Homeopathy
-
పశువ్యాధులకు హోమియోపతి చికిత్సతో ప్రయోజనం
పాడి పశువులు రోగాల బారిన పడినప్పుడు రైతులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర ఖర్చుల కన్నా చికిత్స ఖర్చులు భారంగా మారుతుండటంతో పాడి రైతుల ఆదాయం తగ్గిపోతోంది. ఈ సమస్యకు సరైన పరిష్కారం హోమియో చికిత్సా విధానం. ఇది తక్కువ ఖర్చుతో వెంటనే ఫలితాన్ని ఇచ్చేదే కాకుండా సహజమైన, మానవీయమైన, సమర్థవంతమైన చికిత్సా పద్ధతి కూడా అంటున్నారు పశువైద్యాధికారి డాక్టర్.జి.రాంబాబు. కడపలోని పశువ్యాది నిర్ధారణ ప్రయోగశాలలో సేవలందిస్తున్న ఆయన హోమియో పశువైద్యంలో తన అనుభవాలను ‘సాక్షి సాగుబడి’తో పంచుకున్నారు.. సహజ రోగ నిరోధక శక్తికి ప్రేరణ కలిగించి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడమే హోమియో వైద్య విధానం లక్షణం. హోమియో విధానంలో వాడే ఔషధాలన్నీ కూడా సహజమైన మొక్కలు, లవణాలతో తయారు చేసినవే. ఈ వైద్య విధానానికి 200 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా యూరోపియన్, ఆసియా దేశాల్లో పశువ్యాధుల చికిత్సలో హోమియోపతి మందులు వాడుతున్నారు. మన దేశంలోనూ అక్కడక్కడా ఈ ప్రయత్నాలు జరుగుతుండటం ఆహ్వానించదగిన విషయం. పశువులకు హోమియో ప్రయోజనాలేమిటి? ►ఖర్చు తక్కువ. ఒక మందు ఖరీదు కేవలం రూ. 10 లోపే. అల్లోపతిలో ఈ ధరకు ఏ మందూ రాదు. ► సైడ్ ఎఫెక్ట్స్ /దుష్ప్రభావాలు ఉండవు. పరీక్షలు చేసి రోగ నిర్థారణ చేసే వరకు మందులు వాడకుండా ఉండాల్సిన పని లేదు. రోగ లక్షణాన్ని బట్టి చికిత్స చేస్తే చాలు. ► ఒకసారి పశువులకు, దూడలకు, ముఖ్యంగా శునకాలకు హోమియో (తీపి) మాత్రలు ఒకసారి ఇస్తే మళ్లీ అవే వచ్చి మందు అడుగుతాయి. ► హోమియో మందులు త్వరితగతిన పనిచేస్తాయి. ఇవి నెమ్మదిగా పనిచేస్తాయని చాలామంది అనుకుంటారు. అది అపోహ మాత్రమే. ► ఇతర వైద్య పద్ధతుల్లో మందుల మాదిరిగా భరించలేని వాసన ఈ మందులకు ఉండదు. ► డోసు కొద్దిగా ఎక్కువయినా ఇబ్బంది లేదు. అది మిగతా వైద్య పద్ధతుల్లో ఇది సాధ్యం కాదు. కాబట్టి, అవగాహన పెంచుకున్న రైతులు పశువులకు ఇంటి దగ్గరే ఈ వైద్యం చేసుకోవచ్చు. ► కొన్ని వ్యాధులకు అల్లోపతిలో లేని వైద్యం కూడా హామియోపతిలో ఉండటం విశేషం. ► ఈ మందుల వల్ల పర్యావరణం కలుషితం కాదు. హోమియో మందులతో పొదుగువాపు మాయం! రాథి ఆవు ఇది. రాజస్తాన్‌కు చెందిన జాతి. స్థానిక రైతు అక్కడి నుంచి కడప జిల్లాకు చూడి ఆవును తీసుకువచ్చారు. వారం తరువాత ఈనిన ఆవు కోడె దూడకు జన్మనిచ్చింది. పాలు ఇచ్చిన 5వ రోజు నుంచి రెండు చన్నుల నుంచి పాలతో పాటు రక్తం వచ్చింది. పశువైద్యునిగా పొదుగువాపును గుర్తించి యాంటి బయోటిక్ మందులతో చికిత్స ఇచ్చాను. 5 రోజులకు తగ్గింది. 7వ రోజు నుంచి మళ్లీ పొదుగువాపు వచ్చింది. ఆవు నుంచి తీసిన రక్తంతో కూడిన పాలను యాంటి బయోటిక్ సెన్సిటివిటి పరీక్షకు ప్రయోగశాలకు పంపించాం. పరీక్ష ఫలితాలు 3వ రోజున వస్తాయి. ఈ లోపు మళ్లీ కొత్త అల్లోపతి మందులు ఇవ్వడం కన్నా ఆయుర్వేద లేదా హామియో మందులు వాడుతుంటాం. ఈ ఆవుకు హోమియో మందులు వాడితే.. రెండు విధాలుగా ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. మొదటిది: పాల పరీక్ష ఫలితాల్లో మొత్తం 13 యాంటీ బయోటిక్ మందులకు నిరోధకత వచ్చింది. అంటే, ఆ ఆవుపై ఇక ఏ యాంటి బయోటిక్ మందూ పనిచేయదని అర్థం. రెండోది: ఈ లోగా హోమియో మందులు వాడటం వల్ల 3 రోజుల్లోనే ΄పొదుగువాపు తగ్గిపోయింది. అల్లోపతి మందులకు దాదాపుగా రూ. 2,200 ఖర్చు చేశాం. హోమియో మందుల ఖర్చు కేవలం రూ. 50 మాత్రమే. పొదుగువాపు తగ్గించడానికి ఫైటో లక్క, కొనియం, బెల్లడోన, ఫెర్రం ఫాస్ అనే హామియో మందులను వినియోగించాం. రెండు వారాలైనాతగ్గనిది.. హోమియోతో 2 రోజుల్లో తగ్గింది! ఒక హోటల్ యజమాని ఒంగోలు ఆవును కొన్నారు. మంచిదని హోటల్ దగ్గరే ఆవును కట్టేస్తున్నారు. గడ్డి తక్కువ వేస్తూ ఎక్కువ మొత్తంలో కూరగాయలు మేపేవారట. కొద్ది రోజులకే ఆవుకు సుస్తీ చేసింది. మేత తినటం దాదాపుగా ఆపేసింది. ఆకలి పెంచేందుకు పౌడర్లు, బీకాంప్లెక్స్ ఇంజక్షన్లు, లివర్ టానిక్‌లు, కసురు తాగించినా ఫలితం లేకపోవటంతో కడప పశువుల ఆసుపత్రికి తీసుకువచ్చారు. అల్లోపతి మందులతో దాదాపు 2 వారాల పాటు వైద్యం అందించినా, కొద్దిగా కూడా ఫలితం కనిపించ లేదు. ఆ దశలో నక్స్ వామిక, రుస్ టాక్స్ అనే హోమియో మందులు రెండు రోజులు ఇచ్చాం. 3వ రోజుకు సమస్య పూర్తిగా తగ్గిపోయింది. (పశువైద్యులు డాక్టర్ జి. రాంబాబును 94945 88885 నంబరులో సంప్రదించవచ్చు) -
మన ప్రాచీన వైద్యాన్ని పునరుద్ధరించాలి
ప్రతి మనిషీ ఆరోగ్యం కోరుకుంటాడు. ఏ పని చేయాలన్నా ప్రాథమికంగా మనిషి ఆరోగ్యవంతుడై ఉండాలి. అందుకే అన్ని భాగ్యాల్లో కెల్లా ఆరోగ్యాన్ని మాత్రమే మహా భాగ్యం అన్నారు. అటువంటి ఆరోగ్యం సరిగా లేనప్పుడు చికిత్స తప్పనిసరి. ఇప్పుడంటే ఆధునిక అల్లోపతి వైద్య విధానం రాజ్యమేలు తోంది కానీ... అత్యంత ప్రాచీన కాలం నుంచీ ఇటీవలి కాలం వరకూ భారతదేశంలో ఆయుర్వేద వైద్య విధా నంలోనే చికిత్స అందించారన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అటువంటి మన దేశీయ వైద్య విధానానికి ఇవ్వాళ అంతగా ప్రాముఖ్యం లభించడంలేదు. ఆయుర్వేదమే కాదు... యునాని, హోమియో వైద్య విధానాలు సైతం చౌకగా ప్రజలకు చికిత్స అందించడానికి ఉపయోగపడు తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ విధానాల కన్నా అత్యంత ఖరీదైన అల్లోపతికే ప్రభు త్వాలు పెద్దపీట వేస్తున్నాయి. మిగతా మూడింటితో పోల్చినప్పుడు అల్లోపతి ఎక్కువ శాస్త్రీయమైనదని నమ్మడమే ఇందుకు కారణం కావచ్చు. అలాగే అల్లోపతి వైద్యవిధానంలో రోగ లక్షణాలు లేదా బాధ తొందరగా తగ్గుతుందనేది మరో కారణం. అలాగే పెద్ద పెద్ద శ్రస్త చికిత్సలు చేసి రోగులను బతికించే శాస్త్రీయ విధానంగానూ ప్రజలలో దానికి పేరున్నమాటా నిజం. చరకుడు, సుశ్రుతుని కాలం నుండి కూడా ఆయుర్వేద వైద్యం భారత ఉప ఖండంలో వ్యాపించి ఉంది. ఆయుర్వేదంలోనూ అనేక ఛేదనాల (అంగాలను తొల గించడం) రూపంలో శస్త్ర చికిత్సలు జరిగేవి. రాచ పుండ్లు (కేన్సర్లు), పక్షవాతానికీ, అనేక దీర్ఘకాలిక వ్యాధులకూ, వ్రణాలకూ అద్భుతమైన చికిత్సలు జరిగేవి. అడవులూ, పొలాలూ, పెరడులూ, వంటిళ్లూ... ఎక్కడ చూసినా ఆయుర్వేదానికి అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉండేవి. అయితే అల్లోపతి విధానం అనేక కారణాలవల్ల ప్రజల్లో ఆదరణ పొంద డంతో మన దేశీయ వైద్యం క్రమంగా పడకేసింది. అలాగే గత రెండు మూడు దశాబ్దాలుగా హోమియో వైద్య విధానం అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో భారత్‌లోనూ విస్తరిస్తోంది. ముఖ్యంగా ఈ హోమియో వైద్య విధానంలో వ్యక్తి శారీరక ధర్మాలను అంచనా వేసి వైద్యులు మందులను ఇస్తారు. అల్లోపతి వైద్యంతో పోల్చుకున్నపుడు ఖర్చు కూడా తక్కువ అవుతుంది. మొండి రోగాలను నయం చేయగలిగిన శక్తి హోమియోపతికి ఉన్నదని నమ్మకం కూడా ఇటీవల ప్రజల్లో పెరిగిపోవడంతో హోమియో వైద్యానికి గిరాకీ కూడా గణ నీయంగానే పెరుగుతున్నది. అయితే ప్రభుత్వపరంగా హోమియో, ఆయుర్వేద, యునాని వైద్యవిధానాలకు ప్రోత్సాహం అల్లోపతితో పోల్చి చూసినప్పుడు తక్కువగానే ఉందని చెప్పక తప్పదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా మన ప్రాచీన వైద్య విధానాల ద్వారా ప్రజలకు చౌకగా చికిత్స అందించడానికి కృషి చేస్తాయని ఆశిద్దాం. ఇప్పటికే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆయుష్’ ద్వారా మన సంప్రదాయ వైద్యవిధానాలను ప్రజలకు చేరువ చేస్తోంది. మన రెండు తెలుగు రాష్ట్రాలూ అనేక ఆయుర్వేద కళాశాలలూ, వైద్యశాలలూ నెలకొల్పు తుండటం గమనార్హం. కాకపోతే అల్లోపతి వైద్య కళా శాలలు, ఆస్పత్రుల సంఖ్యతో పోల్చుకుంటే మిగిలిన వైద్య విధానాలకు చెందిన కాలేజీలు, వైద్యశాలలూ తక్కువ అనేది సుస్పష్టం. (క్లిక్: భారత్‌ను ఒంటరిని చేస్తారు జాగ్రత్త!) ముఖ్యంగా వ్యాధి మొదటి, రెండో దశల్లో ఉన్నప్పుడు అల్లోపతి డాక్టర్లకన్నా ఆయుర్వేద, హోమియో వైద్యుల దగ్గరకు వెళ్లడం వల్ల ప్రజలకు తక్కువ ఖర్చుతో సులువైన వైద్యం అందుతుంది. అందుకే ప్రాథమిక, మాధ్యమిక స్థాయిల్లో తప్పనిసరిగా ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్యాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. (క్లిక్: భూమాతకు సత్తువనిచ్చే సంకల్పం) - డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్, జర్నలిజం విభాగం, కాకతీయ యూనివర్సిటీ -
బీజేపీలో చేరిన యూపీ కాంగ్రెస్ పోస్టర్‌గాళ్
లక్నో: డాక్టర్ ప్రియాంక మౌర్య... యూపీలో ప్రియాంకా గాంధీ వాద్రా రూపొందించిన ‘నేను అమ్మాయిని... పోరాడగలను’ నినాదపు గొంతుక. యూపీలో మహిళా సాధికారతకు ముఖచిత్రం. ప్రియాంకా గాంధీకి కుడిభుజంగా మెలిగిన ఆమె... గురువారం బీజేపీలో చేరారు. ఎన్నికల నేపథ్యంలో యూపీలో కాంగ్రెస్ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ. ప్రియాంక మౌర్య... హోమియోపతి డాక్టర్. సామాజిక ఉద్యమకారిణి. అజాంగఢ్‌లో పుట్టి పెరిగారు. గ్వాలియర్ యూనివర్సిటీలో ఉన్నతవిద్యనభ్యసించారు. 2008లో స్పైస్‌జెట్‌లో చేరి ఎగ్జిక్యూటివ్‌గా రెండేళ్లపాటు పనిచేశారు. 2012లో తిరిగి డాక్టర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అది మొదలు... ‘నేకీ కి దివార్’, ‘రోటీ బ్యాంక్’ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశారు. కరోనా పాండమిక్ సమయంలోనూ సేవకుగాను పలు అవార్డులు సైతం అందుకున్నారు. 2020 డిసెంబర్లో ఆమె కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ఆ తరువాత 2021 నవంబర్‌లో పార్టీ ఆమెను మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా నియమించింది. ప్రియాంక మౌర్య... మంచి వక్త. తన మాటలతో యువతను ఇట్టే ఆకట్టుకునే గుణం. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. లక్షల మంది అభిమానులున్నారు. ఐదు కోట్ల మంది మహిళా ఓటర్లున్న యూపీ రాజకీయాల్లో వారి పాత్ర కీలకం. దాంతో ప్రియాంక గాంధీ... . 2021 డిసెంబర్ 8న మహిళా మేనిఫెస్టో ‘శక్తి విధాన్’ను విడుదల చేశారు. మహిళా సాధికారతకు గుర్తుగా ‘మై లడకీ హూ... లడ్ సక్తీ హూ’ స్లోగన్‌కు ప్రియాంక మౌర్యను ప్రచారకర్తగా ఎంచుకున్నారు. పార్టీ కోసం పనిచేస్తూనే... లక్నోలోని సరోజిని నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రియాంకమౌర్య సీట్ ఆశించారు. అందుకనుగుణంగానే తన కార్యకలాపాలను విస్తరించారు. తీరా సీట్ల కేటాయింపుల్లో కాంగ్రెస్‌పార్టీ ప్రియాంకను పక్కన పెట్టింది. ఆమె పనిచేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ సీటును రుద్రదామన్ సింగ్‌కు కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ప్రియాంక బీజేపీలో చేరారు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ ‘‘నా నియోజకవర్గంలోని ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కుతుందనుకున్నాను. కానీ కాంగ్రెస్‌పార్టీ మోసం చేసింది. వాళ్లు ముందే అనుకున్నట్టుగా మరో వ్యక్తికి సీటిచ్చారు. మహిళలు, మౌర్య, కుష్వాహ, శాక్య, సైనీ కులాల ఓట్లను రాబట్టుకోవడానికి నన్ను వాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంకోసం నన్ను, సోషల్‌మీడియాలో నాకున్న లక్షల మంది అభిమానులను ఉపయోగించుకున్నారు. వెనుకబడిన వర్గాలకు చెందినదాన్ని, లంచం ఇవ్వలేను కాబట్టి నాకు టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ. ‘లడకీ హూ... లడ్ సక్తీ హూ’ అనే నినాదమిచ్చారు. నినాదాలు, మాటలతోనే పనవ్వదు. అవకాశాలు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోరాడటానికి నాకు అవకాశమే ఇవ్వలేదు. ప్రియాంకగాంధీతో సైతం నేను పోరాడగలను అని ఇప్పుడు నిరూపించుకుంటాను. శక్తి, సమయం వెచ్చించి నేను పనిచేసిన ఆ పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టే బీజేపీలో చేరాను. నేను హోమియోపతి డాక్టర్‌ను... తీయటి మందులివ్వడమే కాదు.. తీయగా మాట్లాడటమూ వచ్చు. ఇప్పుడా పని బీజేపీ కోసం చేస్తాను. నిత్యం సమాజ సేవలోనే ఉంటా.’’ -
హోమియోలో మందు ఉంది
సాక్షి, యాదాద్రి: నల్లతామర పురుగు, నల్లపేను వంటి తెగుళ్లతో నష్టపోతున్న మిర్చి రైతులు పంటకు హోమియోపతి మందులు పిచికారీ చేస్తే తెగుళ్లకు చెక్ పెట్టవచ్చని యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణాపురానికి చెందిన అమేయ కృషి వికాస కేంద్రం యజమాని జిట్టా బాల్‌రెడ్డి తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 19 రకాలకు పైగా తెగుళ్లు సోకి లక్షలాది ఎకరాల్లో మిర్చి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రైతులు మిర్చికి సోకుతున్న చీడపీడల నుంచి పంటను రక్షించుకోవడానికి లక్షల రూపాయలు వెచ్చించి పురుగుమందులు పిచికారీ చేస్తున్నా ఆశించిన ఫలితం ఉండడం లేదు. వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలతో పాటు ఏపీలోని కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, కర్ణాటకలోని రాయచూర్, గుల్బర్గా, అలాగే ఒడిశాలోని పలు జిల్లాల్లో మిరప పంటకు తెగుళ్లు సోకి రైతులు భారీగా నష్టపోతున్నారు. హోమియోపతి మందులతో.. మనుషులు వివిధ రోగాలకు వాడే హోమియోపతి మందులను ప్రత్యామ్నాయంగా మిర్చిపంట తెగుళ్లకు వాడుకుంటుంటే ఫలితం ఉంటుందని బాల్‌రెడ్డి చెప్పారు. ఎకరాకు రూ.10 వేల ఖర్చు అవుతుందన్నారు. నాట్లు వేసే సమయంలోనే గుర్తించాలి కానీ, ఆలస్యం అయిందన్నారు. ఇప్పటికైనా రైతులు హోమియో మందులను వాడితే నష్టాల నుంచి బయటపడవచ్చని సూచించారు. ముఖ్యంగా తామర పురుగు నివారణకు అర్నేరియాడయోడెమా 30, తూజా 30 హోమియో మందులను పిచికారీ చేయాలని, 20 లీటర్ల నీటిలో 2.5 మి.లీటర్లు పోసి పిచికారీ చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఇండోనేíసియా నుంచి నల్లపేను.. ఇండోనేసియా నుంచి వచ్చిందని చెబుతున్న నల్లపేను తెగులు మిరప పంటపొలాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న మిరప రైతులు తక్కువ ఖర్చుతో లభించే హోమియోపతి మందులను వాడితే ప్రయోజనం ఉంటుందని జిట్టా బాల్‌రెడ్డి తెలిపారు. వరంగల్, గుంటూరు, కృష్ణా, రాయచూర్ జిల్లాల్లో తాను సూచించిన హోమియో పతి మందులను వాడి రైతులు ప్రయోజనం పొందుతున్నారని ఆయన వెల్లడించారు. -
నెల్లూరు: మహిళతో డాక్టర్ వివాహేతర సంబంధం.. వీడియో వైరల్
సాక్షి, నెల్లూరు: జిల్లాలో ఓ వివాహేతర సంబంధం రచ్చకెక్కింది.. నెల్లూరు నగరానికి చెందిన హోమియోపతి డాక్టర్ బాలకోటేశ్వరరావుకు తన దగ్గర పనిచేస్తున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరి మధ్య కొన్నాళ్లపాటు ఈ ఎఫైర్ కొనసాగింది. అయితే ఇటీవల మహిళను డాక్టర్ బాలకోటేశ్వరరావు దూరం పెడుతున్నాడు. దీంతో సదరు మహిళ.. తన ఎందుకు రావడం లేదని అతని ఆస్పత్రికి వెళ్లి నిలదీసింది. ఎందుకు దూరం పెడుతున్నావని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. డాక్టర్, మహిళ మధ్య మాటామాటా పెరిగి ఇరువురు పరస్పర దాడులకు దిగారు. కోపంతో చెలరేగిన మహిళ కోటేశ్వరరావును చొక్కాపట్టుకొని రోడ్డుపైకి లాక్కొచ్చింది. అందరూ చూస్తుండగానే రోడ్డుపై పరస్పరం కొట్టుకున్నారు. అనంతరం సదరు మహిళ జిల్లా ఎస్పీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా రోడ్డుపై ఇద్దరూ కొట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: నాతో సెల్ఫీ అంటే మామూలు విషయం కాదు.. దిమ్మతిరిగిందా! చేపలు, రొయ్యలు, పీతలు.. ఇక మన దరికే ‘మీనం’! -
'వాటిని వైద్య కమిషన్ నియంత్రణ కిందకు తీసుకురావాలి'
ఢిల్లీ : ఇటీవల కాలంలో బహుళ ప్రాచుర్యం పొందిన యోగా, నేచురోపతి వంటి వైద్య విధానాలను సైతం భారతీయ వైద్య విధాన కమిషన్ నియంత్రణ కిందకు తీసుకురావాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. భారతీయ వైద్య విధాన జాతీయ కమిషన్ బిల్లు, జాతీయ హోమియోపతి కమిషన్ బిల్లులపై బుధవారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ వైద్య విధానాలైన ఆయుర్వేద, యునాని, సిద్ధ, సోవా రిగ్పాను నియంత్రిస్తూ ఆయా రంగాలలో పారదర్శకత, బాధ్యతను కల్పించేందుకు ఈ బిల్లులో ప్రతిపాదించిన సంస్కరణల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారతీయ వైద్య విధానాలలో విద్య, వృత్తి నియంత్రణ కోసం యోగా, నేచురోపతిని కూడా తప్పనిసరిగా వైద్య కమిషన్ పరిధిలోకి తీసుకురావాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. అలాగే బిల్లులోని సెక్షన్33లో పొందుపరచిన ఒక నిబంధనను తొలగించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఈ నిబంధన కారణంగా భారతీయ వైద్య విధానాలు ప్రాక్టీస్ చేసే అర్హులైన వైద్యులకు అన్యాయం జరుగుతుంది.ఈ నిబంధన కారణంగా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఉత్తీర్ణులు కాని కొందరు కమిషన్ అనుమతితో ప్రాక్టీసు చేసుకునేందుకు అర్హత సాధిస్తారు. ఫలితంగా నకిలీ వైద్యుల బెడదను అరికట్టేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు లక్ష్యం నిర్వీర్యమవుతుందని తెలిపారు. ఓబీసీల సబ్‌కేటగిరీపై కమిషన్ గడువు పెంపు : ఓబీసీల సబ్‌కేటగిరీపై కమిషన్ గడువు పెంపుపై రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి కృష్ణపాల్ గుర్జర్ రాతపూర్వకంగా జవాబిచ్చారు. దేశవ్యాప్తంగా వెనుకబడిన కులాలను సబ్ కేటగిరిగా విభజించాలన్న ప్రతిపాదనలపై అధ్యయనం చేయడానికి నియమించిన కమిషన్ గడువును ఈ ఏడాది జూలై 31 వరకు పొడిగించినట్లు వెల్లడించారు. రిజర్వేషన్ ఫలాలు ఓబీసీలకు సమాన నిష్పత్తిలో అందడం లేదన్న ఫిర్యాదులపై ఎలాంటి కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించలేదని మంత్రి తెలిపారు. అయితే ఓబీసీలను సబ్ కేటగిరీల కింద విభజించాలంటూ వచ్చిన డిమాండ్లపై అధ్యయనం చేసేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్340 కింద కల్పించిన అధికారాన్ని వినియోగించి 2017 అక్టోబర్2న కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్‌ను నియంమించిదన్నారు. ఈ కమిషన్ గడువును పలు దఫాలుగా పొడిగిస్తూ రావడం జరిగింది. తాజాగా కమిషన్ గడువును ఈ ఏడాది జూలై 31కి పొడిగిస్తూ గత జనవరి 17న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినట్లు మంత్రి వివరించారు. -
క్లినిక్ పేరుతో అసభ్య ప్రవర్తన..!
సాక్షి, హైదరాబాద్ : ట్రీట్మెంట్ కోసం వచ్చిన మహిళలపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ డాక్టర్ కటకటాల పాలయ్యాడు. సికింద్రాబాద్‌లో గత పదేళ్లుగా హోమియోపతి క్లినిక్ నడిపిస్తున్న చంద్రమోహన్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన చిలకలగూడ పోలీసులు డాక్టర్‌ను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. -
రూ 8 కోట్లతో ఆసుపత్రి నిర్మాణంపనులు ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం దాదాపు మూడేళ్ల క్రితం కడపలోని ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలకు, శాశ్వత భవన నిర్మాణాల కోసం నేషనల్ ఆయుష్ మిషన్ కింద రూ. 8 కోట్లు కేటాయించింది. అధికారుల సమన్వయ లోపం, స్థలం కేటాయింపులు తదితర సమస్యలు శాపంగా మారాయి, దీనిపై ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఎట్టకేలకు హోమియోపతికి పట్టిన గ్రహణం వీడింది. కడప పాత రిమ్స్‌లో వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం పక్కన గల స్థలంలో అధునాతన ఆసుపత్రి నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో గుడివాడ, రాజమండ్రి తరువాత కడపలో మాత్రమే ఈ వైద్యశాల ఉండడం గమనార్హం. కడప రూరల్: కడప నగరంలో 1984లో 45 పడకల ప్రభుత్వ హోమియోపతి వైద్యశాల ఏర్పాటైంది. మొదట్లో ఈ ఆసుపత్రి రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉండేది. కొన్నేళ్లుగా పాత రిమ్స్‌లో అసౌకర్యాల మధ్య నడుస్తోంది. ప్రస్తుతం కడప పాత రిమ్స్‌లో కొనసాగుతున్న ఆసుపత్రిలో నాటి నుంచి నేటి వరకు పట్టిన సమస్యల జబ్బు వీడలేదనే చెప్పవచ్చు. ఇక్కడకు జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు 250 మందికి పైగా వైద్య చికిత్సల కోసం వస్తుంటారు. అయితే ఇన్ పేషెంట్లకు అవకాశం ఉన్నా ఎవరూ అడ్మిట్ కాకపోవడం గమనార్హం. ఆసుపత్రిలో 45 పడకలను కింద, పై భాగాల్లో ఏర్పాటు చేశారు.ఇక్కడ నెలకొన్న సమస్యల కారణంగా పై భాగంలో ఏర్పాటు చేసిన గది పనికి రాకుండాపోయింది. దీంతో 45 పడకల వైద్యశాల కాస్తా 19 పడకల ఆసుపత్రిగా మారింది. ఇందులో పక్షవాతం, ఆస్తమా, థైరాయిడ్, మధుమేహం, చర్మ సంబంధిత తదితర వ్యాధులకు వైద్యం లభిస్తుంది. ఈ మందుల వాడకం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేనందున చాలా మంది ఈ వైద్యం పట్ల మక్కువ చూపుతున్నారు. నిధులు కేటాయించినా.. ఈ ఆసుపత్రికి శాశ్వత భవన నిర్మాణం కోసం కడప నగరం జయనగర్ కాలనీలోని సర్వే నెంబరు 752–291–01లో 34 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. ఆ మేరకు మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ ఆయుష్ మిషన్’ కింద రూ. 8 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ‘ఆరోగ్య మౌలిక వసతుల సంస్థ ఆసుపత్రి భవన సముదాయాలను నిర్మించాలి. అయితే కేటాయించిన స్థలం చాలా వరకు ఆక్రమణకు గురైంది. ఈ నేపథ్యంలో కడప పాత రిమ్స్‌లోనే వైద్య ఆరోగ్యశాఖ రీజనల్ డైరెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న దాదాపు 42 సెంట్ల స్థలంలలో ఆసుపత్రిని నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. అందుకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. ఈ భవన నిర్మాణాల కోసం ఆరోగ్య మౌలిక వసతుల సంస్థ వారు టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్లలో ప్రొద్దుటూరుకు చెందిన ఒక కాంట్రాక్టర్ పనులను దక్కించుకున్నారు. ఇప్పుడు ఈ స్థలంలో ఇటీవల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. -
నిర్మించి వదిలేశారు!
అన్నీఉన్నా అల్లుడు నోట్లో శని అన్న సామెత చందాన తయారైంది కేంద్రాస్పత్రిలో నిర్మించిన భవనాల పరిస్థితి. కోట్లాది రుపాయలు వెచ్చించి నిర్మాణాలు పూర్తిచేసినా ప్రారంభించకపోవడం వల్ల రోగులకు ఉపయోగపడకుండా పోయాయి. భవనాలు నిర్మించక ప్రారంభించలేదంటే అదీకాదు. నిర్మాణం పూర్తయినప్పటికీ అధికారులు ఎందువల్లో వినియోగంలోకి తీసుకురావడం లేదు. విజయనగరం ఫోర్ట్ : కేంద్రాస్పత్రిలో ఉన్న మార్చురి గది శిథిలావస్థకు చేరుకోవడం ఆస్పత్రిలో ఆధునాతన మార్చరీ గదిని సుమారు రూ.1.13 కోట్లుతో నిర్మించారు. నిర్మాణం పూర్తయి ఆరునెలలు కావస్తున్నా ఇంతతవరకు ప్రారంభించలేదు. ప్రస్తుతం ఉన్న మార్చురీ గది చాలా చిన్నది. శవాలను ఒక రోజు కూడ భద్రపరచుకునే వీలులేని పరిస్థితి. దీనికి తోడు ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద ఉండడంతో మృతదేహాలు ఒకటి రెండు రోజులు ఉన్నా దుర్వాసన వెలువడుతుంది. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనాథశవాలను మూడు, నాలుగు రోజుల పాటు భద్రపరచాల్సి ఉంటుంది. అయితే మృతదేహాలను భద్రపరిచే ఫ్రీజర్లు పాడవడంతో నేలపైనే మృతదేహాలను ఉంచాల్సిన దుస్థితి నెలకొంది. నిర్మాణం పూర్తయిన ఐసోలేషన్ వార్డు వివిధ రకాల ఇనఫెక్షన్స్తో వచ్చే వారి కోసం రూ.20 లక్షలతో వార్డు నిర్మించారు. నెలరోజుల క్రితమే నిర్మాణం పూర్తయింది. అయినప్పటికీ ప్రారంభించలేదు. ఐసోలేషన్ వార్డు లేకపోవడం వల్ల వివిధ ఇన్ఫెక్షన్స్తో వచ్చే రోగులను ఇన్‌పేషేంట్స్‌గా చేర్చుకోవడం లేదు. ఓపీ సేవలకే పరిమతమవుతున్నాయి. వార్డు వినియోగంలోకి వస్తే ఇన్‌పేషేంట్ సేవలు అందుతాయి. హోమియో ఆస్పత్రిదీ అదే పరిస్థితి అల్లోపతి మాదిరి హోమియో రోగులకుకూడ ఇన్‌పేషేంట్ సేవలు అందించాలన్న ఉద్దేశంతో 10 పడకల హోమియో ఆస్పత్రిని రూ.30 లక్షలతో నిర్మించారు. దీని నిర్మాణం పూర్తయి నెలరోజులు కావస్తోంది. ఇదికూడా ప్రారంభానికి నోచుకోలేదు. హోమియో ఆస్పత్రి వినియోగంలోకి వస్తే రోగులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. ప్రారంభంకాని పిల్లల వార్డు ఆస్పత్రిలో పిల్లలకు ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు రూ.53 లక్షలతో పిల్లలవార్డును నిర్మించారు. ఈ వార్డు వినియోగంలోకి వస్తే పిల్లలకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందుతాయి. ఇప్పడు మహిళల డయేరియా వార్డుపక్కన పిల్లల వార్డు ఉంది. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ సోకుతాయోమోనని రోగులు ఆందోళన చెందుతున్నారు. వినియోగించని అటెండెంట్ షెడ్డు ఆస్పత్రిలో రోగులతో పాటు వచ్చే బంధువులు వి శ్రాంతి తీసుకోవడం కోసం అటెండ్ షెడ్డు నిర్మించారు. దీనివల్ల రూ.15 లక్షల వరకు ఉంటుంది. దీనినిర్మాణం కూడా పూర్తయి 15 రోజులు దాటి ంది. దీన్నికూడా వినియోగంలోకి తీసుకురాలేదు. త్వరలోనే ప్రారంభిస్తాం మార్చురీ గదిని త్వరలోనే ప్రారంభిస్తాం. ఐసోలేషన్ వార్డు నిర్మాణం పూర్తయినప్పటికీ సిబ్బందిని నియమించాల్సి ఉంది. పిల్లల వార్డును కూడా త్వరలోనే ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటాం – కె సీతారామరాజు, సూపరింటెండెంట్, కేంద్రాస్పత్రి -
నొప్పి మెడ నుంచి చేతులకు పాకుతోంది..?
నా వయసు 53 ఏళ్లు. నేను కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. నొప్పి చేతుల వరకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. హోమియోలో నా సమస్యకు పూర్తి పరిష్కారం ఉందా? – ఎన్. ఆంజనేయరెడ్డి, కర్నూలు మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. గతంలో పెద్దవారిలో కనిపించినా, జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇప్పుడిది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: ∙వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ∙క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం ∙డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ∙వృత్తి రీత్యా అధిక బరువులు మోయడం ∙ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ∙ఎక్కువ సేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్కువ సమయం మెడను వంచి ఫోన్లలో మాట్లాడటం ∙ఎల్తైన దిండ్లు వాడటం ∙మెడకు దెబ్బతగలడం ∙మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: ∙సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ∙నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ∙మెడ బిగుసుకుపోవడం ∙తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురుకు వ్యాపించడం ∙నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ∙చిన్న బరువునూ ఎత్తలేకపోవడం ∙నడకలో నిలకడ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. హోమియో చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. - డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
ఫిజియోథెరపి చేస్తూ.. కాళ్లు విరగ్గొట్టాడు
-
కాళ్లు విరగ్గొట్టారు.. రామంతాపూర్‌లో దారుణం
సాక్షి, హైదరాబాద్ : రామంతాపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. రెండున్నరేళ్ల బాలుడికి ఫిజియోథెరపి చేస్తూ.. వైద్యుడు ఏకంగా కాళ్లు విరగ్గొట్టాడు. ఈ ఘటనపై బాలుడి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ హోమియోపతి ఆస్పత్రికి చెందిన వైద్యుడు కిరణ్‌కుమార్ బాలుడికి ఫిజియోథెరపీ చేస్తూ.. కాళ్లు విరగ్గొట్టాడు. డాక్టర్ కిరణ్‌కుమార్ తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించి తమ చిన్నారి కాళ్లు విరగ్గొట్టాడని కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. దీనిపై వైద్యుడిని నిలదీశారు. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించుకోవాలని చెప్పి.. సదరు వైద్యుడు చేతులు దులుపుకున్నాడు. వైద్యుడి నిర్వాకంపై ఫిర్యాదు చేసినా ఆస్పత్రి ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని బాలుడి కుటుంబసభ్యులు చెప్తున్నారు. కాళ్లు విరగడంతో తీవ్రమైన నొప్పులతో నడవలేని స్థితిలో బాలుడు ఉన్నాడు. దీంతో ఆ చిన్నారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యపూరిత ప్రవర్తనపై బాలుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. -
గౌట్ సమస్య తగ్గుతుందా?
నా వయసు 46 ఏళ్లు. కొద్దిరోజుల నుంచి కాలి బొటనవేలు వాచి, విపరీతమైన సలపరంతో నొప్పి వస్తోంది. వైద్యుడిని సంప్రదిస్తే గౌట్ అన్నారు. డాక్టర్ సూచనల మేరకు మందులు వాడినప్పటికీ సమస్య పూర్తిగా తగ్గలేదు. ఇటీవలే రక్తపరీక్ష చేయిస్తే రక్తంలో ఇంకా ‘యూరిక్ యాసిడ్’ స్థాయులు ఎక్కువే ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. నా సమస్యకు హోమియో చికిత్స ఉందా? – ఎమ్. శ్రీనాథ్, వరంగల్ మన శరీరంలో ‘యూరిక్ యాసిడ్’ జీవక్రియలు సరిగా లేనందువల్ల గౌట్ వ్యాధి వస్తుంది. ఇది ఒక రకం కీళ్లవ్యాధి. యూరిక్ యాసిడ్ రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టమవుతాయి. దాన్ని ‘గౌట్’ అంటారు. లక్షణాలు: ∙తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి ∙చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది ∙మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది ∙ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. నివారణ/జాగ్రత్తలు: మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగ, పేగుల వంటి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. చికిత్స: హోమియో వైద్యవిధానంలో అందించే అధునాతనమైన కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది. - డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ ఆటిజం అంటే ఏమిటి? మా బాబు వయసు మూడేళ్లు దాటుతోంది. ఇంకా మాట్లాడటం గానీ, పిలిస్తే పలకడం గానీ, పిల్లలతో ఆడటం కానీ చేయడం లేదు. చూడటానికి బాగానే ఉంటాడు. ఎవ్వరినీ కలవడు. శబ్దాలు చేస్తూ తన లోకంలో తానే ఉంటాడు. పిల్లల డాక్టర్‌కు చూపిస్తే ఇది ఆటిజం కావచ్చని అంటున్నారు. హోమియోలో దీనికి చికిత్స ఉందా? – ఆదిత్య, గుంటూరు ఆటిజం లక్షణాలను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. హోమియోపతిలో దానికి కొంత పరిష్కారం ఉంది. ఆటిజం అనేది ఒక లక్షణం కాదు. దీనిలో వివిధ లక్షణాలు, ఎన్నో స్థాయులు, మరెన్నో భేదాలు ఉంటాయి. ఆటిజం అందరిలో ఒకేలా ఉండదు. కొందరిలో ఆటిజం లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీన్ని క్లాసికల్ ఆటిజం అంటారు. మరికొంతమందిలో లక్షణాల తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. అది జీవనశైలిపై ఎలాంటి ప్రభావం చూపించదు. దీన్ని మైల్డ్ ఆటిజం అంటారు. లక్షణాలు: ∙ఎదుటివారి మనోభావాలు అర్థం చేసుకోలేకపోవడం ∙నలుగురిలో కలవలేకపోవడం లేదా ఆనందాలు, బాధలు పంచుకోలేకపోవడం ∙చేతులు, కాళ్లు విచిత్రంగా ఆడించడం, కదపడం ∙కొత్తదనానికి త్వరగా అలవాటు పడలేకపోవడం, రొటీన్‌గా ఉండటాన్నే ఇష్టపడటం ∙అలవాటు పడ్డ వ్యక్తులతోనే ఉండటం. చికిత్స: ఆటిజం వ్యాధికి హోమియోపతిలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాధి కోసం కార్కినోసిస్, తుజా, సిక్రెటిన్ వంటి మందులను లక్షణాలను ఇవ్వాలి. వ్యాధిని త్వరగానూ, ముందుగానే గుర్తించి ఇస్తే పిల్లల్లో లక్షణాల తీవ్రత పెరగకుండా చూడవచ్చు. ఐక్యూ పెంచవచ్చు. హోమియో చికిత్స తీసుకుంటూ పిల్లలకు బిహేవియర్ థెరపిస్టులతో ప్రత్యేక వైద్యవిధానం ద్వారా చికిత్స చేయాల్సి ఉంటుంది. - డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ ఫిషర్‌కు చికిత్స ఉందా? నా వయసు 65 ఏళ్లు. నేను మలబద్దకంతో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పి, ఆపరేషన్ అవసరమన్నారు. హోమియో మందులతో తగ్గే అవకాశం ఉందా? – ఆర్. కాంతారావు, నిజామాబాద్ మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఆ పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితోపాటు రక్తస్రావం అవుతుంది. ఫిషర్ ఏళ్ల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టే అవకాశాలు ఎక్కువ. దాంతో ఆందోళన మరింత పెరుగుతుంది. కారణాలు: ∙దీర్ఘకాలిక మలబద్దకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం. లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన అనంతరం రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స: ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ఆపరేషన్ అవసరం లేకుండా, ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడితే మంచి ఫలితం ఉంటుంది. - డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
మడమల్లో నొప్పి... తగ్గేదెలా?
నా వయసు 42 ఏళ్లు. పొద్దున లేవగానే నడుస్తుంటే మడమలలో విపరీతమైన నొప్పి వస్తోంది. ఏదైనా సపోర్ట్ తీసుకొనే నడవాల్సి వస్తోంది. ఈ బాధ భరించలేకపోతున్నాను. హోమియో పరిష్కారం చెప్పండి. – సుధారాణి, కాకినాడ అరికాలిలో ప్లాంటార్ ఫేషియా అనే లిగమెంటు ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ అది తన సాగే గుణాన్ని కోల్పోయి తాడులా మారుతుంది. నిజానికి ఇది ఫ్లాట్‌పాడ్‌లా ఉండి కాలికి షాక్ అబ్జార్బర్‌లా పనిచేస్తుంది. వయసు పెరిగి, ఇది సన్నగా మారడం వల్ల గాయాలను తట్టుకునే శక్తిని కోల్పోతుంది. దాంతో నడకతో కలిగే షాక్స్‌ను తట్టుకోలేక ప్లాంటార్ ఫేషియా డ్యామేజ్ అవుతుంది. ఫలితంగా అరికాలిలో నొప్పి, మడమ నొప్పి, వాపు కనిపిస్తాయి. ఉదయం పూట నిల్చున్నప్పుడు మడమలో నొప్పి వస్తుంది. ఇలా ప్లాంటార్ ఫేషియా డ్యామేజ్ అయి వచ్చే నొప్పిని ప్లాంటార్ ఫేషిౖయెటిస్ అంటారు. ఇది పొడిచినట్లుగా లేదా సూదితో గుచ్చినట్లుగా నొప్పిని కలగజేస్తుంది. కారణాలు: ∙డయాబెటిస్ ∙ఊబకాయం, ఉండాల్సినదాని కంటే ఎక్కువగా బరువు ఉండటం ∙ఎక్కువ సేపు నిలబడటం, పనిచేయడం ∙తక్కువ సమయంలో చురుకుగా పనిచేయడం ∙ఎక్కువగా హైహీల్స్ చెప్పులు వాడటం (మహిళల్లో). లక్షణాలు: ∙మడమలో పొడిచినట్లుగా నొప్పి ∙ప్రధానంగా ఉదయం లేవగానే కాలిని నేలకు ఆనించినప్పుడు నొప్పి కనిపించడం ∙కండరాల నొప్పులు చికిత్స: మడమనొప్పికి హోమియోలో పల్సటిల్లా, రొడొడెండ్రాన్, కాల్కేరియా ఫ్లోర్, రస్టాక్స్, అమోనియమ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి లక్షణాలను బట్టి వాటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. మీరు వెంటనే అనుభవజ్ఞులైన డాక్టర్‌ను సంప్రదించి, మీ లక్షణాలన్నీ తెలిపి, తగిన మందులు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. – డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ -
హోమియోపతి అభివృద్ధికి జాతీయ కమిషన్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా హోమియోపతిని ప్రోత్సహించడంతో పాటు నైపుణ్యమున్న వైద్య నిపుణుల్ని ఆకర్షించేందుకు వీలుగా ఓ నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. నేషనల్ హోమియోపతి కమిషన్(ఎన్సీహెచ్) పేరుతో ఏర్పాటు కానున్న ఈ సంస్థ హోమియోపతి రంగంలో నాణ్యమైన విద్యతో పాటు, పరిశోధనల్ని పర్యవేక్షిస్తుందని ఆయుష్ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు మనోజ్ రజోరియా వెల్లడించారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ హోమియోపతి(సీసీఆర్‌హెచ్) నిర్వహించిన రెండురోజుల సదస్సు ముగింపు కార్యక్రమంలో మనోజ్ మాట్లాడారు. ‘ఎన్‌సీహెచ్‌లో ఉండే నాలుగు బోర్డులు డిగ్రీ, పీజీ కోర్సుల పర్యవేక్షణ, విద్యాసంస్థలకు అక్రిడేషన్ ఇవ్వడం, తనిఖీ చేయడం, డాక్టర్ల సంఖ్యను నియంత్రించడం వంటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తాయి’ అని ఆయన తెలిపారు. -
హైపర్‌థైరాయిడిజమ్ తగ్గుతుంది
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 27 ఏళ్లు. ఈమధ్య బరువు తగ్గడం, నీరసం, ఎంత తిన్నా ఆకలిగా ఉండటం, గుండెదడ ఉంటోంది. డాక్టర్ గారికి చెబితే థైరాయిడ్‌కు సంబంధించి టీ3, టీ4, టీఎస్‌హెచ్ పరీక్షలు చేయించమన్నారు. ఈ సమస్య ఏమై ఉండవచ్చు. దీనికి పరిష్కారమార్గాలు చెప్పండి. – సునీత, హైదరాబాద్ థైరాయిడ్ సమస్య ఇటీవల ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తోంది. ప్రపంచ జనాభాలో దాదాపు 75 శాతం మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య పురుషులతో పోలిస్తే మహిళల్లో చాలా ఎక్కువ. మానవుడి శరీరంలో అతి ముఖ్యమైన గ్రంథులలో థైరాయిడ్ ఒకటి, థైరాయిడ్ గ్రంథి మెడ మధ్య భాగంలో గొంతుకు ముందువైపున సీతాకోకచిలుక ఆకారంలో శ్వానాళానికి ఇరుపక్కలా ఉంటుంది. ఈ గ్రంథి పిట్యూటరీ గ్రంథి అధీనంలో ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరులో ముఖ్యంగా రెండు తేడాలను చూస్తాం. వాటిల్లో థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గడం వల్ల కలిగే హైపోథైరాయిడిజమ్ ఒకటి. ఇక రెండోది థైరాయిడ్ గ్రంథి పనితీరు పెరగడం వల్ల కలిగే హైపర్‌థైరాయిడిజమ్. ఈ సమస్యలు ఏ వయసు వారిలోనైనా రావచ్చు. అయితే 20–40 ఏళ్ల మధ్యవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీది హైపర్ థైరాయిడిజమ్ కావచ్చని తెలుస్తోంది. ఈ సమస్యను త్వరగా గుర్తించకపోయినా లేదా నిర్లక్ష్యం చేసినా దుష్ప్రభావాలు ఎక్కవగా కనిపిస్తాయి. థైరాయిడ్ గ్రంథిలో వాపు, ఇన్ఫ్లమేషన్ వంటి కారణాలతో సమస్య రావచ్చు. లక్షణాలు: ∙కోపం, చికాకు, నీరసం ∙అలసట, ఉద్రేకం, కాళ్లు చేతులు వణకడం ∙హైపర్ థైరాయిడిజమ్‌లో ఆకలి బాగా ఉంటుంది. కానీ బరువు తగ్గుతుంది ∙అధిక వేడిని తట్టుకోలేకపోవడం ∙నిద్రలేమి, గుండెదడ, చెమటలు పట్టడం ∙ఏకాగ్రత సమస్యలు, స్త్రీలలో నెలసరి త్వరగా రావడం. నిర్ధారణ పరీక్షలు: టీ3, టీ4, టీఎస్‌హెచ్ స్థాయులు, రక్తపరీక్షలు, థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్ చికిత్స: హోమియోపతి వైద్యవిధానంలో థైరాయిడ్ రావడానికి గల మూలకారణాన్ని విశ్లేషించి, శారీరక, మానసిక లక్షణాలను విచారించి, సరైన హోమియో మందులను వాడటం ద్వారా చికిత్స చేస్తారు. హైపర్‌థైరాయిడ్ సమస్యకు హోమియోలో కాల్కేరియా ఫాస్, కాల్కేరియా కార్బ్, ఐయోడమ్, స్పాంజియా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని అనుభవజ్ఞులైన డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ గొంతును ఎక్కువగా వాడేవారికి జాగ్రత్తలివే... ఇఎన్‌టి కౌన్సెలింగ్ నేను ట్యూషన్స్ చెబుతుంటాను. ఇటీవల అప్పుడప్పుడూ నాకు గొంతు బొంగురుపోయినట్లుగా అనిపిస్తోంది. నా గొంతు విషయంలో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. – ఎన్.ఎల్. ప్రసాద్, వరంగల్ కొంతమందికి గొంతుతోనే పనిచేస్తుంటారు. వీరిని ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్ అంటారు. అంటే ఉపాధ్యాయులు, లెక్చరర్లు, గాయకులు, రేడియోజాకీలు, సేల్స్ జాబ్‌లో ఉన్నవాళ్లంతా రోజూ తమ గొంతుతోనే పనిచేస్తూ ఉంటారు. వారి రోజువారీ పనులతో వాళ్ల వోకల్ కార్డ్స్ ఎంతగానో అలసిపోతాయి. ఇలాంటివారు ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ⇒ రోజులో కనీసం 15 నిమిషాల పాటు చొప్పున మూడుసార్లైనా తమ గొంతుకు పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయాలి. హైపర్‌థైరాయిడిజమ్ తగ్గుతుంది రోజూ నీళ్లు పుష్కలంగా తాగాలి. ⇒ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. పొగాకు అలవాటును తక్షణం వదిలేయాలి. కాఫీ అలవాటును పూర్తిగా తగ్గించుకోవాలి. ⇒గొంతు గరగర వచ్చి అది సుదీర్ఘకాలం ఉంటే తప్పకుండా ఈఎన్టీ నిపుణులను కలుసుకొని తగిచన చికిత్స తీసుకోవాలి. కొందరిలో యాసిడ్ పైకి ఎగజిమ్మడం వల్ల కూడా గొంతులో సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఇలాంటివారు తప్పకుండా తమ ఎసిడిటీ తగ్గించుకోవడం కోసం కృషి చేయాలి. నాకు తరచూ జలుబు చేస్తోంది. గత కొంతకాలం నుంచి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. రోజువారీ పనులు చేసుకోడానికి కూడా కుదరడం లేదు. జలుబు టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. ఆ తర్వాత పదే పదే వస్తోంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – రవికుమార్, శ్రీకాకుళం మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తే మీకు ‘నేసల్ అలర్జీ’ ఉండవచ్చు అనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఈ సమస్య ఇబ్బంది ఉందన్నారు. కాబట్టి దీనికి మీరు సరైన చికిత్స తీసుకోలేదని అనిపిస్తోంది. ముక్కు, చెవి, గొంతు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి. దాంతో ఒక భాగంలో సమస్య వస్తే అది మిగతా రెండు చోట్లా సమస్యలకు దారితీయవచ్చు. యాంటీ అలర్జిక్ టాబ్లెట్ వాడటం శాశ్వత పరిష్కారం కాదు. దాన్ని ఎక్కువగా వాడటం వల్ల కొన్ని ఇతర సమస్యలు కూడా రావచ్చు. దీనికంటే ‘నేసల్ స్ప్రే’లు వాడటం కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. వాటితో సైడ్ఎఫెక్ట్స్ కూడా తక్కువ. మీరు ముందుగా నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం చికిత్స తీసుకోండి. మీకు అలర్జీ కలిగించే అంశాలను గుర్తించి వాటి నుంచి దూరంగా ఉండండి. డాక్టర్ ఇ.సి. వినయకుమార్ హెచ్ఓడి – ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ -
మాటిమాటికీ మూత్రం... ఎందుకిలా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. గత ఆర్నెల్ల నుంచి రాత్రిపూట మూత్ర విసర్జన కోసం మాటిమాటికీ లేచేవాణ్ణి. ఈమధ్య మూత్రం బొట్లు బొట్లుగా వస్తోంది. కంట్రోల్ తప్పింది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - రమేశ్, కందుకూరు పురుషుల్లో అత్యంత ప్రధానమైన గ్రంథి ప్రోస్టేట్ (పౌరుషగ్రంథి). ఇది వీర్యం ఉత్పత్తిలో కీలకమైన భూమిక పోషిస్తుంది. సంతానం కలగజేయడానికి కారణమయ్యే శుక్రకణాలు ఈ ప్రోస్టేట్ గ్రంథి తయారు చేసే స్రావాలలో కలిసి వీర్యం రూపంలో బయటకు వస్తుంటాయి. ఇలా సంతాన సాఫల్యంలో ఈ గ్రంథికి అంతటి ప్రాధాన్యం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ గ్రంథి కొద్దికొద్దిగా ఉబ్బుతుంటుంది. ఫలితంగా మూత్రవిసర్జనలో రకరకాల సమస్యలు తలెత్తడం సహజంగా జరిగే పరిణామమే. దీన్ని బినైన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేసియా’ అంటారు. ప్రోస్టేట్ గ్రంథి సమస్య సాధారణంగా 40 సంవత్సరాలు పైబడ్డ వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశవాసుల్లో ఈ సమస్య ఒకింత తక్కువేగానీ... పట్టణ ప్రాంతాల్లో, మాంసాహారం తినేవాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన లక్షణాలు కనిపించినా, మూత్ర సమస్యలు వేధిస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. కారణాలు : ప్రోస్టేట్ పెరగడానికి హార్మోన్ల స్థాయి తగ్గుదల ముఖ్యకారణం. కాస్త అరుదే అయినా గాయాలు కావడం గౌట్ సమస్య లక్షణాలు : మాటిమాటికీ మూత్రం రావడం పదే పదే మూత్ర విసర్జన చేయాలనిపించడం మూత్రం ఆపుకోలేకపోవడం మూత్రం ఆగి ఆగి రావడం మూత్ర విసర్జనలో రక్తం పడటం వ్యాధి నిర్ధారణ : అల్ట్రా సౌండ్ సోనోగ్రఫీ బయాప్సీ స్కానింగ్ చికిత్స : హోమియోపతి వైద్య విధానంలో ప్రోస్టేట్ గ్రంథి వాపు నుంచి పూర్తి ఉపశమనం కలిగించే మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ విధానంలో కేవలం లక్షణాలను తగ్గించడమే కాకుండా సమస్యను పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతుంది. రోగి శారీరక తత్వాన్ని బట్టి వైద్యులు తగిన మందులు సూచిస్తారు. ఆర్నికా, బెల్లడోనా, కోనియం, తూజా, మెర్క్‌సాల్ వంటి మందులు హోమియోలో అందుబాటులో ఉన్నాయి. అయితే అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో తగిన మోతాదులో వీటిని వాడాల్సి ఉంటుంది. - డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి హైదరాబాద్ -
ఆవు మూత్రంపైనా పన్ను
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో 5% విధింపు సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం గోమూత్రంపై 5 శాతం పన్ను విధించింది. ఏపీ వ్యాట్‌చట్టం-2005లోని ఐదో షెడ్యూల్ ప్రకారం గోమూత్రంపై పన్ను విధించే అధికారం ఉందంటూ వాణిజ్య పన్నుల విభాగం రాష్ట్రంలోని వివిధ సంస్థలకు సంజాయిషీ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్, కాస్మొటిక్స్ చట్టం-1940 కింద లెసైన్స్ పొంది తయారు చేసే ఆయుర్వేద, హోమియోపతి మందులపై పన్ను వేస్తున్నట్టే గోమూత్రాన్నీ ఔషధంగా ఉపయోగిస్తున్నందున పన్ను విధిస్తున్నట్టు పేర్కొంది. ఈమేరకు నోటీసులు అందుకున్న గోఉత్పత్తుల తయారీ సంస్థలు, గోసంరక్షణ శాలల నిర్వాహకులు ప్రభుత్వ తీరును నిరసిస్తున్నాయి. వాణిజ్య పన్నులశాఖ నోటీసుల్లో ఏముందంటే.. ఆయుర్వేద, హోమియోపతి మందుల మాదిరే గోమూత్రాన్నీ ఔషధంగా ఉపయోగిస్తున్నందున పన్ను విధించవచ్చని వాణిజ్య పన్నులశాఖ ఇటీవల గుంటూరు సహా వివిధ జిల్లాల్లోని గోఉత్పత్తుల తయారీ సంస్థలకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. గోమూత్రాన్ని కాచి వడపోసి ప్యాక్ చేసి అమ్ముతున్నందున పన్ను పరిధిలోకి వస్తుందని తెలిపింది. ఆవు మూత్రాన్ని వేదకాలం నుంచే ఆయుర్వేద వైద్యంలో వినియోగిస్తున్నప్పటికీ పన్ను నుంచి మినహాయించమని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. గోమూత్రాన్ని ఏయే రుగ్మతలకు వాడతారో కూడా పేర్కొంది. అధిక బరువు, ఉదర సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు, చక్కెర వ్యాధి, కాలేయ వ్యాధులు, ఉబ్బసం, పేగు సంబంధిత రుగ్మతలు, కీళ్ల వాతం, కీళ్ల నొప్పులు తదితరాలకు వినియోగిస్తుంటారని వివరించింది. అందువల్ల గోమూత్రంపై ఏపీ వ్యాట్‌యాక్ట్ ప్రకారం 5 శాతం పన్ను విధించవచ్చంటూ సమర్థించుకుంది. గోమూత్రాన్ని కీటక నియంత్రణిగానూ ఉపయోగిస్తున్నందున క్రిమి సంహారక మందుల చట్టం కింద అమ్మకపు పన్ను కూడా విధించవచ్చునని తెలిపింది. పది వేల లీటర్ల వ్యాపారం..: రాష్ట్రంలోని గోశాలలు, రైతుల నుంచి గోఉత్పత్తుల తయారీ సంస్థలు నిత్యం వేలాది లీటర్ల మూత్రాన్ని సేకరిస్తున్నాయి. ఇటీవలి కాలంలో దేశీ ఆవులకు, గోమూత్రానికి గిరాకీ పెరిగింది. దేశీ ఆవుల నుంచి తీసిన మూత్రాన్ని వైద్యంతోపాటు సేద్యానికీ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పది వేల లీటర్లకు పైగా గోమూత్రాన్ని అమ్ముతున్నారు. శుద్ధి చేసిన మూత్రాన్ని లీటర్‌కు రూ.50, సేద్యానికి వినియోగించే మూత్రాన్ని లీటర్‌ను రూ.25 నుంచి రూ.30 మధ్య విక్రయిస్తున్నారు. రైతులు లేదా గోశాలల నుంచి సేకరించే మూత్రానికి, తాగడానికైతే లీటర్‌కు రూ.25, 30 మధ్య, సేద్యానికైతే లీటర్‌కు రూ.20 వరకు చెల్లిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేదు.. గోమూత్రాన్నీ, పేడను షాంపూలు, సబ్బులు, పెనాయిల్, అగర్ బత్తీలు, దూప్ బత్తీలు, దోమల నివారణ కాయిల్స్ తదితర ఉత్పత్తుల తయారీకి వినియోగిస్తారు. మనుషులు తాగేందుకు వీలుగా గోమూత్రాన్ని శుద్ధి చేసి విక్రయిస్తుంటారు. దీనిపై ఇప్పటి వరకు ఎక్కడా పన్ను వేయలేదు. రాష్ట్రంలో మాత్రమే ఈ ఏడాది నుంచి ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇదే జరిగితే గోశాలలు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. గోశాలలు విక్రయించే మూత్రంతో వచ్చే డబ్బును ప్రస్తుతం వాటి నిర్వహణకు వినియోగిస్తున్నారు. వ్యాట్‌ను ఎత్తివేయాలని, గోవుల ప్రేమతోనైనా కొత్త మార్కెట్ సృష్టించాలని గోశాలల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలంటే దేశీ ఆవులు అవసరమని, వాటి మూత్రంపై పన్ను ఏమిటని ప్రకృతిసాగు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మూలం నుంచి తొలగిస్తుంది సమూలంగా నయం చేస్తుంది..!
హోమియో డే స్పెషల్ హోమియోపతి నేడు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఆదరిస్తున్న వైద్య ప్రక్రియ. ఎంతో మంది సంతోషంగా విశ్వసిస్తున్న మార్గం. ఎందరో ఆనందంగా అనుసరిస్తున్న వైద్యవిధానం. క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హనిమన్ వైద్యవిధానానికి పునాదులు వేశారు. ఈ ప్రక్రియ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందడం వెనక ఆయన విస్తృతమైన కృషి ఉంది. ఇయన చేసిన శ్రమ అపారం. అందుకే ఆయనను ‘ఫాదర్ ఆఫ్ హోమియోపతి’ అంటారు. కొత్త ప్రక్రియకు ఆవిష్కరణ ఇలా... ఎర్జాంగన్ యూనివర్సిటీ నుంచి హనిమన్ 1779లో వైద్యవిద్యలో ఎండీ పూర్తిచేశారు. అప్పటి వైద్య చికిత్స విధానాలు రోగి అనారోగ్యాన్ని మరింత ఎక్కువ చేసేవిగా ఉన్నాయని, వ్యాధి మళ్లీ మళ్లీ తిరగబెట్టే విధంగా ఉండటం వల్ల ఆ వైద్య వ్యవస్థపై అసంతృప్తితో, ఆ ప్రక్రియలో వైద్యసాధన నుంచి విరమించుకున్నారు. ఆ తర్వాత వైద్య పుస్తకాలను జర్మన్లోకి అనువదించే ఉపాధిని అనుసరించారు. ఆ సమయంలో ఆయన సెల్యులార్ ఎమ్ఎమ్ పుస్తకంలో పెరూవియన్ బార్క్ (సింకోనా బెరడు)ను పరిశీలించారు. అందులోని ఔషధగుణాలు మలేరియాపై ప్రభావం చూపుతాయని తెలుసుకొన్నారు. ఆ తర్వాత ఆ ఔషధాన్ని తనపైనే ప్రయోగించుకున్నారు. ఆ బెరడు ఆశ్చర్యకరంగా ఆయనలో మలేరియా లక్షణాలను కలిగించింది. ఒక వ్యాధిని నివారించగలిగే ఔషధాలను ఆరోగ్యకరమైన వ్యక్తులపై ప్రయోగిస్తే అదే వ్యాధి లక్షణాలను కనబరుస్తాయి. కాబట్టే అవి ఆ వ్యాధిని నివారించగలుగుతున్నాయని నిర్ధారణ చేశారాయన. ఇది ‘సిమిలియా సిమిలిబస్ క్యురాంటర్’ సిద్ధాంతానికి మూలం. ఇంగ్లిష్‌లో చెప్పాలంటే ‘లైక్స్ ఆర్ క్యూర్డ్ బై లెక్స్’ అనేది ఈ మాటకు అర్థం. తన పైనా... కుటుంబ సభ్యులపైనా ప్రయోగాలు ఆ తర్వాత ఆయన ఎన్నో పదార్థాలను, మొక్కలు మొదలుకొని, విషపూరితమైన పదార్థాల వరకు తనపైన, తన కుటుంబ సభ్యులపైనా ప్రయోగించి తద్వారా వచ్చిన ఫలితాల ఆధారంగా ‘మెటీరియా మెడికా ప్యూరా’ అనే గ్రంథంలో వాటి ఫలితాను పొందుపరిచారు. మెటీరియా మెడికా ప్యూరా మూడు పుస్తకాలుగా ప్రచురితమయ్యాయి. రోగి లక్షణాలను పరిగణనలోకి... ప్రతి వ్యక్తికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ ఇద్దరు వ్యక్తులూ ఒకేలా ప్రవర్తించలేరు. అలాగే అనారోగ్య పరిస్థితిలో కూడా ఒక్కో వ్యక్తి కొన్ని ప్రత్యేక లక్షణాలు మానసికంగా గాని, శారీరకంగా గాని కనబరుస్తారు. ఈ ప్రత్యేక లక్షణాలను గుర్తించడానికి ‘లా ఆఫ్ ఇండివిడ్యులైజేషన్’ అంటారు. దీని ద్వారా ఆ వ్యక్తికి సరిపడ ఔషధాన్ని మెటీరియా మెడికా ద్వారా ఎంచుకొని హోమియోపతి విధానంలో చికిత్స