Dr. Ravikiran
-
వెన్నునొప్పి...
మనం నిటారుగా నిలబడి ఉండటానికి కారణమైన ప్రధాన అవయవం ‘వెన్ను’. అందుకే మన జాతీయాల్లోనూ, నుడికారాల్లోనూ ఒకరిపై ఆధారపడకుండా మనకై మనమే జీవించడానికి ప్రతీకగా ‘వెన్నెముక’ను పేర్కొంటుంటారు. అందుకే స్వతంత్రంగా వ్యవహరించని వాళ్లకు ‘వెన్నెముక’ లేదంటుంటారు. ప్రధానమైన వ్యవసాయ వృత్తిలో ఉన్న రైతును దేశానికి వెన్నెముకగా అభివర్ణిస్తారు. అంత ప్రధానమైన ఈ వెన్నుకు వచ్చే బాధలను తెలుసుకుందాం... మన కాళ్లపై మనం ఉండటానికి దోహదపడే ఈ వెన్నెముక పుర్రె చివర నుంచి మొదలై, నడుం కింది వరకు ఉంటుంది. మెదడు చివరి భాగం (మెడుల్లా అబ్లాంగేటా) నుంచి నడుం వరకు ఉండే వెన్నుపాముకు రక్షణకవచంలా ఒకదానినొకటి లింకుల్లా ఏర్పడి 32 నుంచి 34 వెన్నుపూసలు ఒక వెన్నెముకగా ఉంటాయి. దీన్నే స్పైన్ అంటారు. ఇందులో మెడ భాగంలో ఏడు (సర్వైకల్), ఛాతి, కడుపు భాగంలో పన్నెండు (థోరాసిక్), నడుం భాగంలో ఉండేవి ఐదు (లంబార్), మిగతావి ఒకదాంతో మరోటి కలిసిపోయి ఉండే శాక్రల్ ఎముకలు. కాక్సిక్ అనేది చివరన తోకలా ఉండే ఎముక. వీటిల్లో ఏ భాగానికి నొప్పి వచ్చినా దాన్ని వెన్నునొప్పిగానే పేర్కొంటారు. ఇక వెన్నెముకలోని 32-34 ఎముకల్లో... ప్రతి దాని మధ్య నుంచి ఒక్కోనరం చొప్పున మొత్తం 31 నరాలు బయటకు వస్తాయి. వెన్నుపూసల అరుగుదల వల్ల ఈ నరాలపై ఏమాత్రం ఒత్తిడి పడ్డా నొప్పి వస్తుంది. వెన్నెముక నొప్పుల్లో రకాలను చూద్దాం. మెడనొప్పి: మెడ భాగంలో ఉండే వెన్నెముకలను సర్వైకల్ పూసలు అంటాం కదా, అవి అరగడం వల్ల వచ్చే నొప్పిని ‘సర్వైకల్ స్పాండిలోసిస్’ అంటారు. మెడనొప్పికి ముఖ్యకారణం ఇదే. తలపై బరువులు మోసేవారికి, కంప్యూటర్ దగ్గర ఎక్కువ సమయం పనిచేసే వారికి, డ్రైవింగ్ చేసేవారికి ఎక్కువగా వస్తుంది. స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా కంప్యూటర్‌పై పనిచేసే వారిలో, రాతపని, కుట్లు, అల్లికలు చేసే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వెన్నెముకలోని ఎముక భాగాలు అరిగిపోవడం దీనికి ప్రధాన కారణం. వయసు పైబడటం వల్ల ఎముక భాగాలు అరిగిపోతుంటాయి. స్త్రీలలో మెనోపాజ్ దశ వచ్చేసరికి కాల్షియం గ్రహించడం తగ్గిపోతుంది. దీనికితోడు కాల్షియం లభించే ఆహార పదార్థాలను తీసుకోకపోవడం వల్ల సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య ఉన్నవారిలో నొప్పి మెడ నుంచి భుజం వరకు లేదా ఛాతి వరకు పాకుతుంది. ఈ నొప్పి కరెంట్ షాక్‌లా లేదా మంటపుట్టినట్టుగా ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు తలతిరగడం, మెడ నొప్పి ఉంటుంది. నడుమునొప్పి: నడుం భాగంలోని వెన్నుపూసల్లో అరుగుదల వల్ల ఈ నొప్పి వస్తుంది. నొప్పి వచ్చే భాగాన్ని బట్టి పేర్లుంటాయి. వాటిలో స్పాండిలైటిస్, టెయిల్ పెయిన్, సయాటికా నొప్పి ముఖ్యమైనవి. లాంబార్ స్పాండిలైటిస్ కూర్చుని పనిచేసే వారికి, బరువులెత్తే వారిలో, నడుముకి దెబ్బలు తగిలిన వారిలో, మహిళల్లో కాన్పు తర్వాత వస్తుంటుంది. ఈ నొప్పి సూదులతో గుచ్చినట్టుగా, మంటగా ఉంటుంది. టెయిల్ పెయిన్: వెన్నుపూసల కిందిభాగంలో ఈ నొప్పి వస్తుంది. కూర్చున్నా, నిల్చున్నా నొప్పి ఎక్కువగా వస్తుంది. ఇది స్త్రీలలో ఎక్కువ. సయాటికా: సయాటికా అనేది కాలి భాగాన్ని బాధపెట్టే నాడీ సంబంధ నొప్పి. ఈ సమస్య ఎడమ లేదా కుడివైపు ఎక్కడైనా రావచ్చు. ఇది కూడా స్త్రీలలోనే ఎక్కువ. సయాటికా అనేది కాలిలోకి వెళ్ళే అతి పెద్ద నాడి. వెన్నెముకలోని వెన్నుపూసలు అరగడం వల్ల వాటి మధ్య ఉన్న కార్టిలేజ్ మీద ఒత్తిడి పడుతుంది. కార్టిలేజ్ మధ్యలో ఉండే సయాటికా నాడి ఒత్తిడికి లోనవుతుంది. దాంతో సయాటికా నాడి ఏయే భాగాలతో అనుసంధానించి ఉంటుందో ఆయా భాగాలలో నొప్పి మొదలవుతుంది. ఆ బాధ కరెంట్ షాక్‌లా ఉండి నడవలేక, నిలబడలేక, కూర్చోలేక వర్ణనాతీతంగా ఉంటుంది. సయాటికా లక్షణాలు: సయాటికా సమస్యకు కొన్ని ప్రధాన లక్షణాలున్నాయి. ఇవి అన్ని సందర్భాలలోనూ అందరిలోనూ ఒకేసారి ఒకేలా కనిపించకపోవచ్చు. ముందుగా నొప్పి నడుములో ప్రారంభమై పిరుదులలోకి, అక్కడి నుంచి తొడల్లోకి, అక్కడి నుంచి పిక్కల్లోకి వ్యాపిస్తుంది, దగ్గినా, తుమ్మినా, ఎక్కువసేపు కూర్చున్నా సమస్య అధికం అవుతుంది. రెండు కాళ్ళలోనూ, ఒకే స్థాయిలో కాకుండా, ఏదో ఒక కాలిలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. తిమ్మిర్లు కూడా ఉండవచ్చు. సయాటికా నాడి ప్రయాణించే మార్గంలో అంటే కాలిలోనూ పాదంలోనూ ఉంటుంది. సూదులు గుచ్చినట్లుగా నొప్పి ఉంటుంది. కాలు, నడుము బిగుసుకుపోయినట్టు ఉంటుంది. కూర్చున్నా, నిలబడినా నొప్పిగానే ఉంటుంది. కారణాలు: అధిక బరువులు ఎత్తడం కాళ్ళకు ఎత్తుమడమల చెప్పులు వాడడం గతుకుల రోడ్లమీద తరచుగా ప్రయాణం చెయ్యాల్సిరావడం పోషకాహార లోపం, ముఖ్యంగా కాల్షియం లోపం దీర్ఘకాలిక దగ్గు, తుమ్ముల వల్ల నొప్పి తీవ్రం అవుతుంది. ఇవి గాక మరిన్ని వెన్ను సంబంధమైన నొప్పిలు కనిపిస్తాయి... హెర్నియేటెడ్ డిస్క్: ఎక్కువగా డ్రైవింగ్, కంప్యూటర్ వర్క్‌చేసే వారిలో ఈ సమస్య ఉంటుంది. స్టెనోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్: ప్రాథమిక దశలో గురిస్తే ఈ సమస్యను త్వరగా అరికట్టవచ్చు. మెకానికల్ ఇంజ్యురీ: సాధారణ అరుగుదలతో కాకుండా, ఏదైనా దెబ్బ తగలడం వల్ల వెన్నెముకకు భౌతికంగా గాయం అయి వచ్చే నొప్పిని మెకానికల్ ఇంజ్యూటరీ వల్ల వచ్చే నొప్పిగా పేర్కొంటారు. వెన్నునొప్పి నివారణా మార్గాలు: ఎక్కువసేపు కూర్చోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఒకసారయినా లేచి ఐదు నిమిషాల పాటు అటూ ఇటూ తిరగాలి. బరువయిన వస్తువులను వంగి ఎత్తకూడదు. ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకోవాలి. హోమియోపతి చికిత్స: వెన్నునొప్పి, నడుము నొప్పికి హోమియో మందులో అద్భుతమైన ఔషధాలున్నాయి. నొప్పి నివారణ మాత్రల మాదిరిగా తాత్కాలిక ఉపశమనాన్ని అందించకుండా మూలకారణాన్ని తొలగించి నడుము నొప్పి నుంచి శాశ్వత విముక్తిని అందిస్తాయి. శరీరంలో సమసతుల్యతను కాపాడే విధంగా హోమియోపతి వైద్యం పనిచేస్తుంది. దీనితో డిస్క్ సమస్య, కార్టిలేజ్ సమస్యను శాశ్వతంగా నివారించవచ్చు. స్పాండిలైటిస్, స్టెనోసిన్, సయాటికా సమస్యలు ఇట్టే తొలగిపోతాయి. బ్రయోనియా, రస్టాక్స్, లెడంపాల్, హైపరికం వంటి మందులు వ్యాధి తీవ్రతను తగ్గించడంలోనూ, శాశ్వత పరిష్కారాన్ని చూపించడంలో ఉపయోగపడతాయి. దీనితో పాటు కొలోసింథ్, పల్సటిలా అన్న మందులు కూడా ఈ నొప్పుల విషయంలో ఆలోచించాల్సినవే. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వైద్యం చేయించుకుంటూ పోషకాహారం, ఫిజియోథెరపి, యోగా క్రమబద్ధంగా చేయడం ద్వారా సయాటికా మొదలుకొని, అన్ని వెన్నునొప్పులనూ శాశ్వతంగా దూరం చేయవచ్చు. డాక్టర్ రవికిరణ్, ఎం.డి. (చికిత్సరత్న అవార్డు గ్రహీత) ప్రముఖ హోమియో వైద్యనిపుణులు మాస్టర్స్ హోమియోపతి, హైదరాబాద్‌లో దిల్సుఖ్నగర్, అమీర్‌పేట్, కూకట్పల్లి; విజయవాడ, కరీంనగర్, ph: 7842 106 106 / 9032 106 106 -
హెపటైటిస్, హెర్పిస్‌లకు మెరుగైన వైద్యచికిత్స
కొన్ని వైరస్లు శరీరంలో ప్రవేశించి నిద్రాణంగా ఉండిపోతాయి. ఆ సమయంలో లక్షణాలేవీ కనిపించడం లేదని నిర్లక్ష్యంగా ఉంటే అది ఒక్కోసారి ప్రాణాపాయానికి దారి తీయవచ్చు. వాటిలో ముఖ్యమైనవి హెపటైటిస్ బి, సి, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్లు. ఈ వైరస్‌లకు హోమియోలో మెరుగైన చికిత్స ఉందని అంటున్నారు హోమియో వైద్యనిపుణులు డా. రవికిరణ్. హెపటైటిస్ అనగానే మామూలుగా హెపటైటిస్ బి గుర్తుకు వస్తుంది. కానీ హెపటైటిస్ సి,ఏ, ఇ అనే చాలా రకాలూ ఉన్నాయి. హెపటైటిస్‌తో కాలేయం పనితీరు మెల్లగా మందగించి ప్రాణాంతకంగామారుతుంది. కాలేయ కేన్సర్‌కూ దారి తీయవచ్చు. హెపటైటిస్ బి రాకుండా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ వ్యాధి వచ్చిన తర్వాత శాశ్వత పరిష్కారాన్ని చూపే చికిత్స ఇతర వైద్యవిధానాలలో లేదు. కానీ హోమియో వైద్యంలో అద్భుతమైన చికిత్స ఉంది. ఇవీ కారణాలు సురక్షితం కాని శృంగారంలో పాల్గొనడం. స్వలింగ సంపర్కం. అపరిచితుల నుంచి రక్తం స్వీకరించడం. కలుషితమైన సిరంజులను వాడటం. తల్లి నుంచి బిడ్డకు వైరస్ వ్యాప్తిచెందడం. ప్రధానంగా ఈ మూడు మార్గాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంటుంది. వ్యాధి లక్షణాలు ఇది పేషెంట్ తాలూకు