మనం నిటారుగా నిలబడి ఉండటానికి కారణమైన ప్రధాన అవయవం ‘వెన్ను’. అందుకే మన జాతీయాల్లోనూ, నుడికారాల్లోనూ ఒకరిపై ఆధారపడకుండా మనకై మనమే జీవించడానికి ప్రతీకగా ‘వెన్నెముక’ను పేర్కొంటుంటారు. అందుకే స్వతంత్రంగా వ్యవహరించని వాళ్లకు ‘వెన్నెముక’ లేదంటుంటారు. ప్రధానమైన వ్యవసాయ వృత్తిలో ఉన్న రైతును దేశానికి వెన్నెముకగా అభివర్ణిస్తారు. అంత ప్రధానమైన ఈ వెన్నుకు వచ్చే బాధలను తెలుసుకుందాం...
మన కాళ్లపై మనం ఉండటానికి దోహదపడే ఈ వెన్నెముక పుర్రె చివర నుంచి మొదలై, నడుం కింది వరకు ఉంటుంది. మెదడు చివరి భాగం (మెడుల్లా అబ్లాంగేటా) నుంచి నడుం వరకు ఉండే వెన్నుపాముకు రక్షణకవచంలా ఒకదానినొకటి లింకుల్లా ఏర్పడి 32 నుంచి 34 వెన్నుపూసలు ఒక వెన్నెముకగా ఉంటాయి. దీన్నే స్పైన్ అంటారు. ఇందులో మెడ భాగంలో ఏడు (సర్వైకల్), ఛాతి, కడుపు భాగంలో పన్నెండు (థోరాసిక్), నడుం భాగంలో ఉండేవి ఐదు (లంబార్), మిగతావి ఒకదాంతో మరోటి కలిసిపోయి ఉండే శాక్రల్ ఎముకలు. కాక్సిక్ అనేది చివరన తోకలా ఉండే ఎముక. వీటిల్లో ఏ భాగానికి నొప్పి వచ్చినా దాన్ని వెన్నునొప్పిగానే పేర్కొంటారు. ఇక వెన్నెముకలోని 32-34 ఎముకల్లో... ప్రతి దాని మధ్య నుంచి ఒక్కోనరం చొప్పున మొత్తం 31 నరాలు బయటకు వస్తాయి. వెన్నుపూసల అరుగుదల వల్ల ఈ నరాలపై ఏమాత్రం ఒత్తిడి పడ్డా నొప్పి వస్తుంది. వెన్నెముక నొప్పుల్లో రకాలను చూద్దాం.
మెడనొప్పి: మెడ భాగంలో ఉండే వెన్నెముకలను సర్వైకల్ పూసలు అంటాం కదా, అవి అరగడం వల్ల వచ్చే నొప్పిని ‘సర్వైకల్ స్పాండిలోసిస్’ అంటారు. మెడనొప్పికి ముఖ్యకారణం ఇదే. తలపై బరువులు మోసేవారికి, కంప్యూటర్ దగ్గర ఎక్కువ సమయం పనిచేసే వారికి, డ్రైవింగ్ చేసేవారికి ఎక్కువగా వస్తుంది. స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా కంప్యూటర్‌పై పనిచేసే వారిలో, రాతపని, కుట్లు, అల్లికలు చేసే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వెన్నెముకలోని ఎముక భాగాలు అరిగిపోవడం దీనికి ప్రధాన కారణం. వయసు పైబడటం వల్ల ఎముక భాగాలు అరిగిపోతుంటాయి. స్త్రీలలో మెనోపాజ్ దశ వచ్చేసరికి కాల్షియం గ్రహించడం తగ్గిపోతుంది. దీనికితోడు కాల్షియం లభించే ఆహార పదార్థాలను తీసుకోకపోవడం వల్ల సమస్య తలెత్తుతుంది.
ఈ సమస్య ఉన్నవారిలో నొప్పి మెడ నుంచి భుజం వరకు లేదా ఛాతి వరకు పాకుతుంది. ఈ నొప్పి కరెంట్ షాక్‌లా లేదా మంటపుట్టినట్టుగా ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు తలతిరగడం, మెడ నొప్పి ఉంటుంది.
నడుమునొప్పి: నడుం భాగంలోని వెన్నుపూసల్లో అరుగుదల వల్ల ఈ నొప్పి వస్తుంది. నొప్పి వచ్చే భాగాన్ని బట్టి పేర్లుంటాయి. వాటిలో స్పాండిలైటిస్, టెయిల్ పెయిన్, సయాటికా నొప్పి ముఖ్యమైనవి. లాంబార్ స్పాండిలైటిస్ కూర్చుని పనిచేసే వారికి, బరువులెత్తే వారిలో, నడుముకి దెబ్బలు తగిలిన వారిలో, మహిళల్లో కాన్పు తర్వాత వస్తుంటుంది. ఈ నొప్పి సూదులతో గుచ్చినట్టుగా, మంటగా ఉంటుంది.
టెయిల్ పెయిన్: వెన్నుపూసల కిందిభాగంలో ఈ నొప్పి వస్తుంది. కూర్చున్నా, నిల్చున్నా నొప్పి ఎక్కువగా వస్తుంది. ఇది స్త్రీలలో ఎక్కువ.