అందించేవారు. మొదట్లో ఈ ప్రక్రియ రోగికి మరింత అస్వస్థతకు గురిచేసేది. అప్పుడు ఆయన తిరిగి ఆ ఔషధాన్ని తక్కువ మోతాదులో ఆల్కహాల్లో గానీ లేదా నీటిలో గాని కరిగించి, దాన్ని మళ్లీ మళ్లీ ఎక్కువసార్లు కుదించడం ద్వారా ఔషధంలోని ప్రాణాధార బలాన్ని (వైటల్ ఫోర్స్)ను పెంచేవారు. అది రోగి అనారోగ్యాన్ని సంపూర్ణంగా, ఎలాంటి దుష్ర్పభావాలూ లేకుండా నయం చేసేది. ఇది లా ఆఫ్ ఇన్ఫినిటైజిమల్ డోస్’ అనే సిద్ధాంతానికి మూలకారణం. ఇలా పరిశోధనలు జరిపి కనుగొన్న హోమియో విధివిధానాలనూ, సిద్ధాంతాలను ‘ద ఆర్గనాన్ ఆఫ్ రేషనల్ హీలింగ్’ అనే పుస్తకంలో పొందుపరిచారు. ఇవి ఆరు ఎడిషన్స్గా ప్రచురితమయ్యాయి. హోమియోలో కొన్ని ప్రధాన అంశాలు హోమియోపతిలో ఒక్కసారికే కనిపించే జబ్బులు (అక్యూట్), దీర్ఘకాలిక (క్రానిక్) వ్యాధులు మానసిక వ్యాధులు వంటి అనేక సమస్యలకు ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండా చిన్నపిల్లలు మొదలుకొని ఏ వయసు వారికైనా చికిత్స అందిస్తారు. ఇతర వైద్య వ్యవస్థలలా కాకుండా హోమియోపతిలో జన్యుపరమైన వ్యాధులను కూడా నయం చేయడం సాధ్యమవుతుంది. ఇతర వైద్య వ్యవస్థలలో వ్యాధిని కలగజేసే లక్షణాలను మాత్రమే తీసివేయడం జరుగుతుంది. కానీ హోమియోలో వ్యాధి మూలాల (మియాజమ్స్)పై సమగ్ర అధ్యయనం చేసి, సరైన ఔషధాన్ని కనుగొని, సంపూర్ణంగా తీసివేసి, పూర్తిగా ఆరోగ్యాన్ని అందించడం సాధ్యమవుతుంది. స్కార్లెట్ జ్వరం అంటువ్యాధిలా ప్రబలిన సమయంలో ‘బెల్లడోనా’ అనే ఔషధాన్ని ఉపయోగించిన వారిలో ఆ వ్యాధి సోకకపోవడాన్ని హనిమన్ గమనించారు. తద్వారా బెల్లడోనా ముందుజాగ్రత్త ఔషధ విలువను తెలుసుకున్నారు. అలా అది ప్రివెంటివ్ మెడిసిన్‌గా గుర్తింపు పొందింది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లవర్ది వైద్యరంగంలో ప్రత్యేక స్థానం... హోమియోకేర్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ది వైద్యరంగంలోనే ఒక ప్రత్యేక స్థానం. అద్భుత ప్రతిభను కలిగిన ఆయన హోమియోవైద్యచరిత్రలోనే తనదైన చెరగని ముద్రలు వేసి, దాదాపు కోటి మందికి పైగా పేషెంట్లను విలక్షణమైన జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చి వారి జీవితాలలో ఆరోగ్యానందాలను, వెలుగులను నింపారు. అపారమైన అనుభవం, అనితరసాధ్యమైన నైపుణ్యం, అంకిత భావం ఆయన సొంతం. మానవాళి మనుగడకు సవాలుగా మారిన ఎన్నో దీర్ఘకాలిక, మొండి వ్యాధులను శాశ్వతంగా నయం చేసి హోమియోవైద్య రంగంలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్. వారి ప్రతిభ సామర్థ్యాలకు గుర్తింపుగా ‘ధన్వంతరి’, ‘శుశ్రుత’, ‘బెస్ట్ హోమియో డాక్టర్’ వంటి అవార్డులను అందుకున్నారు. బోధన పట్ల ఎంతో అభిరుచి కలిగిన ఆయన ఎంతో ఉత్సాహంగా తన అనుభవపూరిత చికిత్సా విధానాలను, తన విజ్ఞానాన్ని విద్యార్థులకు, ఇతర హోమియో వైద్యులకు ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్త సెమినార్లు, సమావేశాల ద్వారా ఎంతోమందికి అందిస్తున్నారు. ఎన్నో ప్రతిష్ఠాత్మక పదవులను కూడా అధిరోహిస్తూ ఎన్నో సేవాసంస్థలలో భాగస్వాములై ఎంతోమంది పేదవారికి ఉచితంగా చికిత్సను అందిస్తున్నారు. విశిష్ట సంస్థ హోమియోకేర్ ఇంటర్నేషనల్... మూడు దశాబ్దాల కిందట ప్రారంభమైన శ్రీకాంత్ మోర్లావర్ ప్రస్థానం నేడు 36 క్లినిక్‌లతో దాదాపు దక్షిణ భారతదేశమంతా విస్తరించి హోమియో వైద్య రంగంలో చరిత్రను సృష్టించింది. హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో దాదాపు 300 మంది అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, 500 పైగా చక్కటి శిక్షణ పొందిన సిబ్బంది ఎప్పటికప్పుడు పేషెంట్లను పర్యవేక్షిస్తూ, వారి ఆరోగ్య సమస్యలను శాశ్వతంగా దూరం చేయడానికి కృషి చేస్తున్నారు. పూర్తిగా నయమవుతుంది... ఎన్నో మొండి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలైన థైరాయిడ్, డయాబెటిస్, పీసీఓడీ, ఇన్ఫెర్టిలిటీ, ఒబేసిటీ, హెయిర్‌ఫాల్, సోరియాసిస్‌తో పాటు మరెన్నో చర్మసమస్యలకు, ఇతర వ్యాధులకు సున్నితమైన, సమర్థమైన, దుష్ర్పభావాలు లేని చికిత్స హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో నయమవుతాయి. ఇందుకోసం వ్యాధిని అమూలాగ్రం నయం చేసేలా చికిత్స అందిస్తారు. ఎన్నో మొండి వ్యాధులను 85 శాతం సత్ఫలితాలను హోమియోకేర్ ఇంటర్నేషనల్ సాధించింది. ప్రతి వ్యాధి విషయంలోనూ నిపుణులైన వైద్య బృందం నిశితంగా అధ్యయనం జరిపి, చికిత్సను అందించడం జరుగుతుంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో అందించే మందులు అన్నీ జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న అత్యంత నాణ్యమైన మందులు. వాటిని బ్లిస్టర్ ప్యాకెట్ రూపంలో అందిస్తారు. హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఐఎస్ఓ - 9001 - 2008 జర్మన్ ఆమోదం పొందిన సంస్థ. హోమియో ఇంటర్నేషనల్‌లో ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలలో నివాసితులై ఉండి, క్లినిక్‌కు రాలేనివారికి ఆన్లైన్, స్కైప్, టెలీమెడిసిన్ ద్వారా కూడా చికిత్స అందించే సదుపాయం కల్పిస్తున్నారు. పేషెంట్ల సందేహాలు తీర్చడానికి, ఆరోగ్యం గురించి సమగ్రమైన సమాచారాన్ని అందించడానికి ఆన్లైన్ లేదా ఫోన్ సదుపాయం కూడా అందిస్తున్నారు. ఎన్నో పరిశోధనలు జరుపుతూ ఎప్పటికప్పుడు పేషెంట్లకు మెరుగైన, కచ్చితమైన హోమియో చికిత్స అందిస్తూ, మంచి ఫలితాలను పొందుతున్నారు. ఇటీవలే ఎంతోమంది సంతానలేమితో బాధపడిన అనేక మంది హైదరాబాద్, విజయవాడ, బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాలలో నిర్వహించిన ‘హోమియోకేర్ బేబీ షో’ కార్యక్రమంలో పాల్గొని తాము సంతానవంతులైన తాము పొందిన సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు డయాబెటిస్, సోరియాసిస్ వంటి ఇతర వ్యాధుల విషయంలోనూ నిర్వహించారు. అద్భుత ఫలితాలను ఆవిష్కరిస్తున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఇతర రాష్ట్రాలలోనూ వేగంగా విస్తరిస్తూ, ఎన్నో సత్ఫలితాలను అందుకుంటోంది. ఇటీవలే తమిళనాడులోని సేలంలో కూడా కొత్త శాఖను గౌరవనీయులు ‘కళైమామని తిరుబాలకుమారన్’ గారు ప్రారంభించారు. హోమియోకేర్ ఇంటర్నేషనల్ వారు హెచ్1ఎన్1 వైరస్‌కు నివారణ మందును కూడా అందించి మంచి ఫలితాలను పొందారు. ఖచ్చితమైన ఫలితాలే మా బలం, అందరికీ సంపూర్ణ చికిత్స అందించడమే మా ధ్యేయం. హోమియో కేర్ ఇంటర్నేషనల్ గురించి కొన్ని వివరాలు... ప్రపంచంలోనే అత్యుత్తమ హోమియో చికిత్స హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రత్యేకత. ఇక్కడ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ హోమియో చికిత్స ద్వారా వ్యాధులు శాశ్వతంగా నయం చేస్తారు.డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ హోమియోకేర్ ఇంటర్నేషన్ స్థాపించి హోమియోపతిని మొదటిసారిగా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. ఇలాంటి ప్రపంచ వ్యాప్త అత్యుత్తమ చికిత్స (వరల్డ్‌క్లాస్ హోమియోపతి ట్రీట్మెంట్)ను అందిస్తున్న డాక్టర్ శ్రీకాంత్ మోర్లవర్ ఎంతోమంది పేషెంట్లను ఎన్నో దీర్ఘకాలిక సమస్యల నుంచి దూరం చేసి మన్ననలు పొందుతున్నారు. హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్య సిబ్బందికి కూడా ఆయన అత్యాధునిక చికిత్సపై తరగతులు నిర్వహించి, శిక్షణ అందించి, వారి నైపుణ్యాలను మరింత మెరుగుపరుస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రముఖ పత్రికలు, టీవీ ఛానెళ్లలో వారి ఇంటర్వ్యూల ద్వారా పేషెంట్లకు హోమియోపతిపై అవగాహన కలిగిస్తున్నారు. అధునాతన హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స ద్వారా ఎలా సంపూర్ణంగా వ్యాధులు నయం చేయగలుతున్నారో వివరిస్తుంటారు. టీవీ ఛానెళ్లలో ప్రేక్షకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, వారి సందేహాలను దూరం చేస్తుంటారు. ఆరోగ్య పత్రికలు (హెల్త్ జర్నల్స్) ద్వారా కూడా వ్యాధులు, వాటి నివారణ, చికిత్సల పట్ల అవగాహన కలిగిస్తారు. అంతేకాదు... హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో నయం చేసిన ఎన్నో కష్టతరమైన, దీర్ఘకాలిక, మొండి వ్యాధుల వివరాలు, పొందిన అద్భుత ఫలితాలను కచ్చితమైన ఆధారాలతో సహా ప్రేక్షకులకు వివరిస్తారు. -
ప్రాణం.. గాలిలో దీపం!
అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్యం బహు దూరం శ్రీశైలం నుంచి ఎటు వెళ్లాలన్నా 150 కి.మీ. దూరం ప్రయాణించాల్సిందే పీహెచ్సీ స్థాయి పెంచాలంటున్నా ప్రజలు, భక్తులు శ్రీశైల క్షేత్రం చుట్టూ నల్లమల అభయారణ్యం. నిత్యం ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడే నివాసం ఏర్పరుచుకున్న ప్రజలు, ఉద్యోగులు, సమీపంలోని గిరిజన తండా వాసులు ఉన్నారు. వీరికి ఆపద సమయంలో శ్రీశైలంలోని పీహెచ్‌సీనే దిక్కు. సున్నిపెంట వైద్యశాల కేసుల రెఫర్కే పరిమితం. అత్యవసర వైద్యం అందించాలంటే కర్నూలు, మహబూబ్‌నగర్, హైదరాబాద్, ఒంగోలు, గుంటూరు వెళ్లాల్సిందే. ఎటు వెళ్లాలన్నా దాదాపు 150 కి.మీ దూరం ప్రయాణించాలి. అంత వరకు మల్లన్నపైన భారం వేయాల్సిందే. - శ్రీశైలం మొన్నటి వరకు శ్రీశైలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తాత్కాలిక శిబిరంలో నిర్వహించారు. ప్రస్తుతం దాదాపు రూ. 40 లక్షలతో పీహెచ్సీ భవనాన్ని నిర్మించారు. త్వరలో అందులోకి పీహెచ్‌సీని మార్పు చేస్తున్నారు. అయితే స్థాయి పెంచి సౌకర్యాలు మెరుగుపరిచి ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ఇద్దరు మెడికల్ ఆఫీసర్లతో పాటు ఆయుష్కు చెందిన హోమియోపతి డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఫార్మసీ రూమ్, డ్రగ్స్‌స్టోర్, ల్యాబ్‌టెక్నిషియన్ రూమ్, స్టాఫ్ సిస్టర్స్, నర్స్ రూము, కాన్పులగది, 8 బెడ్లతో కూడిన హాల్, రెఫ్రిరేజటర్ రూమ్, డ్యూటీ డాక్టర్ గదులు ఇందులో ఉన్నాయి. మెడాల్ హెల్త్ కేర్ ప్రైవేటు లిమిటెడ్ వారికి ఎన్టీఆర్ వైద్య పరీక్ష పథకం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం చేశారు. అయితే ఆపరేషన్ థియేటర్‌ను ఏర్పాటు చేసినా అందులో ఎలాం టి పరికరాలు లేవు. లేబర్ రూమ్‌లో ఇంక్యూబేటర్ పరికరం మాత్రమే ఉంది. ప్రస్తుతం ఉన్న నూతన పీహెచ్‌సీని శుభ్రంగా ఉంచేందుకుసిబ్బందిని కూడా నియమించలేదు. 24 గంటల ఆసుపత్రిగా మార్చితే: శ్రీశైలం వచ్చే భక్తులు, యాత్రికులు, ఇక్కడే నివాసముండే స్థానికులను దృష్టిలో ఉంచుకుని 24 గంటల వైద్య సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ప్రభుత్వానికి నివేదిక లు పంపించి ప్రత్యేక జీఓ ద్వారా 24 గంటల ఆసుపత్రిగా మార్చే అవకాశం ఉంది. స్థాయి పెంచితే ప్రస్తుతం ఉన్న ఇద్దరు డాక్టర్లతో పాటు మరో ఇద్దరు డాక్టర్లను నియమిస్తారు. అలాగే ఇద్దరు స్టాఫ్‌నర్సులతో పాటు ఏఎన్ఎంలు, ఫీమెల్ నర్సులను అదనంగా నియమిస్తారు. దీంతో పాటు స్కానర్లు, ఎక్స్‌రే, తదితర అన్ని ఆధునిక పరికరాలు కూడా అందుబాటులోకి వస్తాయి. జిల్లా కలెక్టర్, డీఎంఅండ్ హెచ్ఓలు శ్రీశైలం పీహెచ్సీ విషయంలో దృష్టి సారించి క్షేత్ర పరిధిలోని ప్రజలు, భక్తుల ప్రాణాల ను రక్షించాల్సిన అవసరం ఉంది. ఐఏఎస్‌ల వెనుకడుగుకు ఇదే కారణం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రిగా పైడికొండల మాణిక్యాల రావు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి శ్రీశైల దేవస్థానానికి ఐఏఎస్ స్థాయి అధికారులను నియమిస్తామని పలుమార్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇక్కడ ఆధునిక, అత్యవసర వైద్యసౌకర్యాలు అందుబాటులో లేని కారణంగానే శ్రీశైలం ఈఓగా రావడానికి ఐఏఎస్‌లు విముఖత వ్యక్తం చేస్తున్నారని సమాచారం. హఠాత్తుగా అనారోగ్యపరిస్థితులు ఏర్పడితే నాలుగైదు గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుందని, ఈలోగా ఏదైనా జరిగితే పరిస్థితి ఏమిటనే భయంతోనే వెనుకడుగు వేస్తున్నట్లు తెలిసింది. గతంలో వైద్యం అందక.. గతంలో శ్రీశైల దేవస్థానానికి చెందిన పలువురు ఉద్యోగులు, సిబ్బంది, స్థానికులకు సకాలంలో సరైన వైద్యం అందక మృతి చెందిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. రోడ్డు ప్రమాదానికి గురైన వారు అత్యవసర చికిత్స కోసం శ్రీశైలం నుంచి సుదూర పట్టణాలకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. గుండె పోటుకు గురైన వారికి స్థానికంగా ప్రాథమిక చికిత్స మాత్రమే అందుతోంది. మెరుగైన అందక ఎన్నో ప్రాణాలు గాలిలో కలుస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. -
వేడి పెరిగింది కదా... వ్యాయామం ఆపేయాలా?
లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్ ఈమధ్యే నేను వ్యాయామం చేయడం మొదలుపెట్టాను. అయితే గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి కదా. వ్యాయామం ఆపేయాలా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - నవీన్ కుమార్, పిడుగురాళ్ల వేసవిలో వ్యాయామం చేసేవారు కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. అవేమిటంటే... మన శరీర ఉష్ణోగ్రతను ఎప్పుడూ ఒకేలా ఉంచడానికి శరీరంలోని చర్మం, రక్తనాళాలు పనిచేస్తాయి. మన శారీరక శ్రమ పెరగగానే రక్తనాళాల్లోకి రక్తం ఎక్కువగా ప్రవహించి చర్మాన్ని చేరుతుంది. శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించడానికి చర్మంపైన ఉన్న స్వేదగ్రంథులు చెమటను స్రవిస్తాయి. ఆ చెమట ఆవిరి అయ్యే క్రమంలో శరీరం నుంచి ఉష్ణోగ్రతను తీసుకుంటుంది. అందుకే చర్మంపై చెమట పట్టినప్పుడు ఫ్యాన్ నుంచి గానీ, చెట్ల నుంచి గానీ గాలి సోకితే ఒంటికి హాయిగా అనిపిస్తుంది. అలా శరీరంలో పెరిగిన ఉష్ణోగ్రతను తగ్గించడానికి చెమట తోడ్పడుతుంది. అయితే శారీరక శ్రమ అలాగే కొనసాగి ఈ చెమట పట్టే ప్రక్రియ అదేపనిగా జరుగుతుంటే... మన మేను నీటినీ, దానితో పాటు ఖనిజలవణాలను కోల్పోతుంది. మరీ ఎక్కువ వేడిమికి ఎక్స్పోజ్ అయినప్పుడు, మనం తగినన్ని నీళ్లు, ద్రవాహారం తీసుకోనప్పుడు మనకు చెమట అతిగా పట్టి శరీర ఉష్ణోగ్రతను ఒకేలా నిర్వహించే వ్యవస్థ దెబ్బతినవచ్చు. అప్పుడు కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు... వాతావరణంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు చాలాసేపు కూర్చొని ఉండి, అకస్మాత్తుగా నిలబడినా లేదా అదేపనిగా నిలబడి వ్యాయామం చేసినా అకస్మాత్తుగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. దీన్నే ‘హీట్ సింకోప్ అండ్ ఎక్సర్సైజ్ అసోసియేటెడ్ కొలాప్స్’ అని అంటారు. వాతావరణంలో వేడి పెరుగుతున్న సమయంలో మీరు వ్యాయామం మానేయాల్సిన అవసరం లేదు. కానీ పైన పేర్కొన్న అనర్థాలు నివారించడానికి ఈ కింది జాగ్రత్తలు పాటించండి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో పగటివేళ ఎండకు ఎక్స్పోజ్ కావద్దు. మీరు మీ వ్యాయామాలను వాతావరణం చల్లగా ఉండే వేకువజామున చేయండి చెమటను పీల్చే కాటన్ దుస్తులను ధరించండి బాగా నీళ్లు తాగండి. ఒంట్లో ఖనిజ లవణాలు (ఎలక్రొలైట్స్) భర్తీ అయ్యేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోండి మీరు వ్యాయామం చేసే ముందర ఒకసారి వాతావరణం ఎలా ఉందో పరిశీలించండి. మరీ వేడిగా ఉంటే వ్యాయామాన్ని చల్లటి వేళకు వాయిదా వేసుకోండి. ఒకవేళ మీరు వ్యాయామం చేస్తున్న సమయంలో తలనొప్పి, కళ్లుతిరిగినట్లు, వాంతి వచ్చినట్లు అనిపిస్తే వెంటనే వ్యాయామం ఆపేసి, డాక్టర్‌ను సంప్రదించండి. -డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్ కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ హోమియో కౌన్సెలింగ్ నా వయసు 33 ఏళ్లు. నేను ఈమధ్య టీఎస్‌హెచ్ పరీక్ష చేయించుకున్నాను. థైరాయిడ్ ఉందని అన్నారు. గత ఆర్నెల్లుగా నా జుట్టు విపరీతంగా రాలిపోతోంది. ఇది హార్మోన్ లోపం వల్ల వచ్చిందని డాక్టర్లు అంటున్నారు. హోమియోపతిలో చికిత్స అందుబాటులో ఉందా? - అనిత, ఖమ్మం మన తలలో దాదాపు లక్షా ఇరవై వేల నుంచి లక్షా యాభై వేల వెంట్రుకలు ఉంటాయి. ఒక వెంట్రుక ఒక నెలలో దాదాపు ఒక సెంటీమీటరు పెరుగుతుంది. రోజూ 40 నుంచి 50 వెంట్రుకలు రాలుతూనే ఉంటాయి. జుట్టు రాలడం సమస్యకు చాలా కారణాలు ఉన్నాయి. దానిలో హార్మోన్ లోపాలు, థైరాయిడ్ సమస్య, రక్తహీనత, పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం, ఆందోళన, నిద్రలేమి వంటివి దీనికి కొన్ని కారణాలు. కొన్ని రకాల మందులు వాడటం, హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం జట్టు రాలడానికి కారణమయ్యే ఇంకొన్ని అంశాలు. జుట్టు రాలడానికి ఇంకా సూర్యకాంతికి ఎక్స్పోజ్ కావడం, మోతాదుకు మించి క్లోరిన్ ఉండే ఈత కొలనుల్లో ఈతకొట్టడం వంటివీ కారణమవుతాయి. జుట్టుకు రంగు వేసుకునే విషయంలోనూ సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరికి ఈ హెయిర్ డైలు సరిపడవు. వాటి నుంచి అలర్జీ వస్తుంది. అందుకే వాటి ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. డాండ్రఫ్ (చుండ్రు), ఎగ్జిమా, అలొపేషియా సమస్యలూ కారణమవుతాయి. జుట్టు సమస్యలు తీరాలంటే ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ఒంటిని సరైన గాడిలో పెట్టాలి. శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక వికాసం కూడా పెంపొందించుకోవాలి. జుట్టు రాలడాన్ని అరికట్టడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ఇందులో కేవలం జుట్టు రాలడం అనే అంశాన్నే కాకుండా దీనికి కారణాలైన థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ సమతౌల్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. ఆర్నికా, జబొరాండి, వింకమైనర్తో తయారు చేసిన నూనెలు, మంచి షాంపూలు హోమియోలో అందుబాటులో ఉన్నాయి. హోమియో ఔషధాలైన యాసిడ్ ఫ్లోర్, నేట్రమ్మూర్, ఫాస్ఫరస్, వింకామైనర్, ఆలోస్ లాంటి మందులు వాడితే సమస్య తగ్గుతుంది. అయితే ఆ మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. -డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ పల్మనాలజీ కౌన్సెలింగ్ మా నాన్నను వెంటిలేటర్ మీద పెట్టారు. వెంటిలేటర్ మీద పెట్టినవాళ్లు ఇక బతకరనీ బంధువులు అంటున్నారు. మాకు చాలా ఆందోళనగా ఉంది. తగిన సలహా ఇవ్వండి. - వీరభద్రరావు, చిట్యాల వెంటిలేటర్ మీద పెట్టిన పేషెంట్ ఇక బతకరనేది చాలామందిలో ఉండే అపోహ. అయితే జబ్బు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, చాలా సందర్భాల్లో రోగి పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉన్నప్పుడు చివరి ప్రయత్నంగా వెంటిలేటర్ మీద పెడతారు. దాంతో సాధారణ ప్రజల్లో ఈ దురభిప్రాయం ఏర్పడింది. కానీ ఇప్పుడున్న వైద్య పరిజ్ఞానం వల్ల అనేక వ్యాధులకు చాలా ఆధునిక చికిత్సలు అందుతున్నందున వెంటిలేటర్ మీద పెట్టినవాళ్లూ బతికేందుకూ, మళ్లీ నార్మల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. వెంటిలేటర్ అనేది కృత్రికంగా శ్వాస అందించే యంత్రం. దీన్ని పెట్టడానికి ముందుగా శ్వాసనాళంలోకి ఒక గొట్టం వేసి, దాన్ని కృత్రిమ శ్వాస అందించే వెంటిలేటర్‌తో అనుసంధానం చేస్తారు. రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉండటం, కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుతున్నా, రోగికి ఆయాసం పెరుగుతున్నా, ఊపిరితీసుకోవడానికి అవసరమైన కండరాలు పనిచేయకపోయినా వెంటిలేటర్ అమర్చుతారు. సాధారణంగా నిమోనియా, సీవోపీడీ వంటి వ్యాధులకూ, రక్తానికి ఇన్ఫెక్షన్ పాకే సెప్సిస్ వంటి కండిషన్లలో వెంటిలేటర్ పెడుతుంటారు. ఒకసారి వెంటిలేటర్ పెట్టిన తర్వాత... పరిస్థితి మెరగయ్యే వరకూ వెంటిలేటర్ తీయడం కష్టం కావచ్చు. సాధారణంగా ఐదు కంటే ఎక్కువ రోజులు వెంటిలేటర్ పెట్టడం అవసరమైతే ట్రకియాస్టమీ చేస్తారు. దీనివల్ల స్వరపేటికకు నష్టం వాటిల్లదు. వెంటిలేటర్‌ను త్వరగా తొలగించే అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల అవసరమనుకుంటే ఎలాంటి ప్రమాదమూ లేకుండా వెంటిలేటర్ మళ్లీ పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది. ఇటీవల మన వద్ద కూడా పాశ్చాత్య దేశాల్లో ఉన్నంత వైద్యపరిజ్ఞానం, ఉపకరణాలు అందుబాటులోకి ఉన్నాయి. అయితే వైద్యపరమైన అంశాలలో మన దగ్గర తగినంత అవగాహన లేకపోవడం వల్ల అపోహలు రాజ్యమేలుతున్నాయి. మీరు ఏదైనా సందేహం కలిగినప్పుడు నేరుగా మీకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను సంప్రదించండి. అంతేగానీ ఎలాంటి అపోహలను నమ్మకండి. -డాక్టర్ ఎస్.ఎ. రఫీ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ హైదరాబాద్ -
నెలసరి నొప్పికి గృహవైద్యం ఉంది...
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 40 సంవత్సరాలు. ఈ మధ్య ఆయాసం వస్తుంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాను. ఆస్తమా అన్నారు. ఆస్తమా అంటే ఏమిటి? దీనికి హోమియోపతిలో ఎటువంటి చికిత్సా విధానం ఉంది తెలుపగలరు? - దేవరాయలు, అనంతపురం 1. ఆస్తమా అంటే ఏమిటి? దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందిని ఆస్తమా అంటారు ఊపిరితిత్తులలో గాలి మార్గానికి అడ్డంకులు ఏర్పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది శ్వాసకోశ మార్గంలో వాపు, శ్వాసకోశ మార్గం కుంచించుకుపోవడం వల్ల ఆస్తమా వస్తుంది. 2. ఆస్తమాకు కారణాలు ఏంటి? చల్లటి వాతావరణం దుమ్ము, ధూళి, పొగ ఫంగస్, వాతావరణ కాలుష్యం వైరల్ ఇన్ఫెక్షన్స్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ పెంపుడు జంతువులు రసాయనాలు, ఘాటు వాసనలు 3. ఆస్తమా ఎలా వస్తుంది? ఆస్తమా వ్యాధి అలర్జీకి సంబంధించినది. కొంతమందిలో ఇది వంశపారంపర్యంగా కూడా సంక్రమించవచ్చు. దీనినే ఎటోపీ అంటారు కొంత మందిలో వ్యాధి నిరోధక శక్తి కలిగించే యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి. శరీరానికి సరిపడని యాంటీజెన్లు శరీరంలోకి ప్రవేశించినపుడు ఈ యాంటీబాడీ వెలువడి శరీరాన్ని రక్షించే ప్రయత్నం చేస్తాయి. ఈ క్రమంలో కణాల నుండి వెలువడే రసాయనాల వల్ల శ్వాసనాళాల్లో శ్లేష్మం జమ అవుతుంది. తద్వారా శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. 4. ఆస్తమాలో కనిపించే లక్షణాలు ఏమిటి? ఎడతెరిపి లేని దగ్గు పిల్లి కూతలు ఆయాసం జ్వరం జలుబు శ్వాస తీసుకోలేకపోవడం మానసిక ఆందోళన 5. ఆస్తమా నిర్ధారణ పరీక్షలు వంశానుగత చరిత్ర అలర్జీకి సంబంధించిన పరీక్షలు ముక్కు, గొంతు, ఛాతీ పరీక్షలు కఫం పరీక్ష చర్మానికి సంబంధించిన అలర్జీ పరీక్షలు స్పైరోమెట్రీ ఛాతీ ఎక్స్‌రే 6. ఆస్తమాకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? ప్రతిరోజూ వ్యాయామం చేయడం పోషకాహారం తీసుకోవడం ఎక్కువ శారీరక శ్రమ లేకుండా చూసుకోవడం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం దుమ్ము, ధూళి, పొగ, కాలుష్యానికి దూరంగా ఉండటంచల్లని వాతావరణానికి తిరగకుండా ఉండటం పడని పదార్థాలకు దూరంగా ఉండటం డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ ఆయుర్వేద కౌన్సెలింగ్ నా వయసు 35. ఇద్దరు పిల్లలు. ఇటీవల పొట్టలో నొప్పిగానూ, కొంచెం గట్టిగానూ ఉంటే, స్త్రీవైద్య నిపుణులను సంప్రదించాను. పరీక్షలన్నీ చేసి గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని, హిస్టెరెక్టమీ ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇవి తగ్గడానికి, ఆపరేషన్ లేకుండా, ఆయుర్వేదంలో మందులుంటే సూచించండి. - కె. శ్యామల, వనస్థలిపురం మీరు ప్రస్తావించిన ‘ఫైబ్రాయిడ్స్’ను ఆయుర్వేద పరిభాషలో ‘గ్రంథి లేక అర్బుదము’ అంటారు. ఇలాంటివి గర్భాశయంలో కూడా సంభవించవచ్చు. వాటి పరిమాణాన్ని బట్టి, లక్షణాలు మారుతుంటాయి. కంతి సైజు పెద్దదిగా లేకపోతే, ఇతర సమస్యలు లేకపోతే ఆపరేషన్ అక్కర్లేకుండా దీన్ని తగ్గించడానికి చక్కటి ఆయుర్వేద మందులు ఉన్నాయి. వాటిని మీ ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో ఒక ఆరునెలల పాటు వాడితే ఈ వ్యాధి గణనీయంగా తగ్గిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ మందుల వివరాలు... 1. కైశోర గుగ్గులు (మాత్రలు): ఉ॥2, రాత్రి 2 2. కాంచనార గుగ్గులు (మాత్రలు): ఉ॥2, రాత్రి 2 3. శతావరీ లేహ్యం: ఉ॥1 చెంచా, రాత్రి 1 చెంచా 4. అశోకారిష్ట (ద్రావకం): నాలుగు చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి (ఒక మోతాదు) రెండు పూటలా తాగాలి. అధిక రక్తస్రావం తగ్గడానికి... ‘బోలబద్ధరస’ మాత్రలు రెండేసి చొప్పున, రోజుకి మూడు సార్ల వరకు వాడవచ్చు. ఇవి ఒక వారం రోజుల వరకు వాడవచ్చు. మా అమ్మాయి వయసు 15 ఏళ్లు. నాలుగేళ్ల క్రితమే రజస్వల అయ్యింది. నెలసరి సమయంలో విపరీతమైన కడుపునొప్పి వస్తోంది. ఆయుర్వేదంలో పరిష్కారం తెలపండి. - ఎస్. మేరీ, హనమకొండ ఇది చాలామందిలో కనిపించే సాధారణ సమస్య. ఈ వికారాన్ని ఆయుర్వేదంలో ‘కష్టార్తవ లేక ఉదావర్తం’గా వివరించారు. వివాహం తర్వాత, కాన్పు తర్వాత చాలావరకు ఈ సమస్య దానంతట అదే తగ్గిపోవచ్చు. కానీ చాలామంది కన్యలు ఈ లక్షణంతో విలవిలలాడుతుంటారు. ఈ కింద సూచించిన మందులు, రుతుస్రావం అయ్యే తేదీకి రెండు రోజుల ముందు నుంచి మొదలుపెట్టి రక్తస్రావం తగ్గేవరకు వాడండి. తప్పక ఉపశమనం కలుగుతుంది. 