అమూల్‌ డెయిరీకి అంతర్జాతీయ పురస్కారం | international dairy federation awards for 3 indian dairy companies | Sakshi
Sakshi News home page

26 పశువ్యాధులకు హోమియో చికిత్స: అమూల్‌కు అంతర్జాతీయ పురస్కారం

Published Tue, Nov 19 2024 8:02 PM | Last Updated on Tue, Nov 19 2024 8:02 PM

international dairy federation awards for 3 indian dairy companies

మూడు భారతీయ డెయిరీ సంస్థలకు అంతర్జాతీయ డెయిరీ ఫెడరేషన్‌ (ఐడిఎఫ్‌) ‘ఇన్నోవేషన్‌ ఇన్‌ సస్టయినబుల్‌ ఫార్మింగ్‌ ప్రాక్టీసెస్‌ 2024’ ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కాయి. పాడి పశువులకు సోకే జబ్బులకు చేసే చికిత్సల్లో అల్లోపతి యాంటీబయాటిక్‌ ఔషధాలకు బదులుగా హోమియోపతి ఔషధాలను వాడి చక్కని ఫలితాలు సాధించినందుకు గాను ‘యానిమల్‌ కేర్‌’ విభాగంలో అమూల్‌ డెయిరీకి ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు ఐడిఎఫ్‌ ప్రకటించింది.

సుమారు 68 వేల పశువులకు సోకిన 26 రకాల సాధారణ వ్యాధులకు హోమియోపతి మందులతో చికిత్స చేయటం ద్వారా అమూల్‌ డెయిరీ సత్ఫలితాలు సాధించింది. ఇందుకోసం 2024 మే నాటికి 3.30 లక్షల (30 ఎం.ఎల్‌. సీసాలు) హోమియోపతి మందులను అమూల్‌ సొంతంగానే ఉత్పత్తి చేసి, 1.80 లక్షల సీసాలను పాడి సహకార సంఘాల రైతులకు పంపిణీ చేసింది. యాంటీబయాటిక్‌ ఔషధాల వాడకాన్ని తగ్గించటం ద్వారా పశువుల ఆరోగ్యం మెరుగవుతోంది. పాల ఉత్పత్తులు వినియోగించే ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతోందని ఐడిఎఫ్‌ తెలిపింది. సంప్రదాయ ఆయుర్వేద (ఈవీఎం) చికిత్సా పద్ధతులతో పాటు హోమియో పశువైద్య పద్ధతులను కూడా అమూల్‌ ప్రాచుర్యంలోకి తేవటం హర్షదాయకం.

పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్‌ పాడి, పశు పెంపకందారుల సహకార సంఘానికి ఆర్థిక, సామాజిక విభాగంలో పురస్కారం లభించింది. 4,500 మంది మహిళా రైతులు పూర్తి సేంద్రియ పద్ధతుల్లో పాలు ఉత్పత్తి చేస్తున్నారు. అనేక పాల ఉత్పత్తులను, ఎ2 ఆవు నెయ్యిని తయారు చేస్తున్నారు. సేంద్రియ నాటు కోళ్ల పెంపకంతో పాటు సేంద్రియ పప్పుదినుసులను సైతం ఉత్పత్తి చేసి, ప్రాసెసింగ్‌ చేసి వినియోగదారులకు నేరుగా విక్రయిస్తూ మహిళా రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధిస్తున్నారు.

చ‌ద‌వండి: 90% కేసుల్లో యాంటీబయాటిక్స్‌ అవసరం లేదు

ఐడిఎఫ్‌ పురస్కారం అందుకున్న మరో సంస్థ ‘ఆశా మహిళా మిల్క్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ’. సౌర విద్యుత్తుతో నడిచే ఇన్‌స్టంట్‌ మిల్క్‌ చిల్లర్లను వినియోగించటం ద్వారా చిన్న, సన్నకారు పాడి రైతుల అభ్యున్నతికి వినూత్న రీతిలో దోహదపడటం ఈ ఎఫ్‌పిఓ ప్రత్యేకత.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement