Hypothyroidism
-
Health Tips: రెండో నెల.. హైపో థైరాయిడ్! డైట్‌తో కంట్రోల్ చెయ్యొచ్చా?
Hypothyroidism During 2nd month Pregnancy: నాకిప్పుడు రెండవ నెల. నాకు హైపో థైరాయిడ్ ఉందని డాక్టర్ చెప్పారు. దీనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చెయ్యమన్నారు. దీన్ని డైట్‌తో కంట్రోల్ చెయ్యొచ్చా? మందులు తప్పనిసరిగా వేసుకోవాలా? – ఎన్. సీతాలక్ష్మి, గణపవరం థైరాయిడ్ గ్రంథి కొన్ని హార్మోన్స్‌ను విడుదల చేస్తుంది. ఈ గ్రంథి రిలీజ్ చేయవలసిన దానికన్నా తక్కువ విడుదల చేస్తుంది అని గ్రహించగానే దానికి బ్రెయిన్ సిగ్నల్స్ ఇస్తుంది ఎక్కువ విడుదల చేయమని. అందుకే టీఎస్‌హెచ్ అనేది పెరుగుతుంది. ఈ గ్రంథి నుంచి వచ్చే థైరోక్సిన్ హార్మోన్ బాగా పనిచెయ్యాలంటే మీరు తినే ఆహారంలో అయోడిన్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాలి. తొలి పన్నెండు వారాల ప్రెగ్నెన్సీలో.. టీఎస్‌హెచ్ ఎక్కువ అయితే హైపోథైరాయిడిజం అంటారు. బిడ్డకు తల్లి నుంచే థైరాయిడ్ హార్మోన్స్ వెళ్తాయి. మీకు హార్మోన్స్ తక్కువ ఉంటే అది బిడ్డ మీద కూడా ప్రభావం చూపుతుంది. తొలి పన్నెండు వారాల ప్రెగ్నెన్సీలో బిడ్డ థైరాయిడ్ గ్రంథి ఇంకా వృద్ధి చెందదు. ఈ థైరాయిడ్.. బిడ్డ మెదడు ఎదుగుదలకు చాలా అవసరం. అందుకే మీకు థైరాయిడ్ డెఫిషియెన్సీ ఉంటే వెంటనే మెడికేషన్ తీసుకోవాలి. డాక్టర్ తొలి పన్నెండు వారాల్లో టీఎస్‌హెచ్ హార్మోన్ 2–5 కన్నా ఎక్కువ ఉంటే థైరాయిడ్ ట్రీట్మెంట్ను సూచిస్తారు. ప్రతి నెల లేదా మూడు నెలలకు ఒకసారి టీఎస్‌హెచ్ చెక్ చేస్తారు. థైరాయిడ్ యాంటీబాడీస్ బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు. మూడవ నెల తరువాత టీఎస్‌హెచ్ మూడు కన్నా తక్కువ ఉండాలి. ఆ విధంగా మందుల మోతాదును నిర్ణయిస్తారు. కొన్నిసార్లు తల్లికి ఏ సింప్టమ్స్ ఉండవు కానీ టీఎస్‌హెచ్ ఎక్కువ అవుతుంది. దీనిని సబ్కెమికల్ థైరాయిడ్ అంటారు. వీళ్లకు యాంటీబాడీస్ ఫర్ థైరాయిడ్ చెక్ చేస్తారు. టీపీఓ యాంటీబాడీస్ నెగెటివ్ ఉంటే ట్రీట్మెంట్ అవసరం లేదు. క్రమం తప్పకుండా టీఎస్‌హెచ్ చెక్ చేసుకోవాలి. ప్రసవం అయిన ఆరువారాలకు తల్లికి మళ్లీ టీఎస్‌హెచ్ చెక్ చేసి మందులు కొనసాగించాలా.. వద్దా అనేది చెప్తారు. - డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. చదవండి: Pregnancy- Iron Rich Foods: ఏడో నెల.. ఐరన్ మాత్రలు వేసుకుంటే వాంతులు! ఇవి తిన్నారంటే.. Pregnancy 1st Trimester: మూడో నెల.. ప్రెగ్నెన్సీలో ఇవి చేయాల్సిన అవసరం ఉంటుందా? -
హైపో థైరాయిడిజమ్.. ఏం తినాలి? ఏం తినకూడదు!!
లైఫ్ స్టయిల్ ఆరోగ్య సమస్యలకు ఒక దశాబ్దకాలంగా థైరాయిడ్ కూడా తోడయింది. మధ్య వయసు వచ్చిన తర్వాత బీపీ, డయాబెటిస్లకు మందులు వేసుకునే వాళ్లు ఎంతమంది ఉన్నారో ఇరవైలలోనే థైరాయిడ్ సమస్యతో బాధపడేవాళ్లు కూడా అంతగా ఉన్నారంటే ఆశ్చర్యం కాదు. హైపో థైరాయిడిజమ్ అనేది అనారోగ్యం కాదు, థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ (టీఎస్‌హెచ్) దేహానికి తగినంతగా అందని స్థితి. అలాగే హైపర్ థైరాయిడిజమ్ అంటే ఆ హార్మోన్ అవసరానికి మించి అందడం అన్నమాట. హైపో థైరాయిడిజమ్ విషయానికి వస్తే... ఇది మగవాళ్లలో కంటే మహిళల్లో రెండింతలు ఎక్కువగా ఉంటోంది. ఆహారంలో అందాల్సిన సూక్ష్మ పోషకాలు అందకపోవడం కూడా ఒక కారణమే. అందుకే ఈ సమస్య నుంచి బయటపడడానికి మందులతోపాటు తీసుకోవాల్సిన ఆహారం ఏమిటో చూద్దాం. హైపో థైరాయిడిజమ్ నుంచి బయటపడడానికి అయోడిన్ అనే ఖనిజం చాలా అవసరం. ఈ ఖనిజం సహజంగా అందే ఆహారం తినదగిన (పఫర్ ఫిష్ వంటి విషపూరితం కాని)అన్ని రకాల చేపలు, గుడ్లు, పాలు–పాల ఉత్పత్తులు. వీటిలో అయోడిన్ సమృద్ధిగా ఉంటుంది. అలాగే వంటల్లో అయోడిన్‌తో కూడిన ఉప్పు వాడడం మంచిది. అలాగే సెలీనియం బ్రెజిల్ నట్స్ (డ్రై ఫ్రూట్స్ దుకాణంలో ఈ పేరుతోనే లభిస్తాయి) రోజుకు రెండు తినాలి. రోజూ ఒక స్పూన్ అవిసె గింజలు, సబ్జా గింజలు తీసుకోవాలి. వెజ్ సలాడ్, చికెన్, మాంసం, రొయ్యలు వారానికి ఒకటి – రెండుసార్లు తీసుకోవాలి. పండ్ల విషయానికి వస్తే... స్ట్రాబెర్రీ, పీచ్ పండ్లను మినహాయించి మిగిలిన అన్ని పండ్లనూ తీసుకోవాలి. ఇక ప్రధాన ఆహారంగా మామూలుగానే అన్నం, గోధుమ రొట్టెల వంటివి తీసుకోవచ్చు. తెల్లసొన, పచ్చసొన అనే విభజన లేకుండా గుడ్డు మొత్తాన్ని తీసుకోవాలి. (చదవండి: నిద్ర పట్టడం లేదా..? ఇవి చేస్తే ఈజీగా..) వీటికి దూరం! ► మిల్లెట్స్, సోయా గింజలు, టోఫు వంటి సోయా పనీర్, ఇతర సోయా ఉత్పత్తులను, చిలగడ దుంపలను మానేయాలి. వేరుశనగ గింజలు, క్యాబేజ్, బ్రోకలీ, క్యాలీఫ్లవర్, పాలకూర వంటివి బాగా తగ్గించాలి. అయోడిన్ లోపం లేని వాళ్లు కొన్ని రకాల మిల్లెట్స్‌ను తీసుకోవచ్చు. ఇది డాక్టర్ సలహా మేరకు పాటించాల్సిన జాగ్రత్త. ఇది దేహతత్వాన్ని బట్టి వ్యక్తికీ వ్యక్తికీ మారుతుంది. అలాగే పూర్తిగా మానేయాల్సిన జాబితాలో మర్చిపోకూడని మరికొన్ని... బేకరీ ఉత్పత్తులు. లక్షణాలివి ఎప్పుడూ అలసట, బరువు పెరగడం, ఎప్పుడూ జలుబు చేసినట్లు అసౌకర్యంగా అనిపించడం, జుట్టు రాలిపోవడం, మానసికంగా న్యూనతకు లోనుకావడం వంటి ప్రధానంగా కనిపించే లక్షణాలతోపాటు మరికొన్ని ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. -
ఈ లక్షణాలు కనిపిస్తే.. హైపోథైరాయిడిజం ఉన్నట్లే!?