సయాటికా: సయాటికా అనేది కాలి భాగాన్ని బాధపెట్టే నాడీ సంబంధ నొప్పి. ఈ సమస్య ఎడమ లేదా కుడివైపు ఎక్కడైనా రావచ్చు. ఇది కూడా స్త్రీలలోనే ఎక్కువ. సయాటికా అనేది కాలిలోకి వెళ్ళే అతి పెద్ద నాడి. వెన్నెముకలోని వెన్నుపూసలు అరగడం వల్ల వాటి మధ్య ఉన్న కార్టిలేజ్ మీద ఒత్తిడి పడుతుంది. కార్టిలేజ్ మధ్యలో ఉండే సయాటికా నాడి ఒత్తిడికి లోనవుతుంది. దాంతో సయాటికా నాడి ఏయే భాగాలతో అనుసంధానించి ఉంటుందో ఆయా భాగాలలో నొప్పి మొదలవుతుంది. ఆ బాధ కరెంట్ షాక్‌లా ఉండి నడవలేక, నిలబడలేక, కూర్చోలేక వర్ణనాతీతంగా ఉంటుంది.
సయాటికా లక్షణాలు: సయాటికా సమస్యకు కొన్ని ప్రధాన లక్షణాలున్నాయి. ఇవి అన్ని సందర్భాలలోనూ అందరిలోనూ ఒకేసారి ఒకేలా కనిపించకపోవచ్చు. ముందుగా నొప్పి నడుములో ప్రారంభమై పిరుదులలోకి, అక్కడి నుంచి తొడల్లోకి, అక్కడి నుంచి పిక్కల్లోకి వ్యాపిస్తుంది, దగ్గినా, తుమ్మినా, ఎక్కువసేపు కూర్చున్నా సమస్య అధికం అవుతుంది.
రెండు కాళ్ళలోనూ, ఒకే స్థాయిలో కాకుండా, ఏదో ఒక కాలిలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. తిమ్మిర్లు కూడా ఉండవచ్చు. సయాటికా నాడి ప్రయాణించే మార్గంలో అంటే కాలిలోనూ పాదంలోనూ ఉంటుంది. సూదులు గుచ్చినట్లుగా నొప్పి ఉంటుంది. కాలు, నడుము బిగుసుకుపోయినట్టు ఉంటుంది. కూర్చున్నా, నిలబడినా నొప్పిగానే ఉంటుంది.
కారణాలు: అధిక బరువులు ఎత్తడం కాళ్ళకు ఎత్తుమడమల చెప్పులు వాడడం గతుకుల రోడ్లమీద తరచుగా ప్రయాణం చెయ్యాల్సిరావడం పోషకాహార లోపం, ముఖ్యంగా కాల్షియం లోపం దీర్ఘకాలిక దగ్గు, తుమ్ముల వల్ల నొప్పి తీవ్రం అవుతుంది. ఇవి గాక మరిన్ని వెన్ను సంబంధమైన నొప్పిలు కనిపిస్తాయి...
హెర్నియేటెడ్ డిస్క్: ఎక్కువగా డ్రైవింగ్, కంప్యూటర్ వర్క్‌చేసే వారిలో ఈ సమస్య ఉంటుంది.
స్టెనోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్: ప్రాథమిక దశలో గురిస్తే ఈ సమస్యను త్వరగా అరికట్టవచ్చు.
మెకానికల్ ఇంజ్యురీ: సాధారణ అరుగుదలతో కాకుండా, ఏదైనా దెబ్బ తగలడం వల్ల వెన్నెముకకు భౌతికంగా గాయం అయి వచ్చే నొప్పిని మెకానికల్ ఇంజ్యూటరీ వల్ల వచ్చే నొప్పిగా పేర్కొంటారు.
వెన్నునొప్పి నివారణా మార్గాలు: ఎక్కువసేపు కూర్చోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఒకసారయినా లేచి ఐదు నిమిషాల పాటు అటూ ఇటూ తిరగాలి. బరువయిన వస్తువులను వంగి ఎత్తకూడదు. ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకోవాలి.
హోమియోపతి చికిత్స: వెన్నునొప్పి, నడుము నొప్పికి హోమియో మందులో అద్భుతమైన ఔషధాలున్నాయి. నొప్పి నివారణ మాత్రల మాదిరిగా తాత్కాలిక ఉపశమనాన్ని అందించకుండా మూలకారణాన్ని తొలగించి నడుము నొప్పి నుంచి శాశ్వత విముక్తిని అందిస్తాయి. శరీరంలో సమసతుల్యతను కాపాడే విధంగా హోమియోపతి వైద్యం పనిచేస్తుంది. దీనితో డిస్క్ సమస్య, కార్టిలేజ్ సమస్యను శాశ్వతంగా నివారించవచ్చు. స్పాండిలైటిస్, స్టెనోసిన్, సయాటికా సమస్యలు ఇట్టే తొలగిపోతాయి. బ్రయోనియా, రస్టాక్స్, లెడంపాల్, హైపరికం వంటి మందులు వ్యాధి తీవ్రతను తగ్గించడంలోనూ, శాశ్వత పరిష్కారాన్ని చూపించడంలో ఉపయోగపడతాయి. దీనితో పాటు కొలోసింథ్, పల్సటిలా అన్న మందులు కూడా ఈ నొప్పుల విషయంలో ఆలోచించాల్సినవే. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వైద్యం చేయించుకుంటూ పోషకాహారం, ఫిజియోథెరపి, యోగా క్రమబద్ధంగా చేయడం ద్వారా సయాటికా మొదలుకొని, అన్ని వెన్నునొప్పులనూ శాశ్వతంగా దూరం చేయవచ్చు.
డాక్టర్ రవికిరణ్, ఎం.డి.
(చికిత్సరత్న అవార్డు గ్రహీత)
ప్రముఖ హోమియో వైద్యనిపుణులు
మాస్టర్స్ హోమియోపతి,
హైదరాబాద్‌లో దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేట్, కూకట్‌పల్లి; విజయవాడ, కరీంనగర్,
ph: 7842 106 106 / 9032 106 106