1. హింగు త్రిగుణతైలం: దీన్ని ఒక చెంచా గోరువెచ్చని నీటితో కలిపి ఉదయం పరగడుపున ఒకసారి, రాత్రి పడుకునే ముందు ఒకసారి తాగాలి; 2. అశోకారిష్ట (ద్రావకం): 3 చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి, రోజూ మూడు పూటలా తాగాలి. గృహవైద్యం: నాలుగు వెల్లుల్లి రేకల్ని దంచి, దానికి మూడు చిటికెలు ఇంగువ కల్పి, రెండు చెంచాల స్వచ్ఛమైన నువ్వులనూనెలో మరిగించి, వడగట్టాలి. ఇది ఒక మోతాదుగా - 3 చెంచాల పాలు కలిపి, ఉదయం, రాత్రి రెండుపూటలా తాగాలి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్ హుమాయూన్‌నగర్ హైదరాబాద్ బ్లడ్‌ప్రషర్ కౌన్సెలింగ్ ఒకసారి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన నాకు మామూలు బీపీ చూడడంతో పాటు ‘సెంట్రల్ బ్లడ్ ప్రెషర్’ కూడా చూశారు. ఈమాట వినడమే కొత్త! సెంట్రల్ బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి? దీనికీ, మామూలుగా కొలిచే బ్లడ్ ప్రెషర్‌కూ తేడా ఏమిటి? - సుహాసిని, చెన్నై సాధారణంగా మనం బ్లడ్ ప్రెషర్‌ను బీపీ ఆపరేటస్‌తో కొలుస్తుంటాం. ఇందులో ఒక పట్టాలాంటి దాన్ని చేతికి కట్టులా కట్టి, దాన్ని గాలితో నింపి, బిగిసేలా చేసి, రక్తనాళాల్లో ప్రవహించే రక్తపు వేగాన్ని కొలుస్తాం. దీన్నే బీపీ అంటారు. కాని రక్తపోటును గుండె దగ్గరే కొలిస్తే ఆ విలువ సరైనది అని వైద్య నిపుణులు అభిప్రాయం. నేరుగా గుండె స్పందించినప్పుడు అక్కడి రక్తనాళాల్లో రక్తపీడనాన్ని కొలవడాన్ని ‘సెంట్రల్ బ్లడ్ ప్రెషర్’ అంటారు. ఇటీవల ఈ విధమైన సెంట్రల్ బ్లడ్‌ప్రెషర్‌ను కొలవడానికి ఒక పెన్ వంటి సాధనాన్ని రూపొందించారు. దీని కొనను మణికట్టు (రిస్ట్) వద్ద ఉండే నాడి దగ్గర మృదువుగా ఆనించి, ఆ వచ్చిన కొలతలను కంప్యూటర్‌కు అనుసంధానిస్తారు. ఆ ‘పల్స్ వేవ్’ విలువలను కంప్యూటర్ గణించి, నేరుగా గుండెదగ్గరి రక ్తనాళాల్లో రక్తపోటు ఎంత ఉందో లెక్కలు వేస్తుంది. దీని ఆధారంగా మనం గుండెదగ్గరి రక్తపోటును తెలుసుకుంటామన్నమాట. ఇలా నేరుగా గుండెదగ్గర అది స్పందించినప్పుడు రక్తం తొలుత గురైన పీడనాన్నీ అంటే సెంట్రల్ బ్లడ్ ప్రెషర్‌నూ, సాధారణంగా చేతి దగ్గర పట్టా చుట్టి, అందులో గాలి నింపి తీసుకునే సాధారణ బ్లడ్ ప్రషర్‌నూ తెలుసుకుంటూ ఇంకా ఈ విలువలను సరిపోల్చి చూస్తున్నారు. మామూలుగా చేతి దగ్గర తీసే బ్లడ్‌ప్రెషర్‌ను కొన్ని కోట్లమందిలో అనేకసార్లు గణించి సాధారణ రక్తపోటు ప్రమాణాన్ని ‘120/80’గా నిర్ణయించాం. కానీ సెంట్రల్ బ్లడ్‌ప్రెషర్‌తో తీసే విలువలకు ఇంకా నిర్ణీత ప్రమాణాలను రూపొందించలేదు. ఎందుకంటే మన రక్తపోటు క్షణక్షణానికీ మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఒక స్థిరమైన నార్మల్ విలువ వచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇంకా దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. త్వరలోనే సెంట్రల్ బ్లడ్ ప్రెషర్‌కూ ‘ప్రమాణాలను’ రూపొందిస్తే అప్పుడు మామూలు బ్లడ్‌ప్రెషర్ స్థానాన్ని ఆధునికంగా తీసే సెంట్రల్ బ్లడ్ ప్రెషర్ విలువలు ఆక్రమించడం జరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ల అంచనా. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్ కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ -
కడుపునొప్పి... అది 24 గంటల నొప్పేనా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 55 ఏళ్లు. నిల్చునే సమయంలో, నడిచే సమయంలో తల తిరిగినట్లు అయి పడిపోతానేమో అని ఆందోళనగా ఉంటోంది. దీనికి కారణాలు ఏమై ఉంటాయి. హోమియోపతిలో చికిత్స ఉందా? - లక్ష్మి, ఖమ్మం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు బహుశా ‘వర్టిగో’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది చాలా మందిలో సాధారణంగా కనిపించే సమస్య. నిద్రలేచినప్పుడు గానీ, నడుస్తున్నప్పుడు గానీ ఉన్నట్టుండి తలతిరగడం, తద్వారా పడిపోవడం, వాంతులు కావడం వంటి లక్షణాలుంటే ఆ సమస్యను ‘వర్టిగో’ అంటారు.దాదాపు 20 శాతం నుంచి 30 శాతం వరకు ఈ సమస్య ఉంటుంది. ఇది ఏ వయసు వారిలోనైనా కనిపించవచ్చు. దీన్ని మూడు రకాలుగా విభజించవచ్చు. అవి... పెరిఫెరల్, సెంట్రల్, ఇతర కారణాలతో వచ్చే వర్టిగో. పెరిఫెరల్ వర్టిగో: ఈ సమస్య ఉన్నవారిలో తల తిరగడానికి కారణం మూలాలు చెవి లోపలి భాగంలో ఉంటాయి. చెవిలో వెస్టిబ్యులార్ సిస్టమ్ అనే భాగం ఉంటుంది. ఇది శరీరాన్ని అదుపు తప్పకుండా కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. పెరిఫెరల్ వర్టిగో సమస్య వచ్చినప్పుడు తల తిరగడం సమస్య మొదలవుతుంది. శరీరం అదుపు తప్పడం, ముందుకు తూలడం జరగవచ్చు. బైక్ నడుపుతున్నప్పుడు ఈ సమస్య మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. సెంట్రల్ వర్టిగో: కొన్నిసార్లు తలతిరగడానికి మెదడులోని సమస్యలు, నాడీమండల సమస్యలు కారణం కావచ్చు. ఈ కారణాల వల్ల తలతిరుగుతుంటే దాన్ని సెంట్రల్ వర్టిగో అంటారు. ఇతర కారణాలతో వచ్చే వర్టిగో: రక్తహీనత, రక్తపోటు ఎక్కువగా లేదా తక్కువగా ఉండటం, జ్వరం, తీవ్రమైన వ్యాధుల బారిన పడిన తర్వాత ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. కారణాలు: మెదడులో కణితులు, మెదడులో రక్తం గడ్డకట్టడం సర్వైకల్ స్పాండిలోసిస్, పార్కిన్సోనిజమ్, నరాల బలహీనతల వంటివి దీనికి కారణమవుతాయి చేతులు లాగడం, తిమ్మిర్లు కూడా దీనికి దోహదం చేస్తాయి. లక్షణాలు: వికారం, తలనొప్పి, చెమటలు పట్టడం, వినికిడి సమస్యలు, నిద్రలేవగానే లేదా నడుస్తున్నప్పుడు, ముందుకు వంగి పనిచేస్తున్నప్పుడు ఉన్నట్టుండి కళ్లు తిరగడం, వాంతులు కావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. నిర్ధారణ: సీటీస్కాన్, ఎమ్మారై స్కాన్, ఎక్స్‌రే, ఆడియోమెట్రీ, హిమోగ్లోబిన్, కొలెస్ట్రాల్ వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేస్తారు. చికిత్స: హోమియోలో బెల్లడోనా, జెల్సీమియమ్, చైనా, కాకుసల్ ఇండికస్, కోనియమ్, బ్రయోనియా, పల్సటిల్సా, ఆర్సెనికా వంటి మందులు సమర్థంగా పనిచేస్తాయి. - డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. ఐదేళ్ల క్రితం రుతుక్రమం ఆగిపోయింది. అయితే రుతుక్రమం తగ్గిన వాళ్లంతా జీవితాంతం క్యాల్షియమ్ ఎక్కువగా తీసుకోవాలని చదివాను. ఆ తర్వాత నుంచి క్రమం తప్పకుండా క్యాల్షియమ్ మాత్రలు వాడుతున్నాను. వారం కిందట తీవ్రమైన వెన్నునొప్పితో డాక్టర్‌ను కలిశాను. ఆయన ఎక్స్‌రే తీయించి ఆస్టిపోరోసిస్ అన్నారు. నేను క్యాల్షియమ్ వాడుతున్నా ఇలా ఎందుకు జరిగింది. - పద్మ, కోదాడ క్యాల్షియమ్ తగ్గడం వల్ల ఎముకలు పెళుసుబారి ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఎముకలు గుల్లబారడం ఆస్టియోపోరోసిస్‌లో ప్రధానంగా జరిగే ప్రక్రియ. మనందరిలోనూ వయసు పెరుగుతున్న కొద్దీ ఎంతోకొంత ఆస్టియోపోరోసిస్ కనిపిస్తుంటుంది. అయితే మీరు చెప్పినట్లుగానే మహిళల్లో రుతుక్రమం ఆగిపోయాక ఆస్టియోపోరోసిస్ కనిపించడం చాలా సాధారణంగా కనిపించేదే. దీనికి కేవలం క్యాల్షియమ్ టాబ్లెట్లు తీసుకోవడం మాత్రమే సరిపోదు. దానితో పాటు ఎముకల్లోకి క్యాల్షియమ్ ఇంకిపోయేలా క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలి. వ్యాయామం చేయకుండా కేవలం క్యాల్షియమ్ తీసుకుంటూ ఉంటే అది మూత్రం ద్వారా బయటకు పోతూ ఉంటుంది. లేదా కొందరిలో అది మూత్రపిండాల్లో పోగుపడి కిడ్నీ స్టోన్‌గా కూడా పరిణమించవచ్చు. అందుకే మీరు క్యాల్షియమ్ తీసుకుంటూ ఉండటంతో పాటు వాకింగ్, జాగింగ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలలో మీకు అనువైన దాన్ని ఎంచుకొని, క్రమం తప్పకుండా చేస్తూ ఉండటం. ఇక మంచి పోషకాహారాన్ని అంటే... పాలు, పాల ఉత్పాదనలు, ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు వంటివి వాటిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే మీరు క్యాల్షియమ్ టాబ్లెట్స్ కూడా వాడాల్సిన పనిలేదు. ఇక ముందుగా మీకు స్పష్టం చేయాల్సిన విషయం ఏమిటంటే.. ఆస్టియోపోరోసిస్‌ను ఎక్స్‌రే ద్వారా నిర్ధారణ చేయడం జరగదు. డాక్టర్లు ఆస్టియోపోరోసిస్‌ను అనుమానించినప్పుడు డెక్సా స్కాన్ (బోన్ డెన్సిటోమెట్రీ) చేయిస్తారు. ఇందులో ఎముక సాంద్రతను తెలుసుకోవచ్చు. మీరు మరోసారి మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి. - డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్. గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ మా బాబు వయసు తొమ్మిదేళ్లు. ఇటీవల మా అబ్బాయికి తరచూ కడుపునొప్పి వస్తోంది. రెండు మూడు గంటలు విశ్రాంతి తీసుకుంటే దానంతట అదే తగ్గిపోతుంటుంది. సాధారణ నొప్పే కదా తగ్గిపోతుందిలే అని అంతగా పట్టించుకోలేదు. నొప్పి మళ్లీ మళ్లీ వస్తోంది. మా ఊళ్లో డాక్టర్‌కు చూపిస్తే ’కొన్ని మందులు వాడితే తగ్గిపోతుంద’ని రాసిచ్చారు. మాకు తెలిసిన వారు అది ఒక్కోసారి ప్రాణాంతకమైన 24 గంటల నొప్పికి దారితీయవచ్చేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు 24 గంటల నొప్పి అంటే ఏమిటి? మా అబ్బాయికి కడుపునొప్పి ఎందుకు వస్తోంది? దయచేసి వివరాలు చెప్పండి. - ఝాన్సీ, శృంగవరపుకోట కడుపునొప్పిని చాలా కారణాలు ఉంటాయి. ప్రతి కడుపునొప్పీ అపెండిసైటిస్ (24 గంటల నొప్పి) కాదు. మీరు ముందుగా వైద్య నిపుణులను సంప్రదించి, మీ అబ్బాయికి అసలు కడుపునొప్పి ఎందుకు వస్తోందో ముందుగా నిర్ధారణ చేయాలి. దాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. ఇక మీరు పేర్కొన్న 24 గంటల నొప్పి (అపెండిసైటిస్)లో అకస్మాత్తుగా బొడ్డు చుట్టూ నొప్పి వస్తూ అది పొట్ట కింది భాగానికి వ్యాపిస్తూ ఉంటుంది. దాంతో పాటు వాంతులు కావడం, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అపెండిసైటిస్ ఉంటే వెంటనే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఆలస్యం చేయడం మంచిది కాదు. కడుపులో చిన్నపేగు, పెద్దపేగు కలిసే చోట చిన్న ట్యూబ్ ఆకారంలో అపెండిసైటిస్ ఉంటుంది. అందులోకి ఏవైనా మలిన పదార్థాలు, రాళ్లు, పురుగులు చేరితే అకస్మాత్తుగా ఈ నొప్పి వస్తుంది. అపెండిసైటిస్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కెటారల్ అపెండిసైటిస్, రెండోది అబ్స్ట్రక్టివ్ అపెండిసైటిస్. కెటారల్ అపెండిసైటిస్‌ను మందులతో నయం చేయవచ్చు. అబ్స్ట్రక్టివ్ అపెండిసైటిస్‌కు మాత్రం శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక శస్త్రచికిత్సలలో కీ-హోల్ ప్రక్రియ ద్వారా తక్కువ కోతతో శస్త్రచికిత్స చేయవచ్చు. వైద్య పరీక్షల ద్వారా అది ఏ రకం అనేది నిర్ధారణ చేశాకే అపెండిసైటిస్ శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అపెండిసైటిస్ ఉండి, చికిత్స ఆలస్యం అయితే అది పగిలి పొట్టలోకి ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే అలా బొడ్డుచుట్టూ నొప్పి వస్తూ కిందికి పాకుతుంటే అత్యవసరంగా డాక్టర్‌ను సంప్రదించాలని చెబుతుంటారు. - డాక్టర్ టి.ఎల్.వి.డి. ప్రసాద్‌బాబు సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ . మా చిరునామా: వైద్యసలహా కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్- 34. ఈ మెయిల్: asksakshidoctor@gmail.com నిర్వహణ: యాసీన్ -
ఒత్తిడి తొలగించుకుంటే చాలు
హోమియో కౌన్సెలింగ్ మైగ్రేన్ నివారణ, చికిత్స... నాకు విపరీతమైన తలనొప్పి వస్తోంది. వారంలో ఒకటి, రెండు సార్లు తీవ్రంగా వస్తోంది. ఎన్నో రక్తపరీక్షలు, ఎక్స్-రే, స్కానింగ్ పరీక్షలు చేయించాను. డాక్టర్లు దీన్ని మైగ్రేన్‌గా నిర్ధారణ చేశారు. జీవితాంతం వస్తుంటుందని చెప్పారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా? - రమణ, నూజివీడు తరచూ తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. నేటి ఆధునికయుగంలో శారీరక, మానసిక ఒత్తిడి, అనిశ్చితి, ఆందోళనలు తలనొప్పికి ముఖ్యమైన కారణాలు. ఇంకా రక్తపోటు, మెదడు కణుతులు, మెదడు రక్తనాళాల్లో రక్తప్రసరణల్లో మార్పులు, సైనసైటిస్ మొదలైన వాటివల్ల తలనొప్పి వచ్చేందుకు ఆస్కారం ఉంది. తలనొపి ఏ రకానికి చెందినదో నిర్ధారణ తర్వాత ఖచ్చితమైన చికిత్స చేయడం సులువవుతుంది. మైగ్రేన్ తలనొప్పిని పార్శ్వపు తలనొప్పి అంటారు. మానసిక ఆందోళన, ఒత్తిడి, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్, నిద్రలేమి, అధికప్రయాణాలు, సూర్యరశ్మి, స్త్రీలలో హార్మోన్ సమస్యల వల్ల ఈ పార్శ్వపు తలనొప్పి వస్తుంటుంది. పురుషులతో పోలిస్తే ఇది స్త్రీలలోనే ఎక్కువ. మైగ్రేన్‌లో దశలూ, లక్షణాలు: సాధారణంగా మైగ్రేన్ వచ్చినప్పుడు 24 గంటల నుంచి 72 గంటలలోపు అదే తగ్గిపోతుంది. ఒకవేళ 72 గంటలకు పైనే ఉంటే దాన్ని స్టేటస్ మైగ్రేన్ అంటారు. దీంతోపాటు వాంతులు కావడం, వెలుతురునూ, శబ్దాలను అస్సలు భరించలేకపోవడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. వ్యాధి నిర్ధారణ: రక్తపరీక్షలు, రక్తపోటును పరీక్షించడం, సీటీస్కాన్, ఎంఆర్ఐ పరీక్షల ద్వారా మైగ్రేన్‌ను నిర్ధారణ చేయవచ్చు. నివారణ: మైగ్రేన్ రావడానికి చాలా అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు మనం తినే ఆహారంలో మార్పులు, మనం ఆలోచించే విధానం, మానసిక ఒత్తిడి, వాతావారణ మార్పులు, నిద్రలేమి, మహిళల్లో రుతుసమస్యలు వంటి కారణాలతో వచ్చినప్పుడు జీవనశైలిలో మార్పులతో దీన్ని కొంతవరకు నివారించవచ్చు. ఇక మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయాలి. చికిత్స: మైగ్రేన్‌ను పూర్తిగా తగ్గించడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. శారీరక, మానసిక, కుటుంబ, అనువంశీక, వాతావరణ, వృత్తిసంబంధమైన కారణాలను అంచనా వేసి, వాటిని అనుగుణంగా మందును ఎంపిక చేయాల్సి ఉంటుంది. వారి జెనెటిక్ కన్‌స్టిట్యూటషన్ సిమిలియమ్ వంటి అంశాలన పరిగణనలోకి తీసుకోవాలి. బెల్లడోనా, ఐరిస్, శ్యాంగ్యునేరియా, ఇగ్నీషియా, సెపియా వంటి కొన్ని మందులు మైగ్రేన్‌కు అద్భుతంగా పనిచేస్తాయి. జనరల్ హెల్త్ కౌన్సెలింగ్ ఒత్తిడి తొలగించుకుంటే చాలు నా వయసు 38 ఏళ్లు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాను. తీవ్రమైన ఒత్తిడిలో ఉంటాను. ఎక్కువగా ఆందోళనకూ, ఉద్వేగాలకు గురవుతుంటాను. ఆలోచనలు చాలా ఎక్కువ. నిద్ర సరిగా పట్టదు. నా సమస్యలకు తగిన చికిత్సను సూచించండి. - పి. విక్రమ్, సికింద్రాబాద్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు యాంగ్జైటీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లుగా అనిపిస్తోంది. మీరు చెప్పిన లక్షణాలైన తీవ్రమైన ఆందోళనలు, ఎడతెరిపి లేని ఆలోచనలు దీన్నే సూచిస్తున్నాయి. సాధారణంగా తీవ్రమైన ఒత్తిళ్లలో పనిచేసేవారిలో ఇది చాలా ఎక్కువ. మీరు ముందుగా ఒకసారి రక్తపరీక్షలు చేయించుకొని, రక్తంలో చక్కెరపాళ్లను