మన దేహంలో కొన్ని కీలకమైన గ్రంథుల్లో థైరాయిడ్ ఒకటి. ఇది టి3, టి4 అనే రెండు హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ గ్రంథి ముఖ్యంగా పిండం ఎదిగే సమయంలో కణాలు ఎదుగుదలకు, జీవక్రియల సమన్వయానికి దోహదపడుతుంది. అయితే ఈ గ్రంథి పనితీరు పెరిగినా, తగ్గినా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీని పనితీరు తగ్గితే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. హైపోథైరాయిడిజం లక్షణాలు కండరాల నొప్పులు కండరాలు పట్టేయడం చర్మం పొడిగా మారడం బరువు పెరగడం గొంతు బొంగురుపోవడం ముఖం, కళ్లు వాయడం జుట్టురాలడం మలబద్ధకం శృంగారం పట్ల అనాసక్తత స్త్రీలకు రుతుసమయంలో సమస్యలు గుండె తక్కువగా కొట్టుకోవడం జ్ఞాపకశక్తి తగ్గడం వంటివి తొలిదశలో గుర్తిస్తే.. జబ్బు ముదరకుండా నివారించవచ్చు. ఒకసారి రోగి నిర్ధారణ జరిగాక చికిత్స ఏమంత కష్టం కాదు. వ్యాధి తీవ్రతను బట్టి థైరాక్సిన్ మాత్రలు వాడాల్సి ఉంటుంది. చాలామందిలో ఇవి జీవితాంతం వాడాల్సిన అవసరం రావచ్చు. -
గొంతులో గరగర!
అయోడిన్ లోపం వల్ల కాకుండా వాహన, పారిశ్రామిక కాలుష్యం..హార్మోన్లలో లోపించిన సమతుల్యత వల్ల నేడుహైదరాబాద్ వంటి మెట్రోనగరాల్లోథైరాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. 18 ఏళ్లు పైబడిన వారిలో 10.95 శాతం మందిథైరాయిడ్తో బాధ పడుతుంటే, అత్యధికబాధితులతో కోల్‌కతా తొలిస్థానంలో,హైదరాబాద్ ఐదో స్థానంలో నిలిచాయి. సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే అధికంగా కన్పించే హైపోథైరాయిడిజం కేసులు నేడు మెట్రోనగరాల్లోనూ జడలు విప్పుతోంది. పౌష్టికాహారం, అయోడిన్లోపం...వాతావరణ కాలుష్యం వల్ల గ్రేటర్లో నేడు అనేక మంది థైరాయిడ్ బారిన పడుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోం ది. ఇప్పటి వరకు కేవలం మధుమేహ, గుండె జబ్బులకు మాత్రమే కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరం తాజాగా హైపోథైరాయిడిజంలోనూ ఇతర ప్రాంతాల తో పోటీపడుతోంది. ఇండియన్ థైరాయిడ్ ఎపిడమిలాజీ సంస్థ ఇటీవల ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, గోవా తదితర ప్రాంతా ల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి థైరాయిడ్‌తో బాధపడుతున్న వారి వివరాలను సేకరించింది. కొల్కటలో 21.6 శాతం, ఢిల్లీలో 11.07 శాతం, అహ్మదా బాద్‌లో 10.6 శాతం, ముంబైలో 9.6 శాతం ఉండగా, హైదరాబాద్‌లో 8.88 శాతం మంది థైరాయిడ్ బాధితులు ఉన్నట్లు గుర్తించింది. బాధితుల్లో 70 శా తం మహిళలు ఉంటే..30 శాతం పురుషులు ఉన్నట్లు నిర్ధారించింది. హార్మోన్లలో సమతుల్యత లోపానికి తోడు నగరంలో రోజురోజుకు పెరుగుతున్న వాహన, ప్రారిశ్రామిక కాలుష్యం, పని ఒత్తిడి, మారిన జీవనశైలే ఇందుకు ప్రధాన కారణమని గుర్తించింది. థైరాయిడ్ అంటే... థైరాయిడ్ అనేది రెండు రకాలు. ఒకటి హైపర్ థైరాయిడిజం కాగా, మరొకటి హైపోథైరాయిడిజం. గొంతు భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంథి టి3, టి4 అనే రెండు రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి శరీర ఎదుగుదలకు ఉప యోగపడటంతో పాటు అవయవాల పనితీరును మెరుగు పరుస్తుంది. శరీర ఉష్ణో గ్రతలను సమతుల్యంగా ఉంచుతుంది. అయితే ఈ గ్రంథి సరిగా విధులు నిర్వహించనప్పుడు సమస్య ఏర్పడుతోంది. అవసరం కంటే అధికంగా హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు అది హైపర్ థైరాయిడిజమ్‌కు కార ణమవుతోంది. ప్రస్తుతం నగరంలో హైపోథైరాయిడిజం బాధితులు ఉక్కువ ఉన్నారు. ఉన్నట్లుండి బరువు పెరగడం, జుట్టు రాలడం, చర్మం పొడిబారిపోవడం, విపరీతమైన అలసట, మహిళలల్లో రుతుక్రమం తప్పడం, సంతానలేమి వంటివి ఈ హైపోథైరా యిడ్ లక్షణాలైతే...., బరువు తగగ్గడం, విపరీతమైన చమట పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఒకటే టెన్షన్, చేతులు వణకడం వంటి లక్షణాలు కన్పిస్తే హైపర్ థైరాయిడ్‌గా భావిస్తారు. కాలుష్యం కూడాఓ కారణం అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ వస్తుంది. 2004కు ముందు ఎక్కువ మంది ఇదే కారణంతో థైరాయిడ్ బారిన పడే వారు. నగరంలో ఇప్పుడా పరిస్థితి లేదు. 90 శాతం మంది తమ ఆహారంలో అయోడిన్ ఉప్పునే వాడుతున్నారు. అంతేకాకుండా భారత్‌ను ఎప్పుడో అయోడిన్ లోపాన్ని అధిగమించిన దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కానీ రకరకాల వ్యాధులకు కారణం అవుతన్న బ్యాక్టీరియా, వైరస్‌తో పోరాడాల్సిన రోగనిరోధక శక్తి దానికి విరుద్ధంగా అంతర్గత అవయవాలతో పోరాడుతోంది. దీనికి తోడు వాహన, పారిశ్రామిక కాలుష్యం కూడా దీనికి కారణం అవుతోంది. ఆసక్తికర అంశమేమంటే తమకు థైరాయిడ్ ఉన్నట్లు బాధితుల్లో సగం మందికి నేటికీ తెలియదు. థైరాయిడ్‌ను సకాలంలో గుర్తించి మందులు వాడితే కొంత వరకు కాపాడుకోవచ్చు. లేదంటే ఆరోగ్యానికి నష్టం. – డాక్టర్ శివరాజు,కన్సల్టెంట్ ఫిజిషియన్, కిమ్స్ -
‘గొంతు’ సవరించండి
- హైదరాబాద్‌లో 8.88 శాతం మందిలో థైరాయిడ్ సమస్య - దేశంలో ఐదో స్థానం - వాతావరణ కాలుష్యమే ప్రధాన కారణం - ఇండియన్ థైరాయిడ్ ఎపిడమియాలజీ స్టడీ వెల్లడి ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను ఎప్పుడో అయోడిన్ లోపాన్ని అధిగమించిన దేశంగా ప్రకటించింది. కానీ వాహన, పారిశ్రామిక కాలుష్యం, హార్మోన్లలో లోపించిన సమతుల్యత వల్ల నేడు హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో సైతం థైరాయిడ్ కేసులు నమోదవుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. జాతీయ స్థాయిలో 18 ఏళ్లు పైబడిన వారిలో 10.95 శాతం మంది థైరాయిడ్‌తో బాధపడుతుంటే, అత్యధిక బాధితులతో కోల్‌కతా తొలి స్థానంలో, హైదరాబాద్ ఐదో స్థానంలో ఉన్నాయి. సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే అధికంగా కన్పించే హైపోథైరాయిడిజం కేసులు నేడు మెట్రోనగరాల్లోనూ పెరిగిపోతున్నాయి. మధుమేహం, గుండె జబ్బులకు మాత్రమే కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో తాజాగా హైపోథైరాయిడిజం కేసులూ అధికమవుతున్నాయి. ఇండియన్ థైరాయిడ్ ఎపిడమియాలజీ స్టడీ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం జాతీయ స్థాయిలో 18 ఏళ్లు పైబడిన వారిలో 10.95 శాతం మంది థైరాయిడ్‌తో బాధ పడుతుంటే, వీరిలో 15.86 శాతం మంది మహిళలు, 5.02 శాతం మంది పురుషులు ఉన్నారు. హైదరాబాద్‌లో 8.88 శాతం బాధితులు ఉన్నట్లు నిర్ధారణయింది. వీరిలో 50 శాతం మందికి తమకు ఈ సమస్య ఉన్నట్లే తెలియకపోవడం గమనార్హం. కోల్‌కతా టాప్... 2012–2013లో దేశరాజధాని ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూర్, అహ్మదాబాద్, గోవా, చైన్నై, హైదరాబాద్‌ల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. వివిధ ప్రాంతాల్లో థైరాయిడ్ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి, బాధితుల నుంచి వివరాలు సేకరించింది. దేశంలోనే అత్యధికంగా కోల్‌కతాలో 21.6, ఢిల్లీలో 11.07, అహ్మదాబాద్‌లో 10.6, ముంబైలో 9.6 శాతం ఉండగా... దక్షిణాది నగరాల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 8.88 శాతం బాధితులు ఉన్నట్లు తేలిందని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ఎండోక్రానాలజీ విభాగం వైద్యుడు రాకేష్సహాయ్ తెలిపారు. పౌష్టికాహార, అయోడిన్ లోపం, వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడే దీనికి ప్రధాన కారణమని చెప్పారు. ఏమిటీ థైరాయిడ్..! థైరాయిడ్ రెండు రకాలు. ఒకటి హైపర్ థైరాయిడిజం, రెండోది హైపోథైరాయిడిజం. గొంతు భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంథి టి3, టి4 అనే రెండు రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి శరీర ఎదుగుదలకు ఉపయోగపడటంతో పాటు అవయవాల పనితీరును మెరుగు పరుస్తాయి. ఈ గ్రంథి సరిగా విధులు నిర్వర్తించనప్పుడు సమస్య ఏర్పడుతోంది. అవసరం కంటే అధికంగా హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు అది హైపర్ థైరాయిడిజంకు కారణమవుతోంది. అకస్మాత్తుగా బరువు పెరిగితే హైపోథైరాయిడిజంకు సంకేతం. దీన్ని గుర్తించడం కష్టం. వాహన, పారిశ్రామిక కాలుష్యం ప్రధాన కారణం... శరీరంలో అయోడిన్ మూలకం లోపంవల్ల థైరాయిడ్ వస్తుంది. 2004కు ముందు ఎక్కువ మంది ఇదే కారణంతో దీని బారిన పడేవారు. నగరంలో ఇప్పుడా పరిస్థితి లేదు. 90 శాతం మంది ఆహారంలో అయోడిన్ ఉప్పునే వాడుతున్నారు. అంతేకాకుండా భారత్‌ను ఎప్పుడో అయోడిన్ లోపాన్ని అధిగమించిన దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కానీ రకరకాల వ్యాధులకు కారణం అవుతున్న బ్యాక్టీరియా, వైరస్‌తో పోరాడాల్సిన రోగనిరోధక శక్తి... అందుకు విరుద్ధంగా అంతర్గత అవయవాలతో పోరాడుతోంది. దీనికి తోడు వాహన, పారిశ్రామిక కాలుష్యం కూడా దీనికి కారణం అవుతోంది. థైరాయిడ్‌ను సకాలంలో గుర్తించి మందులు వాడితే కొంత వరకు కాపాడుకోవచ్చు. లేదంటే ఆరోగ్యానికి నష్టం. – డాక్టర్ శ్రీనగేష్, ఎండోక్రైనాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ వయసుల వారీగా థైరాయిడ్ బాధితుల వివరాలు (శాతాల్లో)... 18 నుంచి 35 ఏళ్లలోపు 7.53 36 నుంచి 45 ఏళ్లలోపు 12.22 46 నుంచి 54 ఏళ్లలోపు 13.11 55 ఏళ్లు పైబడిన వారిలో 11.62 -
హైపోథైరాయిడిజం- హోమియోపతి వైద్యం
థైరాయిడ్ గ్రంథి తగినంత మోతాదులో థైరాయిడ్ హార్మోన్స్ (టీ3, టీ4) ను ఉత్పత్తి చేయలేకపోవడాన్ని హైపోథైరాయిజం అంటారు. దీనికి దీర్ఘకాలం అయోడిన్ లోపం ప్రధాన కారణం కాగా, మెదడులోని హైపోథలామస్, పిట్యుటరీ గ్రంథుల పనితీరులో లోపం, థైరాయిడ్ గ్రంథి వాపు, మానసిక సమస్యల కోసం వాడే కొన్నిరకాల మందుల దుష్ర్పభావం, దీర్ఘకాల మానసిక ఒత్తిళ్ళ వలన కూడా థైరాయిడ్ గ్రంథి పనితీరులో మార్పు వచ్చి హైపోథైరాయిడిజం ఉత్పన్నమవుతుంది. థైరాయిడ్ గ్రంథి నుండి తగినంత మోతాదుల్లో హార్మోన్స్ (టీ3, టీ4) ఉత్పన్నమవడానికి మన శరీరంలో చాలినంత అయోడిన్, టీఎస్‌హెచ్ (మెదడులోని పిట్యుటరీ గ్రంథి నుండి ఉత్పన్నమయ్యే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) అవసరం. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టిఎస్హెచ్) అయోడిన్‌ను థైరాయిడ్ గ్రంథికి సరఫరా కావడానికి, అక్కడ ైథైరాయిడ్ హార్మోన్స్ (టీ3, టీ4) ఉత్పత్తి అవ్వడానికి సహకరిస్తుంది. అయితే టీఎస్‌హెచ్ లోపం లేదా అయోడిన్ లోపం వల్ల ఈ ప్రక్రియ సజావుగా జరగక టీ3, టీ4 హార్మోన్స్ ఉత్పన్నం కాకపోవడాన్నే, ‘హైపోథైరాయిడిజం’ అంటారు. కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ గ్రంథి వాపు (hashimoto's thyroiditis) వల్ల కూడా థైరాయిడ్ హార్మోన్స్ (టీ3, టీ4) పరిమాణం తగ్గుతుంది. మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పనితీరులో వచ్చే మార్పుల వల్ల అది థైరాయిడ్ గ్రంథిపై దాడి చేసి అక్కడి కణజాలాన్ని దెబ్బతీయడం వలన ఈ వాపు ఏర్పడుతుంది. నిర్ధారణ పరీక్ష: సాధారణంగా టీ3, టీ4, టీఎస్‌హెచ్ హార్మోన్స్ పరిమాణం రక్తపరీక్ష ద్వారా నిర్ధారణ చేయవచ్చు. అయితే చాలావరకు పరీక్షల్లో టీ3, టీ4 అనేవి సాధారణ స్థితిలోనే ఉన్నప్పటికీ టీఎస్‌హెచ్ ఎక్కువస్థాయిలో ఉంటుంది. మన శరీరంలో ఉండే ఒక రక్షణ వ్యవస్థలో భాగంగా ఇలా జరుగుతుంది. హోమియోపతి వైద్యం: హోమియోపతిలో హైపోథైరాయిడిజం సమస్యను చాలావరకు అదుపులో ఉంచే ఔషధాలు ఉన్నాయి. అయితే మందుల ఎంపిక కేవలం లక్షణాలు తగ్గించే విధంగా కాకుండా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుం టారు. అంటే... వ్యక్తి శారీరక, మానసిక స్థితి, శారీరక లక్షణాలు, వాటికి కారణాలు పూర్తిగా విశ్లేషించాక వైద్యులు తగిన ఔషధాలు సూచిస్తారు. సాధారణంగా... కాల్కేరియా కార్బ్ కాల్కేరియా ఫాస్ అయోడమ్ థైరాయిడినమ్ కాల్కేరియా అయోడ్ స్పాంజియా మొదలగు మందులను వాటి వాటి లక్షణాలను బట్టి వైద్యుల పర్యవేక్షణలో వాడితే పూర్తి ప్రయోజనం ఉంటుంది. లక్షణాలు: హైపోథైరాయిడిజంలో సాధారణంగా.... బరువు పెరగడం, మొహం ఉబ్బటం, కాళ్ళుచేతులలో నీరు చేరడం జుట్టు రాలటం, అక్కడక్కడ చర్మం పొడిబారడం తొందరగా అలసిపోవటం, కండరాల నొప్పి మానసిక కుంగుబాటు మలబద్దకం సంతానలేమి, పురుషుల్లో సెక్స్ బలహీనత, మొదలగు లక్షణాలు కనిపిస్తుంటాయి. వ్యాధి తీవ్రత, వ్యక్తులను బట్టి ఈ లక్షణాలు, వాటి తీవ్రత మారుతుంటాయి. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, హన్మకొండ-వరంగల్, కర్ణాటక ph: 7416 107 107 / 7416 102 102 www.starhomeo.com Email : info@starhomeopathy.com