చలిని తట్టుకోవడానికి ఈ సీజన్‌లో చేసే కొన్నిపనులు మేనిచర్మాన్ని దెబ్బతీసేలలలా ఉంటాయి. దురద, పొడిబారడం తోపాటు రకరకాల చర్మ సమస్యలు(Allergy) కనిపిస్తుంటాయి. వాటిలో ముఖ్యమైనవి...
ఫ్యాషన్ డ్రెస్సులు
ఈ సీజన్‌లో చలి నుంచి రక్షణగా స్వెటర్లు, మందపాటి క్లాత్స్, షాలువా.. వంటివి ధరిస్తూ ఉంటాం. ఎక్కువ గంటలు లేదా రాత్రి మొత్తం ఇలాంటి డ్రెస్సుల్లో ఉంటే చర్మం దురద పెడుతుంది. అందుకని, పలచటి కాటన్ డ్రెస్ వేసుకోవాలి.
కొన్ని డ్రెస్సులు(dresses) వార్డ్ రోబ్‌లలో నెలల పాటు అలాగే ఉండిపోతాయి. ఈ సీజన్‌కి అవి సరైన ఎంపిక అని, వాటిని శుభ్రం చేయకుండా అలాగే వేసుకుంటే బాక్టీరియా చర్మానికి హాని చేస్తుంది. అందుకని, వార్డ్‌రోబ్ నుంచి తీశాక వెంటనే వేసుకోకుండా వాటిని ఆరుబయట గాలికి, కొద్దిపాటి ఎండకు వేసి తర్వాత ధరించాలి. కనీసం కొద్దిసేపు గాలికి ఆరవేయాలి.
బిగుతుగా, మేని మొత్తం కవర్ చేసే దుస్తుల వల్ల బ్యాక్ యాక్నె పెరుగుతుంది. ఇలాంటప్పుడు ఎక్కువ గంటలు, బిగుతుగా ఉండే డ్రెస్సుల్లో ఉండకూడదు.
షూ(Shoe) వంటివి వేసుకున్నప్పుడు వాటిలో చెమ్మ ఏర్పడుతుంది. డ్రయ్యర్‌తో షూ లోపల మొత్తం చెమ్మ లేకుండా చేసి, తర్వాత వాడుకోవాలి.
స్కిన్ కేర్ ప్రొడక్ట్స్
ఈ కాలం చర్మం చాలా పొడిబారి ఉంటుంది. ఇలాంటప్పుడు స్క్రబ్, పీల్ చేయడం.. వంటి బ్యూటీ ట్రీట్‌మెంట్లు చేయించకూడదు. వైటెనింగ్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల చర్మ రంధ్రాల్లోని సహజ తైలాలు పోయి, చర్మం నిస్తేజంగా మారుతుంది.
చర్మం మృదువుగా ఉండటానికి రకరకాల బాడీ లోషన్స్‌కి బదులు క్రీమ్స్ వాడుకోవడం మేలు.
వేడికి హీటర్
చలి ఎక్కువ కాబట్టి టెంపరేచర్ కోసం రూమ్ హీటర్స్ వాడుతుంటారు. రాత్రి వేళ మొత్తం ఈ హీటర్స్‌లో ఉండటం వల్ల చర్మం డీ హైడ్రేట్ అయి త్వరగా పొడిబారుతుంది.
నూనె శాతం అధికంగా ఉండే అవకాడో, నట్స్.. వంటి విటమిన్ ఇ, ఎ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల చర్మం నునుపుగా ఉంటుంది.
(చదవండి: మహాకుంభమేళలో అందమైన సాధ్వి..!)
Comments
Please login to add a commentAdd a comment