రోగనిరోధక శక్తి మీద దాడి చేస్తుంది. ఆకలి లేకపోవడం, వికారం, ఒంటినొప్పులు, పసుపు రంగులో మూత్రం వంటి లక్షణాల తర్వాత మెల్లిగా పచ్చకామెర్లు మొదలవుతాయి. దీంతోపాటుగా చర్మంపైన దద్దుర్లు కనిపిస్తాయి. చాలామందిలో ఇవి తర్వాత కనుమరుగయిపోతాయి. కొన్ని కేసులలో కాలేయం పనిచేయటం ఆగిపోయి మరణం సంభవిస్తుంది. దీనినే ఫల్మినంట్ హెపటిక్ ఫెయిల్యూర్ అంటారు. కొన్ని సందర్భాల్లో హెపటైటిస్ బి వ్యాధి చాలా ఆలస్యంగా... అంటే కొన్నేళ్ల తర్వాత బయటపడవచ్చు. దీన్ని క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లివర్లేదా క్రానిక్ హెపటైటిస్ అంటారు. వీరిలో కామెర్ల వ్యాధి తగ్గకుండా అలాగే ఉంటుంది. వాంతులు, ఒళ్ళంతా దురదలు, విరేచనాలు, కడుపుబ్బరం, పొట్టలో నొప్పి, రక్తనాళాల వాపు, కిడ్నీ సమస్యలు, ప్లేట్లెట్స్ తగ్గడం, తలనొప్పి, రక్తహీనత, రక్తకణాల సంఖ్య పడిపోవడం జరుగుతుంది. లివర్ కేన్సర్‌కూ దారితీయవచ్చు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు హెపటైటిస్ బి, సి లను గుర్తించడానికిహెచ్బిఎస్ఎజి; సి గురించి హెచ్సివి యాంటీబాడీ ఎంజైమ్ ఇమ్యూనో అస్సే; హెపటైటిస్ బి, సి వైరల్ లోడ్ పీసీఆర్ టెస్ట్ వంటివి వ్యాధి నిర్ధారణలో ఉపయోగపడతాయి. ఎల్ఎఫ్టీ, ఈఎస్సార్ పరీక్షలు కూడా ఉపయోగపడతాయి. హోమియో చికిత్స హెపటైటిస్ బి, సి వైరస్లు కాలేయాన్నే తమ ఆవాసంగా చేసుకోడానికి కారణం... అవి వృద్ధి చెందే అవకాశం ఎక్కువ. దీన్నే రిప్లికేషన్ అంటారు. ఈ రిప్లికేషన్‌ను హోమియో మందుల ద్వారా అడ్డుకోవచ్చును. అంతేగాక రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసి వైరస్‌ను పెరగకుండా చేయవచ్చు. లైకోపోడియం, హెపర్‌సల్ఫ్, మెర్క్‌సాల్, బ్రయోనియా, ఫాస్ఫరస్ వంటి మందులు వ్యాధిని సమర్థంగా తగ్గిస్తాయి. నిర్లక్ష్యం చేస్తే... హెపటైటిస్ వైరస్ ఉన్నా లక్షణాలు కనిపించడం లేదని నిర్లక్ష్యం చేస్తే సిర్రోసిస్‌కు దారితీసి లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. లివర్ కేన్సర్‌కూ దారితీయవచ్చు. కొన్నిసార్లు కిడ్నీలు, స్ల్పీన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. హెర్పిస్ సింప్లెక్స్ ఒక గుండు సూది మొనమీద కోటి వైరస్లు ఇమిడిపోయేంత సూక్ష్మమెన ఈ వైరస్ రెండు రకాలుగా ఉంటుంది. హెచ్ఎస్వి 1: ఇది నోటి దగ్గర పొక్కుల రూపంలో బయటపడుతుంది. పెదవుల చుట్టూ తెల్లని నీటిపొక్కులలాగా వస్తాయి. ఇది తల్లిదండ్రులు, తోటి పిల్లల నుంచి వ్యాపిస్తుంది. తరచు వచ్చిపోతుంటుంది. హెచ్ఎస్వి 2: జననావయవాల దగ్గర బయటపడే దీన్ని జెనిటల్ హెర్పిస్ అని అంటారు. ఇది నిత్యం వేధించే లైంగిక సమస్య. హెర్పిస్ వైరస్ పురుషుల నుంచి స్త్రీలకు, స్త్రీల నుంచి పురుషులకు లైంగికంగా కలయిక సమయంలో వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ వెన్నెముక చివరిభాగం శాక్రమ్ చుట్టూ ఉండే నాడుల సముదాయంలో చేరి అక్కడ నిద్రావస్థలో ఉండిపోతుంది. ఈ నిద్రాణస్థితిలో ఎలాంటి లక్షణాలు చూపించకుండా అవసరమైనపుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంది. గుర్తుపట్టడం ఎలా? తొలిదశలో జననాంగాల్లో మంట, నొప్పి, మూత్రంలో దురద, జ్వరం వచ్చినట్లుగా ఉంటుంది. ఒళ్లునొప్పులు, గజ్జలలో, చంకలలో గడ్డలు కట్టినట్లుగా ఉంటుంది. తరువాత క్రమంగా జననాంగాల వద్ద చిన్న చిన్న నీటిపొక్కులు కనిపించి, రెండు మూడు రోజులలో పగిలి పుండ్లలాగా తయారవుతాయి. ఈ దశలోనే రోగికి సమస్య వచ్చినట్లు తెలుస్తుంది. తొలిసారి లక్షణాలు కనిపించినపుడు సరియైన చికిత్స తీసుకుంటే ప్రారంభదశలోనే తగ్గిపోతుంది. కానీ చాలామందిలో వైరస్ ఉండిపోవడం వల్ల నిదానంగా ఉంటూ తిరిగి బయటపడుతూ ఉంటుంది. దీన్ని హెర్పిస్ రికరెంట్ అటాక్ అని అంటారు. నిర్ధారణ ఎలా? అపరిచిత వ్యక్తులతో లైంగిక సంపర్కం తరువాత వారం రోజులలో నీటి పొక్కులలా పుండ్లు కనిపిస్తాయి. కొన్నిరోజుల తరువాత మానిపోయి తిరిగి వస్తుంటాయి. దీన్ని బట్టి హెర్పిస్ని గుర్తించవచ్చు. పీసీఆర్ టెస్ట్, హెచ్ఎస్వి. 1, 2 ఐజీజీ, ఐజీఎమ్ పరీక్షలు ఉపయోగపడతాయి. పుండ్ల దగ్గర ఉండే స్రావాలను సేకరించి చేసే కల్చర్ టెస్ట్, డీఎన్ఏ టెస్ట్, యూరిన్ టెస్ట్ మొదలైనవి వ్యాధి నిర్ధారణకు ఉపకరిస్తాయి. కాంప్లికేషన్స్ హెర్పిస్ ఎక్కువగా స్త్రీలను బాధిస్తుంది. గర్భిణుల్లో మొదటినెలలో హెర్పిస్ వస్తే గర్భస్రావానికి అవకాశాలు ఎక్కువ. ప్రసవ సమయంలో హెర్పిస్ ఉంటే పిల్లలకు వచ్చే ప్రమాదం ఉంది. దీనిని నియోనాటల్ హెర్పిస్ అంటారు. శరీరంలో హెర్పిస్ ఉంటే చర్మం మీద దద్దుర్లు. అలర్జీలాంటి సమస్యలు; వెన్నెముకలోని నాడీమండలానికి హెర్పిస్ వస్తే అంగస్తంభన సమస్యలు; కొందరిలో నాడీమండలానికి హెర్పిస్ వస్తే మెదడులో మెనింజైటిస్ రావచ్చు. హోమియో చికిత్స హెర్పిస్ సింప్లెక్స్ వంటి లైంగిక వ్యాధుల నివారణకు హోమియో చికిత్స అద్భుతంగా పనిచేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా రోగనివారణకు అవకాశం ఏర్పడుతుంది. హెర్పిస్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపించినపుడు శృంగారానికి దూరంగా ఉండాలి. వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. హెర్పిస్ ఉన్నవారు కండోమ్ ఉపయోగిస్తే మంచిది. అనుభజ్ఞులైన హోమియో వైద్యుని దగ్గర చికిత్స తీసుకుంటే హెర్పిస్ వ్యాధిని సమూలంగా తరిమేయవచ్చు. డాక్టర్ రవికిరణ్, ఎం.డి. ప్రముఖ హోమియో వైద్యనిపుణులు మాస్టర్స్ హోమియోపతి, అమీర్‌పేట, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, హైదరాబాద్, విజయవాడ ph: 7842 108 108 / 7569 108 108