పరీక్షించుకోండి. ఎందుకంటే మీ తరహా పనితీరు (సెడెంటరీ లైఫ్‌స్టైల్) ఉన్నవారిలో ఒత్తిడి వల్ల రక్తంలో చక్కెరల విడుదల ఎక్కువగా ఉంటుంది. దాంతో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలా మీకు తెలియకుండానే డయాబెటిస్ ఉంటే అది నరాలపై ప్రభావం చూపి, పెరిఫెరల్ నర్వ్స్, అటనామస్ నర్వ్స్ (స్వతంత్రనాడీ వ్యవస్థ)పై ప్రభావం చూపి ఇలా గాభరా, హైరానా పడేలా చేయడం చాలా సాధారణం. మీకు చికిత్స కంటే కూడా జీవనశైలిలో మార్పులు అవసరం. సమస్యపై అవగాహనతో, పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్లాలి. మీరు ఉదయమే నిద్రలేచి బ్రిస్క్ వాకింగ్ వంటి వ్యాయామాలు, యోగా, మెడిషటేషన్ చేయడం, వేళకు భోజనం తీసుకోవడం, వేళకు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకునేందుకు ఆహ్లాదకరమైన వ్యాపకాలను అలవరచుకోవడం వంటి జీవనశైలి మార్పులు చేసుకోండి. దాంతో మీ సమస్య చాలావరకు తగ్గుతుంది. పైన పేర్కొన్న పరీక్షలు చేయించాక ఫిజీషియన్‌ను కలవండి. ఒకవేళ మీకు తెలియకుండా షుగర్ వచ్చి ఉంటే డాక్టర్... ఆ సమస్యకు కూడా కలిపి చికిత్స సూచిస్తారు. ఒకవేళ మీకు షుగర్ లేకపోతే... మీ జీవనశైలి వల్ల త్వరగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నందున... ఆ సమస్యను నివారించచడం కోసం జీవనశైలి మార్పులను తప్పక అనుసరిస్తూ, యాంగ్జటీని తగ్గించే మందులైన యాంగ్జియోలైటిక్స్ను డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. నాకు 65 ఏళ్లు. షుగర్, బీపీ ఏమీ లేవు. అయితే పాతికేళ్లుగా సైనస్ సమస్యతో బాధపడుతున్నాను. ఉదయం లేవగానే చాలాసేపు తుమ్ములు వచ్చి, ముక్కు, కళ్ల నుంచి ధారగా నీరు కారుతుంది. నా సమస్య తగ్గే మార్గాన్ని సూచించండి. - ఎమ్. రాజేశ్వరరావు, వరంగల్ సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు ఉదయం వేళల్లో చలిగాలి సోకినప్పుడు, ఆ గాలి వల్ల సైనస్ రంధ్రాలు మూసుకుపోయి ఒకవిధమైన తలనొప్పి (మైల్డ్ హెడేక్)తో బాధపడతారు. మీలో వ్యాధినిరోధకశక్తి పెరగడానికి విటమిన్-సి టాబ్లెట్స్ వాడటం, యాంటీ అలర్జిక్ మందులు వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీకు సరిపడని వాతావరణానికి వీలైనంత దూరంలో ఉండండి. మీకు బాగా ఇబ్బందిగా ఉంటే ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ వాడటంతో పాటు ఆవిరిపట్టడం (స్టీమ్ ఇన్హెలేషన్), నేసల్ డీ-కంజెస్టెంట్స్ వంటి మందులను డాక్టర్ సూచిస్తారు. చికిత్స కోసం మీరు ఒకసారి ఫిజీషియన్‌ను కలవండి. పీడియాట్రిక్ కౌన్సెలింగ్ గుక్కపడితే... పాప నీలంగా మారుతోంది! మా పాపకు 11 నెలలు. గుక్కపట్టి ఏడుస్తున్నప్పుడు పాప ముఖం తరచూ నీలంగా మారుతోంది. ఆ సమయంలో పాపను చూస్తుంటే ఆందోళనగా ఉంది. దయచేసి పాప సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - సునీల, విశాఖపట్నం మీ పాప ఎదుర్కొంటున్న సమస్యను ‘బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్’గా చెప్పవచ్చు. అంటే పాప కాసేపు ఊపిరి తీసుకోకుండా ఉండిపోతుందన్నమాట. పిల్లల్లో కోపం ఫ్రస్టేషన్ / భయం / కొన్ని సందర్భాల్లో గాయపడటం జరిగినప్పుడు ఇలా కావడం చాలా సాధారణం. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తొమ్మిది నెలల నుంచి 24 నెలల లోపు పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నారుల్లో ఐదు శాతం మందిలో ఇది చాలా సహజం. కుటుంబ చర్రితలో ఈ లక్షణం ఉన్నవారి పిల్లల్లో ఇది ఎక్కువ. ఇలాంటి లక్షణం ఉన్న పిల్లలు పెద్దయ్యాక చాలా మొండిగా అవుతారంటూ కొన్ని అపోహలున్నా, వాటికి శాస్త్రీయమైన ఆధారాలేమీ లేవు. ఇది ఎందుకు వస్తుందనేది చెప్పడం కష్టమైనప్పటికీ రక్తహీనత ఉన్నవారిలో ఇది ఎక్కువ శాతం మందిలో కనిపిస్తుంది. బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్‌లో... సింపుల్, సైనోటిక్, ప్యాలిడ్, కాంప్లికేటెడ్ అని నాలుగు రకాలు ఉన్నాయి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు వస్తోంది సైనోటిక్ అనిపిస్తోంది. ఇక ప్యాలిడ్ అనే రకంలో పిల్లలు పాలిపోయినట్లుగా అయిపోయి, స్పృహతప్పిపోతారు. ఇటువంటి పిల్లల్లో ఒకసారి ఈసీజీ, ఈఈజీ తీయించడం చాలా అవసరం. ఎందుకంటే తీవ్రమైన కారణాలు ఏవైనా ఉంటే అవి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక చికిత్స విషయానికి వస్తే... పాపలో ఈ ధోరణి కనిపించినప్పుడు కుటుంబ సభ్యులంతా తీవ్రమైన ఆందోళనకు గురవుతారు కాబట్టి వాళ్లకు ధైర్యం చెప్పడమే మొదటి అవసరం. చాలా కొద్దిమందిలో మాత్రం ఐరన్ ఇవ్వడం ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలూ, తల్లిదండ్రుల మధ్య ప్రేమాభిమానాలు బలపడినకొద్దీ ఈ లక్షణం క్రమంగా తగ్గిపోతుంది. ఐదేళ్ల వయసు వచ్చాక ఈ లక్షణం కనిపించడం చాలా అరుదు. పైన పేర్కొన్న పరీక్షలు కూడా ఏవైనా తీవ్రమైన సమస్య ఉందేమో అన్నది తెలుసుకోడానికి మాత్రమే. ఈ విషయంలో నిర్భయంగా ఉండండి. మరీ అవసరమైనప్పుడు మీ పిల్లల డాక్టర్‌ను సంప్రదిస్తే చాలు. -
హోమియోపతి కౌన్సెలింగ్
వెన్నునొప్పికి సర్జరీనే మార్గమా? నాకు విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. దీనికి హోమియో ప్రక్రియలో చికిత్స ఉందా? దయచేసి వివరించగలరు. - సుమన్, బాలాపూర్ ఇటీవల వెన్నునొప్పి ఎక్కువ మందిలో కనిపిస్తున్న చాలా సాధారణమైన సమస్య. వెన్నుభాగంలో లిగమెంట్లు, కండరాలు, ఫేసెట్ జాయింట్లు ఒకదానితో ఒకటి అనుసంధానితమై శరీరానికి స్థిరత్వాన్ని ఇస్తాయి. మన రోజువారీ జీవితంలో శారీరకంగా ఎదురయ్యే ఎన్నో సమస్యలను తట్టుకొని నరాల మీద ఎలాంటి ఒత్తిడి పడకుండా కాపాడుకోవడం వెన్నెముక ప్రధాన లక్షణం. అధికంగా బరువు ఎత్తడం, దించడం, ఊబకాయం, ఇన్ఫెక్షన్లు, క్యాల్షియమ్ లోపం, విటమిన్ బి12, డీ3 లోపాలు, ఎముకల సాంద్రత తగ్గడం వంటివి వెన్నునొప్పికి కొన్ని కారణాలు. మనం ఏ పని చేయాలన్నా ప్రతిక్షణం మెడ, నడుములోని వెన్నుపూసలు పనిచేయాలి. అందుకే ప్రతి పదిమందిలో ఆరు నుంచి ఎనిమిది మంది వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. వెన్నుపూసలు అరిగినందువల్ల వెన్నునొప్పి వస్తుంది కాబట్టి మందులతో దాన్ని పరిష్కరించలేమనీ, ఆపరేషన్ అవసరమని చాలామందిలో ఒక అపోహ ఉంది. పైగా ఇది జీవితాంతం వేధిస్తూ ఉంటుందని నిస్పృహ కూడా కొందరు పేషెంట్లలో ఉంటుంది. వెన్నునొప్పికి కారణమైన డిస్క్ బల్జ్, డిస్క్ కంప్రెషన్, నరాలమీద ఒత్తిడి పెరగడం వల్ల తీవ్రమైన నొప్పి సవ్తుంటుంది. అయితే హోమియోలో ఇలాంటి వెన్ను సంబంధమైన నొప్పులు వచ్చినప్పుడు... ఉదాహరణకు డిస్క్ బల్జ్ వల్ల నరాలమీద ఒత్తిడి పెరిగినప్పుడు తగ్గించడానికి కోబాల్ట్ లాంటి ప్రభావపూర్వకమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఇక మెడభాగంలో ఉండే వెన్నుపూసలు అరిగినప్పుడు వచ్చే నొప్పిని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. మెడ భాగంలో సి1 నుంచి సి7 వరకు ఉండే వెన్ను పూసలను సర్వైకల్ పూసలు అంటారు. ఇవి అరిగినప్పుడు వెన్నుపూసల కీళ్ల మధ్య భాగం తగ్గిపోవడం వల్ల డిస్క్‌బల్జ్ ఏర్పడటం, వెన్నుపూసల మధ్య రాపిడి పెరగడం వంటి కారణాల వల్ల మెడ భాగం నుంచి నొప్పి మొదలై చేతి వేళ్ల వరకు నొప్పి పాకుతూ ఉంటుంది. దాంతో పాటు తిమిర్లు, చేయి మొద్దుబారడం, మెడ ఫ్రీగా తిరగలేకపోవడం, మెడ పట్టివేసినట్లుగా ఉండటం వంటివి చూస్తుంటాం. ఇలాంటి వారికి కూడా యాసిడ్‌ఫాస్ అనే మందు బాగా పనిచేస్తుంది. ఇక మెడ, నడుము, వెన్నెముక నొప్పిలకు ఆస్క్కులస్ హిప్, రస్టాక్స్, బ్రయోనియా ఆల్బ్, కాల్కేరియా ఫ్లోర్, హైపరికం, మహిళల్లో వచ్చే ఇలాంటి సమస్యలకే సిమిసిఫ్యూగా వంటివి అద్భుతంగా పనిచేస్తాయి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఆస్తమా తగ్గదంటారు.. నిజమేనా..!? నా వయసు 48. గత పాతికేళ్లుగా ఆస్తమాతో బాధపడుతున్నాను. రకరకాల మందులు వాడాను. అయితే ఆస్తమా వచ్చినప్పుడు ఆయాసం తగ్గడానికి వాడే మందులు తప్ప... శాశ్వత పరిష్కారం ఉండదని చెబుతున్నారు. నిజమేనా? హోమియోలో ఏదైనా పరిష్కారం ఉందేమో చెప్పండి. - యాదయ్య, భువనగిరి ఆస్తమా అనేది సాధారణమైన దీర్ఘకాలిక సమస్య. మన ముక్కులోకి, ఊపిరితిత్తుల్లోకి లేదా శరీరంలోకి సరిపడని సూక్ష్మపదార్థాలు (అలర్జెన్స్) గాలి ద్వారా లేదా ఆహారం ద్వారా ప్రవేశించినప్పుడు, వాటికి ప్రతిచర్యగా మన శరీరం స్పందించి, వివిధ రకాల రసాయనాలు విడుదల చేసి, శ్వాసనాళాలలో శ్లేష్మపొర వాపునకు గురిచేస్తాయి. దీనివల్ల శ్వాసనాళాలు కుంచించుకుపోయి, ఊపిరితీసుకోవడం కష్టమవుతుంది. దగ్గు, ఆయాసం, పిల్లికూతలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే ఆస్తమా లేదా ఉబ్బసం అంటారు. ఆస్తమా లక్షణాలు : శ్వాసనాళాలు సంకోచించడం వల్ల గాలి రవాణాకు ఆటంకం కలిగి ఆయాసం, దగ్గు వస్తాయి. ఛాతీ బరువుగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది, పిల్లికూతలు ప్రధాన లక్షణాలు. పిల్లల్లో ఈ లక్షణాలతో పాటు రాత్రివేళ దగ్గు, పిల్లికూతలు, పగలు పరుగెత్తినప్పుడు, మాట్లాడినప్పుడు ఆయాసపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆస్తమాకు కారణాలు : వాతావరణంలో మార్పులు, దుమ్ము, ధూళి, ఘాటైన వాసనలు, పెంపుడు జంతువులూ వాటి వెంట్రుకలు, మస్కిటో రిపెల్లెంట్స్, రకరకాల స్ప్రేలు, విసర్జకాలు, పూలమొక్కల నుంచి వచ్చే పుప్పొడి రేణువులు, శీతలపానీయాలు, ఐస్‌క్రీమ్స్, జన్యుసంబంధమైన కారణాలు... ఉబ్బసం రావడానికి గల కారణాలలో కొన్ని. నిర్ధారణ : సీబీపీ, ఈఎస్ఆర్, అబ్సల్యూట్ ఇజినోఫిల్ కౌంట్, ఎక్స్‌రే (చెస్ట్), సీటీ స్కాన్, స్పైరోమెట్రీ, పల్మునరీ ఫంక్షన్ టెస్ట్ మొదలైన వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా వ్యాధి తీవ్రతను నిర్ధారణ చేయవచ్చు. నివారణ మార్గాలు : దుమ్ము, ధూళి నుంచి దూరంగా ఉండాలి శీతలపానియాలు, ఐస్‌క్రీమ్స్ తీసుకోకూడదు పెంపుడు జంతువులను దూరంగా ఉంచాలి ఇంటి పరిసర ప్రాంతాలలో ఉండే పార్థీనియం మొక్కలను తొలగించి, పుప్పొడికి దూరంగా ఉండాలి. ఆస్తమా ఎప్పటికీ తగ్గదని చాలామంది భావన. కానీ అందులో నిజంలేదు. హోమియో ప్రక్రియలో ఆస్తమాను పూర్తిగా తగ్గించే మందులు అందుబాటులో ఉన్నాయి. మీరు నిపుణులైన హోమియోవైద్యులను కలిసి, తగు జాగ్రత్తలతో మందులు వాడితే ఆస్తమా పూర్తిగా తగ్గిపోతుంది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ థైరాయిడ్ సమస్యల నుంచి విముక్తి ఎలా? నా వయసు 56. పిల్లల చదువులు పూర్తయి వారు స్థిరపడ్డాక పదేళ్ల క్రితం నగరానికి వచ్చాను. అప్పట్నుంచి థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నాను. మా పిల్లలు చిన్నవారైనప్పటికీ వారిలోనూ ఇదే సమస్య ఉన్నట్లు ఇటీవలే తెలిసింది. థైరాయిడ్ సంబంధిత సమస్యలు తగ్గేందుకు మార్గాలు చెప్పండి. - అనసూయబాయి, హైదరాబాద్ మీరు చెప్పినట్లుగా ఇటీవల నగరాలలో థైరాయిడ్ సమస్యలు రావడం పెరుగుతోంది. నగరాలలో పెరుగుతున్న మానసిక ఒత్తిడులు ఒక రకంగా థైరాయిడ్ సమస్యలకు కారణం అని చెప్పవచ్చు. థైరాయిడ్ అనేది మన గొంతు దగ్గర ఉండే కీలకమైన గ్రంథి. ఇది స్రవించే హార్మోన్లు మానసిక ఆలోచనలపై ప్రభావం చూపేవిగా ఉంటాయి. ఈ గ్రంథి టీ4, టీ3, టీఎస్‌హెచ్ హార్మోన్లను స్రవిస్తుంది. సున్నిత మనస్తత్వం కలవారు, ప్రతి చిన్న విషయాన్నీ మనసుపైకి తీసుకునేవారిలో ఈ గ్రంథి స్రవించే హార్మోన్ సమతౌల్యత దెబ్బతింటుంది. టీహెచ్ఎస్ ఎక్కువ అవడం వల్ల అతిగా బరువు పెరగడం, అతి ఆలోచన, అతి బద్దకం, మతిమరపు, అదినిద్ర వచ్చే అవకాశం ఉంది. మా వద్ద నిర్వహించిన పరిశోధనల ప్రకారం స్త్రీలలో థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. మా పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే... స్త్రీలలో రుతుస్రావ సమస్యలు, గర్భం రాకుండా ఉండేందుకు వాడే మందులు, పీరియడ్స్ సక్రమంగా వచ్చేందుకు వాడే మందుల వల్ల థైరాయిడ్‌పై దుష్ర్పభావాలు పడి, దానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి మందులు వాడటం వల్ల ప్రతి 100లోనూ 50 మంది థైరాయిడ్ సమస్యల బారిన పడుతున్నారు. ఇటీవల చిన్నపిల్లల్లో కూడా థైరాయిడ్ సమస్యలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం... గర్భవతిగా ఉన్నప్పుడు వచ్చే మహిళల్లో వచ్చే అనారోగ్య సమస్యల వల్లనే అని తేలింది. దీనికి బదులు ప్రెగ్నెన్సీ సమయంలో తొమ్మిది నెలల పాటు హోమియోపతి మందులు వాడితే పిల్లల్లోనూ సమస్యలు రాకుండా నివారించవచ్చు. తల్లిదండ్రులకు థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలలోనూ ఆ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇక ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేమిటంటే థైరాయిడ్ సమస్యలన్నీ ఒకేలా ఉండవు. హార్మోన్ స్రావం పెరిగితే ఒకలా, తగ్గితే మరొకలా, నాడ్యూల్స్ వస్తే ఇంకోలా లక్షణాలు కనిపిస్తాయి. హోమియోలో ఈ లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులు ఇస్తారు. ఉదాహరణకు... ఆర్సినిక్ ఆల్బ్: హైపోథైరాయిడిజమ్‌లో కనిపించే నిద్రలేమి, ఎవరినీ నమ్మకపోవడం, ఆలోచనలు అస్థిమితంగా ఉండటం, అతి ఆందోళన వంటివాటికి ఈ మందు బాగా పనిచేస్తుంది. కాల్కేరియా కార్బ్: ఇది కూడా హైపోథైరాయిడిజమ్‌లో లక్షణాలతో పాటు చిన్నపిల్లల మనస్తత్వం, గుర్తింపుకోసం తహతహ, అసూయ వంటి లక్షణాలున్నవారికి. ఓపియమ్ : అతినిద్ర, గురకపెట్టడం, ప్రతివిషయాన్ని అశ్రద్ధ చేయడం, అతిచురుకు లక్షణాలున్నవారికి ఈ మందు. నేట్రమ్మ్యూర్ : అతిగా స్పందించడం, అసంతృప్తి, అతి ఆలోచన వంటి లక్షణాలకు ఈ మందు. ఇలా అన్నిరకాల థైరాయిడ్ సమస్యలకు హోమియోలో మంచి మందులు ఉన్నాయి. డాక్టర్ ఎ.ఎమ్.రెడ్డి, పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్