Positive Homeopathy
-
మా పిల్లలకూ థైరాయిడ్..?
నా వయసు 56. నేను చాలాకాలంగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నాను. మా పిల్లలలోనూ ఇదే సమస్య ఉన్నట్లు తెలిసింది. తగ్గేందుకు మార్గాలు చెప్పండి. – ఆర్. కళ్యాణి, విశాఖపట్నం ఇటీవల నగరాలలో థైరాయిడ్ సమస్యలు పెరుగుతోంది. ఈ సమస్య వచ్చేందుకు దోహదపడే అనేక కారణాల్లో... నగరాలలో పెరుగుతున్న మానసిక ఒత్తిడులు థైరాయిడ్ సమస్యలకు ఒక కారణం అని చెప్పవచ్చు. థైరాయిడ్ అనేది మన గొంతు దగ్గర ఉండే కీలకమైన గ్రంథి. ఇది స్రవించే హార్మోన్లు మానసిక ఆలోచనలపై ప్రభావం చూపుతాయి. ఈ గ్రంథి టీ4, టీ3, టీఎస్‌హెచ్ హార్మోన్లను స్రవిస్తుంది. సున్నిత మనస్తత్వం కలవారు, ప్రతి చిన్న విషయాన్నీ మనసుకి తీసుకునేవారిలో ఈ గ్రంథి స్రవించే హార్మోన్ సమతౌల్యత దెబ్బతింటుంది. టీహెచ్ఎస్ ఎక్కువ అవడం వల్ల అతిగా బరువు పెరగడం, అతి ఆలోచన, బద్దకం, మతిమరపు, అతినిద్ర వచ్చే అవకాశం ఉంది. స్త్రీలలో రుతుస్రావ సమస్యలు, గర్భం రాకుండా ఉండేందుకు వాడే మందులు, పీరియడ్స్ సక్రమంగా వచ్చేందుకు వాడే మందుల వల్ల థైరాయిడ్‌పై దుష్ప్రభావాలు పడి, దానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలలోనూ ఆ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇక ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేమిటంటే థైరాయిడ్ సమస్యలన్నీ ఒకేలా ఉండవు. హార్మోన్ స్రావం పెరిగితే ఒకలా, తగ్గితే మరొకలా, నాడ్యూల్స్ వస్తే ఇంకోలా లక్షణాలు కనిపిస్తాయి. హోమియోలో ఈ లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులు ఇస్తారు. చికిత్స: లక్షణాలను బట్టి ఆర్సినిక్ ఆల్బ్, కాల్కేరియా కార్బ్, ఓపియమ్, నేట్రమ్మూర్ వంటి మందులను ఇస్తారు. అయితే వ్యక్తి తాలూకు శారీరక, మానసిక లక్షణాలను బట్టి ఇచ్చే ఈ మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. –డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ -
మలబద్ధకం... కడుపుబ్బరం..?
నా వయసు 38. తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. పొట్టలో మెలిపెట్టినట్లుగా నొప్పి, తేన్పులు, కడుపు ఉబ్బరం, వికారం, తలనొప్పి, ఆందోళన ఉన్నాయి. దయచేసి నా సమస్య ఏమిటో వివరించి, హోమియోలో చికిత్స చెప్పండి. – నీలిమ, ఖమ్మం ఈ లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ∙జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ∙దీర్ఘకాల జ్వరాలు ∙మానసిక ఆందోళన ∙కుంగుబాటు ∙ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం ∙జన్యుపరమైన కారణాలు ∙చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తుంటాయి. వీటితోపాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయిలెట్‌కు వెళ్లాల్సివస్తుంది. ఐబీఎస్ ప్రాణాంతకం కాకున్నా, చాలా ఇబ్బందికరమైనది. దీనికి నిర్దిష్టమైన పరీక్షలు లేకున్నా, లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా... వంటి అంశాల ఆధారంగా వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్ బ్రీత్ టెస్ట్ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు: ∙పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ∙ఒత్తిడిని నివారించుకోవాలి ∙పొగతాగడం, మద్యపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ∙రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు. –డాక్టర్ టి.కిరణ్ కుమార్ డైరక్టర్, పాజిటివ్ హోమియోపతి విజయవాడ, వైజాగ్ -
నానో మెడిసిన్ లోగో ఆవిష్కరణ
కరీంనగర్ హెల్త్ : నగరంలోని పాజిటివ్ హోమియోపతిని ప్రారంభించి రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆదివారం నానో మెడిసిన్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు ప్రజలు హోమియో వైద్యంపై ఆకర్షితులవుతున్నారన్నారు. హోమియో వైద్యంతో రోగాలు పూర్తిగా నయమవుతాయన్నారు. నానో మెడిసిన్ తో వ్యాధి నిర్ధారణ చేస్తున్నారని, వ్యాధి నిర్ధారణైతే తక్కువ ఖర్చుతో రోగం పూర్తిగా నయమవుతుందన్నారు. డాక్టర్ డెవిడ్ మాట్లాడుతూ నానో మాత్రలతో వ్యాధి మూలాలతో నిర్ధరించబడుతుందని తెలిపారు. పాజిటీవ్ హోమియోపతిలో డయాబెటిక్, సొరియాసిస్, కీళ్లనొప్పులు, హెపటైటిస్ బీ, గ్యాస్ట్రిక్, ఆస్తమా వంటి ధీర్ఘకాలిక వ్యాధులను నయం చేయవచ్చని తెలిపారు. సిబ్బంది పి.జోయల్ ప్రసన్నకుమార్, మానస, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు -
వాటా విక్రయం బాటలో పాజిటివ్ లైఫ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న పాజిటివ్ లైఫ్‌సెన్సైస్ సంస్థ వాటా విక్రయానికి సన్నాహాలు చేస్తోంది. పలు ప్రైవేటు ఈక్విటీ కంపెనీలతో చర్చలు జరుపుతున్న ఈ సంస్థ... మెజారిటీ వాటాను తమ వద్దే ఉంచుకుని, 49 శాతం వరకూ విక్రయించాలని భావిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా పాజిటివ్ హోమియోపతి, పాజిటివ్ డెంటల్ బ్రాండ్లతో సేవలందిస్తున్న ఈ సంస్థ.. వాటా విక్రయం ద్వారా వచ్చిన నిధులను విస్తరణపై వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదిన నాలుగు రాష్ట్రాల్లో విస్తరించిన పాజిటివ్ లైఫ్‌సెన్సైస్... ఉత్తరాదికీ శాఖలను పరిచయం చేయనుంది. అలాగే 2016 మార్చికల్లా దుబాయి, శ్రీలంకతోపాటు ఇతర దేశాల్లోనూ అడుగు పెడుతోంది. కొత్తగా 70కిపైగా శాఖల్ని ఏర్పాటుచేయాలని భావిస్తోంది. బ్రాండ్ విలువ రూ. 200 కోట్లు.. పాజిటివ్ లైఫ్‌సెన్సైస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులలో పాజిటివ్ హోమియోపతి బ్రాండ్ కింద 40 కేంద్రాలను నిర్వహిస్తోంది. పాజిటివ్ డెంటల్ బ్రాండ్‌లో హైదరాబాద్‌లో 5, కర్నూలులో ఒక కేంద్రం ఉంది. ఆన్లైన్ ద్వారా అమెరికాలోని రోగులకూ సేవలందిస్తోంది. వైద్యులైన ఏఎం రెడ్డి, టి.కిరణ్‌కుమార్, ఏ.సృజన సంస్థ ప్రమోటర్లుగా ఉన్నారు. కంపెనీ 2014-15లో రూ.40 కోట్ల టర్నోవర్‌పై రూ.2 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇక సంస్థ విలువను ఆకాశం కన్సల్టింగ్ రూ.200 కోట్లుగా లెక్కగట్టినట్లు పాజిటివ్ లైఫ్‌సెన్సైస్ ఎండీ ఎ.ఎం.రెడ్డి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘‘దక్షిణాదిన హోమియోతోపాటు దంత వైద్య రంగంలో సుస్థిర వాటా దక్కించుకున్నాం. పెద్ద ఎత్తున విస్తరించాలన్న లక్ష్యంతోనే వాటా విక్రయానికి ప్రయత్నాలు చేస్తున్నాం. విస్తరణకు రూ.60 కోట్ల దాకా అవసరమవుతాయని అంచనా వేస్తున్నాం’’ అని వివరించారు. భారీ విస్తరణ దిశగా.. ఈ ఏడాదే ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో శాఖలను తెరుస్తామని ఎ.ఎం.రెడ్డి చెప్పారు. పాజిటివ్ హోమియోపతి బ్రాండ్‌లో కొత్తగా 60 శాఖలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. పాజిటివ్ డెంటల్‌లో 2015లో 5, 2016లో 7 శాఖలను ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరు, వరంగల్, వైజాగ్, విజయవాడ, గుంటూరులలో ఇవి రానున్నాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక టెక్నాలజీతో ఒక్కోటి 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తామని, ఒక్కో డెంటల్ కేంద్రం రెండేళ్లలో బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటుందని తెలియజేశారు. హోమియో వైద్య కళాశాల ఏర్పాటును వేగవంతం చేశామన్నారు. -
సోరియాసిస్‌కు మెరుగైన ఫలితం హోమియోపతి
చలికాలం రాగానే ఎంతోమంది అనేకరకాల చర్మ సంబంధిత వ్యాధుల తో బాధపడుతూ ఉంటారు. ఇందులో అత్యంత క్లిష్టమైన సమస్య సోరియాసిస్. ప్రపంచ జనాభాలో సుమారుగా మూడు శాతం మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీనిని కేవలం సాధారణ చర్మవ్యాధిగా పరిగణించడానికి వీలు లేదు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ వికటించడం వల్ల వచ్చే చర్మవ్యాధి. సోరియాసిస్ వ్యాధిగ్రస్థులలో చర్మంపై దురదతో కూడిన వెండిరంగు పొలుసులు కనిపిస్తాయి. ఈ వ్యాధి ప్రభావం చర్మం మీద మాత్రమే కాకుండా గోళ్ళు, తల తదితర శరీర భాగాలు కూడా వ్యాధి ప్రభావానికి లోనవవచ్చు. ఎందుకు వస్తుంది? వ్యాధినిరోధకశక్తి వికటించి స్వయంప్రేరితంగా మారడం వలన సోరియాసిస్ వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీనిని అర్థం చేసుకోవడానికి వ్యాధినిరోధకశక్తి గురించి కొంత తెలుసుకుందాం. వైరస్, బ్యాక్టీరియా వంటివి శరీరం మీద దాడి చేసినప్పుడు వాటి నుండి రక్షణ పొందటానికి మనశరీరంలో డబ్ల్యూబీసీ (తెల్ల రక్తకణాలు) అనే ప్రత్యేకమైన రక్తకణాలు పని చేస్తుంటాయి. ఇవి అవసరమైన ప్రాంతాలకు వెళ్ళి ఇన్ఫెక్షన్ తగ్గించడమే కాకుండా గాయాలు మానేలా చేస్తాయి. సోరియాసిన్ - వంశపారంపర్యత: కొన్నికుటుంబాలలో సోరియాసిన్ అనువంశికంగా నడుస్తుంది. తల్లిదండ్రులలో ఇద్దరికీ సోరియాసిస్ ఉంటే సంతానానికి వచ్చే అవకాశం 30 శాతం ఉంటుంది. ఒకవేళ ఒకరికే ఉంటే 15 శాతం వచ్చే అవకాశం ఉంటుంది. సోరియాసిస్ ప్రభావం : సోరియాసిస్ ఒక చర్మవ్యాధిగా మాత్రమే గుర్తిస్తే అది తప్పు. దీనివలన సాధారణంగా ప్రాణాపాయం జరగదు. కాని వ్యాధితీవ్రత వలన, దీర్ఘకాలం బాధించడం వలన బాధితులు డిప్రెషన్‌కు లోనవుతారు. ఇది వ్యాధి తీవ్రతను మరింత పెంచుతుంది. సోరియాసిస్‌లో అలా వికటించిన వ్యాధినిరోధక శక్తి వలన సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధికి అనుబంధ అంశంగా గల ఇన్ఫ్లమేషన్ వలన సోరియాసిస్‌తో బాధపడేవారికి హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవేకాక ఈ వ్యాధిగ్రస్థులు డయాబెటిస్, రక్తపోటులకు గురయ్యే అవకాశం కూడా ఎక్కువే. సోరియాసిస్‌ను తీవ్రం చేసే అంశాలు: చల్లని పొడి వాతావరణం మానసిక ఒత్తిడి కొన్నిరకాల మందులు (మలేరియా మందులు, లితేలయా, బీటా, బ్లాకర్స్, మాంటి) ఇన్ఫెక్షన్స్, ఇతర వ్యాధులు అలవాట్లు హార్మోన్ తేడాలు ఆహార పదార్థాలు -ఉదా: గ్లూటన్ ఎక్కువగా ఉండే ఆహారం. నిర్థారణ పరీక్షలు: సీబీపీ ఈఎస్ఆర్ స్కిన్ బ్లాప్సీ కీళ్ళను ప్రభావితం చేసినప్పుడు ఎక్స్‌రే మొదలగు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలి. కాని సాధారణంగా అనుభవజ్ఞులైన డాక్టర్లు సోరియాసిస్ రోగి చర్మ లక్షణాలను బట్టి రోగాన్ని నిర్ధారిస్తారు. సోరియాసిస్‌లో రకాలు సోరియాసిస్‌ను అది వ్యక్తమయ్యే విధానాన్ని బట్టి ఐదు రకాలుగా వర్గీకరించారు. ప్లేగు సోరియాసిస్: ఇది సోరియాసిస్‌లో ఎక్కువగా కనిపించే రకం. ఎర్రని మచ్చలుగా మొదలై పెద్ద పొడగా మారడం దీని ప్రధాన లక్షణం. Guttata సోరియాసిస్: ఇది ఎర్రని పొక్కులు, పొలుసులతో వాన చినుకులుగా కనిపిస్తుంది. వ్యాధి హఠాత్తుగా మొదలవుతుంది. పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. పస్టులర్ సోరియాసిన్: దీనిలో చీముతో కూడిన పొక్కులు తయారవుతాయి. ఇన్వర్సివ్ సోరియాసిస్: దీనిలో పలుచగా పొట్టు లేకుండా ఎర్రగా కనిపించే మచ్చలు చర్మపు ముడతలలో వస్తాయి. Exythrodermic సోరియాసిస్: దీనిలో ఎర్రటి వాపుతో కూడిన మచ్చలు పెద్ద ఆకారంలో తయారవుతాయి. కాన్స్టిట్యూషన్ పద్ధతిలో సోరియాసిస్ నివారణ... కాన్స్టిట్యూషన్ విధానం ద్వారా మందులు ఇవ్వడం అంటే ఒక వ్యక్తి మానసిక, శారీరక పరిస్థితులే కాకుండా ఎమోషనల్ పరిధిని కూడా పూర్తిగా అర్థం చేసుకుని మందులు ఇవ్వడం. తర్వాత ఏయే పొటెన్సీలో ఎంత డోస్ ఇవ్వాలనేది ముఖ్యం. సరైన మందులు, పొటెన్సీ డోస్ ఇచ్చినప్పుడు వ్యాధి పూర్తిగా నివారించబడుతుంది. సాధారణంగా వాడే మందుల వలన ఈ సోరియాసిస్ తాత్కాలికంగా తగ్గినట్లు లేదా కొన్నిసార్లు అసలు ఫలితమే లేకపోవడం జరుగుతుంది. అదే హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధి తీవ్రతను బట్టి నియంత్రించి పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సోరియాసిస్‌ను అరికట్టవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స కాలం నిర్థారించబడుతుంది. -పాజిటివ్ హోమియోపతి. డా॥టి. కిరణ్‌కుమార్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై అపాయింట్మెంట్ కొరకు 92461 99922 www.positivehomeopathy.com -
సోరియాసిస్ వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోయి మీ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారా?
దీర్ఘకాలంపాటు బాధించే మొండి చర్మవ్యాధుల్లో సోరియాసిస్ ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా 125 మిలియన్ల మంది సోరియాసిస్‌తో బాధపడుతున్నారని అంచనా. ఈ వ్యాధి ఎక్కువగా చలికాలంలో మాత్రమే కనబడుతుంది. వేసవి, వర్షాకాలంలో ఈ వ్యాధి లక్షణాలు అసలు కనబడకుండా పోతాయి. ఇలాంటి సందర్భంలో ఈ వ్యాధి ఉన్నవారు వ్యాధి పూర్తిగా తగ్గిందని పొరబడే అవకాశం ఉంది. సోరియాసిస్ రావడానికి కారణాలు: వంశపారంపర్యంగా మానసిక ఒత్తిడి, ఆందోళన గల వారిలో పొడిచర్మం ఉన్న వారిలో కొన్నిరకాల మందుల దుష్పరిణామాల వలన పొగతాగే అలవాటు గల వారిలో బి.పి., డయాబెటిస్ వలన వాతావరణంలోని మార్పుల వలన కూడా వచ్చే అవకాశం ఉంది. సోరియాసిస్ వ్యాధి రకాలు: సోరియాసిస్ వర్గారిస్ గటేట్ సోరియాసిస్ ఇన్వర్స్ సోరియాసిస్ పస్ట్యులార్ సోరియాసిస్ పల్మోప్లాంటార్ సోరియాసిస్. సోరియాసిస్ వ్యాధి లక్షణాలు: చర్మం మీద చిన్న ఎర్రని మచ్చలా మొదలై చర్మం బూడిద రంగులో మారి పొలుసుల్లా రాలిపోతుండటం విపరీతమైన దురద ఈ మచ్చలు మి.మీ. నుంచి మొదలై కొన్ని సెంటీమీటర్ల దాకా విస్తరిస్తాయి తలలో అయితే డాండ్రఫ్ లాగ పెద్ద పెద్ద పొలుసుల రూపంలో రాలిపోతుంటాయి గోరు పసుపు రంగులో మారి చర్మం నుండి వేరుపడుతుంది. సోరియాసిస్ వలన వచ్చే దుష్పరిణామాలు: సోరియాసిస్ వలన వచ్చే దుష్పరిణామం కీళ్ల నొప్పులు. సోరియాసిస్‌తో బాధపడేవారిలో 10 నుండి 35 శాతం మందిలో ఈ కీళ్లనొప్పులు ఉంటాయి. దీనినే ‘సోరియాటిక్ ఆర్థరైటిస్’ అంటారు. ఈ వ్యాధి వచ్చినవారిలో మృతకణాలు చర్మం పైపొర ద్వారా బయటకు వెళ్ళకుండా కీళ్లలో చేరి ఎముకల అరుగుదలకు దోహదపడతాయి. సరైన చికిత్సా విధానం: హోమియోపతి వైద్యవిధానం ద్వారా ఈ సోరియాసిస్‌ను అరికట్టవచ్చు. హోమియోపతి వైద్యవిధానంలో చికిత్స అనేది రోగి శరీరతత్వం, మానసిక స్థితి, వ్యాధి లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. దీనినే ‘‘కాన్స్టిట్యూషనల్ థెరపి’’ అని అంటారు. ఈ విధమైన చికిత్సా విధానం ద్వారా ఏ విధమైన రోగాన్ని అయినా పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది. పాజిటివ్ హోమియోపతి దేశవ్యాప్తంగా పలు శాఖలతో విస్తరించి ప్రతిదినం హోమియో వైద్యవిధానంలో నూతన ఒరవడిని అందిపుచ్చుకుంటూ, రీసెర్చ్ విభాగంలో అందరికంటే ఉన్నతంగా నిలుస్తూ, హోమియో వైద్య ప్రపంచంలో అగ్రగామిగా నిలిచింది. - పాజిటివ్ హోమియోపతి డా॥టి. కిరణ్‌కుమార్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ,వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై అపాయింట్మెంట్ కొరకు 9246199922 www.positivehomeopathy.com -
పీసీఓడీ సమస్య సంతానలేమికి కారణం కావచ్చు
ఆడవాళ్ళలో, అదీ ఇవాళ్టి రోజుల్లో, హార్మోన్ల అసమతుల్యత అనే సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఇందువల్ల ముఖ్యంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల అసమతుల్యత వల్ల అండాశయంలో నీటితిత్తులు ఏర్పడుతున్నాయి. దీనినే పీసీఓడీ (PCOD) లేదా పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటారు. ఇది ఒక్కొక్కసారి జన్యువులలో ఏదైనా తేడా వచ్చినప్పుడు కూడా రావచ్చు లేదా ఏదైనా మానసిక ఒత్తిడి లేదా ఆందోళనల వలన హార్మోన్ల మీద దాని ప్రభావం చూపి ిపీసీఓడీ సమస్య తలెత్తవచ్చు. కారణాలు: 1) వారసత్వంగా వస్తున్న 2) జన్యుపరమైన విభేదాలు 3) మానసికంగా ఉండే ఒత్తిడి, ఆందోళనలు. ఇటువంటివన్నీ చిన్న హార్మోన్ల అసమతుల్యతతో మొదలై నెలసరులు సక్రమంగా రాక, భవిష్యత్తులో ఇటువంటి నీటితిత్తులు ఏర్పడి సంతానలేమి సమస్య రావచ్చు, అంతే కాకుండా సంతానం కలిగిన, పుట్టబోయే పిల్లలలో జన్యుపరంగా వచ్చే వ్యాధులు కూడా రావచ్చు. లక్షణాలు నెలసరుల సమస్యలు నెలసరులు అనేవి మొదటగా ప్రతినెల వచ్చేవి కాస్త ఆలస్యంగా రావటం అంటే 26-30 రోజుల మధ్యలో రావలసినవి 33-40 రోజులకు రావటం ఆ తర్వాత నెల విడిచి నెల రావటం ఉంటుంది. ఒకవేళ నెలసరి వచ్చినా రక్తస్రావం చాలా తక్కువగా ఉంటుంది. కాని నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సంతానలేమి ఈ పీసీఓడీ సమస్య వల్ల అండం విడుదల అనేది సరిగ్గా ఉండదు. ఇంకా అండం విడుదల కాకుండా కూడా నెలసరులు వస్తాయి. దీనిని ‘ఎన్ఒవ్యులేటరీ సైకిల్స్’ అంటారు. అండం విడుదల అవకపోతే సంతానం కలగదు. మగవాళ్ళల్లో ఉండే ఎండ్రోజన్ హార్మోన్లు మగవాళ్ళలో ఉండే ఎండ్రోజన్ హార్మోన్లు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయ్యి మొటిమలు, అవాంఛిత రోమాలు, నెలసరులు తరచుగా వస్తూండటం జరుగుతుంది. బరువు అతిగా పెరగటం దీనివలన కొలస్ట్రాల్ స్థాయిలు శరీరంలో పెరిగి మధుమేహం లేదా చక్కెర వ్యాధి వస్తుంది. ఒక్కొక్కసారి ఈ పీసీఓడీ సమస్యకు సరైనరీతిలో చికిత్స తీసుకోకపోతే, హైపో థైరాయిడిజమ్ సమస్యకు కూడా దారితీస్తుంది. పాజిటివ్ హోమియోపతిలో పీసీఓడీ సమస్యకు సరైన పరిష్కారం ఉంటుంది. ఈ సమస్య అనేది ఎక్కడ నుంచి ప్రారంభమైందో అంటే మూలకారణాన్ని ఎనలైజ్ చేసుకొని, నీటితిత్తుల సైజ్‌ని బట్టి చికిత్సను ప్రారంభించి, ‘జెనిటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్’ అనే పద్ధతి ద్వారా మందులు ఇస్తారు. దీనివలన మొదటగా నెలసరులు సక్రమంగా వచ్చి, అండం విడుదల మొదలై సంతానం కలుగుతుంది. హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక - తమిళనాడు. అపాయింట్మెంట్ కొరకు 9246199922