్లనొప్పుల రూపంలో కనిపించే సమస్య. దాదాపు 25 నుంచి 30 ఏళ్ల మధ్యవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మన శరీరంలోని రోగ నిరోధకశక్తి మనకే వ్యతిరేకంగా పనిచేయడం వల్ల కనిపించే ఆటో-ఇమ్యూన్ సమస్య ఇది. దీనివల్ల కీళ్లనొప్పులు, కీళ్ల కదలికలు తగ్గడం వంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి. లక్షణాలు: బాగా అలసటగా ఉండటం కీళ్లలో విపరీతమైన నొప్పులు కీళ్ల కదలికలు మందగించడం నిత్యం జ్వరం ఉన్నట్లుగా అనిపించడం (మలేయిస్) ఆకలి తగ్గుతుంది. ఫలితంగా బరువు కూడా తగ్గుతుంది కండరాల నొప్పులు ఎదుర్కొనేది ఎలా: మన రోగనిరోధకశక్తి మనకే వ్యతిరేకంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య కావడంతో దీనికి పూర్తిగా చికిత్సగాని, నిర్దిష్టమైన మందులుగాని అంతగా అందుబాటులో లేవు. అయితే ఈ పరిస్థితి మరింత తీవ్రం కాకుండా చూసేందుకు, కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు తగ్గించే మందులు, కీళ్లలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించే ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారికి చేసే చికిత్స ఉద్దేశం పరిస్థితిని అదుపు చేస్తూ, అది మరింత దిగజారకుండా చూడటమే. ఇందులో భాగంగా రక్తపరీక్షలు, ఇతరత్రా ప్రాథమిక పరీక్షలు కొన్ని క్రమం తప్పకుండా చేయించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా మందులనూ, మోతాదులనూ ఎప్పటికప్పుడు మార్చాల్సి రావచ్చు. 14- డిప్రెషన్ మానసిక వ్యాకులత ఏమిటీ సమస్య: డిప్రెషన్ (వ్యాకులత) అన్నది మహిళల్లో చాలా సాధారణంగా కనిపించే మానసిక సమస్య. నిజానికి ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరికి బయటకు తెలిసేలాంటి లక్షణాలతో (క్లినికల్ లక్షణాలతో) డిప్రెషన్ కనిపిస్తుంది. ప్రతి నలుగురు మహిళల్లోనూ ఒకరు జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు డిప్రెషన్‌కు లోనవుతుంటారు. లక్షణాలు: మానసికంగా కుంగిపోయినట్లుగా ఉండటం ఎప్పుడూ విచారంగా కనిపించడం జీవితంపై ఆసక్తి కోల్పోయినట్లుగా ఉంటూ, ఎప్పుడూ ఆనందంగా ఉండాలనే కోరిక తగ్గడం అస్థిమితంగా మారడం త్వరగా కోపం తెచ్చుకోవడం చాలాసేపు అదేపనిగా ఏడ్వటం ఎప్పుడూ అపరాధ భావనతో ఉండటం నిరాశాపూరితంగా ఆలోచించడం ఆకలి తగ్గడం, ఫలితంగా బరువు తగ్గడం అతిగా నిద్రపోవడం లేదా నిద్రలేమితో బాధపడటం నిద్రపట్టినా వేకువనే మెలకువ వచ్చి మళ్లీ నిద్రపట్టకపోవడం ఆత్మహత్య దిశగా ఆలోచనలు రావడం దేనిపైనా దృష్టి నిలపలేకపోవడం, దృష్టికేంద్రీకరణ శక్తి తగ్గడం, జ్ఞాపకశక్తి తగ్గడం, నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం ఎప్పుడూ తలనొప్పి, జీర్ణసమస్యలు, దీర్ఘకాలికంగా ఒంటినొప్పుల వంటి భౌతిక సమస్యలు ఉండటం. ఎదుర్కొనేది ఎలా: జీవితాన్ని ప్రయత్నపూర్వకంగా రసభరితంగానూ, ఆనందదాయకంగానూ మలచుకోవడం ద్వారా మనంతట మనమే ఈ సమస్యనుంచి బయటపడవచ్చు. దీనికి కావాల్సిందల్లా కొద్దిగా ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని పెంపొందించుకోవడమే. విచారం నుంచి బయట పడటానికి ఎవరికి వారుగా చేసుకోదగ్గ పనులు... ప్రతిరోజూ బిజీగా గడపడానికి వీలుగా ఏదో వ్యాపకాన్ని ఎంచుకుని దానిలో ఆసక్తికరంగా నిమగ్నం కావడం. ఏదైనా సాధించడానికి అనుగుణంగా మంచి లక్ష్యాన్ని ఎంచుకోవడం. దానికోసం కృషి చేయడం. ఇందులో భాగంగా మొదట చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని తేలిగ్గా అధిగమిస్తూ పోతూ క్రమంగా పెద్ద లక్ష్యాలను ఛేదించుకుంటూ పోవడం. నిత్యం వ్యాయామంతో ఎండార్ఫిన్స్ అనే రసాయనాలు విడుదలవుతాయి. అవి మనల్ని సంతోషంగా ఉండేలా చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. ముఖ్యంగా ఒమెగా ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండే చేపలు. ఇక చికిత్సలో భాగంగా డాక్టర్ చెప్పిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. -
థైరాయిడ్ సమస్యలు
