సైనసైటిస్‌కు ఆపరేషన్ లేకుండా... అలర్జీ, ఆస్తమాలకు హోమియో చికిత్స | homeo treatment for allergy and asthama | Sakshi
Sakshi News home page

సైనసైటిస్‌కు ఆపరేషన్ లేకుండా... అలర్జీ, ఆస్తమాలకు హోమియో చికిత్స

Published Thu, Oct 10 2013 11:41 PM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM

సైనసైటిస్‌కు ఆపరేషన్ లేకుండా... అలర్జీ, ఆస్తమాలకు హోమియో చికిత్స

సైనసైటిస్‌కు ఆపరేషన్ లేకుండా... అలర్జీ, ఆస్తమాలకు హోమియో చికిత్స

మానవ శరీరం ఒక అద్భుతం. శరీరంలోకి ఎలాంటి బయటి పదార్థాలు, క్రిములు వచ్చినా వాటిని ఎదుర్కొని పోరాడేలా దేవుడు దానిని నిర్మించాడు. దీనినే మనం ‘ఇమ్యూనిటీ’ లేదా రోగ నిరోధక వ్యవస్థ అంటారు. దీని వలన మన శరీరంలోనికి గాలి ద్వారా, నీటిద్వారా, ఆహారం ద్వారా ఎలాంటి ప్రతికూల పదార్థాలు; బాక్టీరియా, వైరస్ ఫారెన్ ప్రొటీన్‌లు వచ్చినా తెల్లరక్తకణాలు వాటితో పోరాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే కొంతమందిలో ఈ వ్యాధినిరోధక వ్యవస్థ ఇతరులకు ఎలాంటి హాని కలిగించని పదార్థాల వలన కూడా సున్నితంగా ప్రతిస్పందిస్తుంది. దీనినే ‘హైపర్ సెన్సిటివిటీ’’ లేదా ‘‘అలర్జీ’’ అని అంటారు.
 
 గాలిలో దుమ్ము, పుప్పొడి వంటివి ఉన్నప్పుడు అలర్జీతో బాధపడేవారికి ఇక అదే పనిగా వరుసబెట్టి తుమ్ములు వస్తాయి. ఆ తర్వాత ముక్కు ఎరుపెక్కి జలుబు చేసి. పల్చని నీరులా స్రవిస్తుంది. దానితో పాటు కళ్ళు ఎరుపెక్కి కళ్ళ నుండి నీరు కారుతుంది. దీనిని అశ్రద్ధ చేసినట్లయితే ముక్కు దిబ్బడ, గాలి సరిగ్గా ఆడకపోవడం, గొంతులోనికి కళ్లె వస్తూ ఉండడం, ముఖం లోపలిభాగంలో నొప్పి, తలనొప్పి మొదలైతే ‘‘అలర్జిక్ సైనసైటిస్’’ అని; గాలి గొట్టాలలోనికి, ఊపిరితిత్తులకు సోకి పొడి దగ్గు, కళ్లెతో కూడిన దగ్గు మొదలైతే ‘‘అలర్జిక్ బ్రాంకైటిస్’’ అని; ఆయాసం, ఎగపోయడం, పిల్లికూతలు వంటి లక్షణాలు కన్పిస్తే ‘‘అలర్జిక్ ఆస్థ్మా’’ అని అంటారు.
 
 కొంతమందికి వంకాయ, మునక్కాయ, పల్లీలు వంటి ఆహార పదార్థాలు తినగానే శరీరంపైన దద్దుర్లు మాదిరిగా ఎర్రగా, ఉబ్బెత్తుగా, తీవ్రమైన దురద వస్తాయి. ఈ ర్యాష్ 24 గంటల్లో తగ్గుతుంది. కొంతమందిలో లేటెక్స్ సంబంధిత వస్తువులు తగిలిన స్థలాల్లో చర్మంపై పొక్కులు వస్తాయి. దీనిని ‘‘అలర్జిక్ డెర్మటైటస్’’ అని అంటారు.
 
