సోరియాసిస్‌కు మెరుగైన ఫలితం హోమియోపతి | Homeopathy is a better result soriyasisku | Sakshi
Sakshi News home page

సోరియాసిస్‌కు మెరుగైన ఫలితం హోమియోపతి

Published Thu, Jan 9 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM

Homeopathy is a better result soriyasisku

చలికాలం రాగానే ఎంతోమంది అనేకరకాల చర్మ సంబంధిత వ్యాధుల తో బాధపడుతూ ఉంటారు. ఇందులో అత్యంత క్లిష్టమైన సమస్య సోరియాసిస్. ప్రపంచ జనాభాలో సుమారుగా మూడు శాతం మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
 
దీనిని కేవలం సాధారణ చర్మవ్యాధిగా పరిగణించడానికి వీలు లేదు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ వికటించడం వల్ల వచ్చే చర్మవ్యాధి. సోరియాసిస్ వ్యాధిగ్రస్థులలో చర్మంపై దురదతో కూడిన వెండిరంగు పొలుసులు కనిపిస్తాయి. ఈ వ్యాధి ప్రభావం చర్మం మీద మాత్రమే కాకుండా గోళ్ళు, తల తదితర శరీర భాగాలు కూడా వ్యాధి ప్రభావానికి లోనవవచ్చు.
 
ఎందుకు వస్తుంది?
వ్యాధినిరోధకశక్తి వికటించి స్వయంప్రేరితంగా మారడం వలన సోరియాసిస్ వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీనిని అర్థం చేసుకోవడానికి వ్యాధినిరోధకశక్తి గురించి కొంత తెలుసుకుందాం.
 
వైరస్, బ్యాక్టీరియా వంటివి శరీరం మీద దాడి చేసినప్పుడు వాటి నుండి రక్షణ పొందటానికి మనశరీరంలో డబ్ల్యూబీసీ (తెల్ల రక్తకణాలు) అనే ప్రత్యేకమైన రక్తకణాలు పని చేస్తుంటాయి. ఇవి అవసరమైన ప్రాంతాలకు వెళ్ళి ఇన్ఫెక్షన్ తగ్గించడమే కాకుండా గాయాలు మానేలా చేస్తాయి.
 
సోరియాసిన్ - వంశపారంపర్యత:
కొన్నికుటుంబాలలో సోరియాసిన్ అనువంశికంగా నడుస్తుంది. తల్లిదండ్రులలో ఇద్దరికీ సోరియాసిస్ ఉంటే సంతానానికి వచ్చే అవకాశం 30 శాతం ఉంటుంది. ఒకవేళ ఒకరికే ఉంటే 15 శాతం వచ్చే అవకాశం ఉంటుంది.
 
సోరియాసిస్ ప్రభావం :

సోరియాసిస్ ఒక చర్మవ్యాధిగా మాత్రమే గుర్తిస్తే అది తప్పు. దీనివలన సాధారణంగా ప్రాణాపాయం జరగదు. కాని వ్యాధితీవ్రత వలన, దీర్ఘకాలం బాధించడం వలన బాధితులు డిప్రెషన్‌కు లోనవుతారు. ఇది వ్యాధి తీవ్రతను మరింత పెంచుతుంది. సోరియాసిస్‌లో అలా వికటించిన వ్యాధినిరోధక శక్తి వలన సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధికి అనుబంధ అంశంగా గల ఇన్‌ఫ్లమేషన్ వలన సోరియాసిస్‌తో బాధపడేవారికి హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవేకాక ఈ వ్యాధిగ్రస్థులు డయాబెటిస్, రక్తపోటులకు గురయ్యే అవకాశం కూడా ఎక్కువే.
 
 సోరియాసిస్‌ను తీవ్రం చేసే అంశాలు:
 చల్లని పొడి వాతావరణం  
 మానసిక ఒత్తిడి  
 కొన్నిరకాల మందులు (మలేరియా మందులు, లితేలయా, బీటా, బ్లాకర్స్, మాంటి) ఇన్‌ఫెక్షన్స్, ఇతర వ్యాధులు
 అలవాట్లు
 హార్మోన్ తేడాలు  
 ఆహార పదార్థాలు -ఉదా: గ్లూటన్ ఎక్కువగా ఉండే ఆహారం.
 
 నిర్థారణ పరీక్షలు:
 సీబీపీ   
 ఈఎస్‌ఆర్  
 స్కిన్ బ్లాప్సీ   
 కీళ్ళను ప్రభావితం చేసినప్పుడు ఎక్స్‌రే మొదలగు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలి. కాని సాధారణంగా అనుభవజ్ఞులైన డాక్టర్లు సోరియాసిస్ రోగి చర్మ లక్షణాలను బట్టి రోగాన్ని నిర్ధారిస్తారు.
 
 సోరియాసిస్‌లో రకాలు
 సోరియాసిస్‌ను అది వ్యక్తమయ్యే విధానాన్ని బట్టి ఐదు రకాలుగా వర్గీకరించారు.
 
 ప్లేగు సోరియాసిస్: ఇది సోరియాసిస్‌లో ఎక్కువగా కనిపించే రకం. ఎర్రని మచ్చలుగా మొదలై పెద్ద పొడగా మారడం దీని ప్రధాన లక్షణం.
 
 Guttata సోరియాసిస్: ఇది ఎర్రని పొక్కులు, పొలుసులతో వాన చినుకులుగా కనిపిస్తుంది. వ్యాధి హఠాత్తుగా మొదలవుతుంది. పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది.
 
 పస్టులర్ సోరియాసిన్: దీనిలో చీముతో కూడిన పొక్కులు తయారవుతాయి.
 
 ఇన్‌వర్సివ్ సోరియాసిస్: దీనిలో పలుచగా పొట్టు లేకుండా ఎర్రగా కనిపించే మచ్చలు చర్మపు ముడతలలో వస్తాయి.
 
 Exythrodermic సోరియాసిస్: దీనిలో ఎర్రటి వాపుతో కూడిన మచ్చలు పెద్ద ఆకారంలో తయారవుతాయి.
 
 కాన్‌స్టిట్యూషన్ పద్ధతిలో సోరియాసిస్ నివారణ...
 కాన్‌స్టిట్యూషన్ విధానం ద్వారా మందులు ఇవ్వడం అంటే ఒక వ్యక్తి మానసిక, శారీరక పరిస్థితులే కాకుండా ఎమోషనల్ పరిధిని కూడా పూర్తిగా అర్థం చేసుకుని మందులు ఇవ్వడం. తర్వాత ఏయే పొటెన్సీలో ఎంత డోస్ ఇవ్వాలనేది ముఖ్యం. సరైన మందులు, పొటెన్సీ డోస్ ఇచ్చినప్పుడు వ్యాధి పూర్తిగా నివారించబడుతుంది.
 
 సాధారణంగా వాడే మందుల వలన ఈ సోరియాసిస్ తాత్కాలికంగా తగ్గినట్లు లేదా కొన్నిసార్లు అసలు ఫలితమే లేకపోవడం జరుగుతుంది. అదే హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధి తీవ్రతను బట్టి నియంత్రించి పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సోరియాసిస్‌ను అరికట్టవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స కాలం నిర్థారించబడుతుంది.
 
 -పాజిటివ్ హోమియోపతి.
 
 డా॥టి. కిరణ్‌కుమార్
 పాజిటివ్ హోమియోపతి
 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ,
 వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై
 అపాయింట్‌మెంట్ కొరకు  92461 99922
 www.positivehomeopathy.com

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement