మనం ఆనందం కోసం ఎక్కడెక్కడో వెతుకుతాం. కానీ అది మన చేతిలోని పనే. పైసా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. సులభంగా మన నిత్య జీవితంలో ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటామట. మన దీర్ఘాయువుకు మూలం అవేనట చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మనిషి ఆనందాన్ని నిర్ణయించే ఈ హార్మోనులు గురించి తెలుసుకుంటే సంతోషంగా ఎలా ఉండాలో తెలుస్తుందని చెబుతున్నారు నిపుణులు. తద్వారా మనశ్శాంతిని, సంతోషకరమైన జీవితాన్ని సొంతం చేసుకోగలం అని అంటున్నారు. అవేంటో చూద్దామా..!
ఆ హార్మోనులు ఏంటంటే..
ఎండార్ఫిన్స్, డోపామిన్, సెరిటోనిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్‌లు గురించి పూర్తిగా తెలుసుకుంటే హాయిగా సంతోషంగా ఉంటాం అని చెబుతున్నారు నిపుణులు. ముందుగా ఒక్కొక్కదాని గురించి సవింరంగా తెలుసుకుందాం..
ఎండార్ఫిన్స్: వ్యాయామాలు చేసేటప్పుడూ విడుదలయ్యేదే ఈ ఎండార్ఫిన్స్. ఇవి వ్యాయామం వల్ల కలిగే నొప్పులను భరించే శక్తిని ఇస్తాయి. అలాగే నవ్వడం వల్ల కూడా ఈ హార్మోన్ విడుదలవుతుంది. అందుకే యోగాలో హాస్యాసనం కూడా ఒక ఆసనంగా మన పూర్వీకులు చేర్చారు. అందువల్ల ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామాలు చేయడం, హాస్య భరిత సీన్‌లు, వీడియోలు చూడటం వంటివి చేయాలి.
డోపామిన్: ఎవరైన పొగడగానే లోపల నుంచి తన్నుకుంటే వచ్చే ఆనందానకి కారణం ఈ హార్మోనే. దీని స్థాయిని పెంచుకుంటే ఆనందంగా ఉంటాం. కొత్త బట్టలు, వస్తువులు కొనుక్కున్నప్పుడు కలిగే ఫీలింగ్ ఇదే. ముఖ్యంగా భార్యభలు ఈ విషయాన్ని గ్రహించి పొగడటం ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ సంతోషాన్ని పొందడమే గాక మీ మధ్య బంధం కూడా బలపడుతుంది.
సెరిటోనిన్: ఇతరులకు సహాయం చేయడం వల్ల కలిగేది. సమాజానికి, స్నేహితులకు ఏదైన సాయం చేయడం వల్ల వచ్చే ఒక విధమైన ఆనందానికి మూలమే ఈ సెరిటోనిన్. అందుకే మొక్కలు నాటడం, రక్తదానం, అనాథలకు సేవ తదితరాల వల్ల సంతోషంగా ఉంటారు.
ఆక్సిటోసిన్: పెళ్లైన కొత్తలో శరీరంలో బాగా విడుదలయ్యే హార్మోన్ ఇదే. ఎవరినైనా మన దగ్గరకు తీసుకున్నప్పడూ మనలో విడుదలయ్యే హార్మోన్ ఇది. స్నేహితులను ఆలింగనం చేసుకోవడం వల్ల విడుదలవుతుంది. మన పిల్లలను, జీవిత భాగస్వామిని కౌగలించుకున్నప్పుడు మనలో కలిగే ఒక విధమైన సంతోషానికి కారణం ఈ హార్మోన్. అందువల్ల తరుచుగా మీకు ప్రియమైన వాళ్లను హగ్ చేసుకుంటూ ఉండటం వంటివి చేయండి. దీని వల్ల ప్రేమానుబంధాలు బలపడి కుటుంబ ఐక్యంగా ఉండేందుకు దోహదపడుతుంది.
ఇలాంటివి అలవాటు చేసుకోవాలి..
ఓ అరంగంట వ్యాయామం చేయండి
చిన్న పనులకు సంతృప్తిగా ఫీలవ్వుతూ గర్వంగా ఫీలవ్వండి. ఇక్కడ కళ్లు నెత్తికెక్కెలా కాదు. కేవలం చిన్న లక్ష్యాలను అందిపుచ్చుకున్నామని, సంతోషంగా భావించడం.
అలాగే మీ పిల్లలను, భాగస్వామిని తరుచుగా ప్రశంసిచండి.
తోచినంతలో సాయం చేసే యత్నం చేయడం, మొక్కలు పెంచడం వంటివి చేయండి.
మీ పిల్లలను, భాగస్వామిని ప్రేమగా దగ్గరకు తీసుకోవడం, ప్రేమను వ్యక్తం చేసేలా హగ్ చేసుకోవడం వంటివి చేస్తే వాళ్లు భరోసాగా ఫీలవ్వుతారు. పైగా మీరు కూడా సంతోషంగా ఉంటారు. పైసా ఖర్చు పెట్టకుండా ఆనందాన్ని పొందడమే గాక సంతోషంగా హాయిగా జీవిద్దాం.
(చదవండి: రాజకీయ నాయకులే దేవుళ్లుగా పూజలందుకుంటున్న ఆలయాలు ఇవే..!)
Comments
Please login to add a commentAdd a comment