 అలర్జీలలో అనేక రకాలు ఉన్నప్పటికి ఎక్కువమందిలో కనబడేవి శ్వాసకోశ సంబంధిత అలర్జీలు, అనగా రైనైటిస్, సైనసైటిస్, బ్రాంకైటిస్ మరియు బ్రాంక్రియల్ ఆస్థ్మా, శ్వాసకోశ సంబంధిత అలర్జీలను కలిగించే వాటిలో ప్రధానమైనవి -  పుప్పొడి, దుమ్ములో ఉండే క్రిములు, మోల్డ్, బొద్దింకలు, పశువుల పేడ మొదలైనవి. కొంతమందికి పూలవాసన, ఫెర్‌ఫ్యూమ్స్, కూరపోపు లాంటివి కూడా పడవు. అలర్జీతో బాధపడేవారిలో ఏదో ఒక ప్రత్యేకమైన పదార్థానికి దగ్గరగా వచ్చినప్పుడు శరీరంలో, రక్తంలో ఉండే ఇమ్యునోగ్లోబ్యులిన్-ఇ (ఐజ్ఛ) అనే యాంటీబాడీతో అలర్జీన్ కలవడం వలన హిస్టమిన్ విడుదలవుతుంది. దీని వలనే ఈ లక్షణాలు ప్రారంభమవుతాయి.
 
 సాధారణంగా వాడే యాంటీ-హిస్టమిన్ మందుల వలన వ్యాధి లక్షణాల నుండి తాత్కాలిక ఉపశమనం లభించవచ్చు కానీ శరీరంలోని ‘‘ఏటీపీ’’ తత్వాన్ని, వ్యాధి నిరోధక వ్యవస్థలోని సున్నితత్వాన్ని అవి తొలగించలేవు. కాబట్టి సమస్య దీర్ఘకాలంగా కొనసాగుతూ ఉంటుంది. అయితే శరీర తత్వాన్ని బట్టి సూచించే హోమియోపతి మందు వలన ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండా ఎంత దీర్ఘకాలంగా ఉన్న అలర్జీ సమస్యలకైనా చక్కని ఉపశమనం పొందవచ్చు. చికిత్స సమయంలో ప్రాధమిక దశలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
 
 వాతావరణం మార్పు ఉన్నప్పుడు, సంధికాలంలో, పుప్పొడి ఎక్కువగా విడుదలయ్యే సమయాలలో సాధ్యమైనంత వరకు బయటికి రాకూడదు
 
 = దుమ్ములో వెళ్లేటప్పుడు విధిగా క్యాప్ మరియు మాస్క్ వాడాలి
 
 =ఇంట్లో గదులలో దుమ్ము, ధూళి క్రమంగా శుభ్రం చేయించుకోవాలి.
 
 =పెంపుడు జంతువులు ఉన్నట్లయితే ఇంటి బయట ఉంచడం మంచిది.
 
 =బెడ్ షీట్స్, పిల్లోకవర్స్ తరచుగా మారుస్తుండాలి.
 
 =ఇంటిలో తేమశాతం తక్కువగా ఉండేటట్లుగా చూసుకోవాలి.
 
 =ఒత్తిడిని తగ్గించుకొని మంచి విశ్రాంతి తీసుకోవాలి. ఇలా కొంత కాలం జాగ్రత్తలు పాటిస్తూ హోమియోపతి మందులు వాడినట్లైతే తర్వాత వ్యాధినిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి పదార్థాలు ఎదురైనా ఎలాంటి సమస్య ఉండదు.
 

 
 డా॥టి. కిరణ్‌కుమార్
 పాజిటివ్ హోమియోపతి
 అపాయింట్‌మెంట్ కొరకు 9246199922
 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ,
 వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై
 www.positivehomeopathy.com

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement