హైపోథైరాయిడిజం- హోమియోపతి వైద్యం
థైరాయిడ్ గ్రంథి తగినంత మోతాదులో థైరాయిడ్ హార్మోన్స్ (టీ3, టీ4) ను ఉత్పత్తి చేయలేకపోవడాన్ని హైపోథైరాయిజం అంటారు.
దీనికి దీర్ఘకాలం అయోడిన్ లోపం ప్రధాన కారణం కాగా, మెదడులోని హైపోథలామస్, పిట్యుటరీ గ్రంథుల పనితీరులో లోపం, థైరాయిడ్ గ్రంథి వాపు, మానసిక సమస్యల కోసం వాడే కొన్నిరకాల మందుల దుష్ర్పభావం, దీర్ఘకాల మానసిక ఒత్తిళ్ళ వలన కూడా థైరాయిడ్ గ్రంథి పనితీరులో మార్పు వచ్చి హైపోథైరాయిడిజం ఉత్పన్నమవుతుంది.
థైరాయిడ్ గ్రంథి నుండి తగినంత మోతాదుల్లో హార్మోన్స్ (టీ3, టీ4) ఉత్పన్నమవడానికి మన శరీరంలో చాలినంత అయోడిన్, టీఎస్‌హెచ్ (మెదడులోని పిట్యుటరీ గ్రంథి నుండి ఉత్పన్నమయ్యే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) అవసరం. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టిఎస్‌హెచ్) అయోడిన్‌ను థైరాయిడ్ గ్రంథికి సరఫరా కావడానికి, అక్కడ ైథైరాయిడ్ హార్మోన్స్ (టీ3, టీ4) ఉత్పత్తి అవ్వడానికి సహకరిస్తుంది. అయితే టీఎస్‌హెచ్ లోపం లేదా అయోడిన్ లోపం వల్ల ఈ ప్రక్రియ సజావుగా జరగక టీ3, టీ4 హార్మోన్స్ ఉత్పన్నం కాకపోవడాన్నే, ‘హైపోథైరాయిడిజం’ అంటారు.
కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ గ్రంథి వాపు (hashimoto's thyroiditis) వల్ల కూడా థైరాయిడ్ హార్మోన్స్ (టీ3, టీ4) పరిమాణం తగ్గుతుంది. మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పనితీరులో వచ్చే మార్పుల వల్ల అది థైరాయిడ్ గ్రంథిపై దాడి చేసి అక్కడి కణజాలాన్ని దెబ్బతీయడం వలన ఈ వాపు ఏర్పడుతుంది.
నిర్ధారణ పరీక్ష: సాధారణంగా టీ3, టీ4, టీఎస్‌హెచ్ హార్మోన్స్ పరిమాణం రక్తపరీక్ష ద్వారా నిర్ధారణ చేయవచ్చు. అయితే చాలావరకు పరీక్షల్లో టీ3, టీ4 అనేవి సాధారణ స్థితిలోనే ఉన్నప్పటికీ టీఎస్‌హెచ్ ఎక్కువస్థాయిలో ఉంటుంది. మన శరీరంలో ఉండే ఒక రక్షణ వ్యవస్థలో భాగంగా ఇలా జరుగుతుంది.
హోమియోపతి వైద్యం: హోమియోపతిలో హైపోథైరాయిడిజం సమస్యను చాలావరకు అదుపులో ఉంచే ఔషధాలు ఉన్నాయి. అయితే మందుల ఎంపిక కేవలం లక్షణాలు తగ్గించే విధంగా కాకుండా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుం టారు. అంటే... వ్యక్తి శారీరక, మానసిక స్థితి, శారీరక లక్షణాలు, వాటికి కారణాలు పూర్తిగా విశ్లేషించాక వైద్యులు తగిన ఔషధాలు సూచిస్తారు.
సాధారణంగా...
కాల్కేరియా కార్బ్
కాల్కేరియా ఫాస్
అయోడమ్
థైరాయిడినమ్
కాల్కేరియా అయోడ్
స్పాంజియా మొదలగు మందులను వాటి వాటి లక్షణాలను బట్టి వైద్యుల పర్యవేక్షణలో వాడితే పూర్తి ప్రయోజనం ఉంటుంది.
లక్షణాలు:
హైపోథైరాయిడిజంలో సాధారణంగా....
బరువు పెరగడం, మొహం ఉబ్బటం, కాళ్ళుచేతులలో నీరు చేరడం
జుట్టు రాలటం, అక్కడక్కడ చర్మం పొడిబారడం
తొందరగా అలసిపోవటం, కండరాల నొప్పి
మానసిక కుంగుబాటు
మలబద్దకం
సంతానలేమి, పురుషుల్లో సెక్స్ బలహీనత, మొదలగు లక్షణాలు కనిపిస్తుంటాయి.
వ్యాధి తీవ్రత, వ్యక్తులను బట్టి ఈ లక్షణాలు, వాటి తీవ్రత మారుతుంటాయి.
డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో),
స్టార్ హోమియోపతి,
సికింద్రాబాద్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్,
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, హన్మకొండ-వరంగల్, కర్ణాటక
ph: 7416 107 107 / 7416 102 102
www.starhomeo.com
Email : info@starhomeopathy.com