White blood cells
-
ప్రాణాంతక డెంగీ: ప్లేట్లెట్స్ తగ్గేదెప్పుడో తెలుసా.. ఎన్ని ఉండాలి?
గత కొద్దిరోజులుగా డెంగీ వ్యాధి విపరీతంగా విస్తరిస్తోంది. డెంగీ వైరస్ సోకిన కొందరిలో ప్లేట్లెట్ల సంఖ్య వేగంగా తగ్గిపోతుంటుందన్న విషయం తెలిసిందే. ఇది ప్రాణాలకు అపాయం తెచ్చే పరిస్థితి. ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో రక్తదానం చేసేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. కానీ డెంగీ పెచ్చరిల్లుతున్న ఈ సమయంలో ప్లేట్లెట్లు ఇవ్వడం చాలా మంది ప్రాణాలను కాపాడుతుంది. డెంగీ రోగుల్లో ప్లేట్లెట్ల ఆవశ్యకత, వాటిని ప్రదానం చేయాల్సిన అవసరం తెలిపే కథనమిది. ప్లేట్లెట్స్ తగ్గేదెప్పుడు? అప్లాస్టిక్ అనీమియా, కొన్ని రకాల రక్తపు క్యాన్సర్ల (లుకేమియా)లో, బాగా ముదిరిపోయిన లింఫోమా లాంటి క్యాన్సర్లతో పాటు దానికి వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లలో మూలుగ దెబ్బతినే అవకాశలున్నాయి. ఇలాంటి సమయాల్లో తెల్ల రక్త కణాలతో పాటు ప్లేట్లెట్స్ కౌంట్ కూడా పడిపోవచ్చు. అలాగే అనేక వైరల్ జబ్బులతో పాటు ముఖ్యంగా డెంగీలో ప్లేట్లెట్స్ సంఖ్య బాగా తగ్గిపోవచ్చు. ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు బాధితుడికి రక్తస్రావం లేదా దేహంలోనే అంతర్గత రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించకపోతే ప్రాణాలకే ప్రమాదం. చదవండి: భోజనం తర్వాత ప్రతిసారీ టూత్‌పిక్ వాడుతున్నారా? ఎక్కించాల్సిందెప్పుడు? సాధారణంగా ప్లేట్లెట్ల సంఖ్య నాలుగు లక్షల నుంచి 80,000 వరకు పడిపోయినా ఎలాంటి ఆపద రాదు. కానీ అవి 20,000 కంటే తక్కువకు పడిపోయినప్పుడు బాధితుడు ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్తాడు. అప్పుడు ఏ చిన్నపాటి గాయమైనా అది చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అప్పుడు ప్లేట్‌లెట్స్‌ను ఎక్కించడం అవసరమవుతుంది. చూడ్డానికి రక్తమంతా ఒకే ద్రవంలా (యూనీఫామ్గా) కనిపిస్తుంటుందిగానీ.. అందులో ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్లెట్స్, ప్లాస్మాతో పాటు చాలా ప్రోటీన్లు వంటి అంశాలుంటాయన్నది తెలిసిందే. అందులో ప్లేట్లెట్లు కూడా చాలా కీలకమైనవే. ఇవి గాయాలైనప్పుడు లేదా ఇతరత్రా కొన్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లో రక్తాన్ని గడ్డకట్టేలా చేసి, రక్తస్రావాన్ని నివారించి ప్రాణాలు కాపాడుతుంటాయి. ఎలా ఎక్కిస్తారు? చదవండి: కోవిడ్ తర్వాత వాకింగ్ బెటరా? జాగింగ్ బెటరా?.. క్యాలరీల ఖర్చు ఎలా? కౌంట్ తక్కువగా ఉన్నవారికి ప్లేట్లెట్స్ ఎక్కించడం (ట్రాన్స్ఫ్యూజన్) రెండు రకాలుగా జరుగుతుంది. అవి... 1. ఆర్.డి.పి. (ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్) 2. ఎస్.డి.పి. (సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్) బ్లడ్‌బ్యాంకుల్లో అనేక మంది దాతలు ఇచ్చిన రక్తాన్ని సేకరిస్తుంటారు. ఇందులోంచి రక్తంలో ఉండే ప్రధానమైన మూడు రకాల అంశాలను వేరుచేస్తారు. అంటే ఎర్రరక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ను విడదీసి వేటికవి ప్యాక్ చేస్తారు. ఇలా చేయడం వల్ల... రక్తహీనత (అనీమియా) మాత్రమే ఉన్న రోగులకు ఎర్రరక్తకణాలు ఎక్కించడం, ప్లాస్మా మాత్రమే అవసరమైన రోగులకు దాన్ని ఇవ్వడం, ప్లేట్లెట్స్ తగ్గినవారికి అవి మాత్రమే ఇవ్వడం ద్వారా ఒకే యూనిట్ బ్లడ్తో ముగ్గురికి ప్రాణాపాయం తప్పించవచ్చు. ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ : బ్లడ్‌బ్యాంకుల్లో అనేక మంది అనేక మంది దాతల నుంచి రక్తాన్ని సేకరిస్తుంటారు. అందువల్ల ఏ రక్తం ఎవరిదన్న విషయం తెలియదు. అందుకే ఇలా సేకరించిన ప్లేట్లెట్లను ‘ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్’ (ఆర్డీపీ)గా చెబుతారు. ‘ఆర్డీపీ’ని ఎక్కించినప్పుడు పేషెంట్లో 5,000 వరకు మాత్రమే కౌంట్ పెరుగుతుంది. కానీ సురక్షితమైన స్థాయికి ప్లేట్లెట్లను పెంచాలంటే, కౌంట్ కనీసం 25,000 నుంచి 30,000 ఉండాలి. ఇందుకోసం ‘ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్’ ప్రక్రియలో కనీసం 5 నుంచి 6 యూనిట్ల రక్తం అవసరమవుతుంది. అంటే ఒకరికి అవసరమైన ప్లేట్లెట్లను సేకరించాలంటే కనీసం ఐదారుగురు దాతలు కావాలి. కొందరు రోగుల్లో వారి వ్యాధిని బట్టి నాలుగైదు మార్లు ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి రావచ్చు. అంటే పేషెంట్‌కు కావాల్సిన ప్లేట్లెట్స్ అందాలంటే కనీసం 30 మంది దాతలు కావాలి. అంతమంది దాతలు దొరకడం చాలా కష్టం. సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ : వైద్యరంగంలో ఇప్పుడున్న ఆధునిక సాంకేతికత సహాయంతో ఒక్క దాత నుంచే అవసరమైన పరిమాణంలో ప్లేట్లెట్స్ సేకరించవచ్చు. ఇలా చేసేప్పుడు రక్తంలోని ఇతర అంశాలను కాకుండా కేవలం ప్లేట్లెట్స్ మాత్రమే సేకరిస్తారు. ఇలా సేకరించేవాటిని ‘సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్’ (ఎస్డీపీ) అంటారు. ఈ ప్రక్రియలో ఒకే దాత... బాధితుడికి అవసరమైనన్ని అంటే... దాదాపు 30,000 ప్లేట్లెట్ కౌంట్ సమకూరేలా వాటిని దానం చేస్తాడు. దానివల్ల దాతకు ఎలాంటి నష్టమూ ఉండదు. కేవలం నాలుగురోజుల్లోనే దాత రక్తంలోకి అవి తిరిగి భర్తీ అవుతాయి. అంతేకాదు.. మళ్లీ ఎవరికైనా అవసరమైతే.. అదే దాత కేవలం 10 రోజుల తర్వాత మళ్లీ ప్లేట్లెట్స్ దానం చేయవచ్చు. అలాకాకుండా, మొత్తం రక్తదానం చేసినప్పుడు... ఆ రక్తమంతా భర్తీ కావడానికి కనీసం మూడు నెలల వ్యవధి అవసరం. అందుకే ప్లేట్లెట్స్ అవసరమైనప్పుడు దాతలు ఎలాంటి అపోహలకు తావులేకుండా ప్రతి పదిరోజులకోమారు కూడా ప్లేట్‌లెట్స్‌ను నిరభ్యంతరంగా దానం ఇవ్వవచ్చు. పైగా ఇటీవలి