థైరాయిడ్ నుంచి విడుదలైన హార్మోన్లు రక్తప్రవాహంలో కలిసి చాలా కీలకమైన జీవక్రియలను నిర్వహిస్తుంటాయి. ఈ గ్రంథిలో వచ్చే మార్పుల వల్ల థైరాయిడ్ సంబంధిత సమస్యలు వస్తాయి. ప్రస్తుతం జీవనశైలిలో వస్తున్న మార్పులు, ఆహారంలో అసమతుల్యత, శారీరక శ్రమ లోపించడం వంటి కారణాల వల్ల థైరాయిడ్ సమస్య ఇటీవల చాలా ఎక్కువగా వస్తోంది. ఇది ఏ వయసువారికైనా రావచ్చు. అయితే వయసును అనుసరించి కారణాలు మారవచ్చు. థైరాయిడ్ సమస్యను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి... 1. హైపోథైరాయిడిజం: ఈ సమస్య ఉన్నప్పుడు జీవక్రియలు సజావుగా జరగడానికి సరిపడ థైరాక్సిన్ హార్మోన్‌ను థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేయలేదు. ఫలితంగా అలసట, చర్మం పొడిబారడం, అధికబరువు, స్త్రీలలో నెలసరి సమస్యలు, మగత, మలబద్దకం, చలికి తట్టుకోలేకపోవడం, జుట్టు రాలడం, కీళ్లనొప్పులు, చిరాకు, మతిమరపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2. హైపర్‌థైరాయిడిజం: థైరాయిడ్ గ్రంథి అవసరాన్ని మించి అధికంగా పనిచేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. గుండెదడ, చేతులు-కాళ్లు వణకడం, నిద్రలేమి, ఆందోళన, బరువు తగ్గిపోవడం, వేడిని తట్టుకోలేకపోవడం, ఆకలి పెరగడం, నెలసరి సమస్యలు, కండరాల బలహీనత వంటి లక్షణాలు హైపర్‌థైరాయిడిజంలో కనిపిస్తాయి. థైరాయిడ్ హార్మోన్లు అధికంగా స్రవించడం వల్ల థైరోటాక్సికోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి చాలా నెమ్మదిగా మొదలవుతుంది. కంటి కండరాలు వాచి, కనుగుడ్లు ముందుకు వచ్చినట్లుగా కనిపిస్తే దాన్ని ‘గ్రేవ్స్ డిసీజ్’ అంటారు. కొంతమందికి థైరాయిడ్ గ్రంథి పెద్దదై మెడ భాగంలో వాపు వస్తుంది. దీన్ని గాయిటర్ అంటారు. నిర్ధారణ పరీక్షలు: థైరాయిడ్ సమస్య ఉందా లేదా అని తెలుసుకోడానికి టీ3, టీ4, టీఎస్‌హెచ్ హార్మోన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఆయా హార్మోన్ల పాళ్లను బట్టి సమస్యను తెలుసుకుంటారు. ఆయా హార్మోన్ల హెచ్చుతగ్గులను బట్టి వ్యాధిని నిర్ధారణ చేస్తారు. రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందేమో అని నిర్ధారణ చేయడానికి థైరాయిడ్ యాంటీబాడీస్ (యాంటీటీపీఓ యాంటీబాడీస్) పరీక్షలు అవసరమవుతాయి. హోమియో వైద్యం: రోగి శారీరక, మానసిక పరిస్థితులు, ఆకలి, నిద్ర, ఆందోళన వంటి అంశాలతో పాటు వంశపారంపర్య ఆరోగ్య చరిత్ర వంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుని థైరాయిడ్ సమస్యకు మందులను ఇవ్వాల్సి ఉంటుంది. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ -
హైపోథైరాయిడిజం- హోమియోపతి వైద్యం
థైరాయిడ్ గ్రంథి తగినంత మోతాదులో థైరాయిడ్ హార్మోన్స్ (టీ3, టీ4) ను ఉత్పత్తి చేయలేకపోవడాన్ని హైపోథైరాయిజం అంటారు. దీనికి దీర్ఘకాలం అయోడిన్ లోపం ప్రధాన కారణం కాగా, మెదడులోని హైపోథలామస్, పిట్యుటరీ గ్రంథుల పనితీరులో లోపం, థైరాయిడ్ గ్రంథి వాపు, మానసిక సమస్యల కోసం వాడే కొన్నిరకాల మందుల దుష్ర్పభావం, దీర్ఘకాల మానసిక ఒత్తిళ్ళ వలన కూడా థైరాయిడ్ గ్రంథి పనితీరులో మార్పు వచ్చి హైపోథైరాయిడిజం ఉత్పన్నమవుతుంది. థైరాయిడ్ గ్రంథి నుండి తగినంత మోతాదుల్లో హార్మోన్స్ (టీ3, టీ4) ఉత్పన్నమవడానికి మన శరీరంలో చాలినంత అయోడిన్, టీఎస్‌హెచ్ (మెదడులోని పిట్యుటరీ గ్రంథి నుండి ఉత్పన్నమయ్యే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) అవసరం. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టిఎస్హెచ్) అయోడిన్‌ను థైరాయిడ్ గ్రంథికి సరఫరా కావడానికి, అక్కడ ైథైరాయిడ్ హార్మోన్స్ (టీ3, టీ4) ఉత్పత్తి అవ్వడానికి సహకరిస్తుంది. అయితే టీఎస్‌హెచ్ లోపం లేదా అయోడిన్ లోపం వల్ల ఈ ప్రక్రియ సజావుగా జరగక టీ3, టీ4 హార్మోన్స్ ఉత్పన్నం కాకపోవడాన్నే, ‘హైపోథైరాయిడిజం’ అంటారు. కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ గ్రంథి వాపు (hashimoto's thyroiditis) వల్ల కూడా థైరాయిడ్ హార్మోన్స్ (టీ3, టీ4) పరిమాణం తగ్గుతుంది. మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పనితీరులో వచ్చే మార్పుల వల్ల అది థైరాయిడ్ గ్రంథిపై దాడి చేసి అక్కడి కణజాలాన్ని దెబ్బతీయడం వలన ఈ వాపు ఏర్పడుతుంది. నిర్ధారణ పరీక్ష: సాధారణంగా టీ3, టీ4, టీఎస్‌హెచ్ హార్మోన్స్ పరిమాణం రక్తపరీక్ష ద్వారా నిర్ధారణ చేయవచ్చు. అయితే చాలావరకు పరీక్షల్లో టీ3, టీ4 అనేవి సాధారణ స్థితిలోనే ఉన్నప్పటికీ టీఎస్‌హెచ్ ఎక్కువస్థాయిలో ఉంటుంది. మన శరీరంలో ఉండే ఒక రక్షణ వ్యవస్థలో భాగంగా ఇలా జరుగుతుంది. హోమియోపతి వైద్యం: హోమియోపతిలో హైపోథైరాయిడిజం సమస్యను చాలావరకు అదుపులో ఉంచే ఔషధాలు ఉన్నాయి. అయితే మందుల ఎంపిక కేవలం లక్షణాలు తగ్గించే విధంగా కాకుండా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుం టారు. అంటే... వ్యక్తి శారీరక, మానసిక స్థితి, శారీరక లక్షణాలు, వాటికి కారణాలు పూర్తిగా విశ్లేషించాక వైద్యులు తగిన ఔషధాలు సూచిస్తారు. సాధారణంగా... కాల్కేరియా కార్బ్ కాల్కేరియా ఫాస్ అయోడమ్ థైరాయిడినమ్ కాల్కేరియా అయోడ్ స్పాంజియా మొదలగు మందులను వాటి వాటి లక్షణాలను బట్టి వైద్యుల పర్యవేక్షణలో వాడితే పూర్తి ప్రయోజనం ఉంటుంది. లక్షణాలు: హైపోథైరాయిడిజంలో సాధారణంగా.... బరువు పెరగడం, మొహం ఉబ్బటం, కాళ్ళుచేతులలో నీరు చేరడం జుట్టు రాలటం, అక్కడక్కడ చర్మం పొడిబారడం తొందరగా అలసిపోవటం, కండరాల నొప్పి మానసిక కుంగుబాటు మలబద్దకం సంతానలేమి, పురుషుల్లో సెక్స్ బలహీనత, మొదలగు లక్షణాలు కనిపిస్తుంటాయి. వ్యాధి తీవ్రత, వ్యక్తులను బట్టి ఈ లక్షణాలు, వాటి తీవ్రత మారుతుంటాయి. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, హన్మకొండ-వరంగల్, కర్ణాటక ph: 7416 107 107 / 7416 102 102 www.starhomeo.com Email : info@starhomeopathy.com -
సంతానలేమి వేధిస్తోందా?
పాశ్చాత్య దేశాల్లోలాగే ఇప్పుడు మన దగ్గర కూడా పని సంస్కృతి విపరీతంగా పెరిగిపోయింది. తమ రంగంలో రాణించడం కోసం రాత్రి-పగలు తేడా లేకుండా కృషి చేయడం అన్నది ఇప్పుడొక సాధారణ అంశంగా మారింది. దాంతో సరైన వయసులో పెళ్లి కాక, పెళ్లైనవాళ్లలో కూడా పై కారణాల వల్ల మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగి సంతానం కలగడానికి అవసరమైన హార్మోన్ల స్రావాలు సరిగా జరగక, సమస్యలు తలెత్తి, అవి సంతానలేమికి దారితీస్తున్నాయి. అయితే ఆధునిక విజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లో సంతానలేమికి చక్కటి పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి కనుక ఆందోళన చెందనవసరం లేదు. చాలామంది మహిళల్లో నెలసరి సమస్యలున్నా, స్త్రీలలో భర్త కన్నా భార్య వయసు ఎక్కువగా ఉన్నా లేదా భార్యాభర్తలిద్దరూ ఎలాంటి సంతాన నిరోధక పద్ధతులు పాటించకుండా సంవత్సర కాలం పాటు సంతానం కోసం ప్రయత్నించినా గర్భధారణ జరగకపోవచ్చు. మరి కొంతమందిలో కేవలం ఏడాది మాత్రమే గాక... ఏళ్లు గడుస్తున్నా గర్భం రాకపోవచ్చు. స్త్రీలకే కాదు... పురుషులకు కూడా... సంతానం కలగలేదంటే అందుకు మహిళను కారణంగా చూపడం మన సమాజంలో పరిపాటి. ఇది కేవలం అపోహ మాత్రమే. సంతానలేమికి కారణాలన్నవి అటు మహిళలలోనూ, ఇటు పురుషులలోనూ లేదా ఒక్కోసారి ఇద్దరిలోనూ ఉండవచ్చు. అంటే... దంపతులిద్దరిలో లోపం ఎవరిలోనైనా ఉండవచ్చునన్నమాట. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగినంతగా లేకపోవడం కూడా సంతానలేమికి కారణం కావచ్చు. అలాగే స్త్రీలలోనైతే హార్మోన్ల లోపం, థైరాయిడ్ సమస్య, పీసీఓడీ వంటి అనేక అంశాలు సంతానలేమికి కారణం కావచ్చు. దంపతులిద్దరూ ఎలాంటి గర్భనిరోధక సాధనాలు వాడకుండా, సంతాన నిరోధక ప్రక్రియలను అనుసరించకుండా... తమ దాంపత్యజీవితాన్ని గడిపితే సాధారణంగా ఏడాదిలోపు 75 శాతం మందిలో గర్భం వస్తుంది. ఇక యాభై శాతం మందిలో ఐదు మాసాల లోపే 50 శాతం మందిలో గర్భం వస్తుంది. రెండేళ్లలో 90 శాతం మందిలో గర్భం వస్తుంది. కానీ ఎవరిలోనైనా అంతకాలం తర్వాత కూడా గర్భం రాలేదంటే, ఏదైనా సమస్య ఉందేమోనని భావించాలి. సమస్యను తెలుసుకోవడానికి స్త్రీలు ముందుకు వచ్చి వైద్యపరీక్షలు చేయించుకున్నట్లుగా, పురుషులు అంత తేలిగ్గా ముందుకు రారు. సంతానలేమికి ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక పరిష్కారాలు... సంతానలేమి ఉన్నవారికి ఇప్పుడు మూడు రకాల పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. అవి... 1) ఐ.యు.ఐ. 2) ఇక్సీ 3) ఐ.వి.ఎఫ్. ఐ.యు.ఐ. : భర్త నుంచి సేకరించిన వీర్యాన్ని ల్యాబ్‌లో పరీక్షించి, దానిలోనుంచి ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్న కణాలను మాత్రం వేరు చేసి సిద్ధం చేస్తారు. వాటిని ఒక సన్నని గొట్టం ద్వారా స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియను అనుసరించడం వల్ల గర్భధారణకు 15 శాతం వరకు అవకాశం ఉంటుంది. ఇలా ఆరు రుతుచక్రాల పాటు ఈ చికిత్స చేసినా ఫలితం లేకుంటే అప్పుడు ఐ.వి.ఎఫ్. అనే ప్రక్రియను అనుసరించవచ్చు. ఇక్సీ: స్త్రీ నుంచి సేకరించిన అండాల్లోకి, పురుషుని శుక్రకణాన్ని ఒక ప్రత్యేకమైన మైక్రో మానిప్యులేటర్ సహాయంతో ప్రవేశపెట్టి ఫలదీకరణం చెందిస్తారు. వాటిని తిరిగి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ పద్ధతి ద్వారా గర్భధారణ విజయవంతం కావడానికి 40 శాతం వరకు అవకాశాలు ఉంటాయి. శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉన్నవారిలో ఈ ప్రక్రియ మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఐ.వి.ఎఫ్.: దీన్నే ‘టెస్ట్‌ట్యూబ్’ విధానం అంటారు. ముందుగా పక్వమైన అండాలను స్త్రీ నుంచి బయటకు తీసి, పురుషుడి శుక్రకణాలతో బయటే ఫలదీకరణం చెందిస్తారు. ఇలా ఏర్పడిన తొలి దశ పిండాల్లో రెండు లేదా మూడింటిని తిరిగి స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియ ద్వారా సంతానం కలగడానికి 30 నుంచి 35 శాతం విజయావకాశాలు ఉంటాయి. ఇటీవలికాలంలో సంతాన సాఫల్య చికిత్సలో మరెన్నో కొత్త విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఫలదీకరించిన పిండాలలో గర్భాశయంలోకి ప్రవేశపెట్టగా మిగిలిన పిండాలను అతి శీతల పరిస్థితుల్లో ఉంచి తరువాత వాటిని వాడతారు. అవసరాన్ని బట్టి అండాలను గాని శుక్రకణాలను గాని దాతల నుంచి స్వీకరించి వాడతారు. వీటితోపాటు పిండాన్ని మరో స్త్రీ గర్భాశయంలో పెంచే వినూత్నమైన సరోగసీ విధానం కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అందుకే సంతానం కలగడం లేదని ఏళ్ల తరబడి బాధపడేకన్నా, ఆధునిక పద్ధతులు అనుసరించడం శ్రేయస్కరం. సంతానలేమికి ముఖ్య కారణాలు... మన జీవనశైలితో పాటు కాలుష్యం, వాతావరణం, పొగతాగడం, మద్యం సేవించడం, బిగుతైన దుస్తులు ధరించడం, అధికబరువు, మానసిక ఒత్తిడి, కొన్నిరకాల మందులు, ఆరోగ్యకరమైన వీర్యం ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తాయి. పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగినంతగా లేకపోవడం, ఉన్నా... వాటిలో తగినంత చురుకుదనం లేకపోవడం లేదా వాటి ఆకృతి బాగా లేకపోవడం వంటి లోపాలు ఉన్నప్పుడు వారి భాగస్వామికి గర్భధారణ జరగడం కష్టమే. మరికొందరి వీర్యంలో అసలు శుక్రకణాలే ఉండకపోవచ్చు. ఇక మహిళ విషయానికి వస్తే... నెలసరి సమస్యలు, అండాల విడుదల సరిగా లేకపోవడం లేదా విడుదలైన అండాలలో నాణ్యత లోపించడం వంటివి ప్రధాన కారణాలు. వయసు పెరిగేకొద్దీ అబార్షన్లు అయ్యే అవకాశాలూ ఎక్కువే. మహిళ వయసు 30 ఏళ్లు దాటాక సంతాన అవకాశాలు తక్కువగా ఉంటాయి. నిర్వహణ: యాసీన్ డాక్టర్ సి. జ్యోతి, క్లినికల్ డెరైక్టర్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, స్టార్ ఫెర్టిలిటీ, మారేడ్‌పల్లి, సికింద్రాబాద్. -
ఆయిల్ వాడండి...ఆయిల్‌నెస్ దూరం చేసుకోండి
ఇప్పుడు ప్రతివారిలోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది. ‘హెల్త్ బాగుండాలంటే ఆయిల్ తక్కువ వాడాలండీ...’ లాంటి మాటలు అందరినోటా వినిపిస్తున్నాయి. నిజంగా ఆరోగ్యం విషయంలో నూనె వాడటం అంతటి ప్రమాదకరమా? నూనె అన్నది కేవలం రుచి కోసమేనా? ఆరోగ్యంగా ఉండాలనుకుంటే నూనె లేకుండా చేసిన పదార్థాలే తినాలా?... మనకు ఇలాంటి సందేహాలెన్నో వస్తాయి. నిజానికి మన శారీరక జీవక్రియలు సక్రమంగా జరగడానికి అవసరమైన ప్రధాన పోషకాలైన కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లతో పాటు కొవ్వులూ అంతే కావాలి. కాకపోతే వాటి పరిమితి మించకూడదంతే. నూనె వల్ల సమకూరే కొవ్వుల వల్లనే మనలోని ఎన్నో ఎంజైములు, హార్మోనులు పనిచేస్తాయి. పళ్లు, కండరాలు, శరీర అవయవాలు, కళ్లు, ఎముకల మంచి పనితీరుకు కొవ్వులు అవసరం. అయితే అవెంతగా అవసరమో, పరిమితి ఏమిటో తెలిసుండటం కూడా అంతే అవసరం. అందుకే... నూనెల గురించి అనేక అంశాలపై అవగాహన కలిగించుకోవడం కోసమే ఈ కథనం. మన ఒంటికి మిగతా పోషకాలతో పాటు కొవ్వులూ అవసరం. ఆ కొవ్వులు మనం వాడే వంట నూనెలు, ఇతరత్రా ఆహార పదార్థాలు (ఉదాహరణకు కొబ్బరి) నుంచి లభిస్తాయి. కొందరు కొన్నిరకాల నూనెలు... (ఉదాహరణకు కుసుమ నూనె, ఆలివ్ ఆయిల్ వంటివి) మంచివనీ, వేరుశనగ (పల్లీ) నూనె అంత మంచిది కాదనీ అంటారు. కొన్ని నూనెల్లో కొవ్వు తక్కువనీ, మరికొన్నింటిలో కొవ్వు పాళ్లు ఎక్కువని అంటుంటారు. ఇవన్నీ కేవలం పాక్షిక సత్యాలు మాత్రమే. ఇక ఆలివ్ ఆయిల్ వాడటం మంచిది కాబట్టి మధ్యధరాప్రాంతం వాళ్లంతా ఆరోగ్యంగా ఉంటారంటారు. ఆ మాటకొస్తే ఆలివ్ ఆయిల్, వేరుశనగ నూనె... ఈ రెండూ ‘మ్యూఫా’ అనే ఒకే కేటగిరీకి చెందిన నూనెలు. ఇక ప్యూఫాకు చెందిన కుసుమ నూనె కొలెస్ట్రాల్‌ను కాలేయంలోకి వెళ్లకుండా నిరోధిస్తుంది కాబట్టి దాన్నే అదేపనిగా ఎక్కువగా (పరిమితికి మించి) వాడితే అది వ్యాధి నిరోధక శక్తిని మందగింపజేయవచ్చు. కాబట్టి మనం మన ఒంటికి అవసరమయ్యే మోతాదులోనే వాడాలి. అంతేగాని కొవ్వుల పేరుకునేందుకు దోహదం చేసేటంత ఎక్కువ మోతాదులో నూనెలు వాడకూడదు. అలాగని నూనెను పూర్తిగా మానేస్తే...? నూనె అంటేనే నూటికి నూరుపాళ్లు కొవ్వు కాబట్టి వాటిని పూర్తిగా మానేయకూడదు. ఎందుకంటే నూనెల వల్ల మనకు సమకూరే కొవ్వులు మన శరీరంలో జరిగే ఎన్నో జీవక్రియలకు తోడ్పడతాయి. ఉదాహరణకు మనకు అవసరమైన కీలక విటమిన్లయిన ఏ, డి, ఈ, కె వంటివి కేవలం కొవ్వుల్లోనే కరుగుతాయి. అవి మన ఒంటికి పట్టాలంటే కొవ్వు అవసరం. ఇక ఫ్యాటీ ఆసిడ్స్ వల్ల మనకు రోగనిరోధక శక్తి సమకూరుతుంది. అంటే.. మనకు అవసరమైన మోతాదుల్లో అందాల్సిన నూనెలనూ కాదనుకుంటున్నామంటే...రోగనిరోధకశక్తిని దెబ్బతీసుకుంటున్నామని అర్థం. పైగా ప్రమాదవశాత్తూ మనం గాయపడ్డా మనలోని కీలకమైన అవయవాలకు దెబ్బ తగలకుండా ఉండేందుకు (ఉదాహరణకు... మూత్రపిండాలు, కాలేయం, గుండె) స్వతహాగా అవి వాటి చుట్టూ కొవ్వు పేరుకునేలా చేసుకుంటుంది మన శరీరం. అందుకే మనకు నూనెలు... వాటివల్ల సమకూరే కొవ్వులు కావాలన్నమాట. కాకపోతే మితిమీరి నూనెలు తీసుకుంటే వచ్చే అనర్థాలు కూడా ఉంటాయి కాబట్టి వాటి పరిమితి మించకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు అవసరమయ్యే నూనెల్లో రకాలు... మానవ శరీరానికి అవసరమైన నూనెలను ప్రధానంగా నాలుగు రకాలైన ఫ్యాటీ ఆసిడ్స్గా విభజించవచ్చు. అవి... మోనో-అన్ సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ (మ్యూఫా - ఉదా: వేరుశనగ నూనె, ఆలివ్ నూనె) పాలీ- అన్ సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ (ప్యూఫా - ఉదా: సఫోలా, పొద్దుతిరుగుడు నూనె) సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ (ఉదా: నెయ్యి, డాల్డా, కొబ్బరి, పామోలిన్ నూనె ) ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ (ఉదా: చేప నూనె, సోయాబీన్నూనె, ఆవనూనె) ఆరోగ్యానికి మేలు చేసేలా నూనెలను ఎలా వాడాలి..? నిజానికి ఫలానానూనె మాత్రమే ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిర్దిష్టంగా చెప్పలేం. మోనో అన్ సాచ్యురేటెడ్, పాలీ అన్సాచ్యురేటెడ్, ఒమెగా-3 ఫ్యాటీఆసిడ్స్, వీటితోపాటు అతి తక్కువమోతాదులో శరీరానికి సాచ్యురేటెడ్ ఆయిల్స్ అందేలా నూనెల కాంబినేషన్స్‌ను మారుస్తుండటం మంచిది. మనకు, మన గుండెకు కొవ్వు పేరుకొని హాని కలిగించని రీతిలో వాడుకోవాలంటే... మ్యూఫా, ప్యూఫాల కాంబినేషన్లో నూనెలను వాడుతుండాలి. ప్యూఫా విభాగంలోకి వచ్చే నూనెలైన పొద్దుతిరుగుడు, కుసుమ నూనెలు గుండెకు హాని చేసే కొలెస్ట్రాల్‌ను నిరోధిస్తాయి. కాబట్టి వీటిని తప్పక వాడాలి. అయితే మోనో అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ (మ్యూఫా)లను తీసుకోవడమూ చాలా ప్రధానం. ఆలివ్ ఆయిల్, వేరుశనగ నూనెలు ఈ మ్యూఫాకు ఉదాహరణ. ఇవి వాడాల్సిన పద్ధతులు ఏమిటంటే... ఉదయం ప్యూఫా వాడితే, సాయంత్రం మ్యూఫా వాడవచ్చు. (రివర్స్‌లో కూడా). లేదా ఒకటి ఒక నెలరోజులు వాడి, మరో నెలపాటు మరో రకాన్ని వాడవచ్చు. ఇలా ప్యూఫా, మ్యూఫాలను మార్చి మార్చి వాడటం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. దాంతో నూనెలతో గుండెకు కలిగే హాని చాలా తక్కువగా ఉంటుంది. ఎంత మోతాదుల్లో వాడాలి...? ప్రతి ఒక్కరూ రోజుకు 25 గ్రాముల నూనె వాడటం అన్నది నిపుణులు సిఫార్సు చేసే పరిమాణం. మాంసాహారంలో ఉండే యానిమల్ ఫ్యాట్‌తో శరీరంలో కొవ్వు చేరుతుంది. మాంసాహారం తీసుకునేవారు చేపలను వారానికి కనీసం రెండు మూడుసార్లు తీసుకోవడం మంచిది. అదే శాకాహారులైతే వాళ్లు ఉపయోగించే నూనెలతో పాటు తప్పనిసరిగా సోయాబీన్నూనె లేదా ఆవనూనె వాడాలి. ఎందుకంటే... చేపలు వంటి మాంసాహారం ద్వారా మన శరీరానికి అందాల్సిన ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఆ నూనెల్లో ఉంటాయి కాబట్టి వాటిని శాకాహారంతో ఇలా భర్తీ చేయాలన్నమాట. నెయ్యి, డాల్డా వంటి సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ విషయానికి వస్తే ఒక్కొక్కరు నెలకు 150గ్రా.లకు మించి తీసుకోవద్దు. కనిపించని కొవ్వులు (ఇన్విజిబుల్ ఫ్యాట్స్) అంటే... నట్స్, డ్రైఫ్రూట్స్, ఇతర మాంసాహార పదార్థాలు, పాలతో వచ్చే కొవ్వుల విషయంలో జాగ్రత్త కోసం అవి తీసుకునే సమయంలో కొంత సంయమనం పాటించాలి. ఆరోగ్యకరమైన పరిమితి ఎంత...? వంటనూనెలు పరిమితిలోపే తీసుకోవాలని అందరూ అంటారు. అందుకే ఆరోగ్యకరమైన పరిమితి ఎంత అన్నది తెలుసుకోవాలి. ఒక వ్యక్తి నెలలో అర లీటర్ (500 ఎం.ఎల్) నుంచి వుుప్పావు లీటర్ (750 ఎం.ఎల్) వరకు నూనెను వాడవచ్చు. అంతకుమించి వాడటం ఆరోగ్యానికి వుంచిది కాదు. ఇక డయాబెటిస్, గుండెజబ్బులు, రక్తపోటులాంటివి ఉన్నవారైతే తప్పనిసరిగా 500 ఎం.ఎల్. కంటే మించనివ్వకూడదు. రోజువారీ వాడకంలో దీన్ని ఇలా గుర్తుంచుకోవచ్చు. ఒక టీస్పూన్లో 5 ఎం.ఎల్. నూనె పడుతుంది. ప్రతి వ్యక్తీ రోజూ 3 టీస్పూన్ల నూనె వాడితే అది నెలకు 450 ఎం.ఎల్. అవుతుందన్నవూట. కాస్తంత మొగ్గుగా భావించి వురో 50 ఎం.ఎల్.ను తీసుకోదలిస్తే ప్రతి వ్యక్తి ఒక రోజులో వుూడు నాలుగు చెంచాల నూనెకు మించి వాడకూడదని నియువుం పెట్టుకోవాలి. దీన్నిబట్టి ఎవరైనా తమ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారన్న లెక్క ఆధారంగా ఎంత నూనె వాడాలన్న పరిమితిని తెలుసుకోవచ్చు. ఉదాహరణకు నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే నెలకు రెండు లీటర్లు, ఐదుగురు కుటుంబ సభ్యులు ఉంటే రెండున్నర లీటర్లకు మించి వాడకూడదన్నమాట. నూనెలు, కొవ్వులు, మాంసం ఎక్కువ తీసుకుంటున్నవారైతే...? ఏవైనా కారణాల వల్ల లేదా జిహ్వచాపల్యం వల్ల నూనెలు, కొవ్వులు, మాంసాహారం పరిమితికి మించి ఎక్కువగా తీసుకుంటున్నవారు, దాని దుష్ర్పభావాలను కొంతైనా తగ్గించుకోడానికి ఏం చేయాలో తెలుసుకోండి. నూనెలు ఎక్కువగా తీసుకుంటే అది కొవ్వుగా మారి గుండెకు హాని చేస్తుందన్న విషయం తెలిసిందే. దాన్ని నిరోధించడానికి పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. సంప్రదాయబద్ధంగా తీసుకునే వరి అన్నంతో పాటు, ఆకుపచ్చరంగులో ఉండే అన్ని ఆకుకూరల్లో, కూరగాయల్లో పీచు ఎక్కువ. అందుకే మాంసాహారం తీసుకునేవారు దాన్ని నిరోధించుకోలేకపోతే కనీసం ఎంత మోతాదులో మాంసం తింటున్నారో దానికంటే ఎక్కువగా ఆకుకూరలు, పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. అంటే గ్రీన్‌సలాడ్ ఎక్కువగా తీసుకోవాలి. అయితే గ్రీన్‌సలాడ్ పచ్చిగా తీసుకుంటాం కాబట్టి, అందులో రసాయన కాలుష్యాలు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అందుకే గ్రీన్సలాడ్స్కు బదులు వండిన కాయగూరలనే ఎక్కువ మోతాదులో తీసుకోవడం కూడా మంచిదే. అలా అని అదేపనిగా మాంసాహారం తీసుకోకూడదు. పైన పేర్కొన్న విధంగా విచక్షణతో పరిమితులు పాటిస్తూ వాడుకుంటే మన జీవక్రియలన్నీ సజావుగా జరుగుతాయి. నూనెలతో మన శరీరానికి జరగాల్సిన మేలూ చేకూరుతుంది. నిర్వహణ: యాసీన్ నూనెతో వచ్చే ప్రమాదాలను నివారించండిలా... వేపుళ్లు చాలా రుచిగా ఉంటాయి. ఆ రుచిని ఆస్వాదించడం కోసమే ఆహార పదార్థాలను ఫ్రై చేస్తుంటారు. (ఉదా: ఆలూ చిప్స్, చికెన్, మటన్, చేపల వంటివి). అందుకోసం నూనెను ఎక్కువగా వాడుతుంటారు. నిజానికి ఎక్కువగా ఫ్రై చేయుడం వల్ల ఆహారంలోని పోషకాలు నశిస్తాయి. రుచి కోసం పోషకాలను వదులుకోవడం మంచిది కాదు. అందుకే ఫ్రై లకు బదులుగా ఉడికించిన పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి మేలు. ఇక ఫ్రై చేయడానికి ఆలివ్ ఆయిల్ మంచిది కాదు. ఎందుకంటే మిగతా నూనెలతో పోలిస్తే వేడిచేయడం వల్ల ఆలివ్ ఆయిల్‌లోని రసాయన బంధాలు త్వరగా విడిపోతుంటాయి. అందుకే సాధారణంగా ఆలివ్ ఆయిల్ మిగతా నూనెల కంటే మంచిదే అయినప్పటికీ దానితో ఫ్రై చేసుకోవడం హానికరం అని గుర్తుంచుకోండి. నూనెలలో రకాలపై ప్యూఫా, మ్యూఫాలను మార్చి మార్చి వాడటం (అలా మార్చడం ఉదయం, సాయంత్రం కావచ్చు లేదా రోజు విడిచి రోజు కావచ్చు లేదా నెలకు ఒకమారు మార్చుకోవచ్చు) మంచిది. అలాగని... ఈ రెండు రకాల నూనెలనూ కలిపి వాడటం మంచిది కాదని గుర్తుంచుకోవాలి. వీటిని దేనికదే విడివిడిగా వాడాలి. వేపుళ్ల కోసం గాని, వంటకోసం గాని ఒకసారి వాడిన నూనెను (నెయ్యి కూడా) మళ్లీ ఉపయోగించకూడదు. ఎందుకంటే ఒకసారి మంట మీద పెట్టినప్పుడు నూనెలోని రసాయన బంధాల్లో మార్పులు వస్తాయి. ఇలా మారిన రసాయన బంధాల నూనెను మళ్లీ వాడితే దాంట్లోంచి క్యాన్సర్ కారకమైన పదార్థాలు (కార్సినోజెన్స్), హానికరమైన ట్రాన్స్ ఫ్యాటీ ఆసిడ్స్ వెలువడతాయి. కాబట్టి ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదు. -
హోమియోకేర్ చెంత థైరాయిడ్ నుంచి నిశ్చింత
ఆధునిక జీవితంలో ప్రతి 20 మందిలో ఒక వ్యక్తికి థైరాయిడ్ సమస్య రాగలదు. థైరాయిడ్ గ్రంథి నుండి విడుదలైన హార్మోనులు రక్త ప్రవాహంలో కలిసి శారీరక పెరుగుదలకు, జీవక్రియలు జరగడానికి తోడ్పడతాయి. థైరాయిడ్ గ్రంథిలో వచ్చే మార్పుల వల్ల ఈ సమస్య వస్తుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్, అందువల్ల జీవక్రియలన్నీ నెమ్మదిస్తాయి. ప్రస్తుత జీవన పరిస్థితులలో మానసిక ఒత్తిళ్ళ వల్ల, ఆహార సమతుల్యం/ శారీరక శ్రమ లోపించడం వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశం ఎక్కువ. అప్పుడే పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు ఏ వయసువారికైనా ఈ సమస్య రావచ్చు. అయితే వయసును అనుసరించి కారణాలు మారవచ్చు. శిశువులలో... థైరాయిడ్‌గ్రంథి నిర్మాణంలో ఏదైనా లోపం ఉన్నపుడు సాధారణంగా ఈ సమస్య కనిపిస్తుంది. దీన్ని కంజెనిటల్ హైపోథైరాయిడిజం అంటారు. పెద్దవారిలో హషిమోటో థైరాయిడిటైటిస్, ఈ హైపోథైరాయిడిజం సమస్య రావడానికి ఒక సాధారణ కారణం. రకాల: థైరాయిడ్ సమస్యలు 2 రకాలు 1.హైపోథైరాయిడిజం: జీవక్రియలు సజావుగా జరగడానికి సరిపడా థైరాక్సిన్ హార్మోన్‌ను థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేయకపోవడాన్ని హైపో థైరాయిడిజం అంటారు. ఫలితంగా అలసట, చర్మం పొడిబారడం, అధిక బరువు, స్త్రీలలో నెలసరి సమస్యలు, మగత, మలబద్దకం చలికి తట్టుకోలేకపోవడం, జుట్టు రాలడం, కీళ్ల నొప్పులు, చిరాకు, మతిమరుపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2.హైపర్ థైరాయిడిజం: థైరాయిడ్ గ్రంథి అధికంగా పనిచేయడం వలన ఈ సమస్య వస్తుంది. గుండెదడ, చేతులు, కాళ్ళు వణకడం, నిద్రలేమి, ఆందోళన, బరువు తగ్గిపోవడం, వేడిని తట్టుకోలేకపోవడం, ఆకలి పెరగడం, నెలసరి సమస్యలు, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్ హార్మోన్లు అధికంగా స్రవించడం వల్ల థైరోటాక్సికోసిస్ వస్తుంది. ఈ వ్యాధి చాలా నెమ్మదిగా ప్రారంభమవుతుంది. కంటి కండరాలు వాచి, కంటి గుడ్లు ముందుకు వచ్చినట్లు కనిపిస్తే దీన్ని Grave's disease అంటారు. కొంతమందికి థైరాయిడ్‌గ్రంథి పెద్దదై మెడభాగంలో వాపు వస్తుంది. దీన్ని గాయిటర్ అంటారు. పరీక్షలు: థైరాయిడ్ సమస్య ఉందా లేదా అని తెలుసుకోవడానికి టి3, టి4, టిఎస్హెచ్ హార్మోన్ల లెవల్స్‌ను రక్త పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పై లెవల్స్‌లో ఉండే హెచ్చుతగ్గులను బట్టి వ్యాధిని నిర్థారిస్తారు. రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందేమో నిర్థారించడానికి థైరాయిడ్ యాంటీ టాడిస్ (యాంటీ టిపిఓ బాడిస్) పరీక్షలు అవసరమవుతాయి. మెడ లోపలి భాగంలో సీతాకోక చిలుక ఆకృతిలో ఉండే థైరాయిడ్‌గ్రంథి అత్యంత కీలకమైన విధులను నిర్వహిస్తుంటుంది. థైరాయిడ్ వ్యాధిగ్రస్తుల్లో కొందరికి కనుగుడ్లు బయటకు పొడుచుకు వచ్చినట్లుగా ఉంటాయి. మరికొందరిలో గాయిటర్ సమస్య వస్తుంది. హోమియో వైద్యం హోమియో కేర్ వైద్యవిధానంలో రోగి శారీరక, మానసిక పరిస్థితి ఆకలి, నిద్ర, ఆందోళనలు తదితర అంశాలలో పాటు వంశపారంపర్యత, ఆరోగ్యచరిత్ర వంటివి పరిగణనలోకి తీసుకొని మళ్ళీ వచ్చే అవకాశం లేకుండా థైరాయిడ్ సమస్యకు వైద్య చికిత్స ఇవ్వబడుతుంది. ప్రపంచంలో మొదటిది కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ద్వారా హోమియోకేర్ థైరాయిడ్ సమస్యలకు అత్యధిక శాతం రోగులకు పూర్తిగా తగ్గించడం జరుగుతుంది. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత సలహా సంప్రదింపుల కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు. -
పీసీఓడీ సమస్య సంతానలేమికి కారణం కావచ్చు
ఆడవాళ్ళలో, అదీ ఇవాళ్టి రోజుల్లో, హార్మోన్ల అసమతుల్యత అనే సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఇందువల్ల ముఖ్యంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల అసమతుల్యత వల్ల అండాశయంలో నీటితిత్తులు ఏర్పడుతున్నాయి. దీనినే పీసీఓడీ (PCOD) లేదా పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటారు. ఇది ఒక్కొక్కసారి జన్యువులలో ఏదైనా తేడా వచ్చినప్పుడు కూడా రావచ్చు లేదా ఏదైనా మానసిక ఒత్తిడి లేదా ఆందోళనల వలన హార్మోన్ల మీద దాని ప్రభావం చూపి ిపీసీఓడీ సమస్య తలెత్తవచ్చు. కారణాలు: 1) వారసత్వంగా వస్తున్న 2) జన్యుపరమైన విభేదాలు 3) మానసికంగా ఉండే ఒత్తిడి, ఆందోళనలు. ఇటువంటివన్నీ చిన్న హార్మోన్ల అసమతుల్యతతో మొదలై నెలసరులు సక్రమంగా రాక, భవిష్యత్తులో ఇటువంటి నీటితిత్తులు ఏర్పడి సంతానలేమి సమస్య రావచ్చు, అంతే కాకుండా సంతానం కలిగిన, పుట్టబోయే పిల్లలలో జన్యుపరంగా వచ్చే వ్యాధులు కూడా రావచ్చు. లక్షణాలు నెలసరుల సమస్యలు నెలసరులు అనేవి మొదటగా ప్రతినెల వచ్చేవి కాస్త ఆలస్యంగా రావటం అంటే 26-30 రోజుల మధ్యలో రావలసినవి 33-40 రోజులకు రావటం ఆ తర్వాత నెల విడిచి నెల రావటం ఉంటుంది. ఒకవేళ నెలసరి వచ్చినా రక్తస్రావం చాలా తక్కువగా ఉంటుంది. కాని నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సంతానలేమి ఈ పీసీఓడీ సమస్య వల్ల అండం విడుదల అనేది సరిగ్గా ఉండదు. ఇంకా అండం విడుదల కాకుండా కూడా నెలసరులు వస్తాయి. దీనిని ‘ఎన్ఒవ్యులేటరీ సైకిల్స్’ అంటారు. అండం విడుదల అవకపోతే సంతానం కలగదు. మగవాళ్ళల్లో ఉండే ఎండ్రోజన్ హార్మోన్లు మగవాళ్ళలో ఉండే ఎండ్రోజన్ హార్మోన్లు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయ్యి మొటిమలు, అవాంఛిత రోమాలు, నెలసరులు తరచుగా వస్తూండటం జరుగుతుంది. బరువు అతిగా పెరగటం దీనివలన కొలస్ట్రాల్ స్థాయిలు శరీరంలో పెరిగి మధుమేహం లేదా చక్కెర వ్యాధి వస్తుంది. ఒక్కొక్కసారి ఈ పీసీఓడీ సమస్యకు సరైనరీతిలో చికిత్స తీసుకోకపోతే, హైపో థైరాయిడిజమ్ సమస్యకు కూడా దారితీస్తుంది. పాజిటివ్ హోమియోపతిలో పీసీఓడీ సమస్యకు సరైన పరిష్కారం ఉంటుంది. ఈ సమస్య అనేది ఎక్కడ నుంచి ప్రారంభమైందో అంటే మూలకారణాన్ని ఎనలైజ్ చేసుకొని, నీటితిత్తుల సైజ్‌ని బట్టి చికిత్సను ప్రారంభించి, ‘జెనిటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్’ అనే పద్ధతి ద్వారా మందులు ఇస్తారు. దీనివలన మొదటగా నెలసరులు సక్రమంగా వచ్చి, అండం విడుదల మొదలై సంతానం కలుగుతుంది. హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక - తమిళనాడు. అపాయింట్మెంట్ కొరకు 9246199922