దీర్ఘకాలం పాటు బాధించే మొండి చర్మ వ్యాధుల్లో సోరియాసిస్ ముఖ్యమైనది. ప్రపంచ వ్యాప్తంగా 125 మిలియన్ల మంది సోరియాసిస్‌తో బాధపడుతున్నారని అంచనా. ఈ వ్యాధి ఎక్కువగా చలికాలంలో కనబడుతుంది. మిగిలిన వేసవికాలం, వర్షాకాలంలో ఈ వ్యాధి లక్షణాలు అసలు కనబడకుండాపోతాయి. ఇట్లాంటి సందర్భంలో ఈ వ్యాధి ఉన్న వారు వ్యాధి పూర్తిగా తగ్గిపోతుందని పొరబడే అవకాశం కూడా ఉంది. అయితే దానివల్ల ముందు ముందు ఎంతో ముప్పు ముంచుకొస్తుంది. అసలు వ్యాధి కారణాలు, దాని పరిష్కారమార్గాలపై అవగాహన కలిగిస్తూ, కాన్‌స్టిట్యూషనల్ విధానం ద్వారా వ్యాధిని మూలం నుంచే నయం చేయవచ్చు. ఇతర విధానాలతో పోల్చితే హోమియో వైద్యవిధానంలో దీనికి చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయి.
సోరియాసిస్ రావడానికి కారణాలు
వంశపారంపర్యంగా
మానసికంగా ఒత్తిడి, ఆందోళన ఉండటం
పొడిచర్మం ఉన్నవారిలో
కొన్ని రకాల మందుల దుష్పరిణామాల వల్ల
స్త్రీలలో పొగతాగే అలవాటు గల వారిలో
అధిక బరువు ఉన్నవారిలో
బి.పి., డయాబెటిస్ వ్యాధి గల వారిలో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలుంటాయి
వాతావరణంలోని మార్పుల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది.
సోరియాసిస్ వ్యాధి రకాలు
సోరియాసిస్ వల్గారిస్
గటేట్ సోరియాసిస్
ఇన్‌వర్స్ సోరియాసిస్
వస్ట్యులార్ సోరియాసిస్
పల్మోప్లాంటార్ సోరియాసిస్
సోరియాసిస్ వ్యాధి లక్షణాలు
చర్మం మీద చిన్న ఎర్రని మచ్చలాగ మొదలై చర్మం బూడిదరంగులో మారి పొడిబారి పొలుసులలాగ రాలిపోతుండటం
విపరీతమైన దురద
ఈ మచ్చలు మి.మీ. నుంచి మొదలై కొన్ని సెంటీమీటర్ల వరకూ విస్తరిస్తుంటాయి.
తలలో అయితే డాండ్రఫ్ లాగ పెద్ద పెద్ద పొలుసుల రూపంలో రాలిపోతుంటాయి
గోరు పసుపురంగులో మారి చర్మం నుండి వేరుపడుతుంది
చర్మంపై నున్న పొలుసులను బలవంతంగా లాగినపుడు చిన్నగా రక్తం వస్తుంది.
సోరియాసిస్ వలన వచ్చే దుష్పరిణామాలు
సోరియాసిస్ వల్ల వచ్చే ఒకే ఒక దుష్పరిణామం కీళ్ళ నొప్పులు. సోరియాసిస్‌తో బాధపడేవారిలో 10 శాతం నుండి 35 శాతం మందిలో ఈ కీళ్ళ నొప్పులు ఉంటాయి. దీనినే ‘‘సోరియాటిక్ ఆర్థరైటిస్’ అంటారు. ఈ వ్యాధి వచ్చిన వారిలో చనిపోయిన చర్మకణాలు చర్మం పైపొర ద్వారా బయటకు వెళ్ళకుండా కీళ్ళలో చేరి ఎముకల అరుగుదలకు దోహదపడతాయి.
అందువలన కీళ్ళనొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది.
సోరియాసిస్ వ్యాధిని గుర్తించడం ఎలా?
1. వ్యాధి లక్షణాలను బట్టి రోగిని పరీక్షించడం ద్వారా తెలుసుకోవచ్చు.
2. చర్మంలోని చిన్న ముక్కను తీసి పరీక్షకు పంపడం ద్వారా తెలుసుకోవచ్చు.
సరైన చికిత్సా విధానం
హోమియోపతి వైద్య విధానం ద్వారా ఈ సోరియాసిస్‌ను అరికట్టవచ్చు. హోమియోపతి వైద్య విధానంలో చికిత్స అనేది రోగి శరీరతత్వం, మానసిక స్థితి, వ్యాధి లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. దీనినే ‘కాన్‌స్టిట్యూషనల్ థెరపీ’ అని అంటారు. ఈ విధమైన చికిత్సా విధానం ద్వారా ఏ విధమైన రోగాన్ని అయినా పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది.
డాక్టర్ సృజనారెడ్డి,
సీనియర్ డెంటల్ సర్జన్
పాజిటివ్ డెంటల్, హైదరాబాద్.
స్ట్రెస్ వల్ల సోరియాసిస్
Published Thu, Nov 21 2013 11:05 PM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM
Advertisement