కాలంలో ఇది చాలామంది ప్రాణాలు కాపాడుతూ పలువురికి మేలు చేస్తుంది. ఎక్కడ, ఎలా పుడతాయి? ప్లేట్లెట్స్ ఎముక మూలుగ నుంచి పుడతాయి. వీటి జీవిత కాలం కేవలం నాలుగు రోజులు మాత్రమే. సాధారణంగా ఎముక మూలుగలో ఏదైనా సమస్య వస్తే ప్లేట్లెట్స్ ఉత్పత్తి తగ్గుతుంది. రక్తంలో వీటి సంఖ్య తగ్గినప్పుడు రక్తం గడ్డకట్టే మన స్వాభావిక రక్షణ ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. ఎన్ని ఉండాలి? ఆరోగ్యవంతుడైన ఓ వ్యక్తిలో క్యూబిక్ మిల్లీమీటర్ పరిమాణంలో 1.5 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్లెట్స్ ఉండాలి. ఇది నార్మల్ కొలత. వీటి సంఖ్యను ‘సెల్ కౌల్టర్ మెషిన్’ అనే యంత్రం ద్వారా కొలుస్తారు. ప్లేట్లెట్ కౌంట్ కోసం 2 – 3 ఎమ్ఎల్ రక్తాన్ని సేకరిస్తారు. డెంగీవ్యాధిగ్రస్తుల్లో ప్లేట్లెట్ కౌంట్ తెలుసుకోవడం కోసం ప్రతి 24 గంటలకోమారు రక్తపరీక్ష నిర్వహిస్తుండాలి. ఎలా పనిచేస్తాయి? రక్తం గడ్డకట్టే జీవక్రియల్లో ప్లేట్‌లెట్స్‌లోని అనేక ప్రోటీన్లు పాలు పంచుకుంటాయి. వీటిని ‘క్లాటింగ్ ఫ్యాక్టర్స్’ అంటారు. ఇవన్నీ ఒక వలలా ఏర్పడి రక్తం ప్రవహించకుండా ఓ అడ్డుకట్ట వేస్తాయి. గాయం అయ్యాక కేవలం 2, 3 నిమిషాల్లోనే ఈ వల ఓ ఆనకట్టలా ఏర్పడుతుంది. -
మంచి నిద్రతో ఆరోగ్యం.. కారణం తెలిసింది!
కంటి నిండా నిద్రపోవడం ఆరోగ్యానికి మేలన్నది చాలాకాలంగా తెలిసిన విషయమే. కారణమేమిటన్నది మాత్రం తెలియదు. ఈ లోటును భర్తీ చేశారు మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల ద్వారా, నిద్రలేమికి – ఎముక మజ్జలో తెల్లరక్తకణాల ఉత్పత్తికి మధ్య సంబంధం ఉందని గుర్తించామని ఫిలిప్ స్విర్స్కీ అనే శాస్త్రవేత్త తెలిపారు. తెల్ల రక్తకణాలు శరీరంలో మంట/వాపులకు కారణమవుతున్నట్లు తెలిసిందని చెప్పారు. అంతేకాకుండా మనం మెలకువగా ఉండేందుకు ఉపయోగపడే మెదడులోని ఒక రసాయనం కూడా తెల్ల రక్త కణాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. నిద్రలేమికి – రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెజబ్బులు వచ్చేందుకు మధ్య సంబంధాలను తెలుసుకునేందుకు తాము ఎలుకలపై ప్రయోగాలు చేశామని చెప్పారు. తరచూ నిద్రాభంగానికి గురయ్యే ఎలుకల రక్తనాళాలల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతున్నట్లు, బరువు, కొలెస్ట్రాల్, రక్తంలో గ్లూకోజ్ మోతాదులతో సంబంధం లేకుండా ఇది జరుగుతున్నట్లు స్పష్టమైందని ఫిలిప్ వివరించారు. దీంతోపాటు నిద్ర తక్కువైన ఎలుకల్లో తెల్ల రక్తకణాల ఉత్పత్తికి కారణమవుతున్న మూలకణాలు రెట్టింపు సంఖ్యలో ఉన్నాయని, మెదడులోని హైపోక్రెటిన్ రసాయనం కూడా తక్కువైనట్లు తెలిసిందని చెప్పారు. గుండెజబ్బుల నివారణకు మరింత సమర్థమైన చికిత్స అందించేందుకు ఈ ప్రయోగం తోడ్పడుతుందని అంచనా. -
ఈ లుకేమియా గురించి తెలుసుకోండి...
తెల్లరక్తకణాలు సైనికుల్లాగా మన దేహాన్ని కాపాడుతుంటాయి. అవన్నీ మన ఎముకలోని మూలగలో పుడుతుంటాయి. ఇలా పుట్టే క్రమంలో ఒక కణం రెండు కావాలి. ఆ రెండూ మళ్లీ మరో రెండుగా మారాలి. ఇదీ దేహధర్మం. విభజనలో కణాల పాటించాల్సిన ధర్మం ఇది. అయితే లుకేమియా వచ్చినప్పుడు మాత్రం ఒకటి రెండు కావాల్సినవి కాస్తా... వందలవుతాయి. దాంతో దేహంలో 5,000 నుంచి 11,000 ఉండాల్సిన తెల్లరక్తకణాలు కాస్తా ఒక లక్షా, రెండు లక్షలకు పెరుగుతాయి. ఇది రక్తానికి వచ్చే ఒక క్యాన్సర్. ఈ క్యాన్సర్‌నే లుకేమియా అంటారు. లుకేమియాలో రెండు రకాలు... ఈ లూకేమియాలో రెండు రకాలు ఉంటాయి. మొదటిది అక్యూట్ లుకేమియా. అంటే ఇందులో కణాల విభజన తక్షణం కనిపిస్తుంది. లక్షణాలు వెంటనే బయటపడతాయి. అంటే కణవిభజన చాలా వేగంగా త్వరత్వరగా జరుగుతుంది. క్రానిక్ లుకేమియాలో ఒక రకం క్రానిక్ మైలాయిడ్ లుకేమియా. ఇది దీర్ఘకాలిక క్యాన్సర్. చాలాకాలం పాటు ఈ క్యాన్సర్ ఉంటుంది. ఇది మెల్లగా పెరుగుతుంది. రక్తానికి సంబంధించిన ఈ క్రానిక్ మైలాయిడ్ లుకేమియా వ్యాధిపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. ఈరోజే ఎందుకు...? ఈ రోజును ‘సీఎమ్‌ఎల్–డే’ గా నిర్ణయించడానికి ఒక కారణం ఉంది. ఈ కారణాన్ని తెలుసుకోవాలంటే నిజానికి సీఎమ్‌ఎల్ ఎలా వస్తుందో, అలా రావడానికి దేహంలో ఎలాంటి ప్రక్రియలు జరుగుతాయో కాస్త అర్థం చేసుకోవాలి. మన ఒంట్లో నిత్యం రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. రక్తంలో అనేక రకాల అంశాలు ఉన్నప్పటికీ ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్స్‌లెట్స్ అనేవి చాలా ప్రధానమైనవి. ఇందులో తెల్లరక్తకణాలు మన దేహంలో రక్షణ కల్పించే సైనికుల భూమిక నిర్వహిస్తాయి. ఇవి మన ఒంట్లోకి ప్రవేశించే అనేక హానికారక సూక్ష్మజీవులు, వాటి వల్ల వచ్చే వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటాయి. ఇవి ఎముక మధ్య భారంలో ఉండే మూలుగ/మజ్జలో నిత్యం పుడుతూ ఉంటాయి. పాతవి నశిస్తూ... వాటి స్థానంలో కొత్తవి పుడుతూ ఉండటం వల్ల వాటి సంఖ్య ఎప్పుడూ తక్కువలో తక్కువ 5,000 నుంచి గరిష్టంగా 11,000 వరకు ఉండాల్సిన వాటి సంఖ్య అపరిమితంగా పెరిగి దాదాపు రెండు లక్షలకు చేరుకుంటుంది. అలాంటప్పుడు అవి వాటి రక్షణ బాధ్యతలు నిర్వహించకపోవడంతో తరచూ ఇన్ఫెక్షన్లు సోకడం, జ్వరాలు రావడం జరుగుతుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం. మనిషిలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. అంటే... మొత్తం 46 అన్నమాట. ఆ క్రోమోజోముల్లోని 9వ, 22వ క్రోమోజోముల్లో తేడాలు వస్తాయి. అంటే తొమ్మిదో క్రోమోజోములోని కొంత భాగం 23వ క్రోమోజోముకూ, అదే విధంగా 23వ క్రోమోజోములోని మరికొంత భాగం 9వ క్రోమోజోముకు వెళ్తాయి. దీన్నే క్రోమోజోమల్ ట్రాన్స్‌లొకేషన్ అంటారు. ఈ ట్రాన్స్‌లొకేషన్ కారణంగా ‘ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ అనేది çరూపొందుతుంది. (అమెరికన్ పద్ధతిలో చెబితే) ఈ రోజు తేదీ 9 / 22 కాబట్టి... ఈ క్రోమోజోమల్ మార్పునూ 9 : 22 అంటారు కాబట్టి ఈ తేదీని ‘క్రానిక్ మైలాయిడ్ లుకేమియా’ డే గా చెబుతారు. ప్రతి ఏడాదీ ఈ తేదిని క్రానిక్ మైలాయిడ్ లుకేమియా (సీఎమ్‌ఎల్) అవగాహన దినంగా వ్యవహిరిస్తుంటారు. లక్షణాలు: సీఎమ్‌ఎల్ వచ్చిన రోగుల్లో అన్ని వయసులో వారు ఉంటారు. ముఖ్యంగా పెద్దల్లో ఇది 50, 60 ఏళ్లు దాటిన వారిలో కనిపించడం సహజమే అయినా చిన్న పిల్లల్లోనూ ఇది చాలా సాధారణం. చిన్న పిల్లల్లో వచ్చే క్యాన్సర్లలో లుకేమియాలే ఎక్కువ. చిన్నపిల్లల్లో వచ్చే సీఎమ్ఎల్ను జువెనైల్ లుకేమియా అంటారు. ఇది వచ్చిన వారిలో తెల్లరక్తకణాలు సరిగా పనిచేయకపోవడంతో తరచూ ఇన్ఫెక్షన్లు సోకడం, జ్వరం రావడం, నిస్సత్తువగా, నీరసంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక పిల్లల్లోనైతే వారు పాలిపోయినట్లుగా ఉండటం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, నీరసం, అలసట ఎక్కువగా ఉండటం, త్వరగా చర్మం కమిలిపోవడం, మచ్చలుమచ్చలుగా ఉండటం, తీవ్రమైన రక్తస్రావం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే లుకేమియాను అనుమానించాల్సి ఉంటుంది. నిర్ధారణ పరీక్షలు: సాధారణంగా జ్వరం లేదా ఇన్ఫెక్షన్లు మాటిమాటికీ వస్తున్నప్పుడు చేయించే సాధారణ రక్తపరీక్షలోనే (పెరిఫెరల్ స్మియర్) అసాధారణంగా పెరిగిపోయిన తెల్లరక్తకణాల సంఖ్య (కౌంట్)తో ఇది బయట పడుతుంది. కొన్నిసార్లయితే జనరల్ చెకప్‌లో భాగంగా చేయించిన రక్తపరీక్షలలో బయటపడవచ్చు. అప్పుడు నిర్ధారణ కోసం బోన్ మ్యారో పరీక్ష అనే నిర్దిష్టమైన పరీక్ష చేయించాలి. సైటోజెనిక్ టెస్ట్‌గా పేర్కొనే ఆ పరీక్షలో మూలకణంలో వచ్చిన మార్పుల కారణంగా రూపొందిన ‘ఫిలడెల్ఫియా క్రోమోజోమ్’ ఉనికితో సీఎమ్ఎల్ను నిర్ధారణ చేయడం జరుగుతుంది. దశలు: తీవ్రతను అనుసరించి ఇందులో స్టేజ్–1, స్టేజ్–2, స్టేజ్–3 అనే దశలు ఉంటాయి. మొదటిదాన్ని క్రానిక్ దశ అని, రెండో దశను యాక్సిలరేటెడ్ దశ అని, మూడోదాన్ని బ్లాస్ట్ క్రైసిస్ అని అంటారు. అయితే ఇటీవల స్టేజ్–1లోనే చాలా ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి. పైగా ఈ దశలో కనుకొన్నప్పుడు దాని నియంత్రించడం కూడా తేలిక. చికిత్స: ఒకప్పుడు అంటే... 1990లలో క్రానిక్ మైలాయిడ్ లుకేమియా వస్తే గరిష్ఠ ఆయుఃప్రమాణం ఐదేళ్లు, బతికి బయటపడేవారు కేవలం 30% మాత్రమే ఉండేది. కానీ 1990లలో వచ్చిన ఇమాటనిబ్ మిసైలేట్ అనే ఒకే ఒక టాబ్లెట్‌తో దీన్ని చాలా సమర్థంగా అదుపు చేయవచ్చు. దాంతో ఇప్పుడు ఈ జబ్బు వచ్చిన ప్రతివారు దాదాపుగా నార్మల్ వ్యక్తిలాంటి ఆయుప్రమాణం తోనే జీవించవచ్చు. ఫలితంగా ఇప్పుడు బతికి బయటపడేవారు దాదాపు 80% – 90% వరకు ఉంటున్నారు. అయితే ఈ ఇమాటనిబ్ మిసైలేట్ అనే మాత్రతో జబ్బు పూర్తిగా నయం కాదు... కానీ అదుపులో ఉండి, వ్యక్తులు సాధారణ ప్రజల్లాగే నాణ్యమైన జీవితం గడపగలుగుతారు. అయితే జబ్బు పూర్తిగా లేకుండా పోవాలంటే మాత్రం ‘బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేన్’ చేయించాలి. కానీ ఇటీవల కేవలం మాత్రలతోనే జబ్బు ఎప్పటికీ నియంత్రణలో ఉండటం వల్లనూ, అనేక స్వచ్ఛంద సేవా సంస్థలతో పాటు ఆరోగ్యశ్రీ లోనూ ఇవి ఉచితంగా లభిస్తూ ఉండటం వల్ల ఇమాటనిబ్ మిసైలేట్ను వాడుతూ వ్యాధిని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవడమే జరుగుతోంది. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి, ఎండీ,, డీఎమ్, మెడికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, కర్నూలు. ఫోన్ నెం. 08518273001 నుంచి 008 వరకు -
అయ్యో పాపం
పశ్చిమగోదావరి, తాళ్లపూడి: ముద్దులొలికే వయసులో ఓ చిన్నారికి పెద్ద కష్టం వచ్చింది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబం పాపకు వైద్యం చేయించే స్తోమత లేక కుమిలిపోతున్నారు. మనసున్న మారాజుల చేయూత కోసం అర్థిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ప్రక్కిలంక గ్రామానికి చెందిన అనుపోజు కిరణ్మయి కుమార్తె లక్ష్మీప్రసన్నకు నాలుగు సంవత్సరాల వయస్సు. ఇటీవల పాపకు ఆనారోగ్యంగా ఉండడంతో రాజమండ్రిలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అన్ని రకాల పరీక్షలు చేసిన వైద్యులు పాపకు తెల్లరక్త కణాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. రోజురోజుకు రక్తంలో ఇన్ఫెక్షన్ పెరిగిపోతుందని చెప్పారు. శరీరంలో రక్తం మొత్తం మార్చాలని చెప్పారని తల్లి కిరణ్మయి వాపోయారు. సుమారు రూ.రెండు లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. ఆర్థికంగా వైద్యం చేయించే స్తోమత లేని ఈ కుటుంబం దాతల ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. సహాయం చేయదలచుకున్న దాతలు సెల్ : 9642081287నంబరులో తెలియజేయాలని కోరారు. -
సైనసైటిస్‌కు ఆపరేషన్ లేకుండా... అలర్జీ, ఆస్తమాలకు హోమియో చికిత్స
మానవ శరీరం ఒక అద్భుతం. శరీరంలోకి ఎలాంటి బయటి పదార్థాలు, క్రిములు వచ్చినా వాటిని ఎదుర్కొని పోరాడేలా దేవుడు దానిని నిర్మించాడు. దీనినే మనం ‘ఇమ్యూనిటీ’ లేదా రోగ నిరోధక వ్యవస్థ అంటారు. దీని వలన మన శరీరంలోనికి గాలి ద్వారా, నీటిద్వారా, ఆహారం ద్వారా ఎలాంటి ప్రతికూల పదార్థాలు; బాక్టీరియా, వైరస్ ఫారెన్ ప్రొటీన్లు వచ్చినా తెల్లరక్తకణాలు వాటితో పోరాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే కొంతమందిలో ఈ వ్యాధినిరోధక వ్యవస్థ ఇతరులకు ఎలాంటి హాని కలిగించని పదార్థాల వలన కూడా సున్నితంగా ప్రతిస్పందిస్తుంది. దీనినే ‘హైపర్ సెన్సిటివిటీ’’ లేదా ‘‘అలర్జీ’’ అని అంటారు. గాలిలో దుమ్ము, పుప్పొడి వంటివి ఉన్నప్పుడు అలర్జీతో బాధపడేవారికి ఇక అదే పనిగా వరుసబెట్టి తుమ్ములు వస్తాయి. ఆ తర్వాత ముక్కు ఎరుపెక్కి జలుబు చేసి. పల్చని నీరులా స్రవిస్తుంది. దానితో పాటు కళ్ళు ఎరుపెక్కి కళ్ళ నుండి నీరు కారుతుంది. దీనిని అశ్రద్ధ చేసినట్లయితే ముక్కు దిబ్బడ, గాలి సరిగ్గా ఆడకపోవడం, గొంతులోనికి కళ్లె వస్తూ ఉండడం, ముఖం లోపలిభాగంలో నొప్పి, తలనొప్పి మొదలైతే ‘‘అలర్జిక్ సైనసైటిస్’’ అని; గాలి గొట్టాలలోనికి, ఊపిరితిత్తులకు సోకి పొడి దగ్గు, కళ్లెతో కూడిన దగ్గు మొదలైతే ‘‘అలర్జిక్ బ్రాంకైటిస్’’ అని; ఆయాసం, ఎగపోయడం, పిల్లికూతలు వంటి లక్షణాలు కన్పిస్తే ‘‘అలర్జిక్ ఆస్థ్మా’’ అని అంటారు. కొంతమందికి వంకాయ, మునక్కాయ, పల్లీలు వంటి ఆహార పదార్థాలు తినగానే శరీరంపైన దద్దుర్లు మాదిరిగా ఎర్రగా, ఉబ్బెత్తుగా, తీవ్రమైన దురద వస్తాయి. ఈ ర్యాష్ 24 గంటల్లో తగ్గుతుంది. కొంతమందిలో లేటెక్స్ సంబంధిత వస్తువులు తగిలిన స్థలాల్లో చర్మంపై పొక్కులు వస్తాయి. దీనిని ‘‘అలర్జిక్ డెర్మటైటస్’’ అని అంటారు. అలర్జీలలో అనేక రకాలు ఉన్నప్పటికి ఎక్కువమందిలో కనబడేవి శ్వాసకోశ సంబంధిత అలర్జీలు, అనగా రైనైటిస్, సైనసైటిస్, బ్రాంకైటిస్ మరియు బ్రాంక్రియల్ ఆస్థ్మా, శ్వాసకోశ సంబంధిత అలర్జీలను కలిగించే వాటిలో ప్రధానమైనవి - పుప్పొడి, దుమ్ములో ఉండే క్రిములు, మోల్డ్, బొద్దింకలు, పశువుల పేడ మొదలైనవి. కొంతమందికి పూలవాసన, ఫెర్ఫ్యూమ్స్, కూరపోపు లాంటివి కూడా పడవు. అలర్జీతో బాధపడేవారిలో ఏదో ఒక ప్రత్యేకమైన పదార్థానికి దగ్గరగా వచ్చినప్పుడు శరీరంలో, రక్తంలో ఉండే ఇమ్యునోగ్లోబ్యులిన్-ఇ (ఐజ్ఛ) అనే యాంటీబాడీతో అలర్జీన్ కలవడం వలన హిస్టమిన్ విడుదలవుతుంది. దీని వలనే ఈ లక్షణాలు ప్రారంభమవుతాయి. సాధారణంగా వాడే యాంటీ-హిస్టమిన్ మందుల వలన వ్యాధి లక్షణాల నుండి తాత్కాలిక ఉపశమనం లభించవచ్చు కానీ శరీరంలోని ‘‘ఏటీపీ’’ తత్వాన్ని, వ్యాధి నిరోధక వ్యవస్థలోని సున్నితత్వాన్ని అవి తొలగించలేవు. కాబట్టి సమస్య దీర్ఘకాలంగా కొనసాగుతూ ఉంటుంది. అయితే శరీర తత్వాన్ని బట్టి సూచించే హోమియోపతి మందు వలన ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండా ఎంత దీర్ఘకాలంగా ఉన్న అలర్జీ సమస్యలకైనా చక్కని ఉపశమనం పొందవచ్చు. చికిత్స సమయంలో ప్రాధమిక దశలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వాతావరణం మార్పు ఉన్నప్పుడు, సంధికాలంలో, పుప్పొడి ఎక్కువగా విడుదలయ్యే సమయాలలో సాధ్యమైనంత వరకు బయటికి రాకూడదు = దుమ్ములో వెళ్లేటప్పుడు విధిగా క్యాప్ మరియు మాస్క్ వాడాలి =ఇంట్లో గదులలో దుమ్ము, ధూళి క్రమంగా శుభ్రం చేయించుకోవాలి. =పెంపుడు జంతువులు ఉన్నట్లయితే ఇంటి బయట ఉంచడం మంచిది. =బెడ్ షీట్స్, పిల్లోకవర్స్ తరచుగా మారుస్తుండాలి. =ఇంటిలో తేమశాతం తక్కువగా ఉండేటట్లుగా చూసుకోవాలి. =ఒత్తిడిని తగ్గించుకొని మంచి విశ్రాంతి తీసుకోవాలి. ఇలా కొంత కాలం జాగ్రత్తలు పాటిస్తూ హోమియోపతి మందులు వాడినట్లైతే తర్వాత వ్యాధినిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి పదార్థాలు ఎదురైనా ఎలాంటి సమస్య ఉండదు. డా॥టి. కిరణ్‌కుమార్ పాజిటివ్ హోమియోపతి అపాయింట్మెంట్ కొరకు 9246199922 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై www.positivehomeopathy.com